విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఉట్నూర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సాక్షి, ఆదిలాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అటవీశాఖ మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యలకు మంత్రే బాధ్యత వహించాలని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో శనివారం పర్యటించిన ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బేషరతుగా మంత్రి కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కృషిని మరవద్దన్నారు.
అంతకు ముందు ఉట్నూర్‌లోని బాలికల ఆశ్రమ పాఠశాలను లక్ష్మణ్ సందర్శించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు, జుంబా, ఏరోబిక్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మంత్రి చేతుల మీదుగా విద్యార్థినులకు యూనిఫాం, కిట్లను అందజేశారు.
అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు భోజనం చేశారు. కేబీ కాంప్లెక్స్‌లో మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సంతోష్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు.
కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందే
విప్‌లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, రాంచంద్రునాయక్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వ విప్‌లు సీహెచ్ విజయరమణారావు, ఆది శ్రీనివాస్, రాంచంద్రునాయక్ డిమాండ్ చేశారు. రాష్రా ్టన్ని గాడిలో పెట్టేందుకు రోజుకు 18 గంటలు శ్రమిస్తోన్న సీఎం రేవంత్‌రెడ్డికి తాము అండగా ఉంటామన్నారు. శని వారం సీఎల్పీ మీడియా హాల్‌లో ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్, నవీన్ యాదవ్ తో కలిసి విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడుతూ కొండా సుస్మిత అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యు రాలే కాదని, ఆమె చేసిన వ్యాఖ్యలకు తల్లిగా సురేఖ బాధ్యత తీసుకోవాల్సిందని అభిప్రా యప డ్డారు.
సురేఖ క్షమాపణలు చెప్పాల్సిందని, అలా చెప్పకపోవడం, కనీసం ఖండించక పోవడం దారుణమన్నారు. విజయ రమణా రావు మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి కొందరు ఇష్టారాజ్యాంగా మాట్లాడు తున్నా రని, పదవులు అనుభవిస్తూనే ప్రభు త్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిప డ్డారు. కుటుంబ సభ్యురాలు అసభ్యంగా మా ట్లాడితే ఖండించకపోగా పరోక్షంగా మద్ద తిచ్చేలా సురేఖ తీరు ఉందని రాంచంద్రు నాయక్ ఆరోపించారు. ఆమె నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే బాగుంటుందన్నారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎంపై బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్‌ఠాకూర్, నవీన్ యాదవ్ డిమాండ్ చేశారు.


