'పెద్ది'కి దారి ఇచ్చేసిన 'లెనిన్'.. కొత్త రిలీజ్ డేట్ | Akhil Akkineni's Lenin Movie Release Date Latest Update | Sakshi
Sakshi News home page

Lenin Movie: అఖిల్ కొత్త సినిమా.. రిలీజ్ డేట్ మారింది

Mar 28 2026 6:16 PM | Updated on Mar 28 2026 6:36 PM

Akhil Akkineni's Lenin Movie Release Date Latest Update

అక్కినేని హీరో అఖిల్.. ఎలాగైనా సరే ఈసారి హిట్ కొట్టాలని అనుకుంటూ చేసిన సినిమా 'లెనిన్'. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. లెక్క ప్రకారం మే 01న థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు. కానీ వాయిదా పడిన 'పెద్ది'.. ఏప్రిల్ 30న థియేటర్లలోకి వస్తుందని కొన్నాళ్ల క్రితం క్లారిటీ ఇచ్చారు. దీంతో 'లెనిన్' వాయిదా పక్కా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. అధికారికంగా కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు.

(ఇదీ చదవండి: రెండు వారాలుగా బెడ్‌పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?)

'లెనిన్'లో అఖిల్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడు. నాగార్జున, నాగవంశీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 30న వస్తున్న 'పెద్ది'కి అండగా నిలబడదాం అని చెప్పిన 'లెనిన్' మేకర్స్.. రామ్ చరణ్, అఖిల్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని గుర్తుచేసుకున్నారు. అందుకే తమ చిత్రాన్ని జూన్ 26కు వాయిదా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

జూన్ నెల ప్రారంభంలో అంటే 4వ తేదీన యష్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' రిలీజ్ కానుంది. ఇదొచ్చిన మూడు వారాలకు అఖిల్ 'లెనిన్' థియేటర్లలోకి రాబోతుంది. ప్రస్తుతానికైతే ఈ నెలలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. కాబట్టి కంటెంట్, టైమ్ కలిసొచ్చి అఖిల్ ఈసారైనా హిట్ కొడతాడేమో చూడాలి? ఇదివరకే ఓ పాట రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పింది నేనే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement