మృణాల్‌.. టాలీవుడ్‌ హీరోనే పెళ్లి చేసుకో : అల్లు అరవింద్‌ | Allu Aravind Interesting Comments On Mrunal Thakur Marriage | Sakshi
Sakshi News home page

అప్పుడు లావణ్య..ఇప్పుడు మృణాల్‌.. అల్లు అరవింద్‌ బ్లెస్సింగ్స్‌

Apr 12 2026 3:06 PM | Updated on Apr 12 2026 3:21 PM

Allu Aravind Interesting Comments On Mrunal Thakur Marriage

స్టేజ్‌పై సరదాగా మాట్లాడే టాలీవుడ్‌ ప్రముఖుల్లో నిర్మాత అల్లు అరవింద్‌ ఒకరు. సినిమాకు సంబంధించిన ఈవెంట్లలో ఆయన స్పీచ్‌ ఎప్పుడూ నవ్వించేలా ఉంటుంది. అలాగే టాలెంట్‌ ఉన్న యువ నటీనటులను ప్రోత్సహించేలా ఆయన మాటలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాళ్ల ప్రేమ విషయాలను కూడా బయటపెడుతుంటాడు. అయితే ఆయనకు తెలిసి అంటాడో తెలియక అంటాడో తెలియదు కానీ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కొన్నిసార్లు నిజమవుతుంటాయి. 

ఓ సినిమా ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ..‘తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు.కాబట్టి ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది’ అని దీవించగా..ఆయన మాటలే నిజమై.. వరుణ్‌ తేజ్‌ని పెళ్లి చేసుకుంది. ఇక తాజాగా ఆయన మరో నటిపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు.  సీతారామం ఫేం మృణాల్‌ ఠాకుర్‌ని కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు.

తాజాగా ఆయన అడివి శేష్‌-మృణాల్‌ జంటగా నటించిన ‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మృణాల్‌ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. లావణ్య మాదిరే నువ్వు కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్‌ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. 

‘ఇంతకు ముందు ఒక అమ్మాయిని(లావణ్య త్రిపాఠి) దీవించాను. ఆమె మా వరుణ్‌ తేజ్‌ భార్య అయిపోయింది. అలాగే నువ్వు(మృణాల్‌) కూడా ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మాకు(టాలీవుడ్‌) కావాలి. అందుకే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని అరవింద్‌ నవ్వుతూ అన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement