ప్రేమతో మా సినిమా చూస్తున్నారు.. ధన్యవాదాలు: అడివి శేష్‌ | Adivi Sesh Thanks To Telugu Audience For Watching Dacoit Movie | Sakshi
Sakshi News home page

ప్రేమతో మా సినిమా చూస్తున్నారు.. ధన్యవాదాలు: అడివి శేష్‌

Apr 11 2026 12:19 PM | Updated on Apr 11 2026 12:53 PM

Adivi Sesh Thanks To Telugu Audience For Watching Dacoit Movie

అడివి శేష్, మృణాల్‌ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా, అనురాగ్‌ కశ్యప్‌ ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డెకాయిట్‌’. షానియల్‌ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నిన్న (శుక్రవారం) రిలీజైంది. ఈ సందర్భంగా ప్రేక్షకులతో కలిసి సినిమాను చూసింది ‘డెకాయిట్‌’ యూనిట్‌. 

అనంతరం అడివి శేష్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను మేం ప్రేమతో చేశాం. మీరు కూడా ప్రేమతో చూశారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రంలో సరస్వతి పాత్ర చేసిన మృణాల్‌ మా హీరో (నవ్వుతూ). నా బెస్ట్‌ ఫ్రెండ్‌ షానియల్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావడం నాకు ఎమోషనల్‌గా అనిపిస్తోంది’’ అని చెప్పారు. 

‘‘ఈ చిత్రంలో నేను పోషించిన సరస్వతి పాత్ర మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు మృణాల్‌ ఠాకూర్‌. ‘‘మా సినిమాపై ఇంతటి ప్రేమ, ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు షానియల్‌ డియో.  

Advertisement
 
Advertisement
Advertisement