29న రాజ్యాంగ పరిరక్షణపై జస్టిస్‌ మేనకా గురుస్వామి కీలక ప్రసంగం | Justice Maneka Guruswamy Constitution Protection Speech Hyderabad | Sakshi
Sakshi News home page

29న రాజ్యాంగ పరిరక్షణపై జస్టిస్‌ మేనకా గురుస్వామి కీలక ప్రసంగం

Aug 28 2026 12:03 PM | Updated on Aug 28 2026 12:41 PM

Justice Maneka Guruswamy Constitution Protection Speech Hyderabad

హైదరాబాద్‌: భారత రాజ్యాంగం, పరిరక్షణపై హైదరాబాద్‌లో కీలక చర్చ జరగనుంది. ఎస్‌. జైపాల్‌ రెడ్డి మెమోరియల్‌ ఫౌండేషన్‌.. మంథన్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ సభ్యురాలు డాక్టర్‌ మేనకా గురుస్వామి ‘ఇండియన్‌ కాన్స్టిట్యూషన్‌ అండ్‌ ఇట్స్‌ ప్రొటెక్షన్‌’ (Indian Constitution and its Protection) అనే అంశంపై ప్రసంగించనున్నారు.

ఈ కార్యక్రమం ఆగస్టు 29, శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ విశ్వేశ్వరయ్య భవన్‌ మెయిన్‌ ఆడిటోరియంలో జరగనుంది. సాయంత్రం 6 గంటలకు మేనకా గురుస్వామి ప్రసంగం ప్రారంభమవుతుంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, చట్టపరమైన అంశాలపై ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.

ప్రస్తుతం దేశంలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, చట్టబద్ధ పాలన వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు.. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్య సంస్థలు, పౌరుల పాత్ర ఏమిటనే అంశాలపై మేనకా గురుస్వామి తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.

ఇవి కూడా చదవండి: 40 ప్రశ్నలతో జనగణన

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా మేనకా గురుస్వామి రాజ్యాంగం, పౌర హక్కులకు సంబంధించిన పలు కీలక కేసుల్లో వాదించారు. ముఖ్యంగా భారతీయ శిక్షాస్మృతిలోని(IPC) సెక్షన్‌ 377ను సవాలు చేసిన న్యాయపోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షించాలి? ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో పౌరుల బాధ్యత ఏమిటి? వంటి అంశాలపై ఆమె చేసే ప్రసంగం ఆసక్తిని రేకెత్తించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, హైదరాబాద్‌ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ శ్రీకృష్ణ దేవరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement