అనుమానం అక్కర్లేదు... బ్లాక్‌బస్టర్‌ ఖాయం: వెంకటేశ్‌ | Victory Venkatesh is the chief guest for Dacoit Movie pre-release event | Sakshi
Sakshi News home page

అనుమానం అక్కర్లేదు... బ్లాక్‌బస్టర్‌ ఖాయం: వెంకటేశ్‌

Apr 8 2026 1:45 AM | Updated on Apr 8 2026 1:45 AM

Victory Venkatesh is the chief guest for Dacoit Movie pre-release event

సురేంద్ర, వెంకటేశ్, మృణాల్, అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ

‘‘కొన్ని సినిమాలు ఆరంభించినప్పుడే ఒక మంచి అనుభూతి ఉంటుంది. ‘డెకాయిట్‌’ ఆరంభమైనప్పుడే సుప్రియ ఓ మంచి సినిమా తీస్తోందనే ఫీల్‌ ఇండస్ట్రీలో ఉంది. ఎందుకంటే తను చాలా ప్యాషనేట్‌. క్రమశిక్షణ ఉన్న టీమ్‌ని ఎంచుకుంది. అడివి శేష్‌ వరుస హిట్స్‌ కొడుతున్నాడు. మరిన్ని బ్లాక్‌బస్టర్‌ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. ‘డెకాయిట్‌’ కూడా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది... ఎలాంటి అనుమానం అక్కర్లేదు’’ అని హీరో వెంకటేశ్‌ చెప్పారు. అడివి శేష్‌ హీరోగా, మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘డెకాయిట్‌’. షానియల్‌ డియో దర్శకత్వం వహించారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో ఎస్‌ఎస్‌ క్రియేషన్స్‌పై సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘సుప్రియ కోసం ఇక్కడికి వచ్చాననుకుంటున్నారు.

నిజాయతీగా చెప్పాలంటే నాకు ఇష్టమైన  మా సురేంద్ర మామ (సుప్రియ తండ్రి)కోసం వచ్చాను. ఎస్‌ఎస్‌ క్రియేషన్స్‌పై సుప్రియ ఇలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు సంతోషంగా ఉంది. మృణాళ్‌ మంచి నటి. ఈ మూవీ ట్రైలర్‌ చూడగానే లవ్‌స్టోరీలోనే యాక్షన్, ఎమోష న్  అన్నీ ఉన్నాయని తెలిసిపోయింది. ఇలాంటి మంచి కథ ఎంచుకున్నందుకు గౌరవంగా ఉంది. యూనిట్‌కి ఆల్‌ ది వెరీ బెస్ట్‌’’ అని పేర్కొన్నారు. 

సుప్రియ మాట్లాడుతూ– ‘‘నాన్నగారి ఎస్‌ఎస్‌ క్రియేష న్్స బ్యానర్‌లో మంచి సినిమా తీయాలని ఎక్కడో మనసులో ఉంది. అందువల్లే ‘డెకాయిట్‌’ ఆరంభించాను. ఈ లోగోలో మా తాతగారి (ఏఎ న్ ఆర్‌) పంచె, మా నానమ్మ (అన్నపూర్ణ) కుంకుమ, పరిగెత్తే పాప, ముందు నడిపించే తాత... దాని వెనుక మా నాన్నగారు చేయించుకున్న మ్యూజిక్‌. ఇవన్నీ కూడగట్టి ఓ పదిహేను సెకన్లలో మా ఫ్యామిలీ కథ ఎలా చూపించుకోవాలా అనుకున్నాను. ‘డెకాయిట్‌’కి సైలెంట్‌గా ప్రోడ్యూస్‌ చేసి బ్యాక్‌బో న్ గా నిలిచిన మా అన్నయ్య సుమంత్‌కి థ్యాంక్స్‌’’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement