సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో నిర్లక్ష్యంపై చర్యలు చేపట్టింది. ఎఫ్‌ఐఆర్ నమోదులో అలసత్వం వహించారంటూ సీఐపై వేటు వేసింది. సుమంత్‌ను పట్టుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకు ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకుంది. మూడు వారాల క్రితమే జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా ముత్తు యాదవ్ బాధ్యతలు చేపట్టారు.
కాగా, హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు మూడు బృందాలు ఏర్పాటు చేయగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. గత నెల 30న జూబ్లీహిల్స్ లోని తన కార్యాలయానికి సుమంత్ సహచరులు రాము డబ్బు వ్యవహారంలో మాట్లాడేందుకు చెంగిచెర్ల కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ని పిలిపించారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు
అక్కడే ఉన్న సుమంత్ ఆయన అనుచరులు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాము తదితరులు ఇనుపరాడుతో తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న సుమంత్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. ఆయన డ్రైవర్ నవీన్ ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


