లక్ష్మీదేవి విగ్రహం.. గులాబీ రాయి.. భారీ స్కెచ్ | Fake Lakshmi Idol Scam Busted | Sakshi
Sakshi News home page

లక్ష్మీదేవి విగ్రహం.. గులాబీ రాయి.. భారీ స్కెచ్

Aug 16 2026 7:30 PM | Updated on Aug 16 2026 7:30 PM

Fake Lakshmi Idol Scam Busted

హైదరాబాద్‌: నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, మహిమలు ఉన్నాయంటూ ప్రచారం చేసిన ఒక రాయిని అధిక ధరలకు విక్రయించి అమాయకులను మోసం చేసేందుకు యత్నిస్తోంది ఓ ముఠా. ఆ ఆరుగురి ముఠాను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఉమ్మడిగా దాడి చేసి పట్టుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు. శనివారం (ఆగస్టు 15) కాటేదాన్‌లోని లక్ష్మీగూడ ప్రాంతంలో కొనుగోలుదారుల కోసం వేచి చూస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి నిర్వహించారు.

పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటకు చెందిన కేతావత్ రాజు అలియాస్ కట్టప్ప, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతానికి చెందిన పి.నరసింహ, వడత్య కుమార్, ప్రవీణ్ సింగ్, మంగళి బసవ నరేశ్‌, వేములవాడకు చెందిన సిద్ధాంతి చల్లా రవి ఒక ముఠాగా ఏర్పడ్డారు.

పి.నరసింహ అనే వ్యక్తి 2024లో వేములవాడకు చెందిన చల్లా రవి, కొండపల్లి భిక్షపతి నుంచి నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాన్ని రూ.10,00,000కు కొనుగోలు చేసి మోసపోయాడు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని వడత్య కుమార్‌కు అందజేశాడు. దాంతో తామంతా ఒక గుంపుగా ఏర్పడి, ఆ నకిలీ విగ్రహానికి దివ్యశక్తులు ఉన్నాయని, అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్మబలికి అమాయకులకు భారీ ధరలకు విక్రయించాలని ప్లాన్ చేశారు.

ఇదే సమయంలో కేతావత్ రాజు తన వద్ద ఒక అరుదైన గులాబీ రంగు రాయి ఉందని, దాన్ని కూడా అధిక ధరకు విక్రయించవచ్చని భావించి ముఠాలో చేరాడు. శనివారం కాటేదాన్, లక్ష్మీగూడ సమీపంలో ఈ నకిలీ విగ్రహం, రాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

అరెస్ట్ అయిన నిందితులు:

కేతావత్ రాజు అలియాస్ కట్టప్ప (38): కార్ డ్రైవర్, చౌదూర్ (గ్రామం), నవాబ్‌పేట, మహబూబ్‌నగర్ జిల్లా.

వడత్య కుమార్ (34): కార్ డ్రైవర్, లక్ష్మీగూడ, కాటేదాన్, హైదరాబాద్.

ప్రవీణ్ సింగ్ (34): డ్రైవర్, మధుబన్ కాలనీ, కాటేదాన్, హైదరాబాద్.

మంగళి బసవ నరేష్ (38): కార్మికుడు, లక్ష్మిగూడ, కాటేదాన్, హైదరాబాద్.

పి. నరసింహ (45): కార్ డ్రైవర్, లక్ష్మిగూడ, కాటేదాన్ (స్వస్థలం: లోయపల్లి, మంచాల్, రంగారెడ్డి జిల్లా).

చల్లా రవి (38): జోతిష్యుడు, చీర్లవంచ, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా.


స్వాధీనం చేసుకున్న సొత్తు:

నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం

గులాబీ రంగు రాయి (Pink Colour Stone)

ఎర్టిగా (Ertiga) వాహనం (TS 04 B 0549)

5 మొబైల్ ఫోన్లు

3 రసాయన ద్రావణాల బాటిళ్లు (Unknown Liquid Bottles)

2 ఎరుపు రంగు తువాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement