హైదరాబాద్: అధిక వడ్డీ వసూలు చేస్తూ బలవంతంగా చెక్కులను తీసుకొని బెదిరింపులకు పాల్పడుతుందంటూ మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. మధురానగర్‌కు చెందిన పరిమళలకు సుమలత అనే మహిళ ఇంట్లో పనిచేసే లక్ష్మీ ద్వారా 2016లో పరిచయం ఏర్పడింది.
సుమలత భర్త చనిపోయిన తర్వాత ప్రశాంత్‌సాయితో పెళ్లి జరిగింది. పరిమళ తనతో పాటు తన కజిన్స్‌కు ఆర్థిక సాయం కావాలని చెప్పగా పలు దఫాలుగా రూ.37 లక్షలు సుమలత ఇచ్చింది. అయితే కోవిడ్‌లో పరిమళ కజిన్స్ ఆర్థికంగా బలహీనపడ్డారని తెలిసి కూడా వడ్డీని రూ.7 నుంచి రూ.10కి పెంచింది. తప్పని పరిస్థితిలో వడ్డీ కడుతూ వచ్చింది.
అయితే పరిమళ కూతురి వివాహమని తెలిసి రూ.37 లక్షలు చెల్లించాలని బలవంతంగా చెక్కులపై సంతకాలు చేయించుకొని, మేము చెప్పినట్లు వినకపోతే పెళ్లి జరగకుండా చేస్తామని వేధింపులకు గురిచేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తప్పుడుగా వార్తలను సైతం ప్రచురించి పరువు, ప్రతిష్టలను దెబ్బతీ«శారని, అధిక వడ్డీతో సహా అదనంగా కూడా ఇచ్చానని, వేధింపులకు గురిచేసిన సుమలత, ప్రశాంత్‌సాయిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం పరిమళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


