కొన్ని నెలల క్రితం 'డెకాయిట్' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన శృతి హాసన్ అనుకోకుండా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే తను స్వచ్ఛందంగా తప్పుకుందా లేక డెకాయిట్ టీమ్ తొలగించిందా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ ఆ పాత్రకు ఆమెకు సంబంధం లేకుండా పోయింది. వెంటనే ఆ స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నారు.
అయితే ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత, మృణాల్ పోషించిన "సరస్వతి" పాత్రపై చర్చలు మొదలయ్యాయి. శృతి అభిమానులు ఈ పాత్రను ఆమె మరింత బాగా పోషించి ఉండేదంటున్నారు. కానీ తెరపై మృణాల్ నటన చూసిన ప్రేక్షకులు మాత్రం ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో డెకాయిట్ టీమ్ తీసుకున్న నిర్ణయాన్ని వంద శాతం సమర్థిస్తున్నారు.
నటనలో శృతిని తక్కువ చేసి చూడలేం. తను కూడా ఈ పాత్రను బాగా చేసి ఉండేది. కానీ ప్రేక్షకులు ఆమెను తెరపై చూడలేకపోయారు. ఆ అవకాశాన్ని మృణాల్ చాలా బాగా సద్వినియోగం చేసుకుంది. సినిమాలో శృతి లేని లోటును మృణాల్ తీర్చిందనే చెప్పాలి. మొత్తానికి శృతి హాసన్ ఒక మంచి పాత్రను మిస్ అయింది. అదే సమయంలో మృణాల్ ఠాకూర్ తన కెరీర్‌లో మరో బలమైన పాత్రను సంపాదించుకుని ఆ పాత్రకు న్యాయం చేసింది.


