Chiranjeevi About Major Movie: మహేశ్ బాబును చూస్తే గర్వంగా ఉంది: చిరంజీవి

Chiranjeevi Appreciates Adivi Sesh Major Movie Team: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మేజర్'. అడివి శేష్, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. అనురాగ్, శరత్ నిర్మించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి కలెక్షన్లతో పాటు ప్రశంసలు సైతం లభిస్తున్నాయి. మేజర్ మూవీ అద్భుతంగా తీశారంటూ చిత్రయూనిట్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు జనాలు. తాజాగా ఈ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఈ సినిమాను చూసిన చిరంజీవి 'మేజర్' చిత్రబృందాన్ని సోషల్ మీడియా వేదికగా అభినందించారు.
మేజర్ ఒక సినిమా మాత్రమే కాదు. అదొక నిజమైన ఎమోషన్. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని హత్తుకునేలా సినిమాను తెరకెక్కించారు. తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇలాంటి మూవీని మహేశ్‌బాబు నిర్మించినందుకు గర్వంగా ఉంది. చిత్రబృందానికి శుభాకాంక్షలు. అని ట్వీట్ చేశారు చిరంజీవి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మంచి సినిమాల గురించి చిరంజీవి ఎప్పుడూ మాట్లాడుతుంటారని, మేకర్స్‌ను ప్రోత్సహిస్తారని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల 'విక్రమ్' మూవీ విజయం సందర్భంగా కమల్ హాసన్‌ను చిరంజీవి సత్కరించిన విషయం తెలిసిందే.
చదవండి: కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా
రెండేళ్ల తర్వాత తల్లిని కలుసుకున్న హీరోయిన్..
#Major is not a film.Its truly an Emotion
Story of a great Hero & Martyr#MajorSandeepUnnikrishnan told in the most poignant way.A must-watch
Proud of @urstrulyMahesh for backing such a purposeful film
HeartyCongrats to @AdiviSesh @saieemmanjrekar #Sobhita @SashiTikka & Team pic.twitter.com/1lW1m3xmFO
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 13, 2022