వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత | Kavitha Performs Traditional Aadapaduchu Ritual At Mudiraj Leader Wedding, Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత

Aug 27 2026 9:08 AM | Updated on Aug 27 2026 10:47 AM

Kalvakuntla Kavitha Viral Video

కీసర: యాదాద్రి–భువనగిరి జిల్లా గూడూరుకు చెందిన తెలంగాణ రక్షణ సేన నాయకుడు బాషబోయిన బాల­ప్రసాద్‌ వివాహం బుధవారం కీసర చౌరస్తా వద్ద గల ఆరాధ్య కన్వెన్షన్‌ హాలులో జరిగింది. ఈ వివాహ వేడుకకు పార్టీ చీఫ్‌ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ముదిరాజ్‌ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు మెడలో తాళి కట్టాలని బాలప్రసాద్‌ కోరాడు.

దీంతో కల్వకుంట్ల కవిత ఇంటి ఆడపడుచుగా వ్యవహరించి వరుడు వధువుకు తాళికట్టేముందు గౌరి పూజలో పాల్గొని పసుపు కొమ్ము దారంతో వధువు శివాని మెడలో మూడుముళ్లు వేశారు. అనంతరం ఒడిబియ్యం పోసి వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బాలప్రసాద్‌ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.  

చదవండి: హరీష్‌రావు హౌస్ అరెస్ట్‌.. వరంగల్‌ పర్యటనకు బ్రేక్‌!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement