ఐటమ్ డ్యాన్సర్‌గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్ | Jonita Gandhi Item Song In Dacoit Movie Latest | Sakshi
Sakshi News home page

Jonita Gandhi: గ్లామర్‌తో షాకిచ్చిన జోనితా.. సాంగ్ చూశారా?

Mar 28 2026 7:47 PM | Updated on Mar 28 2026 7:53 PM

Jonita Gandhi Item Song In Dacoit Movie Latest

అనిరుధ్‌తో పలు పాటలు పాడిన గ్లామరస్ సింగర్ జోనితా గాంధీ.. ఇప్పుడు ఐటమ్ సాంగ్‌లో నటించింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న 'డకాయిట్' కోసం తొలిసారి కాలు కదిపింది. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఈ పాటని లెక్క ప్రకారం ఈ సాయంత్రమే రిలీజ్ చేయాలి. కానీ కాస్త ఆలస్యంగా ఇప్పుడు విడుదల చేశారు.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పింది నేనే)

ఇప్పటివరకు సింగర్‌గానే అందరికీ తెలిసిన జోనితా.. ఇప్పుడు అందంతో ఐటమ్ సాంగ్‌లోనూ ఆకట్టుకోవడం విశేషం. ఇకపోతే ఏప్రిల్ 10న 'డకాయిట్'.. తెలుగు, హిందీలో థియేటర్లలోకి రాబోతుంది. మృణాల్ ఠాకుర్ హీరోయిన్. దాదాపు నాలుగేళ్ల తర్వాత శేష్ నుంచి వస్తున్న మూవీ ఇది. చూడాలి మరి ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటాడో?

(ఇదీ చదవండి: 'పెద్ది'కి దారి ఇచ్చేసిన 'లెనిన్'.. కొత్త రిలీజ్ డేట్)

Advertisement
 
Advertisement
Advertisement