
సాక్షి,హన్మకొండ: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని దెబ్బతీయాలని కొంతమంది రెడ్లు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం (అక్టోబర్14)ఆమె మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ..‘కొంతమంది రెడ్లు నన్ను దెబ్బతీయాలని చూస్తున్నారు. మంత్రిగా నేను ఏ పనిచేసినా వివాదం చేయాలనుకుంటున్నారు. నాగార్జున విషయంలో నేను మాట్లాడింది వేరు. కానీ దాన్ని వివాదంగా చిత్రీకరించారు. అందుకే మీడియాతో ఓపెన్‌గా ఉండటం లేదు. మౌనంగా నాశాఖ పనులు చేసుకుంటున్నాను’అని వ్యాఖ్యానించారు.