ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సంజయ్ జాజు
కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ఆధారంగా జీఓ 124
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జనగణన వివరాల సేకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు గురువారం జీఓ 124 జారీ చేశారు. జనగణన–2027కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 40 రకాల ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో పేర్కొంది. తాజాగా ఈ గెజిట్‌కు సంబంధించి రాష్ట్రంలో వివరాల నమోదుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్యూమరేటర్లు సేకరించే వివరాలివి
1. వ్యక్తి పేరు;
2. కుటుంబ పెద్దతో సంబంధం
3. లింగం;
4. పుట్టిన తేదీ, వయసు (నిండిన సంవత్సరాలు)
5. ప్రస్తుత వైవాహిక స్థితి;
6. వివాహ సమయానికి వయసు (నిండిన సంవత్సరాలు)
7. జీవిత భాగస్వామి పేరు;
8. జాతీయత;
9. మతం
10. షెడ్యూల్డ్ కులం(ఎస్సీ)/షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)/కులం
11. తండ్రి వివరాలు;
12. తల్లి వివరాలు
13. డిజెబిలిటీ;
14. మాతృభాష, తెలిసిన ఇతర భాషలు
15. అక్షరాస్యత;
16. డిజిటల్ అక్షరాస్యత స్థితి
17. విద్యాసంస్థలో చదువు/హాజరు స్థితి
18. అత్యున్నత విద్యార్హత, విభాగం/విద్యాశాఖ
19. గత సంవత్సరంలో ఎప్పుడైనా పని చేశారా?
20. ఆర్థిక కార్యకలాపాల కేటగిరీ;
21. వృత్తి
22. పరిశ్రమ/వ్యాపారం/సేవ స్వభావం;
23. కార్మికుల వర్గం
24. ఆర్థికేతర కార్యకలాపం (పాక్షికంగా పనిచేసేవారు, స్వల్పంగా పనిచేసేవారు, పనిచేయనివారి కోసం)
25. పని కోసం వెతుకుతున్నారా/పని చేయడానికి అందుబాటులో ఉన్నారా?
26. పనిచేసే ప్రదేశానికి ప్రయాణ వివరాలు
27. జన్మస్థలం;
28. చివరిగా నివసించిన ప్రదేశం
29. వలస రావడానికి కారణం
30. చివరి వలస తర్వాత ఈ గ్రామం/పట్టణంలో ఉంటున్న కాలం;
31. శాశ్వత నివాస చిరునామా
32. ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత, వితంతు, విడాకులు పొందిన లేదా విడిపోయిన మహిళలకు మాత్రమే)
33. ఇప్పటివరకు సజీవంగా జన్మించిన పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత, వితంతు, విడాకులు పొందిన లేదా విడిపోయిన మహిళలకు మాత్రమే)
34. గత ఒక సంవత్సరంలో సజీవంగా జన్మించిన పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత మహిళలకు మాత్రమే)
35. కోవిడ్–19 టీకా తీసుకున్న ప్రదేశం
36. మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య
37. మొబైల్ నంబర్ (అందుబాటులో ఉంటే)
38. ఆధార్ నంబర్ (అందుబాటులో ఉంటే)
39. ఓటరు గుర్తింపు కార్డు నంబర్ (అందుబాటులో ఉంటే); – పాస్‌పోర్ట్ నంబర్(భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉంటే)
40. డ్రైవింగ్ లైసెన్స్ అందుబాటులో ఉందా?


