అడివి శేష్ అంటే చాలా క్రష్ : టాలీవుడ్ నటి | Tollywood actress Kamakshi Bhaskarla about crush on Adivi Sesh | Sakshi
Sakshi News home page

Adivi Sesh: అడివి శేష్ అంటే అప్పుడు క్రష్ ఉండేది : కామాక్షి భాస్కర్ల

Apr 7 2026 9:45 PM | Updated on Apr 7 2026 9:45 PM

Tollywood actress Kamakshi Bhaskarla about crush on Adivi Sesh

టాలీవుడ్ హీరో అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానియల్‌ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.  లవ్‌స్టోరీతో కూడిన యాక్షన్‌ సినిమాగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తాను అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు అడివి శేష్‌ అంటే నాకు క్రష్ ఉండేదని కామాక్షి భాస్కర్ల తన మనసులో మాటను బయటపెట్టింది.‍ అయితే ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ లేదని తెలిపింది. ఇప్పుడు ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టమని వెల్లడించింది. కామాక్షి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను ఎస్ఎస్ క్రియేషన్స్‌ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement