‘రాహుల్‌.. ఢిల్లీకి ఒక నీతి.. తెలంగాణకు మరో నీతా?’ | BRS Leader Harish Rao Slams Revanth Sarkar | Sakshi
Sakshi News home page

‘రాహుల్‌.. ఢిల్లీకి ఒక నీతి.. తెలంగాణకు మరో నీతా?’

Aug 27 2026 5:23 PM | Updated on Aug 27 2026 5:48 PM

BRS Leader Harish Rao Slams Revanth Sarkar

వరంగల్‌: పాలిటెక్నిక్‌ విద్యార్థులపై రేవంత్‌ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులేమన్నా టెర్రరిస్టులా? అని ప్రశ్నించారాయన. తెలంగాణ విద్యార్థుల సమస్యలు రేవంత్‌కు పట్టవా?అని నిలదీశారు హరీష్‌రావు.

‘విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం మా దౌర్భాగ్యం అంటున్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నావ్. తెలంగాణ విద్యార్థులు నీ కంటికి కనిపించడం లేదా...?, జెన్ జీ అంటూ డిల్లీలో ధర్నాలు చేస్తున్న రాహుల్ గాంధీకి ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు కనిపించడం లేదా?, జెన్ జీ రోడ్డెక్కి పోరాడుతుంటే ఎందుకు స్పందించడం లేదు. 

డిల్లీకి ఒకనీతి.. తెలంగాణకు మరో నీతా రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి విద్యారుల కోసం పోరాడాలి. డిల్లీ తరహాలో విద్యార్థులు తిరగడబడక ముందే.... డిల్లీ తరహా ఉద్యమాలు జరగక ముందే... రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోవాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 
వేటేస్తారా?.. వదిలేస్తారా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement