breaking news
Menaka
-
భారత పార్లమెంట్‌కు తొలి LGBTQ+ మహిళ.. ఎవరీ మేనకా గురుస్వామి?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నాలుగు స్థానాలకు అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ.. తమ అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర మంత్రి బాబుల్ సుప్రియో, బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్‌కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, నటి కోయల్ మల్లిక్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు టీఎంసీ ‘ఎక్స్’ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది.అయితే, వీరిలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. ఎగువ సభకు ఆమె ఎన్నికైతే పార్లమెంట్ చరిత్రలోనే తొలి LGBTQ+ పార్లమెంట్ సభ్యురాలు అవుతారు. కాగా.. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో అయిదు స్థానాలు ఖాళీ అవుతుండగా.. నాలుగు టీఎంసీ, మరొకటి బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక, మేనకా గురుస్వామి జీవితం న్యాయపరమైన ప్రతిభ, సామాజిక న్యాయం కోసం పోరాటం, అంతర్జాతీయ గుర్తింపులతో నిండి ఉంది. ఆమె రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం భారతదేశంలో సమానత్వానికి ఒక చారిత్రాత్మక మైలురాయి పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.మేనకా గురుస్వామి ఎవరు?సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన మేనకా గురుస్వామి 2018లో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆ బంధాలను నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్ 377ను కొట్టివేయడంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదుల్లో మేనక కూడా ఒకరు. ఈ కేసు వాదించిన గురుస్వామి కూడా ఎల్జీబీటీక్యూ. ఇప్పుడు రాజ్యసభకు ఎన్నికైతే.. పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించే తొలి ఎల్జీబీటీక్యూ ఎంపీగా రికార్డు సృష్టించనున్నారు.ఆమె 1997లో భారత మాజీ అటార్నీ జనరల్ అశోక్ దేశాయ్ ఆధ్వర్యంలో తన కెరీర్‌ను ప్రారంభించింది. అలాగే, ఆయనను ఆమె తన గురువుగా భావిస్తుంది. 2001లో ఆక్స్‌ఫర్డ్‌లో తన BCL మరియు హార్వర్డ్‌లో తన LLM పూర్తి చేసిన తర్వాత, ఆమె కొంతకాలం న్యూయార్క్‌లోని డేవిస్ పోల్క్, వార్డ్‌వెల్‌లో అసోసియేట్‌గా పనిచేసింది. తరువాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చి న్యూఢిల్లీలో స్థిరపడ్డారు. ఆమె 2019లో ఫారిన్ పాలసీ మ్యాగజైన్ 100 మంది అత్యంత ప్రభావవంతమైన గ్లోబల్ థింకర్స్ జాబితాలో చోటు సంపాదించారు. టైమ్ మ్యాగజైన్-2019లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా.. బెంగాల్లో ఇటీవల I-PAC కార్యాలయాలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలను సవాలు చేస్తూ కోర్టు విచారణలో ఆమె.. టీఎంసీ తరఫున వాదనలు వినిపించారు. ఈ కారణంగానే ఆమెకు రాజ్యసభ స్థానం ఇచ్చినట్టు బెంగాల్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. -
కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్గా చేసింది!
మెగాస్టార్ చిరంజీవి మాములోడు కాదు. ఇప్పటికే ఓ జనరేషన్ హీరోయిన్లతో కలిసి నటించారు. ఎంటర్టైన్ చేశారు. హిట్స్ కొట్టారు. ఇప్పుడు వాళ్ల కూతుళ్లతోనూ సినిమాలు చేస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇంతకీ అది ఏ సినిమా? తల్లీ కూతుళ్లు ఎవరు? చిరంజీవి హీరోగా ఇప్పటికే 150 సినిమాల మార్క్‌ని దాటేశారు. రీఎంట్రీలో మంచి జోరు మీదున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'గా అలరించిన చిరు.. ఇప్పుడు 'భోళా శంకర్'గా సందడి చేయబోతున్నారు. ఆగస్టు 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్, తమన్నా, సుశాంత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇది 'వేదాళం' అనే తమిళ సినిమాకు రీమేక్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) ఇకపోతే 'భోళా శంకర్'లో సిస్టర్ సెంటిమెంట్ కీలకం. చిరుకి చెల్లిగా కీర్తి సురేశ్ కీలకపాత్ర పోషించింది. ఈమె సోదరిగా నటిస్తే.. ఈ బ్యూటీ తల్లి మేనక మాత్రం చిరుకు హీరోయిన్గా ఓ సినిమాలో చేసింది. మెగాస్టార్.. తన కెరీర్ ప్రారంభంలో చేసిన 'పున్నమినాగు'లో కనిపించిన అమ్మాయి కీర్తి సురేశ్ తల్లి మేనక. తాజాగా 'భోళా శంకర్' ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్ ఈ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'చిరంజీవి 'పున్నమినాగు' సినిమాలో అమ్మ నటించింది. అప్పుడు జరిగిన చాలా విషయాలు అమ్మ నాకు చెప్పింది. చిరంజీవి గారి ఎనర్జీ, డెడికేషన్, సెట్ లో ఇచ్చిన సలహాలు, సూచనలు గురించి చెప్పింది. చాలా కేరింగ్ గా చూసుకునేవారట. చిన్న పాపకి చెప్పినట్లు అన్ని విషయాలు చెప్పారట. ఇదే విషయం నేను చిరంజీవిగారితో చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ నన్ను చాలా సర్ ప్రైజ్ చేసింది' అని కీర్తి చెప్పుకొచ్చింది. దీనికి బదులిచ్చిన చిరు.. 'మీ అమ్మ చాలా అమాయకురాలు. నువ్వు మాత్రం అలా కాదు. స్మార్ట్' అని కీర్తితో అన్నారు. (ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి)


