మా ఊరి పొలిమేర 2 నా సినిమా లాంటిది | Adivi Sesh Enrty at Maa Oori Polimera 2 Pre Release Event | Sakshi
Sakshi News home page

మా ఊరి పొలిమేర 2 నా సినిమా లాంటిది

Published Thu, Nov 2 2023 4:31 AM | Last Updated on Thu, Nov 2 2023 4:31 AM

Adivi Sesh Enrty at Maa Oori Polimera 2 Pre Release Event - Sakshi

‘‘నా ‘క్షణం’ సినిమాకి పని చేసిన టీమ్‌ అంతా ‘‘మా ఊరి పొలిమేర 2’ టీమ్‌లో ఉన్నారు. ముఖ్యంగా దర్శకుడు అనిల్‌ నాకు మంచి స్నేహితుడు. ‘మా ఊరి పొలిమేర ’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా తీసి, దానికి సీక్వెల్‌గా ‘మా ఊరి పొలిమేర 2’ తీయడం ఆనందంగా ఉంది. ఇది నా సొంత సినిమా లాంటింది. తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో అడివి శేష్‌ అన్నారు.

‘సత్యం’ రాజేశ్, కామాక్షీ  భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర–2’. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకి ముఖ్య అతిథులుగా అడివి శేష్, నిర్మాత ఎస్‌కేఎన్‌ హాజరయ్యారు. ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు.

ఏదైనా అదే కష్టమే. ప్రేక్షకులకు మంచి సినిమా కావాలి.. అంతే. ‘మా ఊరి పొలిమేర–2’కి హిట్‌ కళ కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ఇంత గ్రాండ్‌గా విడుదల కావడానికి కారణం వంశీ నందిపాటిగారు. మా సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్, గౌరీకృష్ణ, అనిల్‌ విశ్వనాథ్‌. ఈ వేడుకలో కామాక్షీ భాస్కర్ల, గాయకుడు పెంచల్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement