హీరోయిన్‌గా అప్పట్లో తెలుగు, తమిళ సినిమాలు చేసిన రాధిక.. ప్రస్తుతం టీవీ షోలు, అడపాదడపా మూవీస్ చేస్తూ బిజీగా ఉంటోంది. తెలుగులోనూ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్న ఈమె.. రీసెంట్‌గా అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా అనిపించాయి. బన్నీకి డ్యాన్స్ నేర్పింది నేనే అని అనేసరికి అతడి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఓ తెలుగు ఛానెల్‌లో ప్రసారమవుతున్న డ్యాన్స్ షోలో రాధిక ఈ వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: 'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్‌డేట్)
ఆట డ్యాన్స్ షోలో ప్రీతి అనే కంటెస్టెంట్.. 'పుష్ప 2'లోని జాతర పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ క్రమంలోనే సదరు కంటెస్టెంట్‌ని పొగిడిన జడ్జి రాధిక.. అల్లు అర్జున్ ఇంత గొప్ప డ్యాన్సర్ కావడానికి నేనే కారణం అని చమత్కరించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో గతంలో తాను ఓ సినిమా చేశానని, అప్పుడు షూటింగ్ సందర్భంగా బన్నీకి డ్యాన్స్ నేర్పించానని గుర్తుచేసుకుంది. అలానే సమయానికి చిన్న పిల్లాడు ఎవరూ లేకపోవడంతో బన్నీ తనతో పాటు ఓ సీన్‌లో కలిసి నటించాడని, ఇందులో భాగంగా అల్లు అర్జున్‌ని ఎత్తుకుని రైల్వే ట్రాక్‌పై పరుగెత్తిన విషయాన్ని రాధిక గుర్తుచేసుకుంది. ఈ విషయాలన్నీ రాధిక చెబుతున్న ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.
రాధిక ఈ కామెంట్స్ ఫన్నీగానే చేశారు. నెటిజన్లు కూడా అంతే సరదాగా రియాక్ట్ అవుతున్నారు. బన్నీకి మీరు డ్యాన్స్ నేర్పించారా అని మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ విషయానికొస్తే.. టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. పుష్ప, పుష్ప 2 చిత్రాలు ఇతడి స్థాయిని పెంచేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అట్లీ, లోకేశ్ కనగరాజ్‌లతో మూవీస్ చేస్తున్నాడు. వీటిపై బోలెడంత బజ్ ఉంది.
(ఇదీ చదవండి: రెండు వారాలుగా బెడ్‌పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?)


