సుప్రి‍యను వెక్కిరించడానికే వచ్చా.. నాగవంశీ ర్యాగింగ్ | Nagavamsi Teases Supriya at Decoit Pre-Release Event | Sakshi
Sakshi News home page

డెకాయిట్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో సుప్రియపై నాగవంశీ ర్యాగింగ్

Apr 7 2026 11:21 PM | Updated on Apr 8 2026 12:07 AM

Nagavamsi Teases Supriya at Decoit Pre-Release Event

‘డెకాయిట్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత నాగవంశీ, సహ నిర్మాత సుప్రియపై సరదాగా ర్యాగింగ్ చేశారు. సినిమాలు ఎక్కువ రోజులు తీస్తున్నామని ఎప్పుడూ తమకు క్లాస్ పీకే సుప్రియ ఇప్పుడు రెండు సంవత్సరాలు కష్టపడి ‘డెకాయిట్’ పూర్తి చేసిందనిక వెక్కిరిస్తూ మాట్లాడారు. మమ్మల్ని సినిమాలు ఎందుకు ఇన్ని రోజులు తీస్తున్నారంటూ సుప్రియ ఎప్పుడూ తిట్టేవారు. కానీ ఇప్పుడు ఆమె రెండు సంవత్సరాలు కష్టపడి 147 వర్కింగ్ డేస్‌లో సినిమా తీశారు. ఇకపై మమ్మల్ని తిట్టే హక్కు ఆమెకు లేదని ఆటపట్టించారు. నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయో సుప్రియకు చూపించినందుకు అడివి శేష్‌కు థ్యాంక్స్ చెప్పారు.  

అలాగే, “హీరోల్ని నెత్తిన ఎక్కించుకున్నామని ఎప్పుడూ క్లాస్ పీకే సుప్రియ, ఇప్పుడు తొలిసారి బయట హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనుభవించారు. ఇంతకు ముందు తన ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు తీసిన సుప్రియకు ఈ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. డెకాయిట్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. మరింత మంది హీరోలతో సుప్రియ సినిమాలు చేసి తమలాగే కష్టపడాలని చమత్కరించారు. ఓ వైపు నాగవంశీ సరదాగా ర్యాగింగ్ చేస్తుంటే, పక్కనే ఉన్న సురేశ్ బాబు నవ్వుతూ ఎంజాయ్ చేయడం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement