సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ | Minister Konda Surekha Reaction After Meeting Cm Revanth | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ

Aug 28 2026 12:25 PM | Updated on Aug 28 2026 12:41 PM

Minister Konda Surekha Reaction After Meeting Cm Revanth

సాక్షి, హైదరాబాద్‌: సుస్మిత వ్యాఖ్యల వివాదం తర్వాత తొలిసారి సీఎం రేవంత్‌ను కలిసిన మంత్రి కొండా సురేఖ.. ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం మీడియాతో కొండా సురేఖ మాట్లాడుతూ.. సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టానని తెలిపారు. సీఎం మనవడు, అల్లుడికి కూడా రాఖీ కట్టా. మంత్రి సీతక్కతో కలిసి రాఖీ కట్టాను. నేను అందరికీ ఆడపడుచునే. నన్ను వేరు చేసి చూడొద్దని కొండా సురేఖ అన్నారు.

అయితే, తాజా పరిణామాలను ప్రస్తావించని కొండా సురేఖ.. పండగ వాతావరణంలో తాను ఎలాంటి కామెంట్స్‌ చేయనన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి మూడోసారి రాఖీ కట్టానన్నా సురేఖ.. ప్రెస్‌మీట్‌లో రాఖీ శుభాకాంక్షలకే పరిమితమయ్యారు. సీఎం మంచి సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నా. ఇక్కడ  రాజకీయాలు మాట్లాడను, సీఎం రేవంత్‌కు ఆడపడుచుల దీవెన ఉంటుంది’’ అని కొండా సురేఖ పేర్కొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement