బంపర్ ఆఫర్ కొట్టిన 'లిటిల్ హార్ట్స్' కుర్రోడు | Little Hearts Director Sai Marthand Movie With Adivi Sesh | Sakshi
Sakshi News home page

Adivi Sesh: యంగ్ డైరెక్టర్‌తో శేష్ కొత్త సినిమా

Apr 8 2026 12:42 AM | Updated on Apr 8 2026 12:42 AM

Little Hearts Director Sai Marthand Movie With Adivi Sesh

ఆచితూచి సినిమాలు చేసే యంగ్ హీరో అడివి శేష్.. 'డెకాయిట్'ని విడుదలకు సిద్ధం చేశాడు. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. మరోవైపు 'గూఢచారి 2' కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ కూడా రిలీజ్ కానుంది. వీటి తర్వాత ఎవరితో చేస్తాడనే దానిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. స్వయంగా సదరు దర్శకుడు ఈ విషయాన్ని బయటపెట్టాడు.

మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో 'డెకాయిట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. దీనికి 'లిటిల్ హార్ట్స్' దర్శకుడు సాయి మార్తాండ్ కూడా వచ్చాడు. మూవీ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలోనే శేష్‌తో తన తర్వాతి సినిమా ఉంటుందని ప్రకటించేశాడు. లవ్ స్టోరీతో దీన్ని తెరకెక్కించనున్నారు. 'గూఢచారి 2' పూర్తయిన వెంటనే ఇది సెట్స్‌పైకి వెళ్లనుంది.

శేష్ విషయానికొస్తే చివరగా 2022లో 'హిట్ 2'తో థియేటర్లలోకి వచ్చాడు. మళ్లీ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు 'డెకాయిట్'గా వస్తున్నాడు. ట్రయిలర్ చూస్తే ఇది రివేంజ్ ప్రేమకథలా అనిపిస్తుంది. మరోవైపు 'లిటిల్ హార్ట్స్' మూవీతో దర్శకుడిగా పరిచయమైన సాయి మార్తాండ్.. తొలి చిత్రంతో అద్భుతమైన హిట్ కొట్టాడు. ఇప్పుడు శేష్‌తో చేయబోయే సినిమాతోనూ హిట్ కొడితే రేంజ్ పెరిగిపోవడం గ్యారంటీ.

Advertisement
 
Advertisement
Advertisement