
తన తల్లిదండ్రులకు ఏమైనా హానీ జరిగితే సీఎం రేవంత్‌రెడ్డిదే బాధ్యత అంటున్నారు తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కుమార్తె సుస్మిత. మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అడ్డం పెట్టుకుని తమను వేధిస్తున్నారని ఆరోపించారు. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన పోలీసులను ఆమె అడ్డుకున్నారు.
బుధవారం రాత్రి ఆమె తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ''బీసీ లీడర్లను, మమ్మల్ని తొక్కడానికి ట్రై చేస్తున్నారు. ఎక్స్‌టార్సన్ కేసు అంటున్నారు. ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్నను తీసుకొద్దామని ట్రై చేస్తున్నారని నా డౌట్. ఆ డౌట్‌లో మాత్రం మానాన్నకు కానీ, మా అమ్మకు కానీ ఎటువంటి హాని జరిగినా పూర్తి బాధ్యత రేవంత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోహిన్ రెడ్డిలదే. వీళ్లందరు మాత్రం బాధ్యత వహించాలి. నేను ముందే చెబుతున్నా.
ఇది కాంగ్రెసా, తెలుగుదేశమా తెలుస్తలేదండీ. రెడ్ల రాజ్యం నడుస్తోంది. బీసీ నినాదమేమో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎత్తుకుంటే.. ఇక్కడ బీసీ మంత్రి ఇంటికి టాస్క్‌ఫోర్స్ సీఐ వస్తడా? అసలు ఎక్కడైనా ఉందా? ఎంత సిగ్గుమాలిన చర్య? ఒక ముఖ్యమంత్రి సిగ్గుపడాలి దానికి. ఒక బీసీ లేడీ లీడర్ ఇంటికి రాత్రి తొమ్మిదింటికి ఒక టాస్క్‌ఫోర్స్ సీఐ వచ్చిండంటే ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. అయామ్ టెల్లింగ్ ఆన్ మీడియా'' అంటూ సుస్మిత ఫైర్ అయ్యారు. కాగా, నిన్నరాత్రి తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని గురువారం మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు కొండా సుస్మిత.
చదవండి: కొండా సురేఖ వివాదం.. అసలేం జరిగింది?