పది ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులు | Telangana Appoints Incharge Ministers for 10 Erstwhile Districts | Sakshi
Sakshi News home page

పది ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులు

Jun 13 2025 5:44 AM | Updated on Jun 13 2025 5:44 AM

Telangana Appoints Incharge Ministers for 10 Erstwhile Districts

జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాధ్యతల నుంచి ఉత్తమ్, కోమటిరెడ్డి, కొండా సురేఖలను తప్పించిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: కేబినెట్‌లోకి ముగ్గురు కొత్త మంత్రులను తీసుకోవడంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రుల విషయంలో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇన్‌చార్జి మంత్రులుగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కరీంనగర్‌), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (ఖమ్మం), కొండా సురేఖ (మెదక్‌)లను ఆ బాధ్యతల నుంచి తప్పించింది.

అలాగే ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న సీతక్కను అక్కడ నుంచి మార్చి.. నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జిగా నియమించగా, అక్కడి ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్‌కు మార్చింది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురికి జిల్లా ఇన్‌చార్జిలుగా బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు మార్పులు జరిగిన జిల్లాలతోపాటు మొత్తం పది ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement