పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి
గచ్చిబౌలి (హైదరాబాద్): రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా బుధవారం గుండె నొప్పితో హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెలో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి స్టెంట్ వేశారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఉదయం ఆసుపత్రిలో గవర్నర్‌ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు.


