breaking news
check signatures
-
పది రూపాయల వడ్డీకి రూ.37 లక్షలు.. వడ్డీ కట్టినా వేధింపులే!
హైదరాబాద్: అధిక వడ్డీ వసూలు చేస్తూ బలవంతంగా చెక్కులను తీసుకొని బెదిరింపులకు పాల్పడుతుందంటూ మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. మధురానగర్‌కు చెందిన పరిమళలకు సుమలత అనే మహిళ ఇంట్లో పనిచేసే లక్ష్మీ ద్వారా 2016లో పరిచయం ఏర్పడింది. సుమలత భర్త చనిపోయిన తర్వాత ప్రశాంత్సాయితో పెళ్లి జరిగింది. పరిమళ తనతో పాటు తన కజిన్స్‌కు ఆర్థిక సాయం కావాలని చెప్పగా పలు దఫాలుగా రూ.37 లక్షలు సుమలత ఇచ్చింది. అయితే కోవిడ్‌లో పరిమళ కజిన్స్ ఆర్థికంగా బలహీనపడ్డారని తెలిసి కూడా వడ్డీని రూ.7 నుంచి రూ.10కి పెంచింది. తప్పని పరిస్థితిలో వడ్డీ కడుతూ వచ్చింది. అయితే పరిమళ కూతురి వివాహమని తెలిసి రూ.37 లక్షలు చెల్లించాలని బలవంతంగా చెక్కులపై సంతకాలు చేయించుకొని, మేము చెప్పినట్లు వినకపోతే పెళ్లి జరగకుండా చేస్తామని వేధింపులకు గురిచేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తప్పుడుగా వార్తలను సైతం ప్రచురించి పరువు, ప్రతిష్టలను దెబ్బతీ«శారని, అధిక వడ్డీతో సహా అదనంగా కూడా ఇచ్చానని, వేధింపులకు గురిచేసిన సుమలత, ప్రశాంత్సాయిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం పరిమళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: అన్నయ్య వచ్చేసరికే నేనక్కడ ఉండాలి! చెల్లెలి విషాదం! -
బలవంతంగా ఓ వ్యక్తిని కారులో ఎక్కించుకెళ్లి..
► రూ.1.25 కోట్లకు చెక్కులపై సంతకాలు చేయించుకున్న దుండగులు ► పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు మాదాపూర్: బలవంతంగా ఓ వ్యక్తిని కారులో ఎక్కించుకెళ్లి.. అతడితో రూ. కోటి 25 లక్షల చెక్కులపై సంతకం చేయించుకున్నరు ఆరుగురు దుండగులు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కలింగరావు కథనం ప్రకారం... నెల్లూరుకు చెందిన మల్లికార్జున(44) మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ సాయినికేతన్ అపార్ట్మెంట్, ప్లాటు నెం–304లో నివసిస్తూ స్థాని కంగా వ్యాపారం చేస్తున్నారు. ఈ నెల 13న ఉద యం 11.30కి ఖైరతాబాద్‌లో ఉన్న గెలాక్సీ వైన్స్ యజమాని ప్రవీణ్ తన కారు (ఏపీ11 ఏవో7299) లో మరో ఐదుగురితో కలిసి మల్లికార్జునను బల వంతంగా తీసుకెళ్లాడు. బేగంపేట తీసుకెళ్లి రూ. 50 లక్షలకు ఒక చెక్కుపై , రూ.75 లక్షలకు మరో చెక్కు పై సంతకాలు చేయించుకున్నారు.అంతేకాకుండా వంద రూపాయల స్టాంపు పేపర్‌పై నెల్లూరులో ఉన్న మల్లికార్జున్‌కు చెందిన ఆస్తులను కూడా రాయించుకొని... అదే రోజు రాత్రి మల్లికార్జునను వదిలేశారు. బాధితుడు ఈ విషయంపై ఈనెల 15 మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రవీణ్‌తో పాటు ఆరుగురిపై 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం మాదాపూర్ పోలీసులు గాలిస్తున్నా రు. గతంలో మల్లికార్జున్– ప్రవీణ్‌ల మధ్య లావాదేవీలున్నట్టు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు.


