రెండో రాజధానిగా వరంగల్‌: మంత్రి కొండా సురేఖ | Ministers Konda Surekha And Seethakka Comments On BRS, Check More Details Inside | Sakshi
Sakshi News home page

రెండో రాజధానిగా వరంగల్‌: మంత్రి కొండా సురేఖ

Nov 17 2024 4:40 PM | Updated on Nov 17 2024 5:10 PM

Ministers Konda Surekha And Seethakka Comments On Brs

దుష్టపాలన అంతమొందించి ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు.

సాక్షి, వరంగల్: దుష్టపాలన అంతమొందించి ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. హన్మకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రులు కొండా సురేఖ, సీతక్క మీడియాతో మాట్లాడారు.

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని కొండా సురేఖ తెలిపారు. వరంగల్‌ను తెలంగాణకు రెండో రాజధాని కోసం అడుగులు పడుతున్నాయని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. గతంలో ఇక్కడ నిర్వహించిన రాహుల్ గాంధీ సభ విజయవంతమైంది. ఈ సభ కూడా విజయవంతం చేయాలి’’ అని కొండా సురేఖ పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ పార్టీకే ఆ చరిత్ర ఉంది: మంత్రి సీతక్క
బీఆర్ఎస్, బీజేపీకి రాజకీయ లబ్ధి తప్ప వేరే ఆలోచన లేదని.. అందుకే అధికారులపై దాడులు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మేము మంచి పనులు చేస్తే బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. హైడ్రాకు అడ్డుపడుతున్నారు. మీరు చేసిన సకల జనుల సర్వే ఏమైంది?. లిమ్కా బుక్ రికార్డు కోసమే బీఆర్ఎస్ సకల జనుల సర్వే చేసింది. కానీ మేము చేసే కులగణన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడానికే. బీఆర్ఎస్ పార్టీకే మూటలు ఇచ్చిన చరిత్ర ఉంది. దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్. మాకు మూటలు మోసే అలవాటు లేదు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను మెచ్చుకున్నారు..  ఇప్పుడు తిడుతున్నారు

..కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నాం. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రగతి సభ నిర్వహిస్తున్నాం. మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదిక వివరిస్తాం. ఆర్టీసీ బస్సులు కూడా మహిళలే నిర్వహించేలా సీఎం చర్యలు చేపడుతున్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యం. ఆరు గ్యారంటీల్లో... ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేశాం’’ అని సీతక్క తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement