కాంగ్రెస్‌లో భూకంపం.. తన వ్యాఖ్యలపై సుస్మితా పటేల్ వివరణ | Konda Sushmitha on her remarks against Revanth Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో భూకంపం.. తన వ్యాఖ్యలపై సుస్మితా పటేల్ వివరణ

Aug 20 2026 9:11 PM | Updated on Aug 20 2026 9:14 PM

Konda Sushmitha on her remarks against Revanth Reddy

వరంగల్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ చెప్పారు. తన వ్యాఖ్యలతో కొండా సురేఖకు ఎటువంటి సంబంధమూ లేదని తెలిపారు. రాజకీయంగా ఒకే కుటుంబంలో కూడా అభిప్రాయభేదాలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్‌ హై కమాండ్‌పై తనకు నమ్మకం ఉందని తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే గౌరవమని చెప్పారు.

కాగా, రేవంత్‌ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అంతకుముందు, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో పార్టీలో ఒక్కసారిగా మంటలు రేగాయి. మళ్లీ పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఆశీర్వదించాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

దీంతో  కొండా సుస్మితా పటేల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డితో రేవంత్‌రెడ్డి రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోయినా తాను పరకాల నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement