అడివి శేష్ డెకాయిట్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే? | Adivi Sesh latest Movie Dacoit box office collection Day 3 | Sakshi
Sakshi News home page

Dacoit Collections: అడివి శేష్ డెకాయిట్.. ఆ మూవీ కంటే ఎక్కువ వసూళ్లు

Apr 13 2026 4:56 PM | Updated on Apr 13 2026 5:09 PM

Adivi Sesh latest Movie Dacoit box office collection Day 3

టాలీవుడ్‌ హీరో అడివి శేష్‌, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించిన చిత్రం డెకాయిట్‌. ఈ నెల ఏప్రిల్‌ 10న విడుదలైన ఈ మూవీ చిత్రం వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ.. మూడో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. ఓవరాల్‌గా చూస్తే మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. మూడో రోజు ఆదివారం కావడంతో ఈ సినిమాకు మరింత కలిసొచ్చింది. ఈ చిత్రం ఆదివారం రోజు రూ. 6.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా విదేశీ మార్కెట్‌లోనూ రాణిస్తోంది. సండే ఒక్క రోజే రూ. 2.25 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓవర్‌సీస్ వసూళ్లు ఇప్పటివరకు రూ. 11.65 కోట్లకు చేరుకున్నాయి.

ఇక ఇండియా వ్యాప్తంగా వసూళ్లను పరిశీలిస్తే రూ. 23.12 కోట్ల గ్రాస్ సాధించగా.. రూ. 19.80 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.  అడివి శేష్ నటించిన  హిట్‌-2తో పోలీస్తే బాక్సాఫీస్ వసూళ్ల పరంగా డకాయిట్ ముందంజలో ఉంది. హిట్-2  విడుదలైన మూడు రోజుల్లోనే భారతదేశంలో రూ. 16.85 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టగా.. అదే సమయంలో డెకాయిట్ రూ. 19.80 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. కాగా.. ఈ చిత్రానికి షానిల్‌ డియో దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ, సునీల్‌ నారంగ్‌ నిర్మించగా.. మృణాల్‌ ఠాకూర్‌, అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాశ్‌ రాజ్‌, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.
.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement