సీఎం పరకాల పర్యటనకు కొండా సురేఖ దూరం.. ! | Minister Konda Surekha Skips CMs Parkal Visit | Sakshi
Sakshi News home page

అందుకే కొండా సురేఖ దూరంగా ఉన్నారా?

Aug 16 2026 9:12 PM | Updated on Aug 16 2026 9:58 PM

Minister Konda Surekha Skips CMs Parkal Visit

పరకాల: ఒకవైపు సీఎం రేవంత్‌ పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం.. మరొకవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి పోటీచేస్తారని రేవంత్‌ వ్యాఖ్యలు.. వీరి మధ్య దూరం పెరిగిందనే వాదనకు బలం ఇస్తోంది. తాజాగా సీఎం రేవంత్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కార్యక్రమాలకు మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. 

దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే మేడారం సమ్మక్క-సారలమ్మ అభివృద్ధి పనులను పరిశీలించారు సీఎం రేవంత్‌. మరొకవైపు రేవంత్‌ పరకాల సభలోనూ కొండా సురేఖ కనిపించలేదు. దాంతో  ఈ అంశం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. 

మరొకవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి పోటీ చేస్తారని రేవంత్‌ చెప్పడం మరింత హాట్‌ టాపిక్‌ అయ్యింది. రేవూరిని ఆశీర్వదించాలని కూడా రేవంత్‌ పిలుపునిచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేస్తానని కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలకు కొండా సురేఖ దూరంగా ఉన్నారనే చర్చ మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement