'డెకాయిట్‌' రెండురోజుల కలెక్షన్స్‌ | Dacoit Movie 2 days Collection out now | Sakshi
Sakshi News home page

'డెకాయిట్‌' రెండురోజుల కలెక్షన్స్‌

Apr 12 2026 12:17 PM | Updated on Apr 12 2026 1:27 PM

Dacoit Movie 2 days Collection out now

టాలీవుడ్‌ హీరో అడివి శేష్‌ నటించిన చిత్రం డెకాయిట్‌.. ఏప్రిల్‌ 10న విడుదలైన  ఈ మూవీని దర్శకులు షానియల్‌ డియో తెరకెక్కించారు. తాజాగా రెండురోజుల కలెక్షన్స్‌ను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. మొదటిరోజు అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ రూ. 15 కోట్లతో రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ.. రెండోరోజు కూడా అదే రేంజ్‌లో సత్తా చాటింది.   సుప్రియ యార్లగడ్డ, సునీల్‌ నారంగ్‌ నిర్మించిన ఈ మూవీలో ,మృణాల్‌ ఠాకూర్‌, అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాశ్‌ రాజ్‌, కామాక్షి భాస్కర్ల తదితరులు నటించారు.

డెకాయిట్‌ చిత్రం రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. అయితే,  ఈ చిత్రం విదేశాలలో కూడా బాగా రాణిస్తోంది, ఉత్తర అమెరికాలో  ఇప్పటికే 1 మిలియన్ మార్కును దాటింది. రాబోయే రోజుల్లో కలెక్షన్స్‌ మరింత పెరగవచ్చని ఆశిస్తున్నారు. డెకాయిట్‌ చిత్రం బాగుందని ఇప్పటికే చాలామంది ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ మిస్ కావద్దని పోస్టులు షేర్‌ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. దీంతో చాలా థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో సత్తా చాటుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement