మంత్రి కొండా సురేఖకు అస్వస్థత | Telangana Minister Konda Surekha Fell Down At Cabinet Hall | Sakshi
Sakshi News home page

మంత్రి కొండా సురేఖకు అస్వస్థత

Jun 5 2025 3:40 PM | Updated on Jun 5 2025 5:19 PM

Telangana Minister Konda Surekha Fell Down At Cabinet Hall

హైదరాబాద్‌:  తెలంగాణ మంత్రి కొండా సురేఖ అస్వస్థత గురయ్యారు.  తెలంగాణ కేబినెట్‌ సమావేశానికి ముందు కొండా సురేఖ స్వల్ప అస్వస్థత​కు గురయ్యారు.  సెక్రటరియేట్‌లోని కేబినెట్‌ హాలులో ఆమె కళ్లు తిరిగి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్రటరియేట్‌ సిబ్బంది.. వెంటనే పరిశీలించి వైద్యం అందించారు. అయితే ఆమె లోబీపీ వల్ల పడిపోయినట్లు నిర్దారించిన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు.  

కాగా, ఈరోజు(గురువారం) మధ్యాహ్న ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ సమావేశం ప్రారంభం కానుంది.  రాజీవ్‌ యువ వికాసం, వానాకాలం పంటలపై చర్చతో పాటు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై సమీక్షించనున్నారు. కాళేశ్వరంపై విజిలెన్స్‌ రిపోర్ట్‌, ఎన్‌డీఏ నివేదికపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చతో పాటు.. వేములవాడలో కోడెలు మృతిపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.

మంత్రి కొండా సురేఖకు అస్వస్థత

Advertisement
 
Advertisement
Advertisement