‘డెకాయిట్‌​‍’లో రొమాన్స్‌ కష్టంగా అనిపించింది: మృణాల్‌ | Mrunal Thakur Talk About Dacoit Movie | Sakshi
Sakshi News home page

డెకాయిట్‌లో రొమాన్స్‌ సీన్స్‌ కష్టంగా అనిపించాయి: మృణాల్‌

Apr 5 2026 5:37 PM | Updated on Apr 5 2026 5:52 PM

Mrunal Thakur Talk About Dacoit Movie

అడివి శేష్‌ హీరోగా, మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్‌’. షానియల్‌ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 10న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ బట్టి చూస్తే..ఇది లవ్‌స్టోరీతో కూడిన యాక్షన్‌ సినిమా అని అర్థమవుతుంది. ఇందులో హరి పాత్రలో హీరో అడివి శేష్, సరస్వతి పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారు. అయితే మృణాల్‌ తొలిసారి ఇందులో యాక్షన్‌ సీన్స్‌ కూడా చేసింది. అంతేకాదు ఓ పాపకు తల్లిగానూ నటించింది. అయితే ఈ సన్నివేశాలన్నీ ఈజీగానే చేసింది కానీ.. రొమాన్స్‌ సీన్సే కాస్త ఛాలెంజింగ్‌గా అనిపించాయట. ఈ విషయాన్ని స్వయంగా మృణాలే చెప్పింది. 

డెకాయిట్‌ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం మృణాల్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఛాలెంజింగ్‌గా అనిపించిన సన్నివేశాలేంటని ఓ విలేకరి అడగ్గా.. ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ‘యాక్షన్‌ సీన్లు నాకు ఇబ్బంది కాలేదు కానీ.. రొమాన్స్‌ సన్నివేశాలే ఛాలెంజింగ్‌గా అనిపించాయి. 

ఇదొక డిఫరెంట్‌ లవ్‌స్టోరీ సినిమా. ఇందులో హీరోపై కోపం ఉన్నప్పటికీ.. పాస్ట్‌లో ప్రేమగా ఉండాలి. రొమాన్స్‌ చేయాలి. అలా నటించడం నాకు సవాల్‌గా అనిపించింది. సరస్వతి పాత్ర నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది’ అన్నారు. ఇక స్టోరీ నచ్చడంతో ఈ సినిమాకు పారితోషికం కూడా తగ్గించుకున్నట్లు మృణాల్‌ చెప్పుకొచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement