Payal Rajput Interesting Comments On Tees Maar Khan In Pre Release Event - Sakshi
Sakshi News home page

Payal Rajput: ఆ సమయంలో నెర్వస్‌గా ఉంటాను

Published Wed, Aug 17 2022 5:50 PM

Payal Rajput Comments In Tees Maar Khan Pre Release Event - Sakshi

మూడు విభిన్న పాత్రలో ఆది సాయి కుమార్‌, పాయల్ రాజ్‌పుత్‌ జోడిగా నటించిన తాజా చిత్రం తీస్‌ మార్‌ ఖాన్‌. 'నాటకం' వంటి సినిమాను తెరకెక్కించిన కల్యాణ్‌ జి గోగణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్బంగా చిత్ర యూనిట్  ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ.. ''అడగ్గానే వచ్చిన మా మేజర్‌ (అడివి శేష్)కు సెల్యూట్. మా డీజే (సిద్దు జొన్నలగడ్డ) ఇలా రావడం ఆనందంగా ఉంది. నేను, సుధీర్ బాబు కలిసి మళ్లీ తండ్రీ కొడుకుల్లా నటించబోతోన్నాం. మా అబ్బాయి నటించిన ప్రేమ కావాలి అంటూ వచ్చాడు. ఇప్పుడు తీస్ మార్ ఖాన్ అంటూ ముందుకు రాబోతోన్నాడు. ఈ టీం అందరికీ థాంక్స్. ఇంత మంది మంచి మనుషులు కలిసి ఈ సినిమాను తీశారు. ఈ ఏడాదితో నాకు నటుడిగా 50 ఏళ్లు వస్తాయి. అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి.. అన్ని సినిమాలు బాగుండాలి.. అందులో మన సినిమా కూడా ఉండాలి. మీ ఆశీర్వాదంతో తీస్ మార్ ఖాన్ సినిమా కూడా విజయం సాధించాలి'' అని తెలిపారు. 

ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘పిలవగానే ఈవెంట్‌కు వచ్చిన అడివి శేష్, సుధీర్ బాబు, సిద్దులకు థాంక్స్. సినిమాలో మంచి ఎమోషన్‌ ఉంటుంది. మంచి స్క్రిప్ట్. మీకు నచ్చితే ఓ పది మందికి చెప్పండి. పాయల్ మంచి సహనటి. సునీల్ అన్న చేసిన చక్రి అనే పాత్ర అద్భుతంగా ఉంటుంది. అందరూ అద్భుతంగా నటించారు. నన్ను కొత్తగా ప్రజెంట్ చేసిన కల్యాణ్‌కు థాంక్స్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మా సినిమాను నిర్మించిన నాగం తిరుపతి రెడ్డి గారికి థాంక్స్. సాయి కార్తిక్ మంచి బీజీఎం ఇచ్చారు. మా కెమెరామెన్ బాలిరెడ్డి, ఫైట్ మాస్టర్ ఇలా పని చేసిన అందరికీ థాంక్స్. సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి’ అని పేర్కొన్నాడు. 

చదవండి: హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో నాజర్‌కు గాయాలు !

''నన్ను ఇక్కడకు పిలిచిన సాయి కుమార్ గారికి థాంక్స్. ఇది వరకు ఆది చేసిన సినిమాలు అన్నింట్లో కెల్లా ఈ చిత్రంలో కొత్తగా అనిపిస్తున్నాడు. కారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్ కల్యాణ్‌ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. స్క్రీన్ మీద ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తుంది'' అని సిద్ధు జొన్నల గడ్డ తెలిపాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. ‘తీస్ మార్ ఖాన్ సినిమా కుమ్మేయాలని కోరుకుంటున్నాను. సాయి కుమార్ గారు ఫోన్ చేసి రమ్మన్నారు. మా అమ్మ బర్త్ డే ఆగస్ట్ 19. ఈ చిత్రం సక్సెస్‌తో మా అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ట్రైలర్‌లో ఆది కుమ్మేశాడు. సినిమాలోనూ కుమ్మేస్తాడు. పాయల్‌ను ఇలా కలవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.

చదవండి: సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి!

 సుధీర్ బాబు మాట్లాడుతూ.. ''తీస్ మార్ ఖాన్ సినిమా ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. పర్ఫెక్ట్ కమర్షియల్ టైటిల్. నేను ఆది కలిసి శమంతకమణి సినిమాను చేశాం. ఆయన అద్భుతమైన నటుడు. ఈ చిత్రం ఆదికి పర్ఫెక్ట్ సినిమా అనిపిస్తోంది. సాయి కుమార్ గారితో నేను భలే మంచిరోజు చిత్రాన్ని చేశాను. నాకు ఆయన ఆన్ స్క్రీన్‌, ఆఫ్ స్క్రీన్‌లో తండ్రిలాంటి వారు'' అని తెలిపాడు. 

‘నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా సినిమా రిలీజ్ అయ్యే టైంలో కాస్త నెర్వస్‌గా ఉంటాను. అది అందరికీ సహజంగానే ఉంటుంది. మా సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నింటికి విశేషమైన స్పందన వచ్చింది. మా సినిమాకు మీ ప్రేమ దక్కినందుకు మాకు సంతోషంగా ఉంది. నేనేం స్టార్ కిడ్‌ను కాదు. నేను ఏం చేసినా నా సొంతంగానే చేశాను. అది మీ ప్రేమ, అభిమానం వల్లే చేయగలిగాను. ఈ సినిమా నాకెంతో స్పెషల్. మూడేళ్ల తరువాత నా సినిమా థియేటర్లోకి వస్తోంది. ఈ చిత్రంలో ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి’ అని హాట్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ పేర్కొంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement