breaking news
Konda surekha
-
సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: సుస్మిత వ్యాఖ్యల వివాదం తర్వాత తొలిసారి సీఎం రేవంత్‌ను కలిసిన మంత్రి కొండా సురేఖ.. ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం మీడియాతో కొండా సురేఖ మాట్లాడుతూ.. సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టానని తెలిపారు. సీఎం మనవడు, అల్లుడికి కూడా రాఖీ కట్టా. మంత్రి సీతక్కతో కలిసి రాఖీ కట్టాను. నేను అందరికీ ఆడపడుచునే. నన్ను వేరు చేసి చూడొద్దని కొండా సురేఖ అన్నారు.అయితే, తాజా పరిణామాలను ప్రస్తావించని కొండా సురేఖ.. పండగ వాతావరణంలో తాను ఎలాంటి కామెంట్స్ చేయనన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి మూడోసారి రాఖీ కట్టానన్నా సురేఖ.. ప్రెస్మీట్లో రాఖీ శుభాకాంక్షలకే పరిమితమయ్యారు. సీఎం మంచి సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నా. ఇక్కడ రాజకీయాలు మాట్లాడను, సీఎం రేవంత్‌కు ఆడపడుచుల దీవెన ఉంటుంది’’ అని కొండా సురేఖ పేర్కొన్నారు. -
సీఎం రేవంత్ ఇంటికి మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డితో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. సీఎం రేవంత్‌కు రాఖీ కట్టేందుకు వచ్చారు. వివాదం తర్వాత తొలిసారి సీఎంతో ఆమె సమావేశమయ్యారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు తర్వాత పొలిటికల్ గ్యాప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. కొండా సురేఖకు నోటీసులు జారీ చేసిన క్రమశిక్షణ కమిటీ.. నివేదికను ఏఐసీసీకి పంపించింది.. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌తో కొండా సురేఖ భేటీ కావడం ఉత్కంఠ రేపుతోంది. చెల్లెమ్మ సురేఖను అన్న రేవంత్ క్షమిస్తారా?. కాంగ్రెస్‌లో కొండా సురేఖ తుపాన్ ముగిసిపోతుందా?. సుస్మిత కామెంట్ల వివాదానికి తెరపడుతుందా? అనే చర్చ జరుగుతోంది.కాగా, తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ నివేదికతో వేటుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం ఊపందుకున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భేటీ రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. సురేఖపై చర్య ఖరారైందా? లేక అధిష్టానం చివరి నిమిషంలో మరో మార్గాన్ని ఎంచుకుంటుందా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం తెలిసిందే. ఈ నివేదిక ఏఐసీసీకి చేరడంతో బంతి పూర్తిగా అధిష్టానం కోర్టులోకి వెళ్లింది.టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కూడా ఈ వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉందని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని తాజాగా ప్రకటించారు. ఇదే సమయంలో ఖర్గేతో భట్టి బెంగళూరులో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా భట్టి ఖర్గేకు వివరించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అలాగే చిన్నారెడ్డి వ్యవహారంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సిఫారసు బయటకు వచ్చిన తర్వాత సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం దాదాపు ఖాయమన్న వాదన బలపడింది. కేబినెట్ నుంచి తక్షణమే తొలగించాలా? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకు ఆగాలా? అన్న అంశంపై అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
రాఖీ కట్టనిస్తారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో రాఖీ పండుగ వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి రాఖీ కట్టేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. భట్టి ఇంకా బెంగళూరులోనే ఉండగా!.. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇస్తారా? అన్న అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.ప్రతీ ఏడాది రాఖీ పండుగ సందర్భంగా మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సీఎం, డిప్యూటీ సీఎంలకు రాఖీ కడుతుంటారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సురేఖ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులో ఉండటంతో ఆయనను కలిసే అవకాశం కూడా ఆసక్తికరంగా మారింది.సుస్మిత వ్యాఖ్యలతో దుమారం..కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపాయి. పరకాల(వరంగల్) ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను పరకాల ఎమ్మెల్యే కాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి.అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి స్పష్టం చేశారు. అయినప్పటికీ సురేఖ వివరణపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ క్రమశిక్షణా కమిటీకి, అటు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు.అధిష్టానం వద్దకు వ్యవహారం..ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించింది. క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అంశంపై పార్టీ పెద్దలతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో కొండా మురళి కూడా పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరుకు వెళ్లారు. కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీలో మరికొందరిపై క్రమశిక్షణ చర్యల అంశాలపైనా ఖర్గేతో భట్టి చర్చించినట్లు సమాచారం.మౌనంగా సురేఖ.. అపాయింట్మెంట్పై ఉత్కంఠకొండా సురేఖ వ్యవహారం అధిష్టానమే చూసుకుంటుందని.. ఎవరూ దీని గురించి మాట్లాడొద్దని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే సూచించారు. అయితే ఆయన అపాయింట్మెంట్ కోసం సురేఖ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటు కూతురి వ్యవహారంపైనా కొన్నిరోజులుగా కొండా సురేఖ పెద్దగా స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు కూడా ఆమె కొంత దూరంగా ఉంటూ.. తన నియోజకవర్గంలో జరిగే శుభకార్యాలకు హాజరవుతూ బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు ముఖ్య నేతలను కలిసేందుకు సురేఖ తాజాగా అపాయింట్మెంట్ కోరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా? రాఖీ కట్టేందుకు అవకాశం కల్పిస్తారా? అన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: కొండా ఎపిసోడ్.. లాస్ట్ మినిట్‌లో ఆ ట్విస్ట్ తప్పదా? -
చివరి నిమిషంలో ట్విస్ట్ ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ నివేదికతో వేటుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం ఊపందుకున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భేటీ రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. సురేఖపై చర్య ఖరారైందా? లేక అధిష్టానం చివరి నిమిషంలో మరో మార్గాన్ని ఎంచుకుంటుందా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం తెలిసిందే.ఈ నివేదిక ఏఐసీసీకి చేరడంతో బంతి పూర్తిగా అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కూడా ఈ వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉందని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని తాజాగా ప్రకటించారు. ఇదే సమయంలో ఖర్గేతో భట్టి బెంగళూరులో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా భట్టి ఖర్గేకు వివరించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే చిన్నారెడ్డి వ్యవహారంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సిఫారసు బయటకు వచ్చిన తర్వాత సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం దాదాపు ఖాయమన్న వాదన బలపడింది. కేబినెట్ నుంచి తక్షణమే తొలగించాలా? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకు ఆగాలా? అన్న అంశంపై అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీకి ముగ్గురు కీలక నేతలుమంత్రి కొండా సురేఖతోపాటు చిన్నారెడ్డి తదితర నేతలకు సంబంధించి క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదికను ఏఐసీసీకి పంపిన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ వైపే ఉంది. అదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ ఈనెల 31న ఢిల్లీకి వచ్చిన తరువాతే ఈ అంశంపై స్పష్టత వస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది.ఈ ముగ్గురు అధిష్టానంతో భేటీ అయితే సురేఖపై చర్యతోపాటు తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవలి కాలంలో పెరిగిన అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సురేఖ, చిన్నారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి తదితర ఎమ్మెల్యేల వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మురళీ భేటీలో ఏం జరిగింది?కొండా మురళీ డిప్యూటీ సీఎం భట్టిని కలిసి తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యం గురించి వివరించినట్లు చెబుతున్నారు. సురేఖ కుటుంబం తరఫున వివరణ ఇవ్వడంతోపాటు రాజకీయంగా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న చర్చకు ఈ భేటీ కారణమైంది. అదే సమయంలో సురేఖ మంత్రి హోదాలో తనదైన శైలిలో వరంగల్ జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటుండడం, వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. -
వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఇద్దరికి ఉద్వాసన!
సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. కేబినెట్ విస్తరణ, ప్రక్షాళనతోనే ఈ ఎపిసోడ్‌కు ఎండ్‌కార్డ్ వేసే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశముందని సమాచారం. విస్తరణలో భాగంగా పలువురు మంత్రుల శాఖల మార్పు.. ఇద్దరు, ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాముందని చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.ఇదిలా ఉండగా.. శాఖల మార్పు సంకేతాలతో తమ శాఖలో పూర్తయిన పనులకు రిబ్బన్ కటింగ్ చేసేందుకు మంత్రులు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈ దఫాలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖల మార్పునకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా, వరంగల్‌లో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతుంది, వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గాల్లో అనధికార పర్యటనలో పాల్గొంటున్న మంత్రి కొండ సురేఖ.. నో పొలిటికల్ కామెంట్స్ అంటూ ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు. అదే రీతిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కూడా మౌనం పాటిస్తున్నారు. అయితే, ఒక వైపు ఏం జరుగుతుందోన్న ఆందోళనలో వరంగల్ ఈస్ట్ కొండా క్యాడర్ ఉంటే.. మరో వర్గం సంబరాలు చేసుకుంటున్నారు.రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉన్న కొండా మురళి తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత మూడు రోజులుగా ఎక్కడ కనిపించని సుస్మిత పటేల్ హడావుడి లేకుండా సైలెన్స్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. మరో వైపు, మాజీ ఓఎస్డీ సుమంత్ జాడ కోసం వరంగల్‌లో కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని రాష్ట్రవాప్తంగా ఆసక్తి నెలకొంది. -
ఎదురు మాట్లాడను.. ప్రెస్‌మీట్ పెట్టను: అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల: మహిళలంటే తనకు చాలా గౌరవం, వారిపై తాను ప్రెస్ మీట్లు పెట్టనని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇంట్లో మా అమ్మ తిట్టినా తల వంచుకుంటానే తప్ప ఎదురు మాట్లాడను. మహిళల ఒక్క చుక్క కంటనీరు నేలపై పడ్డా అది సునామీ అయిపోయి మనం అందులో కొట్టుకుపోతామ'ని వ్యాఖ్యానించారు.కొండా సురేఖ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని అనిరుధ్ రెడ్డి (Janampalli Anirudh Reddy) చెప్పారు. ఈ వ్యవహారంపై ఎవరూ మాట్లాడొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కొండా సురేఖ అంశంలో ఎమ్మెల్యేలు నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు తనను ఎవరూ ఆహ్వానించలేదని వెల్లడించారు. చిన్నారెడ్డి చాలా సీనియర్ నాయకుడని, ఆయన విషయంలో తానేమి మాట్లాడబోనని అన్నారు.ప్రశ్నిస్తూనే ఉంటాతన నియోజకవర్గ సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. పెండింగ్ బిల్లుల కోసం అవసరమైతే భట్టి విక్రమార్కతో కొట్లాడుతానని, ఈయకపోతే దీక్షకు దిగుతానని వ్యాఖ్యానించారు. కాగా, కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదీ చదవండి: ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌పై సస్పెన్స్! -
ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌పై సస్పెన్స్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో.. కొండా కుటుంబంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం రాష్ట్రం నుంచి ఢిల్లీకి చేరడంతో రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక, ఖర్గేతో భేటీ అనంతరం కూడా భట్టి విక్రమార్క బెంగళూరులోనే ఉండటం ఆసక్తిని పెంచుతోంది.తాజా పరిణామాల్లో భాగంగా నిన్న కొండా మురళి, రాజగోపాల్‌రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. అయితే భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా మురళి.. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదంపై కొండా కుటుంబం తమ వైఖరిని స్పష్టం చేసినప్పటికీ.. పార్టీ అధిష్ఠానం మాత్రం కఠిన చర్యల దిశగానే అడుగులు వేస్తుందా? అన్న చర్చ మొదలైంది.ఇదిలా ఉంటే.. కొండా మురళి, రాజగోపాల్‌రెడ్డితో భేటీ అనంతరం భట్టి విక్రమార్క నేరుగా బెంగళూరు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా ఖర్గేతో భట్టి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో కొండా కుటుంబం వ్యవహారంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను భట్టి ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ముఖ్యంగా సుస్మిత తాజాగా చేసిన వ్యాఖ్యలు, వాటిపై పార్టీలో నెలకొన్న పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో.. ఆ సిఫారసులను అమలు చేయాల్సిన అవసరం ఉందని భట్టి అధిష్ఠానం వద్ద తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. కొండా కుటుంబంతో పాటు సీనియర్ నేత చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని భట్టి కోరినట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం క్రమశిక్షణతో ముందుకు సాగాలంటే.. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే నేతలపై చర్యలు తప్పవని ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు.ఇంకా బెంగళూరులోనే భట్టి..మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం కూడా భట్టి విక్రమార్క బెంగళూరులోనే ఉండటం ఆసక్తిని పెంచుతోంది. మరోసారి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో కొండా ఫ్యామిలీపై కాంగ్రెస్ అధిష్ఠానం చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. క్రమశిక్షణ కమిటీ సిఫారసులకు ఆమోదం లభిస్తుందా? కొండా కుటుంబంపై చర్యలు తప్పవా? చిన్నారెడ్డిపై కూడా వేటు పడుతుందా? లేక వివాదానికి మరోసారి సర్దుబాటు పరిష్కారం చూపుతారా? అన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.సీఎం, పీసీసీ అభిప్రాయాలపైనా చర్చఇదిలా ఉండగా.. కొండా కుటుంబం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ నాయకత్వం అభిప్రాయాలపైనా భట్టి-ఖర్గే మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదాన్ని రాష్ట్ర స్థాయిలోనే ముగించాలా? లేక అవసరమైతే ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలా? అన్న అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ అంశాన్ని ఇకపై సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని భట్టి అధిష్ఠానానికి సూచించినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఢిల్లీలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని కూడా కోరినట్లు సమాచారం.చదవండి: ‘రేవంత్‌పై కొండా సుస్మిత వ్యాఖ్యలతో నాకేం సంబంధం’ -
వేటేస్తారా... వదిలేస్తారా?
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆమెపై వేటు వేయాల్సిందేనంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో శంఖంలో పోయడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసమైన ప్రజాభవన్ వేదికగా నాటకీయ ఘటనలు జరిగాయి. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన మరుసటి రోజు బుధవారం భట్టి నివాసంలో కొండా మురళీ కనిపించారు. ఆయన వచ్చిన సమయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కనిపించింది. కొండా ఎపిసోడ్‌ను కోల్డ్‌స్టోరేజీలో పెట్టే దిశలో పరిణామాలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే సురేఖ కుటుంబంతో మాట్లాడే బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. భట్టికి అప్పగించారని, అందులో భాగంగానే మురళీని కలిశారని అంటున్నారు. కలిసి వచ్చారా..? మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, అసమ్మతికి మారుపేరైన రాజగోపాల్‌రెడ్డి ప్రజాభవన్‌లో ఉన్న సమయంలోనే మురళీ కూడా రావడం అత్యంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, గ్లోబల్ సమ్మిట్‌పై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కోసం ఉత్తమ్, శ్రీధర్‌బాబు వచ్చారని, తన నియోజకవర్గ పనుల కోసం రాజగోపాల్‌రెడ్డి వచ్చారే తప్ప ముందస్తు సమాచారం ప్రకారం రాలేదని ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి. కానీ, మురళీని కలిసేందుకు భట్టి సమ్మతించడం, సీఎంతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతుండటం, సాయంత్రానికి హడావిడిగా బెంగళూరుకు బయలుదేరి వెళ్లడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ వ్యక్తమవుతోంది. భట్టి భుజంపై తుపాకీ పెట్టి సురేఖ కుటుంబాన్ని కాల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదంటే తొందరపడద్దనే ధోరణితో సీఎం ఉన్నారా... లేదా సురేఖ వ్యవహారం మధ్యే మార్గంలో వెళ్తుందా అన్న చర్చ గాం««దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. భట్టి గురువారం బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మాత్రం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సెపె్టంబర్ 7 నాటికే కొండా ఎపిసోడ్‌కు ఫుల్స్టాప్ పడుతుందని సమాచారం. మురళీ ఏమన్నారంటే... మురళీ, భట్టి భేటీలో ఏం జరిగిందన్నది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం భట్టి కొంత గట్టిగానే మాట్లాడినట్టు తెలుస్తోంది. సుస్మిత చేసిన వ్యాఖ్యలు సీఎంను కించపరిచేలా, పార్టీని నష్టపరిచేలా ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. అయితే, సుస్మిత మాటలతో తనకేం సంబంధమని మురళీ చెప్పినట్టు తెలిసింది. పదేపదే వివాదాలకు కారణమవడం, జిల్లా నేతలతో సమన్వయంతో వ్యవహరించలేకపోవడం, సీఎంతో ముఖాముఖి కలిసే పరిస్థితి కూడా లేకుండా చేసుకోవడం లాంటి అంశాలపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం. అనంతరం మురళీ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఓ బిల్లు కోసం భట్టి దగ్గరకు వచ్చానని చెప్పారు. సుస్మిత వ్యాఖ్యల గురించి తాను భట్టితో మాట్లాడలేదని, ఆ వ్యాఖ్యలకు తనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ‘అది నా బిడ్డకు సంబంధించింది. ఆమెకు 35 ఏళ్ల వయసు.. 15 ఏళ్ల పిల్లలున్నారు. వరల్డ్ చాంపియన్ అయిన కొడుకు ఉన్నాడు. ఆమె మనోభావాలు ఆమెకు ఉండొచ్చు. ఎవరి స్వతంత్రత వారిది... ఆమెను ప్రశ్నించే హక్కు మాకు లేదు. ఆమె ప్లాన్ ఏలో భాగంగా ఏదో మాట్లాడింది. ప్లాన్ బీలో ఏం చేస్తుందో.. ఆమె మనసులో ఉన్నది మాకెలా తెలుస్తుంది. కవిత గారు పోయారు. అలానే ఎవరి నిర్ణయం వాళ్లు తీసుకుంటారు. మాకు సోనియా, రాహుల్, ప్రియాంకా గాం«దీలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. మేం కాంగ్రెస్‌లోనే ఉంటాం’ అని మురళీ వ్యాఖ్యానించారు. రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గ విషయాలు మాట్లాడేందుకు ప్రజాభవన్‌కు వచ్చానన్నారు. తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి గురించి, వ్యక్తిగతంగా ఎవరి గురించీ మాట్లాడలేదన్నారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో హైకమాండ్‌దే తుది నిర్ణయమని, ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహించాల్సిందేనన్నారు. సురేఖ విషయంలోనూ హైకమాండ్‌దే తుది నిర్ణయమని, ఈ విషయంలో సీఎం అభిప్రాయమే తన అభిప్రాయమన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకో రాధాకృష్ణ: రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్, ఆ చానల్ ఎండీ రాధాకృష్ణకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘ఏబీఎన్ చానల్ ఎవరికి సపోర్ట్ చేస్తోంది. కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. లేదంటే మర్యాద దక్కదు. మా కెపాసిటీ ఏంటో చూపిస్తే మీ చానల్, పేపర్ ఉండవు. తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీపరులు ఎంతోమంది ఉన్నారు. ఇతర పారీ్టల నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నతస్థాయిలో ఉండొచ్చు. అంతమాత్రాన పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడిన మాలాంటి వ్యక్తులను కించపరచొద్దు. అసలైన కాంగ్రెస్ రక్తం మాది. మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు రాస్తే బాగుండదని హెచ్చరిస్తున్నా. మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపర్చే విధంగా ప్రయత్నించడం మంచిది కాదు. ఎవరు చేస్తున్నారో వారికే చెబుతున్నా. కొందరు వ్యక్తుల గురించి, వారిని బలంగా చేసేందుకు నా లాంటి వారిని బలహీనులను చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి... ఇలాంటి చానళ్లు, పేపర్లు 100 పెడతా. మాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు’ అని రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. -
‘సీఎం రేవంత్‌పై కొండా సుష్మిత వ్యాఖ్యలతో నాకేం సంబంధం’
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్‌లో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కివేసే ప్రయత్నం జరుగుతోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి వివాదాన్ని సర్దుమణిచే ప్రయత్నంలో భాగంగా కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ కాగా, ఆ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారన్న ప్రచారంపై ఆయన స్పందించారు. కొండ సుస్మిత పటేల్ వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు. మునుగోడు అభివృద్ధి నిధుల విషమై చర్చించేందుకు భట్టి విక్రమార్కను కలిశాను. నేను ఎప్పుడూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని నేను. ఎంపీ, ఎమ్మెల్యేగా తెలంగాణ కోసం ఆనాడు ఫైట్ చేశా. తెలంగాణ ఏర్పాటులో భాగస్వామ్యం లేని వాళ్ళు ఇవాళ విమర్శలు చేస్తున్నారు.నా పైన విమర్శలు చేసే వాళ్ళు వాళ్ళ స్థాయి ఏంటో గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కి వేసే ప్రయత్నం జరుగుతుంది. ఉద్యమంలో లేనివాళ్లు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉండవచ్చు. కొండా సుస్మిత పటేల్ అంశాన్ని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. నాలాంటి ఉద్యమ నేతలను విమర్శ చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం’అని హెచ్చరికలు జారీ చేశారు.👉ఇదీ చదవండి: కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు -
కొండా సురేఖ రాజీనామా చేస్తారా?.. ఢిల్లీలో హైఓల్టేజ్ పాలిటిక్స్
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేయడంతో.. ఏఐసీసీ పెద్దలు తదుపరి నిర్ణయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ విషయంలో ఎలాంటి చర్య తీసుకోవాలన్న దానిపై అధిష్టానంలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.అయితే, కొండా సురేఖను నేరుగా మంత్రి పదవి నుంచి తప్పిస్తే రాజకీయంగా ఎలాంటి విమర్శలు ఎదురవుతాయన్న అంశాన్ని కూడా ఏఐసీసీ నేతలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఆమె బీసీ మహిళా మంత్రి కావడంతో నేరుగా వేటు వేస్తే పార్టీపై వచ్చే రాజకీయ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో సస్పెన్షన్‌కు బదులుగా రాజీనామా చేయించడం ద్వారా మధ్యేమార్గాన్ని అనుసరించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, తుది నిర్ణయం తీసుకునే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో అధిష్టానం నేరుగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారుల ఎంపిక కోసం 28న లక్కీ డ్రా.. ఇక, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీపై ఈ వ్యవహారం చూపుతున్న ప్రభావం, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. రానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొండా సురేఖపై ఎలాంటి చర్య ఉంటుందన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. సస్పెన్షన్ చేస్తారా? లేక మంత్రి పదవికి రాజీనామా చేయిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.చిన్నారెడ్డి పరిస్థితేంటి?మరోవైపు సీనియర్ నేత చిన్నారెడ్డి విషయంలోనూ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయనను అధికార పదవి నుంచి తప్పిస్తారా? లేక కేవలం మందలింపుతో వ్యవహారాన్ని ముగిస్తారా? అనే అంశాలపై కూడా ఏఐసీసీ పెద్దలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఇద్దరిపై ఒకే తరహా చర్య తీసుకోవాలా? లేక వారి వ్యవహారాలను వేర్వేరుగా పరిగణించాలా? అన్నదానిపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. మంత్రి కొండా సురేఖ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే, క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి నివేదిక పంపిన నేపథ్యంలో ఈ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ రియాక్షన్‌పై పలువురు నేతలు ఎదురుచూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. కాగా, మంత్రి సురేఖ మాత్రం ఈ అంశంపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. -
వేటు వేయండి!
సాక్షి, హైదరాబాద్: అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డిపై చర్యలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. పార్టీకి ఇబ్బంది కలిగేలా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించారని, ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి, చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని పార్టీని కోరింది. ఈ మేరకు కొండా సురేఖ, చిన్నారెడ్డిలకు సంబంధించిన నివేదికలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు అనంతుల శ్యాంమోహన్, వాజిద్ హుస్సేన్ తదితరులతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి నివేదికను అందజేశారు. ఈ నివేదికను ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందా..? లేక నేరుగా అధిష్టానం పరిశీలించి నిర్ణయం వెంటనే తీసుకుంటుందా? లేక ఏఐసీసీ స్థాయిలో వారిద్దరిని పిలిపించి వారి వివరణలు తీసుకున్నాక తుది నిర్ణయం తీసుకుంటుందా అన్న ఆసక్తికర చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఆమెను తప్పించడమే పరిష్కారం మంత్రి కొండా సురేఖ విషయంలో ఇచ్చిన నివేదికలో ‘క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటం సురేఖకు అలవాటుగా మారింది. ఆమె రాజకీయ నేపథ్యమంతా వివాదాలతో కూడుకున్నదే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఆమె వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రెండుసార్లు పార్టీకి క్షమాపణలు చెప్పి మళ్లీ పార్టీ నియమావళిని ఉల్లంఘించారు. అమెను మంత్రి పదవి నుంచి తప్పించడమే సరైన చర్య అని భావిస్తున్నాం’ అని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. సురేఖకు సంబంధించి మూడు, చిన్నారెడ్డిపై రెండు పేజీల నివేదికతోపాటు ఇందుకు తగిన ఆధారాలను కూడా పొందుపరిచిన క్రమశిక్షణ కమిటీ ఇదే నివేదికను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌కు కూడా పంపినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. మంచి అవకాశమిచ్చాం... విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘ చిన్నారెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా, గెలిచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి అవకాశం ఇచ్చాం. కేబినెట్ హోదా ఇచ్చాం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఆయన కేబినెట్ సమావేశాలకు కూడా వస్తున్నారు. తొమ్మిదిసార్లు ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది. పోటీ చేసేందుకు అవకాశామిచ్చింది. కానీ ఉద్దేశపూర్వకంగానే పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరించారని, పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడారని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణించి ఆయన్ను పదవి నుంచి తప్పించాలి’ అని చిన్నారెడ్డి గురించి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. హైకమాండ్ నిర్ణయం మేరకు చర్యలు: మల్లురవి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌కు నివేదిక ఇచ్చిన అనంతరం గాం«దీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ప్రధానమైందని చెప్పారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి గురించిన అన్ని విషయాలు, సిఫారసులను తమ నివేదికలో పొందుపర్చామని చెప్పారు. ఈ నివేదికను ఏఐసీసీ చీఫ్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పంపుతారని చెప్పారు. ఏదైనా హైకమాండ్‌దే తుది నిర్ణయమని, తమ సిఫారసుల ద్వారా పార్టీ కేడర్‌కు ఓ సందేశం వచ్చేలా నివేదిక ఇచ్చామని మల్లురవి స్పష్టం చేశారు. పార్టీ పెద్దగా తనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా సురేఖ, చిన్నారెడ్డి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ కోణంలో ఆ ఇద్దరికి నోటీసులు ఇస్తే.. ఆ నోటీసులనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ సమాధానం ఇవ్వడం సబబు కాదని వ్యాఖ్యానించారు. కుమార్తె కొండా సుస్మిత మాట్లాడిన అంశం కొండా సురేఖకు తెలియకుండానే జరుగుతుందా అని పశి్నంచారు. సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డిని కూడా కలిసి నివేదికలోని అంశాలను వివరించడానికి ప్రయత్నించారు. కానీ రేవంత్ బిజీ షెడ్యూల్ కారణంగా కలవలేకపోయారని, వీలును బట్టి బుధవారం సీఎంను కలిసే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.ఏమి జరుగుతుందో? కఠిన చర్యలు తీసుకోవాలన్న క్రమశిక్షణ కమిటీ నివేదిక నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు హైకమాండ్ అంగీకరిస్తుందా? లేక గౌరవప్రదంగా ఆమెతో రాజీనామా చేయిస్తుందా..? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమె శాఖను మారుస్తారా.. ఇంతకు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు చిన్నారెడ్డి విషయంలో ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు... అధికారిక పదవి నుంచి మాత్రమే తప్పిస్తారా లేదంటే మందలింపుతో సరిపెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. -
కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ మంత్రిపై చర్యలకు సిపారసు చేసింది. ఈ రోజు (మంగళవారం) టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌కు ఆరు పేజీల నివేదికను అందించింది. నివేదికలో.. "కొండా సురేఖ పదే పదే తప్పులు చేస్తున్నారు. గతంలో కూడా కీలక వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుటుంబసభ్యులను కంట్రోల్ చేయలేకపోతున్నారు. సురేఖపై చర్యలు తీసుకోకపోతే పార్టీకే నష్టం" అని తెలిపింది. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో మల్లురవి భేటీ కానున్నారు. సీఎం రేవంత్‌ను కలిసి నివేదికలోని అంశాలు వివరించనున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఏ నిర్ణయం తీసుకోనుందా అని ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ అంశంపై ఇదివరకే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘కొండా సురేఖ అంశం క్రమశిక్షణా కమిటీ పరిధిలో ఉంది. పార్టీ అంతర్గత అంశాలపై మీడియా ముఖంగా మాట్లాడను. తీసుకునే నిర్ణయాలకు మేము అందరం కట్టుబడి ఉన్నాం. ఆ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే’ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కమిటీ సైతం మంత్రిపై చర్యలకు సిపారసు చేసింది.అసలు వివాదం ఏంటి?ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ అభ్యంతకరంగా మాట్లాడారు. 'సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సంస్కృతి అబ్బలేదు. టీడీపీ నుంచి వచ్చిన వారిపై ప్రేమ కురిపిస్తున్నారు. రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తోంది. అచ్చ కాంగ్రెస్‌కు స్థానం లేకుండా చేస్తున్నారు. ఎప్పుడూ ఏం మాట్లాడతారో సీఎంకు తెలియదు. సంగారెడ్డికి వెళ్లినపుడు జగ్గారెడ్డి విషయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పిన సీఎం.. పరకాలలో రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఎలా కోరతారు’ అని ప్రశ్నించారుఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే సీఎం కాదన్నారు. తాము కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియా, రాహల్, ప్రియాంకలను గౌరవిస్తామన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరూ ఆనందంగా లేరన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్స్‌లో కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడారు.కొండా సురేఖ వివరణకాగా ఈ వివాదంపై ఇదివరకే కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో మంత్రి స్పందిస్తూ.. ‘సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక స్వతంత్ర వ్యక్తిగా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకానీ ఆ వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా నియమావళిపై నాకు పూర్తి గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ నాకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి’అని కొండా సురేఖ కోరారు. అయినప్పటికీ క్రమశిక్షణ కమిటీ ఆమెపై చర్యలకే సిపారసు చేసింది.ఇదీ చదవండి: ఒంటరైన మంత్రి కొండా సురేఖ -
జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో నిర్లక్ష్యంపై చర్యలు చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదులో అలసత్వం వహించారంటూ సీఐపై వేటు వేసింది. సుమంత్‌ను పట్టుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకు ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకుంది. మూడు వారాల క్రితమే జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్గా ముత్తు యాదవ్ బాధ్యతలు చేపట్టారు.కాగా, హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు మూడు బృందాలు ఏర్పాటు చేయగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. గత నెల 30న జూబ్లీహిల్స్ లోని తన కార్యాలయానికి సుమంత్ సహచరులు రాము డబ్బు వ్యవహారంలో మాట్లాడేందుకు చెంగిచెర్ల కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ని పిలిపించారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టుఅక్కడే ఉన్న సుమంత్ ఆయన అనుచరులు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాము తదితరులు ఇనుపరాడుతో తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న సుమంత్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. ఆయన డ్రైవర్ నవీన్ ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
అధిష్టానం కోర్టులోకి!
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోర్టులోకి చేరింది. ఈ విషయంలో ఢిల్లీ పెద్దలు తీసుకునే నిర్ణయంపైనే ఆమె భవితవ్యం ఆధారపడి ఉంటుందని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు తగినట్టుగానే సోమవారం రెండు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి అటు విలేకరుల సమావేశంలోనూ ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీలోనూ సురేఖ అంశంపై స్పందించారు. అంతా పార్టీ అధిష్టానం చూసుకుంటుందని విలేకరుల సమావేశంలో చెప్పిన ఆయన.. ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎవరూ దీని గురించి మాట్లాడొద్దని సూచించారు. ‘పాజిటివ్ వద్దు.. నెగెటివ్ వద్దు.. సురేఖ ఎపిసోడ్ గురించి మాట్లాడొద్దు.. ఫుల్స్టాప్ పెట్టండి... విషయం హైకమాండ్ దగ్గరకు వెళ్లింది కదా. వారు నిర్ణయం తీసుకోవాలి.’అని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మరోవైపు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, షోకాజ్ నోటీసులకు సురేఖ సమాధానంపై ప్రాథమిక నివేదికను పార్టీకి అందజేసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌లకు కమిటీ చైర్మన్ మల్లురవి సోమవారం ప్రాథమిక నివేదికను అందజేశారు. సుస్మిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ప్రతిష్టను వ్యక్తిగతంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. కాగా, ఈ నివేదిక ఆధారంగా సుస్మిత, సురేఖల అంశంపై పీసీసీ నుంచి కూడా ఏఐసీసీకి ఓ నివేదిక వెళుతుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత రాష్ట్ర పార్టీ పెద్దలకు హస్తిన నుంచి పిలుపు వస్తుందని, అక్కడ జరిగే చర్చలో సీఎం, పీసీసీ చీఫ్‌ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఆ వర్గాల్లో జరుగుతోంది. నాడు అడ్డుకున్నదెవరు? ఈ ఎపిసోడ్లో మరో ఆసక్తికర అంశం వెలుగులోనికి వచ్చింది. గతంలో కూడా సురేఖ కుమార్తె సుస్మిత తననుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే సీఎం రేవంత్ చాలా సీరియస్‌గా తీసుకున్నారని, ఈ అంశంపై అధిష్టానం దగ్గర చర్చ జరిగినప్పుడు కొండా కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అడ్డుకున్నారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. అప్పుడు చర్యలు తీసుకోకపోవడంతోనే మరోమారు సుస్మిత సీఎం మీద మాట్లాడగలిగారని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. ఈసారి తాను కూడా కాపాడలేనని ఇటీవల మహేశ్‌గౌడ్ నిజామాబాద్‌లో చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనమని వారంటుండడం గమనార్హం. కాగా, కొండా సురేఖ ఎపిసోడ్ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిల మధ్య కూడా చర్చకు వచ్చింది. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో తెలంగాణ రైజింగ్–2027 సమీక్షకు ముందు తాజా రాజకీయ వివాదం గురించి ఇద్దరూ మాట్లాడుకున్నట్టు సమాచారం. సురేఖ విఫలమయ్యారు: క్రమశిక్షణ కమిటీ విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రి కొండా సురేఖపై చర్యలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. సురేఖ కుమార్తె సుస్మిత పదేపదే సీఎంను కించపరిచేలా, పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతుంటే ఆమెను నియంత్రించడంలో సురేఖ విఫలమయ్యారని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. తాము సుస్మిత మాట్లాడిన మాటలు, ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలను క్షుణ్ణంగా పరిశీలించామని, సురేఖ సమాధానాలను కూడా పరిశీలించామని, అన్నింటినీ పరిశీలించిన మీదట క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సురేఖ అర్హురాలని, ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఏఐసీసీ నిర్ణయమని టీపీసీసీ ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. -
మంత్రి పదవికి గండం...? రేవంత్ తో సురేఖ భేటీపై ఉత్కంఠ
-
కొండా సురేఖ ఇష్యూ.. రేవంత్ కీలక భేటీ!
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటన రద్దు తర్వాత హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలపై దృష్టి సారించారు. సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం, పార్టీలో క్రమశిక్షణ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్‌రెడ్డి తన విదేశీ పర్యటనను కుదించుకుని లండన్ నుంచి తిరిగి వచ్చారు. అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి లభించలేదని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించగా.. కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలపై తీవ్రస్థాయిలో మండిపడింది. దీనిపై తిరిగి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని సీఎం రేవంత్ అన్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్(చిట్టక్క) సీఎం రేవంత్ రెడ్డికి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తట్టుకోలేకపోతున్నారు. కూతురి వ్యాఖ్యలను ఖండించకపోగా.. నాకేం సంబంధం అన్నట్లు సురేఖ మాట్లాడటాన్ని కూడా అంగీకరించడం లేదు. ఇప్పటికే ఈ విషయమై క్రమశిక్షణా కమిటీకి వాళ్లంతా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంతో తమ అభిప్రాయాలను పంచుచుకోనున్నారు. మరోవైపు.. కొండా సురేఖ ఎపిసోడ్‌తో పాటు వనపర్తిలో చిన్నారెడ్డి-ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆదిలాబాద్ నేతలు కంది శ్రీనివాస్‌రెడ్డి-అల్లూరి సంజీవరెడ్డి గొడవ, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇటు.. కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖ చిక్కుల్లో పడ్డారు. వివరణ కోరుతూ పీసీసీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె నిన్న బెంగళూరు వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. గంట పాటు వీళ్ల మధ్య భేటీ జరిగింది. మరోవైపు ఈ పరిణామాల మధ్య మంత్రి కొండా సురేఖ ఇవాళ సీఎంను కలుస్తారనే ప్రచారం సాగుతోంది. తన శాఖ సమీక్ష కోసం ఆమె సచివాలయానికి చేరుకునే అవకాశం ఉంది.దీంతో ఈ వరుస భేటీలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సాయంత్రం ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆయన స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: కొండా ఫ్యామిలీ వ్యవహారం.. ఏం చేస్తే ఏమవునో? -
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కోసం గాలింపు
హైదరాబాద్: హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ నార్ల సుమంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు మూడు బృందాలు ఏర్పాటు చేయగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. గత నెల 30న జూబ్లీహిల్స్ లోని తన కార్యాలయానికి సుమంత్ సహచరులు రాము డబ్బు వ్యవహారంలో మాట్లాడేందుకు చెంగిచెర్ల కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ని పిలిపించారు. అక్కడే ఉన్న సుమంత్ ఆయన అనుచరులు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాము తదితరులు ఇనుపరాడు తో తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితులు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న సుమంత్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. ఆయన డ్రైవర్ నవీన్ ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ఖర్గేను కలిసిన సురేఖ.. నేడు రేవంత్ ప్రెస్‌మీట్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కొండా కుటుంబ వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ నిన్న బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఉదయం 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్లిన ఆమె రాత్రి 8.45 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.బెంగళూరులో ఖర్గేతో భేటీ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను మంత్రి సురేఖ.. ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అన్ని విషయాలను ఆయనతో మాట్లాడతానని కొండా సురేఖ పేర్కొన్నట్లు సమాచారం. అలాగే, ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం ఏం మాట్లాడారు? ఆ తర్వాత తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, తనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు, తానిచ్చిన సమాధానం, తనకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా పెట్టిన ప్రెస్‌మీట్, తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ వారు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత తాను రెండోసారి క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ, గతంలో వరంగల్ జిల్లాలో జరిగిన గొడవలు, ఆ సందర్భంలో పార్టీ, సీఎం వ్యవహరించిన తీరు గురించి ఖర్గేకు ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే సురేఖ చెప్పిన వివరణ విన్న ఖర్గే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిధంగా ఉన్నాయి కదా అని ప్రశ్నించిన ఖర్గే.. సీఎం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడినట్టు సమాచారం. అన్ని విషయాలు పార్టీ పరిశీలిస్తుందని, సీఎం వచ్చాక మాట్లాడుదామని, మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్‌లతో క్షుణ్ణంగా చర్చించాక ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: కొండా సురేఖ ఎపిసోడ్‌పై పీసీసీ చీఫ్ రియాక్షన్ఇదిలా ఉండగా, లండన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం రాకతో కొండా కుటుంబ వ్యవహారంపై తదుపరి పరిణామాలపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ సీఎంను కలిసి వివరణ ఇచ్చే అవకాశం ఉందని, ఈ వ్యవహారంపై పార్టీ పరంగా కీలక నిర్ణయం వెలువడే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమెరికా పర్యటన రద్దు కావడానికి గల కారణాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కారణంగానే తన పర్యటన రద్దయిందన్న అంశంపై కూడా సీఎం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. -
మల్లికార్జున ఖర్గేను కలిసిన మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరింది. ఆదివా రం మధ్యాహ్నం ఆమె బెంగళూరుకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. దాదాపు 15 నిమిషాలపాటు ఇద్దరి భేటీ జరిగిందని సమాచారం. అయితే బెంగళూరుకు వెళ్లి ఖర్గేను కలిసిన విషయంలో మంత్రి సురేఖ గోప్యత పాటించడం.. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకోనున్న ముందు రోజే ఆమె ఏఐసీసీ అధ్యక్షుడితో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అన్ని విషయాలపై వివరణ ఖర్గేను కలిసిన సందర్భంగా మంత్రి సురేఖ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలపై మాట్లాడినట్టు తెలిసింది. ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం ఏం మాట్లాడారు? ఆ తర్వాత తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, తనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు, తానిచ్చిన సమాధానం, తనకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా పెట్టిన ప్రెస్‌మీట్, తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ వారు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత తాను రెండోసారి క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ, గతంలో వరంగల్ జిల్లాలో జరిగిన గొడవలు, ఆ సందర్భంలో పార్టీ, సీఎం వ్యవహరించిన తీరు గురించి ఖర్గేకు ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే సురేఖ చెప్పిన వివరణ విన్న ఖర్గే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిధంగా ఉన్నాయి కదా అని ప్రశ్నించిన ఖర్గే.. సీఎం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడినట్టు సమాచారం. అన్ని విషయాలు పార్టీ పరిశీలిస్తుందని, సీఎం వచ్చాక మాట్లాడుదామని, మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్‌లతో క్షుణ్ణంగా చర్చించాక ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్టు సమాచారం. బీజేపీ చీఫ్ రాంచందర్‌రావుకు తారసపడిన సురేఖ మంత్రి కొండా సురేఖ బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురూ పలకరించుకున్నారని, ఆ సమయంలోనే బెంగళూరు నుంచి వస్తున్నానని సురేఖ వెల్లడించారని సమాచారం. -
కొండా సురేఖకు ఆలిండియా ఓబీసీ సంఘం మద్దతు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ఆలిండియా ఓబీసీ సంఘం మద్దతు ప్రకటించింది కొండా సురేఖకు అండగా ఉంటామని స్పష్టం చేసింది. కొండా సురేఖ బీసీ మంత్రి కాబట్టే కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని ఓబీసీ సంఘం విమర్శించింది. కొండా సురేఖ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా నోటీసులిచ్చారని మండిపడింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిలు వ్యతిరేకంగా మాట్లాడినా నోటీసులు ఇవ్వలేదని, అదే కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన దానికి మాత్రం నోటీసులిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి కొండా సురేఖకు అన్యాయం జరిగితే మాత్రం రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించింది. కాంగ్రెస్‌లో కొందరు చెంచాలున్నారని, అందుకే ఈ తరహా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని దుయ్యబట్టింది. కొండా సురేఖ రెండో లేఖపై సమీక్షిస్తాంకావాలనే కొందరు తనను టార్గెట్ చేశరని, కుమార్తె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా కావాలనే కొంతమంది నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ మరో లేఖ రాసింది. దీనిపై క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందిస్తూ.. కొండా సురేఖ రెండో లేఖపై సమీక్షిస్తామన్నారు. తెరవెనుక ఎవరున్నారనేది చెప్పాల్సిన అవసరం లేదని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదీ చదవండి: కొండా సురేఖ ఎపిసోడ్‌పై టీపీసీసీ చీఫ్ రియాక్షన్కొండా సురేఖ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. చర్యలకు కాంగ్రెస్ సిద్ధం -
కొండా సురేఖ ఎపిసోడ్‌పై టీపీసీసీ చీఫ్ రియాక్షన్
సాక్షి, నిజామాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ.. కానీ హద్దులు ఉల్లంఘిస్తే ఎంత పెద్దవారినైనా ఉపేక్షించం’’ అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన కొండా సురేఖ ఎపిసోడ్‌పై స్పందిస్తూ.. ప్రతి పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీలో మరింత ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందన్నారు. అయితే, క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడితే సహించబోమన్నారు.నేతలకు ఇబ్బందులు ఉంటే పార్టీ వేదికలపై మాట్లాడాలని.. అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడటం సమంజసం కాదని మహేష్ గౌడ్ హితవు పలికారు. కాగా, నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తపనతో ముందుకు వెళ్తున్నామన్న మహేష్ గౌడ్.. జిల్లా అభివృద్ధి గతంలో కాంగ్రెస్ హయంలో జరిగిందన్నారు.వైఎస్సార్ హయంలో తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. కొత్తగా అధికారంలోకి వచ్చాక ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల తీసుకొచ్చాం. రాష్ట్రంలో అత్యధికం ఇందిరమ్మ ఇళ్లు జిల్లాలో ఇచ్చాం. హైదరాబాద్ మాదిరి నిజామాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ టవర్స్ చేపట్టినట్లు మహేష్ గౌడ్ అన్నారు. -
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్‌లోని సుమంత్ ఇంటి ముందు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి.. ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడని సుమంత్‌పై ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.మేడ్చల్ మల్కాజగిరి జిల్లా మేడిపల్లిలో సుమంత్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. రాడ్లుతో దాడి చేసినట్లు వ్యాపారి గొంగడి హరికృష్ణ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. సుమంత్‌పై 109 సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది.అయితే మేడిపల్లిలో పీఎస్‌లో జీరో ఎఫ్ఐఆర్(నేరం ఎక్కడ జరిగినా, ఏ ప్రాంతానికి చెందినదైనా సరే... బాధితులు తమకు దగ్గరలోని ఏ పోలీసు స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవడం) నమోదు చేయడంతో ఇప్పుడు ఆ కేసు జూబ్లీహిల్స్‌కు బదిలీ అయ్యింది. సుమంత్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. -
నేడు రేవంత్ రాక.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌పై బిగ్ సస్పెన్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. సీరియల్ ఎపిసోడ్‌లా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. సొంత పార్టీ నేతలే తనపై విమర్శలు చేస్తున్నా పార్టీ అధిష్ఠానం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మంత్రి కొండా సురేఖ మరోసారి లేఖాస్త్రం సంధించడం చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ, కొండా మురళి వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. పార్టీ క్రమశిక్షణ కమిటీ మరోసారి ఈ అంశాన్ని చర్చించనుంది. తదుపరి సమావేశంలో కొండా వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.మరోసారి లేఖాస్త్రం..తనపై సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేస్తున్న తనపై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా అధిష్ఠానం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తనపై వస్తున్న విమర్శల విషయంలో పార్టీ నాయకత్వం స్పందించాలని ఆమె కోరినట్లు సమాచారం.ఇది కూడా చదవండి: కొండా సురేఖపై చర్యలు.. కాంగ్రెస్‌లో తర్జనభర్జనకొండాపై గరం..మరోవైపు కొండా కుటుంబం తీరుపై కాంగ్రెస్‌లోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలు కొండా కుటుంబం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు మరో అడుగు ముందుకేసి పార్టీ నుంచి బయటకు వెళ్లాలని అల్టిమేటం ఇస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ వివాదం వ్యక్తిగత విమర్శల స్థాయి దాటి పార్టీ అంతర్గత క్రమశిక్షణ అంశంగా మారింది.సీఎం రాగానే కీలక పరిణామాలు?ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉండగా.. నేడు రాత్రి ఆయన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. సీఎం రాకతో కొండా వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వం ఇప్పటికే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో.. సీఎం సమక్షంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత.. మరోవైపు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూపులు.. ఇంకోవైపు మంత్రి కొండా సురేఖ వరుస లేఖలు.. ఇలా కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతోంది. క్షమాపణ చెబుతారా? పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక మరేదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది. సీఎం హైదరాబాద్‌కు తిరిగొచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. -
కొండా సురేఖ బేషరతుగా రాజీనామా చేయాలి
సాక్షి, ఆదిలాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అటవీశాఖ మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యలకు మంత్రే బాధ్యత వహించాలని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో శనివారం పర్యటించిన ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బేషరతుగా మంత్రి కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కృషిని మరవద్దన్నారు. అంతకు ముందు ఉట్నూర్‌లోని బాలికల ఆశ్రమ పాఠశాలను లక్ష్మణ్ సందర్శించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు, జుంబా, ఏరోబిక్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మంత్రి చేతుల మీదుగా విద్యార్థినులకు యూనిఫాం, కిట్లను అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు భోజనం చేశారు. కేబీ కాంప్లెక్స్‌లో మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సంతోష్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేవిప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, రాంచంద్రునాయక్ సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వ విప్‌లు సీహెచ్ విజయరమణారావు, ఆది శ్రీనివాస్, రాంచంద్రునాయక్ డిమాండ్ చేశారు. రాష్రా ్టన్ని గాడిలో పెట్టేందుకు రోజుకు 18 గంటలు శ్రమిస్తోన్న సీఎం రేవంత్‌రెడ్డికి తాము అండగా ఉంటామన్నారు. శని వారం సీఎల్పీ మీడియా హాల్లో ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్, నవీన్ యాదవ్ తో కలిసి విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడుతూ కొండా సుస్మిత అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యు రాలే కాదని, ఆమె చేసిన వ్యాఖ్యలకు తల్లిగా సురేఖ బాధ్యత తీసుకోవాల్సిందని అభిప్రా యప డ్డారు. సురేఖ క్షమాపణలు చెప్పాల్సిందని, అలా చెప్పకపోవడం, కనీసం ఖండించక పోవడం దారుణమన్నారు. విజయ రమణా రావు మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి కొందరు ఇష్టారాజ్యాంగా మాట్లాడు తున్నా రని, పదవులు అనుభవిస్తూనే ప్రభు త్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిప డ్డారు. కుటుంబ సభ్యురాలు అసభ్యంగా మా ట్లాడితే ఖండించకపోగా పరోక్షంగా మద్ద తిచ్చేలా సురేఖ తీరు ఉందని రాంచంద్రు నాయక్ ఆరోపించారు. ఆమె నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే బాగుంటుందన్నారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎంపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్‌ఠాకూర్, నవీన్ యాదవ్ డిమాండ్ చేశారు. -
ఏం చేస్తే.. ఏమవునో!
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా అటవీ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ కుటుంబమే కేంద్రంగా అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయం చక్కర్లు కొడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సృష్టించిన వ్యాఖ్యల కలకలం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఉత్కంఠ ఆ పార్టీ వర్గాల్లో ఉంది. సురేఖను బర్తరఫ్ చేస్తారని, మంత్రి పదవి నుంచి తీసేస్తారని, ఇందుకు అధిష్టానంతో రేవంత్ సంప్రదింపులు జరుపుతున్నారని, లేదంటే ఆమెతో రాజీనామా చేయిస్తారని సీఎం వర్గం ప్రచారం చేస్తున్నా... అసలు ఏం చేయాలనే విషయంలో మాత్రం అటు అధిష్టానం, ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వం తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. బీసీ వర్గాలకు చెందిన మహిళా మంత్రి కావడం, ఇదే సమయంలో మరికొందరు ముఖ్య నేతలు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందోననే చర్చ జరుగుతోంది. రేవంత్ విదేశీ పర్యటనలో ఉండగా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వచ్చే నెల 2 వరకు అందుబాటులో ఉండరన్న ఢిల్లీ వర్గాల సమాచారం నేపథ్యంలో ఈ ఎపిసోడ్ మరికొన్ని రోజులు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం వర్గం అప్రమత్తం సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితులైన ఎమ్మెల్యేలు, నేతలు కొండా ఎపిసోడ్లో తమ వంతు పావులు కదుపుతున్నారు. రేవంత్ సన్నిహితుడైన ఎంపీ వేం నరేందర్‌రెడ్డి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ కుటుంబ ఎపిసోడ్‌ను ఎలా ముగించాలన్న దానిపైనే ఎక్కువగా చర్చ జరిగినట్టు తెలిసింది. ఆమెను తప్పించేలా అధిష్టానాన్ని ఒప్పించాలా లేదంటే ఆమెతో రాజీనామా చేయించాలా లేదా మరో మార్గంలో అంతర్గతంగా ఏదైనా సర్దుబాటు చేయాలా అనే కోణంలోనే ఈ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే, రేవంత్ ఆదివారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్‌కు రానుండటంతో ఆయన వచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్లో ఎలాంటి సంకేతాలిస్తారన్నది కీలకంగా మారనుంది. ఆయన్ను కలిసి మాట్లాడతానని సురేఖ చెప్పిన నేపథ్యంలో ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చి కలుస్తారా లేదంటే అధిష్టానం పెద్దలతో మాట్లాడతారా? తనకు బహిరంగంగా మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యేలకు ఆయన ఏం చెప్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేవంత్‌కు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. సురేఖతో పాటు రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుపడుతున్నారు. కానీ, రేవంత్ కేబినెట్ సహచరులెవరూ ఇప్పటివరకు బహిరంగంగా ఈ అంశంపై మాట్లాడకపోవడం రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అన్నీ పరిశీలించాకే తుది నిర్ణయం: క్రమశిక్షణ కమిటీ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ శనివారం గాం«దీభవన్‌లో సమావేశమైంది. చైర్మన్ మల్లురవి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కమిటీ సభ్యులు శ్యాంమోహన్ తదితరులు పాల్గొని కమిటీ ముందు పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై చర్చించారు. రేవంత్‌నుద్దేశించి సుస్మితా పటేల్ మాట్లాడిన వీడియోను పరిశీలించారు. వనపర్తి నియోజకవర్గం విషయంలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి మాట్లాడిన వీడియోలను కూడా పరి«శీలించారు. అనంతరం మల్లురవి మీడియాతో మాట్లాడుతూ.. తమ నోటీసుకు సురేఖ ఇచ్చిన సమాధానాన్ని, సుస్మిత మాట్లాడిన వీడియోను కమిటీ పరిశీలించిందని చెప్పారు. ‘ముఖ్యమంత్రిని ఒక మామూలు వ్యక్తి కంటే తక్కువగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఈ వీడియోలో కనపడుతోంది. సురేఖ ఇచ్చిన వివరణ చదివిన తర్వాత మరోమారు సమావేశమై పరిశీలించాం. ఎమ్మెల్యేలు కూడా క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు ఇస్తామని చెప్పారు. కాబట్టి తుది నిర్ణయం తీసుకోకుండా, అందరి ఫిర్యాదులు స్వీకరించి వాటిపై కమిటీలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సీఎం గురించి ఎవరు మాట్లాడినా ఖండించాల్సిన బాధ్యత సురేఖపై ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఆమె మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుంది’అని వెల్లడించారు. వనపర్తి విషయంలో కూడా ఇద్దరు నేతలు మాట్లాడిన మాటలను కూడా పరిశీలించామన్నారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణకు, ఎమ్మెల్యే ఫిర్యాదుకు తేడా ఉందని, మరోమారు ఎమ్మెల్యేను పిలిచి వివరణ తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్‌లో జరిగిన పీఏసీ సమావేశం ఘటన గురించి కంది శ్రీనివాస్‌రెడ్డి వివరణ ఇచ్చారని, డీసీసీ అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎల్బీనగర్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సస్పెన్షన్ గురించి తప్పనిసరి పరిస్థితుల్లోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో వచ్చిన ఫిర్యాదులపై షోకాజ్ ఇవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మాకు ఎవరిపై ప్రేమ ఉండదు... తమకు పార్టీ నేతలెవరిపై వ్యక్తిగతంగా ప్రేమ, వ్యతిరేకత ఉండవని మల్లురవి స్పష్టం చేశారు. ‘మేం తీసుకునే ప్రతి చర్య కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు దిశలోనే ఉంటుంది. పార్టీకి నష్టం జరిగితే ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ , కేబినెట్ హోదాలో ఉన్న చిన్నారెడ్డిలకు నోటీసులిచ్చాం. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రస్తావన ఎమ్మెల్యేల మాటల్లో వచ్చింది కానీ ఫిర్యాదు మా దగ్గరకు రాలేదు. రాజగోపాల్‌రెడ్డి మాట్లాడింది నాకు తెలియంది కాదు కానీ పద్ధతి ప్రకారం నాకు ఫిర్యాదు రాలేదు. సుమోటోగా తీసుకోవాలా వద్దా అన్నది పరిశీలిస్తున్నాం. ఎవరైనా సరే క్రమశిక్షణ కమిటీ దృష్టిలో వ్యక్తులు ముఖ్యం కాదు. పార్టీనే ముఖ్యం. ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా పార్టీ వల్లనే. పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా ఎవరూ మాట్లాడకూడదు’అని ఆయన స్పష్టం చేశారు. మరో లేఖ రాసిన సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ శనివారం మరో లేఖ రాశారు. ‘క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుకు నేను వివరణ ఇచ్చాను. అయినా కొందరు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు నన్ను, నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా అవమానించేలా మాట్లాడుతున్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే నాపై బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, నాపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలి. ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపై తీవ్ర మాటలతో సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది’అని లేఖలో పేర్కొన్నారు. పార్టీ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సురేఖ కోరడం కొసమెరుపు. చిన్నారెడ్డి వివరణ వనపర్తి ఎమ్మెల్యే కారణంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న అంశాలను మాత్రమే తాను గోపాల్పేట సమావేశంలో ప్రస్తావించానే తప్ప ఎవరినీ కించపర్చలేదని రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీకి నివేదించారు. కాంగ్రెస్ పార్టీ దేవాలయమని, నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గేలు తనకు దేవుళ్ల లాంటి వారని, తాను పార్టీని, పార్టీ నాయకులను ఎక్కడా విమర్శించలేదని పేర్కొన్నారు, ఎమ్మెల్యే ఒంటెత్తుపోకడలతో 40 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలు పడుతున్న బాధలనే ప్రస్తావించానని అన్నారు, తనకు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలని కోరారు. -
కొండా సురేఖ ఎపిసోడ్.. మల్లు రవి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సుస్మిత వ్యాఖ్యలను పరిశీలించాం. సీఎం రేవంత్‌పై సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోసారి క్రమశిక్షణ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై కూడా చర్చించాం. చిన్నారెడ్డి అంశంపై కూడా మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.‘‘మూడు గంటల పాటు ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి వ్యవహారం పై చర్చించాం. సుస్మిత మాట్లాడిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాం. కొండా సురేఖ వివరణ అందింది. కొందరు ఎమ్మెల్యేలు ఈ అంశంపై క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. వీలైనంత త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖ అంశంపై నిర్ణయం తీసుకుంటాం...చిన్నారెడ్డి వివరణ కూడా అందింది. చిన్నారెడ్డి మాట్లాడిన వీడియోను పరిశీలించాం. ఎమ్మెల్యే మేఘారెడ్డి అభిప్రాయం తీసుకున్న తర్వాత చిన్నారెడ్డి కేసులో నిర్ణయం తీసుకుంటాం. కంది శ్రీనివాస్ రెడ్డిని విచారించాం. తన వాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు’’ అని మల్లు రవి తెలిపారు. -
చిట్టక్క పంచాయితీ.. కొండా మురళి రియాక్షన్‌పై ఉత్కంఠ
సాక్షి, వరంగల్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా కుటుంబం చుట్టూ నెలకొన్న వివాదం మరింత వేడెక్కుతోంది. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు ఇప్పుడు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో అసంతృప్తిని ఒక్కసారిగా బయటపెట్టేశాయి. ఈ క్రమంలో కొండా దంపతుల స్పందనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ అలియాస్ చిట్టక్క చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపాయి. పరకాలకు కాబోయే ఎమ్మెల్యే తానేనంటూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, ఆపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పార్టీ నేతలపై ఆమె చేసిన విమర్శలపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూతురి వ్యాఖ్యలను ఖండించకుండా.. ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటూ కొండా సురేఖ ఇచ్చిన నామమాత్రపు వివరణపైనా భగ్గుమన్నారు. ప్రతిపక్షాలకు సహకరించేలా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. కొండా ఫ్యామిలీ తక్షణమే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని.. లేని పక్షంలో అధిష్టానమే క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద గెంటేయాలని డిమాండ్ చేశారు.చర్యలపై ఉత్కంఠఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. వివాదం ముదిరుతున్నా.. ఇప్పటివరకు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి బహిరంగంగా స్పందించకపోవడం కూడా చర్చకు దారితీసింది. మంత్రులు సైతం ఈ వ్యవహారంపై పెద్దగా స్పందించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అమెరికా పర్యటన రద్దుతో సీఎం రేవంత్ రేపు తిరిగి హైదరాబాద్ రానున్నారు. వచ్చిరాగానే అత్యవసరంగా ఆయన ఈ అంశంపై చర్చలు జరుపుతారని సమాచారం. ఈ క్రమంలో హైకమాండ్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతుందా? లేదంటే చర్యలకు దిగుతుందా? అనే అంశం ఉత్కంఠగా మారింది.టికెట్ దక్కలేదనే అలా..ఇదిలా ఉండగా.. తన వ్యాఖ్యలపై సుస్మిత కాస్త టోన్ మార్చింది. తన తండ్రికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం వల్లే తాను ముఖ్యమంత్రిపై విమర్శలు చేశానని పేర్కొంది. వ్యక్తిగత అసంతృప్తితోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆమె వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.నేడు కొండా మురళి స్పందించే అవకాశంఈ వివాదంపై కొండా కుటుంబం వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు మౌనం పాటించిన కొండా సురేఖ భర్త కొండా మురళీధర్‌రావు నేడు(శనివారం) మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయన స్పందనతో ఈ వివాదంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.మొత్తంగా.. వరంగల్ కాంగ్రెస్‌లో మొదలైన ఈ అంతర్గత కలకలం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అధిష్ఠానం నిర్ణయం, కొండా కుటుంబ స్పందనపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.ఇదీ చదవండి: నా టార్గెట్ ఆయనే.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్య -
మంత్రి పదవి నుంచి కొండా సురేఖ అవుట్..?
-
20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే
-
కొండా సురేఖ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. చర్యలకు కాంగ్రెస్ సిద్ధం
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సురేఖపై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. మరోసారి నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోంది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా నేతలు నిన్న తీర్మానం చేశారు. కొండా సురేఖను భర్తరఫ్ చేయాలని శుక్రవారం సీఎం, పీసీసీ, హైకమాండ్‌కు 20 మంది ఎమ్మెల్యే లు లేఖ రాశారు. మరోసారి నోటీసులు ఇచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ సిద్ధమైంది.ఇప్పటికే కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఓ సారి నోటీసులు జారీ చేసింది. ఆమె కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పింది. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి.తాను త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని కొండా సురేఖ అంటున్నారు. పార్టీపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, రేవంత్ రెడ్డిపైనే తాను టార్గెట్ చేశానని కొండా సుస్మిత తెలిపారు. టికెట్ ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరని సుస్మిత ప్రశ్నించారు.ఇదీ చదవండి: మాట్లాడతా అన్ని విషయాలూ చెబుతా: కొండా సురేఖ -
‘సురేఖ.. సుస్మిత వ్యాఖ్యలను ఖండించాలి కదా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయం మరోసారి వేడెక్కింది. సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శలపై ప్రభుత్వ విప్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త వివాదానికి దారితీశాయని వారు మండిపడ్డారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించాలని, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని డిమాండ్ చేశారు.సీఎల్పీలో ప్రభుత్వ విప్‌లు బల్మూరి వెంకట్, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కొండా సుస్మిత వ్యాఖ్యలపై నేతలు ఘాటుగా స్పందించారు. ‘సీఎంను టార్గెట్ చేయడం క్రమశిక్షణా రాహిత్యమే’ అని వ్యాఖ్యానించారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించాలని, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని డిమాండ్ చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటున్నప్పుడు.. కొండా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరుతున్నామని వారు తెలిపారు. సీఎం నిర్ణయాలను వ్యతిరేకించే వ్యక్తులు పార్టీలో అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు.. ఇలాంటి వారిని కేబినెట్లో ఉంచొద్దని సీఎంను కోరుతున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గత విషయాలను పార్టీలోనే మాట్లాడుకోవచ్చని, కానీ కొండా సురేఖ కుటుంబం పదేపదే బహిరంగ విమర్శలు చేయడం సరికాదన్నారు. సీనియర్ ఎమ్మెల్యేపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చివరగా మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు.. ఇదే సమయంలో తెలంగాణలో 22A భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని బల్మూరి వెంకట్ ఆరోపించారు. అధికారుల తప్పిదాలను సరిదిద్దుతున్నామని, పేదలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందకూడదనే ఉద్దేశంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. అలాగే, సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దు వెనుక కూడా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ఉందని వెంకట్ ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. అయితే స్వపక్షంలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. -
తల్లి, కూతురి మధ్య బంధం తెగిందా..?
-
కాంగ్రెస్‌లో భూకంపం.. తన వ్యాఖ్యలపై సుస్మితా పటేల్ వివరణ
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ చెప్పారు. తన వ్యాఖ్యలతో కొండా సురేఖకు ఎటువంటి సంబంధమూ లేదని తెలిపారు. రాజకీయంగా ఒకే కుటుంబంలో కూడా అభిప్రాయభేదాలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ హై కమాండ్‌పై తనకు నమ్మకం ఉందని తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే గౌరవమని చెప్పారు.కాగా, రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అంతకుముందు, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో పార్టీలో ఒక్కసారిగా మంటలు రేగాయి. మళ్లీ పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఆశీర్వదించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.దీంతో కొండా సుస్మితా పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డితో రేవంత్‌రెడ్డి రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా తాను పరకాల నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. -
‘‘షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సింది మంత్రి కొండా సురేఖకు కాదు’’
జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులను మంత్రి కొండా సురేఖకు కాకుండా సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ విచ్ఛన్నం కావడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి అని చెప్పారు.‘‘సుష్మితను ప్రేరేపించిందెవరు? సుష్మిత కామెంట్స్ కు ఎవరు బాధ్యులు? కావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని చెప్పండి. సమయం, సందర్భం లేకుండా.. ప్రకాశ్ రెడ్డికి ఓటు వేయాలని రేవంత్ ఎలా చెబుతారు? రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటి నుంచే అభ్యర్థులను అనౌన్స్ చేసుకోవాలని ఏమన్నా రాసిచ్చారా? రాహూల్ ఆలోచనలకు భిన్నంగా పార్టీ ఫిరాయింపులను తెరపైకి తీసుకురావడం వల్లే కదా ఇవాళ పార్టీ విచ్ఛిన్నం కావడానికి కారణం. కాంగ్రెస్ డిసిప్లైనరీ కమిటీ ఏఐసీసీ కనుసన్నల్లో నడవడం లేదు.. రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో నడుస్తోంది. నిన్న ఆదిలాబాద్ బీఏసీ సమావేశంలో ఆ అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. చిన్నారెడ్డిని, సుష్మితను ప్రేరేపించింది రేవంత్ రెడ్డే.. పార్టీ ఫిరాయింపులతో విచ్ఛిన్నానికి కారకుడూ రేవంత్ రెడ్డే. ఇంకా రెండేళ్లు కాంగ్రెస్ ను బతికించుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పునరాలోచన చేయాలి. చంద్రబాబు మేనిఫెస్టోను అమలు చేసేందుకు, కాంగ్రెస్ ను కనుమరుగు చేసేందుకే రేవంత్ రెడ్డి పార్టీలోకి ఎంటరయ్యారు. 2034 దాకా తానే ముఖ్యమంత్రినని రేవంత్ ఎలా చెబుతాడు.. కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకొస్తుందని చెప్పాలి’’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
నా కూతురు మాటలకు నాకు సంబంధం లేదు సంచలనం రేపుతున్న కొండా సురేఖ లేఖ
-
‘నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ తన కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం, తన నుండి వివరణ కోరడం ఎంతమాత్రం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ మేరకు మంత్రి కొండా సురేఖ అధికారిక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో మంత్రి స్పందిస్తూ.. ‘సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక స్వతంత్ర వ్యక్తిగా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకానీ ఆ వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా నియమావళిపై నాకు పూర్తి గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ నాకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి’అని కొండా సురేఖ కోరారు.కుటుంబ సభ్యుల వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలకు పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను ముడిపెట్టడం సరికాదని, ఈ విషయంలో తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్‌ను ఉద్దేశిస్తూ కొండా సుష్మిత ఏమన్నారంటే? 'సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ సంస్కృతి అబ్బలేదు. టీడీపీ నుంచి వచ్చిన వారిపై ప్రేమ కురిపిస్తున్నారు. రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తోంది. అచ్చ కాంగ్రెస్‌కు స్థానం లేకుండా చేస్తున్నారు'అని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరూ ఆనందంగా లేరన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్స్‌లో కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడారు.‘ఎప్పుడూ ఏం మాట్లాడతారో సీఎంకు తెలియదు. సంగారెడ్డికి వెళ్లినపుడు జగ్గారెడ్డి విషయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పిన సీఎం.. పరకాలలో రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఎలా కోరతారు’అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే సీఎం కాదన్నారు. తాము కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియా, రాహల్, ప్రియాంకలను గౌరవిస్తామన్నారు.పరకాలనుంచి తాను ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని చెప్పారు. ‘బీసీ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వారు వచ్చి చెబుతున్నారు. మంత్రులు సంతకాలు పెట్టిన పనులూ జరగటం లేదు. టీపీసీసీ అధ్యక్ష పదవికి నా తల్లిదండ్రులే రేవంత్ రెడ్డిని ప్రతిపాదించారు. అధ్యక్షుడైన తర్వాత మా ఇంటికి వచ్చి నా తండ్రి మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మరచిపోయారు’అని పేర్కొన్నారు.కోటమైసమ్మ, ఎల్లమ్మ గుడి వద్దకు వచ్చి ఆ మాట అనలేదని ప్రమాణం చేస్తారా అని సీఎంకు సవాల్ విసిరారు. తన తండ్రి తిరిగి ప్రచారం చేస్తే రేవూరి గెలిచాడని, అలాంటి నాయకుడు నీకు గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు. సీఎంకు కళ్లు నెత్తికె క్కాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రజల కోసం పనిచేసే దాన్నని,చావుకు కూడా భయపడనన్నారు.నాకు టికెట్ ఇవ్వడానికి రేవంత్ ఎవరు'సీఎంతోపాటు ఒక 'పొంగు ఉంది. ఆ పొంగు ఎక్కువ సేపు ఉండదు. వీరిలో ఎవరూ సీఎం అనేది తెలియడం లేదు. హైదరాబాద్ ఇన్చార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటో పెట్టకుండా అక్కడి ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం, పొంగు ఫొటోలు పెట్టుకున్నారు. బీసీలంటే అంత చులకనా. రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావడానికి ప్రయత్నించిన దయాసాగర్, షబ్బీర్ అలీ ఆయన సీఎం అయిన తర్వాత కలవడానికి వెళితే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు'అని సుస్మితా ఆగ్రహం వ్యక్తంచేశారు.మూడేళ్లలో వేం నరేందర్‌రెడ్డి ఇచ్చిన సలహాలు ఏమిటో, వాటిని పాటించి సీఎం చేసిన పనులేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. సీఎం తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే రూ.200 కోట్ల విలువైన భూమిని అతడికి ధారాదత్తం చేశారని మండిపడ్డారు. అన్నా, తమ్ముడు రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము కాపోళ్లమని తమకు వ్యవసాయం చేయడం తప్ప ఊడిగం చేయడం రాదని, తాము పద్మశాలీలమని తమకు నేత చేయడం తప్పితే మోసం చేయడం రాదని అన్నారు. -
'కూతురి వైఖరితో చిక్కుల్లో కొండా సురేఖ'
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మితా పటేల్‌ను అదుపులో పెట్టుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు సూచించారు. బిడ్డను అదుపు చేయకుంటే మంత్రి పదవికి ముప్పు తప్పదని హెచ్చరించారు. గాంధీభవన్‌లో గురువారం కల్వ సుజాత, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజా రేణుక, ఇందిరా శోభన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండా సురేఖ పేరును సుస్మిత దిగజారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సుస్మితకు హితవు పలికారు.కొండా సురేఖను చూస్తే జాలేస్తోందికూతురు వ్యాఖ్యలతో మంత్రి సురేఖ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ మహిళా నేత కల్వ సుజాత అన్నారు. కొండా సురేఖను చూస్తే జాలేస్తోంది. బిడ్డ చేసిన పనికి ఆమె ఇబ్బంది పడుతోంది. సుస్మితకి కాంగ్రెస్ సభ్యత్వం కూడా లేదు. ఆమె ఇండియాలో 15 రోజులు ఉంటే 15 రోజులు అమెరికాలో ఉంటుంది. సుస్మితకి ఆసక్తి ఉంటే పరకాలలో ఇండిపెండెంట్‌గా పోటీ చేయొచ్చు. టికెట్ల కేటాయింపుతో సుస్మితకి ఏం సంబంధం? రేవంత్ తన మేనమామ అని సుస్మిత చెబుతోంది.. మేనమామని ఇష్టమున్నట్టు తిడతారా? అని కల్వ సుజాత నిలదీశారు.సురేఖ తన కూతురిని అదుపులో పెట్టుకోవాలిసుస్మితపై చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కోరుతున్నామని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజా రేణుక తెలిపారు. కొండా సురేఖ తన కూతురిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. సుస్మిత పటేల్ ఇంకా తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థ ఉందని అనుకుంటుంది. సుస్మిత కాంగ్రెస్‌లో కవిత అవుదాం అనుకుంటుందా? ఇంకోసారి రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. సుస్మిత ముందు వార్డు మెంబర్‌గా గెలవాలి. ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి ఆమెకు లేదు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే ఇక్కడ నడవదని రేణుక అన్నారు. చదవండి: సుస్మిత వల్ల సురేఖ తలదించుకోవాల్సి వస్తోందిhttps://t.co/G1ixgCmU99— Telangana Congress (@INCTelangana) August 20, 2026 -
బరాబర్ పరకాల బరిలో ఉంటా
సాక్షి, వరంగల్: పరకాల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు ఇప్పుడే రాజుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ పార్టీలో మొదలైంది. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల పరకాల పర్యటనలో పిలుపునివ్వడం ఒకవైపు.. కొండా సుస్మితాపటేల్ చేసిన ఘాటు వ్యాఖ్యలు మరోవైపు రాజకీయ వేడిని పెంచాయి. ఇదే సమయంలో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి సైతం తాను లేదా తన సతీమణి పరకాల నుంచి బరిలో ఉంటామని చెప్పడంతో కాంగ్రెస్‌లో మూడు వర్గాల మధ్య పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఎన్నికలకు ముందే మొదలైన ఈ టికెట్ పోరు.. రానున్న రోజుల్లో ఇంకా ముదిరే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.గీసు‘కొండా’ కేంద్రంగానే..2024 మే 8: గీసుకొండ కాంగ్రెస్ నాయకుడి వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మధ్య ఫోన్ సంభాషణ ఆడియో లీక్‌తో కలకలం.2024 అక్టోబర్ 13: ధర్మారంలో దసరా ఫ్లెక్సీ వివాదం.. కొండా, రేవూరి వర్గాల మధ్య ఉద్రిక్తత, పోలీస్‌స్టేషన్‌లో హైటెన్షన్.2025 డిసెంబర్: గీసుకొండ మండలంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 16 స్థానాల్లో కొండా వర్గానికి 7, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గానికి 9 స్థానాలు వచ్చాయి. 2026 మార్చి 3: కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో సుస్మితా పటేల్ పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననే సంకేతాలు.2026 మార్చి 3: కొండా మురళి సైతం కుమార్తెకు మద్దతుగా కొండా కుటుంబాన్ని భవిష్యత్‌లోనూ గీసుకొండ ప్రజలు ఆశీర్వదించాలని పిలుపు.2026 ఆగస్టు 19: గీసుకొండలో సుస్మితా పటేల్ సీఎం రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు.. రేవూరి ప్రకాశ్‌రెడ్డితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా పరకాల నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటన. -
కాంగ్రెస్‌లో అంతే..!
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రోజుకో తీరుగా బహి ర్గతమవుతున్నాయి. మంత్రుల మధ్య సమన్వయ లేమి, తమ శాఖలో జరిగే అంశాలు తమకు తెలియకుండానే జరిగి పోతున్నాయనే అసంతృప్తి, ఒకరి శాఖపై మరో మంత్రి వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలు వర్సెస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ ఇన్‌చార్జీలతో సమన్వయ లేమి, పార్టీ కేడర్‌తో ఎమ్మెల్యేల గిల్లి కజ్జాలు, పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ గొడవలు నిరంతరాయంగా వెలుగులోకి వస్తున్నాయి. వీటికి తోడు ఏకంగా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, అధిష్టానాన్ని వేలెత్తి చూపుతున్న ఘటనలు, నేరుగా వారికే సవాల్ విసిరే ప్రసంగాలు కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తుంగతుర్తి, పాలకుర్తి, గజ్వేల్, మునుగోడు, జడ్చర్ల, వనపర్తి, ఎల్బీనగర్... ఇలా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. వీటిని పరిష్కరించడం, పార్టీ నేతలను సమన్వయం చేయడంలో రాష్ట్ర పార్టీ పక్షాన ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అన్ని చోట్లా ఇదే పరిస్థితి పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అసమ్మతి స్వరాలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పుకునే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఏదో నియోజకవర్గంలో తలనొప్పులు బహిరంగంగానే బయటపడుతున్నాయి. ఇప్పటికే పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ పేరుతో సతమతమవుతున్న కాంగ్రెస్‌లో తాజా గొడవలు మరింత చిచ్చు రేపుతున్నాయి. వనపర్తి అసెంబ్లీ పరిధిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. ఈ విషయంలో ఏకంగా చిన్నారెడ్డికి క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. మరోవైపు తుంగతుర్తిలో ఎమ్మెల్యే వర్సెస్ స్థానిక నాయకత్వం పంచాయతీ ఇంకా సమసిపోలేదు. ఇప్పటికే పాలకుర్తి, గజ్వేల్ నియోజకవర్గాల్లోని అంతర్గత గొడవలతో ఫిర్యాదుల మీద ఫిర్యాదులు గాం«దీభవన్‌కు చేరాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోని నేతలతో పార్టీ క్రమశిక్షణా కమిటీ పలుమార్లు భేటీ అయి విచారణ జరిపింది. అయినా ఇక్కడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. ఆదిలాబాద్‌లో బాహాబాహి ఎల్బీనగర్ నియోజకవర్గంలో అయితే ఈశ్వరమ్మ యాదవ్, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి వర్గాలు ఏకంగా ఇళ్ల ముందు ఆందోళనల వరకు వెళ్లాయి. వీటితోపాటు ఇటీవల ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగిన జిల్లా పీఏసీ సమావేశంలో ఆదిలాబాద్ స్థానిక నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో ఇరువర్గాలకు పీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. మరోవైపు అసలు తమకు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ప్రాధాన్యతే లేదని ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు వాపోతున్నారు. బీజేపీ నేతలు చెప్పిన మాట వింటున్నారే తప్ప తమను పట్టించుకోవడం లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు బహిరంగ వేదికపైనా వ్యాఖ్యానించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటికితోడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వచ్చిన చోట్ల ఈ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు బయటపడుతున్నాయి. ఇటీవల పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుధవారం బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల మధ్య విభేదాలు ఇలా ఉంటే పార్టీ అధిష్టానం నియమించిన డీసీసీ అధ్యక్షుల్లో కొంత మందికి స్థానిక పార్టీ నాయకత్వం అసలు సహకరించడమే లేదు. ఇటీవల కాలంలో ముగ్గురు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన డీసీసీ అధ్యక్షులను మార్చాలనే నిర్ణయం తీసుకున్నారనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు తాజాగా తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ ధిక్కారం ఇటీవలి కాలంలో షరా మామూలే అయిపోయిందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సీఎంకు నేరుగా అసమ్మతి సెగ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి సహజమే అయినా ఇటీవలి కాలంలో సీఎం రేవంత్‌రెడ్డికి కూడా ఈ సెగ నేరుగానే తగులుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన వైఖరిని ఖండిస్తూ, పాలనను వేలెత్తి చూపుతూ, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతూ కొందరు పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండగా, మరికొందరు పార్టీలోనే అంతర్గతంగా చక్రం తిప్పుతూ రేవంత్‌కు చెక్ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎం రేవంత్ టార్గెట్‌గానే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నవారు వేలకోట్లు సంపాదించుకుంటూ ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5లక్షలు ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు పెడుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్నది బహిరంగ రహస్యమేనని పార్టీ వర్గాలంటున్నాయి. ఇక, తనకు తెలియకుండానే రైస్‌మిల్లులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం గురించి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంతర్గతంగా పావులు కదిపారని, అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో జరిగిన పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగిందనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యలు కూడా ఈ కోవలోనే చర్చనీయాంశమవుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిన ప్రభుత్వమని, కీలక నిర్ణయాల్లో పార్టీ జోక్యం ఉంటుందని స్పష్టం చేయడం ద్వారా రేవంత్‌కు చెక్ పెట్టే జాబితాలోకి ఆయన కూడా చేరారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కూడా అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే తాజాగా వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ కుమార్తె నేరుగా సీఎం పేరును ఉటంకిస్తూ ఆయనకే నేరుగా సవాల్ విసిరిన నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పార్టీలో ఎవరికీ సరైన పట్టు లేదన్న చర్చ సాగుతోంది. మంత్రికి నోటీసులు సుస్మితా పటేల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె తల్లి, దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండాసురేఖకు పీసీసీ క్రమశిక్షణకమిటీ నోటీసులు జారీ చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదేవిధంగా మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా క్రమశిక్షణ నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల వనపర్తిలో చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అనుచిత ప్రసంగాల గురించి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో పార్టీ ఆదేశించింది. ఎల్బీనగర్ నియోజకర్గంలో బీసీ మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్‌నుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించడం గమనార్హం. -
మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.చిన్నారెడ్డికి కూడా...కాగా, మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. వనపర్తి సభలో పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై చిన్నారెడ్డిని కమిటీ వివరణ కోరింది. స్థానిక ఎమ్మెల్యేపై అనుచిత ప్రసంగం చేసిన అంశంపైనా మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని టీపీసీసీ కోరింది.జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటుజక్కిడి ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ కమిటీ ఆదేశాలు ఇచ్చింది. వ్యక్తిగత, కులపరమైన దూషణలపై ఆధారాలు ఉండటంతో చర్యలు తీసుకున్న కమిటీ.. జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
పరకాల పవర్ పాలిటిక్స్.. కొండా సుస్మిత పోస్టుతో కాకరేపిన రాజకీయం!
సాక్షి, వరంగల్: పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో “అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అంటూ సుస్మిత పోస్టు చేయడంతో.. పరకాల రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తి పెరిగింది. మరోవైపు.. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో, రాజకీయం మరో టర్న్ తీసుకుంది. కాగా, రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రస్తుతం పరకాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో.. సుస్మిత తాజా పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో అధికార కాంగ్రెస్‌లోనే రేవూరి, కొండా కుటుంబం మధ్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతోందన్న చర్చ మొదలైంది.పరకాలపై కొండా ఫ్యామిలీ కన్ను?కొండా కుటుంబానికి పరకాల నియోజకవర్గంతో రాజకీయంగా బలమైన అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో సుస్మితను పరకాల నుంచి రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కొంతకాలంగా ఉంది. తాజాగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆ చర్చకు మరింత బలం చేకూర్చింది. అయితే, మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా పరకాల నియోజకవర్గ పరిధిలో భారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గీసుకొండ మండలంలోనూ పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సుస్మిత పటేల్ రాజకీయంగా కీలక ప్రకటన చేస్తారా? అన్న ఆసక్తి కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.ఒకవైపు రేవూరి ప్రకాశ్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు, మరోవైపు పరకాల నుంచి పోటీకి సుస్మిత పటేల్ ఆసక్తి.. ఈ రెండు పరిణామాలతో పరకాల కాంగ్రెస్‌లో రాజకీయ వేడి పెరిగింది. ప్రస్తుతం ఇది పార్టీ అంతర్గత రాజకీయంగా కనిపిస్తున్నప్పటికీ.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. రేవూరి వర్సెస్ కొండా ఫ్యామిలీగా మారుతున్న ఈ పవర్ పాలిటిక్స్‌లో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. -
రేవంత్ పై కోపమా అక్కా.. CM టూర్ లో మంత్రి మిస్సింగ్
-
సీఎం పరకాల పర్యటనకు కొండా సురేఖ దూరం.. !
పరకాల: ఒకవైపు సీఎం రేవంత్ పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం.. మరొకవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి పోటీచేస్తారని రేవంత్ వ్యాఖ్యలు.. వీరి మధ్య దూరం పెరిగిందనే వాదనకు బలం ఇస్తోంది. తాజాగా సీఎం రేవంత్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కార్యక్రమాలకు మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే మేడారం సమ్మక్క-సారలమ్మ అభివృద్ధి పనులను పరిశీలించారు సీఎం రేవంత్. మరొకవైపు రేవంత్ పరకాల సభలోనూ కొండా సురేఖ కనిపించలేదు. దాంతో ఈ అంశం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. మరొకవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి పోటీ చేస్తారని రేవంత్ చెప్పడం మరింత హాట్ టాపిక్ అయ్యింది. రేవూరిని ఆశీర్వదించాలని కూడా రేవంత్ పిలుపునిచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేస్తానని కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలకు కొండా సురేఖ దూరంగా ఉన్నారనే చర్చ మొదలైంది. -
ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి : కొండా సురేఖ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో విజయవంతంగా ముగిసిందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. జూలై 16న గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన బోనాల మహోత్సవం, బుధవారం (ఆగస్టు 13) జగదాంబిక అమ్మవారికి మహాకుంభహారతితో సంప్రదాయబద్ధంగా ముగిసిందని మంత్రి స్పష్టం చేశారు.దాదాపు నెలరోజుల పాటు వైభవోపేతంగా జరిగిన బోనాల వేడుకలు శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, జానపద కళల ప్రదర్శన, అంబారీల ఊరేగింపు, రంగం, ఘటోత్సవాలతో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ ఘనంగా జరిగాయని అన్నారు.ప్రభుత్వ పర్యవేక్షణలో ఘనంగా ఉత్సవాలుబోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. రూ. 20 కోట్ల నిధులతో ఆషాడ బోనాల జాతరను దేదీప్యమానంగా నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో వేలాది ఆలయాల్లో జరిగిన బోనాల వేడుకలు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా జరిగేందుకు పోలీసులు, జీహెచ్ఎంసీ, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్యారోగ్యం, ట్రాఫిక్ నియంత్రణ, జలమండలి తదితర శాఖలు సమన్వయంతో పనిచేశాయని తెలిపారు. జాతర విజయవంతం కావడానికి కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు, సహకరించిన స్వచ్ఛంద సంస్థలకు మంత్రి పేరుపేరునా అభినందనలు తెలిపారు.లౌకిక సందేశానికి ప్రతీక హైదరాబాద్ బోనాలుహైదరాబాద్ బోనాలు తెలంగాణ సమాజంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్నాయని, గంగా జమునా సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూ యావత్ దేశానికి లౌకిక సందేశాన్నిస్తున్నాయని మంత్రి సురేఖ పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం హైదరాబాద్ నగర ప్రత్యేకతను మరోసారి ప్రపంచానికి చాటిందని అన్నారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి“అమ్మవారి చల్లని చూపు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలి. రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలి. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి. అమ్మవార్ల దయతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి. శాంతి, సౌభ్రాతృత్వం, సామాజిక సామరస్యం మరింత బలపడాలి” అని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. దేవాదాయ శాఖ తరఫున నిర్వహించిన వరుణయాగంతో ప్రభుత్వ సంకల్పం సిద్ధించి, రాష్ట్రం వర్షాలతో కళకళలాడుతుండటం అమ్మవార్ల మహిమేనని పేర్కొన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. -
మంత్రులు వర్సెస్ పీసీసీఎఫ్!
సాక్షి, హైదరాబాద్: అటవీశాఖకు చెందిన 25 మంది దాకా అధికారులు, సిబ్బంది డిప్యుటేషన్ల్ల రద్దు అంశం కొందరు మంత్రులు వర్సెస్ పీసీసీఎఫ్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. వీటిలో కొన్ని డిప్యుటేషన్లను కొనసాగించాలని మంత్రులు తుమ్మల, జూపల్లి, శ్రీధర్‌బాబు, పొన్నం, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు డా.చిక్కుడు వంశీకృష్ణ, డా.సంజయ్ కోరి నా పీసీసీఎఫ్ వెనక్కి తగ్గలేదు. అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ సైతం ఈ డిప్యుటేషన్లను ఎలా రద్దు చేస్తారంటూ పీసీసీఎఫ్‌ను ప్రశ్నించినా ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని తెలుస్తుంది.అటవీశాఖ నూతన ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్)గా వినయ్‌కుమార్... గత జూన్ 30న బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందున్న పీసీసీఎఫ్ సువర్ణ ఆమోదించిన డిప్యుటేషన్లను రద్దు చేశారు. దీంతో ఈ అంశం అటు అరణ్యభవన్‌లో, ఇటు ప్రభుత్వవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. డిప్యు టేషన్లు రద్దు అయిన వారిలో క్షేత్రస్థాయిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మొదలుకొని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఇలా వివిధ స్థాయిల్లోని వారున్నారు. అటవీ శాఖ మంత్రి చెప్పినా..: స్థానిక పరిస్థితులు, కుటుంబ అవసరాల రీత్యా తమను మరో చోటకు లేదా మరో శాఖకు డిప్యుటేషన్‌పై పంపించాలని కోరుతూ మంత్రులు, ఎమ్మెల్యేలను కోరుతూ అధికారులు, ఉద్యోగులు వినతిపత్రాలు సమర్పించడం సాధారణంగా జరిగేదే. ఈ దరఖాస్తులపై ప్రజాప్రతినిధులు స్పందిస్తూ...ఆయా అధికారులు, ఉద్యోగులు కోరుకున్నట్టుగా డిప్యుటేషన్ పంపించాలని సిఫార్సు చేస్తూ లేఖలు పంపుతారు. ఇలాంటి వాటికి ఆమోదం లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ డిప్యుటేషన్లు రద్దు కావడం మంత్రుల కోపానికి కారణమైంది. ఇటీవల బాధ్యతలు చేపట్టిన వినయ్‌కుమార్ ఏకపక్షంగా వాటిని మధ్యలోనే రద్దు చేయడంతో తమ సిఫార్సులకు విలువ లేకుండా పోయిందని వారు వాపోతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు మంత్రి సురేఖ దృష్టికి రావడంతో రద్దు చేసిన డిప్యుటేషన్లను పునరుద్ధరించి, మంత్రులు చేసిన సిఫార్సులను గౌరవించాలని సూచించినట్టు తెలిసింది. అయితే అటవీశాఖ మంత్రి చేసిన సూచనలను కూడా పెడచెవిన పెట్టడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మరోవైపు తన సమీప బంధువు కూడా బాధి తుడు కావడంతో ఓ మంత్రి దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ పెద్దల వద్ద పంచాయితీ పెట్టినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం మంత్రులు–పీసీసీఎఫ్ మధ్య ఏర్పడిన వివాదం మరింత ముదురుతున్నట్టుగా తెలుస్తోంది. -
నీ క్యారెక్టర్ ఏంటో చెప్పమంటారా..? కడియంకు కొండా వార్నింగ్..
-
కడియం శ్రీహరిపై రేవంత్‌కు కొండా సురేఖ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆలయ పరిస్థితులపై కడియం శ్రీహరి రివ్యూ నిర్వహించడంపై మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. ఈ రోజు (మంగళవారం) ఈ విషయమై ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావుకు క్లాస్ పీకారు. ప్రోటోకాల్ పాటించకుండా రివ్యూ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కమిషనర్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. కాగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మళ్ళీ వివాదం రోజురోజుకు ముదురుతోంది. కడియం శ్రీహరి వ్యవహారంపై ఇదివరకే ఏఐసీసీకి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ తాజాగా ఆయనపై మరోసారి సీరియస్ అయ్యారు. గతంలోనూ ఇరువురు నేతలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందన్న నేపథ్యంలో నిన్న నియోజకవర్గంపై అధికారులతో కడియం రివ్యూ చేశారు.సమీక్ష తర్వాత ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని అధికారులను కడియం కోరారు. జిల్లా వ్యవహారాలలో కడియం తల దూర్చడం ఏంటని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడియంపై ఏఐసీసీ పెద్దలు, సీఎం రేవంత్‌కు కొండా సురేఖ లేఖ రాశారు. ఆలయాల అభివృద్ధిపై కడియం ఆదేశాలివ్వడంపై కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగంలో కడియం అయోమయం సృష్టిస్తున్నారంటూ సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. -
కడియం శ్రీహరిపై ఏఐసీసీకి కొండా సురేఖ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య మళ్ళీ వివాదం ముదురుతోంది. కడియం శ్రీహరిపై ఏఐసీసీకి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. కొండా, కడియం.. గతంలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుంది. ఈ నేపథ్యంలో నిన్న నియోజకవర్గంపై అధికారులతో కడియం రివ్యూ చేశారు.సమీక్ష తర్వాత ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని అధికారులను కడియం కోరారు. జిల్లా వ్యవహారాలలో కడియం తల దూర్చడం ఏంటని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కడియంపై ఏఐసీసీ పెద్దలు, సీఎం రేవంత్‌కు కొండా సురేఖ లేఖ రాసిన రాశారు. -
‘మ్యాపింగ్ ద్వారా అటవీ భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తరణ, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంలో మొక్కల పెంపకం అత్యంత కీలకమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గుర్రంగూడ అటవీ ప్రాంతంలో నిర్వహించిన వనమహోత్సవం–2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.వనమహోత్సవాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం 1950లో ప్రజా ఉద్యమంగా ప్రారంభించిందని గుర్తు చేసిన మంత్రి, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో వనమహోత్సవాన్ని మహా ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు గత రెండు సంవత్సరాలుగా వనమహోత్సవ కార్యక్రమాలకు అపూర్వ స్పందన అందించారని, "ప్రతి నవజాత శిశువు పేరుతో ఒక మొక్క" అనే ముఖ్యమంత్రి పిలుపు రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ చైతన్యాన్ని పెంచి, పచ్చదనం పెంపు దిశగా సమాజాన్ని ప్రేరేపించిందని అన్నారు.మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఏడాది నాటిన మొక్కలలో 94 శాతం మొక్కలు విజయవంతంగా పెరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 13,242 నర్సరీలలో సిద్ధం చేసిన 16.06 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.గుర్రంగూడ అటవీ ప్రాంతం తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి, అటవీ శాఖ పట్టుదలకు, న్యాయపరమైన విజయానికి ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుతో సుమారు 102 ఎకరాల అటవీ భూమి తిరిగి అటవీ శాఖకు లభించిందని, అనంతరం మొత్తం 424 ఎకరాల 31 గుంటల భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించినట్లు తెలిపారు. ఇది తెలంగాణ అటవీ సంరక్షణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. -
తెలంగాణ : సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఆరంభం (ఫొటోలు)
-
కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డు
అత్యంత పిన్న వయస్సులోనే చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించిన బాలుడిగా కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ నిలిచాడు. రెండు సంవత్సరాల 11 నెలల వయసులో ఈ ఘనత సాధించాడు. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు అసాధారణ రికార్డులను నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) స్థానం సాధించిన కొండా శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ నిలిచాడు. 15 నిమిషాల 52 సెకండ్స్ లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్ ను పరిష్కరించడంతో పాటు, 1 గంట 9 నిమిషాల 9 సెకండ్స్ లలో 21 చెస్ బోర్డ్ లను అమర్చి రెండు ప్రపంచ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాడు.జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కాలనీ కల్చరల్ సెంటర్లో మంగళవారం వేడుకగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు.శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డ్ సాధించి, భరతమాత ముద్దు బిడ్డగా, అపార మేధస్సు కలిగిన స్వామి వివేకానందునిగా అవతరించాడని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశంసించారు. మరోవైపు.. తన మనవడి ప్రతిభను చూసి మంత్రి సురేఖ మురిసిపోయారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ, శ్రీయాన్ష్ తల్లి కొండా సుస్మిత పటేల్ ఉద్వేగంతో ఆనంద భాష్పాలు రాల్చారు.కాగా రాయ్ చెస్ అకాడమీ తరఫున క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొండా శ్రేయాన్ష్ పటేల్‌కు ట్రోఫీలు, సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు. త్వరలో వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ ద్వారా బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారంతో పాటు సర్టిఫికెట్‌ను శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ పొందనున్నాడు. -
చిట్టక్క ఎంట్రీతో పరకాల పాలిటిక్స్‌కి కొత్త ట్విస్ట్..!
సాక్షి, వరంగల్: గీసుకొండ నుంచి పరకాల టార్గెట్‌గా ‘కొండా’ వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. గతంలోనే పరకాల నుంచి ఎమ్మెల్యే అవుతానని ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, మంత్రి కొండా సురేఖ దంపతుల కుమార్తె సుస్మితాపటేల్ (చిట్టక్క).. తాజాగా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర సాక్షిగా తన తండ్రి మురళీధర్‌రావు దీవెనలు, గీసుకొండ మండల ప్రజల అండతో ఎమ్మెల్యే అవుతానని మాట్లాడడంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కాక రేపినట్లయ్యింది. ఆమె మాటలకు అనుకూలంగానే కొండా కుటుంబాన్ని గతంలో ఆశీర్వదించినట్లుగా భవిష్యత్‌లో కూడా ఆదరించాలని కొండా మురళి మాట్లాడడంతో పొలిటికల్ హీట్ పుట్టించినట్లయ్యింది. ఎవరు అడ్డొచ్చినా కొండా సుస్మిత అదరదు బెదరదని, ఇది అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. తప్పకుండా పరకాల నుంచే తన కుటుంబం రేసులో ఉంటుందని ఆయన విస్పష్టంగా ప్రకటించడంతో మరోసారి పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ వార్ తెరమీదకు వచ్చినట్లయ్యింది. గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ సుస్మితాపటేల్ బ్యానర్లు వెలిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా కొండా, రేవూరి వర్గాలతో కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొండా చేసిన ఈ వ్యాఖ్యల మర్మం వెనుక రాజకీయ మతలబు దాగి ఉందని, వరంగల్ తూర్పులో కూడా కొండా వ్యతిరేక వర్గాలు ఉండడంతో అదే సిద్ధాంతాన్ని పరకాలలో ప్రయోగించి.. పార్టీలో తమ పట్టు నిలుపుకోవాలన్న ఎత్తుగడలో భాగమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అప్పుడు దసరా.. ఇప్పుడు హోలీ● 2024 మే 8న గీసుకొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రడం భరత్ విషయంలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య జరిగిన ఫోన్లో వాగ్వాదం సోషల్ మీడియాలో వైరలైంది. తన మనిషిని కాదని ఇతరులకు పదవుల్లో ఎలా ప్రాధాన్యమిచ్చారంటూ రేవూరిని ఆమె ప్రశ్నించారు. మా వల్లే మీరు గెలిచారు.. నియోజకవర్గంలోని సొంత మండలం గీసుకొండలో మేం చెప్పినట్లే నడవాలని అప్పట్లో ఫోన్లో మాట్లాడిన మాటలు ఆడియో లీక్ అవడం సంచలనంగా మారింది. అంతకుముందే తనకు తెలియకుండా పలు మండలాలకు చెందిన వారిని పార్టీలోకి తీసుకోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయమై గీసుకొండ మండలంలోని కొండా వర్గానికి చెందిన ఒకరిపై పరకాలలో కేసు కూడా నమోదైంది. మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్యపై మంత్రి బాహాటంగానే అప్పుడు విమర్శలు గుప్పించారు.● 2024 అక్టోబర్ 13న దసరా పండుగను పురస్కరించుకొని గీసుకొండ మండలం ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని ఆయన వర్గీయులు దాన్ని ధ్వంసం చేశారు. ఈక్రమంలో కొండా వర్గీయులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్‌కు వచ్చిన మంత్రి కొండా సురేఖ సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొండా వర్గీయులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకొని, వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేయడంతో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిందని, ఇది పార్టీ అంతర్గత వ్యవహారం కాదని, స్థానికతకు సంబంధించిన విషయమన్న సంగతి తెలిసిందే.● 2026 మార్చి 3న కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కుమార్తె, కొండా సుస్మితాపటేల్ మాట్లాడుతూ కొండా కుటుంబాన్ని గీసుకొండ ప్రజలు ఆదరించారని, భవిష్యత్‌లోనూ బాసటగా ఉండాలని సుస్మితాపటేల్ పరకాల నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉంటాననే సంకేతాలను ఇవ్వడం కలకలం రేపింది. దీంతో ఇప్పటికే ఉప్పునిప్పులా ఉంటున్న కొండా, రేవూరి వర్గాలు మరింత దూరమయ్యే పరిస్థితి నెలకొంది. గతేడాది డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ గీసుకొండ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు గెలిచింది. కొండా వర్గం 7 స్థానాలు, రేవూరి వర్గం 9 స్థానాలు దక్కించుకుంది. ఇలా గీసుకొండ మండల కేంద్రంగా అధికార పార్టీలోనే రెండు వర్గాలు తమ ప్రాబల్యాన్ని చూపుతుండడం గమనార్హం. -
నేను ఎమ్మెల్యే అవుతా...! కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు
-
దటీజ్ కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆహ్వానం వెళ్లింది. ఆ సమయంలో ఆయన పలకరింపు మహిళా మంత్రులనూ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందనే చర్చ నడుస్తోంది. ‘‘బాగున్నారా అమ్మా..’’ అంటూ కొండా సురేఖను, సీతక్కలను ఆత్మీయంగా పిలిచి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారాయన. అంతటితో ఆగకుండా.. మేడారం జాతర పనులు ఎంతవరకు వచ్చాయని మంత్రులను అడిగి తెలుసుకున్నారు. పనులు చివరి దశలో ఉన్నాయని.. జాతర దగ్గర పడుతుండడంతో పనులు వేగంగా చేస్తామని ఈ సందర్భంగా మాజీ సీఎంకు మంత్రులిద్దరూ వివరించారు. అయితే.. పనుల విషయం జాగ్రత్త వహించండి.. పనులు తొందర కావాలని ఆగం కావొద్దంటూ ఆయన వాళ్లను సున్నితంగా సూచించారు. అవసరం అయితే కొన్ని పనులు జాతర అయిపోయాక కూడా చేసుకోవచ్చంటూ సలహా ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ఆయన.. హెలికాప్టర్లో సతీసమేతంగా జాతరకు వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ‘‘ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాం. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు’’ అని మంత్రులిద్దరూ మీడియాకు చెప్పారు. అంతకు ముందు.. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన మహిళా మంత్రులను కేసీఆర్ దంపతులు అతిథి మర్యాదలతో పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కరించడం వైరల్‌గా మారింది. మాజీ ముఖ్య మంత్రివర్యులు కేసీఆర్ గారిని మేడారం మహా జాతరకు ఆహ్వానించిన మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు,శ్రీమతి సీతక్క గారు..@seethakkaMLA @iamkondasurekha #prajapalana#medaramjatara#sammakkasarakka#tribalfestival pic.twitter.com/F8pwvacqlP— Telangana Congress (@INCTelangana) January 8, 2026కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేసీఆర్.. మొన్నటి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రేవంత్ రెడ్డి పలకరింపునకు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సీఎం రాక సందర్భంగా లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ‘‘దటీజ్ కేసీఆర్ అని.. ఆయనకంటూ ఓ సంస్కారం ఉందని.. ఆయన విమర్శలు ఏనాడూ హద్దుదాటి ఉండవు’’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆ వీడియోను నెట్టింట తెగ వైరల్ చేశాయి. -
మేడారం జాతరకు కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రులు
-
మేడారం జాతరకు కేసీఆర్‌కు ఆహ్వానం.. ఎర్రవల్లికి సురేఖ, సీతక్క
సాక్షి, సిద్దిపేట: మేడారం మహా జాతర నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులకు పట్టు వస్త్రాలు పెట్టి మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు అందించారు. అనంతరం, కేసీఆర్ దంపతులు కూడా మంత్రులను సన్మానించారు.ఆహ్వానం సందర్భంగా దాదాపు 20 నిమిషాలపాటు వారు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మేడారంలో జాతర సందర్బంగా చేస్తున్న ఏర్పాట్లను కేసీఆర్‌కు వివరించినట్టుగా తెలిసింది. అనంతరం, మేడారం జాతరకు ఏదోఒక రోజు తాము హాజరు అవుతామని కేసీఆర్ చెప్పారని మంత్రులువెల్లడించారు. కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మంత్రులు కొండా సురేఖ, సీతక్క వెళ్లిపోయారు.బాగున్నరా.. అమ్మ !కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపుఇంటికి వచ్చిన ఆడబిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారంగురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది… pic.twitter.com/8NPsnWB5jX— Telugu Scribe (@TeluguScribe) January 8, 2026అంతకుముందు మంత్రులిద్దరూ మాట్లాడుతూ..‘మాజీ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. హెలికాప్టర్లో సతీసమేతంగా జాతరకు కేసీఆర్ వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాము. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. మేడారం జాతరను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అందరిని మేడారం జాతరకు రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం’ అని అన్నారు. -
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందన్న కథనాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. తనకు ఎలాంటి వారెంట్ జారీ కాలేదని.. కోర్టుకు హాజరు కావాలని మాత్రమే కబురు అందిందని స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారామె. ఇదిలా ఉంటే.. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని తొలుత ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఈ పరిణామం చోటు చేసుకుందన్నది ఆ ప్రచార సారాంశం. ‘‘గురువారం (డిసెంబర్ 11, 2025) ఈ కేసు విచారణకు రాగా, నిందితురాలి గైర్హాజరును న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు’’ అని ఆ ప్రచారంలో ఉంది. అయితే దానిని కొండా సురేఖ కాసేపటికి ఖండించారు. ‘‘కోర్టు నాకు ఎన్బీడబ్ల్యూ జారీ చేయలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కోర్టుకు రావాలని చెప్పింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది’’ అని అన్నారామె. కేసు వివరాల్లోకి వెళితే.. తనపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాయని కేటీఆర్ పరువు నష్టం దాదా వేశారు. ఈ కేసు ప్రస్తుతం (C.C. No. 307 of 2025) విచారణ దశకు చేరుకుంది. గురువారం రోజున విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, నిందితురాలైన కొండా సురేఖ కోర్టుకు రాలేదు. ఆమె గైర్హాజరుకు సంబంధించి న్యాయస్థానానికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం, మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. -
కొండా సురేఖ వివాదంపై నాగార్జున కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును నాగార్జున విత్‌డ్రా చేసుకున్నారు. గతేడాది ఓ మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యుల్ని ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో నాగార్జున.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మా కుటుంబ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయి. అందుకే భారత శిక్షా స్మృతి (BNS) సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’ అని నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నారు.కోర్టులో విచారణ కొనసాగుతుండగా.. కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా అక్కినేని కుటుంబానికి క్షమాపణలు తెలిపారు. ఆమె వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా కాకపోయినప్పటికీ, అవి బాధ కలిగించాయని అంగీకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాంపల్లి ప్రత్యేక కోర్టులో పరువు నష్టం కేసుపై విచారణ జరిగింది. విచారణ సమయంలో నాగార్జున తన దావాను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకున్నారు. కొండా సురేఖ, నాగార్జున మధ్య నెలకొన్న వివాదం ముగిసినట్లైంది. I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members. I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members. I regret any unintended impression…— Konda Surekha (@iamkondasurekha) November 11, 2025పరువు నష్టం దావా కేసు విచారణ ముందు రోజు మంత్రి కొండా సురేఖ ‘ఎక్స్’ వేదికగా అక్కినేని కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ గతంలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టాలని నేను మాట్లాడలేదు. వారి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది నా ఉద్దేశమే కాదు. ఆయన కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యల్లో పొరపాటు ఉంటే చింతిస్తున్నా. గతంలో నేను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా’అని పేర్కొన్నారు. -
తప్పు ఒప్పుకొన్న కొండా సురేఖ.. నాగార్జునకు క్షమాపణ
-
నాగార్జున కుటుంబంపై మరోసారి స్పందించిన కొండా సురేఖ
సినీ నటుడు నాగార్జున గురించి తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సోషల్‌మీడియా ద్వారా మరోసారి స్పందించారు. 'నాగార్జునకు సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు తన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశంతో చేయలేదని స్పష్టంగా తెలుపుతున్నాను. అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టాలని లేదా పరువు తీయాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. వారి కుటుంబ విషయంలో నేను చేసిన ప్రకటనలలో ఏదైనా అనుకోని పొరపాటు జరిగివుంటే దానికి చింతిస్తున్నాను. ఆపై ఆ వాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నాను.' అని మంత్రి కొండా సురేఖ ఒక పోస్ట్ చేశారు.కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేసిన సందర్భంలో నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ మాట్లాడిన సంగతి తెలిసిందే. తన కుటుంబ గౌరవాన్ని కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని తప్పుబట్టిన నాగార్జున సురేఖపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members. I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members. I regret any unintended impression…— Konda Surekha (@iamkondasurekha) November 11, 2025 -
కొండా ఫ్యామిలీ ఎపిసోడ్.. కాంగ్రెస్, రేవంత్‌కు నష్టమేనా?
గజం మిథ్య, పలాయనం మిథ్య అని నానుడి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఘటనలు ఇలానే ఉంటాయి. మంత్రి కొండా సురేఖ వివాదమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏదో జరిగిపోతుందన్న భావన ముందు కలుగుతుంది. ఆ తర్వాత పరిస్థితి.. అసలేమీ జరగలేదేమో అనేలా మారుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి వేళ కొండా సురేఖ నివాసానికి వెళ్లడం, ఓఎస్డీ సుమంత్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం ఆ తరువాత మంత్రి స్వయంగా అతడిని కారులో ఎక్కించుకుని రక్షించడం, అదే టైమ్‌లో సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం మనందరం చూశాము.ఆ తరువాత మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయ్యారు సురేఖ. పార్టీ అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభృతులు జోక్యం చేసుకుని రేవంత్, కొండా దంపతుల మధ్య రాజీ కుదిర్చి పరిస్థితిని అదుపు చేశారు. కాంగ్రెస్ నేతలంతా గప్ చుప్ అయిపోయారు. అయితే విపక్షం ఊరుకోదు కదా! తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోయిందని, ముఖ్యమంత్రిపై సురేఖ కూతురు సుస్మిత చేసిన ఆరోపణల మాటేమిటి? అంటూ బీఆర్ఎస్, బీజేపీలు ధ్వజమెత్తాయి. మంత్రి కొండ సురేఖ విషయం ఎందుకంత సీరియస్ అయింది? ఆ తర్వాత ఎలా సద్దుమణిగింది అన్నది ఆసక్తికరమైన అంశమే. ప్రాంతీయ పార్టీల్లో ఎవరైనా సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తే ఆ వ్యక్తి పదవి పోయినట్లే. కాంగ్రెస్‌లో అలా ఉండదు. ఢిల్లీలోని హైకమాండ్ పెద్దలను ఏమీ అనకుండా, రాష్ట్ర స్థాయిలో ఎవరు, ఎవరిని విమర్శించుకున్నా పెద్దగా పట్టించుకోరు. కాకపోతే పిలిచి మాట్లాడి రాజీలు చేస్తుంటారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఇందుకు కారణం కావచ్చు. అయితే సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిలు అప్రతిష్ట పాలయ్యారు. మంత్రి సురేఖ తొలుత ఆత్మరక్షణలో పడినప్పటికీ, ఆ తర్వాత వ్యూహాత్మకంగా రాజీ కుదుర్చుకోవడం ద్వారా పదవిని నిలబెట్టుకున్నారని భావించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయం కావడం, బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోందన్న భావన కలిగించే యత్నం చేస్తున్న తరుణంలో ఒక బీసీ మంత్రిని పదవి నుంచి తప్పిస్తే రాంగ్ సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం కూడా ఇందులో ఉండవచ్చు.సీనియర్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఒక సిమెంట్ కంపెనీ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేయడానికి సురేఖ ఓఎస్డీ సుమంత్ తుపాకితో బెదిరించారన్న ఫిర్యాదు వచ్చింది. అతనితోపాటు మరో కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారని చెబుతున్నారు. ఈ సమాచారం ఆధారంగా సీఎం ఆఫీస్ వెంటనే సుమంత్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తనకు చెప్పకుండా ఎలా చేస్తారన్నది సురేఖ ప్రశ్న. గతంలో పలుమార్లు హెచ్చరించినా మంత్రి పట్టించుకోలేదన్నది రేవంత్ కార్యాలయ వర్గాల వాదన. ఆ తర్వాత పోలీసులు సుమంత్ అరెస్టుకు ప్రయత్నించారు. మంత్రి ఇంటిలోనే రక్షణ పొందుతున్నారని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. అది తీవ్ర కలకలం రేపింది. కానీ, సురేఖ పోలీసులకు అవకాశం ఇవ్వకుండా ఓఎస్డీని అక్కడ నుంచి తీసుకువెళ్లిపోయారు. సహ మంత్రుల వద్దకు వెళ్లి ఆమె దీనిపై తన వాదన వినిపించారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్న కొందరిని కలిసినట్లు వార్తలు వచ్చాయి.హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కావాలనే ఇలా చేశారన్నది సురేఖ వర్గం ఆరోపణగా ఉంది. సురేఖ కుమార్తె ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించి పలు ఆరోపణలు గుప్పించడం రేవంత్‌కు ఇరకాటంగా మారింది. రేవంత్ రెడ్డి, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, తదితరులపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరుల పేర్లు చెప్పి మరో ఆరోపణ సంధించారు. తన తల్లి సురేఖను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆమె అన్నారు. ఏకంగా రెడ్లు తమపై కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మేడారం వద్ద అభివృద్ది పనుల కాంట్రాక్టులు, దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల వివాదం మొదలైన విషయాలలో ఏర్పడిన అభిప్రాయ బేధాలు ఈ వర్గ పోరుకు కారణం అయ్యాయని చెబుతున్నారు.వరంగల్ కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో కూడా ఇదే తరహా గొడవలు నడుస్తుండటం, వారి మద్య రాజీ చేయడానికి పీసీసీ కృషి చేయడం, అవేవి ఒక కొలిక్కి రాకముందే ఈ పరిణామం సంభవించడం కాంగ్రెస్‌కు చికాకు అయింది. తదుపరి మీనాక్షి సమక్షంలో సురేఖ తన వాదన వినిపించి వచ్చారు. కాగా, తమ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌పై చేసిన ఆరోపణలను పట్టించుకోవద్దని, ఆవేశంలో అన్న మాటలు అని మంత్రి భర్త, ఎమ్మెల్సీ మురళీ సర్దిచెప్పే యత్నం చేశారు. సురేఖ మంత్రి పదవి వదలుకోవాల్సి వస్తుందేమో అన్న ప్రచారం జరిగింది. కానీ, ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రస్తుతానికి ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డారని అనిపిస్తుంది. కొండా దంపతులు స్వయంగా రేవంత్‌ను కలిసి శాలువా కప్పారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని తాము కోరుకున్న విషయాన్ని గుర్తు చేశారట. ఓఎస్డీని దూరం పెట్టండని రేవంత్ సూచించారట. తమ కుమార్తె చేసిన విమర్శలు ఆవేశంలో చేసినవని వీరు విచారం వ్యక్తం చేశారట. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రాసెస్‌లో కీలక భూమిక పోషించినట్లుగా ఉంది. కానీ, ఒకసారి విభేదాలు పొడసూపాక అవి అంత తేలికగా పోవు. కాంగ్రెస్‌లో సద్దుమణిగినప్పటికీ, పలు ప్రశ్నలు అటు రాజకీయ వర్గాలలోను, ఇటు ప్రజలలోను మిగిలే ఉంటాయి!.ఇంతకీ సుమంత్ గన్ తో బెదిరించారా లేదా? దానిపై వచ్చిన ఫిర్యాదును హ్యాండిల్ చేయడంలో రేవంత్ కార్యాలయం విఫలమైందా? అర్దరాత్రి వేళ మంత్రి ఇంటికి పోలీసులను పంపించడం తప్పు అన్న అభిప్రాయం కాంగ్రెస్ ముఖ్యనేతలలో, అధిష్టానంలో కలిగిందా? మంత్రి సురేఖ ఒక కేసులో నిందితుడికి ఆశ్రయం కల్పించడం తప్పా? కాదా? మొదలైన ప్రశ్నలన్ని అలాగే ఉండిపోయాయి. కొండా సురేఖ దంపతుల రాజకీయ ప్రస్థానం అంతా ఎప్పుడూ వివాదాలు, గ్రూపుల గొడవలు, ప్రత్యర్ధి రాజకీయ పార్టీలతో ఘర్షణలతోనే సాగిందని చెప్పాలి. సురేఖ, మురళీలు తొలుత కాంగ్రెస్ లోనే ఉండేవారు. అప్పట్లో టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకరరావుతో తీవ్రంగా ఘర్షణ పడేవారు. కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మద్దతుగా ఉండేవారు. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత ముఖ్యమంత్రి రోశయ్యతో సరిపడలేదు. అంతలో వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో ఆమె ఈ పార్టీలోకి వచ్చారు.ఎమ్మెల్యే పదవిని కూడా వదలుకున్నారు. తదుపరి వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి స్వల్ప తేడాతో టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. కొంతకాలం టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవారు. మళ్లీ పరిణామాలు మారడంతో ఆమె వైఎస్సార్సీపీకి దూరమయ్యారు. రాష్ట్ర విభజన జరగడంతో ఆమె టీఆర్ఎస్కు దగ్గరవడం, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అయినా కొండా వర్గం ఆశించినట్లుగా సురేఖ మంత్రి కాలేకపోయారు. తదుపరి టీఆర్ఎస్పైన, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన విమర్శలు చేసి మళ్లీ కాంగ్రెస్ వైపు పయనించారు. కాంగ్రెస్‌కు కూడా జిల్లాలో గట్టిగా నిలబడే నాయకత్వం అవసరమైంది. అది కొండా దంపతులకు కలిసి వచ్చింది. 2023లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచారు. తదుపరి రేవంత్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు.ఈ ప్రస్థానంలో మంత్రి సురేఖ ప్రజలకు కనిపించే ఫేస్ అయితే, వెనుక ఆమె భర్త మురళీ చేసే రాజకీయమే కీలకం అని చెబుతారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కుని మూడు దశాబ్దాలుగా వరంగల్ జిల్లా రాజకీయాలలో తమదైన శైలిలో ఒక ప్రముఖ పాత్రను పోషించడం కొండ దంపతుల విశిష్టత. ఏతావాతా ఈ మొత్తం ఎపిసోడ్లో అటు రేవంత్‌కు, ఇటు సురేఖకు నష్టం జరిగాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలలో కొంత పలచన అవడానికి కూడా ఇది దోహద పడిందని అంగీకరించాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సీఎం రేవంత్‌రెడ్డితో కొండా సురేఖ దంపతుల భేటీ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ పాల్గొన్నారు. ఇటీవల సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు.కొండా సురేఖ, మురళికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. -
కాంగ్రెస్ సర్కారుకు తిప్పలు తెచ్చి పెట్టిన కొండా సురేఖ ఓఎన్డీ వ్యవహారం
-
‘కొండా’ వివాదం సమసినట్లేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్ : సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ దంపతులు, ఆమె కూతురు సుస్మిత వ్యాఖ్యల వివాదం సమసినట్లేనా.. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు.. ఈ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఏమిటి.. ఇంతకీ వివాదానికి కారణమైన మాజీ ఓఎస్డీ సుమంత్ ఎక్కడ.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన సురేఖ.. కీలకమై కేబినెట్ మీటింగ్‌కు ఎందుకు వెళ్లలేదు?.. ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. 48 గంటలుగా తాజా రాజకీయ పరిణామాలు వరంగల్‌ను హీటెక్కించాయి.సుమంత్ కోసం పోలీసులు..కలకలం రేపిన సుస్మిత వ్యాఖ్యలు..మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మధ్య విభేదాలు పక్కన పెడితే... మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లడం.. అక్కడ సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు. కొండా సురేఖ, మురళికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదే సమయంలో వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన కొండా మురళీధర్ సీఎం రేవంత్‌రెడ్డితో తమకు విభేదాలు లేవని, తనకు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పారన్నారు. సుస్మిత ఎక్కడ.. ఎప్పుడు.. ఏం మాట్లాడింది తనకు తెలియదని కొట్టిపారేశారు. మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు? ఇంతకీ అతను ఎక్కడ ఉన్నాడు? ప్రభుత్వం తదుపరి ఏం చేయబోతుంది? అనే అంశాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.కేబినెట్‌కు ఎందుకు వెళ్లలేదు..అసలేం జరుగుతోంది..?రెండు రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో గురువారం జరిగిన కీలకమైన మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత.. టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌తో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కూడ కలిసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌లను కలిసిన కొండా సురేఖ.. 48 గంటల్లో జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిసింది. పార్టీపరంగా, కొందరు ప్రజాప్రతినిధుల వల్ల తమకెదురవుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా మీడియాతో మాట్లాడిన సురేఖ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌తో భేటీ అయిన సురేఖ, ఆ తర్వాత జరిగిన కేబినెట్ మీటింగ్‌కు హాజరుకాకపోవడం కొత్త వివాదానికి తెర తీసింది. అసలు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడిన సురేఖకు వారు ఏమి భరోసా ఇచ్చారు? అక్కడినుంచి కేబినెట్ మీటింగ్‌కు వెళ్లాల్సిన ఆమె ఎందుకు వెళ్లలేదు? కావాలనే వెళ్లలేదా? లేక ఎవరైనా వద్దని చెప్పారా? ఈ నేపథ్యంలో కొండా దంపతులకు ఏమైన ప్రత్యేక వ్యూహం ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది..? అన్న అంశాలు అన్ని వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. -
ఏదైతే అది.. మీనాక్షి మేడంతో మొత్తం చెప్పేశా !
-
పెద్దల వద్దకు ‘కొండా’ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణా మాలు కలకలం రేపాయి. కొంతకాలంగా నెల కొన్న వివాదం గురువారం రాత్రి వరకు కొన సాగింది. పరిస్థితి మరీ దిగజారి రచ్చకెక్కకుండా పార్టీ పెద్దలు అతికష్టం మీద నియంత్రించగలి గారు. తనను లక్ష్యగా చేసుకొని పార్టీలో, మంత్రివర్గంలో కుట్రలు జరుగుతున్నాయని భావిస్తున్న మంత్రి సురేఖ గురు వారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశ మై తన వాదన వినిపించారు.అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌తో కూడా చర్చించారు. తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా తన దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీని ప్రభుత్వం తొలగించడాన్ని అవమానకరంగా భావించినట్లు ఆమె వారికి తెలిపినట్లు సమాచారం. పార్టీలో తనపై జరుగుతున్న దాడి గురించి మీనాక్షికి వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరు కాలేదు. పార్టీ పెద్దల నిర్ణయమే శిరోధార్యం: కొండా మీనాక్షి నటరాజన్‌తో సమావేశం అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘తాజా పరిణామాలపై పార్టీ ఇన్చార్జి, పీసీసీ అధ్యక్షుడు మహేష్మార్ గౌడ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపినం. ఈ విషయంలో పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు. సమస్యను పార్టీ పెద్దలు సెటిల్ చేస్తా మని చెప్పారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసా ఉంది’అని పేర్కొన్నారు. నివురుగప్పిన నిప్పులా పరిస్థితి..వరంగల్‌లో మంత్రి పొంగులేటి దేవాదాయ శాఖకు సంబంధించిన కాంట్రాక్టు వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ లేకుండానే సమావేశం జరగడం, ఆ తరువాత సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను తొలగించడంతో వివాదం ముదిరింది. మేడారం అభివృద్ధి పనులను దేవా దాయ శాఖ నుంచి రోడ్లు, భవనాల శాఖకు బదలాయించడంతో మంత్రి సురేఖ ప్రమేయం లేకుండానే పనులు జరుగుతున్నాయి. పోలీసులతో వాగ్వాదానికి దిగిన మంత్రి కుమార్తె సుష్మిత.. సీఎం పలువురు మంత్రులపై నేరుగా విమర్శలు చేశారు. బీసీ నాయకురాలైన తన తల్లి పట్ల ఓ వర్గం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం సృష్టించాయి. -
కొండా సురేఖ, కుమార్తె సుస్మితా పటేల్ విక్రమార్కను కలిసేందుకు ప్రజాభవన్ వెళ్లారు
-
Mahesh Kumar: క్యాబినెట్ భేటీ తర్వాత కొండా సురేఖతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడతారు
-
కొండా సురేఖ ఎపిసోడ్.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎక్కడో కమ్యూనికేషన్ లోపంగా కనిపిస్తుందన్నారు. సాయంత్రం లోగా ఈ విషయంపై క్లారిటీ వస్తుందని మహేష్ గౌడ్ అన్నారు.కాగా, సుప్రీం కోర్టు తీర్పుపై మహేష్ గౌడ్ స్పందిస్తూ.. హైకోర్టులో కేసుకి సమయం ఉందని.. వేచి చూస్తామన్నారు. హైకోర్టులోనే తేల్చుకుంటామన్నారు. బీసీ రేజర్వేషన్ అంశం మీద కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో ఉందని.. వెనక్కి తగ్గేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలనే తపన ఉందని.. హై కోర్టులో పోరాడతామని మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయట పెట్టాలి: బీజేపీ చీఫ్మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు మాట్లాడుతూ.. సిమెంట్ ఫ్యాక్టరీని బెదిరించడంలో పెద్దవారి హస్తముందని కొండ సురేఖ కుటుంబ సభ్యులు చెబుతున్నారని.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాలన్నారు. ‘‘కాంగ్రెస్ అంటేనే కరప్షన్. కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయట పెట్టాలి. బలవంతంగా కాంగ్రెస్ వసూలు చేస్తుంది. సీఎంపై ఆరోపణలు చేసింది కేబినెట్ మినిస్టర్ కుటుంబ సభ్యులే...దోచుకున్న సొమ్మును పంచుకోలేక దంచుకొని తన్నుకుంటున్నారు. కొండ సురేఖ కుమార్తె మాట్లాడిన విషయంపై విచారణ జరపాలి. దోచుకునే లీడర్లు ఎక్కువ రోజులు ఉండొద్దు. కాంగ్రెస్ నాయకులు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయొద్దు’’ అంటూ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. -
కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు
తన తల్లిదండ్రులకు ఏమైనా హానీ జరిగితే సీఎం రేవంత్‌రెడ్డిదే బాధ్యత అంటున్నారు తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కుమార్తె సుస్మిత. మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అడ్డం పెట్టుకుని తమను వేధిస్తున్నారని ఆరోపించారు. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన పోలీసులను ఆమె అడ్డుకున్నారు.బుధవారం రాత్రి ఆమె తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ''బీసీ లీడర్లను, మమ్మల్ని తొక్కడానికి ట్రై చేస్తున్నారు. ఎక్స్‌టార్సన్ కేసు అంటున్నారు. ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్నను తీసుకొద్దామని ట్రై చేస్తున్నారని నా డౌట్. ఆ డౌట్లో మాత్రం మానాన్నకు కానీ, మా అమ్మకు కానీ ఎటువంటి హాని జరిగినా పూర్తి బాధ్యత రేవంత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోహిన్ రెడ్డిలదే. వీళ్లందరు మాత్రం బాధ్యత వహించాలి. నేను ముందే చెబుతున్నా.ఇది కాంగ్రెసా, తెలుగుదేశమా తెలుస్తలేదండీ. రెడ్ల రాజ్యం నడుస్తోంది. బీసీ నినాదమేమో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎత్తుకుంటే.. ఇక్కడ బీసీ మంత్రి ఇంటికి టాస్క్‌ఫోర్స్ సీఐ వస్తడా? అసలు ఎక్కడైనా ఉందా? ఎంత సిగ్గుమాలిన చర్య? ఒక ముఖ్యమంత్రి సిగ్గుపడాలి దానికి. ఒక బీసీ లేడీ లీడర్ ఇంటికి రాత్రి తొమ్మిదింటికి ఒక టాస్క్‌ఫోర్స్ సీఐ వచ్చిండంటే ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. అయామ్ టెల్లింగ్ ఆన్ మీడియా'' అంటూ సుస్మిత ఫైర్ అయ్యారు. కాగా, నిన్నరాత్రి తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని గురువారం మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు కొండా సుస్మిత. చదవండి: కొండా సురేఖ వివాదం.. అసలేం జరిగింది? -
‘నా మాటలకు కట్టుబడి ఉన్నా.. ఫోన్ వచ్చింది ఇప్పుడేం మాట్లాడలేను’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ(konda Surekha) ఎపిసోడ్ తీవ్ర కలకలం సృష్టించింది. ఇక, తాజాగా మరోసారి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటానని సుస్మిత చెప్పుకొచ్చారు. దీంతో, అధికార కాంగ్రెస్ పార్టీలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.కొండా సుస్మిత(konda Sushmita) తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాత్రి నేను మాట్లాడిన మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. అధిష్టానం మాతో మాట్లాడింది. మీడియాలో ఎలాంటి అంశాలపై మాట్లాడవద్దని అదేశాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని విషయాలపై మాట్లాడలేను. ఏం జరిగిందో అందరికీ తెలుసు’ అని కామెంట్స్ చేశారు.మరోవైపు.. మంత్రి కొండా సురేఖకు సైతం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి పిలుపు వెళ్లింది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి రావాలని సురేఖకు తెలిపారు. మరికాసేపట్లో ఎమ్మెల్యే క్వాటర్స్‌కి మంత్రి కొండా సురేఖ వెళ్ళనున్నారు. కేబినెట్ భేటీకి కూడా కొండా సురేఖ హాజరకానున్నారు. ఇదిలా ఉండగా.. మినిస్టర్ క్వార్టర్స్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటికి ఆమె మాజీ osd సుమంత్ భార్య డాక్టర్ మనిషా చేరుకున్నట్టు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: కొండా సురేఖకు బిగ్ షాక్.. -
మంత్రుల వివాదంపై మీనాక్షి నటరాజన్ సీరియస్
-
కొండా సురేఖ వివాదం.. అసలేం జరిగింది?
మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. తన మాజీ ఓఎస్డీ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల మంత్రి సురేఖ కోపంగా ఉన్నట్టు కనబడుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించిన సురేఖ ఓఎస్డీపై చట్టపరమైన చర్యలకు సర్కారు యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన పోలీసులను సురేఖ కుమార్తె సుస్మిత (konda sushmitha) అడ్డుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. తమను టార్గెట్ చేశారని, రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తోందంటూ సుస్మిత మీడియా ముందు ఫైర్ అయ్యారు.మరోవైపు ఈ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని మంత్రి సురేఖ భర్త కొండా మురళి హన్మకొండలో చెప్పారు. తమ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసి వివాదం పరిష్కారానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. అదే సమయంలో తన కూతురును ఆయన వెనకేసుకొచ్చారు. కాగా, ఈ వివాదంపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కూడా సురేఖ వ్యవహరించిన తీరు పట్ల సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖను ఆమె నుంచి తీసేసుకోవాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం.అసలేం జరిగింది? తన నియోజకవర్గం హుజూర్‌నగర్‌లోని డెక్కన్ సిమెంట్స్‌లోని పనిచేస్తున్న ఓ వ్యక్తిని డబ్బుల కోసం కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ బెదిరించినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో అతడిని విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. సుమంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతడు సురేఖ ఇంట్లో ఉన్నాడన్న సమాచారంతో బుధవారం రాత్రి అక్కడికి వెళ్లారు. జూబ్లీహిల్స్ గాయత్రిహిల్స్‌లోని తమ ఇంటికి మఫ్టీలో వచ్చిన పోలీసులను సురేఖ కూతురు సుస్మిత అడ్డుకున్నారు. మంత్రి ఇంటికి పోలీసులు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. ఈలోపు ఇంట్లో ఉన్న సురేఖ, సుమంత్ బయటికి వచ్చి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మా ప్రమేయం లేదుఈ నేపథ్యంలో మేడారం జాతర పనులను రోడ్లు భవనాలకు అప్పగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కొండా సురేఖ (Konda Surekha) వివాదంపై స్పందించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిరాకరించారు. డెక్కన్ సిమెంట్ వివాదంలో తన ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే వ్యవహారంలో తనపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి తోసిపుచ్చారు. డెక్కన్ సిమెంట్ వివాదంలో తన ప్రమేయం లేదని అన్నారు.తెలంగాణ కేబినెట్ భేటీసీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు, రైతు భరోసా, మైనింగ్ కొత్త పాలసీ, ట్రో ఫేజ్-2 టెండర్లపై మంత్రి మండలిలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కొండా సురేఖ వివాదం నేపథ్యంలో కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, సురేఖకి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి క్యాబినెట్ మీటింగ్‌కు హాజరు కావాలని కోరినట్టు తెలుస్తోంది. చదవండి: నన్ను తిట్టినవాళ్లే నాకోసం వస్తున్నారుపొంగులేటిపై ఫిర్యాదు!అంతకుముందు మేడారం పనుల టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. తన శాఖకు సంబంధించిన రూ. 71 కోట్ల విలువైన పనులను తనవాళ్లకు ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని సురేఖ ఆరోపించినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి పొంగులేటితో ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. మహేష్ గౌడ్ క్లారిటీమంత్రి కొండా సురేఖ వివాదంపై పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ స్పందించారు. ఈ వ్యవహారాన్ని తాను మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎక్కడో కమ్యూనికేషన్ లోపం కనిపిస్తుందని, తొందరలో క్లారిటీ వస్తుందని మీడియా ప్రతినిధులతో చెప్పారు. -
కొండా సురేఖకు బిగ్ షాక్?
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొండా సురేఖను దేవాదాయశాఖ నుంచి తప్పించేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు... -
నా బిడ్డ మాట్లాడిందే కరెక్ట్.. తప్పంతా వాళ్లదే..
-
కొండా సురేఖ ఎపిసోడ్ పై సీఎం రేవంత్..
-
కొండా సురేఖ ఎక్కడికి వెళ్ళింది
-
KSR Live Show: అరెస్ట్ కు స్కెచ్! చిక్కుల్లో కొండా సురేఖ..
-
కొండా సురేఖ, సుమంత్ ఎపిసోడ్ పై స్పందించిన కొండా మురళి
-
కొండా సుస్మిత ఎపిసోడ్.. స్పందించిన రోహిన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూబ్లీహిల్స్‌లో ఉన్న మంత్రి కొండా సురేఖ(konda Surekha) ఇంటి పోలీసులు వెళ్లడంపై బుధవారం రాత్రి హైడ్రామా నెలకొంది. ఈ సందర్బంగా పోలీసులు, డెక్కన్ సిమెంట్, రోహిన్ రెడ్డిపై(Congress DCC Rohin Reddy) కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత(Konda Sushmitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎపిసోడ్‌పై తాజాగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి స్పందించారు.కొండా సుస్మిత పటేల్ ఆరోపణలను రోహిన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘నాపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు. డెక్కన్ సిమెంట్స్ అంశం చెప్తే నేను ఇలాంటి వాటిలో వేలు పెట్టను అని సుమంత్‌కి ముందే చెప్పి పంపేశాను. నేను ఎలాంటి అసాంఘిక పనుల్లో తల దూర్చను.. ఈ విషయంలో నా ప్రమేయం లేదు’ అని చెప్పుకొచ్చారు.సుస్మిత ఆరోపణలు..ఇక, అంతకుముందు.. కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సుస్మిత మాట్లాడుతూ.. సుమంత్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారని తెలిసింది. డెక్కన్ సిమెంట్ వాళ్లను సుమంత్ గన్‌తో బెదిరించారని ఫిర్యాదు ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ ఫిర్యాదుతో అరెస్టు చేసేందుకు వచ్చామని పోలీసులు తెలిపారు. ఆధారాలు ఉంటే చూపించాలని పోలీసులను అడిగాను. ఆధారాలు అడిగితే వరంగల్ నమోదైన మరో కేసులో అరెస్టు చేసేందుకు వచ్చామని అన్నారు. మమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించేందుకు చూస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి కూడా ఈ ఎపిసోడ్లో ఉన్నారని ఆరోపించారు. ఆయన వెనుక ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందా? అంటూ ప్రశ్నించారు. సుమంత్‌ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్టు చేసేందుకే మహిళా పోలీసులు కూడా వచ్చారంటూ కామెంట్స్ చేశారు.బీసీ లీడర్లయిన తమ తల్లిదండ్రుల్ని పార్టీ నుంచి బహిష్కరించేందుకు యత్నిస్తున్నారని ఇదంతా రెడ్డి నాయకులు చేస్తున్న కుట్రగా తెలుస్తోందని కొండా సుస్మిత ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రోహిణ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి హాని ఉన్నప్పటికీ బందోబస్తును తొలగించారని అలాంటప్పుడు సీఎం సోదరులకు మాత్రం గన్మెన్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. -
రేవంతన్నతో గొడవల్లేవ్.. నా బిడ్డ అందుకే అలా మాట్లాడింది: కొండా మురళి
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ(మాజీ) సుమంత్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు గత అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఆమె నివాసం వద్దకు పోలీసులు రావడం, సురేఖ కూతురు సుస్మిత వాళ్లతో వాగ్వాదానికి దిగడం, ఈ క్రమంలో సంచలన ఆరోపణల చేయడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్సీ, సురేఖ భర్త కొండా మురళి స్పందించారు. సుమంత్ వ్యవహారం, కూతురు సుస్మిత వ్యాఖ్యలపై కొండా మురళి గురువారం ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించి స్పందించారు. ‘‘హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు సుమంత్ వ్యవహారంలోనూ ఏం జరుగుతుందో తెలియదు. సెక్రటేరియట్లో కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి నేను ఒక్కసారే వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు.నా బిడ్డకు(సుస్మితను ఉద్దేశించి..) మాట్లాడే స్వేచ్ఛ ఉంది. తాను ఇబ్బంది పడ్డాడని చెప్పింది. అందుకే అలా మాట్లాడి ఉంటుంది. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ కష్టపడ్డాం. నాకు ఎమ్మెల్సీ ఇస్తానని రేవంతన్న హామీ ఇచ్చారు. తప్పకుండా ఇస్తారు కూడా. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే మాకు సంబంధం లేదు. అందరి మంత్రుల ఇండ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది. నేను మంత్రుల వద్దకు వెళ్తాను. పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుని అడుగులు వేస్తా. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ అన్నతో మాట్లాడి సమస్య సాల్వ్ అయ్యేలా చేస్తా. ఎవరి తప్పు ఉన్నా, సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తా. మీడియా ముందు మాట్లాడొద్దని మీనాక్షి నటరాజన్ చెప్పారు. మళ్ళీ మీనాక్షి గారిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతా. మీనాక్షి అమ్మ చెప్పినట్లు వింటాను... నన్ను తిట్టిన వల్లే మళ్ళీ నా కోసం వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్ట్ పనులు కోసం నా దగ్గరకు వచ్చిన వాడే. వేం నరేందర్ రెడ్డి(సీఎం సలహాదారు) నేను కామన్ గా కలుస్తుంటాం. నేను ఎవరికీ టార్గెట్ కాను, నాకు ఎవరూ టార్గెట్ లేరు. నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టం అని మురళి అన్నారు.ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మాజీ ఓస్డీని అర్ధరాత్రి తన కారులో మంత్రి కొండా సురేఖ తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కొండా మురళి పరోక్షంగా స్పందించారు. కొండా సురేఖ హైదరాబాద్‌లోనే ఉన్నారని.. ఈరోజు వరంగల్ తూర్పులో అబ్జర్వర్‌తో ప్రోగ్రామ్ ఉందని, దానికి ఆమె హాజరవుతారని అన్నారాయన. ఇదీ చదవండి: మా అమ్మ అరెస్టుకు కుట్ర జరుగుతోంది: కొండా సుస్మిత -
కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు
-
నన్ను టార్గెట్ చేశారు: కొండా సురేఖ
-
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. దాంతో మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగిన కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత.కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. అయితే సుమంత్ కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తుంది.నిన్న సుమంత్‌ను తన బాధ్యతల నుండి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
అక్కినేని నాగార్జునతో వివాదంపై.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హన్మకొండ: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని దెబ్బతీయాలని కొంతమంది రెడ్లు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం (అక్టోబర్14)ఆమె మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ..‘కొంతమంది రెడ్లు నన్ను దెబ్బతీయాలని చూస్తున్నారు. మంత్రిగా నేను ఏ పనిచేసినా వివాదం చేయాలనుకుంటున్నారు. నాగార్జున విషయంలో నేను మాట్లాడింది వేరు. కానీ దాన్ని వివాదంగా చిత్రీకరించారు. అందుకే మీడియాతో ఓపెన్‌గా ఉండటం లేదు. మౌనంగా నాశాఖ పనులు చేసుకుంటున్నాను’అని వ్యాఖ్యానించారు. -
ఓ మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు
-
Konda Surekha: రేవంత్‌కు ఫిర్యాదు.. ఖర్గేకు లేఖ
సాక్షి, హైదరాబాద్: అడ్లూరి-పొన్నం వివాదం మరువక ముందే.. తెలంగాణలో మళ్లీ మంత్రుల మధ్య లొల్లి మొదలైంది(Telangana Ministers Clash). దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓ మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మేడారం టెండర్ల విషయంలో ఈ ఇద్దరు మంత్రులకు వార్ మొదలైందని తెలుస్తోంది. ఇటీవల మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్.. పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. అయితే.. తన శాఖకు సంబంధించిన రూ.71 కోట్ల పనులను తన మనిషికి ఇప్పించుకునేందుకు ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది మంత్రి కొండా సురేఖ ఆరోపణ. ఈ క్రమంలో సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పలుకీలక అంశాలతో లేఖ రూపేణా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని ప్రచారం బలంగా వినిపిస్తోంది(Konda Surekha Complaint Ponguleti). ఇదిలా ఉంటే.. మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్య చేశారంటూ అడ్లూరి లక్ష్మణ్ ఓ వీడియో రిలీజ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. పొన్నం క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టారాయన. ఈ క్రమంలో సీఎం సూచనతో.. టీపీపీసీ చీఫ్ మధ్యవర్తిత్వం వహించడంతో పొన్నం క్షమాపణలు చెప్పగా ఆ పంచాయితీ ముగిసింది.ఇదీ చదవండి: కోర్టు ఆదేశాలంటే లెక్కే లేదా? -
మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా?
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కుతున్నాయి. పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. తాజాగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి (వరంగల్ తూర్పు ఎమ్మెల్యే) కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. వరంగల్ నగరంలోని భద్రకాళి దేవస్థానం పాలకమండలి నియామకం సందర్భంగా ఏర్పడిన మనస్పర్థలు చినికి చినికి గాలి వానలా మారాయి. నాలుగైదు రోజులుగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడం కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో చేసుకుంటున్న వ్యాఖ్యలు మరోసారి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.రచ్చకెక్కుతున్న కాంగ్రెస్ రాజకీయాలునాలుగు నెలల క్రితం మంత్రి కొండా సురేఖ దంపతులు, ఎమ్మెల్యేల మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఈమేరకు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ కొండా సురేఖ దంపతులపై సీఎం రేవంత్‌రెడ్డికి, టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా ఇరువర్గాలతో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్.. పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు మల్లు రవికి అప్పగించారు. దీంతో ఆయన మంత్రి సురేఖ, కొండా మురళీధర్‌రావుతో పాటు ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడారు. సుమారు మూడు పర్యాయాలు మంత్రి, ఎమ్మెల్యేల మధ్యన నెలకొన్న వివాదం పరిష్కారం కోసం టీపీసీసీ, క్రమశిక్షణ సంఘం వేర్వేరుగా ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ గొడవ సద్దుమణగకపోగా... ఒక దశలో ‘‘వారా.. మేమా’’ తేల్చాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో ఈ అంశంపై క్రమశిక్షణ సంఘం కూడా ఎటూ తేల్చలేకపోగా, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ జోక్యం చేసుకుని మంత్రి, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఆ తర్వాత కొంత స్తబ్ధత నెలకొన్నా పరిస్థితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. అతిథుల మార్పు వెనుక?సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవానికి హాజరయ్యే మంత్రులు/ప్రముఖుల పేర్లను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అయితే ఉమ్మడి వరంగల్‌కు సంబంధించిన కొన్ని జిల్లాలకు ఈసారి స్వల్పంగా మార్పులు చేసింది. గతంలో వరంగల్ కలెక్టరేట్లో రెవెన్యూశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండలో అటవీశాఖమంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొనేవారు. ప్రజాపాలన వేడుకల సందర్భంగా కొండా సురేఖను వరంగల్‌కు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని హనుమకొండ జిల్లాలకు మార్చారు. ఈ మార్పు వెనుక ఇటీవల ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి సురేఖ మధ్య ఉన్న వివాదాలు కారణం కాకపోలేదన్న చర్చ జరుగుతోంది. కాగా ఈసారి ములుగులో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్‌లో ప్రభుత్వ విప్ జె.రామచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల వీ రయ్య, జయశంకర్ భూపాలపల్లిలో తెలంగాణ ఎస్టీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.వ్యాఖ్యల కలకలంసీఎం, టీపీసీసీల జోక్యం తర్వాత గొడవలు సద్దుమణిగినట్లుగానే కనిపించినా.. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య వ్యాఖ్యలు కలకలంరేపాయి. భద్రకాళి ఆలయ పాలకమండలి కమిటీ సందర్భంగా ‘ఏది చేసినా నడుస్తోందని మంత్రి కొండా సురేఖ అనుకుంటున్నారని’ మంత్రిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళి ఆలయ పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారు? అని ప్రశ్నించారు. దేవాదాయశాఖకు మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా? నా నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటి?’ అని నిలదీశారు. అంతా మంత్రి చేస్తే స్థానికంగా తాను ఉన్నది దేనికని.. ఇదే పద్ధతి అవలంబిస్తే తాను చూస్తూ ఊరుకోనని కూడా హెచ్చరించారు. ఇదే సందర్భంలో ‘నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయ్యాడు. నాయిని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న. ఆయనపై నేను కామెంట్ చేయాలనుకోవడం లేదు. మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా?’ అంటూ మంత్రి కొండా సురేఖ స్పందించారు. కేవలం తాము అధిష్ఠానం నుంచి వచ్చిన పేర్లను మాత్రమే భర్తీ చేశామని కూడా వివరించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజేందర్ రెడ్డి.. ‘పూటకో పార్టీ మార్చిన ఘనత మంత్రి సురేఖది. 40 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం నా రక్తం ధారపోశాను. 12 ఏళ్లు ఉమ్మడి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా.. ఎవరైనా అదృష్టం ఉంటేనే ఎమ్మెల్యే అవుతారు. దురదృష్టవంతులు ఓడిపోతారు. మంత్రి బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదు’’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. సొంత పార్టీ నాయకులపై బహిరంగ విమర్శలు చేసుకోవద్దని అధిష్టానం హెచ్చరిస్తుండగా.. ఇక్కడ మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్న చర్చ పార్టీ కేడర్‌లో జరుగుతోంది. -
నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందన
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలని స్పష్టం చేసిందని.. ఈ దేశ న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఈ కేసులు, కొట్లాటలు కొత్త కాదు నాకు. నా జీవితమే ఒక పోరాటం’’ అంటూ చెప్పుకొచ్చిన కొండా సురేఖ.. ఏ కేసులోనైనా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమన్నారు.మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నటి సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్‌పై కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
కేటీఆర్ పరువు నష్టం కేసు.. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నటి సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్‌పై కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.కేటీఆర్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి మనోరంజన్ కోర్టు.. త్వరలో సీసీ నెంబర్ కేటాయించనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కోర్టు నేరంగా పరిగణించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, సమంత విడాకుల వంటి అంశాలపై కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు ప్రాథమికంగా నిరాధారమని కోర్టు భావించింది. కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ పోగుల వాదనలను వినిపించగా.. కోర్టు సమర్థించింది. సాక్ష్యుల వాంగ్మూలాలు, సమర్పించిన పత్రాలు, ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు తేల్చింది. కొండా సురేఖ తరపు న్యాయవాది వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. ఆయన లేవనెత్తిన పలు అంశాలను తిరస్కరించింది. -
‘బీసీ బిల్లుపై అభ్యంతరం ఉంటే అసెంబ్లీలోనే ఎందుకు చెప్పలేదు?’
ఢిల్లీ: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ శాతం కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన బిల్లుపై బీజేపీ వైఖరి సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ బిల్లుపై బీజేపీకి అభ్యంతరం ఉంటే అసెంబ్లీలోనే ఎందుకు చెప్పలేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు. ఫ్యూడల్ ధోరణితో అన్యాయం చేస్తే తిరుగుబాటు చేస్తామని పొన్నం హెచ్చరించారు. ముస్లింల పేరుతో బీసీల నోటి కాడి కూడు లాక్కోవొద్దన్నారు పొన్నం. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రామచంద్రరావుకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారని విమర్శించారు. కిషన్‌రెడ్డి, రామచంద్రరావులు బీసీ వ్యతిరేకులుగా పొన్నం పేర్కొన్నారు. తాము ఏ కుల సర్వే చేసినా....కేంద్రం చేసేది ప్రామాణికం అవుతుందన్నారు.ఆమోదిస్తారా?.. తిరస్కరిస్తారా?రాష్ట్రపతి వద్ద ఉన్న తెలంగాణ బీసీ బిల్లును ఆమోదిస్తారా?, తిరస్కరిస్తారా? అనేది ఏదో ఒకటి చెప్పాలని మరొక మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేయవద్దని, ఈ బిల్లును ఆమోదించేందుకు కిషన్‌రెడ్డి సహకరించాలన్నారు. బీసీ బిల్లును వ్యతిరేకిస్తే బీజేపీకి తెలంగాణలో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు మంత్రి వాకిటి శ్రీహరి. సకల జనుల సమ్మె తరహాలో బీసీలు ఉద్యమిస్తారన్నారు. -
చైసామ్ విడాకులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. కేసు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున (Nagarjuna Akkineni) దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్)లో విచారణ జరిగింది. అగ్రనటుడు నాగార్జున కుమారుడైన హీరో నాగ చైతన్య–సమంత విడాకుల విషయమై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆమె వ్యాఖ్యలతో తన కుటుంబ పరువుపోయిందని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. గైర్హాజరుఈ కేసు విచారణకు ప్రతివాది అయిన మంత్రి కొండా సురేఖ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. పిటిషనర్ నాగార్జున కూడా గైర్హాజరు కావడంతో వారి తరుపున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖ ఢిల్లీ వెళ్లారని వచ్చే విచారణకు హాజరు అవుతారని ఆమె తరఫు న్యాయవాది గుర్మిత్‌సింగ్ కోర్టుకు సూచించారు. దీంతో విచారణను ఈనెల 28కు వాయిదా వేసిన కోర్టు తప్పకుండా ఆ విచారణకు హాజరు కావాలని సూచించింది.ఏం జరిగింది?నాగచైతన్య–సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరు విడిపోవడానికి కేటీఆర్ కారణమన్నారు. నాగార్జున, చైతన్య కలిసి.. సమంతపై ఒత్తిడి తీసుకొచ్చారని, అది నచ్చకే ఆమె విడాకులు తీసుకుందని ఆరోపణలు చేయడం పెను సంచలనమైంది. ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆమె వ్యాఖ్యల్ని సినీ ప్రముఖులు ఖండించారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పడంతోపాటు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అయితే తనకుగానీ, తన కుటుంబానికి కానీ క్షమాపణ చెప్పలేదంటూ.. నాగార్జున కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు.చదవండి: మళ్లీ ఇన్నేళ్లకు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ -
ఎవరికీ భయపడేది లేదు : కొండా మురళి
-
కొండా లేఖ కలకలం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్న లేఖ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. మురళి శనివారం భారీ అనుచరగణంతో ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చి, నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమ య్యారు. కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు శ్యాంమోహన్, జి.వి.రామకృష్ణ, కమలాకర్‌రావులతో గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించి, తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఆ లేఖలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. సీఎం సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి గురించి పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పొంగులేటి మాపై కక్షగట్టారు!: కొండా మురళి క్రమశిక్షణ కమిటీ భేటీకి వెళ్లడానికి ముందే ప్రచారంలోనికి వచ్చిన ఆ లేఖలో తొలుత మంత్రి పొంగులేటి గురించి ప్రస్తావించినట్లు సమాచారం. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సమయంలో దళితులు, గిరిజనులకు ఎక్కువ సీట్లు వచ్చేలా తాను పనిచేశానని, అందుకే జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలు రిజర్వుడ్ కేటగిరీకి వెళ్లాయని తెలిపారు. ఈ పరిణామంతో సీటు కోల్పోయిన కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి.. అందుకు తానే కారణమని చెబుతూ రాజకీయాలకు దూరమయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆయన అల్లుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వచ్చి, ఆ కోపంతో తన సతీమణి, మంత్రి కొండా సురేఖపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డి గతంలో కొండా సురేఖపై పోటీ చేస్తే 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, డీలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయేందుకు కూడా తానే కారణమని నరేందర్‌రెడ్డి కోపం పెంచుకున్నారని లేఖలో పేర్కొనట్లు సమాచారం.మా సాయం పొంది.. మాకే వ్యతిరేకంగా.. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి కూడా కొండా మురళి తన లేఖలో వివరించినట్లు తెలిసింది. వర్ధన్నపేటలో తమ ప్రభావం బలంగా ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో సత్సంబంధాలున్నట్లు తెలిపారు. భూపాలపల్లి నుంచి గత ఎన్నికల్లో తననే పోటీ చేయాలని ప్రజలు కోరినా టీడీపీ నుంచి వచ్చిన గండ్ర సత్యనారాయణకు మద్దతిచ్చామని, ఇప్పుడు ఆయన తమకు వ్యతిరేకంగా ఇతర నేతలతో కలిశారని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ములుగు నియోజకవర్గానికి చెందిన మంత్రి సీతక్కతో తమకు ఎలాంటి విభేదాలు లేవని మురళి తెలిపారు. మంత్రులు సురేఖ, సీతక్క మధ్య గ్యాప్ వచ్చిందని కడియం శ్రీహరి మీడియాలో పెయిడ్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పరకాల పూర్తిగా తమ నియోజకవర్గమేనని, అందులోనే తమ స్వగ్రామం ఉందని గుర్తుచేసిన ఆయన.. ఎన్నికల సమయంలో రేవూరి అభ్యర్థన మేరకు మనస్ఫూర్తిగా సహకారం అందించినట్లు తెలిపారు. అయినా ప్రకాశ్‌రెడ్డి తమకు వ్యతిరేకంగా గూడుపుఠాణీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డట్లు తెలిసింది. నాయిని రాజేందర్‌రెడ్డి (వరంగల్æ వెస్ట్) కూడా ఎన్నికల సమయంలో తమ మద్దతు కోరారని, ఇప్పుడు తమ నియోజకవర్గంలోకి వచ్చి (వరంగల్ ఈస్ట్) ఎలక్ట్రిసిటీ అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుంటున్నారని అభ్యంతరం తెలిపారు. తమ పరిధిలోనికి వచ్చే ఎంజీఎం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. జనగామలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తమతో బాగానే ఉంటున్నారని వెల్లడించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి వచ్చి స్థానిక కాంగ్రెస్ ఇన్చార్జి ఇందిరకు చుక్కలు చూపిస్తున్నారని, కేడర్‌ను టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు. పాలకుర్తిలో యశస్వినిరెడ్డి, డోర్నకల్ రాంచంద్రునాయక్లతో కూడా తమకు ఇబ్బంది లేదని మురళి తెలిపినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇప్పటివరకు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదని తెలిపారు. మా పవర్ గురించి చెప్పాల్సిన పనిలేదుతాము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లు తమతో వచ్చారని, వరంగల్‌లో కొండా దంపతుల పవరేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఆ లేఖలో మురళి పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, ఆ లేఖ గురించి తనకు తెలియదని, బయట ఏం ప్రచారం జరుగుతుందో తన దృష్టికి రాలేదని క్రమశిక్షణ కమిటీ భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొండా మురళి వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
కాంగ్రెస్‌లో పొలిటికల్ వార్.. కొండా సురేఖపై చర్యలు తప్పవా?
సాక్షి, వరంగల్/హైదరాబాద్: వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు.. మంత్రి కొండా సురేఖ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు నేతలందరూ కూటమి కట్టారు. ఇక, తాజాగా హస్తం నేతల పంచాయతీ తాజాగా కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్ వద్దకు చేరుకుంది.వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీనాక్షీ నటరాజన్ భేటీ అయ్యారు. కడియం శ్రీహరి, కార్పొరేషన్ చైర్మన్, ఎర్రబెల్లి స్వర్ణ తదితర నేతలు మీనాక్షి నటరాజన్‌తో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో చర్చలో ఏం చేస్తారు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇప్పటికే వరంగల్ పంచాయతీపై పీసీసీ చీఫ్‌కు సీనియర్ల నివేదిక అందింది. సీనియర్ల నివేదిక ఆధారంగా మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.కొండా మురళి వ్యాఖ్యల ఎఫెక్ట్.. అయితే, ఇన్ని రోజులు మంత్రి కొండా సురేఖ జిల్లాలో నేతలను కలుపుకుని పోవడం లేదన్న అసంతృప్తి ఉంది. ఇదే సమయంలో తాజాగా మంత్రి భర్త కొండా మురళి చేసిన తాజా వ్యాఖ్యలు అగ్గికి మరింత ఆజ్యం పోశాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఒకరిద్దరు నేతల్ని ఉద్దేశించి మురళి కామెంట్స్ చేశారు. పార్టీ మారినప్పుడు పదవులకు రాజీనామాలు చేసి రావాలంటూ.. మురళి అన్న ఆ మాటలే ఎమ్మెల్యేలందర్నీ ఏకం చేసినట్టు చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా.. ఎవరి దారి వారిదే అన్నట్టున్నగా ఉన్న శాసనసభ్యులు.. కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్క తాటి మీదికి వచ్చినట్టు సమాచారం.కొండా మురళి వ్యాఖ్యలతో.. కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి అంతా ఇప్పుడు ఏకమైనట్టు తెలిసింది. కొండా ఫ్యామిలీకి రేవూరి ప్రకాష్‌రెడ్డితో కూడా కయ్యం మొదలైంది. ఇప్పుడు వరంగల్ సిటీలోని ఎమ్మెల్యేలతో పాటు.. కడియం శ్రీహరి లాంటి వాళ్ళంతా కలిసి కొండా దంపతులపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో వీరంతా.. ఢిల్లీ వెళ్ళి అధిష్టానం పెద్దలకు మంత్రి మీద ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. -
‘నా ముందు కూర్చోవడానికి ఆయనకు నామోషీ’
వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నేతలపై కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీలో ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుంటే, మంత్రి కొండా సురేఖ సైతం అదే తరహాలో మాట్లాడారు. కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషని, సీఎం రేవంత్ వద్దకు, పొంగులేటి వద్దకు వెళ్లా తన మీద ఉన్నది లేనిది చెబుతున్నారంటూ విమర్శలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారు కడియం శ్రీహరి. అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు. సీఎం దగ్గరకు, పొంగులేటి వద్దకు వెళ్లి నా మీద ఉన్నది లేనిది చెబుతున్నాడు. తెలుగుదేశంలో నడిపించుకున్నట్లు ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నాడు. నా అదృష్టం ఉంది నేను మంత్రి అయ్యాను. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడు. నన్ను దిగిపోవాలని అనుకుంటే ఎలా?, నా కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదు. కడియం కూతురికి అదృష్టం ఉంది ఎంపీ అయ్యింది. నేను ఆమె ఎంపీ పదవి తీయాలని అంటున్నానా?, అని కొండా సురేఖ ప్రశ్నించారు. భద్రకాళీ టెంపుల్ ఎవరి సొత్తు కాదు..వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్‌రెడ్డికి సురేఖ కౌంటర్ ఇచ్చారు. కొందరు భద్రకాళీ టెంపుల్ తమ సొత్తు అనుకుంటున్నారని, అది ఎవరి సొత్తు కాదనే విషయం తెలుసుకోవాలన్నారు. రాజేందర్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడటం సరికాదు. ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఆగమశాస్త్ర ప్రకారం భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయించుకున్నాం. అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమ్మవారు శాఖాహారీ అని అందరికీ తెలుసు. అక్కడ ఏళ్లుగా పనిచేస్తున్న పూజార్ల అభిప్రాయం తీసుకున్నాం. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తాం’ అని కొండా సురేఖ తెలిపారు. కేంద్రానికి వివక్ష తగదుగోదావరి పుష్కరాల విషయంలో రెండు రాష్ట్రాలను కేంద్రం ఒకేలా సమానంగా చూడాలన్నారు కొండా సురేఖ. పుష్కరాలకు రూ. 200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని, గోదావరి పుష్కరాలు ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతాయన్నారు. భద్రాచలం రాముని పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుందని, ఇక్కడే గోదావరి పుష్కరాలు ఘనంగా జరుగుతాయన్నారు. తెలంగాణ వివక్ష వద్దు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలి.తెలంగాణకు పుష్కరాల కోసం నిధులు ఇప్పించాలి. లేదంటే వారు చేతకాని మంత్రులుగా మిగిలిపోతారు’ అని ఆమె స్పష్టం చేశారు. -
సొంత పార్టీ నేతలకు కొండా సురేఖ భర్త మాస్ వార్నింగ్
సాక్షి, వరంగల్: వరంగల్ కాంగ్రెస్‌లో వార్ ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వంత పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. కనుబొమ్మలు లేని నాయకుడు నాడు టీడీపీని భ్రష్టు పట్టించాడు. మొన్న కేటీఆర్‌ను వెన్నుపోటు పొడిచిండు. ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాడు. మీకు ఇజ్జత్ ఉంటే బయటి పార్టీ నుంచి వచ్చిన నాయకులు మీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి’’ అంటూ కొండా మురళి వ్యాఖ్యానించారు.వరంగల్ పోలీస్ కమిషనర్‌కు చెపుతున్నా.. మీ డిపార్ట్మెంట్లో కోవర్డులు ఉన్నారు. నాకు ఎస్కార్ట్ ఇచ్చిన వారిపై చర్యలు కాదు.. పోలీస్ డిపార్ట్మెంట్లో కోవర్డులపై చర్యలు తీసుకోండి. కొండా మురళి ఉన్నంత వరకు వరంగల్ తూర్పులో రెండో నాయకుడు ఎవరూ ఉండరు. పరకాలలో 75 ఏళ్ల వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి కాళ్లు పట్టుకున్నాడు’’ అంటూ కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘పరకాల నియోజకవర్గంలో నా కూతురు కొండా సుస్మిత పటేల్ రంగప్రవేశం చేయనుంది. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆమె మంత్రి పదవి ఎక్కడికి పోదు’’ అని కొండా మురళి పేర్కొన్నారు. -
పది ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు
సాక్షి, హైదరాబాద్: కేబినెట్లోకి ముగ్గురు కొత్త మంత్రులను తీసుకోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రుల విషయంలో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇన్చార్జి మంత్రులుగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కరీంనగర్), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (ఖమ్మం), కొండా సురేఖ (మెదక్)లను ఆ బాధ్యతల నుంచి తప్పించింది.అలాగే ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా ఉన్న సీతక్కను అక్కడ నుంచి మార్చి.. నిజామాబాద్ జిల్లా ఇన్చార్జిగా నియమించగా, అక్కడి ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్‌కు మార్చింది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురికి జిల్లా ఇన్చార్జిలుగా బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు మార్పులు జరిగిన జిల్లాలతోపాటు మొత్తం పది ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మంత్రి కొండా సురేఖకు అస్వస్థత
-
మంత్రి కొండా సురేఖకు అస్వస్థత
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ అస్వస్థత గురయ్యారు. తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముందు కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సెక్రటరియేట్‌లోని కేబినెట్ హాలులో ఆమె కళ్లు తిరిగి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్రటరియేట్ సిబ్బంది.. వెంటనే పరిశీలించి వైద్యం అందించారు. అయితే ఆమె లోబీపీ వల్ల పడిపోయినట్లు నిర్దారించిన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ఈరోజు(గురువారం) మధ్యాహ్న ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటలపై చర్చతో పాటు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై సమీక్షించనున్నారు. కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఏ నివేదికపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చతో పాటు.. వేములవాడలో కోడెలు మృతిపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. -
‘కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు విజయవంతంగా ముగిశాయి’
హైదరాబాద్: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సరస్వతీ పుష్కరాలు విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు కొండా సురేఖ. ఈ మేరకు మంగళవారం మాట్లాడిన కొండా సురేఖ.. ‘ తెలంగాణ రాష్ట్ర వచ్చిన తొలి పుష్కరాలు అద్భుతంగా జరిగాయి. 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, కాళేశ్వర ముక్తీశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఇందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు, స్థానిక ప్రజలకు, భక్తులకు ధన్యవాదాలు.రాబోయే రోజుల్లో వచ్చే గోదావరి పుష్కరాలను మరింతగా గొప్పగా జరుపుకుందామని తెలియజేస్తున్న. ఈ పుష్కరాలు విజయవంతం కావటంలో కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు , స్థానిక అధికారులు, ఎండోమెంట్ డిపార్టుమెంటు వారికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని కొండా సురేఖ పేర్కొన్నారు.కాగా, మే 15వ తేదీన తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.మాధవానంద సరస్వతీ స్వామి పుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతీ నది వద్ద మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక పూజలు చేశారు. త్రివేణి సంగమం వద్ద పుష్కర్ స్థానం ఆచరించి కుటుంబ సమేతంగా ప్రత్యేక అర్చనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు దంపతులు.మే 15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకూ సరస్వతీ నదీ పుష్కరాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవే తొలిసారి సరస్వతీ పుష్కరాలు వచ్చాయి. రోజుకు లక్ష నుంచి లక్షన్నర వరకూ భక్తులు వస్తారని అంచనా వేసిన అంతకుమించి వచ్చినట్లు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. -
‘సురేఖ వ్యాఖ్యల ఎఫెక్ట్.. రేవంత్ కమీషన్ల సంగతేంటి?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రులు కమీషన్లు తీసుకోకుండా సంతకాలు చేయరు అని మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. దీంతో, ఆమె వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ఏయే మంత్రి ఎంత కమీషన్లు తీసుకున్నారో దర్యాప్తు చేపట్టాలని రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ మంత్రులు కమిషన్లు తీసుకోవడం కామన్ అనడం బాధాకరం. అంటే రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని ఒప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఏయే శాఖ మంత్రి ఎంత తీసుకున్నారో దర్యాప్తునకు ఆదేశించాలి. మంత్రులు తీసుకున్న కమీషన్లు బయట పెట్టాలి అని వ్యాఖ్యలు చేశారు.రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర..ఇదే సమయంలో తిరంగా యాత్రపై మాట్లాడుతూ.. పహల్గాం ఘటనలో 26 మందిని ఉగ్రమూకలు హతమార్చారు. మానవత్వం లేకుండా పిల్లల ముందు తండ్రిని, భార్య ముందు భర్తను పేర్లు అడిగి హతమార్చారు. మానవ సమాజానికే సవాల్ గా మారిన ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్లో 9 ఉగ్రవాద స్థావరాలను పేల్చివేశాం. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేయడం జరిగింది. ఉగ్రవాద చర్యలతో మనదేశం బలవుతూనే ఉంది. జమ్ముకశ్మీర్‌లోనే 46 వేల మందిని ఉగ్రమూకలు బలితీసుకున్నాయి. మన సైనికులు నూతన చరిత్రను ప్రారంభించారు.గతంలో ఉగ్రమూకలు దాడి చేసినప్పుడు.. మరణించినవారి ఫోటో దగ్గర గులాబీ పువ్వు పెట్టడం వరకే పరిమితం అయ్యే వాళ్ళం. 2009లో 40 మందిని ఊచకోత కోశారు. భారత్‌పై దాడి చేస్తే ప్రతీకారం ఎలా ఉంటుందో చూపించాం. ఉగ్రవాదుల శిక్షణ కార్యక్రమాలు, ఉగ్రవాదుల నివాసాలను ధ్వంసం చేశాం. కరడుకట్టిన ఉగ్రవాదులను అంతం చేశాం. పాకిస్తాన్ పిల్ల చేష్టలతో దాడికి ఒడిగట్టింది.. భారత సైన్యం తిప్పికొట్టింది. ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. ఇంకా కొనసాగుతోంది. రక్షణ రంగంలో ప్రతి సైనికుడు రాణించారు. S-400, బ్రహ్మాస్త్రం పనితీరు దేశ ప్రజలు గమనించారు. భారత ఆర్మీకి అన్ని రకాలుగా సమకూర్చడం జరిగింది.ఆర్మీకి అవసరమైన వాటిలో 35 శాతం మనమే సమకూర్చుకున్నాం. మిథానీ, DRDAలో వసతులు మెరుగు పరుస్తున్నాం. ఆర్డినెన్సు ఫ్యాక్టరీలను మరింత సంసిద్ధం చేసుకున్నాం. పాకిస్తాన్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెడతాం. భారత సైనికులు అనుసరించిన స్ట్రాటజీని ప్రపంచం మొత్తం చూసింది. రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆహ్వానిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు
-
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
సాక్షి, వరంగల్ జిల్లా: వరంగల్‌లో నిర్వహించిన మెగాజాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. ఎంకే నాయుడు ఫంక్షన్ హాలఖలో నిర్వహించిన జాబ్ మేళాకు యువత భారీగా తరలి రావడంతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. గేట్ తీయగానే నిరుద్యోగులు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఫంక్షన్ హాల్ ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురు నిరుద్యోగ మహిళలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మంత్రి కొండా సురేఖ జాబ్ మేళాను ప్రారంభించి వెళ్లిన కాసేపటికే ఈ ఘటన జరిగింది.కాగా, 60 కంపెనీల ద్వారా 11 వేల మంది నిరుద్యోగ యువతకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగం కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో కొండా దంపతులు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.ఎన్నికల ముందు చెప్పిన విధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన విధంగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని గత పది సంవత్సరాలలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగాలు లేకుండా పోయాయని మంత్రి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో నిమగ్నమయ్యారని, ప్రతిఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని.. అందుకే జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని కొండా సురేఖ చెప్పారు. -
కన్నీరు పెట్టుకున్న కొండా సురేఖ
-
పెంపుడు కుక్క హఠాన్మరణం.. మంత్రి కొండా సురేఖ కన్నీరుమున్నీరు
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ పెంపుడు కుక్క గుండెపోటుతో మృతి చెందడంతో భావోద్వేగానికి లోనైనా మంత్రి.. కన్నీరుమున్నీరయ్యారు. గుండెపోటుతో చనిపోయిన హ్యాపీకి మంత్రి కొండా కుటుంబం.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హ్యాపీ హఠాన్మరణంతో సురేఖ కుటుంబీకులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.గత కొన్నాళ్లుగా హ్యాపీతో మధుర అనుభూతులను మంత్రి సురేఖ, స్టాఫ్ పంచుకున్నారు. 2021లో కూడా కొండా సురేఖకు చెందిన ఓ పెంపుడు కుక్క మృతి చెందితే ఆ సమయంలోనూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Minister Konda Surekha breaks down in tears over sudden death of pet dog ‘Happy’pic.twitter.com/f87jhedaPA— Naveena (@TheNaveena) March 6, 2025 -
కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ.. ఎందుకంటే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ లేఖ రాశారు. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంబాభిషేకం ఘనంగా నిర్వహించినందుకు సోనియా ప్రశంసించారు. 42 సంవత్సరాల తర్వాత ప్రత్యేక చొరవ తీసుకొని మహా కుంబాభిషేకం నిర్వహించడం హర్షణీయం అన్న సోనియా గాంధీ.. త్రివేణి సంగమం జలాలకి ఎంతో ప్రత్యేకత ఉందని ప్రస్తావించారు.తనకు ప్రసాదాన్ని, త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించిందుకు కొండా సురేఖకు సోనియా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనకి కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి స్థల విశిష్టతను, ప్రశస్థను తెలియజేసినందుకు కొండా సురేఖను సోనియా గాంధీ అభినందించారు. -
మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్: మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి కొండా సురేఖ. చారిత్రక నాయకురాలు రాణి రుద్రమదేవి నుంచి మొదలుకొని నేటి వ్యాపారవేత్తల వరకూ మహిళలు సమాజానికి వెన్నెముకగా ఉన్నారన్నారు. విమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిల్ ఆప్ ఎంట్రపెన్యూన్ అండ బీ2బీ ఎక్స్ పో 2025లో మంత్రి సురేఖ పాల్గొన్నారు. ‘మహిళా సాధికారత సామాజిక పురోగతి మాత్రమే కాదని, ఆర్థిక వృద్ధికి కీలకం. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో లక్ష మంది మహిళా కోటీశ్వరులను తయారు చేయడానికి ప్రభుత్వ చేయూత. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు & నైపుణ్యాభివృద్ధి. వీ-హబ్: దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రం ఆధ్వర్యంలో మహిళా ఆంట్రప్రెన్యూర్ల కోసం తొలి ఇన్క్యూబేటర్. T-IDEA & మహిళల నేతృత్వంలోని వ్యాపారాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు. పాడి, వస్త్రాలు, ఆహార ప్రాసెసింగ్ వంటి రంగాలకు మద్దతు. ఐటీ, సౌరశక్తి, లాజిస్టిక్స్ వంటి రంగాలలో మహిళలను ప్రోత్సహించడం. దేశ వ్యాప్తంగా మహిళా ఆంట్రప్రెన్యూర్లకు COWE మార్గదర్శకత్వం, మద్దతు అందిస్తుండడం అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను బలపరిచేందుకు, రాష్ట్ర ఆర్థిక పురోగతికి నాయకత్వం వహించేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది’ అని కొండా సురేఖ వెల్లడించారు. -
నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరైన మంత్రికొండ సురేఖ
-
నాగార్జున పరువు నష్టం కేసు.. కోర్టుకు మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రి కొండా సురేఖ గురువారం నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. గతంలో తన కుటుంబ వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలకుగానూ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఇవాళ స్పెషల్ జడ్జి ముందు ఆమె హాజరై వివరణ ఇవ్వనున్నారు.ఈ పిటిషన్‌కు సంబంధించి ఇప్పటికే నాగార్జున కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం సేకరించింది కోర్టు. గత వాదనల్లో.. కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు.బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని వాదించారు. అయితే తన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణ చెప్పిన విషయాన్ని సురేఖతరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే మీడియా ముఖంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు, కోర్టుకు సమర్పించిన వివరాలకు పొంతన లేకుండా ఉందని అశోక్ రెడ్డి వాదించారు.ఈ క్రమంలో ఇరువైపులా వాదనల అనంతరం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు పలుమార్లు మంత్రికి సమన్లు జారీ చేసింది. అయితే పలు ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఆమె వివరణ ఇస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇవాళ ఆమె కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు. -
బీఆర్ఎస్ వల్లే ‘ఆప్’ ఓటమి: కొండా సురేఖ
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ పార్టీ భస్మాసుర హస్తమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) పరాజయానికి కారణమని మంతత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం(ఫిబ్రవరి8) వెలువడ్డ ఢిల్లీ ఫలితాలపై కొండా సురేఖ స్పందించారు. ‘ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,కేజ్రివాల్‌ల లిక్కర్ స్కాం ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలకు దూరం చేసింది.ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలనుద్దేశించి రాహుల్‌గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి. ఈ అహంకారాన్ని అణచివేసేందుకే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారు. అధికార పక్షమైన,ప్రతిపక్షమైనా కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ పోరాట పంథానే.కాంగ్రెస్ పార్టీ పరమోన్నత లక్ష్యం ప్రజా సంక్షేమమే’అని కొండా సురేఖ అన్నారు. ‘ఎక్స్’లో కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్..తెలంగాణలో ఎలా పుంజుకున్నామో అలాగే దేశవ్యాప్తంగా గెలుస్తాం.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం మీరు సున్నా సీట్లు తెచ్చుకున్నారు.తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు బీఆర్ఎస్సే కారణం -
నేడు గిరిజన దర్బార్
సాక్షి, ఆదిలాబాద్: నాగోబా జాతర సందర్భంగా శుక్రవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఇందులో ప్రజాప్రతినిధులు పాల్గొనడం లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్బార్‌కు వస్తారని అనుకున్నప్పటికీ కోడ్ నేపథ్యంలో వారు పాల్గొనే అవకాశాలు లేవని చెపుతున్నారు. నాగోబా పూజల్లో మాత్రం మంత్రి సీతక్క పాల్గొంటారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా నాగోబా జాతరలో.. గిరిజన దర్బార్‌కు అత్యంత ప్రాముఖ్యం ఉంది. 1940 కాలంలో గిరిజన పోరాట యోధుడు కొమురంభీం వీర మరణం తర్వాత అప్పటి నైజాం సర్కార్.. గిరిజనుల్లో అసంతృప్తి, తిరుగుబాటుకు కారణం ఏమిటనే విషయంపై పరిశోధన కోసం మానవ పరిణామ శాస్త్రవేత్త, లండన్‌కు చెందిన హైమన్‌డార్ఫ్‌ను నియమించారు. ఆయన అప్పట్లో తన భార్య బెట్టి ఎలిజబెత్‌తో ఇక్కడికి వచ్చి జైనూర్ మండలం మార్లవాయిలో స్థిరపడ్డారు. ఆయన ఆదివాసీల జీవితాలపై పరిశోధించడమే కాకుండా వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారంకోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. గిరిజనుల కోసం విద్య, ఇతర పథకాలను అమలు చేసేలా కృషి చేశారు. ఇదిలా ఉంటే గిరిజనులు అత్యధిక సంఖ్యలో కేస్లాపూర్లో కలుస్తారని, అక్కడ గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని 1942 ప్రాంతంలో హైమన్‌డార్ఫ్ ప్రభుత్వానికి సూచించారు. ఈ దర్బార్‌లో గిరిజనులు అధికారుల వద్ద తమ సమస్యలను చెప్పుకొనేవారు. అధికారుల ద్వారా వారి వినతులు నైజాం సర్కార్ వరకు చేరేవి. ఆ తర్వాత కూడా ప్రభుత్వాలు ఇదే పద్ధతిని కొనసాగిస్తూ వచ్చాయి. నాగోబా జాతరను అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఏటా గిరిజన దర్బార్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఈ దర్బార్‌లో అనేక కౌంటర్లు ఏర్పాటు చేసి గిరిజనుల నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటారు. ఏటా జరిగే ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున గిరిజనులు తరలి వస్తారు. -
మెదక్ జిల్లా వడియారంలో మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం
-
మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం
సాక్షి, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. చెక్కుల పంపిణీ వేదికపైకి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి రావడంతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం నెలకొంది. ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమంలో చిల్లర రాజకీయాలు చేయడానికి సిగ్గు ఉండాలి అంటూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలిమరోవైపు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు, కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇవ్వకుండా ప్రారంభోత్సవాలు నిర్వహించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తన తీరు మార్చుకోవాలని నార్సింగి కాంగ్రెస్ మండల నాయకులు హెచ్చరించారు. శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు బాల్‌రాజ్‌గౌడ్, యాదగిరియాదవ్, ఎస్సీ సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన సీసీరోడ్ల పనులు ప్రారంభించడానికి వచ్చే ఎమ్మెల్యే ఎవరికి సమాచారం ఇవ్వకుండా రావడంపై మండిపడ్డారు.గత ఏడాది ప్రారంభించిన నర్సంపల్లి జీపీ భవనం తిరిగి ప్రారంభించడం ఎందుకని ప్రశ్నించారు. శిలాపలకపై ఇన్చార్జి మంత్రి పేరు పెట్టకపోవడం ఎంటని ప్రశ్నించారు. ప్రభుత్వం నియమించిన ఇందిరమ్మ కమిటీ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వరా అని వాపోయారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాజీ ప్రతినిధులను వెంట బెట్టుకోని ప్రారం¿ోత్సవాల చేస్తే చూస్తూ ఉరుకునేదిలేదని తెలిపారు. -
నాగార్జున పరువునష్టం కేసు.. మంత్రి కొండా సురేఖ గైర్హాజరు!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర మనోవేదనకు గురి చేశాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు మంత్రికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 12న వ్యక్తిగతంగా హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.అయితే ఇవాళ విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత గడువు కావాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయస్థానం ఈ నెల 19కి విచారణను వాయిదా వేసింది. అసలేంటి వివాదం..గతంలో మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో నాగార్జున ఫ్యామిలీపై కామెంట్స్ చేసింది. దీంతో తమ పరువుకు భంగం కలిగేలా మంత్రి మాట్లాడారని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేయగా.. న్యాయస్థానం విచారణకు అనుమతించింది. -
వేములవాడలో బీజేపీ, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ధర్నా
-
మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ
సాక్షి,రాజన్నసిరిసిల్లజిల్లా: మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడ రాజన్న కోడెల వివాదంలో మంత్రి పేరు వినిపిస్తోంది. కోడెల పంపిణీలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. కోడెలు పక్కదారి పడుతున్నాయంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకుల ఆందోళన చేపట్టారు.మంత్రి సిఫారసుతో ఆగస్టు 12న 49 కోడెలను రాంబాబు అనే వ్యక్తికి ఆలయ అధికారులు అప్పగించారన్న ఆరోపణలున్నాయి. మంత్రి మెప్పుకోసం నిబంధనలకు విరుద్ధంగా కోడెలను అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. రైతులకు కేవలం రెండు, మూడు కోడెలు అప్పగించి, మంత్రి సిఫారసుతో రాంబాబు అనే వ్యక్తికి ఏకంగా 49 కోడెలు ఇవ్వడం వివాదాస్పదమైంది.తాను టెండర్ ద్వారా పొందిన 49 కోడెలను ఇప్పటికే రాంబాబు పోలీసులకు వెల్లడించారు. ఈ విషయమై మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.పశువుల వ్యాపారిగా ఉన్న మంత్రి అనుచరుడికి రాజన్న కోడెలు అప్పగించడంపై భక్తులు మండిపడుతున్నారు.నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి కోడెల కేటాయింపుపై విచారణ జరపాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: అది నినాదం కాదు.. కేసీఆర్ ప్రభుత్వ విధానం -
కౌశిక్ రెడ్డిపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌తో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు. పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఆయన గొడవ పడే విధంగా వ్యవహారించాడు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేకపోయే సరికి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారు. ఇన్ని రోజులు పట్టించుకోని వారిని కూడా ఇప్పుడు బయటకు తీసుకువస్తున్నారు.కేసీఆర్‌ను కేటీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిజంగా రాజీనామా చేశారు. మంత్రి వెంకట్‌రెడ్డి గురించి గంధపు చెక్కల వ్యాపారి ఒకరు అగౌరవంగా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుంది. ఇష్టం వచ్చినట్టు ఎవరినా మాట్లాడినా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎవరైనా సరే.. చూస్తూ ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ అధికారాన్ని ఉపయోగించుకోలేదు.. మేము ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టే ఉత్సవాలు చేసుకుంటున్నాం.ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు చెబుతున్నా.. సలహాలు, సూచనలు చేయండి అంతే కానీ అర్ధం పర్థం లేని విమర్శలు ఎందుకు. మా నాయకుల మీద చిలువలు పలువలుగా మాట్లాడితే ఊరుకోము. మీ లాగా మేము అక్రమ అరెస్ట్ చేయదలుచుకుంటే ఒక్కరూ కూడా మిగలరు. ఫోన్ ట్యాపింగ్‌లో మీ హస్తం లేకపోతే అధికారులను దేశాలు ఎందుకు దాటిస్తున్నారు. మీరు చేసేది మంచి అయితే విదేశాల నుండి యూ ట్యూబ్‌లు ఎందుకు నడిపిస్తున్నారు.గతంలో ఉన్నట్లు ఇప్పుడు రాజకీయ సంస్కృతి లేదు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పని చెప్పండి అంతే కానీ లేని పోనీ విమర్శలు చేయకండి. ప్రతిపక్షాలు అంటే జనాలు ఆహ్వానించాలి కానీ జనాలు కేటీఆర్‌ను దగ్గరికి రానివ్వడం లేదు. మేము మళ్ళీ అధికారం లోకి వస్తాము. సంవత్సర కాలం ఓర్చుకున్నాము ఇక ఓర్చుకోము. ఏది పడితే అది మాట్లాడితే క్షమించము. మా పాలన చూసి వాళ్ళు ఓర్చుకోలేక పోతున్నారు. అధికారులు అధికార పార్టీకి తగ్గట్టుగా పని చేస్తారు. ఇప్పటి వరకు యూ ట్యూబ్‌ల విషయంలో చేసిన తప్పులు ఇక చేయము. గతంలో తెలంగాణ తల్లి బొమ్మని దొరసాని లాగా సృష్టించారు. గతంలో కవిత ఫేస్ లాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. మేము మన తెలంగాణ ప్రజల ఆత్మని ఆవిష్కరిస్తున్నాము’ అని కామెంట్స్ చేశారు. -
నా గురించి మాట్లాడే అర్హత మంత్రికి లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలపై తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో కాంగ్రెస్‌కు తెలియదని ధ్వజమెత్తారు. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే వారికి తెలుసని మండిపడ్డారు. ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని సురేఖపై విమర్శలు గుప్పించారు. తన గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత మంత్రికి ఏ మాత్రం లేదని హెచ్చరించారు. కేటీఆర్ గురుకుల బాట అనగానే వెన్నులో చలి పుడుతోందా..? రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. దమ్ముంటే మీరు గురుకులాల మీద బహిరంగ చర్చకు రండి. అంతే కానీ మత్తులో ఉన్న ఈ మతి స్థిమితం లేని మంత్రులను, భజంత్రీలను పంపించి నవ్వులపాలు కాకండి అని సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ సూచించారు.సభ్యత-సంస్కారం- మానవత్వం అంటే ఎంటో తెలియని మీకు, బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే తెలిసిన మీకు,ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన మీకు,నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదు, మంత్రి గారు. రేవంత్… pic.twitter.com/fZd4wh9G5s— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) November 29, 2024 -
ఆర్ఎస్ ప్రవీణ్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు
-
‘ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం’
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాల్లో కుట్రల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని అన్నారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని ఆరోపించారు. అన్ని హాస్టల్స్‌లో ప్రవీణ్ కుమార్ అనుచరులు ఉన్నారని, త్వరలోనే అన్ని విషషయాలు బయటకు వస్తాయని చెప్పారు.బాలిక మృతి బాధాకరం..ఈ మేరకు సచివాలయం మీడియా పాయింట్ వద్ద మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఒక విద్యార్థిని చనిపోయిందని, అది కూడా బాధకరమని అన్నారు. బాధిత విద్యార్థినికి ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయిందని తెలిపారు. బాలిక మృతి విషయాన్ని బీఆర్ఎస్ తమ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తోందని.. ఆమె మృతిపై రాజకీయాలు చేయడం తగదని సూచించారు.‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఒకప్పుడు మాఫియా నడిపారు. సైకో రావు అండ్ బీఆర్ఎస్ గ్రూప్ ప్రభుత్వంపై బట్టకాల్చి వేయాలని చూస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులను సొంత పిల్లల లెక్క ప్రభుత్వం చూడాలి. కానీ గత పదేళ్ళలో ఏనాడు అలా జరగలేదు.అమ్మాయి చనిపోతే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఆదుకున్నారా? గత ప్రభుత్వం హయంలో కస్తూర్బా ఘటన, గురుకులల్లో ఘటనలు, రెండెకెల సంఖ్యలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫుడ్ పాయిజన్, మూసీ, లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ప్రమేయం ఉన్నట్లు అనుమానంగా ఉంది. మల్లన్న సాగర్ ముంపు ప్రజలకు గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. బాధితులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు.అందుకే కేటీఆర్ జైలుకు వెళ్తా అంటున్నారుమహబూబాబాద్లో పసిపిల్లలు ఉన్న వాళ్లను సైతం గత ప్రభుత్వంలో జైల్లో పెట్టారు. పక్కా ప్రణాళికతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలాగ చేస్తున్నారు. ప్రభుత్వం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా నిఘా పెడుతుంది. అన్ని బయటకు వస్తాయి. కేటీఆర్ తప్పులు చేశారు అని ఆయనకు తెలుసు అందుకే జైలుకు వెళ్తా అని ముందే చెప్తున్నారు. కేటీఆర్ ఏనాడు ప్రజలను కలువలేదు..ఇప్పుడేమో స్వాతంత్ర సమర యోధుడు లెక్క మాట్లాడుతున్నారు.’ అని కొండా సురేఖ మండిపడ్డారు.కవితకు ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్..కవిత జైల్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. ఆమె బయటకు రాగానే మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. కేసీఆర్ కవితకు ప్రాధాన్యత ఇస్తున్నారట. కేటీఆర్‌ను పట్టించుకోవడం లేదట. కేసీఆర్ కుటుంబంలో కవిత - హరీష్ రావు ఒక్కటి అయ్యారని చర్చ జరుగుతుంది. బాల్క సుమన్, గాధరి కిషర్ అప్పట్లో ఆర్ ప్రవీణ్ కుమార్‌పై ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి పాల్పడినట్లు అప్పటి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.కేటీఆరే కాదు కేసీఆర్ కూడా జైలుకే..జైలుకు పోవాలని కేటీఆర్‌కు ఉబలాటంగా ఉన్నట్లు ఉంది. సరైన ఆధారాలు దొరికినప్పుడు జైలుకు పంపుతాం. సమయం వచ్చినప్పుడు జైలుకు కచ్చితంగా పోతావు కేటీఆర్. ఆధారాలు రాగానే కవిత జైలుకు వెళ్ళింది. కేటీఆర్ కూడా వెళ్తాడు. కేటీఆర్ మాత్రమే కాదు కవిత - కేసీఆర్ కూడా జైలుకు వెళ్తారు. -
నాగ్ పిటిషన్.. కొండా సురేఖకు బిగ్ షాక్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంతత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. దీని ఆధారంగా.. మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేస్తూ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగార్జున దావా వేసిన విషయం తెలిసిందే.చేసిన ఆరోపణలకుగానూ కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ తర్వాత ‘ఎక్స్’లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారన్నారు.ఎక్స్‌లో మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్టును ఆయన కోర్టు ముందు చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అశోక్‌రెడ్డి అన్నారు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు అని పేర్కొన్నారు. అంతకు ముందు.. కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్.. ఆమె క్షమాపణలు చెప్పినట్లుగా కౌంటర్ దాఖలు చేశారు.అయితే ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. అంతకు ముందు.. నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ.. డిసెంబర్ 12న సురేఖను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: కొండా సురేఖకు ఇదొక గుణపాఠం కావాలి! -
జంతు దాడుల పరిహారం రూ. 20 లక్షలకు పెంపుపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల దాడుల ఘటనల్లో మరణించిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. శుక్రవారం కొండా సురేఖ అధ్యక్షతన అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ గవరి్నంగ్ బాడీస్ సమావేశం జరిగింది.ఈ భేటీలో సురేఖ మాట్లాడుతూ ఆమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ల పరిధిలోని గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున వారిలో విశ్వాసాన్ని కల్పిస్తూ పునరావాస ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించారు. పునరావాసం కోసం తరలించిన కుటుంబాలకు శాశ్వత పట్టాలు అందించాలని, రాకపోకల నిమిత్తం గ్రీన్ పాసులు అందించాలని, స్కూల్ ఏర్పాటు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మంత్రిని కోరారు. సాధారణ అటవీ ఉత్పత్తులను సేకరించే స్థానికులపై మానవత్వం చూపాలని మంత్రి అధికారులకు సూచించారు. అక్కమహాదేవి గుహలు, సలేశ్వరం జాతరకు సౌకర్యాలు దోమలపెంట–శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్లో భాగంగా అక్కమహాదేవి గుహలను సందర్శించే భక్తులకు యాత్రా సౌకర్యాల కల్పనకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతరను భవిష్యత్తులో చేపట్టనున్న సర్క్యూట్లలో చేర్చి ప్రభుత్వపరంగా యాత్రా సౌకర్యాలను కలి్పంచే దిశగా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ భేటీలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతిరెడ్డి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియాల్, పిసిసిఎఫ్ (వైల్డ్ లైఫ్) ఏలూసింగ్, డీసీసీఎఫ్ ఆంజనేయులు(హెడ్ ఆఫీస్), ఓఎస్డీ శంకరన్ పాల్గొన్నారు. -
నాగార్జున పరువు నష్ట దావా కేసులో కోర్టులో ముగిసిన వాదనలు
-
పరువు నష్టం కేసు.. మంత్రిపై క్రిమినల్ చర్యలకు డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ హీరో నాగార్జునపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కినేని నాగార్జున మంత్రిపై పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కొండా సురేఖ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్‌ను నాగార్జున తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టు ముందు చదువు వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని.. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని ఆయన వాదించారు. ఇలాంటి కామెంట్స్ వల్ల నాగార్జున కుటుంబ సభ్యులు మానసికంగా ఎంతో కుంగిపోయారని న్యాయమూర్తికి విన్నవించారు.కొండాసురేఖ లాయర్ వేసిన కౌంటర్‌పై నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కొండ సురేఖ మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని.. నాగార్జున ఫ్యామిలీని కించ పరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని అన్నారు. కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. ఇప్పటికే ఈ కేసులో నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.ట్విటర్లో క్షమాపణలు..అయితే తన కామెంట్స్‌పై మంత్రి కొండా సురేఖ ట్విట్టర్ ద్వారా క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌ను కూడా కోర్టు ముందు నాగార్జున తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి చదివి వినిపించారు. నాగార్జున కుటుంబంపై మంత్రి చేసిన కామెంట్స్ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే మంత్రి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరింది. 'నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ.. మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా.. అన్యద భావించవద్దు' అంటూ కొండా సురేఖ ట్విట్ చేసింది. -
రెండో రాజధానిగా వరంగల్: మంత్రి కొండా సురేఖ
సాక్షి, వరంగల్: దుష్టపాలన అంతమొందించి ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రులు కొండా సురేఖ, సీతక్క మీడియాతో మాట్లాడారు.ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని కొండా సురేఖ తెలిపారు. వరంగల్‌ను తెలంగాణకు రెండో రాజధాని కోసం అడుగులు పడుతున్నాయని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. గతంలో ఇక్కడ నిర్వహించిన రాహుల్ గాంధీ సభ విజయవంతమైంది. ఈ సభ కూడా విజయవంతం చేయాలి’’ అని కొండా సురేఖ పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ పార్టీకే ఆ చరిత్ర ఉంది: మంత్రి సీతక్కబీఆర్ఎస్, బీజేపీకి రాజకీయ లబ్ధి తప్ప వేరే ఆలోచన లేదని.. అందుకే అధికారులపై దాడులు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మేము మంచి పనులు చేస్తే బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. హైడ్రాకు అడ్డుపడుతున్నారు. మీరు చేసిన సకల జనుల సర్వే ఏమైంది?. లిమ్కా బుక్ రికార్డు కోసమే బీఆర్ఎస్ సకల జనుల సర్వే చేసింది. కానీ మేము చేసే కులగణన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడానికే. బీఆర్ఎస్ పార్టీకే మూటలు ఇచ్చిన చరిత్ర ఉంది. దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్. మాకు మూటలు మోసే అలవాటు లేదు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను మెచ్చుకున్నారు.. ఇప్పుడు తిడుతున్నారు..కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నాం. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రగతి సభ నిర్వహిస్తున్నాం. మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదిక వివరిస్తాం. ఆర్టీసీ బస్సులు కూడా మహిళలే నిర్వహించేలా సీఎం చర్యలు చేపడుతున్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యం. ఆరు గ్యారంటీల్లో... ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేశాం’’ అని సీతక్క తెలిపారు. -
కోర్టులో కొండా కౌంటర్..
-
అధికారులు ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు అటవీ అనుమతులివ్వడంలో నిర్లక్ష్యానికి తావు లేదని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆయా ప్రాజెక్ట్‌లకు అటవీ అనుమతుల సాధనలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకంగా మారిందని అన్నారు. శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాలు, అటవీ శాఖల అధికారులతో ఇద్దరు మంత్రులు నిర్వహించిన సమీక్షలో పలు రహదారుల పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా 7 రోడ్డు ప్రాజెక్టుల పనులు, నాలుగేళ్లుగా ఒక ప్రాజెక్టు, మూడేళ్లుగా 20 ప్రాజెక్టులు, ఏడాది కాలంగా 31 ప్రాజెక్టులు అటవీ అనుమతులు లేక ఆగిపోయాయని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గత ఐదేళ్లుగా ఇన్ని అనుమతులు పెండింగ్ లో ఉంటే రెండు శాఖల అధికారులు ఏం చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం నుంచి అనేక రహదారులకు అనుమతులు సాధించినా ఒక్కడ అనుమతులు లేక కొత్త రోడ్ల మంజూరీ గురించి కేంద్రాన్ని అడగడం ఇబ్బందిగా మారిందన్నారు. అటవీ అనుమతుల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా పర్యవేక్షణాధికారులను నియమించాలని ఈ సందర్భంగా అటవీశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియల్లను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.డీఎఫ్ఓల స్థాయిలో 11 అటవీ అనుమతుల ఫైళ్ల ఆలస్యంపై అధికారులను ఆమె ప్రశ్నించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఫైళ్ల పరిష్కారంలో అనవసర జాప్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డికి హామీనిచ్చారు. కాగా, అటవీ అనుమతుల సాధన పర్యవేక్షణకు ఆర్అండ్బీ శాఖ పరిధిలో ఎస్ఈ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమిస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రీజనల్ ఆఫీసర్ తీరు సరికాదు..రాష్ట్ర రోడ్డు ప్రాజెక్టుల అటవీ అనుమతులను పర్యవేక్షించే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ రీజనల్ ఆఫీసర్ త్రినాథరావు చిన్న చిన్న అంశాలపై వివరణలతో కాలయాపన చేయడంపై ఇద్దరు మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అండగా నిలబడాల్సిందిపోయి.. సాంకేతిక కారణాలతో ఫైళ్లను జాప్యం చేయడం తగదన్నారు. -
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కేటీఆర్ నోటీసులు
-
ఎలాంటి ఆధారాలూ లేకుండా దిగజారి మాట్లాడారు: కేటీఆర్
సిటీ కోర్టులు (హైదరాబాద్): మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తనతో పాటు, తమ పార్టీకి కూడా తీవ్ర నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీ రామారావు చెప్పారు. ఆమె వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని, వాటిని విని తాను షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు. తనపై సురేఖ చేసిన కామెంట్లను చూసి పలువురు సాక్షులు తనకు ఫోన్ చేశారని తెలిపారు. కొండా సురేఖ తనపై అసత్య ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారని పేర్కొంటూ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ బుధవారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్, ఎక్సైజ్ కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ తన వాంగ్మూలం ఇచ్చారు. వాస్తవానికి గత వారం విచారణలోనే కేటీఆర్ తన వాంగ్మూలాన్ని ఇవ్వాల్సి ఉండగా..ఆయన కోర్టుకు రాలేకపోవడంతో న్యాయవాదులు వాయిదా కోరారు. జడ్జి ఎస్.శ్రీదేవి విచారణను బుధవారానికి వాయిదా వేయగా కేటీఆర్ హాజరై వాంగ్మూలం ఇచ్చారు. కేటీఆర్‌తో పాటు సాక్షులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌కుమార్, తుల ఉమా, బాల్క సుమన్ కూడా తమ వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు కోర్టుకు హాజరయ్యారు. అయితే సమయం లేకపోవడంతో శ్రవణ్‌కుమార్ వాంగ్మూలం మాత్రమే కోర్టు రికార్డు చేసింది. మిగతావారి వాంగ్మూలం తీసుకునేందుకు వీలుగా విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. బుధవారం నాటి విచారణకు కేటీఆర్ తరఫు న్యాయవాదులు సురేందర్, అరవింద్, సిద్ధార్థ, బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది జక్కుల లక్ష్మణ్ హాజరయ్యారు. తదుపరి విచారణకు సాక్షులు అందరూ హాజరుకావాలని ఆరోజు వారి వాంగ్మూలం తీసుకుంటామని జడ్జి శ్రీదేవి తెలిపారు. కేటీఆర్ వాంగ్మూలం ఇలా.. ‘డబుల్ పీజీ చేసిన నేను తొలుత అమెరికాలో ఉద్యోగం చేశా. 2006లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్ సారథ్యంలో ఉద్యమంలో పాల్గొన్నా. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశా. ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందా. ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించా. వివిధ దేశాల నుంచి కంపెనీలు తీసుకువచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేశా. కేవలం తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా. అలాంటి నాపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. దాదాపు 18 ఏళ్లుగా రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవచేస్తున్న నాపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడంతో, నా గురించి తెలిసిన చాలామంది బాధపడ్డారు. సురేఖ బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా, తీవ్ర ఆవేదన కలిగించేలా ఉన్నాయి. నేను డ్రగ్ అడిక్ట్నని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని, ఇతరులకు డ్రగ్స్ అలవాటు చేస్తానని, సినీ, రాజకీయ నేతలు చాలామంది విడాకులకు నేనే కారణమని.. ఎలాంటి ఆధారాలూ లేకుండా కేవలం పబ్లిసిటీ కోసం అలాంటి వ్యాఖ్యలు చేశారు. నేను అన్నీ చెప్పలేకపోతున్నా. ఫిర్యాదులో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోండి. సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను కూడా కోర్టుకు సమర్పించా. నాపై అసత్య ఆరోపణలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి..’ అని కేటీఆర్ కోర్టును కోరారు. సురేఖ అనుచిత వ్యాఖ్యలతో బాధపడ్డా.. ‘కేటీఆర్ నాకు 2007 నుంచి తెలుసు. ఆయనతో పాటు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశా. 2024 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో చాలా బాధపడ్డా. మా నాయకుడిపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోండి..’ అని శ్రవణ్‌కుమార్ తన వాంగ్మూలంలో కోరారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు బుధవారం కోర్టుకు వచ్చారు. -
కొండా సురేఖ వ్యాఖ్యలతో మనస్తాపం చెందా.. కోర్టులో కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ చేసిన అసత్య ఆరోపణలతో తాను తీవ్ర మనస్తాపం చెందినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణ నిమిత్తం.. ఈరోజు (బుధవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ హజరయ్యారు. ప్రస్తుతం కోర్టు కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తుంది. నాంపల్లి కోర్టుకు కేటీఆర్‌తో పాటు జగదీశ్వర్ రెడ్డి,బాల్క సుమన్, సత్యవతి రాథోడ్‌లు వెళ్లారు. కోర్టులో కేటీఆర్ స్టేట్మెంట్అమెరికాలో ఆరేళ్లు చదువుకున్నానుచదువు పూర్తి అయ్యాక ఇండియా కు తిరిగి వచ్చానుభారత్కు వచ్చాక తెలంగాణ ఉద్యమం జరుగుతుంది2006 ఆగస్ట్ కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారుమళ్ళీ ఉప ఎన్నికలు వచ్చాయి2006 నుంచి 2009వరకు తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీగా పనిచేశానుతెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశాను 2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికలో గెలిచానుఐదుసార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాప్రతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందాను2014లో నేను మంత్రి గా పనిచేశాను2023 వరకు నేను మంత్రిగా ఉన్నాను మంత్రిగా ఉన్న కొండాసురేఖ నాపై లేని పోనీ అసత్య ఆరోపణలు చేసిందినాపై ఇటీవల మంత్రి కొండా సురేఖ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడిందిఆమె చేసిన వాఖ్యలు సమాజంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందిఆమె చేసిన వాఖ్యలు అనేక ప్రచార మధ్యమాల్లో ప్రచారం అయ్యాయినా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసే విధంగా మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ చేసానని వాఖ్యలు చేశారుఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం బాధ్యత గల పదవిలో ఉన్న మహిళ మంత్రి నా పరువుకు భంగం కలిగించేలా వాఖ్యలు చేశారునేను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు ఆరెంజ్ చేస్తా అని కొండా సురేఖ వాఖ్యానించారుసాక్షులు నాకు 18 సంవత్సరాలుగా తెలుసుసాక్షులు కొండా సురేఖ వాఖ్యలను టీవీలో చూసి వారు నాకు ఫోన్ చేశారుకొండ సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల సమాజంలో నా పరువు, ప్రతిష్ట దెబ్బతిన్నదికొండ సురేఖ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వాఖ్యలు చేసి నాతో పాటు బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేశారురాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి వాఖ్యలు చేశారుతనపై సమాజంలో ఉన్న మంచి పేరు ప్రతిష్టాలను దిగజార్చాలానే అలాంటి వాఖ్యలు చేశారుఅన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించానుయూట్యూబ్ లింక్స్, పేపర్ స్టేట్ మెంట్స్ అన్ని కోర్టుకు ఇచ్చానుచట్ట ప్రకారం మంత్రిపై చర్యలు తీసుకోవాలి అని కేటీఆర్ కోర్టుకు స్టేట్మెంట్ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ గురించి కొండా సురేఖ ఏం మాట్లాడారు అని కోర్టు ప్రశ్నించింది. దీంతో ఫిర్యాదు కాపీలో వివరాలు ఉన్నాయని కేటీఆర్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ కాపీలోని వివరాల్నే ప్రామాణికంగా తీసుకోవాలా ? స్టేట్మెంట్ ఇస్తారా ? మరోసారి కోర్టు వివరణ అడిగింది. అందుకు స్పందించిన కేటీఆర్.. కొండా సురేఖ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు. ఆ జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని వివరంగా చెప్పమంటే చెప్తాను అని అన్నారు. అందుకు కోర్టు అనుమతించగా.. కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని కేటీఆర్ చదివి వినిపించారు. నాగ చైతన్య విడాకులకు నేను కారణం అని ఆమె అన్నారుఎన్కన్వెన్షన్ విషయంలో సమంత, నా గురించి లేని పోని విధంగా మాట్లాడారునేను ఫోన్లు ట్యాప్ చేశానని వ్యాఖ్యానించారునేను ఒక డ్రగ్ బానిస అని, ఇతరులను డ్రగ్ తీసుకునేలా ప్రేరేపించనని ఆమే వ్యాఖ్యానించారునా వల్ల పెళ్లిల్లు బ్రేక్ అవుతున్నాయనీ ఆమె అన్నారు. అనంతరం కేసు విచారణ నిమిత్తం కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ సరిపోతుందని కోర్టు తెలిపింది. తర్వాత కేటీఆర్ తరుఫు సాక్షుల స్టేట్మెంట్ను కోర్టు రికార్డ్ చేయడం ప్రారంభించిందికొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ మనస్తాపంఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో కొండా సురేఖ సినీరంగంలోని పలువురిని ప్రస్తావిస్తూ కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలో కొండా సురేఖపై కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో పరువు నష్టం దావా వేశారు.కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తాను తీవ్ర మనస్తాపం చెందానని,కొండా సురేఖపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.కేటీఆర్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్రావు ఇందుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. గత విచారణ సందర్భంగా కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే, అందుకు కేటీఆర్ కొంతసమయం అడిగారు. దీంతో విచారణను నాంపల్లి స్పెషల్ కోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. కేటీఆర్ ఈ రోజు కోర్టుకు హాజరై స్టేట్మెంట్ ఇస్తున్నారు. -
ఇవాళ నాంపల్లి ప్రత్యేక కోర్టుకు కేటీఆర్, కొండా సురేఖ
-
కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. ఇదొక గుణపాఠం కావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వదిలిపెట్టేది లేదంటూ.. కొండా సురేఖపై పరువు నష్టం దావా అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పిరికిపందల మాదిరి తన వ్యక్తిత్వంపైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్.. ఇలాంటి నీచమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఇప్పటిదాకా ఇలాంటి వ్యాఖ్యలను వదిలిపెట్టినా, ఇక పైన మీడియా, సోషల్ మీడియాలో చేసే ఇలాంటి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ప్రజల తాలూకు అంశాలకే తాను ప్రాధాన్యత ఇచ్చాను. ఇతరులపై వ్యక్తిగత ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు ఏనాడూ చేయలేదు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేస్తామంటే ఊరుకునేది లేదు’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు.రాజకీయ విమర్శలపేరు చెప్పి, ఎలాంటి ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కొండా సురేఖపై వేసిన రూ. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలి. న్యాయస్థానాల్లో సత్యం గెలుస్తుందన్న నమ్మకం నాకున్నది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఝలక్ -
ఆలయ భూముల్లోని పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు: మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: కబ్జాల్లో ఉన్న దేవాలయ భూములను స్వా«దీనం చేసుకునే క్రమంలో ఆ భూ ముల ఆక్రమణలో ఉన్న పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆలయాల భూములు స్వాధీనం చేసుకుని దేవుడి పేరుతో పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఆమె సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే 34,092 ఎకరాల ఆలయ భూముల జియోట్యాగింగ్ ప్రక్రియ పూర్తయిందని, రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ఆలయ భూముల హద్దులు నిర్ధారిస్తామని చెప్పారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వే నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఎకో–టెంపుల్ టూరిజం.. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న అటవీ భూముల్లో సుందర ప్రాంతాలను గుర్తించి పర్యాటకులను ఆకట్టుకునేలా ఎకో టూరిజం ప్రాజెక్టును చేపడుతున్నట్టు మంత్రి సురేఖ తెలిపారు. అలాగే దీనిని ఇప్పుడు ఆధ్యాత్మికతకు జోడించి ఆయా ప్రాంతాల్లోని ఆలయాలను అద్భుత పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. దేవాలయాల్లో ఫిర్యాదుల పుస్తకం.. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఫిర్యాదులు నమోదు చేసేందుకు పుస్తకాలను ఏర్పాటు చేస్తామని, వాటిల్లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా పరిష్కార చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వేములవాడ దేవాలయ గోపురానికి కూడా స్వర్ణ తాపడం చేయిస్తామని, ఇందుకు 65 కిలోల ఆలయ బంగారాన్ని వాడతామని ఆమె చెప్పారు. ఆలయంలోని వెండితో పల్లకీ చేయిస్తామన్నారు. అలాగే బాసర దేవాలయాన్ని రూ.110 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంతో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియాల్లు పాల్గొన్నారు. -
యాదగిరిగుట్ట లడ్డూపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి ప్రభుత్వం 60 కిలోల బంగారు తాపడం పెట్టనుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. అక్టోబర్ 18(శుక్రవారం) ఆమె మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రవ్యాప్తంగా అన్ని గుడుల లడ్డూలను టెస్టింగ్‌కు పంపితే యాదగిరి గుట్ట లడ్డూ భేష్ అని రిపోర్ట్ వచ్చింది. వేములవాడ దేవస్థానం మాస్టర్‌ప్లాన్ త్వరలోనే విడుదల చేస్తాం. త్వరలోనే దేవాలయాల్లో 24 రకాల ఆన్లైన్ సేవలను అందించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.వేములవాడ రాజన్నకు 65 కిలోల బంగారంతో తాపడం చేయిస్తాం. బాసర సరస్వతి టెంపుల్ పునర్నిర్మాణం కోసం మాస్టర్‌ప్లాన్ రెడీ అయింది. వేములవాడను రూ.110 కోట్లతో అభివృద్ధి చేస్తాం’అని మంత్రి సురేఖ తెలిపారు.ఇదీ చదవండి: కేటీఆర్,హరీశ్‌రావులకు సీతక్క కౌంటర్ -
కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. నేడు నాంపల్లి కోర్టుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖపై పరువు నష్టం కేసులో నేడు నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. కొండా సురేఖపై పరువు నష్టం కేసులో కేటీఆర్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరుపు న్యాయవాది కోర్టుకు అందజేశారు.బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 356 కింద చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ పిటిషన్లో కోరారు. కేటీఆర్‌తో పాటు నలుగురు సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రావణ్ స్టేట్మెంట్లను న్యాయస్థానం రికార్డు చేయనుంది. హీరో నాగార్జున పిటిషన్‌పై మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ కేటీఆర్ ఈ నెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌ను ఈ నెల 14న విచారించిన కోర్టు విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను నేడు (శుక్రవారం) నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. -
కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత
-
నాకు వారి సపోర్ట్ లేకుండా ఉంటే.. మంత్రి వ్యాఖ్యలపై మరోసారి సమంత
సమంత- నాగ చైతన్యల విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వారిద్దరూ విడిపోవడానికి కారణం మాజీ మంత్రి కేటీఆర్ ఆంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు మహిళా తారల జీవితాలను కేటీఆర్ నాశనం చేశారని కొండా సురేఖ ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ సమంత, అక్కినేని కుటుంబానికి అండగా నిలిచారు. మంత్రి చేసిన ఆరోపణలపై వారు భగ్గుమన్నారు. అయితే, ఈ విషయం గురించి మరోసారి సమంత ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పు బడుతూ.. సౌత్ ఇండియాలోని సినీ నటీనటులు చాలామంది సమంతకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ క్రమంలో నెటిజన్లు, ఆమె అభిమానులు కూడా మద్ధతిచ్చారు. అయితే, తనకు అండగా నిలిచిన వారి గురించి సమంత ఇలా చెప్పారు. 'నా గురించి ద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ నా పక్షాన నిలబడింది. వారందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే దానికి కారణం ఇండస్ట్రీతో పాటు ఈ ప్రజలు నన్ను వదులుకోకపోవడమే.. వారి ప్రేమ, నాపై ఉన్న విశ్వాసమే ఈ వివాదం నుంచి త్వరగా బయటకు వచ్చేలా చేసింది. పరిశ్రమ నాకు సాయం చేయకుండా ఉండుంటే.. దీని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టేది. ఇలాంటి సమయంలో వారే లేకుంటే నేను మరింతగా కుంగిపోయేదానిని. అందరి సపోర్ట్ వల్లే మళ్లీ నేను ఇక్కడ తిరిగి మీ ముందు కూర్చున్నాను.' అని సమంత తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, ఎన్టీఆర్,మహేశ్ బాబు, అల్లు అర్జున్, మాజీ మంత్రి ఆర్కే రోజా తదితరులు భగ్గుమన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. -
వరంగల్ కాంగ్రెస్‌లో పవర్ వార్..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా గడవకుండానే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం వేదికగా పార్టీలో అంతర్గత లుకలుకలు ప్రారంభమయ్యాయి. జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖపై హను మకొండ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీకి ఫిర్యాదులు చేయడం గమనార్హం. పరకాల నియోజకవర్గంలో ఇప్పటికే కొండా సురేఖ, ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిల మధ్య విభేదాలు బహిర్గతం కాగా, ఇప్పుడు పార్లమెంటు పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా జత కలిశారు.మంత్రి సురేఖ తమ నియోజ కవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, తమకు నష్టం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారంటూ వీరంతా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి వినతిపత్రం అందజేశారని, తమ నియోజకవర్గాల్లో కలుగజేసుకోకుండా మంత్రి సురేఖను నియంత్రించాలని కోరారని తెలుస్తోంది. దీనికి ముందు మంగళవారం రాత్రి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని కూడా కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేయడం గమనార్హం. వివాదాస్పదమవుతున్న సురేఖ వ్యవహార శైలిరాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలి ఇటీవలి కాలంలో వివాదాలకు దారితీస్తోంది. సినీ నటుడు నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో వివాదం పార్టీకి తలనొప్పిగా మారింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఇతర ఎమ్మెల్యేలతో సైతం సఖ్యత కొరవడటం తాజాగా చర్చనీయాంశమవుతోంది. దీంతో సురేఖ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆసక్తి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇటీవలి పరిణామాలు ఆమె భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
కొండా సురేఖపై టీపీసీసీకు ఫిర్యాదు
-
కాంగ్రెస్‌లో ‘కొండా’ వర్గం కలకలం.. హస్తినకు హస్తం నేతలు
వరంగల్, సాక్షి: వరంగల్‌లో కాంగ్రెస్ రాజకీయాలు హీటెక్కాయి. రేపు (గురువారం) ఢిల్లీ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పయనం కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ను ఎమ్మెల్యేలు కోరినట్ల సమాచారం. మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ వర్గం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోండా సురేఖపై ఏడుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.చదవండి: TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా -
ఫ్లెక్సీ వార్.. గీసుకొండ పోలీస్ స్టేషన్ కు కొండా సురేఖ
-
ఫ్లెక్సీ వార్.. కొండా సురేఖ వర్సెస్ రేవూరి
సాక్షి, వరంగల్: గీసుకొండ పీఎస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మండలంలోని ధర్మారంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దసరా పండుగను పురస్కరించుకొని ధర్మారంలో కొండా వర్గీయులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని రేవూరి వర్గీయులు నిరసన తెలిపారు.ఈ క్రమంలో ఫ్లెక్సీని ధ్వంసం చేశారని రేవూరి వర్గీయులపై కొండా అనుచరులు దాడి జరిపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గీసుకొండ పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్‌కు వచ్చిన మంత్రి కొండా సురేఖ.. సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు కొండా సురేఖ వర్గీయులు భారీగా చేరుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.గీసుకొండ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. ఇక్కడి వ్యవహారం ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్లింది. పార్టీ వర్గాలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారం కాదు.. స్థానికతకు సంబంధించిన ఇష్యూ.. ఎవరు తొందరపడినా పార్టీకే నష్టం.. సమన్వయం పాటించడం మంచిందని రేవూరి అన్నారు.ఇదీ చదవండి: సునీల్ పోస్టులో తప్పేముంది?.. ఏపీ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ -
మంత్రి పదవి నుంచి ‘కొండా’ను తప్పిస్తారా? పీసీసీ చీఫ్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) పార్టీతో స్నేహం వేరు.. శాంతిభద్రతలు వేరని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆయన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌పై దాడి విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘‘దాడుల విషయంలో కఠినంగా ఉంటాం. పార్టీలో నేతల చేరికలు జరిగిన చోట కొంత ఇబ్బంది అవుతుంది. అందుకే చేరికలకు బ్రేక్ వేశాం. దసరాకు రెండో విడత కార్పోరేషన్ పదవులు అనుకున్నాం. కానీ కుదరలేదు. దీపావళి లోపు పూర్తి చేస్తాం. త్వరలోనే జిల్లా పర్యటనకు వెళ్తాను భావితరాల భవిష్యత్ కోసమే హైడ్రా, మూసీ అభివృద్ధి. మూసీ అభివృద్ధికి రు. లక్షా యాబై వేల కోట్లని ఎక్కడా మేం చెప్పలేదు.పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందేళ్ల దోపిడీ జరిగింది. ఏఐసీసీ నేతలంత బిజీబిజీగా ఉండడం వల్లే మంత్రివర్గం, పీసీసీ కార్యావర్గం ఆలస్యం అయింది. త్వరలోనే రెండు భర్తీ చేస్తాం. మంత్రి కొండా సురేఖ ఇటీవల తన వాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. ఆరోజే ఆ వ్యవహారం క్లోజ్ అయింది. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారని ప్రత్యర్ధులు చేస్తున్నది ప్రచారం మాత్రమే. వాస్తవం కాదు. ఈ విషయంపై అధిష్టానం ఎటువంటి వివరణ అడగలేదు’’ అని అన్నారు. -
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు
సిటీ కోర్టులు: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ గురువారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్, ఎక్సైజ్ కోర్టులో జరిగింది. హీరో నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన మాటలు మాట్లాడారని, ఆమె తమ కుటుంబ పరువు తీసేలా మాట్లాడినందుకు ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హీరో నాగార్జున మంత్రిపై పరువునష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.అయితే గత విచారణలో ఫిర్యాదుదారు నాగార్జునతో పాటు మరో సాక్షి సుప్రియా వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన స్పెషల్ జ్యుడీíÙయల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఎక్సైజ్ కోర్టు జడ్జి ఎస్. శ్రీదేవి మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. ఆరోజు కొండా సురేఖ కోర్టుకి హాజరైతే ఆమె వాంగ్మూ లాన్ని కోర్టు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ కేసు విచారణకు నాగార్జున తరఫున న్యాయ వాది అశోక్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ తరఫున న్యాయవాది, టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ తిరుపతి వర్మ హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు మంత్రి కొండా సురేఖపై మరో పరువు నష్టం కేసు దాఖలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్, ఎక్సైజ్ కోర్టులో సెక్షన్ 356 కింద పరువునష్టం కేసు దాఖలు చేశారు. మంత్రి పదవిలో ఉండి.. స్థాయిని మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, తన ప్రతిష్ట దెబ్బతినేలా ఆమె మాట్లాడారని కేటీఆర్ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా, అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తనపై అసత్యపు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువునష్టం కేసు దాఖలు చేస్తామని లీగల్ నోటీసు కూడా జారీ చేశామని పేర్కొన్నారు.అయితే లీగల్ నోటీసు గడువు తీరినా ఆమె క్షమాపణ చెప్పలేదని, అందుకే ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కేసు దాఖలు చేసినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. కొండా సురేఖ గతంలో కూడా అసత్యపు ఆరోపణలు, అడ్డగోలు వ్యాఖ్యలు చేసినప్పుడు భారత ఎన్నికల సంఘం ఆమెకు చీవాట్లు పెట్టిందని, ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయపరమైన వ్యాఖ్యలు మాత్రమే కావని, తన పరువుకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికా బద్ధంగా చేసిన కుట్రగా ఉన్నాయని ఆయన తెలిపారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను, వాటి వెనుక ఉన్న నేరపూరిత దురుద్దేశాలను పరిగణనలోకి తీసుకొని ఆమెపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్ సోమవారం జడ్జి ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం అక్కినేని నాగార్జున కుటుంబం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ క్రమంలో మంత్రి తమ కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారని నాగార్జున కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు.రాజకీయ లబ్ధి కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే, తాజాగా స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది.కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. రాజకీయ పరంగా మాజీ మంత్రి కేటీఆర్‌ను దూషించే క్రమంలో సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి, అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణం అయ్యాయి. -
రాజకీయ లబ్ధికి మా పరువు తీశారు
సిటీ కోర్టులు: రాజకీయ లబ్ధి కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలేనని.. వాటిలో ఎలాంటి నిజం లేదన్నారు. మంత్రిపై వేసిన క్రమినల్ పరువునష్టం కేసు విచారణలో భాగంగా మంగళవారం నాగార్జున తన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజి్రస్టేట్ ఎక్సైజ్ కోర్టుకు హాజరయ్యారు. జడ్జి ఎస్.శ్రీదేవి ఎదుట ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా గౌరవప్రదంగా జీవిస్తున్నాఅక్కినేని వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాల గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిసున్నానని నాగార్జున కోర్టుకు తెలిపారు. నటుడిగా, నిర్మాతగా, టీవీ వ్యాఖ్యాతగా, స్టూడియో యజమానిగా తాను, తన కుటుంబం ప్రజల ఆద రాభిమానాలు పొందుతున్నామన్నారు. తన కుమారుడు నాగచైతన్య సైతం సినీ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నాడ న్నారు. కానీ తన కుమారుడి వైవాహిక జీవితాన్ని ఉద్దేశించి కొండా సురేఖ మాట్లాడిన మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించాయని పేర్కొన్నారు.ఇందుకు సంబంధించిన వీడియోలు, పేపర్ క్లిప్పింగ్‌ల వల్ల తమ కుటుంబం పరువు పోయిందని.. తాము ఎంతో కలత చెందామని చెప్పారు. అందుకే మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకుని తమ కుటుంబ పరువు కాపాడాలని కోరారు. నాగార్జునతోపాటు ఆయన తరఫు సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేసింది. అనంతరం నాగార్జున తరుఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కొండా సురేఖ మాట్లాడిన వీడియోతో కూడిన పెన్‌డ్రైవ్, పేపర్ క్లిప్పింగ్‌లను మెమోతోపాటు కోర్టుకు సమరి్పంచారు. సాక్షుల స్టేట్మెంట్ సమయంలో కొండా çసురేఖ తరుఫు న్యాయవాది, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ, సురేఖ కూడా హాజరయ్యారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. -
కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా
కొన్నిరోజుల క్రితం అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్త పెద్ద రచ్చకు కారణమయ్యాయి. ఒకరిపై ఒకరు పిటిషన్లు వేసుకునేంత వరకు వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా పిటిషన్ విషయమై నాంపల్లి కోర్టుకు మంగళవారం హాజరయ్యారు. ఈ క్రమంలోనే న్యాయస్థానానికి నేరుగా తన స్టేట్మెంట్ ఇచ్చారు. సాక్షులుగా యార్లగడ్డ సుప్రియ, అట్ల వెంకటేశ్వర్లు హాజరయ్యారు. నాగచైతన్య, అమల, సుశీల కూడా కోర్టుకు వచ్చారు.(ఇదీ చదవండి: త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్)నాగ్ ఏం చెప్పారంటే?ఈ పిటిషన్ ఎందుకోసం ఫైల్ చేసారని కోర్ట్ ప్రశ్నించగా.. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాద పూర్వక వాఖ్యలు చేశారని, తద్వారా మా కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని చెప్పారు. సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, దేశవ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయని, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని నాగార్జున అన్నారు.సినిమా రంగం తో పాటు సామజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నామని చెప్పిన నాగార్జున.. మాజీ మంత్రి కేటీఆర్ వల్ల మా కొడుకు విడాకులు తీసుకున్నాడని మంత్రి అసభ్యంగా మాట్లాడారని, అలా మాట్లాడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని అన్నారు. బీఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని నాగార్జున కోరారు.విచారణ వాయిదాసాక్షిగా వచ్చిన సుప్రియ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో మా కుటుంబం మొత్తం షాక్ గురయ్యము. ఇలా మా కుటుంబం గురించి ఎందుకు ఇలా మాట్లాడారో అర్ధం కాలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాం. మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ని 10వ తేదీన రికార్డ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.(ఇదీ చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందని హీరోయిన్) -
నేడు నాంపల్లి కోర్టుకు హీరో నాగార్జున
సాక్షి,హైదరాబాద్:మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటిషన్‌పై మంగళవారం(అక్టోబర్8) నాంపల్లికోర్టులో విచారణ జరగనుంది. నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఆయన కోర్టుకు హాజరుకానున్నారు.నాగార్జున వేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. తమ కుటుంబ గౌరవం, ప్రతిష్ఠ దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయంటూ పిటిషన్లో నాగార్జున పేర్కొన్నారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు.కాగా, ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించడంలో భాగంగా నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కొండాసురేఖపై సోషల్‌మీడియాలో విమర్శలు గుప్పించారు. ఇదీ చదవండి: సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు -
నాగార్జునకు మద్దతిస్తే కేసులు వేస్తామంటూ కొండా సురేఖ లాయర్ హెచ్చరిక
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. తన కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆయన పరువునష్టం పిటిషన్ వేశారు. ఈమేరకు సోమవారం విచారణ జరిగింది. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానాన్ని నాగార్జున ఆశ్రయించారు. అయితే, న్యాయస్థానంలో మరోసారి విచారణ వాయిదా పడింది.నేడు నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున్ పిటీషన్‌పై మరోసారి విచారణ జరగనుంది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. అక్టోబర్ 8న నాగార్జున వాగ్మూలం రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం కోర్ట్‌కు నాగార్జున హాజరుకానున్నారు. ఇదే సమయంలో సాక్షుల స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. ఇదీ చదవండి: ఆ ఫోటోలన్నీ ఫేక్.. దర్శన్ కేసులో కీలక మలుపుఅయితే, నాగార్జున మీదే కేసులు వేస్తామని మంత్రి కొండా సురేఖ తరుపున వాదనలు వినిపిస్తున్న లాయర్ హెచ్చరించారు. అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకింత రాద్దాంతం చేస్తున్నాడు..? అని ఆయన ప్రశ్నించారు. నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీంతో నాగార్జున అభిమానులు కూడా మండిపడుతున్నారు. బాధితుడి మీదే కేసులు వేస్తామని ఎలా వార్నింగ్‌లు ఇస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు.


