Live Updates

కొండా సురేఖకు బిగ్ షాక్?
కొండా సురేఖ అంశంపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- రాష్ట్ర ఇన్‌ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లాం: మహేష్ గౌడ్
- ఎక్కడో కమ్యూనికేషన్ లోపంగా కనిపిస్తుంది
- సాయంత్రం లోగా ఈ విషయంపై క్లారిటీ వస్తుంది
2025-10-16 14:26:37
కొండా సురేఖ అంశంపై స్పందించిన బీజేపీ రామచంద్ర రావు
- బీజేపీ చీఫ్ రామచంద్ర రావు కామెంట్స్..
- సిమెంట్ ఫ్యాక్టరీని బెదిరించడంలో పెద్దవారి హస్తముందని కొండ సురేఖ కుటుంబ సభ్యులు చెబుతున్నారు
- దీని వెనుక ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాలి
- కాంగ్రెస్ అంటేనే కరప్షన్
- కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయట పెట్టాలి
- బలవంతంగా కాంగ్రెస్ వసూల్ చేస్తుంది
- సీఎంపై ఆరోపణలు చేసింది కేబినెట్ మినిస్టర్ కుటుంబ సభ్యులే
- దోచుకున్న సొమ్మును పంచుకోలేక దంచుకొని తన్నుకుంటున్నారు
- కొండ సురేఖ కుమార్తె మాట్లాడిన విషయంపై విచారణ జరపాలి
- దోచుకునే లీడర్లు ఎక్కువ రోజులు ఉండొద్దు
- కాంగ్రెస్ నాయకులు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు
- అందుకే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయొద్దు
2025-10-16 13:05:50
అధిష్టానం మాతో మాట్లాడింది: కొండా సుస్మితా పటేల్.
- రాత్రి నేను మాట్లాడిన మాటలకు నేను కట్టుబడి ఉన్నాను.
- అధిష్టానం మాతో మాట్లాడింది.
- మీడియాలో ఎలాంటి అంశాలపై మాట్లాడవద్దని అదేశాలు ఉన్నాయి.
- ఇప్పుడు అన్ని విషయాల పై మాట్లాడలేను.
- ఏం జరిగిందో అందరికీ తెలుసు.
2025-10-16 13:01:59
కొండా సురేఖ ఇంటికి లాయర్లు
- మినిస్టర్స్ క్వాటర్స్ మంత్రి కొండా సురేఖ ఇంటికి లాయర్లు
- మాజీ OSD సుమంత్ కేసుపై అడ్వకేట్లతో మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ
- ముందస్తు చర్యలు తీసుకోవాలని అడ్వకేట్లకు చెప్పిన మంత్రి కొండా సురేఖ
- అడ్వకేట్ల భేటీలో మాజీ ఓఎస్డీ సుమంత్ భార్య మనిషా, కొండా సుస్మితా పటేల్
2025-10-16 13:01:59
కాసేపట్లో మీడియా ముందుకు సురేఖ..
- కాసేపట్లో మీడియా ముందుకు మంత్రి కొండా సురేఖ
- తన OSD సుమంత్ వివాదంపై, డెక్కన్ సిమెంట్ వివాదంపై స్పందించనున్న కొండా సురేఖ
- ఇప్పటికే తనకేమీ సంబంధం లేదన్నట్లుగా మాట్లాడిన కొండా మురళి
2025-10-16 12:27:20
కొండా సురేఖకు నటరాజన్ నుంచి పిలుపు..

- కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ నుంచి పిలుపు..
- ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుండి మంత్రి కొండా సురేఖకు పిలుపు
- ఎమ్మెల్యే క్వాటర్స్‌కి రావాలని సందేశం.
- మరికాసేపట్లో ఎమ్మెల్యే క్వాటర్స్‌కి వెళ్ళనున్న మంత్రి కొండా సురేఖ
- కేబినెట్ భేటీకి హాజరుకానున్న కొండా సురేఖ
- రాత్రి ఎపిసోడ్‌పై మంత్రి కొండా సురేఖకు పలువురు మంత్రుల ఫోన్ కాల్స్
2025-10-16 11:57:21
మంత్రి ఉత్తమ్ నో కామెంట్స్..

- మంత్రి ఉత్తమ్ నో కామెంట్స్..
- డెక్కన్ సిమెంట్ వివాదంపై స్పందించడానికి నిరాకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వివాదంతో తనకి సంబంధం లేదన్న మంత్రి ఉత్తమ్
- నా ప్రమేయం లేదని కొండా సురేఖ కూతురే చెప్పింది కదా అంటూ ప్రకటన
2025-10-16 11:57:21
కొండా మురళి కీలక వ్యాఖ్యలు..

- కొండా మురళి కీలక వ్యాఖ్యలు..
- హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు.
- సుమంత్ వ్యవహారంలోనూ ఏం జరుగుతుందో తెలియదు.
- సెక్రటేరియట్‌లో కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి నేను ఒక్కసారే వెళ్ళాను.
- అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు.
- నా బిడ్డ సుస్మితకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది.
- తాను ఇబ్బంది పడ్డానని చెప్పింది.
- అందుకే అలా మాట్లాడి ఉంటుంది.
- రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ కష్టపడ్డాం.
- నాకు ఎమ్మెల్సీ ఇస్తానని రేవంతన్న హామీ ఇచ్చారు.
- తప్పకుండా ఇస్తారు కూడా.
- మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.
- ఎవరైనా సృష్టిస్తే మాకు సంబంధం లేదు.
- అందరి మంత్రుల ఇండ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది.
- నేను మంత్రుల వద్దకు వెళ్తాను.
- పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుని అడుగులు వేస్తా.
- పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ అన్నతో మాట్లాడి సమస్య సాల్వ్ అయ్యేలా చేస్తా.
- ఎవరి తప్పు ఉన్నా, సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తా.
- మీడియా ముందు మాట్లాడొద్దని మీనాక్షి నటరాజన్ చెప్పారు.
- మళ్ళీ మీనాక్షి గారిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతా.
- మీనాక్షి అమ్మ చెప్పినట్లు వింటాను.
- నన్ను తిట్టిన వల్లే మళ్ళీ నా కోసం వస్తున్నారు.
- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్ట్ పనులు కోసం నా దగ్గరకు వచ్చిన వాడే.
- వేం నరేందర్ రెడ్డి(సీఎం సలహాదారు) నేను కామన్ గా కలుస్తుంటాం.
- నేను ఎవరికీ టార్గెట్ కాను, నాకు ఎవరూ టార్గెట్ లేరు.
- నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టం.
2025-10-16 11:33:02
సురేఖ ఆరోపణలు..
- సురేఖ ఆరోపణలు..
- మొన్న కొంతమంది రెడ్డి ముఖ్యులు తనపై కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన సురేఖ.
- మేడారం టెండర్ల వివాదంలో పైచేయి సాధించిన పొంగులేటి.
- పొంగులేటికి పరోక్షంగా మద్దతుగా నిలిచిన మంత్రి సీతక్క.
- మేడారంలో మంత్రుల కార్యక్రమానికి గైర్హాజరైన సురేఖ.
- కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి, సీతక్క.
- పని ఒత్తిడి వల్లే వెళ్లలేకపోయానని వివరణ ఇచ్చిన సురేఖ.
- అధిష్టానం పెద్దలకు సీతక్క కూడా సురేఖపై ఫిర్యాదు చేసినట్లు ప్రచారం.
- సురేఖపై సీఎం సీరియస్ అయినట్లుగా మీడియాకి సమాచారం లీక్..!
- అదంతా అబద్ధమని చెప్పిన సురేఖ.
- ఈలోగా సుమంత్ వ్యవహారంపై రచ్చ.
- అరెస్ట్ చేస్తే కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం.
- ఏకంగా ఒక మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లి నిందితుడి గురించి వెతకడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
2025-10-16 11:27:35
ఆర్‌అండ్‌బీకి మేడారం జాతర పనులు..
- ఆర్‌అండ్‌బీకి మేడారం జాతర పనులు..
- రికార్డులు అప్పగించాలని మంత్రి కొండా సురేఖకు, దేవాదాయశాఖకు ఆదేశం
- మేడారం జాతర పనులను రోడ్లు-భవనాల శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం
- టెండర్ల విషయంలో మంత్రుల మధ్య కొట్లాటతో ఈ నిర్ణయం
- ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ
2025-10-16 11:12:40
కొండా సురేఖకు మరో షాక్
- కొండా సురేఖకు మరో షాక్
- మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలే అవకాశం
- కొండా సురేఖను దేవాదాయ శాఖ నుంచి తొలగించే పనుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- ఇప్పటికే ఆమె వద్ద ఉన్న ఫైల్స్ మొత్తం అధికారులకు అప్పగించాలని అధికారులకు ఆదేశం.
2025-10-16 11:12:40
Advertisement