Mahesh Babu Feel Proud Of Me Says Adivi Sesh - Sakshi
Sakshi News home page

Adivi Sesh: మహేశ్‌బాబు అలా అనేసరికి కళ్లలో నీళ్లు తిరిగాయి

Dec 3 2022 4:10 PM | Updated on Dec 3 2022 4:59 PM

Adivi Sesh: Mahesh Babu Feel Proud of Me - Sakshi

హిట్‌ యూనివర్స్‌లోకి మహేశ్‌బాబులాంటి పెద్ద స్టార్‌ను ఇన్వాల్వ్‌ చేయండి అన్న.. నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్లిపోద్ది. ఎప్పటినుంచో నువ్వు ఎంచుకునే థ్రిల్లింగ్‌ స్టోరీలలో మహేశ్‌బాబుని చూడాలని కోరిక.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ లైన్‌ రాసి మ

యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హిట్‌ 2. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో హిట్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న అడివి శేష్‌ ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అమ్మాయి మనం డేట్‌కెప్పుడు వెళ్దాం అని అడగ్గా ఇదిగో వచ్చేస్తున్నా. కలిసి హిట్‌ 2 చూసేద్దామా? అని సరదాగా బదులిచ్చాడు.

'హిట్‌ యూనివర్స్‌లోకి మహేశ్‌బాబులాంటి పెద్ద స్టార్‌ను ఇన్వాల్వ్‌ చేయండి అన్న.. నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్లిపోద్ది. ఎప్పటినుంచో నువ్వు ఎంచుకునే థ్రిల్లింగ్‌ స్టోరీలలో మహేశ్‌బాబుని చూడాలని కోరిక.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ లైన్‌ రాసి మహేశ్‌ అన్నతో చేయండి అన్న..' అని ఓ అభిమాని ట్వీట్‌ చేశాడు. దీనికి శేష్‌ స్పందిస్తూ.. 'ఈరోజు ఉదయమే ఆయన ఫోన్‌ చేసి చాలాసేపు మాట్లాడారు. నా విషయంలో గర్వంగా ఉన్నట్లు చెప్పారు. అప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సోదరుడిగా తన వెన్నంటే ఉంటానని మాటిచ్చాను. ఆయనకు హిట్‌ 2 ఎప్పుడెప్పుడు చూపించాలా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను' అని ట్వీట్‌​ చేశాడు.

చదవండి: బాలయ్య వీరసింహారెడ్డి వచ్చేది ఆరోజే!
ఆ అమ్మాయి భార్యగా రావాలనుకుంటాడు, చివరికి

Advertisement
 
Advertisement
Advertisement