Adivi Sesh Interesting Comments On Mumbai Heroines In Hit 2 Teaser Launch Goes Viral - Sakshi
Sakshi News home page

Adivi Sesh : ముంబై హీరోయిన్స్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన అడివి శేష్‌

Nov 4 2022 12:45 PM | Updated on Nov 4 2022 1:13 PM

Adivi Sesh Intresting Comments About Mumbai Heroines Goes Viral - Sakshi

విభిన్నమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్‌. మేజర్‌తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ఆయన హిట్‌-2 అనే స్పై థ్రిల్లర్ తరహా కాన్సెప్ట్‌తో మన ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అడివి శేష్‌ ముంబై హీరోయిన్స్‌ గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

ఆయన మాట్లాడుతూ.. హిట్‌-2లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. సాధారణంగా ముంబై వాళ్లు ఉంటారు కదా.. ప్రెట్టి గర్ల్స్.. వస్తారు హాయ్ అని చెప్పి వన్ టూ త్రీ అంటారు. తర్వాత క్యారవాన్ ఎక్కి వెళ్లిపోతారు. అందరికీ నమస్కారం అంటారు. కానీ మీనాక్షి అలా కాదు. అందరికీ నమస్కారం చెప్పిన తర్వాత కూడా తెలుగులోనే మాట్లాడింది.

టీజర్‌ లాంచ్‌లోనే ఇంత ప్రిపేర్‌ అయ్యిందంటే సినిమాలో ఎంత కష్టపడి ఉండొచ్చో మీరే అర్థం చేసుకోండి అంటూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తాడు. అయితే ఈ సందర్భంగా ముంబై హీరోయిన్స్‌పై శేష్‌ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. 

Advertisement
 
Advertisement
Advertisement