హరీష్‌రావు హౌస్ అరెస్ట్‌.. వరంగల్‌ పర్యటనకు బ్రేక్‌! | Harish Rao House Arrest, Police Stop BRS Leader’s Warangal Visit To Support Polytechnic Students Protest, Watch Video | Sakshi
Sakshi News home page

హరీష్‌రావు హౌస్ అరెస్ట్‌.. వరంగల్‌ పర్యటనకు బ్రేక్‌!

Aug 27 2026 9:12 AM | Updated on Aug 27 2026 11:48 AM

BRS Harish Rao House Arrest Due To Warangal Visit

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు ఆయన వరంగల్‌ వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వరంగల్‌ వెళ్లాలని హరీష్‌రావు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఈ క్రమంలో హరీష్‌ను బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించి హౌస్‌ అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. దీంతో హరీష్‌ రావు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడంపై హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 

చదవండి: ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌పై సస్పెన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement