గుడ్‌ స్కూల్‌ యాప్‌ను ప్రారంభించిన అడివి శేషు

Adivi Sesh Launches Good School App - Sakshi

సైన్స్‌ అంటే ఎంత ఇష్టమో... గణితం అంటే అంతా  భయమని సినీ నటుడు ఆడివి శేషు అన్నారు. చదవడం ఎంత ముఖ్యమో... చదివి దాన్ని గుర్తు పెట్టుకోవడం అంతే ముఖ్యమని పేర్కొన్నారు. పరీక్షల సయమంలో ఒత్తిడికి గురి కాకుండా సులభమైన పద్ధతితో నేర్చుకుని గుర్తు పెట్టుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో గుడ్‌ స్కూల్‌ యాప్‌ను అడివి శేషు ప్రారంభించారు. తెలుగు, ఆంగ్లంలో యాప్‌ను రూపొందించడం ద్వారా గ్రామీణ ప్రాంత పిల్లలకు సైతం ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆడివి శేషు అన్నారు.  

ప్రస్తుతం గుఢచారి-2 చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని... తర్వాత హాలీవుడ్‌ తరహా చిత్రంలో నటిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులకు  నాణ్యత గల దృశ్యమాన కంటెంట్‌ను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త-ఏజ్డ్-టెక్కో సిస్టమ్, గుడ్ స్కూల్ యాప్‌ అని ఛైర్మన్‌ వెంకట్‌రెడ్డి అన్నారు.

శిక్షణతో పాటు, ఇది విశిష్టమైన విద్యా అనుభవాలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.  ఇందులో సహకారం, సృజనాత్మకత, ఆట నేర్చుకునే విధంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ శ్రీనివాసరావు, సీఈవో విజయ్‌ భాస్కర్‌, విద్యారంగ ప్రముఖులు పున్నమి కృష్ణ, మేములపాటి శ్రీధర్‌, అజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top