breaking news
jantar mantar
-
జంతర్ మంతర్ హోదా రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్‌ను నిరసనల ప్రదేశంగా గుర్తించే హోదాను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఒకవేళ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.న్యాయవాది స్వాతి సింగ్ మాలిక్ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. జంతర్ మంతర్ హోదా రద్దు చేస్తూ ఢిల్లీ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సవాలు చేశారు. నిరసనలను నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు తరలిస్తే.. అధికారులకు తమ సమస్యలను తెలియజేసే అవకాశం తగ్గిపోతుందని పిటిషన్లో పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛకు ఇది విఘాతం కలిగించవచ్చని వాదించారు.జంతర్ మంతర్ హోదా రద్దు నిర్ణయం సుప్రీంకోర్టు వ్యాఖ్యల ఆధారంగా తీసుకున్నదా? లేదంటే ఆ ప్రాంతం నిరసనల వేదికగా ఎంతవరకు ఉపయోగకరమన్న అంశంపై స్వతంత్రంగా పరిశీలించి నిర్ణయించారా? అని కూడా ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. సుప్రీంకోర్టు వ్యాఖ్యల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశాన్ని పరిశీలించి.. సమగ్ర నివేదిక సమర్పించిందని కోర్టుకు వివరించారు.‘నిరసనకారుల మాటలు అధికారులకు చేరాలి’విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదించిన మాజీ న్యాయమూర్తి, సీనియర్ న్యాయవాది ముక్తా గుప్తా.. నిరసనకారుల మాటలు అధికారంలో ఉన్నవారికి చేరే ప్రదేశంగా జంతర్ మంతర్ ఉండాలని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి స్పందిస్తూ.. ‘‘వినడం అనే పదాన్ని సాంకేతికత కోణంలోనూ అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు. ప్రత్యామ్నాయ వేదికలుగా మూడు ప్రాంతాలుఅక్టోబర్ 11న ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. జంతర్ మంతర్ హోదాను తొలగించి, నిరసనలకు ప్రత్యామ్నాయ వేదికలుగా రాంలీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ మైదాన్‌లను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు (ఎస్ఓపీలు) విడిగా జారీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే రాంలీలా మైదాన్‌లో గతంలో అనేక రాజకీయ నిరసనలు, ధర్నాలు జరిగాయి. అయితే బురారీ, షాహదరాలోని సీబీడీ మైదానాల్లో చాలా కాలంగా ఇలాంటి కార్యక్రమాలు జరగలేదని నివేదికలు చెబుతున్నాయి. ప్రత్యామ్నాయ వేదికలు ప్రజలకు అందుబాటులో ఉండటం, నిరసనల ఉద్దేశం అధికారులకు చేరే అవకాశం వంటి అంశాలు ఈ వివాదంలో కీలకంగా మారాయి.ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్జంతర్ మంతర్ హోదా రద్దుపై ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్.. నిరసనకు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూనే.. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్లో కొత్త ఉత్తర్వులను కూడా సవాలు చేశారు. జంతర్ మంతర్‌ను డీనోటిఫై చేయడాన్ని కాంగ్రెస్ సహా విపక్షాలు, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిర్ణయం ప్రకటించిన మరుసటి రోజే జంతర్ మంతర్ వద్దకు దూసుకెళ్లిన సీజేపీ కోర్ కమిటీ సభ్యులు.. జాతీయ జెండాలు ప్రదర్శించారు. దీంతో వాళ్లను అరెస్ట్ చేసి.. రిమాండ్ కింద తిహార్ జైలుకు తరలించారు. ఈ అరెస్టును దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఖండించాయి.గతంలో జంతర్ మంతర్ వద్ద నిరసనలపై సంపూర్ణ నిషేధం విధించడం సరికాదని సుప్రీంకోర్టు 2018లో పేర్కొన్న తీర్పును కూడా పిటిషనర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం, ఢిల్లీ పోలీసుల సమాధానాల తర్వాత సుప్రీంకోర్టు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: మతం మారితే ఇక అంతే!.. సుప్రీం కోర్టు -
తీహార్ జైలుకు సౌరవ్, రాంకా
న్యూఢిల్లీ: నిరసనలకు అనుమతి లేని జంతర్‌మంతర్‌కు చేరుకునేందుకు ఒక ప్రైవేట్ ఇంటి ఆవరణలోకి చొరబడడం, శాంతిని కాపాడాలన్న నిబంధనలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాకు కోర్టు ఐదు రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు. మరో నాయకుడు అజింక్య షిండేను రూ.5,000 పూచీకత్తు(ష్యూరిటీ)పై విడుదల చేసినట్లు చెప్పారు. ఆరు నెలల పాటు శాంతియుతంగా, సత్ప్రవర్తనతో నడుచుకోవాలని షరతు విధించినట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం నిందితులను ఢిల్లీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. నిబంధనలను పదేపదే ఉల్లంఘించడాన్ని, బెయిల్‌పై విడుదల చేస్తే మళ్లీ చట్టాన్ని ఉల్లంఘించి ఇతరులను రెచ్చగొడతారన్న పోలీసుల వాదనను స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పరిగణనలోకి తీసుకున్నారు. సౌరవ్ దాస్, రాంకాలకు ఐదు రో జుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. పోలీ సులు వీరిని తీహార్ జైలుకు తరలించారు.విధులకు ఆటంకం కలిగించారు: పోలీసులుఢిల్లీలో మంగళవారం తెల్లవారుజామున జంతర్‌మంతర్ ప్రాంతంలోకి ప్రవేశించి, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు సీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అంతకుముందు శనివారమే అరెస్టయ్యి విడుదలయ్యారు. ఒక సంవత్సరం పాటు శాంతిని కాపాడతామని అంగీకరిస్తూ బాండ్లపై వారు సంతకాలు చేశారని, అయినప్పటికీ శాంతిని భగ్నం చేస్తూ జంతర్‌మంతర్‌లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. అందుకే నిబంధనల ప్రకారం మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. శనివారం జంతర్‌మంతర్‌లో నిరసనల సందర్భంగా మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకొని, వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. నిందితులకు బెయిల్ లభించని బీఎన్ఎస్ సెక్షన్లు 332, 132, 121(1) కూడా ఇందులో ఉన్నాయి. నిరసనకారులు తమ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజా శాంతికి భంగం కలిగించడానికి, చట్టాన్ని ఉల్లంఘించడానికి వారు ప్రయత్నించారని స్పష్టంచేశారు. సోషల్ మీడియా ద్వారా ఇతరులను చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ప్రేరేపించేందుకు వారు ప్రయత్నాలు సాగించినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయని వెల్లడించారు అరెస్టు హాస్యాస్పదం: కేజ్రీవాల్ సొంత దేశంలో జాతీయ జెండాను ఎగురవేయడం నేరమా? అని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. సీజేపీ నాయకులను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించడం పూర్తిగా హాస్యాస్పదం అని బుధవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సీజేపీ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అని ఆప్ ఢిల్లీ విభాగం చీఫ్ సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. నిరసనకారుల డిమాండ్లకు తమ పార్టీ మద్దతు ఇస్తోందని తెలిపారు. అణచివేతను సహించొద్దు: మమత కాక్రోచ్ జనతా పార్టీ నేతల అరెస్టును పశి్చమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ బుధవారం తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పటికీ యువతకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు ఐక్యంగా పోరాడాలని చెప్పారు. మనమంతా దృఢంగా నిలబడాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఒక తరం మొత్తాన్ని భయపెట్టి, వారి గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. అణచివేతను సహించడానికి వీల్లేదన్నారు. మన రాజ్యాంగపరమైన హక్కులను ఎప్పటికీ వదులుకోకూడదని తేల్చిచెప్పారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రజాస్వామ్య హత్య జరుగుతోందని మమత ఆందోళన వ్యక్తంచేశారు. ఖండించిన విపక్ష నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను పోలీసులు అరెస్టు చేయడాన్ని పలువురు ప్రతిపక్ష నాయకులు ఖండించారు. పోలీసుల చర్యను సీపీఐ(ఎంఎల్) లిబిరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు తప్పుపట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రజలకు లేదా? అని ధ్వజమెత్తారు. -
CJP నేతలకు బిగ్ షాక్ 5 రోజుల జ్యూడిషియల్ రిమాండ్
-
సీజేపీ నేతలకు 5 రోజుల రిమాండ్.. మోదీపై దీప్కే ఫైర్
జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. మరో నేత అజింక్య షిండే మాత్రం వ్యక్తిగత బాండ్‌పై విడుదలయ్యారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు నిషేధం ఉండగా.. దానిని ఉల్లంఘించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వారు నిరసనకు దిగిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు నేతలు పోలీసు బారికేడ్లను దాటి జంతర్ మంతర్ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా ప్రవేశించడం, నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలతో కేసు నమోదు చేశారు. గతంలో సమర్పించిన శాంతి బాండ్ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలూ ఉన్నాయి.దాస్, రంకా గత శనివారం ఢిల్లీలో నిరసనల సందర్భంగా ఏడాది పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడబోమంటూ పోలీసులకు శాంతి బాండ్ సమర్పించారు. తాజాగా జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగడంతో బాండ్ నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాలు నమోదయ్యాయి. బుధవారం స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) ఎదుట హాజరుపరచగా, దాస్, రంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. షిండే శాంతి బాండ్ సమర్పించి విడుదలయ్యారు.న్యాయవాదులను కలవనివ్వలేదని ఆరోపణలుసీజేపీ న్యాయ బృందం అధిపతి రత్నా సింగ్ పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముగ్గురు నేతలను బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రైవేటు వ్యాన్‌లో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని, న్యాయవాదులను కలిసేందుకు అనుమతించలేదని ఎక్స్‌లో ఆరోపించారు.జంతర్ మంతర్ నిరసనలపై ఆంక్షలుఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల కోసం రాంలీలా మైదాన్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్లను ప్రత్యామ్నాయ ప్రదేశాలుగా గుర్తిస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ అక్టోబర్ 11న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జంతర్ మంతర్ అధికారిక నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగిపోయింది. ఈ నిర్ణయాన్ని సీజేపీ వ్యతిరేకిస్తోంది. నిరసనలను రాజకీయ కేంద్రానికి దూరంగా తరలిస్తే ప్రజా ఆందోళనలకు లభించే ప్రచారం తగ్గుతుందని ఆ పార్టీ వాదిస్తోంది.దీప్కే ఫైర్దాస్, రంకాలకు కస్టడీ విధించడంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే వారి తప్పా? అని ప్రశ్నించారు. అసమ్మతి స్వరాలను అణచివేయాలనుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ఎమర్జెన్సీ ప్రకటించాలని ఎక్స్‌లో విమర్శించారు. తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు సీజేపీ సమావేశం కానుంది.Ashu and Saurav have been sent to 5 days judicial custody. Their fault? Unfurling tricolour at Jantar Mantar. Show some guts, @narendramodi. If you’re so determined to crush dissent, have the courage to officially declare an Emergency instead of hiding behind these cowardly tactics.— Abhijeet Dipke (@abhijeet_dipke) October 14, 2026ఇదీ చదవండి: ఇక ముక్కోణ హోరాహోరీయేనా! -
జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ను నిరసనల వేదికల జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించడంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నేతలు, కార్యకర్తలు మంగళవారం తెల్లవారుజామున ఆందోళనకు దిగారు. పార్టీ నేతలు ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, అజింక్య షిండే ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్న కార్యకర్తలు పోలీసుల అడ్డంకులను దాటుకుని నిరసన తెలిపేందుకు ప్రయతి్నంచారు. ఇనుప గేటు, పోలీసుల బారికేడ్లను దూకి జంతర్‌మంతర్ ప్రాంగణంలోకి ప్రవేశించారు.ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. భారత్ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జైభీమ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ‘సర్ఫరోష్ కీ తమన్నా’అనే విప్లవ కవితను కూడా పఠించారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండేతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ నాయకులను ద్వారకా జిల్లాలోని జాఫర్పూర్ కలాన్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఓ అధికారి తెలిపారు.కొంతమంది సీజేపీ కార్యకర్తలు అక్కడ గుమిగూడటంతో పోలీస్ స్టేషన్ లోపల, చుట్టుపక్కల భద్రతను పెంచినట్లు చెప్పారు. జంతర్‌మంతర్ తాము తిరిగి స్వా«దీనం చేసుకున్నట్లు సీజేపీ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. నిరసన తెలిపే హక్కు తమకు ఉందని వెల్లడించింది. తమ సభ్యులు బారికేడ్లను ఛేదించుకొని, జంతర్‌మంతర్ ప్రదేశంలోకి ప్రవేశించి, అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని వెల్లడించింది.జంతర్‌మంతర్‌ను లాక్కోవడానికి అధికారం ఎక్కడిది?జంతర్‌మంతర్ వద్ద తాము ప్రతిపాదించిన శాంతియుత నిరసన కోసం తేదీ, సమయం కోరుతూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు లేఖ సమర్పించిన రోజే.. అంటే అక్టోబర్ 12న ప్రభుత్వం నుంచి డీనోటిఫికేషన్ ప్రకటన వెలువడిందని అశుతోష్ రాంకా వెల్లడించారు. నిరసన తెలిపేందుకు అనుమతి కోసం అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం చెప్పినట్లు గుర్తుచేశారు. అనుమతి కోరుతున్న సమయంలోనే నిబంధనలను మార్చడం ఏమిటని ప్రశ్నించారు.నిరసన ప్రదేశంలోకి ప్రవేశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విధించిన ఆంక్షలను సౌరవ్ దాస్ తప్పుపట్టారు. ప్రజల సొత్తు అయిన జంతర్‌మంతర్‌ను లాక్కోవడానికి హోంశాఖకు అధికారం ఎక్కడదని నిలదీశారు. నిరసనలకు కేటాయించిన జంతర్‌మంతర్‌లో నిరసనలు కచ్చితంగా జరుగుతాయన్నారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేదాకా అక్కడి నుంచే తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ.. రాజ్యాంగం మనతోనే ఉందని సౌరవ్ దాస్ అన్నారు.జంతర్‌మంతర్ వద్ద అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడారు. నిర్బంధంలో ఉన్న సీజేపీ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ‘దిశ’అనే విద్యార్థి సంఘం సభ్యులు మంగళవారం కన్నాట్ ప్లేస్ నుంచి జంతర్‌మంతర్ వరకు ర్యాలీ నిర్వహించారు. జంతర్ మంతర్‌ను తిరిగి స్వా«దీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్‌ను డీనోటిఫై చేయడాన్ని తప్పుపట్టారు.ప్రతిఘటనను రద్దు చేయలేరు: దీప్కేతమపార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం పట్ల సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మండిపడ్డారు. ‘ప్రజల ప్రతిఘటనను మీరు రద్దు చేయలేరు’అని తేల్చిచెప్పారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ మంగళవారం సోషల్ మీడియాలో దీప్కే పోస్టుచేశారు. జంతర్‌మంతర్‌లో జాతీయ జెండా ఎగరవేయడం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు.నిరసన ప్రదేశం వైపు సీజేపీ సభ్యులు దూసుకెళ్లడం, ఒక గేటుపైకి ఎక్కి, త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని నినాదాలు చేయడం, ఆ తర్వాత పోలీసు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్న ఒక వీడియోను దీప్కే షేర్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘‘నిర్ణీత నిరసన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగిస్తే, జవాబుదారీతనం కోరుతున్న ప్రజల గొంతు నొక్కేయవచ్చని ప్రభుత్వం భావిస్తే ఈ ఉద్యమం లక్ష్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టే. జంతర్ మంతర్ కేవలం పటంలో ఒక ప్రదేశం మాత్రమే కాదు.అది అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడానికి పౌరులు గుమిగూడిన చోటు. ఏ పరిపాలనాపరమైన ఉత్తర్వు కూడా ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చెరిపివేయలేదు’’అని దీప్కే ఉద్ఘాటించారు. సీజేపీ నాయకులు పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారని, వారిని కలిసేందుకు తమ న్యాయవాదులకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ నాయకులను కిడ్నాప్ చేశారని పోలీసులపై ధ్వజమెత్తారు. పోలీసులు చట్టాన్ని పాటించడం లేదని విమర్శించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చివరకు జంతర్ మంతర్ వద్దే జరుగుతుందని పేర్కొన్నారు. ‘మీకు చేతనైంది చేసుకోండి’అంటూ ప్రభుత్వానికి సవాలు విసిరారు.ఇదీ చదవండి: కలిసికట్టుగా పోరాడుతాం! -
ఎవరీ నేహా బోరా? దేశవ్యాప్తంగా వైరల్..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ఓటర్ల పేర్లను తొలగించారనే ఆరోపణలపై ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా కీలకంగా మారారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్న ఆమె.. విద్యార్థి ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ‘జంతర్ మంతర్ 2.0’ ఆందోళనల్లో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.ఎవరీ నేహా బోరా?నేహా బోరా వయసు 29 ఏళ్లు. ఆమె భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు–లెనినిస్టు) లిబరేషన్‌కు అనుబంధంగా ఉన్న అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ ఏడాది జులైలో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్, ఇతరులతో కలిసి 23 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడంతో ఆమె వార్తల్లో నిలిచారు.విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యంనేహా బోరా ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని కళలు, సౌందర్యశాస్త్ర విభాగంలో పీహెచ్డీ పరిశోధకురాలిగా కొనసాగుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఖతిమాలో నేహా బోరా జన్మించారు. ఆమె తండ్రి భారత సైన్యంలో పనిచేశారు. తల్లి గృహిణి. తన కుటుంబం భారతీయ జనతా పార్టీకి గట్టి మద్దతుదారుగా ఉంటుందని నేహా పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. తన రాజకీయ భావజాలం కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా ఉండటంతో ఇంట్లో సిద్ధాంతపరమైన విభేదాలు ఏర్పడ్డాయని ఆమె పేర్కొన్నారు.విద్యార్థి ఉద్యమాల నుంచి నిరసనల వరకుఢిల్లీ విశ్వవిద్యాలయంలో అండర్గ్రాడ్యుయేట్ చదువుతున్న సమయంలో ‘సంగ్వారీ’ అనే వీధి నాటకాల బృందంతో కలిసి పనిచేయడం ద్వారా తన సామాజిక ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందని నేహా తెలిపారు. 2019-2020లో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లోనూ చురుగ్గా పాల్గొన్నట్లు చెప్పారు.జంతర్ మంతర్ 2.0లో కీలక పాత్రనిరసనల్లో నేహా పాత్రను అఖిల భారత విద్యార్థి సంఘం నాయకులతో పాటు ఇతర ఉద్యమకారులు కూడా గుర్తించారు. సామాజిక ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ కూడా నేహాను ప్రశంసించారు. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, కపిల్ సిబల్‌ను తమకు ఆదర్శంగా పేర్కొన్న నేహా.. వారి వయసుకు చేరుకున్నప్పుడు తామూ అంతే ధైర్యంగా, పట్టుదలగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీనిపై యాదవ్ స్పందిస్తూ.. తన వయసులో ఉన్నప్పుడు నేహా ప్రదర్శించినంత ధైర్యం, దృఢ సంకల్పం తనకు లేవని, ఆమెతో కలిసి నడవడం తనకు బలాన్ని, ఆశను ఇస్తోందని పేర్కొన్నారు.శనివారం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నేతలను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు మద్దతుదారులు జంతర్ మంతర్‌కు చేరుకోకుండా ఆంక్షలు విధించారు. దీంతో నేహా బోరా దక్షిణ ఢిల్లీలోని ఐఎన్ఏ ప్రాంతంలో ఉన్న ఢిల్లీ హాట్‌ను కొత్త నిరసన స్థలంగా ప్రకటించారు. పోలీసులు ఆమెతో పాటు ఇతర ఉద్యమకారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఓటర్ల పేర్ల తొలగింపు ఆరోపణలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌తో కొనసాగుతున్న ఈ ఆందోళనల్లో నేహా బోరా పాత్ర ఎలా మారుతుందన్నది, నిరసనలకు మరింత మద్దతు లభిస్తుందా అన్నది తదుపరి పరిణామాల్లో కీలకం కానుంది.ఇదీ చదవండి: ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్ -
జంతర్ మంతర్ క్లోజ్.. సుప్రీంలో సవాల్
ఢిల్లీ: ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ఆందోళనల రద్దును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా డీనోటిఫై చేస్తూ ఢిల్లీ పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. అక్టోబర్ 11న ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ జారీ చేసిన స్టాండింగ్ ఆర్డర్‌పై అభ్యంతరం వ్యక్తమవుతోంది. జంతర్ మంతర్ స్థానంలో మూడు కొత్త నిరసన వేదికలను ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.రాంలీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌ను నిరసన స్థలాలుగా గుర్తించారు. ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞాన్శ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో నిరసనలపై పోలీసుల అణచివేత చర్యల మధ్య కొత్త నిరసన వేదికలపై వివాదం నెలకొంది. గతంలో జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా సుప్రీంకోర్టు గుర్తించిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించారు.నిరసనలకు అనువైన స్థలం కాదంటూ గతంలో రాంలీలా మైదాన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని పిటిషన్లో పేర్కొన్నారు. కొత్తగా గుర్తించిన నిరసన స్థలాలు ఢిల్లీ చెత్త డంపింగ్ యార్డులకు సమీపంలో ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో నిరసనలపై దాఖలైన పెండింగ్ పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టును పిటిషనర్ ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముక్తా గుప్తా వాదనలు వినిపించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రఫేల్ డీల్‌పై వ్యాఖ్యల కేసు.. రాహుల్‌కు సుప్రీంలో ఊరట -
జంతర్ మంతర్‌లోకి సీజేపీ నేతలు.. ఢిల్లీలో హైటెన్షన్!
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అనుమతులు లేకపోయినా.. నిషేధిత ప్రాంతంగా ఉన్న జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు సీజేపీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, అజింక్య షిండేతో పాటు పలువురు కార్యకర్తలు, వాలంటీర్లు హఠాత్తుగా జంతర్ మంతర్ నిరసన స్థలంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అనుమతులు లేవనే కారణంతో నిరసనకు యత్నించిన అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్తోపాటు ఇతర సీజేపీ ప్రతినిధులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే జంతర్ మంతర్‌ను నిరసన స్థలాల జాబితా నుంచి ఢిల్లీ పోలీసులు పూర్తిగా తొలగించిన విషయం తెలిసిందే. Cockroaches with the Tiranga sneaked into Jantar Mantar early this morning before they were picked up by Delhi Police. @AshutoshRanka, @SauravDassss, @AjinkyaCJP along with other team members have been detained. You cannot denotify the resistance, @narendramodi https://t.co/x7B40akCVO— Abhijeet Dipke (@abhijeet_dipke) October 13, 2026 -
సుప్రీం దిశగా సమర భేరి. ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా రాహుల్, విపక్ష నేతల బస్సు ర్యాలీ.
-
జంతర్ మంతర్ ఇక చూ మంతర్
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ అంటే ఒక ఆశ. భారతదేశంలో ఇంకా ప్రజాస్వామ్యం ఉందని నమ్మడానికి నిలువెత్తు సాక్ష్యం. ఒకప్పుడు కాలాన్ని, ఖగోళ వస్తువుల కదలికలను అంచనావేసే ప్రయోగశాలగా ఉన్న జంతర్‌మంతర్.. దశాబ్ద కాలంగా దేశ సామాజిక పరిస్థితులను, మారుతున్న ప్రజాభిప్రాయాలను తెలిపే వేదికయ్యింది. తాజాగా సీఈసీకి వ్యతిరేకంగా నిరసనలు, పేపర్ లీకేజ్ ఆందోళనలు, అంతకుముందు నిర్భయ ఘటనపై వెల్లువెత్తిన ఉద్యమం, ప్రభుత్వాలను మార్చేసిన అన్నా హజారే నిరాహార దీక్ష.. ఇంకా ఎన్నో ఆందోళనలకు, ఎన్నో నిరసన గళాలకు గొంతుకయ్యింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని అనామక, అమాయక ప్రజల అసమ్మతిని తెలిపే వేదికయ్యింది. అంతటి చారిత్రాత్మక ప్రదేశంపై ఇప్పుడు ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. నిరసన ప్రదేశాల జాబితా నుంచి ఢిల్లీ పోలీసులు తాజాగా తొలగించింది. దీంతో మరోసారి దేశవ్యాప్త చర్చకు కారణమైన ఆ ప్రాంత ప్రాశస్త్యం గురించి ఓసారి చూద్దాం.. ఖగోళ వేదశాలగా.. జంతర్‌మంతర్ ప్రస్తుత ఆధునిక భారత రాజకీయాల్లో పోషిస్తున్న పాత్ర కంటే చాలా పురాతనమైన చరిత్ర ఉంది. 1724లో జైపూర్ మహారాజు సవాయ్ జైసింగ్ ( జీజీ) ఖగోళ శాస్త్రంపై ఆసక్తితో కాలక్రమాన్ని, గ్రహాల స్థితిగతులను ఖచ్చితంగా గణించడానికి ఇక్కడ ఖగోళ వేదశాలను నిర్మించారు. దీంతోపాటు జైపూర్, ఉజ్జయిని, వారణాసి, మధురలలోనూ ఏర్పాటు చేశారు. వేదశాల బయట ఉన్న రహదారికి కొన్ని శతాబ్దాల తర్వాత గుర్తింపు వచ్చింది. దీనికో సుదీర్ఘ చరిత్ర ఉంది. బోట్‌క్లబ్ మైదానాల నుంచి.. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రజల అసమ్మతిని తెలపడానికి ఇండియా గేట్, విజయ్ చౌక్ సమీపంలోని బోట్ క్లబ్ మైదానాలు ఢిల్లీలో భారీ ప్రదర్శనలకు ప్రధాన వేదికలుగా కొన్ని దశాబ్దాల పాటు ఉన్నాయి. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రజలు రోజుల తరబడి ఎర్రకోట వెనుక శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఉండేవారు. 1988 ఇదే అక్టోబర్‌లో రైతు నాయకుడు మహేంద్ర సింగ్ టికాయత్ బోట్ క్లబ్ మైదానాల్లో భారీ సభ నిర్వహించారు. వేలాది మంది రైతులు తమ పశువులతో సహా వచ్చి ఆ ప్రాంతంలో ఉండి.. తమ డిమాండ్లను పరిష్కరించాలని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వంలోని కీలక కార్యాలయాలకు ఇది దగ్గరగా ఉండటం, ఆందోళనలతో ప్రజల శాంతిభద్రతలపై బోట్‌క్లబ్‌ను నిరసన వేదికగా ఉండటంపై పునరాలోచనలో పడ్డ ప్రభుత్వం.. ఇక్కడ ప్రదర్శనలపై ఆంక్షలు విధించింది. ప్రత్యామ్నాయంగా జంతర్‌మంతర్, రామ్‌లీలా మైదానం.. జంతర్ మంతర్ ఒక ప్రత్యామ్నాయ ప్రదేశంగా చూపింది. 5,000 మంది వరకు గుమిగూడే సమావేశాల కోసం జంతర్ మంతర్‌ను కేటాయించగా, అంతకంటే పెద్ద ప్రదర్శనలను రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించాల్సిందిగా సూచించింది. ఇలా ఏళ్లు గడిచేకొద్దీ, జంతర్ మంతర్ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, కారి్మక సంఘాలు, రైతులు, కార్యకర్తలు, సాధారణ పౌరులకు ప్రధాన నిరసన కేంద్రంగా మారింది. ఇక్కడ జరిగిన తొలి, ముఖ్య ప్రదర్శనల్లో ఒకటి.. 1993లో జరిగిన‘జైల్ భరో’. ఆనాటి ప్రభుత్వ ఆర్థిక విధానాలకు, మతతత్వానికి వ్యతిరేకంగా నిరసన కోసం 33 సంస్థలు ఏకమయ్యాయి. ఈ ప్రదర్శనలో దాదాపు 25,000 మంది పాల్గొన్నారు. జన్ లోక్‌పాల్ బిల్లుకోసం.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, దేశవ్యాప్త అవినీతిని అరికట్టడానికి ‘జన్ లోక్‌పాల్ బిల్లు’డిమాండ్ చేస్తూ 2011లో అన్నా హజారే నేతృత్వంలో జరిగిన ఐదు రోజుల నిరాహార దీక్షకు కేంద్రంగా మారింది. చట్టాన్ని రూపొందించడం కోసం ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడంతో హజారే తన నిరాహార దీక్షను విరమించారు. దీంతో రాజకీయ జవాబుదారీతనం కోసం సాగే ప్రజా ఉద్యమాలకు జంతర్ మంతర్ కేంద్ర భిందువైంది. నిర్భయ ఘటనతో.. 2012 డిసెంబర్లో ‘నిర్భయ ఘటన’తరువాత.. నిరసన ప్రదర్శనలకు ఒక ముఖ్యమైన ప్రదేశంగా మారింది. ఢిల్లీలో కదులుతున్న బస్సులో సామూహిక హత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయాలని, మహిళలను రక్షించడానికి మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు, ముఖ్యంగా యువత, వీధుల్లోకి వచ్చారు. 2014లో, అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థిని నిడో తానియా మరణం తర్వాత కూడా నిరసనలు జరిగాయి. 2017లో, వ్యవసాయ సంక్షోభాన్ని ఎత్తిచూపుతూ తమిళనాడు రైతులు 41 రోజుల పాటు నిరసన చేపట్టారు. 2023లో అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ధర్నా జరిగింది. మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధిస్తున్నారని, ఆయనను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒలింపిక్ విజేతలతో సహా ప్రముఖ రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. పేపర్ లీకేజీలపై.. నీట్–యూజీ పేపర్ లీకేజీపై 2024లో విద్యార్థులు గళమెత్తారు. 2026లో మరో నీట్–యూజీ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో ఈ పరీక్షా విధానంపై దేశ్యాప్త చర్చ జరిగింది. దీనిపై జంతర్ మంతర్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ఆధ్వర్యంలో జరిగిన భారీ ఆందోళనకు చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అందరికీ తెలిసిందే. గతంలోనూ నిషేధం... ప్రభుత్వాలను కుదిపేసిన ఆందోళనలకు సాక్షీభూతంగా ఉన్న జంతర్‌మంతర్‌పై నిషేధం విధించడం కొత్తేం కాదు. నిరసనలు పెరగడం, ఆ ఆందోళనలతో నెలకొనే శబ్దం, ఆ తరువాత ఏర్పడే చెత్త, నిరసనకారులు ఎక్కువకాలం ఉంటుండంతో ఏర్పడుతున్న తాత్కాలిక నిర్మాణాలపై ఆందోళన పలుమార్లు వ్యక్తమైంది. దీంతో 2017 అక్టోబర్ 5న జంతర్ మంతర్ వద్ద ప్రజల నిరసనలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధం విధించింది. ఈ సంపూర్ణ నిషేధాన్ని సుప్రీంకోర్టు 2018 కొట్టేసింది. పూర్తి నిషేధం పరిష్కారం కాదని, పౌరుల నిరసన హక్కును, స్థానికుల శాంతిభద్రతల హక్కును సమతుల్యం చేస్తూ ప్రదర్శనలను నియంత్రించడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. పెద్ద సమావేశాలను రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించుకోవచ్చని సూచించింది. జంతర్‌మంతర్ వద్ద నిరసనకారుల సంఖ్యను పరిమితం చేసింది. లౌడ్‌స్పీకర్ల వాడకాన్ని నియంత్రించింది. దీర్ఘకాలిక శిబిరాలను నివారించాలని, స్థానికులకు ఇబ్బంది కలగకుండా నిరసన కారులు తమ హక్కులను వినియోగించుకోవాలని తీర్పులో పేర్కొంది. గొంతు నొక్కేయడమే.. ‘జంతర్ మంతర్ దేశంలో అసమ్మతికి, అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా నిలబెట్టే పౌరుల హక్కుకు ప్రతీక. నిర్భయ సామూహిక అత్యాచారం కేసు దేశాన్ని కుదిపేసినప్పుడు నేను టీనేజర్నే. జాతీయ రాజధానిలో ఆ ఘోరం గురించి తెలిసి కలత చెందాను. నిరసనల్లో భాగం కావాలనుకున్నా. జంతర్‌మంతర్ వెళ్లి నా వంతుగా గళం విప్పాను. ఇప్పుడు జంతర్‌మంతర్‌ను నిషేధించడమంటే ప్రజల అసమ్మతి గొంతు నొక్కేయడమే’ – డాక్టర్ ప్రణవ్ రాజ్ సింగ్, ఢిల్లీ నివాసి అణచివేత చర్య.. ‘ప్రభుత్వ కీలక కార్యాలయాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రజలు తమ నిరసనలు తెలపడానికి , ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడానికి సరైన ప్రదేశం. నేను ఈ వేదిక నుంచే అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్న. దీని జాబితా నుంచి∙తొలగించడమంటే అసమ్మతి గళాలపై అణచివేత చర్యే. ’ – రాణి శర్మ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రజాస్వామ్యాన్నీ డీనోటిఫై చేస్తారు
ఛత్రపతి సంభాజీనగర్: ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు కేటాయించిన జంతర్‌మంతర్ మాదిరిగానే ప్రధాని నరేంద్రమోదీ భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కూడా డీనోటిఫై చేసే ప్రమాదం ఉందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోమవారం వ్యాఖ్యానించారు. డీనోటిఫికేషన్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే దేశమంతా జంతర్‌మంతర్ అవుతుందని హెచ్చరించారు. ‘‘జంతర్ మంతర్‌ను అధికారిక ప్రొటెస్ట్ సైట్ కాదంటున్నారు. నిజమే. పిరికి నియంత దాన్నిప్పుడు యుద్ధభూమిలా మార్చేశాడు. అబ్ పూరా దేశ్ జంతర్‌మంతర్ బనేగా’’అంటూ దీప్కే ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ప్రజాస్వామ్యాన్ని కూడా డీనోటిఫై’చేస్తారని వ్యాఖ్యానించారు. ‘‘నియంత అసలు సమస్య నిరసన ప్రదర్శనల కేంద్రం కాదు. ప్రజలు నిరసనలు చేస్తున్నారన్నదే’’అని విమర్శించారు. ఢిల్లీ పోలీసులు టార్చర్ పెట్టారు... ఢిల్లీ పోలీసులు తనను, కుటుంబ సభ్యులను మానసిక హింసకు గురిచేశారని అభిజీత్ దీప్కే ఆరోపించారు. అక్టోబరు పదిన తనను అదుపులోకి తీసుకున్న సందర్భంలో కుటుంబసభ్యులు ఎవరికీ తన ఆచూకీ తెలియనివ్వలేదని చెప్పారు. ఢిల్లీ పోలీసుల అదుపులో ఉండగానే దీప్కే నానమ్మ మరణించిన విషయం తెలిసిందే. ఈ వార్తను పోలీసులు తనకు తెలిపినప్పటికీ గ్రామంలో ఉన్న బంధువుకు ఫోన్ చేస్తానంటే అనుమతించలేదని, అతడి నంబరు తీసి ఇచ్చేందుకైనా ఫోన్ ఇవ్వాలన్నా నిరాకరించారని ఆరోపించారు. న్యాయవాదితో మాట్లాడేందుకు తనకున్న హక్కును కూడా తోసిపుచ్చారని ఆరోపించారు. అక్టోబరు పది నాటి నిరసన ప్రదర్శనల కోసం బయలుదేరిన తనను విమానంలోనే అదుపులోకి తీసుకున్నారని, తల్లిదండ్రులకు గానీ, న్యాయవాదికి కానీ తన ఆచూకీ తెలపలేదని ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు మాత్రం దీప్కే నానమ్మ మరణవార్తను అతడికి చేరవేశామని, సహాయం ఏదైనా అవసరమని అడిగితే అతడు తిరస్కరించాడని ఆరోపిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. దీనిపై ‘‘నానమ్మ మరణవార్తను పోలీసులు నాకు చెప్పి ఉంటే వాళ్లు మధ్యాహ్నం 3.30 గంటలకు అరెస్ట్ పేపర్లతో ఎందుకు వచ్చారు? దానిపై సంతకం పెట్టాలని బలవంతపెట్టారు’’? అని ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. తల్లిదండ్రులతో మాట్లాడమని పోలీసులు చెబితే.. వారి ఆరోగ్యం సరిగా లేనందున తాను నానమ్మతోపాటు ఉండే బంధువుకు కాల్ చేయమని అడిగానని దీప్కే వివరించారు. ఢిల్లీ పోలీసులు ఇందుకు నిరాకరించారని, అన్నారు. నాతో పాటు తల్లిదండ్రులపై కూడా ఒత్తిడి తీసుకురావాలన్నది వారి ఉద్దేశమని విమర్శించారు. నానమ్మ మరణ వార్త చెప్పేందుకు వారు మూడు కెమెరాలతో రావడమే అందుకు నిదర్శనమన్నారు. ‘‘ఢిల్లీ పోలీసులు ఎడిట్ చేసిన వీడియో ప్రసారం చేస్తున్నారు. దమ్ముంటే మొత్తం వీడియో చూపమనండి. నా ప్రాథమిక హక్కులకు భంగం చేసిన విషయం తెలుస్తుంది’’అని సవాలు విసిరారు. ‘‘మోదీ నియంతృత్వం నశించేంతవరకూ పోరాడతాను’’అని స్పష్టం చేశారు. -
ఉద్యమస్థలి జంతర్ మంతర్‌కు తాళం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఉద్యమాల రాజధానిగా, నిరసనకారులకు సిసలైన చిరునామాగా వెలుగొందుతూ దశాబ్దాల కాలంలో ఎన్నెన్నో చరిత్రాత్మక ఉద్యమాలకు కేరాఫ్‌గా నిలిచిన, ఉద్యమ నినాదాలతో అనునిత్యం హోరెత్తిపోయే జంతర్‌మంతర్‌లో ఇకపై నిశ్శబ్దం రాజ్యమేలనుంది. సెంట్రల్ ఢిల్లీలో కీలమైన ప్రాంతంలో ప్రతిరోజూ ఉద్యమ సెగలను రాజేసే ప్రతిష్టాత్మకమైన జంతర్‌మంతర్‌లో ఇక మీదట ధర్నాలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమని ఢిల్లీ పోలీసులు తేల్చిచెప్పారు. విద్యార్థి, ఉద్యోగ, యువజన, రాజకీయ, సాంఘిక, సామాజిక సమస్యలకు పరిష్కారాలు కోరుతూ తరచూ తండోపతండాలుగా తరలివచ్చే ఉద్యమకారులతో జంతర్‌మంతర్ కిక్కిరిసిపోతోందని, ఢిల్లీ వాసుల ట్రాఫిక్ సమస్యల్ని కాస్తయినా తగ్గించే లక్ష్యంతో ధర్నాస్థలిని జంతర్‌మంతర్ నుంచి వేరే చోటుకు మార్చుతున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ప్రకటించారు. అక్టోబర్ 11వ తేదీన ఇచ్చిన ఉత్తర్వు వివరాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. రాంలీలా మైదాన్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్లలో ఇకపై ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు, ఆందోళనలు చేసుకోవచ్చని కమిషనర్ వెల్లడించారు. జంతర్‌మంతర్ నుంచి రాంలీలా మైదాన్ దాదాపు నాలుగు కి.మీ.ల దూరంలో ఉంది. సీబీడీ గ్రౌండ్ ఏకంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఉత్తరఢిల్లీలోని బురారీ గ్రౌండ్ మరీ దూరంగా 21 కి.మీ.ల దూరంలో ఉంది. కేంద్ర హోం శాఖ నియమించిన కమిటీ సమగ్ర సమీక్ష తర్వాత నూతన ప్రత్యామ్నాయ ధర్నావేదికలను సిఫార్సు చేసిందని, వాటినే ఖరారుచేసినట్లు ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు. గత కొద్దివారాలుగా కాక్రోచ్ జనతాపార్టీ, కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల ఉద్యమాలతో జంతర్‌మంతర్ హోరెత్తిపోయిన నేపథ్యంలో అక్కడ ఉద్యమకారులు గుమికూడకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘‘2022 ఏప్రిల్ 28వ తేదీనాటి ఉత్తర్వుల్లో మార్పులు చేస్తున్నాం. జంతర్‌మంతర్‌లో ధర్నాల సంగతి ఇక మర్చిపోండి. కొత్త ధర్నాస్థలాల్లో ఉద్యమాలను కొనసాగించండి. అక్కడ ఉద్యమాలకు సంబంధించిన విధివిధానాలు, నిబంధనలను త్వరలోనే ప్రకటిస్తాం’’అని పోలీస్ కమిషనర్ చెప్పారు. జంతర్‌మంతర్‌లో ధర్నాలకు తాజా తేదీలను ఖరారుచేయాలని కోరుతూ సీజేపీనేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లు సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రాలు అందజేసిన రోజే ధర్నాస్థలిని మారుస్తున్న విషయం వెలుగులోకి రావడం గమనార్హం. జన్‌పథ్ మెట్రో స్టేషన్ రెండో నంబర్ గేటు జంతర్‌మంతర్‌కు అత్యంత సమీపంలో ఉంది. పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లు సైతం జంతర్‌మంతర్‌కు సమీపంలోనే ఉన్నాయి. ధర్నాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు తరచూ ఢిల్లీ మెట్రో గేట్లు మూసేస్తుండటంతో ఈ మార్గంలో ప్రయాణించే వేలాది మంది ఢిల్లీవాసులకు తీవ్ర ఇబ్బందికలుతోందని ఢిల్లీ పోలీసులు వాదిస్తున్నారు. ఇక్కడ ధర్నాల వేళ ట్రాఫిక్‌ను మరో మార్గంలోకి మళ్లించడం, అత్యధిక సంఖ్యలో బలగాలను మోహరించడం తలకు మించిన భారంగా తయారైందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. రాంలీలాలో అసలే వద్దు... ఇకపై రాంలీలా మైదాన్‌లో ధర్నాలు చేసుకోవచ్చంటూ ఢిల్లీ పోలీసులు ఇచ్చిన ఉత్తర్వును ఆ ప్రాంతంలోని వాణిజ్య, రవాణా సంస్థల సంఘాలు తప్పుబట్టాయి. ‘‘పాత ఢిల్లీలో కీలకమైన హోల్‌సేల్ మార్కెట్ ఇక్కడే ఉంది. కొత్తగా ఇక్కడ ధర్నాలు చేపడితే టోకుధరల దుకాణ సముదాయాలకు తరలివచ్చే భారీస్థాయిలో సరుకు రవాణా అస్తవ్యస్తమవుతుంది. ఇక్కడ వాణిజ్య లావాదేవీలు, కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కొత్త ధర్నావేదికల నుంచి రాంలీలా మైదాన్ పేరు తీసేయండి’’అని ది చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) ఒక ప్రకటనలో అభ్యర్థించింది. ‘‘జంతర్‌మంతర్‌లో ధర్నాలు ఆపేస్తే మంచిదేగానీ ఇక్కడ మొదలెడతామంటే ఏమాత్రం సబబుగా లేదు. సదర్ బజార్, చాందినీచౌక్, చౌరీ బజార్, ఖారీ బవోలీ, భగీరథ్ ప్లేస్, కాశ్మీరీ గేట్, పహార్గంజ్, దర్యాగంజ్, కమలమార్కెట్, లజ్‌పత్‌రాయ్ మార్కెట్, అజ్మీరీ గేట్ ప్రాంతాలన్నీ హోల్‌సేల్ మార్కెట్లే. పండుగల సీజన్లో వ్యాపారులు, వినియోగదారులతో ఈ ప్రాంతాలన్నీ అత్యంత రద్దీగా ఉంటాయి. కొత్తగా ధర్నాచౌక్ ఇక్కడికొస్తే వాణిజ్యం తీవ్రంగా దెబ్బతినే ఆస్కారముంది’’అని సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ ఆందోళన వ్యక్తంచేశారు. రాంలీలా మైదాన్‌ను ‘ధర్నా జాబితా’నుంచి తొలగించాలని ఆలిండియా మోటార్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సైతం ఢిల్లీ కమిషనర్‌కు సోమవారం ఒక వినతిపత్రం అందజేసింది. మా బతుకులు బుగ్గిపాలు.. ధర్నాలో పాల్గొనేందుకు తరలివచ్చే ఉద్యమకారులకు ఛాయ్, బిస్కెట్, సమోసా, వాటర్ బాటిళ్లు, చిరుతిండ్లు, అల్పాహారాలు, భోజన ఏర్పాట్లు చూస్తూ చిరువ్యాపారులుగా, వీధి వర్తకులుగా ఇ క్కడే స్థిరపడిపోయిన పలువురి బతుకులు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. ‘‘గత 20 ఏళ్లుగా ఇక్కడే ఛోలే భటూరే, రాజ్మా చావల్, మటర్ కుల్చా, పులావ్ అమ్ముతూ ఇక్కడే ఉంటున్నా. ఉన్నంతలో బతుకుతున్నాం. ఇప్పుడు హఠాత్తుగా ధర్నాచౌక్ మూసేస్తే మా కుటుంబాలు వీధిన పడతాయి’’అని విజయ్ గుప్తా అనే చిరువ్యాపారి ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘గత 26 ఏళ్లుగా ఇక్కడే పాన్ షాప్ నడుపుతున్నా. నా కుటుంబ అవసరాలు, నా సోదరి చదువులయ్యే ఖర్చు ఈ షాప్‌తోనే వెళ్లదీస్తున్నా. ఇప్పుడు ధర్నాలకు ఆపేస్తే మా కుటుంబం వీధిన పడుతుంది’’అని అజయ్ కుమార్ అనే మరో వ్యాపారి ఆందోళనవ్యక్తంచేశారు.ప్రజాస్వామ్యం పట్టదు: కాంగ్రెస్ ధర్నాస్థలి మార్పు నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మోదీ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘రోజూ ఉద్యమాలకు జంతర్‌మంతర్ సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ ఉత్సాహం, ప్రజా ఉద్యమం చూసి మోదీ, షాలకు భయం పట్టుకుంది. జంతర్‌మంతర్‌లో ఉద్యమాలు కొనసాగితే తమకు ముప్పు ఎక్కువవుతుందని భావించి ఈ విష ద్వయం శాంతియుత ప్రజాఉద్యమాలను దారుణంగా అణచివేసేందుకు ఈ కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చింది. వాళ్లకసలు ప్రజాస్వామ్యం అంటేనే పట్టదు. వీళ్ల నిర్ణయం ప్రజాస్వామ్యానికి పెనుశాపం’’అని అన్నారు. ఇక దేశమే జంతర్‌మంతర్: సీజేపీ ఏకపక్ష నిర్ణయం ఏమాత్రం ఆమోదనీయం కాదు అని సీజేపీ కో–కన్వినర్ సౌరవ్ దాస్ వ్యాఖ్యానించారు. ‘‘నరేంద్ర మోదీకి జంతర్‌మంతర్ అంటే ఎంతటి భయం.. ఈ నిర్ణయంతో తేటతెల్లమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడు జంతర్‌మంతర్‌ను డీనోటిఫై చేసింది. త్వరలో ప్రజాస్వామ్యాన్ని సైతం డీనోటిఫై చేస్తుందేమో. ఇదే వాళ్ల తదుపరి నిర్ణయం కావొచ్చు. ఈ నిర్ణయం శాంతియుత ప్రదర్శనలకు అనుమతించే ప్రాథమిక హక్కుపై దాడే. జంతర్‌మంతర్‌లో ధర్నాలను తొలగిస్తే ఇక దేశమే జంతర్‌మంతర్‌లా మారుతుంది. అంతటా ధర్నాలుచేస్తాం’’అని ఆయన స్పష్టంచేశారు. -
పోలీసులకు సీజేపీ నేతల అల్టిమేటం
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టేందుకు తేదీని కోరుతూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీస్ స్టేషన్ బయట విలేకరులతో మాట్లాడుతూ.. తాము పోలీసులకు 24 గంటల సమయం ఇస్తున్నామని, ఒకవేళ వారు స్పందించకపోతే మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తామని సీజేపీ నేతలు తెలిపారు."జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు మేము ఢిల్లీ పోలీసులను తేదీని కోరుతున్నాము. పోలీసులు మాకు తేదీని కేటాయిస్తారని ఆశిస్తున్నాము. ఒకవేళ వారు అలా చేయకపోతే 24 గంటల్లోపు మేము మరో నిర్ణయం తీసుకుంటాము," అని రంకా అన్నారు."ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా ఆంక్షలు, నిషేధాజ్ఞలను పాటించాలని, శాంతిని కాపాడాలని, అనధికారిక గుంపులుగా చేరవద్దని కోరుతూ పోలీస్ స్టేషన్ బయట ప్రజలకు ప్రకటన చేశారు. రాజధానిలో విధించిన భద్రతా ఆంక్షలను కూడా రంకా విమర్శించారు. పండుగలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఏర్పాట్లు స్థానిక నివాసితులు, వ్యాపారాలపై ప్రభావం చూపుతున్నాయని" ఆయన అన్నారు."ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపారాలు మూతపడ్డాయి... పండుగలు కూడా వస్తున్నాయి. నిరసన తెలిపేందుకు మాకు ఒక నిర్దిష్ట స్థలాన్ని ఢిల్లీ పోలీసులు ఎందుకు కేటాయించరు?" అని రంకా ప్రశ్నించారు.శాంతియుత నిరసన అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు అని CJP నేత సౌరవ్ దాస్ పేర్కొన్నారు. నిరసన ప్రదర్శన కోసం తేదీ, సమయాన్ని ఖరారు చేయాలని పోలీసులను కోరారు."శాంతియుత నిరసన అనేది ఒక హక్కు, అది రాజ్యాంగబద్ధమైన హక్కు. ప్రజలు ఇప్పటికే ఆ హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజలు శాంతియుతంగా నిరసన తెలుపుతారు. తాము అనుమతి కోసం 10 రోజుల ముందే సంప్రదించాలని పోలీసులు ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వారికే వదిలేస్తున్నాం. తేదీ, సమయాన్ని వారే చెప్పాలని కోరుతున్నాం. అయితే ఈ విషయాన్ని వారు పెండింగ్‌లో ఉంచేలా మేము అనుమతించము. వారికి 24 గంటల గడువు ఇస్తున్నాము. చూద్దాం ఏం జరుగుతుందో," అని దాస్ అన్నారు. అయితే సోమవారం జంతర్ మంతర్‌ను నిరసన ప్రదర్శనల కోసం కేటాయించిన ప్రదేశం జాబితా నుండి తొలగించారు. పౌరులు నిరసనలు నిర్వహించుకోవడానికి వీలుగా ఢిల్లీ పోలీసులు మూడు కొత్త ప్రదేశాలను ప్రకటించారు. అక్టోబర్ 11న జారీ చేసిన ఒక ఉత్తర్వులో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తూర్పు ఢిల్లీలోని రామ్‌లీలా గ్రౌండ్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్లను నిరసనలు, ప్రదర్శనల కోసం కొత్త వేదికలుగా నిర్దేశించారు.ఇదీ చదవండి: ఇది శివ తాండవం.. ప్లానింగ్ అవసరం లేదు : రాహుల్ గాంధీ -
నిరసనలకు జంతర్ మంతర్ కేంద్రంగా ఎలా మారింది? ఇకపై ఏం కానుంది?
ఢిల్లీలోని జంతర్ మంతర్ దశాబ్దాలుగా ప్రజా నిరసనలకు కీలక వేదికగా నిలిచింది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి మహిళల భద్రత, రైతుల సమస్యలు, విద్యార్థుల ఆందోళనల వరకు అనేక ఉద్యమాలకు ఈ ప్రాంతం కేంద్రంగా మారింది. అయితే, నిరసనలకు అధికారికంగా కేటాయించిన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను ఢిల్లీ పోలీసులు తొలగించడంతో ప్రజల ఆందోళనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వేదికలపై మరోసారి చర్చ మొదలైంది.ప్రజా సమస్యలపై గళమెత్తడానికి జంతర్ మంతర్ అనేక వర్గాలకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ అధికార కేంద్రాలకు సమీపంలో ఉండటంతో తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లవచ్చని నిరసనకారులు భావించేవారు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అధికారిక నిరసన స్థలంగా గుర్తించకపోవడం ప్రజల నిరసన హక్కుపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 1993లో 33 సంస్థలు ప్రభుత్వ ఆర్థిక విధానాలు, మతతత్వానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద జైల్ భరో ఆందోళన నిర్వహించాయి.ఆ నిరసనలో దాదాపు 25,000 మంది పాల్గొన్నట్లు ఓ ఎంపీ పార్లమెంటులో ప్రస్తావించారు. 2011 ఏప్రిల్ 5న అన్నా హజారే అవినీతిని అరికట్టేందుకు బలమైన జనలోక్‌పాల్ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం మంత్రులు, పౌర సమాజ ప్రతినిధులతో కూడిన సంయుక్త ముసాయిదా కమిటీ ఏర్పాటుకు అంగీకరించడంతో ఉద్యమం ఊపందుకుంది. ఏప్రిల్ 9న ఆయన దీక్ష విరమించారు.2012 డిసెంబరులో నిరసనలుఆ తర్వాత 2012 డిసెంబరులో ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం, అనంతరం ఆమె మరణం దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమయ్యాయి. న్యాయం చేయాలని, మహిళల రక్షణకు కఠిన చట్టాలు తీసుకురావాలని కోరుతూ వేలాది మంది యువత జంతర్ మంతర్ పరిసరాల్లో నిరసనలు చేపట్టారు. 2014లో ఈశాన్య రాష్ట్రానికి చెందిన విద్యార్థి నీడో తానియా మృతిపై కూడా ఇక్కడ ఆందోళనలు జరిగాయి.ఈ ఘటన జాతి వివక్ష, ఈశాన్య ప్రాంత ప్రజలపై దాడుల అంశాలను చర్చలోకి తెచ్చింది. 2017లో తమిళనాడు రైతులు వ్యవసాయ సంక్షోభం, అప్పుల భారం, కరువు నష్టాలపై 41 రోజులపాటు నిరసన తెలిపారు. 2023లో భారత రెజ్లింగ్ సమాఖ్య అప్పటి అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో ప్రముఖ రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 2024లో నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వివాదంపైనా విద్యార్థులు నిరసనలు నిర్వహించారు.అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్న రాణి శర్మ మాట్లాడుతూ.. జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించడం అసమ్మతి వ్యక్తం చేసే అవకాశాలను కుదించడమేనని అభిప్రాయపడ్డారు. “ప్రభుత్వ అత్యున్నత కార్యాలయాలకు జంతర్ మంతర్ సమీపంలో ఉండటం వల్ల ప్రజలు తమ గళాన్ని వినిపించడానికి, తమ మాట వినిపించుకునేందుకు ఇది సరైన వేదికగా నిలిచింది. దీన్ని అధికారిక నిరసన స్థలంగా గుర్తించకపోవడం అసమ్మతి స్వరాలపై అణచివేత చర్య” అని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు, జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా గుర్తించకపోవడం ప్రజా ఉద్యమాల భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వానికి సమీపంలో నిరసన తెలిపే అవకాశం తగ్గితే ప్రజల సమస్యలు ఎంతవరకు పాలకుల దృష్టికి చేరతాయన్నది కీలకంగా మారింది. -
దేశమంతా జంతర్ మంతర్‌గా మారుతోంది: సీజేపీ సంచలనం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడానికి వీల్లేకుండా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ ప్రదేశాన్ని నిరసన వేదికల జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మండిపడింది. జంతర్ మంతర్‌ను నిరసనల వేదిక జాబితా నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ ఎక్స్‌లో స్పందిస్తూ... ‘కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. “ఆమోదయోగ్యం కాదు.. జంతర్ మంతర్‌ను చూసి నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.జంతర్ మంతర్ భారత ప్రజలకు చెందినదని పేర్కొన్న దాస్.. ఈ నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రజలను సంప్రదించిందా అని నిలదీశారు. సంబంధిత వర్గాలు, సంస్థల అభిప్రాయాలను తీసుకున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రజలకు చెందిన జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా తొలగిస్తున్నట్లుగానే, త్వరలో ప్రధానమంత్రి భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ చర్య ఆ దిశగా వేసిన అడుగుగా అభివర్ణించారు.నిరసన తెలిపే హక్కుపై దాడిప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమని, దీనిని తాము అంగీకరించబోమని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. నిరసన తెలిపే ప్రాథమిక హక్కుతో పాటు శాంతియుతంగా సమావేశమయ్యే హక్కుపై ఇది దాడి అని ఆరోపించారు. ప్రస్తుతం దేశమంతా జంతర్ మంతర్‌గా మారుతోందని వ్యాఖ్యానించారు. సీజేపీ కన్వీనర్ దీప్కే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ అక్టోబర్ 11న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. నిరసనలు, ఆందోళనల కోసం రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ మైదాన్‌ను కొత్త వేదికలుగా గుర్తించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలు నిర్వహించేందుకు పిలుపులు రావడంతో దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా తొలగించడంపై సీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, ఈ అంశంపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో, నిరసనల నిర్వహణపై తదుపరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.ఇదీ చదవండి: ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరికి నోబెల్ -
జంతర్ మంతర్‌పై సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు, ధర్నాలకు ప్రసిద్ధి చెందిన జంతర్ మంతర్‌పై సంచలన నిర్ణయం వెలువడింది. అక్కడ ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడానికి వీల్లేకుండా హోం మంత్రిత్వ శాఖ ఆ ప్రదేశాన్ని నిరసన వేదికల జాబితా నుంచి తొలగించింది. వరుస ఆందోళనలు, భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మూడు ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించిన పోలీసులు.. అక్కడే నిరసనలు నిర్వహించాల్సి ఉంటుందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు అనుమతి లేకపోవడంతో ఇకపై నిరసనకారులు ప్రత్యామ్నాయ వేదికలను ఆశ్రయించాల్సి ఉంటుంది. రామ్‌లీలా మైదాన్, బురాఠీ మైదాన్, సీబీడీ గ్రౌండ్స్‌ను (CBD Ground) ఇందుకోసం ఎంపిక చేసినట్లు ఢిల్లీ పోలీసుల తెలిపారు. దీంతో ఇక నుంచి నిరసనల నిర్వహణకు సంబంధించి అనుమతులు, సమయాలు, భద్రతా ఏర్పాట్లపై పోలీసుల మార్గదర్శకాలు కీలకం కానున్నాయి.నిరసన హక్కుపై సీజేపీ నేతల ప్రశ్నలుమరోవైపు, జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరేందుకు సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు వాళ్లకు ఎలాంటి హామీ ఇవ్వనట్లు తెలుస్తోంది. సీజేపీ ర్యాలీకి నిరసనకు ఎప్పుడు అనుమతి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని కోరారు. అనుమతి ఇచ్చిన 24 గంటల్లోనే నిర్దేశిత వేదిక వద్ద ఆందోళన నిర్వహిస్తామని అశుతోష్ రంకా తెలిపారు. శాంతియుత నిరసన రాజ్యాంగం కల్పించిన హక్కు అని సౌరవ్ దాస్ పేర్కొన్నారు. నిరసనకు పది రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో, ఇప్పుడు తేదీ, సమయాన్ని పోలీసులే నిర్ణయించాలని కోరినట్లు తెలిపారు. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులకు 24 గంటల డెడ్‌లైన్ విధించినట్లు చెప్పారాయన. భద్రతా కారణాలే ప్రధానమా?రాజధాని నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్ దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాలు తమ నిరసనలను తెలియజేసే ప్రధాన వేదికగా చాలాకాలంగా కొనసాగుతోంది. ఆ మధ్య ఈ ప్రాంతంలో ఆందోళనల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయనే చర్చా నడిచింది. అది కోర్టు దాకా వెళ్లింది కూడా. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని నిరసన వేదికల జాబితా నుంచి తొలగించడంతో రాజకీయ, సామాజిక ఆందోళనల నిర్వహణపై ప్రభావం పడనుంది. భద్రతా కారణాలతో ఢిల్లీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం నిరసనల నిర్వహణను ఎలా మార్చనుంది? ప్రత్యామ్నాయ వేదికల్లో ఆందోళనలకు అనుమతులు సజావుగా లభిస్తాయా? అన్నది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: జంతర్ మంతర్ కథే వేరు.. 300 ఏళ్ల ఆసక్తికర ప్రయాణం -
అదే అలజడి
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) మూటున కోట్లాది ఓటర్ల ఓటు హక్కును హరించాడని విపక్షాలు, విద్యార్థి, సామాజిక సంఘాల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో కాక్రోచ్ జనతాపార్టీ వరుసగా రెండోరోజు సైతం నిరసనలతో హోరెత్తించింది. సీజేపీ పిలుపు మేరకు నిరసనకారులు కన్నాట్‌ప్లేస్‌లోని ఇన్నర్సర్కిల్ నుంచి రాజీవ్‌చౌక్ వైపు పెద్దసంఖ్యలో కార్యకర్తలు జంతర్‌మంతర్ వైపు దూసుకెళ్లారు. అయితే బారీకేడ్లతో వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిలువరించి నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆదివారంనాటి నిరసనల్లో 200 మందికిపైగా ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్‌చేశారు. వీళ్లను ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎస్ఎఫ్ఐ), ఏఐఎస్ఏ), కేవైఎస్ తదితర విద్యార్థి సంఘాల సభ్యులను అరెస్టు చేశారు. సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్, ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా తదితరులనూ నిర్బంధంలోకి తీసుకున్నారు. నేహా చేతులు, కాళ్లను పట్టుకుని మహిళా పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. జంతర్‌మంతర్‌కు చాలా దూరంలో ఉన్న సాధారణ ప్రజలను సైతం పోలీసులు ముందుజాగ్రత్తగా అదుపులోకి తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది. మోదీ ఓటమిని అంగీకరించారు: దీప్కే ప్రధాని మోదీపై సీజేపీ కనీ్వనర్ అభిజీత్ దీప్కే ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. నిరసనలు ప్రారంభం కాకముందే మోదీ ఓటమిని అంగీకరించారని ఎద్దేవా చేశారు. నిరసనకారులను అణచివేయడం, ఢిల్లీలో ఆంక్షలు విధించడం బలానికి సంకేతాలు కావని పేర్కొన్నారు. ప్రజలను చూసి పాలకులు భయపడుతున్నారని చెప్పడానికి ఇది నిదర్శనమని ఉద్ఘాటించారు. అక్టోబర్ 10వ తేదీ నియంతృత్వ పాలన అంతానికి నాంది పలికిన రోజుగా నిలిచిపోతుందన్నారు. ఆయన ఆదివారం మహారాష్ట్రలోని నాగపూర్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. తాము మళ్లీ వీధుల్లోకి వస్తామని ప్రకటించారు. తాను పోలీసుల అదుపులో ఉన్నప్పుడు ఫోన్ వాడుకోనివ్వలేదని, తన న్యాయవాదితో మాట్లాడేందుకు అనుమతించలేదని అభిజీత్ దిప్కే ఢిల్లీ పోలీసులపై ఆరోపణలు చేశారు. ‘‘నానమ్మను కోల్పోయిన తర్వాత మా కుటుంబాన్ని ఇంకా ఎంతటి మానసిక వేదనకు గురిచేయాలనుకున్నారు? తెల్లవారుజామున 3:30 గంటలకు మా తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని చెప్పడంలో పోలీసుల ఉద్దేశం ఏమిటి? వారిని హింసించాలనుకున్నారా?’’ అని దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులకు వైద్య, న్యాయ సహాయం ఢిల్లీలో నిరసనకారులకు వాలంటీర్లు, వైద్యులు, న్యాయవాదులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో కూడిన ఒక నెట్వర్క్ ముందుకొచ్చి వైద్య సహాయం, న్యాయ సహాయం వరకు అందిస్తోంది. నిరసనకారులకు మద్దతుగా ప్రస్తుతం 130 మందికి పైగా పనిచేస్తున్నారని ఒక సీజేపీ వలంటీర్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత ఇంటికి తిరిగి వస్తున్న వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘డిటెయినీ ఘర్ వాపసీ యోజన’, గాయపడినవారికి సహాయం చేయడానికి వైద్యులతో, వాలంటీర్లతో ‘ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఫస్ట్ ఎయిడ్ నెట్వర్క్’ పని చేస్తున్నాయి. తమకు మద్దతు ఇవ్వడానికి చాలామంది స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని సీజేపీ నేతలు వెల్లడించారు. ఇక దేశవ్యాప్త నిరసనలు: సీజేపీజ్ఞానేశ్ రాజీనామా చేసేదాకా తమ పోరాటం ఆగదని సీజేపీ తేల్చిచెప్పింది. ఎస్ఐఆర్లో అక్రమాలపై నిరసన ఇక దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని ప్రకటించింది. శనివారం ఢిల్లీలో ఆందోళన సందర్భంగా అరెస్టయిన సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఆదివారం కోర్టు ఆదేశాలతో విడుదలయ్యారు. అనంతరం దాస్, అశుతోష్ మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ‘అత్యవసర పరిస్థితిని’ సృష్టించి, సొంత పౌరులకే వ్యతిరేకంగా దమనకాండ సాగిస్తోందని దాస్ ఆరోపించారు. ఏడాదిపాటు శాంతికి భంగం కలిగించకూడదని కోర్టు షరతు విధించినట్లు చెప్పారు. జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులను సంప్రదించనున్నట్లు అశుతోష్ రంకా ఆదివారం తెలిపారు. నిరసన కోసం ఒక తేదీని సూచించాలని కోరుతూ సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నట్లు ‘ఎక్స్’లో వెల్లడించారు. 24 గంటల్లోగా పోలీసులు స్పందించకపోతే మరోసారి నిరసనకు పిలుపునిస్తామని తేల్చిచెప్పారు. షరతులతో నేతల విడుదల కాక్రోచ్ జనతా పార్టీ ముఖ్యనేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాకు భారీ ఊరట లభించింది. వారిని విడుదల చేయాలని న్యాయస్థానం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు ముగ్గురు నేతలను విడుదల చేశారు. శనివారం ఢిల్లీలో ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను పోలీసులు విమానంలోనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల నిర్బంధంలో ఉన్న ముగ్గురు నేతలకు తక్షణమే విడుదల విముక్తి కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం ఆదివారం విచారణ చేపట్టింది. ముగ్గురు నేతలను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఏడాదిపాటు శాంతికి విఘాతం కలిగించవద్దని, స్రత్పవర్తనతో మెలగాలన్న షరతుతో ముగ్గురి విడుదలకు కోర్టు అంగీకరించింది. రూ.50,000 పూచీకత్తు సమరి్పంచాలని పేర్కొంది. వారిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ అంశాన్ని అతిపెద్ద న్యాయపరమైన విజయంగా కాక్రోచ్ జనతా పార్టీ అభివరి్ణంచింది. నిర్బంధం నుంచి విడుదలై తర్వాత అభిజీత్ దీప్కే తన నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు స్వగ్రామానికి బయలుదేరారు. అయితే ముగ్గురు నేతల విడుదలను చట్టపరమైన విజయంగా సీజేపీ అభివరి్ణంచింది. ర్యాలీగా సుప్రీంకోర్టుకు సాక్షి, న్యూఢిల్లీ/బెంగళూరు: సోమవారం కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి పార్టీలు సైతం భారీ నిరసనలకు పూనుకుంటున్నాయి. అయితే, ముందుగా సుప్రీంకోర్టు వరకు ర్యాలీ నిర్వహించి, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు మెమోరాండం సమర్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ర్యాలీలో పౌర సంఘాలు, యువత కూడా పాల్గొంటుందన్నారు. బెంగళూరులో మీడియా సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ విషయం చెప్పారు. అయితే, సీజేఐని తాము సాయంత్రం 4–5 గంటల మధ్య అపాయింట్మెంట్ కోరామన్నారు. సీజేఐని ఎలాంటి డిమాండ్లు చేయబోమని, తాము తెలిపిన అంశాలపై పరిశీలన చేయాలని మాత్రమే విజ్ఞప్తి చేస్తామని ఖర్గే అన్నారు. సీజేఐతో భేటీ అనంతరం కూటమి పక్షాలతో కలిసి ఆందోళన చేపడతామని రాహుల్ వివరించారు. ఓటు చోరీని, సర్ ప్రక్రియను నిలిపివేయాలని, తిరిగి బ్యాలెట్ విధానాన్ని తేవడంతోపాటు సీఈసీ రాజీనామా చేయాలని కోరుతామని ఆయన వివరించారు. అందరూ ర్యాలీలో పాల్గొనాలని కోరుతూ ఒక వీడియోను విడుదల చేశారు. కాగా, కాంగ్రెస్ పిలుపు మేరకు తెలంగాణ, తమిళనాడు, కేరళం, కర్ణాటక, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఢిల్లీకి పెద్ద సంఖ్యలో నేతలు చేరుకున్నారు. భేటీకి సీజేఐ నిరాకరణ!కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని కలిసేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరాకరించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ, ఓట్ల చోరీపై ఆరోపణల వ్యవహారం ప్రస్తుతం న్యాయవ్యవస్థ పరిధిలో విచారణలో ఉన్నాయని ఆయన పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు ఆదివారం తెలిపాయి. -
ఢిల్లీ ధర్నాలో వాళ్ల ముసుగులో వీళ్లు అమ్మాయిలపై దాడులు
న్యూఢిల్లీ: అక్టోబర్ 10న జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలో అమ్మాయిలు, మహిళలు, ఇతర విద్యార్థులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాము హిందూ రక్షా దళ్‌కు చెందినవారమని చెప్పుకున్న ఈ వ్యక్తులు.. ఆ ముసుగులో డీడీయూ మార్గ్‌లో నిరసనకారులను కొట్టడం, మహిళలను తోసివేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అరెస్టయిన వారిని రమణ్ సైనీ (50), వివేకానంద్ అలియాస్ వివేక్ (32), కపిల్ కుమార్ (27), రవీందర్ సింగ్ అలియాస్ గోవింద్ హిందూ (35)గా గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీయూ మార్గ్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కొందరు యువ విద్యార్థులపై దాడి చేయడం, మహిళలను బలవంతంగా తోసివేయడం వీడియోలో కనిపించింది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఓ పోలీసు సిబ్బంది కూడా ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది.నిరసన మొదటి రోజున విద్యార్థులు దేశ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో గుమిగూడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లోని గ్రూపుల్లో చక్కర్లు కొట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, తొలుత ఘటన జరిగిన కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించలేకపోయారు. నిరసన నేపథ్యంలో నగరవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు, తనిఖీలు చేపట్టిన సమయంలో సిబ్బంది ఆ ప్రాంతాన్ని గుర్తించినట్లు వెల్లడించాయి.ఇదీ చదవండి: జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకే అణచివేత: సౌరవ్ దాస్ అధికారిక ఫిర్యాదు అందకపోయినా.. ఈ ఘటనపై తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ, వీడియో తమ దృష్టికి రావడం, నిందితులు ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందన్న విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు స్వయంగా కేసును పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టారు. నలుగురిని గుర్తించి అరెస్టు చేసినట్లు సీనియర్ అధికారి వెల్లడించారు.ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా సీజేపీ నిరసన చేపట్టింది. ఈ ఆందోళనల సందర్భంగా ఢిల్లీలో పలుచోట్ల నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేలాది మందిని నిర్బంధించినట్లు వార్తలు వెలువడ్డాయి.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను భారత యువజన కాంగ్రెస్, అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్ఏ), సీజేపీకి సంబంధించిన సామాజిక మాధ్యమ ఖాతాలు కూడా పంచుకున్నాయి. దాడి ఘటనపై తదుపరి పోలీసు చర్యలు, నిరసనల సమయంలో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై విచారణ ఎలా సాగుతుందన్నది కీలకంగా మారింది.POLICE ACTION Taking suo motu cognizance of a video circulating on social media showing four men allegedly assaulting a male protester, Delhi Police, PS Kamla Market, acted promptly and initiated legal proceedings. All four individuals involved have been identified and traced. Further legal action is underway in accordance with the law. Delhi Police remains committed to taking appropriate action against incidents of violence and ensuring that complaints of such nature are dealt with promptly. #DPUpdates— Delhi Police (@DelhiPolice) October 11, 2026 -
ఢిల్లీలో హైటెన్షన్.. మధ్యాహ్నం 2 గంటలకు సీజేపీ కీలక ప్రెస్‌మీట్
ఢిల్లీలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. నేడు కూడా నిరసనలు తెలుపుతామన్న సీజేపీ.. జ్ఞానేష్ రాజీనామా చేసే వరకు నిరసనలు చేస్తామంటూ తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని.. ఎన్నికల పారదర్శకత కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలంటూ సీజేపీ పిలుపునిచ్చింది.సుప్రీంకోర్టు కీలక ఆదేశాలుమెట్రో రైళ్ల సర్వీసులు పూర్తిగా నడపాలిశాంతి భద్రతల సమస్యలు ఎదురుకానంత వరకు సాధారణ సర్వీసులు నడపాలిఇంటర్నెట్ పునరుద్దరణ చేయండిన్యాయవాదుల ప్రొఫెషనల్ డ్యూటీకి పోలీసులు ఆటంకం కల్పించొద్దుమధ్యాహ్నం 2 గంటలకు సీజేపీ కీలక ప్రెస్మీట్ఎన్నికల జాబితా అక్రమాలపై పోరాటం కొనసాగిస్తామన్న సీజేపీసీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్13 కోట్ల ఓట్ల తొలగింపు, తారుమారుపై జవాబుదారీతనం నిర్థారించాలని డిమాండ్దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని పార్టీ ప్రకటనసీజేపీ నేతలు, పౌరుల నిర్బంధాలపై పార్టీ అభ్యంతరంఢిల్లీని కోటలా మార్చారంటూ ప్రభుత్వంపై సీజేపీ నేతల విమర్శలు15 వేల మందికి పైగా నిర్బంధానికి గురయ్యారన్న సీజేపీ ప్రతినిధులురైళ్లు, బస్సులు, విమానాల రద్దుతో నిరసనలకు ఆటంకం కలిగించారని ఆరోపణమెట్రో స్టేషన్ల మూసివేత, సిగ్నల్ జామర్ల వినియోగంపై అభ్యంతరాలుప్రతిపక్షాలు, పౌర సమాజం మధ్య ఐక్యత ఉందన్న ఎన్సీపీ నేత అనీష్ గవాండేఎన్నికల పారదర్శకత కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపునియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా విస్తృత ఐక్యతతో పోరాడతామన్న ఎస్ఎఫ్ఐజంతర్ మంతర్ వద్ద నిరసనలకు ఆంక్షలు విధించడంపై విమర్శలురాజ్యాంగ హక్కులు, ఎన్నికల పారదర్శకత కోసం ఉద్యమం కొనసాగిస్తామన్న సీజేపీసీజేపీ నేతలు అభిజిత్, అశుతోష్ విడుదలపోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన సీజేపీ నేతలు అభిజిత్, అశుతోష్ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆదేశాలతో సీజేపీ నేతల విడుదలనిన్న ఢిల్లీ వస్తున్న సీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులునేడు సుప్రీం కోర్టు ప్రత్యేక విచారణనేడు ఢిల్లీ పోలీసుల ఆంక్షలు, కోర్టు ధిక్కార పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణసీజేపీ నిరసన నేపథ్యంలో విధించిన ఆంక్షలు పరిమితంగానే ఉండాలన్న సుప్రీం ఆదేశాలుపాటించకపోవడంపై ధిక్కార పిటిషన్ దాఖలుజస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహన ధర్మాసనం విచారణమళ్లీ హీటెక్కిన జంతర్ మంతర్ ఎస్ఐఆర్ వివాదంపై రెండో రోజుకు చేరిన సీజేపీ ఆందోళనలు ఎస్ఐఆర్ అంశంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు సీజేపీ పిలుపు అప్రమత్తమైన పోలీసులు.. అదుపులోకి వందల మంది సీజేపీ కార్యకర్తలు,ముఖ్య నేతలునిన్న ఉదయం నుంచి పోలీసుల అదుపులోనే అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్నేడు ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఈ ముగ్గురు నేతలు నాయకుల అరెస్టులతో నిరసనలు ఆగిపోవన్న సీజేపీ మరో నేత అజింక్య షిండే నేతల గైర్హాజరీలోనూ ఆందోళనకారులు నేడు మరోసారి జంతర్ మంతర్ వైపు భారీ మార్చ్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదన్న షిండే ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌కు అభిజిత్ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌కు సీజేపీ ఫౌండర్ అభిజీత్, అశుతోష్ , సౌరవ్9 గంటలకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్న పోలీసులు👉చలో జంతర్ మంతర్‌కు నేడు మరోసారి సీజీపీ నిరసన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో జరిగిన నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను నిర్బంధించడంపై మీడియా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బహిరంగ క్షమాపణ చెప్పాలని సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.👉ప్రెస్ గుర్తింపు కార్డులు చూపించినప్పటికీ పలువురు జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించారని, కొందరు విలేకరుల ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారని మీడియా సంఘాలు ఆరోపించాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ శనివారం నిరసన తెలిపిన వందలాది మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రకటనలో పేర్కొన్నాయి.👉పోలీసుల చర్యలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను సైతం బస్సుల్లో ఎక్కించి ఛత్రసాల్ స్టేడియం, చాణక్యపురి పోలీస్ స్టేషన్ సహా పలు నిర్బంధ కేంద్రాలకు తరలించారని తెలిపాయి. నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మీడియా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.ఇదీ చదవండి: అడుగడుగునా అణచివేత -
అరాచకవాదుల కుట్ర విఫలమైంది
సాక్షి, న్యూఢిల్లీ: ఓట్ల చోరీ పేరుతో ఫేక్‌న్యూస్ వ్యాప్తి చేస్తూ జంతర్‌మంతర్ వద్ద అరాచకం సృష్టించి దేశాన్ని బందీ చేయాలని చూసిన విపక్షాల కుట్ర పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు. దేశ రాజధాని వేదికగా మూకస్వామ్యంపై ప్రజాస్వామ్యం విజయం సాధించిందని స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. భారతదేశ విస్తీర్ణం 32,87,000 చదరపు కిలోమీటర్లు కాగా, జంతర్‌మంతర్ పరిధి కేవలం 4 చదరపు కిలోమీటర్లు మాత్రమేనని అన్నారు. ఆ కొద్ది ప్రాంతంలో గందరగోళం సృష్టించి, అదే దేశ ముఖచిత్రంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనీస రాజ్యాంగ మర్యాదలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల చోరీపై ఎలాంటి ఆధారాలు లేకుండానే రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి వినతిపత్రం సమర్పించారని, బయటకు రాగానే తమ వాదనతో రాష్ట్రపతి ఏకీభవించారంటూ అవాస్తవాలు మాట్లాడారని తప్పుబట్టారు. రాజ్యాంగ అధినేతను రాజకీయ వివాదాల్లోకి లాగడం రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. -
అడుగడుగునా అణచివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అక్రమాలు జరిగాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు అనుమతి నిరాకరించారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా ఉదయం నుంచే భద్రతను పటిష్టం చేశారు. 35,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. జంతర్‌మంతర్‌కు వైపు వెళ్లే నాలుగు మార్గాల వద్దే 5 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అటుగా వస్తున్న ప్రతి వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, సీజేపీ నేతలు సహా 7,000 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.నగరంతోపాటు పొరుగు రాష్ట్రాల్లోని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. విమానం దిగకుండానే... సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతోపాటు ఆ పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ముంబై నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగానే పోలీసులు లోపలికి చొరబడ్డారు. ఈ ముగ్గురూ తమ సీట్లలో నుంచి లేచేలోపే మహిళా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వేర్వేరు నిర్బంధ కేంద్రాలకు తరలించారు. తమ నాయకులు ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియడం లేదని కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన వ్యక్తంచేసింది. ధర్నాకు దిగిన మమతా బెనర్జీ అరెస్టు న్యూఢిల్లీ జిల్లాలో బీఎన్ఎస్ఎస్–2023లోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చారు. ప్రజలు గుమిగూడకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలపైనా ఆంక్షలు విధించారు. మెట్రో స్టేషన్లను మూసివేశారు. జంతర్‌మంతర్ వైపు ర్యాలీగా బయలుదేరిన ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరా, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీని పోలీసులు అడ్డుకోగా, ఆమె తమ పార్టీ నేతలతో కలిసి సౌత్ అవెన్యూ బస్‌స్టాప్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆ పార్టీ నాయకులను సైతం అరెస్టు చేశారు. కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్లను సైతం అరెస్టు చేసి ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు. సీజేపీ నిరసనకు మద్దతు ప్రకటించడానికి వచ్చిన యూట్యూబర్ ధ్రువ్ రాఠీని గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ, కమ్యూనిస్టు అగ్రనేత బృందా కారత్, సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి ప్రధాన దీపాంకర్ భట్టాచార్యను సైతం పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని ప్రాంతాల్లో లాఠీచార్జి నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. దాదాపు 57 మెట్రో స్టేషన్లను మూసివేసినప్పటికీ.. ఆందోళనకారులు ఆయా స్టేషన్ల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుప్రీంకోర్టు వద్ద లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణ సీజేపీ నిరసనకు మద్దతు తెలిపేందుకు వందలాది మంది లాయర్లు సుప్రీంకోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరారు. వీరిని ప్రధాన ద్వారాల పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులకు, లాయర్లకు మధ్య వాగి్వవాదం చోటుచేసుకుంది. తోపులాట జరిగింది. కొందరు లాయర్లను పోలీసులు కాలర్లు పట్టుకుని ఈడ్చిపారేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. పలువురు లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తక్షణం విడుదల చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోలీసులను ఆదేశించారు. నిర్మానుష్యంగా మారిన సెంట్రల్ ఢిల్లీ సెంట్రల్ ఢిల్లీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది. కేంద్ర బలగాలు మినహా సాధారణ ప్రజలు ఆ ప్రాంతంలో కనిపించలేదు. నిరసనకారులు జంతర్‌మంతర్ వరకు చేరుకోకుండానే పోలీసులు మధ్యలోనే నిర్బంధించారు. మొత్తానికి సెంట్రల్ ఢిల్లీ ప్రాంతం లాక్డౌన్ పరిస్థితిని తలపించింది. పోలీసులకు గాయాలు ఆకాశవాణి భవన్ సమీపంలోని ఇంతియాజ్ అలీ మార్గ్ వద్ద నిరసనకారులు బారికేడ్లను పడగొట్టి, భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని చెప్పారు. నిరసనకారుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే వేర్వేరు ప్రాంతాల్లో నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పింక్ ఫోర్స్‌కు చెందిన ఒక మహిళా సభ్యురాలితో సహా ఆరుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారని పేర్కొన్నారు. గాయపడిన పోలీసులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని వెల్లడించారు. మోదీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు: కేజ్రీవాల్ ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా యువత నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ఓట్లను దొంగిలించి ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని అన్నారు. పోలీసులు ఎక్కడ ఆపితే అక్కడే బైఠాయించాలని, ఆ ప్రదేశాన్ని జంతర్‌మంతర్‌గా మార్చాలని యువతకు సూచించారు. దేశ యువత మేల్కొందని, మోదీ నిరంకుశత్వానికి భయపడరని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. భారతదేశాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఎమర్జెన్సీని దాటిపోయిందని, ఇది సూపర్ ఎమర్జెన్సీగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలను చూసి భయపడుతోందని, అందుకే తమను నిర్బంధించిందని కేరళ మాజీ సీఎం విజయన్ విమర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విజయన్‌కు ఔషధాలు అందజేయకుండా పోలీసులు అడ్డుకున్నారని సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ మండిపడ్డారు నేడు జంతర్‌మంతర్‌కు చేరుకుంటాం: అజింక్య షిండే దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ విధించిందని సీజేపీ ఉద్యమ సారథి అజింక్య షిండే ఆరోపించారు. సారధి దీప్కేతోపాటు ముఖ్య నేతలు సౌరబ్ దాస్, అశుతోష్ రంకాను పోలీసులు నిర్బంధిండంతో ఉద్యమ సారథ్యం బాధ్యతను అజింక్య షిండే(35)కు సీజేపీ అప్పగించింది. కొత్త హోదాలో ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసేందుకు వస్తున్న నాయకులు, సామాన్య ప్రజలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా, పోలీసు బలగాలతో అణచివేయాలని చూసినా తమ పోరాటం ఆగబోదని అజింక్య షిండే తేల్చిచెప్పారు. ‘‘ఇది ఒక్కరోజుతో ముగిసేది కాదు. మాది సుదీర్ఘమైన పోరాటం. ఓట్ల చోరీతో అధికారంలోకి వచ్చినవారు మళ్లీ గెలవలేమన్న భయంతోనే సీఈసీ జ్ఞానేశ్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. జ్ఞానేశ్ రాజీనామా చేసేవరకూ ఈ పోరాటం కొనసాగుతుంది. పోలీసులు ఎంతమందిని అరెస్టు చేసినా సరే ఆదివారం ఉదయం 10 గంటలకు మళ్లీ జంతర్‌మంతర్ వద్దకు చేరుకుంటాం’’అని ప్రకటించారు. తమను అరెస్టు చేస్తే ఆందోళన ఆగిపోతుందని ప్రభుత్వం భ్రమపడుతోందని అన్నారు. -
2K కాదు 50K పోలీసులను తెచ్చుకో... మోదీకి రాహుల్ సవాల్
-
అభిజీత్ దీప్కే ఇంట విషాదం
-
పినరయి విజయన్ అరెస్ట్
-
విమానంలోనే సీజేపీ నేతల నిర్బంధం
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అబిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగానే సుమారు డజను మంది మహిళా పోలీసులు విమానంలోకి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.విమానంలో ఇరుకైన మార్గాలు ఉండటం, పురుష పోలీసుల జోక్యంతో ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతోనే మహిళా పోలీసులను పంపి ఉండవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే పోలీసులు ఈ వ్యూహాన్ని ఉద్దేశపూర్వకంగా చేశారా? లేదా ఇంకేదైనా కారణంతో చేశారా అనేది స్పష్టంగా తెలియలేదు.ఈ ఏడాది జూలై 20న పరీక్ష పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో పురుష పోలీసులు అక్కడ ఉన్న యువతులపై దాడి చేశారంటూ సీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో తాజా నిర్బంధంలో మహిళా పోలీసులను ఉపయోగించడం ద్వారా ఉద్రిక్తతలు తగ్గించడంతోపాటు మరో వివాదం తలెత్తకుండా అధికారులు ప్రయత్నించి ఉండవచ్చని భావిస్తున్నారు.400 మందికి పైగా నిర్బంధంప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. అయితే దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ పార్టీ నేతలు మాత్రం నిరసనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, రత్నా సింగ్ సహా 400 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: సీజేపీ నిరసనకు సోనమ్ వాంగ్‌చుక్ దూరం! కారణం ఇదే.. -
పోలీసుల అదుపులో మనీష్ సిసోడియా
-
ఢిల్లీ పోలీసుల మాస్టర్‌స్ట్రోక్.. కాక్రోచ్ల ప్లాన్ చిత్తు?
లాఠీలు ఝళిపించడం, టియర్ గ్యాస్‌లు.. వాటర్ కేనన్లు ప్రయోగించడం, బలప్రయోగానికి దిగడమే నిరసనలను అడ్డుకునే మార్గమా? ఏమాత్రం కాదు.. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని మేధావులు ఎన్నో ఏళ్లుగా మొత్తుకుంటున్నారు. అలాగే సుప్రీం కోర్టు సైతం ఇటు మొట్టికాయలు వేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు వ్యూహాంతో సాంకేతిక నిఘా, పక్కా ప్రణాళికల ద్వారా ఢిల్లీ పోలీసులు ఈసారి ప్రతి అడుగులోనూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు.జంతర్ మంతర్ వద్ద శనివారం సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) తలపెట్టిన ‘జంతర్ మంతర్ 2.0’(Jantar Mantar 2.0) నిరసనను అడ్డుకునేందుకు పక్కా ప్లానింగ్‌తో ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. గత కొన్నిరోజులుగా ఈసీ వ్యతిరేక నిరసనల్లో వాళ్ల వ్యవహర శైలి ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఇప్పుడు.. కాక్రోచ్ల ర్యాలీ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది సిబ్బందిని మోహరించి, బాడీ కెమెరాలతో నిఘా పెట్టారు. వేదికకు చేరుకోక ముందే కీలక నేతలను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరకుండా కట్టడి చేయడంపై దృష్టి పెట్టారు. గత నిరసనల్లో ఎదురైన విమర్శలు పునరావృతం కాకుండా ఈసారి పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించారన్న చర్చ మొదలైంది.Ahead of the CJP protest ,Delhi Police personnel are equipped with body cams that record everything even in the dark 💪 https://t.co/6ZTA11IAZ3— Boiled Anda (@AmitLeliSlayer) October 10, 2026ఈసారి ‘నీట్’గా..నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలూ వచ్చాయి. ఈ పరిణామాలపై న్యాయపరమైన సవాళ్లు, విచారణ కోరుతూ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అదే సమయంలో.. తమపైనా దాడులు జరిగాయని.. సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు మొత్తుకున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఢిల్లీ పోలీసులు తీరు మార్చుకోవాలంటూ కోర్టులు సైతం అక్షింతలు వేస్తూ వచ్చాయి.जंतर-मंतर पर प्रदर्शन से पहले पुलिस का एक्शन! 🚨 CJP के प्रदर्शनकारी हिरासत में Cockroach Janta Party (CJP) के प्रदर्शन के लिए जुट रहे कुछ प्रदर्शनकारियों को दिल्ली पुलिस ने हिरासत में लिया। #Delhi #DelhiPolice #JantarMantar #CJP #BreakingNews #News https://t.co/Jhx34Fnrwm— PRIYA RANA (@priyarana3101) October 10, 2026ఈ నేపథ్యంలో ఈసారి ఢిల్లీ పోలీసులు మరో విధంగా సిద్ధమయ్యారు. నిరసనకారులు గుమిగూడిన తర్వాత పరిస్థితిని అదుపు చేయడం కంటే, వారు నిర్దేశిత ప్రాంతానికి చేరుకోకముందే కట్టడి చేయడంపై దృష్టి పెట్టారు. నిరసనకు అనుమతి లేదని ముందుగానే ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల నుంచి కీలక రహదారుల వరకు తనిఖీలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిరసనకు వస్తున్నారనే అనుమానంతో పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.బాడీ కెమెరాలతో ఆధారాలు.. చీకట్లోనూ రికార్డింగ్ఈసారి పోలీసుల వ్యూహంలో ప్రత్యేకంగా కనిపించిన అంశం బాడీ కెమెరాలు. విధుల్లో ఉన్న సిబ్బంది యూనిఫామ్‌లకు అమర్చిన ఈ కెమెరాలు చీకట్లోనూ ఘటనలను రికార్డు చేయగలవు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినా, తోపులాట చోటుచేసుకున్నా ఏం జరిగిందో ఫుటేజీ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది.గతంలో పోలీసులపై దురుసు ప్రవర్తన, అధిక బలప్రయోగం వంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఘటనాస్థలంలో ఏం జరిగిందన్న దానిపై వివాదాలు తలెత్తాయి. ఈసారి అలాంటి పరిస్థితుల్లో ఆధారాలు అందుబాటులో ఉండేలా కెమెరాలను ఉపయోగించారు. తమపై దాడులు జరిగినా, తాము ఎవరిపైనా అనుచితంగా వ్యవహరించలేదని నిరూపించుకోవాల్సి వచ్చినా ఈ ఫుటేజీ ఉపయోగపడుతుందని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. అంటే కెమెరాలు నిరసనకారుల కదలికలను మాత్రమే కాదు.. పోలీసుల చర్యలనూ రికార్డు చేస్తాయి.మహిళా సిబ్బందికి రక్షణగా ‘పింక్ ఫోర్స్’మహిళా పోలీసుల భద్రతకూ ఈసారి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. గత నిరసనల్లో మహిళా సిబ్బందిని తోసివేయడం, దురుసుగా ప్రవర్తించడం, దుస్తులు, బ్యాడ్జీలను చించివేయడం వంటి ఘటనలు జరిగాయని పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక మహిళా బృందమైన ‘పింక్ ఫోర్స్’ను రంగంలోకి దించారు. నిరసనకారులను నియంత్రించే సమయంలో మహిళా సిబ్బందికి రక్షణ కల్పించడం, పరిస్థితులు అదుపు తప్పకుండా చూడటం ఈ బృందం లక్ష్యం.విమానాశ్రయంలోనే నేతలకు అడ్డుకట్టనిరసనలో కీలక పాత్ర పోషించనున్న నేతలను కూడా పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను ఢిల్లీ విమానాశ్రయంలో విమానం దిగకముందే నిర్బంధించారు. సీజేపీ న్యాయ విభాగం అధిపతి రత్నా సింగ్, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సహా మరికొందరినీ అదుపులోకి తీసుకున్నారు. రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి వందల మందిని ముందస్తు చర్యల్లో భాగంగా నిర్బంధించారు.🚨 ABHIJEET DIPKE, SAURAV DAS AND ASHUTOSH RANKA DETAINED FROM INSIDE THEIR FLIGHT 🚨 Shame on you @narendramodi @AmitShah https://t.co/hXl6bzh53i— Cockroach Janta Party - CJP (@Cockroachisback) October 10, 2026మహిళా పోలీసులే హైలైట్!ఢిల్లీ పోలీసుల వ్యూహంలో ఈసారి మహిళా సిబ్బందే హైలైట్‌గా నిలిచారు. విమానంలోనే సీజేపీ కీలక నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను అదుపులోకి తీసుకునేందుకు మహిళా పోలీసులనే రంగంలోకి దించారు. గత కొన్నిరోజులుగా ఈసీ వ్యతిరేక నిరసనల్లోనూ మహిళా పోలీసులే ప్రధానంగా కనిపిస్తున్నారు. గత ఆందోళనల్లో మహిళా సిబ్బందిపై దాడులు జరిగాయన్న ఆరోపణలు, పోలీసుల తీరుపై విమర్శల నేపథ్యంలో.. ఈసారి మహిళా బలగాల మోహరింపు చర్చనీయాంశంగా మారింది. మెట్రో, రైళ్లు, ఇంటర్నెట్‌పైనా ఆంక్షలునిరసనకారులు జంతర్ మంతర్‌కు చేరకుండా రవాణా వ్యవస్థపైనా కఠిన ఆంక్షలు విధించారు. ఢిల్లీ మెట్రోలో 45 స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు. పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. జనపథ్–కర్తవ్య పథ్ కూడలి చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపైనా తాత్కాలిక ఆంక్షలు అమలు చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలను కలిపి 35 వేల మందికి పైగా సిబ్బందిని భద్రత కోసం మోహరించారు.పక్కా ప్రణాళికతో కట్టడి కానీ..ముందస్తు నిర్బంధాలు, బాడీ కెమెరాలు, ప్రత్యేక మహిళా బలగాలు, రవాణా ఆంక్షలు.. ఇలా అనేక చర్యలను ఒకేసారి అమలు చేసి నిరసనకారులు భారీగా గుమిగూడకుండా పోలీసులు ప్రయత్నించారు. నిరసనను అడ్డుకోవడంలో వారి వ్యూహం గణనీయమైన ప్రభావం చూపింది. అయితే, ప్రజా రవాణా నిలిపివేత, ఇంటర్నెట్ ఆంక్షలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.#WATCH | A passenger who was onboard the flight on which Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke was travelling to Delhi says, "We were travelling from Mumbai. We had to wait even after the flight landed. After the flight landed, we could hear sloganeering of 'Inquilab Zindabad' from the front of the aircraft. I don't know who Dipke is. They must be 'Cockroach' who must be behaving like this; I don't know much...They were on a protest for 36 days earlier. But will they create inconvenience everywhere? Public is inconvenienced due to a few people like this. If the names of people have been wrongfully deleted, Supreme Court will look into it. They (protesters) are not going to look into it. Shut down Courts if public will do everything. There is a system which we follow, shut down that system. If there is a problem, we will protest - will that help?"— ANI (@ANI) October 10, 2026శాంతిభద్రతలను కాపాడటం పోలీసుల బాధ్యతే. అదే సమయంలో నిరసన తెలిపే హక్కును, సాధారణ ప్రజల ప్రయాణ స్వేచ్ఛను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈసారి పోలీసులు బలప్రయోగం కంటే ముందస్తు ప్రణాళిక, సాంకేతిక నిఘాకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: లాఠీ పట్టని లేడీ సింగాన్ని చూశారా? -
ఢిల్లీలో హైటెన్షన్.. CJPకి భయపడుతోన్న కేంద్రం
-
ధృవ్ రాఠీ అరెస్ట్?.. దీప్కేకు టెన్షన్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టనున్న నిరసనల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. అయితే ఈ నిరసనలకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసి, నగరంలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సీజేపీ మద్దతుదారుల్ని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నిరసనకు అనుమతి కోరుతూ నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, భద్రతాపరమైన ఆందోళనలు, ముందస్తు నోటీసు గడువు పాటించకపోవడం, గత నిరసనల్లో నిబంధనల ఉల్లంఘనలను కారణాలుగా చూపుతూ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ నిరసన చేపడతామని సీజేపీ నాయకులు ప్రకటించారు. ధృవ్ రాఠీ అరెస్ట్?.. దీప్కే కోసం..సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే శనివారం ఉదయం ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ‘ఎమర్జెన్సీ’ తరహా పరిస్థితులతో భయపెట్టాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని.. నిరసనలకు అనుమతి లేకపోయినా వెనక్కి తగ్గబోమని ఆయన ప్రకటించారు. మరోవైపు, నిరసనలో పాల్గొనేందుకు విదేశాల నుంచి వచ్చిన యూట్యూబర్ ధృవ్ రాఠీ అరెస్ట్ అయినట్లు సమాచారం. గురుగ్రామ్‌లో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు.. ఈ నిరసనలకు మద్దతు తెలుపుతున్న ప్రకాశ్ రాజ్‌ను సైతం పోలీసులు అడ్డుకోవచ్చనే సమాచారం అందుతోంది. మరోవైపు దీప్కేను కూడా అరెస్ట్ చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది. నిరసనకారుల వరుస అరెస్టుల నేపథ్యంలో సీజేపీ శ్రేణులు అప్రమత్తం అయ్యాయి. STORY | YouTuber Dhruv Rathee detained by Delhi Police ahead of CJP protest: Sources YouTuber Dhruv Rathee was detained by Delhi Police from his residence in Gurugram's Sector 56 on Saturday ahead of the Cockroach Janta Party's (CJP) proposed protest at Jantar Mantar, police sources said. READ: https://t.co/xKTbD2i8AY— Press Trust of India (@PTI_News) October 10, 2026సరిహద్దుల్లో భారీ బందోబస్తునిరసన నేపథ్యంలో ఢిల్లీ అంతటా సుమారు 35 వేల మంది పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని మోహరించారు. జంతర్ మంతర్‌తోపాటు ఎన్నికల సంఘం కార్యాలయం పరిసరాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, నగర సరిహద్దుల్లో భద్రతను పెంచారు. ఇంటర్నెట్ స ఏవల్ని నిలిపివేశారు. ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా వ్యవస్థల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిరసన ప్రభావంతో పలు మెట్రో స్టేషన్లలో రాకపోకలపై ఆంక్షలు విధించగా, రైళ్లను కూడా రద్దు చేశారు. ఇదీ చదవండి: ఎన్ని కేసులైనా పర్వాలేదు.. జైలుకైనా వెళ్తా -
జైలుకైనా సిద్ధం.. జ్ఞానేశ్ రాజీనామా చేసే వరకు పోరాటం: అభిజీత్ దీప్కే
న్యూఢిల్లీ: ఓట్ల తొలగింపు ఆరోపణలపై పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్త అభిజీత్ దీప్కే ప్రకటించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో జరగనున్న ‘జంతర్ మంతర్ 2.0’ నిరసనలో పాల్గొనేందుకు ముంబై నుంచి బయలుదేరిన సందర్భంగా ఆయన ఏఎన్ఐతో మాట్లాడారు. జైలుకు పంపుతామనే బెదిరింపులతో తమను వెనక్కి తగ్గించలేరని దీప్కే పేర్కొన్నారు. తమపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ), చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) వంటి చట్టాలను ప్రయోగించినా పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎంతటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని తెలిపారు.దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓట్లు తొలగించారని దీప్కే ఆరోపించారు. ఈ కారణంగా ప్రజలు ఓటు హక్కును కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపుపై బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేలా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఢిల్లీలో విధించిన ఆంక్షలపైనా దీప్కే ప్రశ్నలు లేవనెత్తారు. ఒక వ్యక్తికి రక్షణ కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధానిని మొత్తం స్తంభింపజేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైలు సేవలను నిలిపివేశారని, మెట్రోను మూసివేశారని, రహదారులను దిగ్బంధించారని, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని విమర్శించారు.మరోవైపు, నిరసన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 35 వేల మందికి పైగా ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ సిబ్బందిని మోహరించినట్లు ఏఎన్ఐ తెలిపింది. శాంతిభద్రతలను కాపాడాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించినట్లు పేర్కొంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై జవాబుదారీతనం కోరడమే నిరసన ఉద్దేశమని సీజేపీ తెలిపింది. నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఇదీ చదవండి: నిరసనకు ముందే వేధింపులు.. సౌరవ్ దాస్ ఆవేదన -
Delhi protest: ముందస్తుగా 40 మంది.. పోలీసుల అదుపులో..
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన కార్యక్రమానికి ముందు పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దేశ రాజధానిలోని మొత్తం 15 జిల్లాల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 30 నుంచి 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇతరులను సమీకరించే లేదా వారిపై ప్రభావం చూపగలరని అనుమానిస్తున్న వ్యక్తుల కదలికలపైనా పోలీసులు నిఘా పెట్టారు.అనుమానిత వ్యక్తుల నివాసాల వెలుపల నిఘాను పెంచినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిరసనకు ముందు భద్రతాపరమైన చర్యలను విస్తృతం చేసినట్లు పేర్కొన్నాయి. రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు వివరించాయి. నిరసన నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిరసన సందర్భంగా ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సీజేపీ ప్రతిపాదించిన నిరసన కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదీ చదవండి: నిరసనకు ముందే వేధింపులు.. సౌరవ్ దాస్ ఆవేదన -
సీజేపీ ధర్నా ఎఫెక్ట్.. కేంద్రం కీలక ఆదేశాలు!
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ నిరసనల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. జంతర్ మంతర్ వద్ద సీజేపీ (CJP) తలపెట్టిన ధర్నా నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించింది. ఇందుకోసం ఢిల్లీ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించింది.ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ఈ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి సీజేపీ సభ్యులు, మద్దతుదారులు ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే అవకాశముందని కేంద్ర హోం శాఖకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యలు చేపట్టాలని హోం మంత్రి అమిత్ షా కార్యాలయం వివిధ రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలు జారీ చేసింది.ఢిల్లీకి వెళ్లే సరిహద్దు మార్గాల్లో పోలీసుల నిఘా పెంచాలని కేంద్రం ఇప్పటికే సూచించింది. నిరసనల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తుల కదలికలను గమనించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించాలని ఆదేశించింది. ఆకతాయిలు, అరాచక శక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు ఢిల్లీ పోలీసులతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకోవాలని సూచించింది.శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంనిరసనల సందర్భంగా ప్రజా శాంతికి విఘాతం కలగకుండా, కీలక ప్రాంతాలు, మౌలిక సదుపాయాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న చట్టపరమైన నిబంధనల పరిధిలోనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించింది. రాష్ట్రాల మధ్య, ఢిల్లీ పోలీసులతో సమన్వయం నిరంతరం కొనసాగించాలని ఆదేశించింది. ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో కేంద్రం భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి.Delhi: A heavy police force has been deployed at Janpath Gol Chakkar. Security has been tightened on the road leading towards Janpath Metro Station, while Delhi Police have also put up barricades on Feroz Shah Road towards Mandi House. https://t.co/XtmSKa1pLC— IANS (@ians_india) October 10, 2026ఇదీ చదవండి: జంతర్ మంతర్‌కు జస్ట్ 1000 మందే! -
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఢిల్లీ మొత్తం పోలీసుల నిఘాలో
-
జంతర్ మంతర్‌లో 1,000 మందికే ఛాన్స్.. నిబంధనలివే!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టాలంటే పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుందా? లేక ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలా? నిరసనల్లో పాల్గొనే వారి సంఖ్యను బట్టి వేదికలను కూడా మార్చుకోవాల్సి ఉంటుందా? దేశ రాజధానిలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చేపట్టే ఆందోళనలపై ఈ ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో నిరసనలకు వర్తించే నిబంధనలు, అనుమతి ప్రక్రియ, పోలీసులు చేపట్టే చర్యలపై పలువురు ఆరా తీస్తున్నారు.శాంతియుత నిరసన హక్కు ఉన్నా.. భారత రాజ్యాంగం పౌరులకు శాంతియుతంగా సమావేశమై నిరసన తెలిపే హక్కును కల్పించింది. అయితే ఈ హక్కు సంపూర్ణమైనది కాదు. ప్రజా భద్రత, శాంతిభద్రతలు, రవాణా వ్యవస్థ, ఇతర పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా నిరసనలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే ఢిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో ధర్నాలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలనుకునే రాజకీయ పార్టీలు, సంస్థలు, పౌర సమూహాలు నిర్దేశిత నిబంధనలను పాటించాలి. సుప్రీంకోర్టు కూడా నిరసన తెలిపే హక్కుతోపాటు ప్రజా ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరాన్ని పలు తీర్పుల్లో స్పష్టం చేసింది.జంతర్ మంతర్ వద్ద..జంతర్ మంతర్ వంటి నిర్దేశిత నిరసన ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడానికి సంబంధిత పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు నిరసనల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశించింది. వీటికి అనుగుణంగా ఢిల్లీ పోలీసులు 2022లో జారీ చేసిన ఆదేశాల ప్రకారం నిరసన, ఊరేగింపు లేదా ప్రదర్శనకు ముందుగా సంబంధిత అధికారి నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలి. కేవలం పోలీసులకు సమాచారం అందించామని చెప్పడం మాత్రమే అనుమతి లభించినట్లు కాదని అధికారులు చెబుతున్నారు.పది రోజుల ముందే దరఖాస్తు.. జంతర్ మంతర్ వద్ద నిరసన నిర్వహించాలనుకునేవారు కనీసం పది రోజుల ముందుగా న్యూఢిల్లీ జిల్లా డీసీపీకి దరఖాస్తు సమర్పించాలి. నిరసన ఉద్దేశం, తేదీ, ప్రారంభ,ముగింపు సమయాలు, ప్రతిపాదిత ప్రదేశం, నిర్వాహకుల పేర్లు, సంప్రదింపు వివరాలను అందులో పేర్కొనాలి. అంతేకాకుండా కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతారనే అంచనా, నిరసన స్వరూపం, వేదిక ఏర్పాట్లు, లౌడ్‌స్పీకర్ల వినియోగం వంటి వివరాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఊరేగింపు నిర్వహించాలనుకుంటే దాని మార్గాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఈ సమాచారంతో పోలీసులు భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవచ్చు.ఎక్కడపడితే అక్కడ నిరసనలు కుదరవు!ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించడానికి అనుమతి ఉండదు. పార్లమెంట్, సెంట్రల్ విస్టా పరిసరాల్లో ప్రజా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇండియా గేట్, సీ-హెక్సాగన్, మాన్సింగ్ రోడ్, జన్‌పథ్, కర్తవ్య పథ్, చుట్టుపక్కల పచ్చిక బయళ్ల వంటి ప్రాంతాల్లో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలపై పరిమితులు వర్తిస్తాయి. ఆయా ప్రాంతాల్లో అమల్లో ఉన్న నిర్దిష్ట ఆదేశాలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలి. తమకు నచ్చిన వీధిలో లేదా ప్రభుత్వ ప్రాంగణంలో అనుమతి లేకుండా నిరసన నిర్వహించేందుకు వీల్లేదు. పరిస్థితులను బట్టి పోలీసులు ప్రత్యామ్నాయ వేదికలను సూచించే అవకాశం ఉంది.నిరసనకారుల సంఖ్యను బట్టి..నిరసనల్లో పాల్గొనే వారి సంఖ్య ఆధారంగా ఢిల్లీ పోలీసులు మూడు ప్రధాన వేదికలను నిర్దేశించారు. 1,000 మంది వరకు పాల్గొనే నిరసనలకు జంతర్ మంతర్, 1,000 నుంచి 50,000 మంది వరకు పాల్గొనే కార్యక్రమాలకు సెంట్రల్ ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్, 50,000 మందికి పైగా పాల్గొనే భారీ సమావేశాలకు ఔటర్ ఢిల్లీలోని బురారీ మైదాన్ కేటాయించినట్లు సమాచారం. ఈ వర్గీకరణ ప్రకారం భారీ జనసమీకరణకు జంతర్ మంతర్ వేదికను మాత్రమే కోరడం సాధ్యం కాకపోవచ్చు. అంచనా జనసంఖ్య, భద్రతా అవసరాలు, అందుబాటులో ఉన్న స్థలాన్ని పరిగణనలోకి తీసుకుని అధికారులు నిర్ణయం తీసుకుంటారు.అనుమతి లేకుంటే ఏం జరుగుతుంది?నిరసనకు అనుమతి నిరాకరించే అధికారం పోలీసులకు ఉంది. భద్రతా ముప్పులు, ట్రాఫిక్ సమస్యలు, ప్రజలకు కలిగే అసౌకర్యం, అత్యవసర సేవలకు ఆటంకం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుమతిపై నిర్ణయం తీసుకుంటారు. అవసరమైతే షరతులు విధించవచ్చు లేదా ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని సూచించవచ్చు. అనుమతి లేకుండా నిరసన నిర్వహించేందుకు ప్రయత్నిస్తే, సంబంధిత ప్రాంతంలో అమల్లో ఉన్న ఆదేశాలను బట్టి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 163 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పరిస్థితులను బట్టి గుమిగూడిన వారిని చెదరగొట్టడం, అదుపులోకి తీసుకోవడం, నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం వంటి చర్యలు చేపట్టవచ్చు. అయితే ఇవన్నీ.. వర్తించే చట్టాలు, అమల్లో ఉన్న ఆదేశాలు, ఘటనకు సంబంధించిన పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. నిరసన హక్కును పరిరక్షిస్తూనే ప్రజా శాంతిభద్రతలు, పౌరుల రాకపోకలు, భద్రతకు భంగం కలగకుండా చూడటమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం.ఇదీ చదవండి: దసరా సెలవులు.. ఏ రాష్ట్రంలో ఎక్కువో తెలుసా? -
ఎంతమంది పోలీసులను తెచ్చుకుంటారో తెచ్చుకోండి: రాహుల్
ఢిల్లీలో నిరసనలు అప్డేట్స్.. మిస్టర్ మోదీ.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి: రాహుల్ గాంధీఎంతమంది పోలీసులను తెచ్చుకుంటారో తెచ్చుకోండియువకులందరినీ, నేతలందరినీ అరెస్ట్ చేసుకోండిమేం మాత్రం వెనక్కి తగ్గం.. మిమ్మల్ని కమ్మేస్తాంమేం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం15 ఏళ్లలో దేశానికి ఏం జరిగిందో.. అది మళ్లీ జరగనివ్వం:రాజ్యాంగంపై దాడి చేసిన పాలకులను దించి తీరుతాందేశ యువతను చూసి గర్వపడుతున్నాయువత తమ పోరాటాన్ని ఆపొద్దు.. మీ వెనుక మేం ఉన్నాం కేజ్రీవాల్ అరెస్ట్ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్జంతర్ మంతర్ వద్ద కేజ్రీవాల్ అదుపులోకి తీసుకున్న పోలీసులు జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతజంతర్ మంతర్ వద్ద నిరసనల్లో బెంగాల్ మాజీ సీఎం అరెస్ట్జంతర్ మంతర్ వద్ద మమతా బెనర్జీని అదుపులోకి తీసుకున్న పోలీసులు జంతర్ మంతర్ వద్ద మాజీ సీఎంలు అరెస్ట్జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులుమాజీ సీఎంలు పినరయి విజయన్, మాణిక్ సర్కార్ అరెస్ట్ ఢిల్లీలో ఉద్రిక్తత..పోలీసులపైకి ఆందోళనకారుల రాళ్ల దాడి.పలువురు పోలీసులకు గాయాలు.30 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.ఆందోళకారులను చెదరగొట్టిన పోలీసులు. #WATCH | Delhi: Security personnel detain protesters at Connaught Place ahead of the protest called by the CJP. https://t.co/HOjuOmW0yN— ANI (@ANI) October 10, 2026సీజేపీ నిరసనలు.. అజింక్య షిండే నాయకత్వం..ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద సీజేపీ నిరసనపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా స్పందిస్తూ.. ఈరోజు ఢిల్లీ హాట్ జంతర్‌మంతర్‌గా మారింది అని వ్యాఖ్యలు.సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దీంతో సీజేపీ ఆర్గనైజేషన్ ఇన్చార్జి అజింక్య షిండే నిరసనకు నాయకత్వం వహించనున్నారు.జంతర్‌మంతర్ వద్ద సీజేపీ నిరసనకు మద్దతుగా ఏఐఎస్ఏ, వామపక్ష పార్టీల నేతలు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం సమీపంలో ఆందోళన చేపట్టారు.సుప్రీంకోర్టు పరిసరాలు, జంతర్‌మంతర్ సమీపంలో నిరసన తెలిపిన పలువురు న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.న్యాయవాదుల నిర్బంధంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు లేఖ రాసింది.ఆయన జోక్యంతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు.సీజేఐ జోక్యం అనంతరం అదుపులోకి తీసుకున్న న్యాయవాదులను విడుదల చేసే ప్రక్రియ ప్రారంభమైనట్లు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవవ్రత్ తెలిపారు.ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సీజేపీ నిరసనకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు.కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు పలువురు వామపక్ష నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీరంతా జంతర్‌మంతర్ నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చారు.మరోవైపు.. సీజేపీ మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.#WATCH | Delhi: SFI workers topple Police barricades as they carry out a protest march over CEC Gyanesh Kumar matter. Visuals from Imtiaz Khan Marg. https://t.co/LS3hHImI7u— ANI (@ANI) October 10, 2026కేజ్రీవాల్ ఆగ్రహం..సీజేపీ నిరసనలను అడ్డుకోవడంపై కేజ్రీవాల్ ఆగ్రహంనియంతృత్వ పాలనంలో జీవిస్తున్నామంటూ విమర్శలు.ఎమర్జెన్సీ కంటే దారుణంగా పరిస్థితులుమూడు డిటెన్షన్ సెంటర్లకు సీజేపీ నేతలుసీజేపీ ముగ్గురు నేతలను మూడు డిటెన్షన్ సెంటర్లకు పంపిన పోలీసులుఅభిజిత్ దీప్కేను గుర్గావ్ డిటెన్షన్ సెంటర్‌కి తరలింపుఅశుతోష్ రాంకాను ద్వారకా డిటెన్షన్ సెంటర్‌కి తరలింపుసౌరవ్ దాస్ ఢిల్లీ డిటెన్షన్ సెంటర్‌కి తరలింపు.సీజేపీ నేతలు అరెస్ట్.. రంగంలోకి కేజ్రీవాల్?ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద హైఅలర్ట్.సీజేపీ నేతల అరెస్ట్‌తో మరో ట్విస్ట్.కాసేపట్లో జంతర్‌మంతర్‌కు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రానున్నట్టు సమాచారం.తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసనలు చేపట్టే అవకాశం.అక్టోబర్ 10న జరిగే నిరసనలో తన కుటుంబం కూడా పాల్గొంటుందని గతంలోనే కేజ్రీవాల్ ప్రకటనమరోవైపు.. నిరసనకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, పలు ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.మెట్రో స్టేషన్ల ప్రవేశాలు, రైళ్ల రాకపోకలపైనా ఆంక్షలు విధింపు. సీజేపీ నేతల అరెస్ట్ఢిల్లీలో విమానంలోనే సీజేపీ నేతల అరెస్ట్విమానం ల్యాండ్ కాగానే అదుపులోకి తీసుకున్న మహిళా పోలీస్స్వేచ్ఛగా సంచరించే హక్కుకు భంగం కలిగించడమేనని పేర్కొంటూ,ముగ్గురు నేతలను తక్షణమే, ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని సీజేపీ డిమాండ్ఢిల్లీలో సీజేపీ మద్దతుదారులు ఎక్కడికక్కడే అరెస్ట్..#UPDATE | Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke has been detained by the Police at Delhi Airport.— ANI (@ANI) October 10, 2026సీజేపీ టీమ్ అరెస్ట్?అభిజీత్ ప్రయాణించిన విమానంలో పోలీసులు కూడా ప్రయాణించినట్టు సమాచారం.అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను విమానంలో అదుపులోకి తీసుకున్న పోలీసులుదీనికి సంబంధించిన వీడియోలు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు ఢిల్లీ చేరుకున్న అభిజీత్ దీప్కేఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా మోహరించిన పోలీసులు. Peak Dictatorship! Polis came inside flight to detain Abhijeet Dipke! Shame 56📐🤏🏻🐒 https://t.co/yzIdiAqCqo— HIMANSHU KUMAR LAL (@himanshu1995LAL) October 10, 2026 సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్..సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘనపై కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలుఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేత, రవాణా ఆంక్షలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘించారంటూ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలునిరసనలను నియంత్రించే పేరుతో రైళ్లు మరియు మెట్రో సర్వీసులను పూర్తిగా నిలిపివేయవద్దని,పౌరులకు ఇబ్బంది కలగకుండా నియంత్రిత పద్ధతిలో అనుమతించాలని నిన్న సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో 57 మెట్రో స్టేషన్ల ద్వారాలు మూసివేయడం, రవాణాపై ఆంక్షలు కొనసాగించడం పట్ల పిటిషనర్లు అభ్యంతరం .నిరసనల పేరుతో పౌరుల ప్రాథమిక రవాణా హక్కులను, రోజువారీ జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేయడం తగదన్న సుప్రీంకోర్టు.పూర్తి నిషేధానికి బదులుగా సమతుల్య నియంత్రణ ఉండాలన్న న్యాయస్థానం ఆదేశాలను పాటించని యంత్రాంగం.ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు: సంజయ్ సింగ్దేశమంతటినీ ఒకే వ్యక్తి రక్షణ కోసం సైనిక శిబిరంగా మార్చేశారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్రంగా విమర్శించారు.ఢిల్లీని పూర్తిగా దిగ్బంధించారని, రాజధానికి వచ్చే రైళ్లను సైతం నిలిపివేశారని ఆరోపించారు.ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీని మించిపోయాయని మండిపడ్డారు.జంతర్‌మంతర్ వద్ద సీజేపీ చేపట్టనున్న నిరసనకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించిందని తెలిపారు.నిరసనలో పాల్గొనాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా తమకు పిలుపునిచ్చారని వెల్లడించారు.ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా వెనక్కి తగ్గేది లేదని,జంతర్‌మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తామని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. #WATCH | Delhi: AAP MP Sanjay Singh says, "... the entire country has been turned into a cantonment to protect one person. Delhi has been shut down, and trains arriving here have been stopped, creating a situation worse than the Emergency. The Aam Aadmi Party is supporting the CJP's protest... Arvind Kejriwal has also appealed to us to reach Jantar Mantar, and we will go ahead with the protest, no matter what action they take."— ANI (@ANI) October 10, 2026 ధృవ్ రాఠీ అరెస్ట్..సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులైన సింగూ, టిక్రి, ఘాజీపూర్ బార్డర్లో భారీ బందోబస్తు ఏర్పాటుఢిల్లీలో వచ్చే వాహనాలను క్షుణ్ణంగా చెక్ చేస్తున్న పోలీసులుఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసిన కేంద్ర హోంశాఖసీజేపీ ఆందోళన నేపథ్యంలో దృష్టి పెట్టాలని సూచించిన కేంద్రంయూ ట్యూబర్ ధృవ్ రాఠీ అరెస్ట్గుర్గావ్లో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులుDhruv Rathee has been detained. The Dictator is TERRIFIED of young people who question its wrongdoings and refuse to stay silent!— Cockroach Janta Party - CJP (@Cockroachisback) October 10, 2026సీజేపీ నిరసనకు 7,000 మంది: పోలీసుల అంచనాఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరగనున్న సీజేపీ నిరసనకు సుమారు 7,000 మంది వస్తారని ఢిల్లీ పోలీసులు అంచనా వేస్తున్నారు.నిరసన నేపథ్యంలో పోలీసులు సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే చర్యలకు స్పందించకుండా ప్రశాంతంగా విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.అనుమతి లేని సమావేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు.ఆంక్షలను ఉల్లంఘించి నిరసనకు వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని, ముందుగా నిర్ణయించిన నిర్బంధ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.పోలీసులను రెచ్చగొట్టడం లేదా ఘర్షణలకు కారణమయ్యే ప్రయత్నాలు చేసే వ్యక్తులపై, స్వతంత్ర పాత్రికేయులమని చెప్పుకునే వారిపైనా పరిస్థితులను బట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.సీజేపీ నిరసన నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.రైల్వే స్టేషన్ పరిసరాల్లో డ్రోన్లతో నిఘా కొనసాగుతోంది.ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సిబ్బందిని మోహరించారు.స్టేషన్ పరిసరాల్లో భద్రతా కవాతులు నిర్వహిస్తూ, అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టారు.మరోవైపు.. జంతర్‌మంతర్ వైపు వస్తున్న సీజేపీ మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. #WATCH | Delhi Police detain a few protesters who had started gathering at Jantar Mantar for the Cockroach Janta Party (CJP) protest here. https://t.co/QqZtF4Jswd— ANI (@ANI) October 10, 2026 అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు..కేంద్ర ప్రభుత్వంపై దీప్కే విమర్శలుప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని యువతను, ప్రజలను చూసి ఎందుకు భయపడుతున్నారు?రవాణా సేవల నిలిపివేత ఎందుకోసం? రైలు సేవలను, మెట్రో కార్యకలాపాలను ఎందుకు నిలిపివేశారని ఆయన ప్రశ్నించారు.ఇంటర్నెట్ నిలిపివేత, రహదారుల దిగ్బంధం వంటి చర్యలను ఆయన విమర్శించారు.జమ్మూ కాశ్మీర్ నుంచి సైన్యాన్ని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల నుంచి CRPF బలగాలను ఢిల్లీకి ఎందుకు తీసుకొచ్చారు.దేశ ప్రజలపైనే యుద్ధం చేయాలనుకుంటున్నారా అని ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు.జ్ఞానేశ్ కుమార్ కోసం ప్రజలపై పోలీసు, సైనిక బలగాలను ప్రయోగిస్తున్నారా అని ప్రశ్నించారు.ప్రజలు తమకు ఓటు వేయరనే భయంతోనే ప్రభుత్వం నిరసనలను అడ్డుకుంటోంది.రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.నిరసనల్లో పాల్గొనవద్దని కాలనీల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు.నిరసనల్లో పాల్గొనవద్దని ప్రజలకు చెప్పేందుకు పోలీసులు వారి ఇళ్లకు వెళ్తున్నారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉంది.ఢిల్లీ విమానాశ్రయంలో తనను అరెస్టు చేసినా లేదా అదుపులోకి తీసుకున్నా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.UAPA, NSA వంటి కఠినమైన చట్టాలను తనపై ప్రయోగించినా వెనక్కి తగ్గబోనని ప్రకటించారు.స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. #WATCH | Mumbai: Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke says, "I wonder why the Prime Minister of this country is so afraid of the nation's youth and its people. What was the need to shut down all railway services? What was the need to halt all metro operations? They have cut off the internet and blocked the roads. They have brought the Army from J&K and deployed it in Delhi. They have summoned CRPF forces from Naxal-affected areas and deployed them in Delhi. Do Narendra Modi and Amit Shah want to wage war against the people of their own country? Is Gyanesh Kumar so dear to them that they would unleash their police and army forces upon their own citizens?..." He adds, "PM Modi is afraid; he fears that the people of this country will not vote for him after this. That is why, simply to cling to power, they are picking people up from trains. Announcements are being made in societies warning people not to join the protests. The Delhi Police is visiting homes, telling people not to participate in protests. But why shouldn't we? Protesting is our fundamental right. Article 19 grants us the fundamental right to protest in a democratic and peaceful manner, and that is exactly what we intend to do. When asked if he will be arrested upon reaching Delhi airport, he says, "If they want to detain or arrest me, let them go ahead. I am ready for it; let them arrest or detain me. It makes no difference to me. Invoke the UAPA, invoke the NSA—go ahead and do it. But we will keep fighting for free and fair elections and to save this country's democracy."— ANI (@ANI) October 10, 2026 ఢిల్లీకి అబిజిత్ దీప్కేముంబై నుంచి ఢిల్లీ బయలుదేరిన సీజేపీ అభిజిత్ దీప్కేఢిల్లీలో మోహరించిన పోలీసులు, ప్రత్యేక బలగాలుఎక్కడిక్కడే పోలీసుల తనిఖీలుకఠిన ఆంక్షలతో రాజధానిలో హైఅలర్ట్.. ఉదయం 10 గంటలలోపు ఢిల్లీ చేరుకునే అవకాశం.#WATCH | Mumbai, Maharashtra: Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke leaves for Delhi ahead of the protest today at Jantar Mantar. https://t.co/ABZcekAlCS— ANI (@ANI) October 10, 2026‘ఎమర్జెన్సీ’ విధిస్తున్నారంటూ సీజేపీ నేతల విమర్శలునిరసనకు అనుమతి నిరాకరించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని సీజేపీ నేతలు విమర్శించారు.నిర్బంధించే అవకాశం ఉన్నప్పటికీ వెనక్కి తగ్గబోమని అభిజీత్ దీప్కే ప్రకటించారు.ఢిల్లీ నిరసనపై ఉత్కంఠజంతర్మంతర్ వద్ద నిరసన నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రత కట్టుదిట్టం#WATCH | Mumbai, Maharashtra: Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke leaves for Delhi ahead of the protest today at Jantar Mantar. https://t.co/EZVIGtq9Tx— ANI (@ANI) October 10, 2026దేశమంతా జంతర్‌మంతరే: సౌరవ్ దాస్రవాణాపై ఆంక్షలు విధించడాన్ని సీజేపీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ ప్రశ్నించారు.రైళ్లు, విమానాలు, బస్సులను ఎంతకాలం నిలిపివేస్తారని నిలదీశారు.ప్రభుత్వ చర్యలతో ఢిల్లీ మాత్రమే కాకుండా దేశమంతా నిరసన వేదికగా మారిందని వ్యాఖ్యానించారు.ఫోన్ నంబర్ లీక్ చేశారని ఆరోపణఢిల్లీ పోలీసులు తన ఫోన్ నంబర్‌ను బహిర్గతం చేశారని సౌరవ్ దాస్ ఆరోపించారు.దీంతో తనకు పెద్దఎత్తున ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు వస్తున్నాయని తెలిపారు. #WATCH | Delhi: The RAF has been deployed at Firoz Shah Road, Mandi House, ahead of the protest today at Jantar Mantar. https://t.co/3oGqIqwIUz— ANI (@ANI) October 10, 2026సెంట్రల్ ఢిల్లీలో లాక్డౌన్.. సీజేపీ ధర్నాకు అనుమతి ఇవ్వని ఢిల్లీ పోలీసులు30000 మంది కేంద్ర బలగాలతో భారీ భద్రత ఏర్పాట్లుసున్నితమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీసులుఅర్ధరాత్రి నుంచి ఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్ఢిల్లీ నలుమూలల భారీగా మోహరించిన పోలీసులుదుకాణాలు, కార్యాలయాలు మూసివేత57 మెట్రో స్టేషన్లు బంద్శాంతియుత నిరసనలకు జంతర్ మంతర్ కాకుండా ఆందోళనకు మరోచోట అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశంహోటల్స్, పీజీ హాస్టల్స్ లో తనిఖీలు చేస్తున్న ఢిల్లీ పోలీసులుసెంట్రల్ ఢిల్లీలో సెక్షన్ 163 BNS యాక్ట్ అమలుఢిల్లీలో ఎలాంటి నిరసనలకు ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసుల మైకులలో ప్రకటన #WATCH | Delhi: Heavy security has been deployed, and barricades have been put up at the Jantar Mantar and Parliament Street areas ahead of the protest today. https://t.co/6yzKOiOw6b— ANI (@ANI) October 10, 2026 ఢిల్లీలో హైఅలర్ట్.. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద శనివారం భారీ ధర్నాకు పిలుపుఅన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి‘నీట్’పేపర్ లీక్ విషయంలో సీజేపీ ఆందోళన సందర్భంగా ఎదురైన అనుభవంతో పోలీసులు కఠిన ఆంక్షలుజంతర్మంతర్ వద్ద శనివారం ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని తేల్చిచెప్పారు. #WATCH | Delhi: Security tightened, and barricades put up at Jantar Mantar ahead of the protest today. https://t.co/9CcWs0nzZO— ANI (@ANI) October 10, 2026అన్నీ బంద్.. ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాల ఆందోళన.ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని ప్రతిపక్షాల డిమాండ్.ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్.జంతర్‌మంతర్ వద్ద సీజేపీ, విద్యార్థి సంఘాల నిరసనకు పిలుపు.నిరసనకు అనుమతి నిరాకరించిన ఢిల్లీ పోలీసులు.ఢిల్లీలో భారీగా భద్రతా బలగాల మోహరింపు.నగర సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్ల వద్ద విస్తృత తనిఖీలు.ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేత.న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చే కొన్ని రైళ్ల రద్దు.ఢిల్లీలో విద్యా సంస్థల మూసివేత, పరీక్షలు, క్రీడా కార్యక్రమాల వాయిదా.హోటళ్లు, లాడ్జీల బుకింగ్‌లపై ఆంక్షలు.నగరంలోకి ప్రవేశించే వాహనాల తనిఖీలు ముమ్మరం.నిరసనకు సంబంధించిన సోషల్ మీడియా ప్రచారంపై పోలీసుల నిఘా.జంతర్‌మంతర్ పరిసరాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ప్రకటన.న్యూఢిల్లీ జిల్లాను 20 భద్రతా జోన్లుగా విభజించిన పోలీసులు.ఢిల్లీకి నిరసనకారులు రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ సూచన.ట్రాఫిక్ మళ్లింపులు, రవాణా ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. -
ఈగను చంపడానికి సుత్తిని వాడొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఈగను చంపడానికి సుత్తిని వాడకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. శనివారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టనున్న నిరసన సందర్భంగా నగరంలో మెట్రో స్టేషన్లు మూసివేయడం, న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు వచ్చే రైళ్లను రద్దు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజా రవాణా సేవలను పూర్తిగా నిలిపివేయడం సరైంది కాదని తేల్చిచెప్పింది. మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దుపై అధికారులు తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీతోపాటు మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, గోపాల్ శంకరనారాయణన్, డాక్టర్ ఏఎం సింఘ్వీ, ఎన్.హరిహరన్, వృందా గ్రోవర్ తదితరులు అత్యవసరంగా ఈ అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రజా రవాణా సేవలను పూర్తిగా నిలిపివేయడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ ప్రాంతాల నుంచి ఉపాధి, విద్య, ఇతర అవసరాల కోసం ప్రతిరోజూ సెంట్రల్ ఢిల్లీకి వచ్చే వేలాది మంది ప్రజలు ప్రజా రవాణాపైనే ఆధారపడుతున్నట్లు గుర్తుచేసింది. వారిలో విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ఉంటారని పేర్కొంది. ప్రతి ఒక్కరికీ సొంత వాహనం ఉండదని, ప్రైవేట్ రవాణా సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండవని వ్యాఖ్యానించింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అధికారులు నియంత్రణ చర్యలు తీసుకోవడంలో అభ్యంతరం లేదని, అయితే నిరసనకారుల కదలికలను నియంత్రించాలనే ఉద్దేశంతో మొత్తం రవాణా వ్యవస్థను నిలిపివేయడం సమంజసం కాదని తేల్చిచెప్పింది. నిష్పత్తి సూత్రాన్ని పాటించాలి చట్టాన్ని అమలు చేసే అధికారులు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చని.. అయితే, ఆ చర్యలు అవసరానికి మించి ఉండకూడదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. న్యాయపరమైన చర్యల్లో ‘నిష్పత్తి సూత్రం’పాటించాలని సూచించారు. శాంతిభద్రతల సమస్యలను ఎదుర్కొనేందుకు అవసరమైన మేరకే ఆంక్షలు విధించాలని, అదేసమయంలో ప్రజలకు రవాణా సౌకర్యాలు పూర్తిగా దూరం కాకుండా చూడాలని అన్నారు. మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్కృమణ మార్గాలను పూర్తిగా మూసివేయడంపై అభ్యంతరం తెలిపారు. మెట్రో రైళ్ల రాకపోకల సంఖ్యను తగ్గించడం లేదా ప్రయాణికుల కదలికలను నియంత్రించడం ఒక చర్య అయితే, మొత్తం సేవలను నిలిపివేయడం మరో విషయమని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ వ్యాఖ్యానించారు. రైళ్ల, మెట్రో రాకపోకలను నియంత్రించాలే తప్ప పూర్తిగా నిలిపివేయరాదని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ధర్మాసనం వ్యక్తంచేసిన ఆందోళనలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, రవాణా సేవలను నియంత్రిత పద్ధతిలో కొనసాగించే అంశాన్ని పునఃపరిశీలించేలా కృషి చేస్తానని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రైళ్లు, మెట్రో సేవలను పూర్తిగా నిషేధించకుండా, తగిన నియంత్రణలతో నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆ నిర్ణయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించింది. -
ఢిల్లీ అష్ట దిగ్బంధం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా మొదలైన కార్చిచ్చు మరింత రగులుతోంది. ప్రతిపక్షాలు ఎన్నికల సంఘంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎస్ఐఆర్లో విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్నాయని, బీజేపీ వ్యతిరేకుల ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారని మండిపడుతున్నాయి. అందుకే ఈ ప్రక్రియను రద్దు చేయాలని, అక్రమాలకు బాధ్యుడైన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టాయి. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద శనివారం భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది. ‘నీట్’పేపర్ లీక్ విషయంలో సీజేపీ ఆందోళన సందర్భంగా ఎదురైన అనుభవంతో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. జంతర్‌మంతర్ వద్ద శనివారం ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని తేల్చిచెప్పారు. ఎవరూ రావొద్దని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రాజధాని మొత్తం భద్రతా బలగాల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. నగర సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, బస్ టెరి్మనల్స్, హోటళ్లు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎటుచూసినా అష్టదిగ్బంధనమే కనిపిస్తోంది. అంతేకాకుండా పలు కఠిన అంక్షలు విధించారు. నగరంలో శాంతిభద్రతలను కాపాడటానికి విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అన్ని మెట్రో స్టేషన్ల మూసివేత ఢిల్లీలో కేంద్ర పారా మిలటరీ దళాలకు చెందిన 35 వేల మంది జవాన్లు మోహరించారు. నగరాన్ని తమ అదీనంలోకి తీసుకున్నారు. ప్రతి ప్రాంతాన్నీ క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ తదితర దళాలు రంగంలోకి దిగాయి. ప్రతి 50 మీటర్లకు ఒక జవాను పహారా కాస్తున్నారు. నిరసనకారులు రైళ్లలో తరలివచ్చే అవకాశం ఉండడంతో వారిని అడ్డుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. నగరంలోని మొత్తం 57 మెట్రో రైలు స్టేషన్లను శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ను పోలీసులు కోరారు. న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు శనివారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకోవాల్సిన పలు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల నుంచి ఢిల్లీకి పలు రైళ్లు బయలుదేరాయి. నాగపూర్, భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్ తదితర స్టేషన్లలో ఆగి ఉన్న రైళ్లలో ప్రయాణిస్తున్న కొందరు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందర్నీ సమీపంలోని పోలీసు స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. ఢిల్లీలో ఎక్కడికక్కడ అదనంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జనం కదలికలను గమనిస్తున్నారు. అలాగే 12 నిర్బంధ కేంద్రాలను సైతం సిద్ధం చేశారు. నిరసనకారులను అరెస్టు చేసి వాటిలో నిర్బంధించే అవకాశం ఉంది. శనివారం ఉదయం 6 గంటల తర్వాత ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలపై ఆంక్షలు విధించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులు తమను గృహ నిర్బంధంలో ఉంచారని నోయిడాలోని పలు సామాజిక సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాల సభ్యులు, రాజకీయ పార్టీల నేతలు ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. విద్యార్థులు బయటకు రావడానికి వీల్లేదు జంతర్‌మంతర్ వైపు ఏ ఒక్కరూ రావొద్దంటూ ఢిల్లీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నగరమంతటా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పా టు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. యజమానుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని నోయిడా, గురుగ్రామ్ వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. నగరంలో విద్యా సంస్థలను శనివారం మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులెవరూ బయటకు రావడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. దాంతో ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. శనివారం జరగాల్సిన పరీక్షలు, క్రీడా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. హోటల్ బుకింగ్‌లు బంద్ ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం నుంచే అన్ని మద్యం దుకాణాలను పోలీసులు మూసివేయించారు. హాస్టళ్లు, పేయింగ్ గెస్టు వసతి గృహాలను తనిఖీ చేస్తున్నారు. సెవెన్‌స్టార్ హోటళ్లు మొదలు చిన్నపాటి లాడ్జీల వరకు బుకింగ్స్‌పై ఆంక్షలు విధించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే హోటళ్లు, లాడ్జీల్లోకి ప్రవేశానికి అనుమతి ఇస్తున్నారు. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న స్టార్ హోటళ్లు మినహా మిగతా ఇతర ప్రాంతాల్లో బుకింగ్స్‌పై ఆంక్షలు విధించడంతో సందర్శకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వసతి దొరక్కపోవడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. నిరసనకు అనుమతి నిరాకరణ జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీతోపాటు కొన్ని విద్యార్థి సంఘాలు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించినట్లు న్యూఢిల్లీ రేంజ్ జాయింట్ పోలీస్ కమిషనర్ నూపుర్ ప్రసాద్ శుక్రవారం స్పష్టంచేశారు. అనుమతి కోసం దరఖాస్తును ఆలస్యంగా సమరి్పంచడం, గతంలో సీజేపీ నిరసన సమయంలో నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాలను ప్రస్తావించారు. అందుకే ఈసారి అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. సీజేపీ కో–కన్వీనర్ సౌరవ్ దాస్ నుంచి ఈ నెల 10న దరఖాస్తు అందినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం.. నిరసనకు 10 రోజుల ముందే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. గతంలో నిరసన చేపట్టడానికి సీజేపీకి అనుమతి ఇచ్చినప్పుడు, వారు చట్టపరమైన ఆదేశాలను పాటించలేదని గుర్తుచేశారు. శాంతిభద్రతల సమస్యను దృష్టిలో పెట్టుకొని సీజేపీ నిరసనకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. అందుకే జంతర్‌మంతర్‌కు ఎవరూ రావొద్దని సూచించారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరగాళ్లపై, సోషల్ మీడియా ఖాతాలపై కన్ను పోలీసు రికార్డుల్లో నమోదైన నేరగాళ్లు, అనుమానాస్పద సోషల్ మీడియా ఖాతాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈ ఏడాది జూలైలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిలో 2,873 మందికి నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించి, వారి కదలికలపై దృష్టి పెట్టారు. ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్తాన్ వైపు నుంచి ఢిల్లీకి వచ్చే మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నోయిడాను ఢిల్లీతో కలిపే సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనకు సంబంధించి సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపైనా పోలీసులు నిఘా పెంచారు. నిరసనకు ప్రజలను సమీకరించే ప్రయత్నాలు, వాట్సాప్, టెలిగ్రామ్ తదితర వేదికల్లో జరుగుతున్న ప్రచారాన్ని పరిశీలిస్తున్నారు. 200 సోషల్ మీడియా చానళ్లను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత జంతర్‌మంతర్‌కు 4 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం 10వ తేదీ రాత్రి 10 గంటల వరకు సేవలు నిలిచిపోనున్నట్లు వెల్లడించాయి. ఈ నిర్ణయానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని అధికారులు చెప్పారు. ఈ నిలిపివేత అన్ని మొబైల్ ఇంటర్నెట్ సేవలకు వర్తిస్తుంది. ఢిల్లీలోని మిగిలిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపారు. సెంట్రల్ ఢిల్లీలో పలు ప్రాంతాల్లో జామర్లు ఏర్పాటు చేయడంతో ఫోన్ సిగ్నల్స్ అందడం లేదు. 20 జోన్లుగా విభజన శాంతిభద్రతలను కాపాడేందుకు న్యూఢిల్లీ జిల్లాను 20 జోన్లుగా విభజించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై పర్యవేక్షణ కోసం ఈ 20 జోన్లలో ప్రతి జోన్‌ను ఒక జాయింట్ కమిషనర్, ఒక డిప్యూటీ కమిషనర్, ఒక అదనపు డిప్యూటీ కమిషనర్‌ను నియమించినట్లు చెప్పారు. భద్రతా చర్యల్లో భాగంగా న్యూఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ జిల్లాల్లోని కీలక ప్రదేశాల్లో అదనపు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీజేపీ మద్దతుదారులను నిరోధించండి: హోంశాఖ లేఖ ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు ఎవరూ వెళ్లకుండా నిరోధించాలని, ఈ విషయంలో ఢిల్లీ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలకు లేఖ రాశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని కోరుతూ ఢిల్లీ పోలీసు లు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘యూనిఫాం వెను క కూడా ఒక మనిషి ఉంటారు’’అని వివరించారు. ధర్నాల్లో పిల్లలు పాల్గొనకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. -
ఆ సిరా గుర్తులు.. పోరాటానికి చిహ్నాలు
అల్లు సూరిబాబు కుటుంబంలో అంతా బీజేపీకి మద్దతు ఇచ్చే వాతావరణం.. కానీ ఆమెది మాత్రం వామపక్ష భావజాలం. ఆర్మీ ఉద్యోగి అయిన తండ్రి నుంచి పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న ఆమె.. డిగ్రీ సోషియాలజీ విద్యార్థిగా ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత సమాజాన్ని చదివారు. తొలుత అక్కడ విద్యార్థుల సమస్యలపై నినదించిన ఆమె.. గళం ఇప్పుడు ఎన్నికల వ్యవస్థలో అక్రమాలపై ప్రశ్నిస్తోంది.నీట్–యూజీ పేపర్ లీక్‌లపై దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద జూలైలో జరిగిన ఆందోళనలో ఒక పోలీసు అధికారి అనుచితంగా ప్రవర్తించినా, రాంచీలో జేపీఎస్సీ–జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్ర మాలు, పేపర్ లీకేజీలపై విద్యార్థుల ఆందోళనలో ఓ వ్యక్తి నల్లటి సిరా చల్లి దేశద్రోహి అని నిందించినా ఆమె మనోధైర్యం కోల్పోలేదు. ఆ సిరా గుర్తులు తన పోరాటానికి చిహ్నాలని చెబుతున్నారు. ఆమే అఖిల భారత విద్యార్థుల సంఘం (ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాలు శనివారం భారీ స్థాయిలో నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విష యాలపై తన అభిప్రాయాలను నేహా బోరా కుండబద్దలుకొట్టినట్లు వెల్లడించారు.సాక్షి: సాధారణ విద్యార్థి స్థాయి నుంచి దేశం దృష్టిని ఆకర్షించిన ప్రధాన విద్యార్థి సంఘ సారథిగా మారడం ఎలా సాధ్యమైంది? నేహా: ఉత్తరాఖండ్‌లోని ఖటీమా ప్రాంతం మా స్వస్థలం. మా నాన్న సైన్యంలో ఉద్యోగి. అమ్మ సాధారణ గృహిణి. నాన్న ఉద్యోగ రీత్యా నా బాల్యమంతా వేర్వేరు ప్రాంతాల్లో గడిచింది. పశ్చిమ బెంగాల్ సిలిగురిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. గ్రాడ్యుయేషన్ కోసం ఢిల్లీలో అడుగుపెట్టాను. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ హిందూ కాలేజీలో బీఏ సోషియాలజీలో చేరాను. తర్వాత ఢిల్లీలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశాను.థియేటర్ ఆర్ట్స్, స్ట్రీట్ ప్లే (వీధి నాటకాలు) ఆసక్తితో ప్రస్తుతం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి చెందిన స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్థటిక్స్‌లో థియేటర్ అండ్ పెర్ఫార్మెన్స్ స్టడీస్ విభాగంలో పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్‌గా పరిశోధన చేస్తున్నాను. థియేటర్ ఆర్ట్స్‌పై ఆసక్తితోనే ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే సంగవారి అనే ప్రసిద్ధ థియేటర్ గ్రూప్‌తో కలిసి పనిచేశాను.ఈ నేపథ్యమే నాలో ప్రాథమికంగా రాజకీయ చైతన్యాన్ని కలిగించింది. సమాజంలోని పేదరికం, విద్యా వ్యవస్థలోని లోపాలు, మహిళలకు భద్రత కొరవడటం, సామాజిక అసమానతలను ప్రత్యక్షంగా చూశాను. అలా ప్రజాపోరాటాల వైపు వచ్చాను. ఏఐఎస్‌ఏలో క్రియాశీల సభ్యురాలిగా మారాను. జేఎన్‌యూ క్యాంపస్‌లో విద్యార్థుల సమస్యలపై ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నాను. దీంతో నా ప్రసంగ శైలితోపాటు నిర్వహణ సామర్థ్యాల వల్ల ఏఐఎస్ఏ ఢిల్లీ యూనిట్లో కీలక పదవులకు ఎంపికయ్యాను. ఆ తర్వాత జాతీయ అధ్యక్షురాలిగానూ ఎన్నికయ్యాను. అలా దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన ఉద్యమాల్లో భాగస్వామ్యమయ్యే అవకాశం కలిగింది. విద్యార్థి, యువజన ఉద్యమాలతో ప్రభుత్వాలు దిగొస్తాయని భావిస్తున్నారా? కచ్చితంగా! విద్యార్థులు, యువత ఉద్యమాలకు ప్రభుత్వాలు దిగొచ్చిన తార్కాణాలు చరిత్రలో చాలా ఉన్నాయి. శాంతియుత ఉద్యమాలకు ప్రభుత్వాలు గౌరవం ఇవ్వాలి. వాటిని పోలీసు బలగాలతో అణచివేయడం కాదు,.. వారి సమస్యలను సానుకూలంగా స్పందించాలనే ఆలోచనా ధోరణి ప్రభుత్వానికి, పాలకులకు ఉండాలి. అందుకు భిన్నంగా వ్యవహరించినప్పుడే శాంతియుత నిరసనలు కాస్తా హింసాయుతంగా మారుతున్నాయి.ఇటీవల కాలంలో నేను స్వయంగా పాల్గొన్న ఉద్యమాలనే తీసుకుంటే యువత, విద్యార్థుల ఉద్యమస్ఫూర్తిని సమాజం అభినందించాల్సిందే. ప్రభుత్వాలు దిగొచ్చాయి. నీట్–యూజీ ప్రవేశపరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై విద్యార్థులు, యువత నిర్వహించిన నిరాహార దీక్షలు, నిరసనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ఈ లీకేజీ వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తుకు అప్పగించింది. కఠినమైన యాంటీ పేపర్ లీక్ చట్టం తీసుకొచ్చింది. నీట్ పరీక్షల నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరును సమీక్షించడానికి ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.తర్వాత జార్ఖండ్‌లో జేపీఎస్సీ–జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాలు, లీకేజీలపై ఇటీవల రాంచీలో విద్యార్థులు నిర్వహించిన ఆందోళనకు అక్కడి ప్రభుత్వం దిగొచ్చింది. అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశించింది. భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీలు పునరావృతం కాకుండా కఠినమైన యాంటీ పేపర్ లీక్ నిబంధనలను వర్తింపజేస్తామని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఓటర్ల తొలగింపు వ్యవహారం యువత, విద్యార్థి సంఘాల నిరసనలతోనే సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఢిల్లీలో నేడు ‘చలో ఢిల్లీ’పిలుపుతో నిరసన వెనుక ప్రధాన ఉద్దేశమేమిటి? ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటు హక్కుతోనే గౌరవం ఏర్పడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే అది వారి ఉనికికి నిదర్శనం. ప్రజాస్వామ్యమంటే ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నికైన ప్రజాప్రభుత్వం. కానీ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పౌరుల ఓటు హక్కే ప్రమాదంలో పడింది. ఓటర్ల జాబితాల నుంచి పేర్లు గల్లంతవుతున్న వారిలో ఎక్కువ మంది పేదలు, శ్రామిక వర్గానికి చెందినవారు, యువతే ఉంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోని ఓఖ్లా, మంగోల్‌పురి, జామియానగర్లలో చూస్తే చాలా మంది పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తీసేశారు.ఎవరికి వారు ఒక్క ఓటే కదా అనుకుంటే భవిష్యత్తులో ప్రశ్నించే గొంతుకే ఉండదు. ఓటర్ల జాబితాల సమగ్ర పరిశీలన (సర్) పేరుతో జరుగుతున్న అక్రమ తొలగింపులకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని బాధ్యులను చేయడానికే శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), విద్యార్థి సంఘాలు సమష్టిగా పిలుపునిచ్చాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలి, ఎన్నికల వ్యవస్థలో అక్రమాలను చక్కదిద్దాలి, సర్ ప్రక్రియ నిలిపేసి రానున్న ఎన్నికలను పాత ఓటర్ల జాబితాలతోనే నిర్వహించాలనే డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాం. సీజేపీతో కలిసి పనిచేయడం భవిష్యత్తులో పొత్తుకు దారితీస్తుందా? ఏఐఎస్ఏ, సీజేపీ భిన్న దృక్ఫథాలతో పనిచేస్తున్న సంస్థలు. రెండింటి ఆలోచనా విధానం, సిద్ధాంతాలు ఒక్కటి కావు. మాది స్పష్టమైన వామపక్ష విద్యార్థి ఉద్యమం. దీప్కే తదితర సీజేపీ నాయకులు కూడా ఏ మార్గంలో వెళ్లాలో ఒక స్పష్టమైన విధానాన్ని నిర్ణయించుకున్నారు. కాబట్టి రెండు సంఘాల మధ్య సమన్వయం కేవలం ఒక అంశం లేదా ఎజెండా ఆధారంగానే ఉంటుంది. అయితే జూలైలో మేము జంతర్ మంతర్ వద్ద సుదీర్ఘ పోరాటం కలిసి చేశాం. అలాగే ఇప్పుడు ఓటు చోరీ పోరాటంలోనూ భాగస్వాములమయ్యాం. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ)లనూ భాగస్వాములను చేయడానికి మేము సంప్రదిస్తున్నాం. ‘చలో ఢిల్లీ’భగ్నానికి కేంద్రం ప్రయత్నాల నేపథ్యంలో మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా పౌరులకు రాజ్యాంగం ఇచ్చింది. శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చాం. కానీ వారు తిరస్కరించారు. జంతర్‌మంతర్‌ను మూసేశారు. వాస్తవానికి అదొక అధికారిక నిరసన ప్రదేశం. కానీ అది కాగితాలకే పరిమితమైంది. ప్రభుత్వం బలవంతంగా ఆక్రమించుకున్న, తొలగించిన ప్రతిదానినీ తిరిగి స్వాధీనం చేసుకోవడమే శనివారం నాటి నిరసన వెనుక ఉన్న మా ప్రధాన ఉద్దేశం. ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి లేకుండాపోయిన జంతర్ మంతర్ నుంచే ఇది ప్రారంభమవుతుంది. నిరసన తెలిపే హక్కునూ తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాం. విద్యార్థి సంఘాల శాంతియుత నిరసనలు ఎందుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి? మా నిరసన ప్రదర్శనల్లో ఎవరూ ఉద్దేశపూర్వకంగా హింసాత్మక ఘటనలకు దిగడంలేదు. బారికేడ్లు దాటి పార్లమెంటు వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తే సెక్షన్ 163 నిషేధాజ్ఞలు ఉల్లంఘించారంటూ ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేస్తున్నారు. బాష్పవాయువు గోళాలను ప్రయోగిస్తున్నారు. నిరసనకారులను, మహిళా జర్నలిస్టులను అదుపులోకి తీసుకొనే క్రమంలో మగ పోలీసులు భౌతిక దాడులకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నేనూ బాధితురాలినే. నాపైనా దాడులు జరిగాయి. వాటిపై ఫిర్యాదు చేసినా పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్లో తొలుత ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఆ తర్వాత ఎట్టకేలకు కేసు నమోదు చేసి ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు. కానీ ప్రభుత్వం భయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తే ప్రజలు భయంతో బతుకుతూ ఎప్పటికీ గళం విప్పకుండా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటారని పాలకులు అనుకుంటే పొరపాటే. ఇలాంటి సమయాల్లో ప్రజల్లో ధైర్యం నింపడానికి శాంతియత నిరసనలు చేస్తాం. హాస్యాన్ని, వ్యంగ్యాన్ని నిరసనలో భాగం చేస్తాం. అదే యువత, జెన్‌జీ చేతిలో ఉన్న ఒక ఆయుధం. నిరసనకారులపై భౌతిక దాడుల ఉదంతాల నేపథ్యంలో మీరు భయపడుతున్నారా? జేపీఎస్సీ–జేఎస్ఎస్సీ పరీక్షల్లో అక్రమాలపై నిరసనగా జార్ఖండ్ అసెంబ్లీ వైపు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు జన సమూహంలో నుంచి ఓ వ్యక్తి హఠాత్తుగా దూసుకొచ్చి నా ముఖంపై, దుస్తులపై నల్లటి సిరా చల్లాడు. నన్ను దేశద్రోహి అంటూ ఏవేవో ఆరోపణలు చేశాడు. జూలై 20న ఢిల్లీలో జరిగిన నిరసనలో మాపై బాష్పవాయు గోళాలు, పెల్లెట్లు ప్రయోగించారు. వాటికే భయపడని మేము సిరా చల్లితే బెదిరిపోతామా? ఆ సిరా గుర్తులు నా పోరాటానికి, నా ధైర్యానికి చిహ్నాలు. -
CJP నిరసనల వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
సీఈసీపై సమరం.. జ్ఞానేశ్ రాజీనామా డిమాండ్.. ఢిల్లీలో కీలక పోరు!
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై రాజకీయ పోరు మరింత ఉధృతమైంది. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారంటూ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలను కొనసాగిస్తున్నాయి. వరుస ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ రాజకీయంగా వేడెక్కింది. ఇప్పటికే మూడు రోజులుగా నిరసనలు చేపట్టిన విపక్ష ఎంపీలు.. నాలుగో రోజూ తమ ఆందోళనలను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. ఎస్ఐఆర్ అంశంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు విపక్ష ఎంపీలు నేడు మధ్యాహ్నం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశం కానున్నారు. అనంతరం ఇండియా కూటమి నేతల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తమ అభ్యంతరాలను వివరించనుంది. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్ల తొలగింపు, ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై ఫిర్యాదు చేయడంతోపాటు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ భేటీకి సంబంధించి పది మంది నేతల బృందం రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నట్లు సమాచారం.రేపు జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనమరోవైపు, సీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) రేపు జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు కూడా ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. అయితే, నిరసనకు పోలీసుల అనుమతి విషయంలో స్పష్టత లేకపోయినా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సీజేపీ ప్రతినిధులు చెబుతున్నారు. నిరసనకు ముందు తమ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారని ఆ సంస్థ ఆరోపించగా, ఈ పరిణామాలు ఢిల్లీలో ఉద్రిక్తతలను పెంచాయి.భారీ భద్రతవరుస నిరసనలు, రేపటి ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు 20 వేల మంది పోలీసులను మోహరించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. నిరసనకారుల కదలికలపై నిఘా పెంచడంతోపాటు రద్దీ ప్రాంతాల్లో అదనపు బలగాలను అందుబాటులో ఉంచారు. ఆందోళనల కారణంగా న్యూఢిల్లీ పరిధిలో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.మద్యం దుకాణాలు బంద్మరో కీలక పరిణామంగా.. ఢిల్లీలో అక్టోబర్ 9, 10 తేదీల్లో అన్ని రిటైల్ మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పోలీసుల నుంచి అందిన సమాచారం ఆధారంగా శాంతిభద్రతలను కాపాడేందుకు ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఎస్ఐఆర్పై భిన్న వాదనలుఎస్ఐఆర్ ద్వారా పశ్చిమ బెంగాల్లో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, ముస్లిం వర్గాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నాయి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ సహా పలువురు విపక్ష నేతలు సీఈసీ రాజీనామాతోపాటు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నారు.అయితే, ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ను ఓటర్ల జాబితాలో నకిలీ, పునరావృత, మరణించిన వారి పేర్లను తొలగించే ప్రక్రియగా సమర్థిస్తోంది. మరోవైపు 42 మంది మాజీ న్యాయమూర్తులు కూడా ఎన్నికల సంఘానికి మద్దతుగా బహిరంగ లేఖ విడుదల చేసి, ఆరోపణలు చేసేవారు ఆధారాలను సమర్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణపై మొదలైన వివాదం ఇప్పుడు ఎన్నికల సంఘం నాయకత్వంపై రాజకీయ పోరుగా మారింది.ఇదీ చదవండి: దేశం కంటే జ్ఞానేశ్ కుమార్ గొప్ప? -
ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం
ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి(అక్టోబర్ 9,10 తేదీల్లో) ఢిల్లీలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. సీఈసీకి వ్యతిరేకంగా నిరసనల కారణంగా శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలో బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు కానుంది. జంతర్‌మంతర్ సహా అన్ని చోట్లా నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. 10న సీజేపీ ఆందోళనకు అనుమతి లేదని ఢిల్లీ డీసీపీ సృష్టి పాండే స్పష్టం చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు.ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓట్ల చోరీ జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో 20 వేలకు పైగా పోలీసులు, పారామిలటరీ సిబ్బంది మోహరించారు.సీఈసీకి వ్యతిరేకంగా తలపెట్టిన నిరసనలో పలు విద్యార్థి, రైతు సంఘాలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా పాల్గొనాలని నిర్ణయించాయి. జూలై 20న జంతర్ మంతర్ వద్ద జరిగిన సీజేపీ నిరసన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తాజా నిరసనల్లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. జూలై 20న జరిగిన ఆందోళనలో హింస చోటుచేసుకోవడం, పలువురు పోలీసులు, సీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేశ్‌కు మద్దతుగా 42 మంది మాజీ న్యాయమూర్తులు -
ఢిల్లీలో హైటెన్షన్... సీఈసీ జ్ఞానేష్ ఇంటి వద్ద భారీ భద్రత
-
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. ఢిల్లీ పోలీసుల తీరుపై సీఎం రేవంత్ ఫైర్..
-
రాహుల్ కొత్త పొలిటికల్ స్ట్రాటజీ.. మొండితనమా.. వ్యూహమా?
ఊహించని చోట ప్రత్యక్షం.. చెప్పాపెట్టకుండా నిరసన.. పోలీసుల అడ్డంకులను లెక్కచేయకుండా ముందుకు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ శైలిలో ఈ తరహా ‘సర్ప్రైజ్ పాలిటిక్స్’ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించడం కంటే.. చిన్న బృందంతోనే నేరుగా రంగంలోకి దిగుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇటీవలి కాలంలో మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రాహుల్ ఆకస్మిక నిరసనలు, అనూహ్య మార్చ్‌లు, ముందస్తు సమాచారం లేకుండా కీలక ప్రాంతాలకు వెళ్లడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కొన్నిసార్లు ఒంటరిగానే.. మరికొన్ని సందర్భాల్లో ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి రోడ్డెక్కుతున్నారు. దీంతో రాహుల్ రాజకీయ వ్యూహంపై చర్చ మొదలైంది.మొండితనమా.. వ్యూహమా?ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా సవరణ అంశంపై తాజాగా ఇండియా కూటమి ఆందోళనలు ఉధృతమయ్యాయి. బుధవారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయగా.. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు కూడా ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ చేపట్టి.. ఆకాశవాణి భవన్ వద్ద దాదాపు ఎనిమిది గంటల పాటు నిరసన తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గురువారం మరింత పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని కూటమి నిర్ణయించింది.రాహుల్‌కు కొత్తేమీ కాదు..అయితే ఈ తరహా రాజకీయ శైలి రాహుల్‌కు ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు. భట్టా-పార్సౌల్ రైతుల ఆందోళన సమయంలోనూ ఆయన మోటార్ సైకిల్‌పై అక్కడికి వెళ్లి రైతులను కలిశారు. మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉన్న రాహుల్.. భారత్ జోడో యాత్ర సమయంలోనూ యాత్రికులతో కలిసి శిక్షణ తీసుకున్నారు. వీధి నిరసనల్లో గంటల తరబడి నడవడం, బైఠాయించడం, పోలీసుల అడ్డంకులను ఎదుర్కోవడంలో ఆయన ఫిట్నెస్ కూడా కనిపిస్తోంది.మరోవైపు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు కూడా ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. 15 మంది నేతలతో కూడిన ప్రతినిధి బృందానికి సమయం కోరగా.. 10 మందికి అనుమతి లభించినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య రాహుల్ గాంధీ ‘సడెన్ యాక్షన్’ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహమా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న -
జంతర్ మంతర్ వద్ద హై టెన్షన్ రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు
-
‘పోలీసులు నన్ను కింద పడేశారు.. గోళ్లతో రక్కారు’
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత నడుమ.. ప్రధాన ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి చేపట్టిన నిరసన కార్యక్రమం హైడ్రామాకు దారితీసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్, ఓటర్ల జాబితా సవరణల్లో అవకతవకలు జరిగాయంటూ జంతర్ మంతర్ వైపు వెళ్తున్న విపక్ష ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తనను మహిళా పోలీసులు కింద పడేశారని, ఒళ్లంతా రక్కారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రాలతో పాటు పలువురు ప్రముఖ విపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. జంతర్ మంతర్ వైపు నిరసన ప్రదర్శనగా వెళ్తున్న ఇండియా కూటమి ఎంపీల బస్సులను అశోక రోడ్డు వద్ద భారీ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో ఆగ్రహించిన విపక్ష నేతలు విండ్సన్ సర్కిల్ వద్ద రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.మరోవైపు, ప్రియాంకా గాంధీ వాద్రా సహా పలువురు మహిళా ఎంపీలు జంతర్‌మంతర్‌కు వెళ్లే మార్గంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్లలో ఎక్కించారు. పోలీసుల అదుపులోకి తీసుకునే క్రమంలో తనపై దురుసుగా ప్రవర్తించారని ప్రియాంకా గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. నిరసన సమయంలో మహిళా పోలీసు సిబ్బంది తనను కిందపడేశారని, ఒళ్లంతా గోళ్లతో గీరారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎంపీలతో ప్రవర్తించే తీరు ఇదేనా? ఎంపీలను కొడతారా? ఈడ్చి పడేస్తారా? ఎంపీలు ఏం అడుగుతున్నారు? ఈసీని కలుద్దామని ఎంపీలు అడగడం నేరమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు వ్యవహరించిన తీరు అప్ర జాస్వామికమని విపక్ష నేతలు మండిపడ్డారు. -
దద్దరిల్లిన ఢిల్లీ జంతర్ మంతర్ లో భారీ నిరసన
-
సోషల్ మీడియానా.. మజాకా.. పోలీసులు ఏం చేశారంటే?
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. విధులు నిర్వహిస్తున్న పలువురు ఢిల్లీ పోలీసు సిబ్బంది నేమ్ట్యాగ్లు ధరించకుండా కనిపించారు. జులై 20న జరిగిన ఘర్షణల తర్వాత కొందరు పోలీసుల గుర్తింపును సామాజిక మాధ్యమాల్లో బయటపెట్టి లక్ష్యంగా చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.పోలీసుల కుటుంబ సభ్యులను కూడా ఆన్లైన్ వివాదాల్లోకి లాగే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయని పేర్కొన్నాయి. గతంలో జంతర్‌మంతర్ నిరసనల్లో విధులు నిర్వహించిన కొందరు పోలీసుల వివరాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చాయని అధికారులు తెలిపారు. పోలీసుల కుటుంబ సభ్యులను సైతం స్నేహితులు, సామాజిక వర్గాలు, సహోద్యోగుల ద్వారా ప్రస్తావించడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ ద్వారా లక్ష్యంగా చేసుకున్నట్లు కొందరు అధికారులు సమీక్ష సమావేశాల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.ఈసారి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించిన పలువురు జూనియర్ సిబ్బందికి నేమ్ట్యాగ్లు లేకుండానే పనిచేసేందుకు అనుమతించినట్లు సమాచారం. అయితే ప్రజలు సులభంగా గుర్తుపట్టే సీనియర్ ఐపీఎస్ అధికారులు మాత్రం తమ నేమ్ట్యాగ్లు కొనసాగించినట్లు అధికారులు తెలిపారు. పెద్ద నిరసనల్లో కొంతమంది సిబ్బంది ప్రత్యేక గుర్తింపు లేదా నిఘా విభాగాలకు చెందినవారని, వారి విధుల స్వభావం కారణంగా సాధారణంగా సాధారణ దుస్తుల్లో పనిచేస్తారని పోలీసులు వివరించారు.అయితే నేమ్ట్యాగ్లు లేకపోవడంపై నిరసనకారులు, రాజకీయ నాయకుల నుంచి విమర్శలు వచ్చాయి. పోలీసుల జవాబుదారీతనం దెబ్బతినే అవకాశం ఉందని వారు ఆరోపించారు. జంతర్‌మంతర్‌లో నిరసన సందర్భంగా అదుపులోకి తీసుకున్న సీపీఐ రాజ్యసభ సభ్యుడు పి.సంతోష్ కుమార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.పోలీసుల చర్యలపై విచారణ జరపాలని కోరుతూ.. సుప్రీంకోర్టు డీకే బసు కేసులో ఇచ్చిన ఆదేశాలు, ఢిల్లీ పోలీసు స్టాండింగ్ ఆర్డర్ నంబర్ 51 ప్రకారం పోలీసులకు స్పష్టంగా కనిపించే గుర్తింపు, నేమ్ప్లేట్లు ఉండాలని పేర్కొన్నారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ జరుగుతున్న తాజా నిరసనల నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం జరిగిన ఆందోళనల్లో సుమారు 110 మందిని అదుపులోకి తీసుకున్నట్లు, 15 మంది పోలీసు సిబ్బంది గాయపడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. -
రాజధానిలో హైడ్రామా.. పోలీసులకు చుక్కలు చూపించిన జెన్‌జీ!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జంతర్ మంతర్‌లో నిరసనల వేడి తారస్థాయికి చేరింది. ఆందోళనకారులను తరలించేందుకు పోలీసులు సిద్ధం చేసిన బస్సు.. ఓ మహిళ చేసిన పనితో ఒక్కసారిగా ఆగిపోయింది. బస్సు డ్రైవర్ వద్దకు వెళ్లిన ఆమె వాహనం తాళాలను లాక్కొని జనాల్లో కలిసిపోయింది. దీంతో తాళాలు లేక బస్సు ముందుకు కదల్లేదు. చివరకు పోలీసులు బస్సును వెనుక నుంచి నెట్టుకుంటూ తరలించాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఎన్నికల జాబితాల సవరణ, ఎన్నికల సంఘం పనితీరుపై ఆందోళనలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఆదివారం జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరిగాయి. వివిధ రాజకీయ, విద్యార్థి, పౌర హక్కుల సంఘాలు చేపట్టిన ఆందోళనలో పరిస్థితి క్రమంగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా బలగాలను మోహరించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.🚨Surgical Strike on Delhi Police Near Jantar Mantar 🚨 This girl somehow stole the Key of the bus which was detaining protestors. She is a Hero 😅🫡 https://t.co/rjDgbJTisN— 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) October 5, 2026 అదుపులోకి తీసుకున్న వారిని తరలించేందుకు పోలీసు బస్సులను సిద్ధం చేస్తుండగా.. ఓ మహిళా నిరసనకారిణి ఓ బస్సు డ్రైవర్ వద్ద నుంచి తాళాలు లాక్కున్నట్లు వీడియోలో కనిపించింది. అనంతరం ఆమె పరుగెత్తుకుంటూ జనాల్లోకి వెళ్లిపోయింది. తాళాలు దొరకకపోవడంతో బస్సు అక్కడే నిలిచిపోయింది. మరో వీడియోలో పోలీసులు బస్సును వెనుక నుంచి నెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు మహిళ చర్యను నిరసనలో భాగంగా సమర్థిస్తుండగా.. మరికొందరు పోలీసు వాహనం తాళాలు లాక్కొని దాని రాకపోకలను అడ్డుకోవడం చట్టపరంగా సమస్యలకు దారితీయొచ్చని ప్రశ్నిస్తున్నారు.Subway Surfers. Jantar Mantar 2.0 😂😂😂😂 https://t.co/3qyEMsyqQ3— Pranav (@pranav7222) October 5, 2026అయితే వైరల్ వీడియో ఆధారంగా మాత్రమే ఆమెపై ఏదైనా కేసు నమోదైందా? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారా? అన్నది ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. మరోవైపు.. పోలీసు వాహనాల నుంచి నిరసనకారులు తప్పించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. జెన్‌జీ పవర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.Police can't handle Genz See how the protesters at Jantar Mantar are breaking the bus windows and running away. Handling the GenZ movement is not an easy task even for the Delhi Police. I request all the youth to protest peacefully and not indulge in any kind of violence. https://t.co/fmXQOVyStI— Wallah Habebe (@Wallahhabebe) October 4, 2026ఇదిలా ఉండగా.. ఆదివారం జరిగిన ఆందోళనలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు బారికేడ్లను తొలగించి, అదుపులోకి తీసుకున్న వారిని తరలిస్తున్న బస్సులను అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనల్లో సుమారు 15 మంది ఢిల్లీ పోలీసు సిబ్బంది గాయపడగా.. దాదాపు 110 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కొందరు మహిళా పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయని సమాచారం. Jantar Mantar 2.0 The Power of Women https://t.co/OM7jIDCb5Z— Shivam Parashar (@Shivam2805) October 5, 2026Jantar Mantar 2.0 just unlocked a new level of Delhi protest politics. Police detained scores of student protesters and activists during demonstrations near Jantar Mantar, but videos circulating online appear to show some students making a quick escape from detention buses before reaching police stations. 🚍💨 Delhi Police had deployed heavy security, barricades, and large numbers of personnel as protests intensified over demands for the Chief Election Commissioner’s resignation. Reports indicate that around 150 protesters were detained today amid the standoff. Delhi Metro: "Mind the gap." Students: "Already did." 😅 Who had "bus jailbreak" on their 2026 Delhi bingo card? 👀 🎥 If you were on that bus, would you stay put or make a run for it? #Delhi #JantarMantar #Protest #StudentPolitics #India #ViralVideo— Kaptan Hindustan™ (@KaptanHindustan) October 4, 2026Cockroach janta party protest 2.0 jantar mantar😉😗😁😀 https://t.co/VxBHzVADEt— Ram dhakar (@RamDhakar97) October 4, 2026 -
మూడో రోజూ నిరసన హోరు
న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) నేతలు, కార్యకర్తలు ఢిల్లీలో వరుసగా మూడో రోజు ఆదివారం సైతం కదం తొక్కారు. జంతర్‌మంతర్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జంతర్‌మంతర్ చుట్టూ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అశోక రోడ్డులోని ఆంధ్రభవన్ సర్కిల్ నుంచి దూసుకొచ్చిన నిరసనకారులు జంతర్‌మంతర్ సమీపంలో బారికేడ్లను ఛేదించడానికి ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా బారీకేడ్ ఎక్కగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులను పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి, పోలీసు స్టేషన్‌కు తరలించారు. మహిళా జర్నలిస్టులకు లైంగిక వేధింపులు ఢిల్లీలో ఈనెల 3న జరిగిన నిరసన సందర్భంగా పోలీసులు తమను లైంగికంగా వేధించారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఆరోపించడం కలకలం సృష్టించింది. నిష్పాక్షిక విచారణ కోసం వారి ఫిర్యాదులను క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు పోలీసు అధికారులు ఆదివారం తెలిపారు. తనపై ఒక ఏసీపీ లైంగిక దాడి చేశారని పాత్రికేయురాలు ఆరోపించారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో మహిళా పోలీసులు ఎవరూ లేరంటూ తాను ప్రశ్నించానని, దాంతో ఏసీపీ వివేక్ భగత్ తనను అసభ్యకరంగా తాకుతూ నెట్టేశాడని తెలిపారు. వేధింపులపై మరో ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. మహిళా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ది్రగ్బాంతి వ్యక్తం చేసింది. పోలీసుల వ్యవహార శైలిని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఖండించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని నిలదీశారు. నిరసనల సందర్భంగా మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తేల్చిచెప్పారు. నంబర్‌లేని వాహనంలో నేహా తరలింపుఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరాను ఢిల్లీ పోలీసులు నంబర్ ప్లేట్‌లేని ఒక వాహనంలో ఎక్కించారు. అందులో గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని ఏఐఎస్ఏ సభ్యులు ఆరోపించారు. ‘‘మా నాయకురాలి జాడ తెలీకుండా ఉండేందుకు నంబర్‌లేని వాహనంలో ఎత్తుకెళ్లారు. తీసుకెళ్లే సమయంలో వాహనంలో మహిళా పోలీసులు ఎవరూ లేరు. ఇది నిబంధనల్ని పూర్తిగా ఉల్లంఘించడమే. ఆమె ఫోన్, బ్యాగ్‌ను పోలీసులు లాక్కున్నారు’’ అని నిరసనకారులు ఆందోళన వ్యక్తంచేశారు. అదుపులోకి తీసుకున్న నేహా బోరాను నరేలా పారిశ్రామిక ప్రాంత పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు తర్వాత విడుదల చేశారు. -
మహిళా జర్నలిస్టులతో ఇదేం తీరు.. పోలీసులపై తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో మహిళా జర్నలిస్టులపై పోలీసుల ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపుతోంది. ముగ్గురు మహిళా జర్నలిస్టులు తమపై పోలీసు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ ఫిర్యాదులను నిష్పక్షపాత దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు.ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల వ్యవహారం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నందున అమిత్ షా దీనిపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా జర్నలిస్టు పోలీసు అధికారిపై ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని రాహుల్ ఆరోపించారు. జంతర్ మంతర్‌లో వందలాది మంది జర్నలిస్టులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారని రాహుల్ తెలిపారు. నిరసనల సందర్భంగా మహిళా ఆందోళనకారుల పట్ల కూడా పోలీసుల ప్రవర్తనపై ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. కెమెరాలు లాక్కోవడం, జర్నలిస్టులను ఈడ్చుకెళ్లడం వంటి ఘటనలు జరిగాయని ఆయన ఆరోపించారు.🚨THIS IS SHAMEFULL Female Journalist alleges an inappropriate behavior by security personnel during Jantar Mantar Protest. @yadavakhilesh @abhijeet_dipke @RahulGandhi #DelhiPolice #JantarMantar #GyaneshKumar https://t.co/jJ1kRjyU98— Global News 🚨 (@Jarvis945) October 3, 2026ఇదిలా ఉండగా, సీపీజే, ఏఐఎస్ఏ కూడా మహిళా జర్నలిస్టులు, మహిళా ఆందోళనకారులు, న్యాయవాదుల పట్ల పురుష పోలీసు సిబ్బంది దురుసుగా వ్యవహరించారని ఆరోపించాయి. పలువురు మహిళలు గృహిణులు/జర్నలిస్టులు తమను తాకుతూ వేధించారని ఫిర్యాదు చేసినట్లు ఏఐఎస్ఏ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపై దర్యాప్తు ఇంకా కొనసాగాల్సి ఉంది. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే అందిన ఫిర్యాదులను క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించిన నేపథ్యంలో.. విచారణలో ఏం తేలుతుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.Bravo Delhi Police 🔥🔥 Neha Bora Detained Again On 2nd day of protest At Jantar Mantar https://t.co/GCphH3PNHg— INDIAN (@hindus47) October 3, 2026𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐖𝐢𝐭𝐡𝐨𝐮𝐭 𝐍𝐚𝐦𝐞𝐩𝐥𝐚𝐭𝐞𝐬 Under the cover of Darkness, they are detaining Girls and taking them away in Buses. First of all, Detaining Women in this manner after Dark raises Serious questions about Legality and due Process. Who are these Police Personnel without Nameplates? If anything happens to these Protesting Girls while they are being taken away, Who Will Be Held Accountable? Let's reclaim Jantar Mantar. 🔥 #JantarMantar— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) October 3, 2026She refused to leave him 🥹❤️ Woman = God 🙏 https://t.co/lWDe4nfyrB— 🐅ராச.துரை ஆனந்தன் 🐅 (@thuosi444) October 3, 2026 -
ఢిల్లీలో హైటెన్షన్.. ఇంటర్నెట్ బంద్
జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు అప్డేట్స్.. 👉సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు.. పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. జంతర్ మంతర్ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే, సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 👉ఢిల్లీలో ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై నిరసన తెలిపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు, కార్యకర్తలు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో భద్రతను కట్టుదిట్టం చేసిన ఢిల్లీ పోలీసులు డ్రోన్లతో ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. ఆందోళనలో పాల్గొన్న ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పలువురు ఆప్ కార్యకర్తలను కూడా పోలీసులు డిటైన్ చేసినట్లు తాజా సమాచారం.No chance this time.🚨 AAP leader Saurabh Bhardwaj detained by Delhi Police at Jantar Mantar while protesting against CEC Gyanesh Kumar.Next number: Neha Bora, Abhijeet Dipke and whole CJP 🔥🤣 pic.twitter.com/f5apluLSBH— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) October 2, 2026👉ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR), ఎన్నికల సంఘం పనితీరుపై నిరసన వ్యక్తం చేస్తూ కార్యకర్తలు, రాజకీయ నేతలు, పౌరసమాజ ప్రతినిధులు ఆందోళనకు పిలుపునిచ్చారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనలు చేపట్టారు. అయితే జంతర్ మంతర్ వద్ద ఈ ఆందోళనకు ఢిల్లీ పోలీసులు ముందస్తు అనుమతి ఇవ్వలేదు.👉ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిరసనకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో కేంద్ర ఢిల్లీలో భద్రతను మరింత పెంచారు. పరిస్థితిని బట్టి డ్రోన్ల ద్వారా గుంపుల కదలికలను పర్యవేక్షించే ఏర్పాట్లు కూడా చేశారు.JANTAR MANTAR PROTEST OVER CEC GYANESH KUMARDelhi Police denied permission for a protest at Jantar Mantar over the SIR and electoral-roll controversy involving CEC Gyanesh Kumar. Section 163 BNSS was imposed in New Delhi restricting gatherings without permission. The… pic.twitter.com/l6ScHMliza— Ravi Prakash Official (@raviprakash_rtv) October 2, 2026👉ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ మెట్రో 11 స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. జంతర్ మంతర్ వద్ద ప్రతిపాదిత ఆందోళన నేపథ్యంలో ప్రజల భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు న్యూఢిల్లీలో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ముందస్తు అనుమతి లేకుండా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, ర్యాలీలు, ధర్నాలు, నినాదాలు, ప్రసంగాలపై ఆంక్షలు విధించారు. నిషేధాజ్ఞలు అమలు చేయడంతో రాజధానిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.👉ఇంటర్నెట్ సేవలు నిలిపేయడంతో యాప్ బుకింగ్.. ఊబర్, ఓలా, భారత్ టాక్సీ, ఫోన్ పే, గూగుల్ పే సేవలు ఆగిపోయాయి. సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. #WATCH | Delhi | Police and RAF personnel and Riot Control Vehicle deployed at Jantar Mantar, in view of a call for protest by activists, political leaders and civil society representatives against the ongoing Special Intensive Revision and demanding accountability from the Chief… pic.twitter.com/Kg21aCgGYY— ANI (@ANI) October 2, 2026👉ఇక, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. అక్టోబర్ 2న ముంబైలోని శివాజీ పార్క్‌లో ఆందోళనకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. అయితే శివాజీ పార్క్‌లో కార్యక్రమానికి ముంబై పోలీసులు అనుమతి ఇవ్వలేదని, ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోవాలని సూచించారు. దీంతో, ముంబైలో హైఅలర్ట్ వాతావరణం నెలకొంది.👉ఇదిలా ఉండగా.. జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బందిని మోహరించారు. అల్లర్ల నియంత్రణ వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జంతర్ మంతర్ సమీపంలోని జన్‌పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్, సేవా తీర్థ్, మండీ హౌస్, లోక్ కల్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్ల గేట్లను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మూసివేశారు. దీంతో ఆయా స్టేషన్ల వద్ద ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. Delhi Metro Rail Corporation says, "The entry and exit at the following metro stations will remain closed till further notice: Janpath, Patel Chowk, Central Secretariat, Rajiv Chowk, Seva Teerth, Mandi House, Lok Kalyan Marg, INA, Chawri Bazar, Ramakrishna Ashram Marg and New… pic.twitter.com/aLGhbJOPXY— ANI (@ANI) October 2, 2026 -
‘‘సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలి’’
న్యూఢిల్లీ: దేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు, సీజేపీతో పాటు చాలా మంది ప్రముఖులు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో జ్ఞానేశ్ కుమార్‌కు మద్దతుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో అగర్వాల్, వైశ్య సామాజిక వర్గాలకు చెందిన సంస్థలు భైఠాయించాయి. ఎన్నికల సంఘాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆయా సంఘాల నాయకులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌కు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. జ్ఞానేశ్ కుమార్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.నిరసనలో పాల్గొన్నవారు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జ్ఞానేశ్ కుమార్‌తో పాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని వారు విమర్శించారు. సర్‌కు మద్దతుగా బీజేపీ..భారతీయ జనతా పార్టీ నేత జై భగవాన్ గోయల్ కూడా జ్ఞానేశ్ కుమార్ పనితీరును ప్రశంసిస్తూ ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ప్రతిపక్షాన్ని ఆయన విమర్శించారు. జ్ఞానేశ్ కుమార్ చర్యల కారణంగా ఓటరు జాబితా నుంచి బంగ్లాదేశ్, రోహింగ్యా ప్రజల పేర్లను తొలగించారని గోయల్ పేర్కొన్నారు. ఈ చర్య వల్ల పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ఎన్నికల సంఘం, ముఖ్యంగా జ్ఞానేశ్ కుమార్ కారణమై ఉండవచ్చని ప్రతిపక్షం భావిస్తోందని గోయల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఎన్నికల ఫలితాలపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారని గోయల్ అన్నారు. ప్రతిపక్షానికి ప్రజల మద్దతు లేకపోవడంతోనే ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతికూల వాతావరణం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని గోయల్ పేర్కొన్నారు. ఇతర ఎన్నికల కమిషనర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి జ్ఞానేశ్ కుమార్ పనితీరుపై ఫిర్యాదు పంపినట్లు తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఆ ఫిర్యాదులో ఉన్నాయని చెప్పారు. జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతిపక్షాల నిరసనలు, ఆయనకు మద్దతుగా జరుగుతున్న కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం వ్యవహారశైలి, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై రాజకీయ చర్చ మరింత కొనసాగనున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: మంచంపై తొలిసారి నిద్రపోతున్నానంటూ పట్టలేని ఆనందం -
జంతర్‌మంతర్ వద్ద నిరసన.. పలువురి నిర్బంధం
న్యూఢిల్లీ: ఓటరు జాబితా, సర్ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ శుక్రవారం జంతర్‌మంతర్ వద్ద నిరసన జరిగింది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)ఢిల్లీ విభాగం, పౌర సమాజాల సభ్యులు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా, సీఈసీ రాజీనామా చేయాలంటూ వీరు నినాదాలు చేశారు. అయితే, నిరసన కోసం వీరు ఎటువంటి అనుమతులు కోరలేదని పోలీసులు తెలిపారు. అందుకే నిర్వాహకులను అరెస్ట్ చేశామన్నారు. పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న వారిలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్, ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా తదితరులున్నారు. అయితే, శనివారం, ఆ తర్వాతా తాము నిరసనలను కొనసాగిస్తామని ఏఐఎస్ఏ నేతలు తెలిపారు. కంఝావాలా పోలీస్‌స్టేషన్ నుంచి నేహా ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆమె..ఎన్నికల సంఘం నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసినందుకే పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ‘రాజ్యాంగం అందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రసాదించింది, అందుకే మేం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపడానికి వెళ్లాం’అని పేర్కొన్నారు. ఈ రోజు తమను అదుపులోకి తీసుకున్నప్పటికీ, రేపు మళ్లీ వస్తాం, ఎల్లుండీ వస్తాం. జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లే వరకు.. సర్ నిలిపివేసే వరకు.. రాజ్యాంగ విరుద్ధంగా ఓటు హక్కు కోల్పోయిన ఓటర్లందరికీ తిరిగి ఓటు హక్కు పునరుద్ధరించే వరకు నిరసనలతో హోరెత్తిస్తాం’అని నేహా ఆ వీడియోలోపేర్కొన్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులు నిరసనకారులపై విచక్షణారహితంగా వ్యవహరించారని భట్టాచార్య ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిరసన స్థలంలో మోహరించిన కొందరు పోలీసు సిబ్బంది నేమ్ ట్యాగ్లు (పేరు బిళ్ళలు) ధరించకపోవడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘ఓట్ల దొంగతనానికి పాల్పడుతూ జ్ఞానేశ్ పట్టుబడ్డారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే, సీఈసీగా ఆయన్ను నియమించిన మోదీ, షాలు నిరసనలను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వం సీఈసీని కాపాడుతోంది’అని విమర్శించారు. -
హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్!
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై జంతర్‌మంతర్‌లో జరిగిన ఆందోళన సందర్భంగా ఒకవ్యక్తిపై దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌కు న్యూఢిల్లీ కోర్టు మంగళవారం మూడు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఈ మూడు వారాల్లో స్వతంత్ర ప్రవర్తనను పరిశీలించిన తరువాత అతడి సాధారణ బెయిల్‌పై విచారణ చేపడతామని కోర్టు తెలిపిందని సమాచారం. ‘‘న్యాయస్థానం విశ్వాసానికి ఈ బెయిల్ ప్రతీక. అంతేకానీ అది అందరికీ చూపేలా ప్రదర్శించే ట్రోఫీ కాదు’’ అని న్యాయమూర్తి బెయిల్ ఇస్తూ స్పష్టం చేసినట్లు తెలిసింది. అత్యంత హీనాతిహీనమైన కేసులో బెయిల్ దక్కడంపై ఉత్సవాలు, ఊరేగింపులు జరపడం, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం సమాజం, శాంతి భద్రతలకు అంతగా సరిపోయే అంశం కాదని అన్ని పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న తరువాత, కస్టడీలో ఉన్న దాదాపు పదిరోజుల్లో భరద్వాజ్ ఆత్మపరిశీలన చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు న్యాయమూర్రిత తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. భరద్వాజ్ విచారణ కూడా పూర్తయిందని, అతడిపై మోపిన అభియోగాలకు ఏడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని న్యాయమూర్తి తెలిపారు. అయితే ఈ కేసులో న్యాయస్థానం ఆందోళన ప్రధానంగా ఫిర్యాదుదారు, అతడి కుమార్తె మైనర్ బాలిక విషయంలో ఉందని, తగిన షరతులతో వారి భద్రతను కాపాడవచ్చునని వ్యాఖ్యానించింది. ‘‘బాధితుల రక్షణ, ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యతలను పూర్తి చేయండం రెండూ కఠినమైన షరతుల కింద అప్లికెంట్కు మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయడం ద్వారా సాధ్యమవుతాయి’’ అని పేర్కొన్నారు. ఈ కాలంలో అతడి ప్రవర్తనను గమనించాలని, దాని ఆధారంగానే అతడి సాధారణ బెయిల్ విజ్ఞప్తిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. జూన్ 23 నాటి ఘటనకు సంబంధించిన ఏ నిర్ణయమైనా న్యాయస్థానాల్లో సాక్ష్యాల ఆధారంగా జరగాలని, బహిరంగంగా సోషల్ మీడియాలో కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. భరద్వాజ్‌ను రూ.50 వేల వ్యక్తిగత బాండ్, అంతే మొత్తానికి ష్యూరిటీ, పలు షరతులతో మధ్యంతర బెయిల్‌పై విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కేసు గురించి చర్చించడం, తనకు మద్దతుగా పోస్టులు పెట్టడం, లేదా ఫిర్యాదుదారుల కుటుంబానికి వ్యతిరేకంగా ఏ రకమైన మీడియాలోనూ వ్యాఖ్యలు చేయకపోవడం వంటివి మధ్యంతర బెయిల్‌కు పెట్టిన షరతుల్లో కొన్ని. బాధితుడిని, అతడి కుమార్తెను లేదా సాక్షులను సంప్రదించే ప్రయత్నం అసలు చేయకూడదు. సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం విదేశాలకు పారిపోయే యత్నమూ చేయకూడదు. విచారణకు సహకరించాలి. చిరునామా, ఫోన్ నెంబర్లను పోలీసులకు ఇవ్వడంతోపాటు మధ్యంతర బెయిల్ సమయం ముగిసిన తరువాత లొంగిపోవాలి. తదుపరి విచారణ అక్టోబరు ఆరవ తేదీ జరగనుంది. మంగళవారం నాటి బెయిల్ విచారణ ఇన్ కెమెరా జరిగిన విషయం తెలిసిందే. -
స్వతంత్ర భరద్వాజ్ అరెస్టు
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా ఓ విద్యార్థి తండ్రిపై తాను దాడి చేశానని, తల పగులగొట్టానని చెప్పుకున్న హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షెహర్ జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అంతకుముందు ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, ఎంపీ పప్పు యాదవ్‌లతో కలిసి కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. స్వతంత్ర భరద్వాజ్‌ను అరెస్టు చేయాలని పట్టుబట్టారు. 72 గంటల్లో అతడిని అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో సీజేపీ కార్యకర్తలు నిరసన విరమించారు. తర్వాత గంటల వ్యవధిలోనే స్వతంత్ర భరద్వాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగింది? పేపల్ లీకేజీపై జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు జూన్ 23న ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థిని నిషూ ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్ ఫోన్లో రికార్డు చేస్తుండగా వాగ్వాదం మొదలైంది. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయనపై దాడి చేశారు. ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. తన తలపై పిడిగుద్దులు కురిపించారని, ఇనుప కడియం లాంటి గట్టి వస్తువుతో కొట్టారని సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆయన తలపై రెండు బలమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాడికి పాల్పడిన స్వతంత్ర భరద్వాజ్, సూరజ్ కుమార్లపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. స్వతంత్ర భరద్వాజ్ మాట్లాడిన ఒక పాడ్‌కాస్ట్ క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో భరద్వాజ్ తనను తాను కట్టర్ హిందూ(కరుడుగట్టిన హిందువు)గా చెప్పుకున్నాడు. సంజయ్ కుమార్ పుర్రెను తాను పగలగొట్టినట్లు బయటపెట్టాడు. ‘‘ఈ నేరం ఏ సెక్షన్ పరిధిలోకి వస్తుందో మీకు తెలుసా? సెక్షన్ 307. నిషూ ఆజాద్ తండ్రికి 60 కుట్లు పడ్డాయి. అతడిని అంబులెన్స్‌లో తరలించారు. తన తండ్రికి న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పోలీస్ స్టేషన్ బయట నిలబడి అతడి కుమార్తె నిషూ ఆజాద్ అంటోంది. కానీ, నన్ను కనీసం జైలులో కూడా పెట్టలేదు. ఈ విషయం ప్రపంచానికి తెలియాలి. రాత్రంతా నేను బయట తిరుగుతూనే ఉన్నాను. నాకు హనుమంతుని ఆశీస్సులు ఉన్నాయి. కపిల్ మిశ్రా నాకు అన్నయ్య అవుతారు. కపిల్ మిశ్రా ఫోన్ చేయడం వల్లే నేను విడుదలయ్యానని అంటుంటారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా నాకు అన్నయ్యే. మీకు ఎంతమంది నాయకులు తెలుసు? మోదీజీ తెలుసా? మోదీజీ కూడా నాకు అన్నయ్యే. అందరి మద్దతు నాకు ఉంది’’అని భరద్వాజ్ ఆ వీడియోలో చెప్పడం కనిపిస్తోంది. దీంతో ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచి్చంది. భరద్వాజ్‌ను అరెస్టు చేయాలని సీజేపీ కార్యకర్తలు శుక్రవారం ఆందోళనకు దిగారు. విద్యారి్థని నిషూ ఆజాద్ కూడా పాల్గొన్నారు. భరద్వాజ్‌ను ఎందుకు జైలులో పెట్టలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు అతనికి రాజకీయ రక్షణ లభిస్తోందని ఆరోపించారు. రాజకీయ జోక్యం ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. అతడిని అరెస్టు చేసినట్లు స్పష్టంచేశారు. ఆత్మరక్షణ కోసమే దాడి స్వతంత్ర భరద్వాజ్ మొదటి వీడియో వైరల్ అయిన తర్వాత మరో వీడియో వెలుగులోకి వచి్చంది.వాస్తవానికి ఆత్మరక్షణ కోసమే తాను దాడికి దిగాల్సి వచి్చందని ఇందులో అతడు వివరణ ఇచ్చాడు. ‘‘ఒకవేళ నేను ఆత్మరక్షణలో భాగంగా వ్యవహరించి ఉండకపోతే ఆ గుంపు నన్ను కొట్టి చంపి ఉండేది. నా ప్రాణాలు కచి్చతంగా పోయేవి. జంతర్‌మంతర్ వద్ద నిరసనకారులపై నేను దాడి చేయడానికి ప్రయత్నించలేదని నిరూపించడానికి వీడియో సాక్ష్యం ఉంది’’అని పేర్నొన్నాడు. -
జంతర్‌మంతర్‌లో మరో నిరసన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ మళ్లీ జనసంద్రంగా మారింది. ఈసారి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కాకుండా.. అన్రిజర్వ్డ్(రిజర్వేషన్ వర్గాలకు చెందని) యువత కదం తొక్కారు. భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కుల ప్రాతిపదికన అమలవుతున్న రిజర్వేషన్లు, యూనివర్సిటీ నిధుల సంఘం(యూజీసీ) తీసుకొచ్చిన సమానత్వ నిబంధనలను వ్యతిరేకిస్తూ వేలాది మంది ఆందోళనకు దిగారు. రిజర్వేషన్ల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ‘రిజర్వేషన్ సంస్కరణల ఆందోళన్’పేరిట పెద్ద సంఖ్యలో నిరసనకారులు శుక్రవారం జంతర్‌మంతర్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) జవాన్లు భారీగా మోహరించారు. పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. యూజీసీ నిబంధనలకు, ప్రస్తుతం ఉన్న కుల ఆధారిత రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా తాము శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తున్నామని నిరసనకారులు స్పష్టంచేశారు. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) అభ్యర్థి హర్‡్ష దూబే నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమంలో రాజస్తాన్‌కు చెందిన జనరల్ సేన, చాణక్య సేనలతో పాటు కర్ణి సేన కూడా పాల్గొన్నాయి. ఇన్ఫ్లుయెన్సర్ అజిత్ భారతి కూడా హాజరయ్యారు. ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి నిరసనకారులు జంతర్‌మంతర్ వద్ద హనుమాన్ చాలీసా పఠించారు. ‘సియావర్ రామచంద్ర కీ జై’అని నినాదాలు చేశారు. కొంతమంది నిరసనకారులు ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని వ్యతిరేకించారు. దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాలను ఎవరూ దురి్వనియోగం చేయకూడదని చెప్పారు. అటువంటి దురి్వనియోగాన్ని నివారించడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. కులం ఆధారంగా కాకుండా పౌరుల ఆర్థిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిజంగా అవసరమైన వారికే రిజర్వేషన్ ప్రయోజనాలు దక్కేలా సంస్కరణలు తీసుకురావాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తేలి్చచెప్పారు. ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో సాగిన కుల ఆధారిత రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ఇప్పుడు వీధుల్లోకి వచ్చింది. -
ధర్నా విరమించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
ఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషస్ వద్ద ధర్నాను విరమించారు. జంతర్ మంతర్ వద్ద గత నెల జరిగిన విద్యార్థుల నిరసన సమయంలో లోచవ్ (19) అనే విద్యార్థికి పెల్లెట్ గన్ల వల్ల గాయాలయ్యాయి. లోచవ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.పెల్లెట్ గన్ గాయాల ఘటనకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 118, 125 కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీఎన్ఎస్లోని సెక్షన్ 118 ప్రమాదకర ఆయుధాలు లేదా మార్గాలను ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా గాయపరచడం లేదా తీవ్రమైన గాయాలు కలిగించడం గురించి చెబుతుంది. సెక్షన్ 125 ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు సంబంధించినది.అంతకుముందు ఏం జరిగింది?ఈ ఘటనకు సంబంధించిన శుక్రవారం తెల్లవారుజామున నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించారని లోచవ్ ఆరోపించడంతో, రాహుల్ గాంధీ కొంతమంది కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ముందుగా వారు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని సమాచారం అందడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు.తెల్ల టీషర్ట్, లేత గోధుమరంగు ప్యాంట్ ధరించిన రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్లోకి నడుచుకుంటూ వెళ్లడంతో అక్కడి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. తొలుత ఫిర్యాదు నమోదు చేయాలని ఆయన అధికారులను ఒత్తిడి చేశారు. అయితే అధికారులు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ బయట బైఠాయించి నిరసన ప్రారంభించారు. లోచవ్ ఫిర్యాదును నమోదు చేసేందుకు అధికారులు అంగీకరించే వరకు తన నిరసనను విరమించబోనని ఆయన తెలిపారు.“లోచవ్ కంటిలో 3 గుళ్లు దిగాయి. అతని శరీరంలో 200 గుళ్లు ఉన్నాయి. అతని గుండె సమీపంలో తాకలేని గుళ్ల ముక్కలు ఉన్నాయి. తాము గాలి తుపాకులతో కాల్పులు జరపలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కాకపోతే గాలి తుపాకులతో కాల్పులు జరిపింది ఎవరు? బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని తమకు పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పారు” అని రాహుల్ మీడియాతో అన్నారు. విద్యార్థి శరీరం నుంచి వెలికితీసిన లోహపు గుళ్లను కూడా ఆయన మీడియాకు చూపించారు.ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కుమారి సెల్జా, జైరాం రమేశ్, రణదీప్ సుర్జేవాలా రాహుల్ గాంధీతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. వారు పోలీస్ స్టేషన్లోకి వెళ్లారు. చివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఇదీ చదవండి: ధర్నా విరమించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ -
రాజస్థాన్‌లో ఉద్రిక్తత : 24 గంటల్లో 'జంతర్ మంతర్ 2.0' సీజేపీ హెచ్చరిక
జైపూర్, రాజస్థాన్: స్కూల్ ఠీక్ కరో' (పాఠశాలలను బాగు చేయండి) ప్రచారంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రాజస్థాన్‌లో చేపట్టిన కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు దాడిచేయడంపై సీజేపీ స్పందించింది. సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా, ఇతరులపై అమానుషంగా దాడిచేయడాన్ని,వాహనాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. తమపై ఎటాక్ చేసిన దుండగులను 24 గంటల్లో అరెస్టు చేయాలని రాజస్థాన్ పోలీసులను డిమాండ్ చేసింది. లేదంటే 24 గంటల తర్వాత రాజస్థాన్‌లో 'జంతర్ మంతర్ 2.0' ప్రారంభమవుతుంది; ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత తమది కాదని హెచ్చరించింది. అయితే ఈ విషయంలో గ్రామస్తులను మాత్రం వేధించకూడదని స్పష్టం చేసింది. ఇందులో గ్రామస్తుల ప్రమేయం ఏమీ లేదనీ వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ కూడా స్పందించింది. గ్రామ పాఠశాలను సందర్శించిన సందర్భంగా జరిగిన ఘర్షణ వాతావరణంపై కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ స్పందిస్తూ , "ప్రజలు, యువత , విద్యార్థులలో ఆగ్రహం ఉంది. ప్రభుత్వం దానిని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించడం, ఫోటోలు తీయడం లేదా నివేదికలు ప్రచురించడం వంటివి చేయరాదని జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తప్పబట్టారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలను జారీ చేయడం సరైనది కాదన్నారు. పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్న పరిస్థితిని, సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టడానికి బదులుగా, ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి చేటున్నారు. అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించకుండా లేదా ఫోటోలు తీయకుండా ప్రజలను అడ్డుకోలేరన్నారు. వాస్తవానికి, ప్రభుత్వం వార్తలను అణచివేయడానికి , ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’ <राजस्थान पुलिस को 24 घंटों का समय दिया गया है इन गुंडों को गिरफ्तार करें,बिना गांव वालो को परेशान किए इसमें गांव वालो का कोई योगदान नहीं है24 घंटे निकलने के बाद राजस्थान में शुरू होगा जंतर मंतर 2.0 , जो आगे होगा उसकी जिम्मेदार हम नहीं होंगे@Cockroachisback#schoolThikKaro pic.twitter.com/kRyFncu9Sj— Cockroach Janta party (@IAMVICKYFANS) August 21, 2026 కాగా సీజేపీ ప్రచారంలో భాగంగా జయపూర్ జిల్లాలోని బగ్రూ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న రాంపురా కన్వర్పురా గ్రామంలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేయడానికి వచ్చిన కార్యకర్తలను గ్రామస్తులు, సీజేపీ బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. సీజేపీ బృందం రాకముందే గ్రామస్తులు ప్రధాన రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం సీజేపీ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీజేపీ కార్యకర్తలను గ్రామంలోనికి రానీయకుండా అడ్డుకుని, అక్కడినుంచి పంపించివేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది.గతంలో సీజేపీ నిర్వహించిన తనిఖీల నేపథ్యంలో, రాజస్థాన్ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లోకి బయటి వ్యక్తులు మరియు మీడియా ప్రతినిధుల ప్రవేశంపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయంపై సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని దాచి పెట్టేందుకే విద్యాశాఖ మంత్రి ఇలాంటి ఆంక్షలు విధిసస్తోందని, తమ ప్రచారం ఆగదని పేర్కొన్నారు. 'స్కూల్ ఠీక్ కరో' ప్రచారంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలను పరిశీలించి ఉపాధ్యాయులు, విద్యార్థుల నుండి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలిపారు.#WATCH | Attack on Cockroach Janta Party (CJP) team in Jaipur village | Jaipur, Rajasthan: Congress MLA Sachin Pilot says, "State Govt has issued a fresh order that no journalist can enter a school, no photos can be taken, and nothing can be reported. They want to keep their… pic.twitter.com/Q4NTYATzVe— ANI (@ANI) August 21, 2026 ప్రస్తుతం ఈ పాఠశాల భవనం ప్రమాదకరంగా మారి మూతపడటంతో, సమీపంలోని పశువుల కొట్టంలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే పాఠశాల మరమ్మతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని, స్థానిక ప్రయత్నాలతోనే పాఠశాలను బాగు చేసుకోవచ్చని గ్రామస్తులు, భాజపా కార్యకర్తలు తెలిపారు. అనంతరం వారు పాఠశాల వెలుపల ధర్నా చేపట్టి నినాదాలు చేశారు.సీజేపీ కార్యకర్త శివాంగి శర్మ మాట్లాడుతూ, "మమ్మల్ని ఉగ్రవాదులని, నక్సల్స్ అని అంటూ మా కార్యకర్తలపై దాడి చేశారు. ఈ బయటివాళ్ళు... లోపలివాళ్ళు... ఏంటిది... ఇది ఒకే దేశం. మేము ఏ పార్టీ నుంచో గానీ, మరో దేశం నుంచో గానీ రాలేదు. మేము మన సొంత దేశపు బిడ్డల గురించి మాట్లాడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: పెల్లెట్ గన్ వివాదం: సాహిల్‌తో కలిసి రాహుల్‌గాంధీ ధర్నామరోవైపు తాము బీజేపీ కార్యక్తలం కాదని, సీజేపీ కార్యకర్తలే తమ కార్లను ధ్వంసంచేసుసుకున్నారని తెలిపారు. తమ పాఠశాలను బాగు చేసుకునే పనులను ఇప్పటికే ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఈ ఘటన గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని బగ్రూ డీఎస్పీ ధర్మేంద్ర శర్మ తెలిపారు.(14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’) -
దిమాగీ నక్సల్ అంటే మాకు మెదడు ఉన్నట్టే కదా!
ప్రశ్న: ముందుగా, ఇటీవలి కాలంలోని అత్యంత విజయవంత మైన, దేశానికి కొత్త ఆశను కల్పించిన ఉద్యమంలో నాయకత్వ పాత్ర పోషించినందుకు అభినందనలు. గత రెండు దశాబ్దాలుగా సమాజాన్ని ఆవరించిన భయోత్పాత వాతావరణాన్ని ఈ ఉద్యమం కొంతవరకు తొలగించగలిగింది. అందుకు మరిన్ని అభినందనలు. ఇప్పుడు ప్రశ్నల్లోకి వెళ్దాం. జంతర్ మంతర్ నుంచి దేశవ్యాప్త పర్యటన ఎందుకు?ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించడం. జార్ఖండ్‌లో విద్యార్థులు జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్నారు. అందుకే రాంచీ వెళ్లాం. కోల్‌కతాలో ఐఎస్ఐ విద్యార్థులు తమ విద్యాసంస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అందుకే అక్కడికి వెళ్లాం. తర్వాత జైపూర్ వెళ్లాం. రాజస్థాన్ పేపర్ లీక్‌లకు కేంద్రంగా మారింది. ప్రైవేట్ కోచింగ్ మాఫియా అక్కడ పెద్ద సమస్య. విద్యా వ్యవస్థ ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అక్కడ కనిపిస్తున్నాయి. హైదరాబాదులో ఏబీవీపీ హింసకు వ్యతి రేకంగా కొంతమంది విద్యార్థులు పోరాడుతున్నారు. సీజేఐని కాన్వొకేషన్‌కు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తే తమను బార్లో నమోదు చేయబోమని బెదిరించే పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు జరుగుతున్నాయి. మేము వారితో కలిసి పోరాడుతున్నాం.జంతర్ మంతర్ ఉద్యమం ఎలాంటి పాఠాలు నేర్పింది?ఆ ఉద్యమం విజయం సాధించడానికి ప్రధాన కారణం మేము సంఘటితంగా ఉండటం. అందుకే ఎక్కడ విద్యార్థులు పోరాడు తున్నా వారు కూడా సంఘటితం కావాలి. అధికార ధోరణులను, నిరంకుశ శక్తులను నిజంగా ఎదుర్కోవాలంటే కలిసి రావాలి, తమను తాము చైతన్యపరుచుకోవాలి.మీ తక్షణ లక్ష్యం ఏమిటి?ప్రత్యేకంగా ఏమీ లేదు. వీలైనంత ఎక్కువమంది విద్యార్థులను సంఘటితం చేయడం, రాజకీయాల్లోకి తీసుకుని రావడం, నిజమైన శక్తి ఐక్యతలోనే ఉందని అర్థమయ్యేలా చేయడం– ఇవే మా లక్ష్యాలు. నాణ్యమైన విద్య కోసం, విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం పోరాడాలి.జంతర్ మంతర్‌లో మూడు భిన్నమైన స్రవంతులు ఒకే వేదిక పైకి వచ్చాయి. ఇక భవిష్యత్తు?మేమంతా కలిసి కొత్త సంస్థ ఏర్పాటు చేయబోవడం లేదు. నేను ఏఐఎస్‌ఏలో భాగం. అదే నా సంస్థ. అభిజీత్ దీప్కే సీజేపీలో భాగం. అదే ఆయన సంస్థ. సోనమ్ వాంగ్‌చుక్ స్వతంత్ర వ్యక్తి. ఆయన సొంత అభిప్రాయాలు ఆయనకు ఉన్నాయి. అయితే ఉమ్మడి సమస్యలు ఉంటే విద్యార్థుల కోసం, దేశంలోని యువత కోసం మేము ఒక ఐక్య వేదిక ద్వారా కలిసి పోరాడవచ్చు.మీరు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి వస్తారా?మెయిన్‌స్ట్రీమ్ రాజకీయాలపై నా అవగాహన భిన్నంగా ఉంటుంది. నేను వామపక్ష భావజాలం నుంచి వచ్చాను. ప్రధాన స్రవంతి రాజకీయాలను ఆదర్శ రాజకీయాలుగా మేము చూడం. కాబట్టి నేను ఆ రాజకీయాల్లో చేరను. నేను రాజకీయాల్లోనే ఉన్నాను – నాకు సాధ్యమైనంత లోతుగా. నా భావజాలాన్ని కొనసాగిస్తాను. ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను కొనసాగించవచ్చు.మోదీ అంటించిన ‘దిమాగీ నక్సల్’ లేబుల్‌పై మీ స్పందన?అది ఏమాత్రం ప్రభావం లేని పదం. ప్రజలను చెడ్డవారిగా చిత్రీకరించడానికి, వారిని నిరుత్సాహపరచడానికి, వారి మనో ధైర్యాన్ని దెబ్బతీయడానికి కొత్త కొత్త పదాలను సృష్టిస్తున్నారు. ‘దిమాగీ నక్సల్’ అనేది ఒక జోక్ మాత్రమే. అందరూ నరేంద్ర మోదీని ఉద్దేశించి రకరకాల వ్యంగ్య నినాదాలు ఇస్తున్నారు. ఆయన కూడా ‘నేనూ ఏదైనా కొత్త పదం కనిపెట్టాలి’ అనుకుని ‘దిమాగీ నక్సల్’ అనే పదాన్ని తీసుకొచ్చినట్టుంది. కానీ ఇందులో మరో విషయం ఉంది. ‘దిమాగీ నక్సల్’ అంటే మనందరికీ మెదడు ఉంది. మనకు ఆలోచించే శక్తి ఉంది. మనం ఏమి ఆలోచిస్తున్నామో చెప్పడానికి టెలీప్రాంప్టర్ అవసరం లేదు. సామాన్య ప్రజలకు అర్థం కాని భాషలో మాట్లాడే ఇన్స్టాగ్రామ్ ప్రపంచం కూడా మనకు అవసరం లేదు. ప్రజలతో స్నేహంగా ఉండాల్సింది పోయి, వారి నుంచి పూర్తిగా దూరమయ్యే భాష మనకు అవసరం లేదు. కాబట్టి ‘దిమాగీ నక్సల్స్’ అని పిలిస్తే పిలవనివ్వండి!– డానీ, సమాజ విశ్లేషకులు -
జంతర్ మంతర్ సీజన్ -2 లోడింగ్...!
-
జంతర్ మంతర్ సీజన్-2కు సిద్దం.. అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన
-
జంతర్ మంతర్ సీజన్-2లో ఏం చేస్తారు? ఎప్పుడు షురూ?
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద 36 రోజుల పాటు ఉద్యమం నిర్వహించి నెల కూడా పూర్తికాకముందే.. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే 'సీజన్-2' త్వరలో మొదలవుతుందని ప్రకటించారు. సీజన్-2లో ఏం చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. అది ఎలా ముందుకు వెళ్లనుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యంగా ఈ సారి సీజేపీ ముందుకు వస్తోంది.సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ.. సీజన్-2లో అసలు ఏం జరగబోతోందో వివరించారు. ఈసారి పార్టీ దృష్టి దేశంలోని పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడంపై ఉంటుందని చెప్పారు. పాఠశాలల విషయంలో తమ మాట ప్రభుత్వం వినకపోతే మళ్లీ ఉద్యమం చేస్తామని చెప్పారు. 'స్కూల్ ఠీక్ కరో అభియాన్' ఆగస్టు 15 నుంచి మొదలవుతుందని అన్నారు. పాఠశాలలు బాగుపడాల్సిందే.. సీజేపీ కొత్త ప్రచారాన్ని ప్రారంభించబోతుందని ఆశుతోష్ ప్రకటించారు. ‘‘మా పిల్లలను పాఠశాలలకు దూరంగా ఉండనివ్వం. ఇదే జంతర్‌మంతర్ సీజన్-2. ఈ ప్రచారానికి దేశ ప్రజలే నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారు. గ్రామాల్లో ఉన్న పిల్లలను విద్యకు దూరంగా ఉంచారు. గత కొన్ని సంవత్సరాల్లో దేశంలో 94 వేల పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లలను బలహీనంగా ఉంచాలనే ప్రభుత్వ ప్రయత్నంలా ఇది కనిపిస్తోంది" అన్నారు.ప్రచార సమయంలో ఏం చేస్తారో కూడా రాంకా వివరించారు. "దేశవ్యాప్తంగా సర్పంచ్‌లను తమ పాఠశాలలను మెరుగుపరచాలని కోరుతాం. రాబోయే నెలల్లో మా బృందం దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలను సందర్శిస్తుంది. ఈ పాఠశాలలను మెరుగుపరచాలని కలిసి డిమాండ్ చేస్తాం. సర్పంచ్‌లకు పూర్తిగా మద్దతు ఇస్తాం" అన్నారు.పాఠశాలలను మెరుగుపరచని చోట తమ పార్టీ నిరసనలు కూడా చేపడుతుందని చెప్పారు. సీజేపీ బృందాలు వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలను సందర్శించనున్నాయి. పాఠశాలలు మెరుగుపడని ప్రాంతాల్లో నిరసనలు చేపడతాయి. నీట్ ఉద్యమం ముగిసినా తమ పోరాటం ముగియలేదని, ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఇతర సమస్యలపై దృష్టి పెడతామని సీజేపీ చెబుతోంది. -
జంతర్ మంతర్ సీజన్-2 వచ్చేస్తోంది: దీప్కే సంచలనం
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పార్టీ నిరసన కార్యక్రమాల్లో మరో దశకు చేరుకుంటుందన్న సంకేతాలు ఇచ్చారు. తమ ‘జంతర్ మంతర్’ ఉద్యమం ‘సీజన్ 2’ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు.“ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ‘జంతర్ మంతర్’ సీజన్ 2 ఎప్పుడు మొదలవుతుందని కామెంట్లు చేస్తున్నారు. వారికి నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, ‘జంతర్ మంతర్’ సీజన్ 2 చాలా త్వరలో మొదలుకానుంది” అని దిప్కే చెప్పారు.తదుపరి దశ నిరసనలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో, ఏ డిమాండ్లపై దృష్టి పెడతాయన్న వివరాలను దీప్కే వెల్లడించలేదు. అయితే, జంతర్ మంతర్ వద్ద గతంలో చేపట్టిన ఉద్యమం తర్వాత ఇప్పుడు మరోసారి నిరసనల వేదికపైకి రావడానికి సీజేపీ సిద్ధమవుతోందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పాఠశాలకు సరైన రహదారి కావాలని డిమాండ్ చేస్తూ హమీర్పూర్ జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసిన పాఠశాల విద్యార్థుల నిరసనకు కూడా దీప్కే మద్దతు ప్రకటించారు. దాదాపు 300 మంది విద్యార్థులు, 100 మంది తల్లిదండ్రులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారి దుస్థితిని విద్యార్థులు ప్రస్తావించారు. విద్యార్థులను దిప్కే ప్రశంసించారు. ప్రాథమిక రవాణా సౌకర్యం కోసం వారు చేస్తున్న డిమాండ్ దశాబ్దాల క్రితమే నెరవేరాల్సిందని అన్నారు.అందుకే దేశవ్యాప్తంగా నిరసనలుసీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. దిప్కే చేసిన “జంతర్ మంతర్ సీజన్ 2” వ్యాఖ్య కేవలం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరో నిరసనకే పరిమితం కాదన్నారు. ఇదే సీజన్ 2. ఇలాంటి అసమర్థ ప్రభుత్వాలు, అధికారులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ప్రజలు ఏమి చెప్పాలనుకుంటున్నారో వినేందుకు సీజేపీ తరఫున ఇప్పుడు దేశవ్యాప్త ‘లిజనింగ్ టూర్’ ప్రారంభిస్తున్నాం. ఒక ప్రచార కార్యక్రమం చేపడతాం. స్వాతంత్య్ర దినోత్సవం నుంచి విద్యా అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నాం” అని ఆయన అన్నారు. -
పేపర్ లీక్స్ వ్యవస్థాగత సమస్య
కోల్‌కతా: ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం భారత విద్యా వ్యవస్థలోని లోపాల వల్ల వచ్చిన వ్యవస్థాగత సమస్య అని, లీకేజీ బాధ్యులకు శిక్ష పెంచడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేమని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరా స్పష్టం చేశారు. జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమాల సందర్భంగా సామజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి నేహా బోరా 23 రోజులపాటు ఉద్యమించిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలపై జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న నేహా మంగళవారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. విద్యార్థి ఉద్యమాలతో వ్యవహరించే విషయంలో బీజేపీయేతర రాజకీయ పార్టీలు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ప్రశ్న పత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్రం ప్రతిపాదిస్తున్న చట్టం నష్టం జరిగిన తరువాత ఏం చేయాలన్న దానిపైనే దృష్టి పెట్టిందని, లీకేజీ జరిగేందుకు కారణమవుతున్న సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. ప్రశ్న పత్రాల లీకేజీ ఘటనలపై దర్యాప్తును కొత్త చట్టం ప్రకారం 11 నెలల్లో పూర్తి చేసినా అప్పటికి అడ్మిషన్ ప్రక్రియ పూర్తయి ఉంటుందని అన్నారు. జార్ఖండ్‌లో కొనసాగుతున్న ఆందోళనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విపక్ష, బీజేపీయేతర పార్టీలు శాంతియతంగా నిరసన చేస్తున్న విద్యార్థులతో ఎలా వ్యవహరించాలో చూపాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఇంకోలా వ్యవహరిస్తే విపక్షాలు రాజకీయంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ను రాజకీయంగా సమర్థంగా ఎదుర్కోలేరని అన్నా రు. జెన్–జీ ఉద్యమం ప్రజా ప్రతినిధులను తప్పులకు బాధ్యులుగా నిలపవచ్చునన్న విషయాన్ని నిరూపించిందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఒక్కటొక్కటిగా బలహీన పడుతున్న సమయంలో పుట్టుకొచ్చిన జెన్–జీ ఉద్యమం వాటి పునరుద్ధరణపై ఆశలు పెంచేవిగా ఉన్నాయన్నారు.అనుభవజు్ఞల చేతుల్లో విధాన రూపకల్పనవిద్యా వ్యవస్థలో అనుభవం ఉన్నవారు విధానాల రూపకల్పనలో తమవంతు పాత్ర పోషించాలని బోరా అభిప్రాయపడ్డారు. కేంద్రీకరణను ప్రోత్సహించే నూతన విద్యా విధానాన్ని వెనక్కు తీసుకోవాలని, ఈ విధానం ప్రైవేటీకరణను, విద్యార్థుల మధ్య అసమానతలను పెంచేదిగా ఉందని విమర్శించారు. న్యాయం, అన్యాయం, సమాజ నిర్వహణ వంటి అంశాలపై చర్చలకు, అవగాహన పెంచుకునేందుకు విశ్వవిద్యాలయాలు వేదికలని అన్నారు. విద్యార్థి రాజకీయాలు కూడా ప్రజాస్వామ్య పరీక్షేనని, అక్కడ కూడా నేతలు విద్యార్థుల ప్రశ్నలు ఎదుర్కొని తాము వారికి నిజమైన ప్రతినిధులుగా నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థి రాజకీయాలను అణచివేస్తే ప్రశ్నించే సంస్కృతికి బదులు అనుకరించే సంస్కృతి ఎక్కువవుతుందని బోరా హెచ్చరించారు. ఢిల్లీ నిరసనల సమయంలో పౌరులపై బలప్రయోగం సరికదాన్న బోరా నిరసనకారులతో వ్యవహరించడానికి ప్రభుత్వాలు వ్యవస్థలు, ప్రోటోకాల్‌లు ఏర్పాటు చేసుకున్నాయని గుర్తు చేశారు. జెన్–జీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మద్దతివ్వడంపై బోరా పరోక్షంగా స్పందించారు. పెద్దల సలహాలను ప్రశ్నించకుండా పాటించి ఉంటే సాంఘిక సంస్కరణలు జరిగేవే కాదని వ్యాఖ్యానించారు.ఏకమైతేనే హక్కుల సాధనప్రజలు ఐకమత్యంతో నిలిస్తే తమ హక్కులను సాధించుకోగలరు అనేందుకు జంతర్‌మంతర్ నిరసన కార్యక్రమం ప్రత్యక్ష ఉదాహరణ అని నేహా బోరా వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో మంగళవారం కొంతమంది వామపక్ష విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ జంతర్ మంతర్ ఉద్యమ ఫలితం కేంద్ర మంత్రి రాజీనామా ఒక్కటే కాదని స్పష్టం చేశారు. జవాబుదారీతనానికి అతీతంగా ఉన్నామని అనుకునే వారిపై సాధించిన విజయమని అన్నారు. ప్రజలు దోషులుగా భావిస్తే ఎంతటి ముఖ్యులనైనా గద్దె దింపవచ్చునని ఈ ఉద్యమం నిరూపించిందని చెప్పారు. -
జార్ఖండ్‌లో ‘జంతర్ మంతర్’
ఉన్నత చదువులకూ, ఉద్యోగాలకూ పోటీ పరీక్షలు నిర్వహించే ప్రభుత్వాలు వాటిల్లో అవకతవకలు బయపడినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం, విశ్వసనీయ సంస్థలతో దర్యాప్తు చేయించటానికి మొండికేయటం ఈమధ్య కనబడుతున్న వింత ధోరణి. సోమవారం జార్ఖండ్‌లోని రాంచీలో నిరుద్యోగ యువత, విద్యార్థులు ‘అసెంబ్లీ ముట్టడి’ నిర్వహించినప్పుడు చానెళ్లలో కనబడిన దృశ్యాలు విస్తుగొలిపాయి. హఠాత్తుగా చూసినవారికి అది జంతర్ మంతరో, జార్ఖండో తెలియని స్థితి ఏర్పడింది. జార్ఖండ్‌లో జేఎంఎం నాయకత్వానగల పాలక కూటమిలో కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. కానీ తమ డిమాండ్లు నెరవేరటం కోసం రాంచీలో యువత 16 రోజులుగా పోరాడాల్సి వస్తోంది. ఉద్యమకారుల డిమాండ్లలో 98 శాతం నెరవేర్చామని జార్ఖండ్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. గత నెల 22న ఈ వ్యవహారంలో పదవి నుంచి తప్పుకొన్న జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) చైర్మన్ ఎల్. ఖియాంగ్టేను తాజాగా అరెస్టు చేశారు. కమిషన్‌లోని ముగ్గురు సభ్యులు గవర్నర్‌కు రాజీనామాలు సమర్పించారు. కానీ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్ అయిన సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ససేమిరా అంటున్నది.నిరుద్యోగ యువతతో ముడిపడి ఉన్న సమస్యలపై ప్రభుత్వాల స్పందనెలా ఉంటుందో జంతర్ మంతర్‌తోపాటు జార్ఖండ్ ఉద్యమం కూడా నిరూపించింది. సర్కారీ కొలువు లభించాలని యువతీయువకులు ఎంతగానో తపిస్తారు. అందుకోసం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి చదువుల్లో మునిగిపోతారు. శిక్షణ కోసం వేలకు వేలు వెచ్చిస్తారు. తీరా ప్రశ్నపత్రం లీకయిందంటే, అయోగ్యులు పైపైకి ఎగబాకారని తెలిస్తే... ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు చెప్పనలవికాని వేదనను అనుభవిస్తారు. వారి కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలుతుంది. లక్షలాదిమంది జీవితాలతో ఆడుకున్న ఒక పెద్ద కుంభకోణం బయటపడిన వెంటనే చిత్తశుద్ధిగల ప్రభుత్వమైతే సంబంధిత మంత్రి చేత రాజీనామా చేయిస్తుంది. ఆ పరీక్షల నిర్వహణలో పాలుపంచుకున్న వారందరినీ అరెస్టు చేస్తుంది. పరీక్ష ఫలితాలను రద్దుచేస్తుంది. ఇందుకోసం యువత రోడ్డెక్కాల్సి వచ్చిందంటే పాలకులు సిగ్గుపడాలి. తప్పు జరిగిందని తెలిసినా జార్ఖండ్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు డిమాండ్‌ను ఎందుకు తిరస్కరిస్తోంది? అదొక్కటే కాదు... ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కూడా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై, వేలంపాటలపై సీబీఐతో దర్యాప్తు చేయించడానికి మొండికేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న నిరసనలపై రౌడీ ఎమ్మెల్యేలతో దాడులు చేయిస్తోంది. ఈ వ్యవహారంలో విద్యామంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడటానికి జంకి, ప్రభుత్వాధికారుల్ని ముందుకు తోస్తున్నారు. మరోవైపు చర్చకు సిద్ధమని సవాళ్లు విసురుతున్నారు. సాక్షాత్తూ అభ్యర్థులే తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతుంటే... ఇలా బీరాలు పోవడం ఆయన గారికి సిగ్గనిపించడం లేదు. కేంద్రంలో తమ కూటమి ఏలుబడే ఉన్నా, సీబీఐ దర్యాప్తు అనగానే ఏపీ సర్కారు నిలువెల్లా వణుకుతోంది. యువత ఉద్యమాల సందర్భంగా రాజకీయ పక్షాల ద్వంద్వవైఖరి తేటతెల్లం అయింది. జంతర్ మంతర్ ఆందోళనపై ముద్రలేసి, దాన్ని నీరుగార్చాలని చూసిన బీజేపీ చివరాఖరికి తన వైఖరిని మార్చుకుంది. కానీ జార్ఖండ్ ఆందోళనలో అది చురుగ్గా పాల్గొంటున్నది. ఢిల్లీ ఉద్యమంలో మౌనప్రేక్షకపాత్ర వహించి ఆఖరి దశలో మేల్కొన్న కాంగ్రెస్... జార్ఖండ్‌లో పాలక కూటమిలో ఉంటూ కూడా ప్రభుత్వానికి నచ్చజెప్పలేకపోయింది. పైగా మీ డిమాండ్లేమిటో చెప్పండని పదిరోజులైనాక కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఉద్యమకారుల్ని అడిగారు. ఏపీలో పాలక కూటమిలో ఉన్న బీజేపీ అక్కడి డీఎస్సీ నియా మకాల స్కామ్‌పై నోరెత్తదు. కానీ జార్ఖండ్‌లో మాత్రం నేనున్నానంటూ ముందు కొస్తుంది. ఇవన్నీ యువత గుర్తించరనుకోవటం ఆ పక్షాల తెలివితక్కువతనం. వెంటనే ప్రభుత్వాలు ఉన్నతస్థాయి దర్యాప్తునకు సిద్ధపడి లీకుల వెనకుండే మాఫియాలనూ, వారికి అండదండలందించే బడా నేతలనూ బయటకు లాగాలి. ఇతర వాగ్దానాల సంగ తలావుంచి కనీసం పరీక్షలైనా సక్రమంగా నిర్వహించలేకుంటే యువత క్షమించదు. -
జంతర్‌మంతర్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: జంతర్‌మంతర్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జంతర్ మంతర్‌ను ఎందుకు మూసివేయొద్దు? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. నగరం మధ్యలో నిరసనలతో నగరాన్ని అతలాకుతలం చేయొద్దంటూ వ్యాఖ్యానించింది. జంతర్ మంతర్‌లో నిరసనకు అనుమతి కోరుతూ అఖిల భారతీయ దళిత క్రైస్తవ హక్కుల రక్షణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.'నగరాన్ని అనవసరంగా ఎందుకు బందీగా మార్చాలంటూ ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్ర స్థానంలో ఉన్న జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టకూడదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి ప్రదర్శనల వల్ల అనవసరంగా నగరం మొత్తాన్ని బందీగా మారుస్తున్నారని వ్యాఖ్యానించింది. అయితే ఇటువంటి ధర్నాల అనుమతికి సంబంధించిన నిర్ణయాన్ని ఆయా సందర్భాలను బట్టి ప్రభుత్వం, పోలీసులకే విడిచిపెట్టింది. అయితే, శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల పరిధిలోని అంశం కాబట్టి ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ అమిత్ మహాజన్ ధర్మాసనం పేర్కొంది.పోలీసులు జూలై నుంచి దరఖాస్తుపై నిర్ణయం తీసుకోకుండా ఉన్నారని పిటిషనర్ వాదించారు. ఆగస్టు 8లోగా దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు జంతర్ మంతర్ నిరసన స్థలంగా ఉండాలా అనే అంశం పైనే విచారణ చేస్తోందన్న ఏఎస్జీ.. సెక్షన్ 144 అమలులో ఉంది. ఆగస్టు 15 సమీపంలో ఉండటంతో భద్రతా పెంచామని ఏఎస్జీ వివరణ ఇచ్చింది. -
జంతర్ మంతర్‌లో పెట్రోల్ బాంబులతో దాడికి ప్లాన్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసన ప్రదర్శనను లక్ష్యంగా చేసుకుని పెట్రోల్ బాంబు దాడికి పన్నాగం పన్నిన పాకిస్థాన్ గూఢచార సంస్థ ‘ఐఎస్ఐ’ మద్దతుగల ఉగ్రవాద మాడ్యూల్‌ను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఉగ్రదళానికి చెందిన సభ్యులు నిరసన సమయంలో జంతర్ మంతర్‌ను సందర్శించి, రవాణా సాయం అందుకోవడంతో పాటు పెట్రోల్ బాంబులను కూడా సమకూర్చుకున్నారు. భద్రతా సిబ్బంది, పోలీసులను, ఇతర యూనిఫాం ధరించిన అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని పాకిస్థాన్ హ్యాండ్లర్లు నిందితులకు శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.అయితే ఈ దాడిని అమలు చేయడం సాధ్యపడకపోవడంతో, అనుమానితులు పంజాబ్‌కు తిరిగి వెళ్లిన తర్వాత నిఘా వర్గాల ఆధారంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను పోలీసులు గుర్తించారు. అమృత్‌సర్‌లో ఐఎస్ఐ మద్దతుగల రెండు సరిహద్దు ఉగ్రవాద మాడ్యూళ్లను పోలీసులు ఛేదించారు. నలుగురు మైనర్లతో సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో మూడు అక్రమ పిస్టల్స్, నాలుగు పెట్రోల్ బాటిల్ బాంబులు, తొమ్మిది తూటాలను స్వాధీనం చేసుకున్నారు.విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు స్థానిక యువకులను ఉగ్ర కార్యకలాపాల కోసం నియమించుకోవడం, భద్రతా స్థావరాలపై నిఘా పెట్టడం, అక్రమ ఆయుధాలను సమకూర్చడం వంటి పనులకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. రైల్వే ట్రాక్‌ల వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి, ఆ ఫుటేజ్‌ను విదేశాల్లోని హ్యాండ్లర్లకు పంపినట్లు దర్యాప్తులో తేలింది. అమృత్‌సర్‌లోని మోకంపుర, ఎయిర్పోర్ట్, సి-డివిజన్ పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇతర అనుసంధానాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: దుబాయ్‌లో భారీ పేలుళ్లు: జెబెల్ అలీని కమ్మేసిన దట్టమైన పొగ! -
జంతర్ మంతర్ కథే వేరు.. 300 ఏళ్ల ఆసక్తికర ప్రయాణం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఆందోళనలు, నినాదాలు, ప్రజా ఉద్యమాలు. ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయాలన్నా.. తమ సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లాలన్నా.. అనేక వర్గాలకు ఇది దశాబ్దాలుగా కీలక వేదికగా మారింది. తాజాగా నీట్ పరీక్షల అక్రమాలపై విద్యార్థుల నిరసనలకు కూడా ఇదే ప్రాంతం వేదికైంది. ఇలాంటి చరిత్ర ఉన్న జంతర్ మంతర్‌ను నిరసనల కోసం వినియోగించడంపై పునరాలోచించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం, కేంద్రం–ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడంతో ఈ చారిత్రక ప్రాంతం మరోసారి చర్చలోకి వచ్చింది.అయితే జంతర్ మంతర్ పుట్టుక నిరసనల కోసం కాదు. ఖగోళ పరిశోధనల కోసం నిర్మించిన ఈ ప్రదేశం.. కాలక్రమేణా ప్రజల సమస్యలు ప్రతిధ్వనించే ప్రజాస్వామ్య వేదికగా మారింది. ఒకప్పుడు సూర్యుడు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసిన ఈ ప్రాంతం.. ఆ తర్వాత పాలకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రజలు తమ గళాన్ని వినిపించే వేదికగా పరిణామం చెందింది. మరి ఈ మార్పు ఎలా జరిగింది? జంతర్ మంతర్ చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాలు ఏవి? ఆ లోతులోకి వెళ్తే. ఖగోళ కేంద్రం నుంచి ఉద్యమాల వేదిక వరకుజంతర్ మంతర్‌ను 18వ శతాబ్దంలో జైపూర్ మహారాజు సవాయి జైసింగ్-2 నిర్మించారు. 1724లో నిర్మించిన ఈ ఖగోళ పరిశోధనా కేంద్రంలో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసేందుకు భారీ పరికరాలను ఏర్పాటు చేశారు. ఆ కాలంలో భారతదేశ శాస్త్రీయ ఆలోచనలకు ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది.జంతర్ మంతర్ అనే పేరు కూడా దాని చరిత్రతో ముడిపడి ఉంది. సంస్కృతంలోని ‘యంత్ర’ (పరికరం), ‘మంత్ర’ (సూత్రం లేదా లెక్కింపు) అనే పదాల నుంచి ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఖగోళ గణనలకు ఉపయోగించే ప్రత్యేక యంత్రాల కారణంగా ‘యంత్ర మంత్ర’ కాలక్రమంలో ‘జంతర్ మంతర్’గా ప్రాచుర్యంలోకి వచ్చింది.కానీ కాలం మారింది. ఢిల్లీ నగరం విస్తరించడంతో పాటు జంతర్ మంతర్ చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు, అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు సమీపంగా ఉండటం వల్ల తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం మొదలైంది. అలా ఖగోళ పరిశోధనలకు వేదికగా ప్రారంభమైన ఈ ప్రదేశం.. క్రమంగా దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిరసన వేదికల్లో ఒకటిగా మారింది.అన్నా ఉద్యమంతో దేశవ్యాప్త గుర్తింపుజంతర్ మంతర్‌కు భారీ గుర్తింపు తెచ్చిన ఉద్యమాల్లో 2011లో అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమం ఒకటి. బలమైన లోక్‌పాల్ చట్టం కోసం జరిగిన ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో భాగమయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని దేశం మొత్తం చూసేలా చేసిన ఈ ఉద్యమం తర్వాత జంతర్ మంతర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.అయితే అన్నా ఉద్యమంతోనే జంతర్ మంతర్ నిరసనల చరిత్ర ప్రారంభం కాలేదు. అంతకుముందు నుంచే ఉద్యోగాలు, కార్మిక హక్కులు, సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అనేక సంఘాలు, రాజకీయ పార్టీలు ఇక్కడ ఆందోళనలు నిర్వహించాయి. అన్నా ఉద్యమం మాత్రం ఈ ప్రాంతాన్ని ప్రజా ఉద్యమాలకు ప్రతీకగా నిలిపింది.నిర్భయ ఘటనతో యువత కదిలి..2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. న్యాయం కోసం, కఠిన చట్టాల కోసం జరిగిన నిరసనల్లో జంతర్ మంతర్ కీలక కేంద్రంగా మారింది. యువత ఒక్కటిగా పోరాటానికి దిగింది. ఈ ఉద్యమం ఒక ఘటనకు వ్యతిరేకత మాత్రమే కాదు.. దేశంలో మహిళల భద్రత, న్యాయ వ్యవస్థ, చట్టాలపై పెద్ద చర్చకు దారితీసింది. ప్రజల ఆగ్రహం ప్రభుత్వాలను స్పందించేలా చేసిన సందర్భాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.రైతు ఉద్యమాలకు సాక్ష్యంజంతర్ మంతర్ చరిత్రలో రైతు ఉద్యమాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. వ్యవసాయ సమస్యలు, కనీస మద్దతు ధర, రైతుల ఆదాయం వంటి అంశాలపై రైతు సంఘాలు ఎన్నోసార్లు ఇక్కడ తమ గళాన్ని వినిపించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020–21లో జరిగిన రైతు ఉద్యమ సమయంలో జంతర్ మంతర్ మరోసారి కీలకంగా మారింది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఆందోళనలు సాగినప్పటికీ.. రైతు సంఘాలు ఇక్కడ ప్రత్యేక నిరసనలు నిర్వహించి తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి.ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యవసాయ విధానాలపై పెద్ద చర్చకు దారితీసింది. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది.రెజ్లర్ల ఆందోళనతో మరోసారి చర్చలోకి2023లో మహిళా రెజ్లర్ల నిరసనలతో జంతర్ మంతర్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఆరోపణలకు సంబంధించి సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఇక్కడ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు క్రీడా రంగంలో మహిళల భద్రత, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై పెద్ద చర్చకు కారణమయ్యాయి.నీట్ నిరసనలు.. కొనసాగుతున్న గళంఇటీవల నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై విద్యార్థులు కూడా జంతర్ మంతర్‌ను ఆశ్రయించారు. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్ వంటి అంశాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం, వివిధ ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలపై కూడా అనేక వర్గాలు ఇక్కడ నిరసనలు చేపట్టాయి. ఇలా జంతర్ మంతర్ కేవలం ఒక ప్రాంతంగా కాకుండా.. ప్రజల సమస్యలు దేశవ్యాప్తంగా వినిపించే వేదికగా మారింది.ఇబ్బందులు కూడా ఉన్నాయా?అయితే జంతర్ మంతర్ నిరసనల వల్ల సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కొందరు వాదిస్తున్నారు. తరచూ జరిగే ఆందోళనల కారణంగా సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని, స్థానిక ప్రజలు, అత్యవసర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్‌కు బదులుగా ప్రత్యేక నిరసన వేదిక ఏర్పాటు చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నుంచి వివరాలు కోరింది.ప్రజాస్వామ్యానికి ప్రతీక.. మార్పు అవసరమా?జంతర్ మంతర్ భారత ప్రజాస్వామ్యంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపించే హక్కుకు ఇది ప్రతీకగా నిలిచింది. అధికార కేంద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రజల గొంతు పాలకుల వరకు చేరే అవకాశం కల్పించింది. అయితే నగర నిర్వహణ, సాధారణ ప్రజల సౌకర్యాలు కూడా అంతే ముఖ్యమని న్యాయస్థానం పరిశీలిస్తోంది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న.. జంతర్ మంతర్ ఉద్యమాల వేదికగా కొనసాగుతుందా? లేక కొత్త నిరసన కేంద్రానికి మారుతుందా? అనేది. -
జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయ వేదిక?!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నిరసనల వేదికగా పేరొందిన జంతర్ మంతర్‌పై సుప్రీం కోర్టు కీలక విచారణ చేపట్టింది. జంతర్ మంతర్ స్థానంలో నిరసనలకు మరో ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన ధర్మాసనం.. సోమవారం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.జంతర్ మంతర్ వద్ద తరచూ జరిగే ధర్నాలు, ఆందోళనల కారణంగా సెంట్రల్ ఢిల్లీలో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని పిటిషనర్ సతీశ్ చంద్ర కౌశిక్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిత్యావసర వస్తువులు, వైద్య అవసరాల సరఫరాపైనా ప్రభావం పడుతోందని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ పిటిషన్‌ను ఇవాళ పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇందులో ప్రజల రాకపోకలు, ప్రాంతంలో అందుబాటు వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ అంశంపై కేంద్రం నుంచి వివరాలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.జంతర్ మంతర్ ఇకపై నిరసనలకు అనువైన ప్రదేశం కాదని, ట్రాఫిక్ సమస్యలు, స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. ముఖ్యంగా వైద్య సేవలకు సంబంధించిన సరఫరాలు, అత్యవసర రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఇటీవలి కొన్ని రాజకీయ నిరసనలను ప్రస్తావించినప్పటికీ.. ప్రతిపాదిత కార్యక్రమాలపై వ్యాఖ్యానించేందుకు ధర్మాసనం నిరాకరించింది. చట్ట ప్రకారం అధికారులు పరిస్థితులను నిర్వహిస్తారని పేర్కొంది.ప్రజాస్వామ్యంలో నిరసనలకు హక్కు ఉన్నప్పటికీ.. అదే సమయంలో సాధారణ ప్రజల రాకపోకలు, అత్యవసర సేవలకు ఇబ్బంది కలగకుండా సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని ఈ పిటిషన్ తెరపైకి తెచ్చింది. ఇప్పుడు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చే సమాధానంపై తదుపరి పరిణామాలు ఆధారపడనున్నాయి. -
నిరసనలపై బీజేపీ మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ: జంతర్‌మంతర్‌లో ఇటీవల జరిగిన విద్యార్థులు, సీజేపీ నిరసన కార్యక్రమంపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. నిరసనలో పాల్గొన్న వారిలో విద్యార్థుల కంటే "పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలు" ఎక్కువ మంది ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైనా తీవ్ర విమర్శలు చేశారు.తాజాగా మీడియాతో మాట్లాడిన బిధూరి మాట్లాడుతూ.. ‘జంతర్‌మంతర్‌లో జరిగిన నిరసనలో విద్యార్థుల కంటే పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలే ఎక్కువ మంది ఉన్నారు. పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలు ఎవరనేది మీకు తెలుసు’ అని అన్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిని ఉద్దేశిస్తూ.. "ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను దేశ ప్రధాని గురించి అలాంటి భాష మాట్లాడమని ప్రోత్సహించరు. మోదీ జీని దూషించే వారు పంక్చర్ వేసేవాళ్ల పిల్లలు లేదా వారి కుటుంబాలకు చెందినవారే" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.నీట్ (NEET) అంశాన్ని అడ్డం పెట్టుకుని కొందరు సంఘ వ్యతిరేక శక్తులు జనరేషన్-జెడ్ (Gen Z) యువతను తప్పుదోవ పట్టించాయని బిధూరి ఆరోపించారు. ‘నీట్ సమస్య పేరుతో కొందరు సంఘ వ్యతిరేక శక్తులు జంతర్‌మంతర్ వద్ద యువతను సమీకరించాయి. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం, పార్లమెంట్‌పై దాడికి ప్రయత్నించడం, దేశంలో అశాంతి సృష్టించడమే వారి లక్ష్యం’ అంటూ ఆయన అన్నారు.జెన్-జెడ్‌కు అవగాహన కల్పించాలి..గత 12 ఏళ్లలో దేశంలో జరిగిన మార్పులు, అభివృద్ధి, అంతకుముందు 12 ఏళ్ల పరిస్థితుల గురించి యువతకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బిధూరి పేర్కొన్నారు. తప్పుదోవ పట్టిన జనరేషన్-జెడ్‌ను సరైన మార్గంలోకి తీసుకురావాలి. గత 12 ఏళ్లలో దేశంలో ఏం జరిగిందో, అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో వారికి వివరించాలని అన్నారు. అయితే, రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. గతంలో కూడా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈసారి కూడా నిరసనలో పాల్గొన్న వారిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వచ్చే అవకాశముంది. -
జంతర్ మంతర్ వేదికగా విధ్వంసానికి పాక్ ప్లాన్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమిమ్ మండల్ అనే ఉగ్రవాద అనుమానితుడిని తూర్పు బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసనల్లో పోలీసుల వేషధారణలో చొరబడి అల్లర్లు సృష్టించాలనేది ఈ ఉగ్రవాద కుట్ర ప్రధాన లక్ష్యమని ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ గౌరవ్ శర్మ తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి కదలికలపై నిఘా ఉంచాలని, రక్షణ లేని ప్రాంతాల వివరాలు సేకరించాలని పాకిస్థాన్ హ్యాండ్లర్లు హమిమ్ను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని కోర్టు 14 రోజుల ఎస్టీఎఫ్ కస్టడీకి అప్పగించింది.మరోవైపు, హమిమ్ ప్రియురాలు అర్పితా సర్కార్‌ను శుక్రవారం జార్ఖండ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. షాజాద్ భట్టీ గ్యాంగ్‌కు చెందిన పాకిస్థాన్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు వీరిద్దరూ ఈ కుట్రకు పాల్పడ్డారు. రాజకీయ నాయకులు, ప్రముఖులను హానీట్రాప్ చేసి, వారి నుంచి రహస్య సమాచారం రాబట్టడంలో అర్పితా సర్కార్ సిద్ధహస్తురాలని పోలీసుల విచారణలో తేలింది. రాష్ట్ర మంత్రి ఉమేష్ రాయ్ కుమారుడిని హానీట్రాప్ చేసి కిడ్నాప్ చేయడానికి, కుటుంబం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడానికి వారు ప్లాన్ చేశారు.నిందితుల వద్ద నుంచి బ్రిటన్, మెక్సికో దేశాలకు చెందిన అంతర్జాతీయ సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ హ్యాండ్లర్లు రానా, ఉజైర్, అబిద్ జాట్, హమాద్లతో ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా వీరు సంభాషణలు జరిపినట్లు ఎస్టీఎఫ్ గుర్తించింది. సోషల్ మీడియా ద్వారా రాడికలైజ్ అయిన వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ప్రేమలో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరి ఉగ్రమూలాలపై దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: ‘పొట్టకూటి కోసం వెళ్తే ప్రాణాలే తీశారు’ -
'అలాంటి వారికి మార్గనిర్దేశం చేయాలి': ప్రధాని మోదీ పిలుపు
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో రిలీజ్ చేశారు. నీట్ పేపర్ లీక్ అంశంపై మరోసారి మాట్లాడారు. జంతర్‌మంతర్‌లో ఏం జరిగిందో దేశ ప్రజలంతా చూశారని అన్నారు. నిరసనలో కొందరు అసభ్యకరమైన పదాలు వాడారని అన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. అయినప్పటికీ అందరినీ తాను క్షమించానని ప్రధాని మోదీ వెల్లడించారు. సరికొత్త భారత్ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తప్పుదోవ పట్టిన వారికి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని సూచించారు. కాగా.. నీట్ పేపర్ లీక్ కావడంతో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది. ఈ నిరసనను కొన్ని రాజకీయ పార్టీలు అవకాశంగా మార్చుకున్నాయి. కాంగ్రెస్‌తో పాటు పలు ప్రతిపక్ష నాయకులు ఢిల్లీలో హంగామా చేశారు. చివరికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇవాళ మరో వీడియో సందేశమిచ్చారు. Abuses never solve anything. Let’s guide the misguided. Let’s work together. Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL— Narendra Modi (@narendramodi) July 31, 2026 -
మోదీపై వ్యాఖ్యల వివాదం.. ఎవరీ రుచికా సింగ్?
ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నీట్ నిరసనల సందర్భంగా రెచ్చిపోయిన యువతికి పెద్ద షాక్ తగిలింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమెపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘రాజ్యాంగ పదవి గౌరవాన్ని ఆమె వ్యాఖ్యలు దెబ్బతీశాయని.. ప్రజా శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని’’ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.కాక్రోచ్ పార్టీ నిరసనల్లో పాల్గొన్న ఆ యువతి.. జూలై 23-24 తేదీల మధ్య ఈ వీడియో తీసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. మోదీని గద్దె దిగిపోవాలని.. యువత ఆ పని చేయాలంటూ అసభ్య పదజాలంతో దూషించింది. ఆ సమయంలో కొందరు ఆందోళనకారులు ఆమెను సెల్ఫోన్లతో వీడియోలు తీసిన మరింత రెచ్చిగొట్టినట్లు కనిపించింది. అవి విపరీతంగా వైరల్ కావడంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్వచ్చందంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.జీరో ఎఫ్ఐఆర్ నమోదుసుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 352, 353(1), 356(1) కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం ద్వారా ప్రజా శాంతికి భంగం కలిగించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో.. సదరు యువతి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, ద్వేషాన్ని వ్యాప్తి చేసి ప్రజా శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ వీడియోలో ఆమె ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం. ఎవరీ అమ్మాయి?.. జంతర్ మంతర్ నిరసనల్లో ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన యువతిని నోయిడాకు చెందిన రుచికా సింగ్‌గా గుర్తించారు. 25 ఏళ్ల రుచిక.. విద్యార్హతలు ఏంటో స్పష్టత లేదు. అయితే ఆమె మోడల్‌గా, ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్నట్లు సమాచారం. విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు, విద్యార్థుల సమస్యలపై జరిగిన ఈ నిరసనలో భాగంగా ఆమె.. ఇలా అభ్యంతరక వ్యాఖ్యలతో దేశ ప్రధానిని తిట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.ఢిల్లీ పోలీసులకు బదిలీజంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో నోయిడాలో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసును ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఐఎఫ్ఎస్ఓ (Intelligence Fusion and Strategic Operations) పరిశీలిస్తోంది. నిరసనకు సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను పోలీసులు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేశారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులుఈ వ్యవహారంలో ఇప్పటికే పలు సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అభ్యంతరకరమైన, పరువునష్టం కలిగించే కంటెంట్‌ను షేర్ చేశారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్స్ (X) వేదికకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి సంబంధిత పోస్టులను తొలగించడం లేదంటే వాటి యాక్సెస్‌ను నిలిపివేయడం, దర్యాప్తు కోసం ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని కోరినట్లు సమాచారం. -
ఈసారి ‘ఆల్ఫా’ వంతు!
జంతర్ మంతర్ వేదికగా జెన్ జీ తరం సృష్టించిన పెను సంచలనం గురించి అందరూ ఇంకా చర్చించుకుంటుండగానే... తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆల్ఫా తరం కూడా తరగతి గదుల్లోంచి బయటికొచ్చింది. ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్లతో పాటు మహారాష్ట్రలో సైతం పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, బెంచీలవంటి కనీస సదుపాయాలు కల్పించాలనీ, అన్ని పాఠ్యాంశాలకూ టీచర్లను నియమించా లనీ కోరుతూ సాగుతున్న ధర్నాల వెనక కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సాధించిన విజయాల స్ఫూర్తి ఉన్నదని తెలుస్తూనే ఉంది. పాలకుల్ని నిలదీసిన జెన్ జీ తరాన్ని చూసి అసహ్యించుకున్న ఎంపీ కంగనా రనౌత్ లాంటివారు ఈ ఆల్ఫా తరానికి ఎలాంటి శాపనార్థాలు పెడతారో చూడాల్సివుంది. బిహార్‌లోని గయ జిల్లాలో విద్యార్థులు అతి పెద్ద ధర్నా నిర్వహించడమే కాదు... తమ డిమాండ్లు తెలుసుకోవటానికొచ్చిన ప్రభుత్వా ధికారిని వెనక్కిపంపారు. తాము జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్)తో తప్ప మాట్లాడబోమని చెప్పటంతో ఆయనే రావాల్సివచ్చింది. అన్నిచోట్లా ఒకే రకమైన సమస్యలు. అందరిదీ ఒకే రకమైన కథ. చదువు చుట్టూ ఇన్ని సమస్యలుండగా ‘వికసిత్ భారత్’ ఎలా సాధ్యమో పాలకులు చెప్పాలి. దేశంలో ప్రాథమిక విద్య మొదలు విశ్వవిద్యాలయ విద్యవరకూ అంతా అస్తవ్యస్థంగా ఉంది. ఎక్కడ చూసినా శిథిలాలను తలపించే బడులు, అరకొర సదుపా యాలు వెక్కిరిస్తుంటాయి. సరిపడా ఉపాధ్యాయులుండరు. యాదృచ్ఛికంగానే కావొచ్చు గానీ... రాజ్యసభలో గురువారం పాఠశాల విద్య గురించి అడిగిన ప్రశ్నకు విద్యామంత్రిత్వ శాఖ ఇచ్చిన జవాబు దిగ్భ్రమ గొలుపుతుంది. దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 1,00,843 అని ఆ శాఖ సహాయమంత్రి చెప్పారు. అందులో 16,357 పాఠశాలలతో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంటే జార్ఖండ్(9,827), మహారాష్ట్ర(9,269), కర్ణాటక(8,042), ఉత్తరప్రదేశ్(7,874) తదనంతర స్థానాల్లో ఉన్నాయి. అలాగని మిగిలిన స్కూళ్లు బాగున్నాయని కాదు. రాజస్థాన్‌లోని ఒక పాఠశాలలో కేవలం చరిత్ర, హిందీ పాఠ్యాంశాలకు మాత్రమే టీచర్లున్నారు. మరో పాఠశాలలో 1,2,3 తరగతులకు అసలు టీచర్లే లేరు. తక్షణం టీచర్ల నియామకం జరగకుంటే పాఠశాలకు తాళాలేసి, రహదారి దిగ్బంధిస్తామని పిల్లలు హెచ్చరించారు. చివరకు అప్పటికప్పుడు నలుగుర్ని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. మరో ముగ్గుర్ని పది రోజుల్లో నియమిస్తామనటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో లిఖితపూర్వక హామీ దొరికేవరకూ ఇంటర్ విద్యార్థులు ధర్నా కొనసాగించారు. సెకండరీ విద్యలో 2023–24లో ఆడపిల్లల్లో 12.6 శాతంగా ఉన్న డ్రాపౌట్లు 2025–26కు 8 శాతానికి తగ్గాయని పార్లమెంటుకు సమర్పించిన నివేదిక చెబుతోంది. కానీ ఇప్పటికీ 8 శాతంమంది పిల్లలు ఆ స్థాయికొచ్చాక చదువులు మానుకుంటున్నారంటే ఆవేదన కలుగుతుంది. దీన్ని అంకెల్లోకి మారిస్తే లక్షల్లో ఉంటుంది. ఇది మన అధ్వాన్న స్థితికి అద్దం పడుతుంది. పేదరికం మొదలుకొని పాఠశాలలో సదుపాయాల లేమి వరకూ ఇందుకు ఎన్నో కారణాలుండొచ్చు. వాటిని సరిచేయటానికి పూనుకొనే వరకూ ఇలాంటి పిల్లలు చదువులకు దూరంకాక తప్పదని పాలకులు గుర్తించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ బడి పిల్లల వ్యథ మరో రకం. అక్కడ గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11,700 కోట్లు వ్యయం చేసి ‘నాడు–నేడు’ కింద 38,059 పాఠశాలల రూపురేఖల్ని మార్చింది. కార్పొరేట్ విద్యాసంస్థల్ని తలదన్నేలా 60,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,000 స్మార్ట్ టీవీలు అమర్చి తరగతి గదుల్ని డిజిటల్ లెర్నింగ్ స్పేస్‌లుగా మార్చింది. పిల్లలకు దాదాపు ఆరు లక్షల ట్యాబ్ల్ని అందించి పాఠాల్ని సులభంగా అవగాహన చేసుకునేందుకు తోడ్పడింది. ఇప్పుడు ఉత్తరాదిన వినబడుతున్న డిమాండ్లతోపాటు మరెన్నో నాలుగేళ్ల క్రితమే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అందులో చాలా భాగం అటకెక్కాయి. గుక్కెడు మంచినీళ్లు, పరిశుభ్రమైన పరిసరాలు, రుచికరమైన మధ్యాహ్న భోజనం కరువయ్యాయి. గతంలో సకల సదుపాయాలతో వర్ధిల్లిన బడులన్నీ ఇప్పుడు బావురుమంటున్నాయి. అనేకం మూతబడ్డాయి. అందుకే ఉత్తరాది పిల్లల స్ఫూర్తితో రేపో మాపో ఏపీ ఆల్ఫా తరం కూడా తిరగబడినా ఆశ్చర్యం లేదు. -
సీజీపీ రీఎంట్రీ హెచ్చరిక.. జంతర్‌మంతర్ వద్ద హైఅలర్ట్
ఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరిగిన నిరసనల్లో నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించకపోతే మరోసారి ఆందోళన చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రదర్శనల సమయంలో నిరసనకారులు నిర్ణీత ప్రాంతం దాటి వెళ్లకుండా ఉండేందుకు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన మెటల్ బ్యారికేడ్లను ఇనుప కడ్డీలతో వెల్డింగ్ చేసినట్లు సమాచారం.భవిష్యత్తులో ఆందోళనలు జరిగితే బ్యారికేడ్లను తొలగించడం లేదా ముందుకు కదలడం సాధ్యం కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ బలగాలు, ఇతర భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. సీజీపీ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతోంది.36 రోజుల ఆందోళన.. మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజీపీ గతంలో జంతర్ మంతర్ వద్ద 36 రోజుల పాటు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం జూలై 25న ఆందోళన విరమించింది. అయితే నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమన్న హామీని కేంద్రం ఉల్లంఘించిందని సీజీపీ ఆరోపించింది. అన్ని ఎఫ్ఐఆర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరోసారి రోడ్డెక్కుతామని హెచ్చరించింది.సీజీపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా తాజాగా మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తిగా ఉల్లంఘించిందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వందలాది మంది విద్యార్థులపై కేసులు నమోదు చేశారని, అరెస్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ, అదుపులో ఉన్న నిరసనకారుల విడుదల, కొత్త క్రిమినల్ కేసుల నమోదును నిలిపివేయడం, ఒప్పంద వివరాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారా?సీజీపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే మరో ఉద్యమానికి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థుల్లో అసంతృప్తి ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరసనకారులకు సహాయం చేసేందుకు దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ సెల్ ఏర్పాటు చేసినట్లు సీజీపీ ప్రకటించింది. అలాగే సాక్ష్యాల సేకరణ కోసం ‘సాక్షి’ అనే ఆన్లైన్ వేదికను ప్రారంభించింది. రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కూడా కేసులు ఎదుర్కొంటున్న నిరసనకారులకు న్యాయ సహాయం అందించేందుకు రూ.1 కోటి నిధిని ప్రకటించినట్లు సమాచారం. -
జంతర్ మంతర్ లో లాఠీ ఛార్జ్.. పోలీసులకు సుప్రీం నోటీసులు
-
జంతర్ మంతర్ వద్ద జులై 31న మరో నిరసన
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీ సమయంలో పోలీసులపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీ మాజీ పోలీసు అధికారులు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో సంఘ వ్యతిరేక శక్తులు చొరబడి పోలీసు సిబ్బందిపై దాడి చేశాయని, ఆ ఘటనలో 100 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. భద్రతా సిబ్బంది హద్దులు దాటారని నిరసనకారులు ఆరోపిస్తుండగా, సంఘ వ్యతిరేక శక్తులు తమపై దాడి చేశాయని పోలీసులు చెబుతున్నారు.ఇప్పుడు.. పదవీ విరమణ చేసిన అధికారుల సంఘం ఢిల్లీ పోలీసు ఫెడరేషన్ జులై 31న జంతర్ మంతర్ వద్ద ఒక రోజు నిరసన చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్‌కు లేఖ రాసింది. తమ దరఖాస్తులో ఫెడరేషన్ ఇలా పేర్కొంది.. ‘‘జూలై 20న జంతర్ మంతర్ పరిసరాల్లో చట్టబద్ధ విధులు నిర్వహిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో పోలీసు, పారామిలిటరీ దళాల అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. పోలీసు దళానికి సంఘీభావం తెలియజేసేందుకు జులై 31న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చేపట్టేందుకు అనుమతి ఇవ్వండి’’ అని కోరింది. శాంతి భద్రతలు కాపాడే సమయంలో భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలను ప్రస్తావించేందుకు ఈ ధర్నాకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ ధర్నాను పదవీ విరమణ చేసిన ఢిల్లీ పోలీసు సిబ్బంది అంతా కలిసి చట్టాన్ని గౌరవించే పౌరుల తరఫున నిర్వహిస్తున్నామని, ఇది పూర్తిగా శాంతియుతంగా, అహింసాత్మకంగా సాగుతుందని ఫెడరేషన్ తెలిపింది.మరోవైపు, జులై 20న జరిగిన పోలీసు చర్యపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. "నిరసనల సమయంలో పోలీసులకు కొత్త ప్రోటోకాల్ అవసరం" అని సుప్రీంకోర్టు పేర్కొంది. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలోని విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసులు గతంలో నిర్దేశించిన నిబంధనలు పాటించలేదని కోర్టు సూచించింది. -
జంతర్ మంతర్ లాఠీఛార్జిపై సీజేఐ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆందోళనకారులపై లాఠీచార్జ్, పెల్లెట్ గన్స్ వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తిన అత్యున్నత న్యాయస్థానం.. ఇలాంటి ఘటనల్లో బాధ్యతను నిర్ధారించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది.“ఎవరు అతిగా బలప్రయోగం చేశారో తేల్చాలి. తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేస్తుంది. బాధ్యతను నిర్ణయించకుండా చేసే దర్యాప్తునకు అర్థం లేదు” అని మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.నిరసన హక్కు ప్రతి ఒక్కరికీ ఉందిప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని సుప్రీంకోర్టు సీజేపీ ధర్మాసనం గుర్తు చేసింది. ఆందోళనలను ఎదుర్కొనే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధానాల్లో మార్పులు అవసరమని పేర్కొంది. పోలీసులు గతంలో కోర్టులు సూచించిన మార్గదర్శకాలను పాటించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. నిరసనల సమయంలో పోలీసుల వ్యవహారశైలికి సంబంధించి కొత్త ప్రొటోకాల్ అవసరమని సూచించింది. 2018లో ఇచ్చిన మార్గదర్శకాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. టియర్ గ్యాస్, లాఠీచార్జి, నియంత్ర పద్ధతులపై సమగ్ర విధానం రూపొందించాలి అని పేర్కొంది. జులై 20న ఉద్రిక్తతలుజులై 20న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా(చలో సంసద్) వెళ్లేందుకు CJP నేతృత్వంలో నిరసనకారులు ప్రయత్నించిన సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీలు ఉపయోగించారు. ఈ క్రమంలో ఘర్షణలు చోటుచేసుకుని పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పెల్లెట్ గన్స్ వాడకంపై ఆగ్రహంపోలీసుల దాడిలో ఓ యువకుడు కంటి చూపు కోల్పోయిన ఘటనను పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మహిళలు, చిన్నారులపై కూడా లాఠీచార్జి జరిగిందని.. యూనిఫాంలో లేకుండా సివిల్ డ్రెసులో ఉన్నవాళ్లూ దాడులు చేశారని.. ఎలక్ట్రిక బ్యాటన్లు, ఎలక్ట్రిక్ షీల్డ్‌లు వాడారని తెలిపారు. ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడంపై సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. పోలీసుల చర్యల్లో అతిగా బలప్రయోగం జరిగిందా? అనే అంశంపై పూర్తి స్థాయి విచారణ అవసరమని తెలిపారు. మాజీ న్యాయమూర్తితో సిట్ ఏర్పాటు?ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరం అని సుప్రీంకోర్టు పేర్కొంది. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించింది. జంతర్ మంతర్ ఘటనలో ఎవరి తప్పు ఎంత ఉందో బయటకు రావాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పోలీసులకు కీలక సందేశంనిరసనలు, ఆందోళనలు ప్రజాస్వామ్యంలో భాగమని గుర్తు చేసిన సుప్రీంకోర్టు.. వాటిని నియంత్రించే క్రమంలో పోలీసులు చట్టపరమైన పరిమితులు దాటకూడదని సూచించింది. జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం వ్యాఖ్యలు.. నిరసనల నిర్వహణ, పోలీసుల వ్యవహారశైలిపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి. -
LIVE: మళ్లీ అదే రిపీట్ అవుతుంది..!
-
ఢిల్లీ నిరసనలపై ఫేస్ స్కాన్ ఆపరేషన్
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జూలై 20న నిర్వహించిన పార్లమెంట్ ‘చలో సంసద్ ర్యాలీ’లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. జంతర్ మంతర్ దగ్గర గత వారం జరిగిన ఉద్రిక్త ఆందోళనలకు సంబంధించిన వందలాది గిగాబైట్ల సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. పరీక్ష పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ.. సీజేపీ నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో పోలీసులకు, సీజేపీ మద్దతుదారులకు మధ్య ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే.సుమారుగా 100 సీసీటీవీ వీడియో క్లిప్‌లలో నిరసనకారులు.. భద్రతా వలయాలను ఛేదించడం, పోలీసు సిబ్బందిపై దాడి, రాళ్లు రువ్వి ఆస్తులను ధ్వంసం చేయడం రికార్డయింది. ఇప్పటివరకు ముఖ గుర్తింపు వ్యవస్థ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్) ద్వారా 2,873 మంది నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించారు. వీరిలో 989 మందిపై హత్య, అత్యాచారం, కిడ్నాప్, దోపిడీ, పోక్సో చట్టం కింద నమోదైన కేసులతో సహా పలు తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇందులో 101 మంది హత్య కేసుల్లో, 284 మంది దొంగతనం కేసుల్లో.. మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్న 92 మంది పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు.పోలీసులు, భద్రతా సిబ్బందిపై దాడులు చేయడం, బారికేడ్లను బద్దలు కొట్టడం, రాళ్లు రువ్వడం, పెప్పర్ స్ప్రే ఉపయోగించడం, వాహనాలను ధ్వంసం చేయడం, వాహనాల లోపల ఉన్న పోలీసులపై దాడి చేయడం, నిరసన మార్గంలో ఉన్న ప్రజా ఆస్తులను, దుకాణాలను ధ్వంస చేయడం వంటి ఘటనలు పలు ప్రదేశాల్లో సీసీటీవీలలో రికార్డయ్యాయి. కొన్ని ఫుటేజీలలో గుంపుగా బారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు సాగడం, జూలై 20న సంసద్ మార్గ్ వద్ద పలు చోట్ల రాళ్లు రువ్విన దృశ్యాలు ఉన్నాయి.అదే రోజు.. జంతర్ మంతర్ సమీపంలో పోలీసులు లోపల కూర్చున్నప్పటికీ, గుంపు పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేసి, ఒక పోలీసు వాహనాన్ని బోల్తా కొట్టించడానికి ప్రయత్నించింది. టాల్‌స్టాయ్ మార్గ్ వద్ద ఒక వాహనానికి నిప్పు పెట్టడం, బస్సు టైర్లను పంక్చర్ చేయడం సీసీటీవీలో రికార్డయ్యింది. పోలీసు సిబ్బందిపై ప్రత్యక్ష దాడులు జరిగినట్లు పలు వీడియోలు స్పష్టంగా చూపుతున్నాయని వర్గాలు తెలిపాయి. గాయపడిన ఒక మహిళా పోలీసు అధికారిని ఆమె సహచరులు సురక్షిత ప్రాంతానికి తరలించడం కనిపించింది.సంసద్ మార్గ్ వద్ద గుంపు ఒక పోలీసును చుట్టుముట్టి దాడి చేసింది. గాయపడిన పోలీసు సిబ్బంది యూనిఫామ్లపై రక్తం కారుతున్న అనేక క్లిప్‌లు ఉన్నాయి. ఢిల్లీ పోలీసుల ప్రకారం సుమారు 200 మంది పోలీసులు గాయపడ్డారు. జూలై 22న రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్‌లో పోలీసు అధికారులు నంద్కిషోర్, వివేక్ భగత్‌లపై జరిగిన దాడులు నమోదయ్యాయి. కొంతమంది నిరసనకారులు కెమెరా ముందు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను సేకరించి తదుపరి చర్యల నిమిత్తం విశ్లేషిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. వీటిలో కన్నాట్ ప్లేస్‌లో ఓ మహిళ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, సంసద్ మార్గ్ వద్ద ఓ వ్యక్తి పార్లమెంటు గురించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోలీసులపై ఒక మహిళ బూతులు తిట్టిన దృశ్యాలు ఉన్నాయి. -
శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు
సాక్షి, న్యూఢిల్లీ: శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసన తెలపడం దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఆందోళన జరుగుతోందనే ఒకే కారణంతో పోలీసులు, ఇతర భద్రతాధికారులు లాఠీచార్జ్‌కు పాల్పడటం సరికాదని సీజేఐతోపాటు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్లతో జంతర్‌మంతర్‌లో జరిగిన ఆందోళనలపై పోలీసులు లాఠీఛార్జ్ తదితర బల ప్రయోగానికి పాల్పడటంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లు అన్నింటినీ కలిపి మంగళవారం విచారించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.అది రాజ్యాంగ హక్కువిచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ ‘‘జంతర్ మంతర్ ఆందోళనల్లో పోలీసులు అతిగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉంటే వాటిపై స్వతంత్ర విచారణ జరగాలి. ఇది కేవలం ఢిల్లీకి పరిమితమైన సమస్య కాదు. నిరసనలను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో దేశవ్యాప్తంగా ఒకే రకమైన పోలీసు ప్రోటోకాల్ అవసరం. ప్రజాస్వామ్యంలో క్రమశిక్షణ అంతర్భాగం’ అని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తి ప్రాణం చాలా విలువైందని స్పష్టం చేశారు. జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ మాట్లాడుతూ ‘‘పోలీసులు, విద్యార్థుల్లో ఎవరు గాయపడ్డా సమానంగానే చూడాలి. నిరసన ప్రదర్శనలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసులకు తగిన రక్షణ ఏర్పాట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి రావచ్చు’’ అని అన్నారు. నిరసనల సందర్భంగా గాయపడ్డ పోలీసు సిబ్బంది కుటుంబాలు తమ వాదన కూడా వినిపించేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కేంద్రం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ న్యాయస్థానానికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. -
కేసుల రద్దుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారంలోగా ఆమేరకు హామీ లభించకుంటే మళ్లీ ఆందోళన బాట పడతామని హెచ్చరించింది. సీజేపీ జాతీయ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌తో కలిసి సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ఆందోళనకారులు, నిర్వాహకులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఉప సంహరించుకుంటామని, కొత్తగా ఎవ్వరిపైనా కేసులు పెట్టబోమని మూడో విడత చర్చల సమయంలో కేంద్రం మాకు హామీ ఇచ్చింది. ఆ తర్వాతే 36 రోజులపాటు జంతర్‌మంతర్‌లో కొనసాగించిన నిరసనలను ఉపసంహరించుకున్నాం’అని సీజేపీ ప్రతినిధులు వివరించారు. ‘ముసాయిదా ఒప్పందాన్ని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు అందజేయగా వారు ఆమోదం తెలిపారు. న్యాయనిపుణులతో చర్చలు జరిపాక మంగళవారం కల్లా ప్రభుత్వం లిఖిత పూర్వక ఒప్పందాన్ని అందజేస్తుందని మాకు హామీ ఇచ్చారు’అని వివరించారు. ‘ప్రభుత్వం నుంచి అందాల్సిన లిఖిత పూర్వక ఒప్పందం కోసం మేం ఎదురు చూస్తున్నాం. కేబినెట్ సీనియర్ మంత్రులు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నాం. నిరసనకారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించరాదు. భవిష్యత్తులో వారిపై ఎటువంటి కేసులు పెట్టరాదు’అని రాంకా, దాస్ స్పష్టం చేశారు. లేనిపక్షంలో తాము మరోసారి నిరసనలకు దిగక తప్పదని స్పష్టం చేశారు. -
విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై కేసులు పెడతాం
-
లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపుతూ పోలీసులు మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించలేరని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.కాగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ నిరసనల సందర్భంగా వారిపై పోలీసుల చర్యల విషయమై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సోమవారం విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కేవలం నిరసన జరుగుతోందనే కారణంతోనే లాఠీచార్జ్ చేయలేరు. ఎక్కడైనా పోలీసులు మితిమీరిన బలప్రయోగానికి పాల్పడితే దానిని అరికట్టాల్సిందే. ప్రతి పౌరుడి హక్కులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రానిదే.ఈ విచారణలో జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి మాట్లాడుతూ..‘విద్యార్థుల భద్రత ఎంత ముఖ్యమో, పోలీసుల భద్రత కూడా అంతే ముఖ్యం. నిరసనకారులు పోలీసులపై కూడా దాడులకు పాల్పడకూడదు. పోలీసుల చర్యలకు సంబంధించి తగిన ఎస్ఓపీలు ఎందుకు లేవో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరవచ్చు" అని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో నిరసనల్లోకి ఆకతాయిలు, సామాజిక విద్రోహ శక్తులు చొరబడి పోలీసులపై దాడులకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని కోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేసింది. శాంతియుత నిరసనలు, పోలీసుల చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిరసనకారులు కూడా హింసకు తావులేకుండా ఆత్మనియంత్రణ, క్రమశిక్షణ పాటించడం అత్యంత కీలకమని పేర్కొంది. విద్యార్థుల నిరసనలు, పోలీసుల వ్యవహార శైలిపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. -
‘జంతర్ మంతర్’ లవ్ స్టోరీ.. తలకు గాయంతో వివాహం!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరిగిన ‘నీట్’ పేపర్ లీక్ నిరసన ప్రదర్శన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫలితంగా కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నిరసనలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి యువత తరలివచ్చింది. ఈ క్రమంలోనే బీహార్‌కు చెందిన మోహన్ శ్రీవాస్తవ్, ఢిల్లీకి చెందిన ఓ యువతి మధ్య చిగురించిన ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. This could be a prank from Bihar. But it ends so authentically with a question, that is so steeped in reality. pic.twitter.com/t1EBCziYhy— Smita Prakash (@smitaprakash) July 26, 2026నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పాల్గొనేందుకు మోహన్ బీహార్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆందోళన ప్రాంతంలో భోజన వసతి లేకపోవడంతో ఒ యువతి అతనికి ఆహారం అందించింది. తర్వాతి రోజు తాగునీరు కూడా తెచ్చి ఇచ్చింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య మంచి స్నేహానికి దారితీసింది. ఆ యువతి కూడా ‘నీట్’ పరీక్ష రాసి, పేపర్ లీక్ బాధితురాలే కావడంతో ఆందోళనలో పాలుపంచుకుంది.ఈ క్రమంలో పోలీసులు జరిపిన లాఠీచార్జిలో మోహన్ తలకు తీవ్ర గాయమై అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్పందించిన ఆ యువతి అతనిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడింది. మోహన్ కోలుకున్నాక ఆమె తన ప్రేమను వ్యక్తం చేసింది. మోహన్ కూడా తన మనసులోని భావాన్ని బయటపెట్టాడు. గాయాలతో బాధపడుతూనే మోహన్ ఆ యువతిని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఒంటరిగా ఢిల్లీకి వెళ్లిన మోహన్, ఆందోళన ముగిశాక నూతన వధువుతో కలిసి బీహార్‌కు తిరుగుముఖం పట్టాడు.ఇది కూడా చదవండి: ఇక గడ్కరీకి ‘బొద్దింకల’ బెడద? -
పాశవిక దాడికి బాధ్యులెవరు?
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి బాష్పవాయుగోళాలు ప్రయోగించి, పెల్లెట్ గన్స్ వినియోగించాలంటూ అనుమతిచ్చింది మీరేనా? అని హోం మంత్రి అమిత్ షాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనికి జవాబు చెప్పాలని దేశ ప్రజల నుంచి డిమాండ్లు ఎక్కువయ్యాయని రాహుల్ చెప్పారు. విద్యార్థులపై పాశవికంగా జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శనివారం అమిత్ షాకు రాహుల్ ఒక లేఖ రాశారు. ‘‘జంతర్‌మంతర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. విద్యార్థులు న్యాయమైన, పారదర్శకమైన విద్యా వ్యవస్థను కోరుతూ ఆందోళన నిర్వహించారు. వారి డిమాండ్లను వినాల్సిన ప్రభుత్వం, పోలీసులతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ వినియోగం వంటి తీవ్ర బలప్రయోగానికి పాల్పడింది. విద్యార్థినులతో కొందరు పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పోలీసుల దమనకాండలో వందలాది మంది విద్యార్థులు గాయపడ్డారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. పెల్లెట్స్ తగిలి గాయపడిన, ఒక కంట్లో చూపును కోల్పోయే ప్రమాదంలో పడిన టీనేజీ విద్యార్థి సాహిల్ లోచబ్‌ను కలిశా. ఒక జర్నలిస్టు సహా పలువురు తీవ్రంగా గాయపడినట్లు మీడియాలో కథనాలొచ్చాయి. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడాలని మీరే అనుమతి ఇచ్చారా? ఇవ్వకపోతే ఎవరు ఆదేశించారు? సాధారణ దుస్తుల్లో లాఠీలతో విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తులు పోలీసులా లేదా వలంటీర్లా? వారికి అక్కడ విధులను అప్పగించింది ఎవరు?’’ అని అమిత్‌షాను రాహుల్ నిలదీశారు. ‘‘విద్యార్థులపై జరిగిన హింస ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసింది. దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. యువత దేశ భవిష్యత్తు. వారు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే’’ అని రాహుల్ ఆ లేఖ ద్వారా డిమాండ్‌చేశారు. -
బోసిపోయిన జంతర్ మంతర్
-
జంతర్ మంతర్‌లో భారీగా చెత్త.. తొలగిస్తున్న 500 మంది సిబ్బంది!
న్యూఢిల్లీ: కొన్నిరోజుల పాటు సాగిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసన ప్రదర్శన ముగిసిన దరిమిలా న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) జంతర్ మంతర్ నిరసన ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి భారీ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టింది. నిరసన సమయంలో పేరుకుపోయిన వ్యర్థాలు, శిథిలాలు, తాత్కాలిక నిర్మాణాలను తొలగించడానికి 500 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దించారు. నిరసనకారులు శనివారం సాయంత్రం ఆందోళన విరమించి ఖాళీ చేసిన వెంటనే ఈ శుభ్రపరిచే కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన డిమాండ్లను అంగీకరించడంతో పాటు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఈ నిరసన ముగిసింది.రౌండ్-ది-క్లాక్ పనుల్లో 500 మందికి పైగా కార్మికులుజంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు పారిశుద్ధ్య కార్మికులను భారీగా మోహరించినట్లు ఎన్డీఎంసీ అధికారులు తెలిపారు. నిరసన వేదిక వద్ద మిగిలిపోయిన చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాలు, బ్యానర్లు, టెంట్లు తదితర సామగ్రిని తొలగిస్తున్నారు. నిరసన ఆనవాళ్లు లేకుండా చేసి, ఆ ప్రాంతాన్ని పూర్వ స్థితికి తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.రంగంలోకి లారీలు, యంత్ర పరికరాలుపనులను వేగవంతం చేయడానికి ఎన్డీఎంసీ లారీలు, ఆటో-టిప్పర్లు, గోబ్లర్ యంత్రాలతో సహా యాంత్రీకృత శుభ్రపరిచే పరికరాలను వినియోగిస్తోంది. సైట్ నుంచి నిర్మాణ వ్యర్థాలు, రాళ్లు, ఇతర శిథిలాలను తొలగించడానికి సివిల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి అదనపు సిబ్బందిని కూడా కేటాయించారు. నిరసన సమయంలో రద్దీగా ఉండే జంతర్ మంతర్ రోడ్డు, టాల్‌స్టాయ్ మార్గ్, జై సింగ్ రోడ్డు, సంసద్ మార్గ్, కన్నాట్ ప్లేస్ పరిసరాలలో ఈ పారిశుద్ధ్య డ్రైవ్ కొనసాగుతోంది.బారీగా వ్యర్థాల తొలగింపుగత రెండు రోజులుగా నిరసన ప్రాంతం నుంచి కొన్ని టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు ఎన్డీఎంసీ వెల్లడించింది. ఆందోళన కొనసాగిన కొద్దీ చెత్త పరిమాణం విపరీతంగా పెరగడంతో కార్మికులు, యంత్రాలను రౌండ్-ది-క్లాక్ మోహరించి పనులు ముమ్మరం చేశారు. -
ఆరోపణలను ఖండించిన వాంగ్‌చుక్
న్యూఢిల్లీ: కేంద్రంతో కుదిరిన ‘‘ఒప్పందం’’మేరకే తాను 26 రోజుల ఆమరణ నిరాహారదీక్షను ఉపసంహరించానన్న వార్తలను సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఖండించారు. జంతర్‌మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోమని కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చినందుకే విరమించినట్లు స్పష్టం చేశారు. గత ఏడాది సెపె్టంబర్ 24న లద్దాఖ్‌లో యువతపై జరిగిన కాల్పులను గుర్తు చేసుకుంటూ, ఢిల్లీలో కూడా అలాంటి దాడి జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరాహార దీక్షను ఉపసంహరించుకుని శాంతి కోసం పిలుపునిస్తే పరిస్థితి సర్దుకుంటుందని భావించానని చెప్పారు. శుక్రవారం ఆర్ధరాత్రి యూట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసిన సోనమ్ నిరాహార దీక్ష విరమణకు దారితీసిన పరిస్థితులను వివరించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి సిబ్బందితో జరిగిన వాగ్వాదాన్ని కూడా ఆయన ఈ వీడియోలో పోస్ట్ చేశారు. తనను అరెస్ట్ అయినా చేయాలని, లేదంటే స్వేచ్ఛగా వెళ్లేందుకు అవకాశం కలి్పంచాలని వాంగ్‌చుక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. కేంద్ర మంత్రుల చర్చల సందర్భంగా తాను విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టబట్టలేదని, విద్యార్థులు కేసుల్లో చిక్కుకో కూడదన్న ఒకే ఒక్క ఆలోచనతో ఉన్నానని చెప్పారు. లోపాయికారి ఒప్పందం చేసుకోవాలని అనుకుంటే 26 రోజులపాటు ఆకలితో ఎలా ఉండేవాడినని ప్రశ్నించారు. ఏసీ గదిలో కూర్చొని ఒప్పందం చేసుకునే వాడినని అన్నారు. మంత్రులు నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంతోపాటు, పార్లమెంటులో చర్చకు అంగీకరించారని, కేసుల విషయంలో మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తాను ఆందోళన చెందాననన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ సభ్యుల సమక్షంలోనే నిరాహార దీక్ష ఉపసంహరించాలని అనుకున్నా మంత్రులు రాకముందు నుంచే తనను కలిసేందుకు ఎవరినీ అనుమతించకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నానని అన్నారు. వారు లేకుండానే దీక్ష విరమించడంపై దుఃఖం వ్యక్తం చేశారు. -
గుర్తుంచుకోండి.. బొద్దింకతో పెట్టుకోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమం కీలక మలుపు తిరిగింది. రాజీనామా వార్త తెలియగానే జంతర్‌మంతర్ వద్ద ఆందోళనచేస్తున్న నిరసనకారులు ఒక్కసారిగా ఆనందడోలికల్లో మునిగారు. జాతీయజెండాలు చేతబూని కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఉద్యమంలో ప్రభుత్వంపై గెలిచామన్న ఆనందంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ‘విద్యార్థి శక్తి విజయం సాధించింది‘అంటూ హర్షధ్వానాలు చేశారు. నీట్ లీకేజీతో మనస్తాపంతో ఆత్మహత్యచేసుకున్న పరీక్షార్థులకు నివాళిగా అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత సంబరాలు కొనసాగించారు. వందేమాతరం నినాదాలతో ప్రాంగణం హోరెత్తిపోయింది. ఫోన్ కాల్‌తో ఒక్కసారిగా ఆనందం శనివారం తొలుత జంతర్‌మంతర్‌లో నిరసన కార్యక్రమంలో సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ఉన్న సమయంలోనే మంత్రి పదవికి ధర్మేంద్ర రాజీనామాచేసిన విషయం ఫోన్‌కాల్ ద్వారా తెలిసింది. ఈ ఘటన వివరాలను దీప్కే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియో షేర్ చేసి తెలిపారు. 3 నిమిషాల నిడివి గల ఆ వీడియోలో దీప్కే ఫోన్ మాట్లాడటం పూర్తయ్యేలోపే అక్కడి విద్యార్థులకు విషయం తెల్సి పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. తర్వాత దీప్కే మైక్‌తీసుకుని ‘మన విద్యార్థి శక్తి వరి్ధల్లాలి. మనం సాధించాం’అని బిగ్గరగా అరుస్తూ చర్చలు ఫలవంతమయ్యాయని ప్రకటించారు.దీంతో విద్యార్థులంతా కేరింతలు కొట్టారు. చేతులు పైకెత్తి విజయోత్సాహం వ్యక్తం చేశారు. వేదికపై ప్రదర్శించిన పోస్టర్లో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనతో మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడిన పరీక్షార్థుల పేర్లను దీప్కే చదివి వినిపించారు. వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ, వారి త్యాగాలను ఉద్యమం ఎప్పటికీ మరచిపోదని అన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పలువురు విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. షారుఖ్‌ఖాన్ హిట్ సినిమా ఛక్‌దే ఇండియాలోని దేశభక్తి పాటలను అక్కడ ప్లే చేశారు. బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలను ప్రదర్శించారు. సీజేఐ సూర్యకాంత్‌కు థాంక్యూ.. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి దిప్కే ప్రసంగించారు. ‘‘ధర్మేంద్ర రాజీనామా చేయడం ప్రజాస్వామ్య విజయం. గుర్తుంచుకోండి బొద్దింకలతో పెట్టుకోవద్దు. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడం అంత సులభం కాదు. కానీ విద్యార్థుల ఐక్యతతో ఇది సాధ్యమైంది. ప్రపంచం వంగుతుంది. కానీ దానిని వంచే సామర్థ్యం, నాయకత్వం మనకుండాలి. మీరు భయపడకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడితే ఎవరినైనా రాజీనామా చేయించవచ్చు అని ఈ ఉద్యమం నిరూపించింది. విద్యార్థుల ఐక్యత ముందు ప్రభుత్వం తలవంచింది’’ అని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు దీప్కే కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీరే గనక మమ్మల్ని బొద్దింకలు అని పిలవకపోయి ఉంటే నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేవాడినే కాదు. మీరే గనక మమ్మల్ని కాక్రోచెస్ అని పిలవకపోయి ఉంటే దేశ యువత వీధుల్లోకి వచ్చి పోరాటం మొదలెట్టేదేకాదు. మీరేగనక కాక్రోచ్ అని పిలవకపోయి ఉంటే ఈరోజు ధర్మేంద్ర మంత్రిగా రాజీనామా చేసేవాడేకాదు. ఇవన్నీ సుసాధ్యంకావడానికి పరోక్షంగా మీ కాక్రోచ్ వ్యాఖ్యలే కారణం. అందుకే మీకు కృతజ్ఞతలు’’ అని దీప్కే అన్నారు. వాంగ్చుక్కు థాంక్యూ చెప్పని దీప్కే! తాము ఘన విజయం సాధించామని నిరసన వేదికపై నుంచి ప్రకటించిన సందర్భంగా దీప్కే చేసిన ప్రసంగంలో సోనమ్ వాంగ్‌చుక్ పేరును ప్రస్తావించలేదు. కనీసం థాంక్యూ చెప్పలేదు. వాంగ్‌చుక్ నిరాహార దీక్షతోనే తొలుత నిరసనగా మొదలైన ఈ కార్యక్రమం తర్వాత ఉద్యమంగా ఉధృతరూపం దాల్చింది. అలాంటి వాంగ్చుక్ను దీప్కే తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంతో ఉద్యమనేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా అనే కొత్త చర్చ మొదలైంది. అయితే ఉద్దేశపూర్వకంగానే వాంగ్‌చుక్ పేరును దీప్కే ప్రస్తావించలేదనే వాదనా విని్పస్తోంది. ఈ వాదనకు బలం చేకూర్చేలా దీప్కే ప్రసంగంలోని మాటలు ఉండటం గమనార్హం. ‘మన డిమాండ్లు నెరవేరడంతో నన్ను హీరోను చేసేయకండి. కేవలం ఒక్క వ్యక్తిని హీరోను చేస్తూ పోవడంతోనే ఇప్పుడు భారత్ ఇలా అస్తవ్యస్తంగా తయారైంది. అలాంటి తప్పును మీరు చేయొద్దు’’ అని దీప్కే అన్నారు.ఇప్పుడే సూర్యోదయమైంది ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలోని ఫేమస్ డైలాగ్‌ను దీప్కే చెప్పారు. ‘‘మోదీజీ. ప్రజాస్వామ్యానికి ఇప్పుడే సూర్యోదయం అయింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడే తొలి వికెట్ పడింది. మా ఉద్యమ ప్రయాణం మరెంతో ముందుకు సాగాల్సి ఉంది. ఈ ప్రభుత్వంలో ఎవరూ రాజీనామా చేయరని అందరూ మాతో చెప్పేవారు. కానీ సంకల్పం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని మేము నిరూపించాం’అని దీప్కే అన్నారు. -
ఆందోళనల విరమణ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పోటీపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంతో ఉద్యమించిన యువత ఆరంభించిన ఆందోళనలను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పారీ్ట(సీజేపీ) శనివారం ప్రకటించింది. నీట్ ఉదంతంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తోపాటు ఆత్మహత్యలకు పాల్పడిన పరీక్షార్థుల కుటుంబాలకు తలో రూ.1 కోటి నష్టపరిహారం, జూన్ 20నాటి ఛలో సంసద్ ర్యాలీలో పోలీసులతో ప్రతిఘటించిన ఉద్యమకారులపై మోపిన కేసులన్నింటినీ ఎత్తేసేందుకు మోదీ సర్కార్ సమ్మతి తెలపడంతో తమ ఆందోళనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. ప్రభుత్వంతో జరిపిన నాలుగో దఫా చర్చలు ఫలవంతమయ్యాక సీజేపీ ప్రతినిధులు ఈ విషయాన్ని మంత్రులతో కలిసి సంయుక్త మీడియా ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో కలిసి శనివారం ఢిల్లీలోని ‘కాన్సిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా’లో సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలు సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో అశుతోష్ మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు గౌరవప్రదమైన ఆర్థిక సాయంతోపాటు ఢిల్లీ, బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఉద్యమకారులపై నమోదైన కేసులను నాలుగు రోజుల్లోపు ఎత్తేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. దీంతో నిరసనలకు నేటితో ముగింపు పలుకుతున్నాం. జంతర్‌మంతర్ సహా అన్ని నిరసనవేదికల నుంచి కార్యకర్తలంతా ఇళ్లకు బయల్దేరండి’’అని అశుతోష్ కోరారు. హామీల అమలు, విద్యావ్యవస్థ పటిష్టతకు తీసుకునే చర్యలపై సమీక్ష కోసం సీజేపీ, ప్రభుత్వ ప్రతినిధులు నాలుగు వారాల తర్వాత మళ్లీ భేటీ అవుతారని అశుతోష్ వెల్లడించారు. తర్వాత జేపీ నడ్డా మాట్లాడారు. ‘‘ఉద్యమం ముగిశాక కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడవద్దు అని సీజేపీ ప్రతినిధులు కోరారు. మంత్రి రాజీనామా, బాధితులకు నష్టపరిహారం, కేసుల ఉపసంహరణతోపాటు పరీక్షల నిర్వహణ, విద్యావ్యవస్థలో సమూల మార్పులకు వాళ్లు సూచించిన ఐదు పాయింట్ల చార్టర్‌ను పరిశీలించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేసింది’’అని నడ్డా తెలిపారు. -
జంతర్ మంతర్ నిరసనల కాలక్రమం
జూన్ 6, 2026: జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు షురూ! ⇒ ప్రధాన డిమాండ్: నీట్ యూజీ–2026 పేపర్ లీక్, సీబీఎస్ఈ ఆన్‑ స్క్రీన్ మార్కింగ్ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. జూన్ 28, 2026: సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష మొదలు. దేశవ్యాప్తంగా అందరి, ముఖ్యంగా జెన్–జీ దృష్టిని ఆకర్షించిన ఘట్టమిది. ⇒ భారతదేశం నలుమూలల నుంచి సీజేపీ ఉద్యమానికి సంఘీభావం. వెల్లువలా జంతర్‌మంతర్‌కు జెన్–జీ. జూలై 18, 2026: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను హైకోర్టు ఆదేశాల మేరకు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే సోనమ్ భార్య అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణ జరిపిన కోర్టు జూలై 21న మెదాంత ఆసుపత్రికి తీసుకెళ్లేందకు అనుమతిచి్చంది. జూలై 20, 2026: చలో సంసద్ ర్యాలీ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు. మహిళలు సహా పలువురు విద్యార్థులకు గాయాలు. కొంతమందిపై పెల్లెట్ గన్ ప్రయోగం. జంతర్ మంతర్ చుట్టూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల మోహరింపు. జూలై 23, 2026 (రాత్రంతా జాగరణ): గాయాలు, అలసట ఉన్నప్పటికీ విద్యార్థులు నిరసన శిబిరాన్ని కొనసాగించారు. ఆటలు, పాటలతో సందడిగా రాత్రంతా సందడిగా మారింది జంతర్ మంతర్. ⇒ దేశం నలుమూలల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఎందరో ఉద్యమంలో పాల్గొంటున్న వారికి స్విగ్గీ, జొమాటోల ద్వారా ఆహార పానీయాలు పంపించడం, కుర్రాళ్ల విన్యాసాలతో ఆ రాత్రి నిరసన కార్యక్రమాల్లో కొంగొత్త వైఖరిని ఆవిష్కరించింది. గాయాలతో విశ్రాంతి తీసుకుంటున్న కొందరికి స్వచ్ఛంద కార్యకర్తలు ఆహారం, నీరు, మందులు పంపిణీ చేశారు; ఉక్కబోత నుంచి ఉపశమనం కలిగించేందుకు విసనకర్రలతో వారికి సపర్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ⇒ నిరసనకారులు రాక్‌స్టార్ సినిమాలోని ‘‘సడ్డా హక్’’తోపాటు చాలా సినిమా పాటలను ఉత్సాహంగా పాడి, ఆడారు. నినాదాలు రాత్రంతా మారుమోగాయి. జూలై 24, 2026: కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ నేత జితేంద్ర సింగ్ మెదాంత ఆసుపత్రిలో సోనమ్ వాంగ్‌చుక్‌తో చర్చలు జరిపారు. ప్రధాన్ రాజీనామా మినహా మిగిలిన షరతులకు రాతపూర్వక అంగీకారం తెలపడంతో ఆమరణ నిరాహార దీక్షను ఉపసంహరించుకుంటున్నట్లు సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటించారు. జూలై 25, 2026: పేపర్ లీక్‌పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ⇒ నిరసనకారులు దీనిని పాక్షిక విజయంగా ప్రకటించారు, కానీ పరీక్షల నిర్వహణ. పారదర్శకతపై మరిన్ని సంస్కరణలు అవసరమని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. -
ఇది ఆరంభం మాత్రమే... రాజీనామా పై రఘవీరా రెడ్డి రియాక్షన్
-
కేంద్ర మంత్రులతో CJP సంచలన ప్రెస్ మీట్
-
లోకేష్ రాజీనామా చేయకపోయితే ఏపీలో కూడా జంతర్ మంతర్ ధర్నా..
-
ప్రియమైన బొద్దింకలారా కంగ్రాట్స్.. CJPకి ప్రకాష్ రాజ్ విషెస్
-
ఆందోళన విరమించిన సీజేపీ
ఢిల్లీ: కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. కేంద్రంతో సీజేపీ ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపారు. చర్చల్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సీజేపీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు కొనసాగాయి. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సీజేపీ తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ మొదటి డిమాండ్ నెరవేరిందని.. మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని అశుతోష్ పేర్కొన్నారు.ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిందన్న సీజేపీ.. ఆందోళన విరమించాలని నిర్ణయించింది. జంతర్‌మంతర్ దగ్గర నుంచి విద్యార్థులు వెళ్లిపోవాలని పిలుపునిచ్చింది. విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలన్న సీజేపీ.. నాలుగు వారాల తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని పేర్కొంది. సీజేపీ 3 డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం.. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు ఒప్పుకుంది. త్వరలోనే పరిహారం కూడా చెల్లిస్తామని వెల్లడించింది.వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. నవభారత్‌కు ఇదొక శుభపరిణామంగా అభివర్ణించారు. యువతకు అభినందనలు తెలిపిన ఆయన.. విద్యారంగంలో సమూల మార్పులు రావాలన్నారు. విద్యార్థులు సంయమనం పాటించాలని వాంగ్‌చుక్ కోరారు. -
నీట్ బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి
-
GEN- Z కేంద్రంకు మా సత్తా ఏంటో చూపించాం..!
-
GEN-Z సంబరాలు ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి..
-
రాజీనామా డిమాండపై భిన్నాభిప్రాయాలు.. బీజేపీకి ఉన్న సమస్య ఏంటి? మాట జారడమే ముంచేసిందా
-
కొడుకు అభిజిత్ దీప్కే విజయంపై తల్లి ఎమోషనల్ వీడియో
-
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్ చుక్ రియాక్షన్
-
అంబేద్కర్ ఫోటో ఫ్రేమ్ తో CP లీడర్స్ సంబరాలు
-
చర్చల్లో బిగ్ ట్విస్ట్.. కేంద్రానికి షాకిచ్చిన సీజేపీ!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మధ్య మూడో విడత చర్చలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ మరోసారి స్పష్టం చేసింది. రాజీనామాపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే చర్చలను కొనసాగించడంలో ఎలాంటి ప్రయోజనం లేదని శనివారం తేల్చిచెప్పింది.సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమకు చర్చలకు అతీతమైన అంశమని పేర్కొన్నారు. ప్రభుత్వం రాజీనామాకు అంగీకరించకపోతే తదుపరి చర్చలకు అర్థం ఉండదని స్పష్టం చేశారు.Dharmendra Pradhan’s resignation is NON-NEGOTIABLE.If it’s a no from the government, there’s no point of further discussion.— Ashutosh Ranka (@AshutoshRanka) July 25, 2026‘ముందు రాజీనామా.. ఆ తర్వాతే చర్చలు’నీట్ సహా పోటీ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం జరగనున్న మూడో విడత చర్చలకు ముందు సీజేపీ చేసిన ఈ ప్రకటనతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో సీజేపీ తన ప్రధాన డిమాండ్‌పై మరింత కఠిన వైఖరి ప్రదర్శించింది.రెండు డిమాండ్లపై కేంద్రం సానుకూలతఇప్పటికే జరిగిన చర్చల్లో సీజేపీ చేసిన మూడు ప్రధాన డిమాండ్లలో రెండు అంశాలపై కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయకూడదన్న డిమాండ్పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలన్న డిమాండ్ఈ అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇందుకోసం ఈ మధ్యాహ్నం వరకు కేంద్రం గడువు కోరింది. అయితే రాజీనామాపై స్పష్టత ఇచ్చాకే చర్చలను ముందుకు తీసుకెళ్తామని సీజేపీ ఇప్పుడు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.రాజీనామాకు నో?మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజీనామా చేయడం సమస్యకు పరిష్కారం కాదని, అది బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని కేంద్ర వర్గాల అభిప్రాయం. పరీక్షల నిర్వహణలో లోపాలను సరిదిద్దడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో సంస్కరణలు చేపట్టడమే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్న సీజేపీప్రధాన్ రాజీనామాపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని సీజేపీ హెచ్చరిస్తోంది. చర్చల ఫలితం ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదంతో ప్రారంభమైన ఆందోళనలు ప్రస్తుతం కేంద్రం–సీజేపీ మధ్య ప్రతిష్టంభనకు దారితీశాయి. ఈ నేపథ్యంలో మూడో విడత చర్చలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. -
కాక్రోచ్ ఉద్యమం వెనుక పూర్తి కథ ఇదే !
-
మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకారం: సీజేపీ
సీజేపీ ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. సీజేపీ విధించిన డెడ్‌లైన్‌లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించామంటూ సీజేపీ వ్యాఖ్యానించింది. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదని.. ఈ విజయం విద్యార్థులందరిందని సీజేపీ పేర్కొంది. సీజేపీ నిరసనలు.. అప్డేట్స్..విద్యారంగంలో మంచి సంస్కరణలు తీసుకురావాలి: రాహుల్విద్యావ్యవస్థను బీజేపీ భ్రష్ఠు పట్టించిందివిద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాల్సిందేదేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ ఆక్రమించిందివిద్యా రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారువిద్యార్థులపై దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలి నీట్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం: జేపీ నడ్డాత్వరలోనే పరిహారం ఇస్తాంనిబంధనలకు లోబడే పరిహారం చెల్లిస్తాంసీజేపీ ప్రతిపాదించిన సంస్కరణలను పరిశీలిస్తాంమూడు డిమాండ్లకు కేంద్రం అంగీకారం: సీజేపీవిద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందిప్రధాన్ రాజీనామాతో మా మొదటి డిమాండ్ నెరవేరిందివిద్యార్థులపై కేసు ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందిపరిహారంపై కూడా స్పష్టత ఇచ్చిందివిద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలిఆందోళన విరమించిన సీజేపీసీజేపీ, కేంద్ర మధ్య ముగిసిన చర్చలుసీజేపీ ప్రతినిధులతో చర్చించిన నడ్డా, జితేంద్రసింగ్దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన చర్చలు కేంద్రంతో సీజేపీ మూడో విడత చర్చలుచర్చల్లో పాల్గొన్న జేపీ నడ్డా, జితేంద్ర సింగ్సీజేపీ నుంచి హాజరైన సౌరవ్ దాస్, అశుతోష్లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరిన సీజేపీసెంట్రల్ ఢిల్లీలో తెరుచుకున్న మెట్రో స్టేషన్లువిద్యార్థుల ఆందోళన విరమణతో మెట్రో స్టేషన్లు రీఓపెన్ఢిల్లీలో వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాలుఢిల్లీకి బయల్దేరి రావాలని ఫడ్నవీస్, షిండేలకు పిలుపుమరికొంతమంది రాజకీయ నాయకులకు ఢిల్లీ పిలుపుఇది ప్రజాస్వామ్య విజయం మల్లికార్జున ఖర్గేఇప్పటికైనా విద్యా వ్యవస్థను సరిదిద్దాలియువత ధైర్యంగా పోరాడిందిఢిల్లీ:ప్రధాని మోదీతో అమిత్ షా భేటీతాజా పరిణామాలపై మోదీ, అమిత్ షా చర్చలు కాసేపట్లో కేంద్రంతో సీజేపీ ప్రతినిధుల చర్చలుమిగతా రెండు డిమాండ్లను నెరవేర్చాలంటున్న సీజేపీప్రజాస్వామ్యం గెలిచింది: వాంగ్చుక్శాంతికి, సహనానికి చెందిన విజయం ఇదిఇప్పటికైనా విద్యారంగంలో సంస్కరణలు తేవాలిఇకపై కేంద్ర బాధ్యతాయుతంగా వ్యహరించాలిసీజేపీ, జెన్ జీలకు ధన్యవాదాలు జంతర్‌మంతర్ దగ్గర విద్యార్థుల సంబరాలుఒక డిమాండ్ నెరవేరింది: సీజేపీమిగతా 2 డిమాండ్లు నెరవేరే వరకు వేచి ఉందాంవిద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్యం గెలిచింది: సీజేపీకేంద్రానికి మా సత్తా ఏంటో చూపించాం: సీజేపీవిద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదుఈ విజయం విద్యార్థులందరిదికేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ రాజీనామాసీజేపీ ఉద్యమంతో దిగొచ్చిన ధర్మేంద్ర ప్రధాన్సీజేపీ విధించిన డెడ్‌లైన్‌లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామారాజీనామా లేఖను ప్రధానికి పంపిన ధర్మేంద్ర ప్రధాన్జంతర్మంతర్ సమీపంలో ఉద్రిక్తతపోలీసులపై రాళ్లురువ్విన ఆందోళనకారులుఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగంజంతర్మంతర్లో కొనసాగుతున్న సీజేపీ నిరసనలు ఢిల్లీ పోలీసులకు సీజేపీ డిమాండ్జంతర్ మంతర్‌ను ముట్టడించడం ఆపండిదీక్షా స్థలికి వచ్చే ప్రజలను అడ్డుకోవద్దునిరసనకారులకు ఆహారం, మందులు చేరనివ్వాలిజంతర్ మంతర్ ముట్టడిని ఎత్తివేయాలని డిమాండ్ఢిల్లీ పోలీసుల సంచలన ప్రకటనజంతర్మంతర్ హింసాత్మక ఘటనలపై పోలీసుల ప్రెస్మీట్అందులో చాలా వరకు ఫేక్ వీడియోలు, ఫొటోలు ఉన్నాయిసోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారాలు చేశారుదీని వెనక పాకిస్తాన్ ప్రమేయం ఉందిపాక్ నుంచి ఏఐ వీడియోలను క్రియేట్ అయ్యాయి400కి పైగా పాక్ హ్యాండిల్స్‌ను బ్లాక్ చేశాంఏఐ కట్టడికి కృషి చేస్తున్నాంఏఐ ద్వారా ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయిరేపు దేశవ్యాప్త నిరసనలను సీజేపీ పిలుపుమరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చిన సీజేపీరేపు సాయంత్రం 6గం. క్యాండిల్ ర్యాలీలు చేపట్టాలని పిలుపుఇవాళ చర్చలు ఉంటాయా? ఉండవా? అనేదానిపై నెలకొన్న అనిశ్చితిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్న సీజేపీధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించకలేకపోతే.. మోదీనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్కేంద్రంతో చర్చకు ముందు సీజేపీ కీలక ట్వీట్రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదునిర్ణయం తీసుకోకపోతే.. చర్చలు కొనసాగించడంలో అర్థం లేదు“వాళ్లు అడిగే పరిస్థితి రాకముందే.. ఇప్పటికి బాధ్యత తీసుకుని స్వయంగా రాజీనామా చేసి ఉండాల్సింది.” అంటూ మరో ట్వీట్మధ్యాహ్నం 3.30గం. కు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ భేటీ!నిన్న గంటన్నరపాటు జరిగిన చర్చలుకీలక డిమాండ్‌పై కొలిక్కి రాని చర్చలుఇవాళ ఏ నిర్ణయం ప్రకటిస్తామన్న కేంద్ర మంత్రులుమంత్రి రాజీనామాపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతి చేస్తామని ప్రకటనजिम्मेदारी लेकर बिना मांगे ही अब तक इस्तीफा दे देना चाहिए था 🥺— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026 సీజేపీ నిరసనలకు ప్రొఫెసర్ కోదండరాం మద్దతుసీజేపీ నిరసనలకు ప్రొఫెసర్, తెలంగాణ ఎమ్మెల్సీ కోదండరాం మద్దతువిద్యార్థులు చేస్తున్న ఆందోళన సరైందిపేపర్ లీకేజీకి ధర్మేంద్ర ప్రధానే కారణంకచ్చితంగా ఆయన రాజీనామా చేయాలిసీజేపీ నిరసనలకు రాహుల్ గాంధీ సంఘీభావంశనివారం.. మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్ ప్రధాని అర్ధరాత్రి పూట వీడియోలు చేస్తున్నారు.. ఏం లాభం?ఢిల్లీ పోలీసులు విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించారులాఠీలతో తలలు పగలకొట్టారుపిల్లలపై దాడి చేసిన వాళ్లు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేధర్మేంద్రను ప్రధాని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలినీట్ లీక్‌పై విద్యార్థులకు ప్రధాని క్షమాపణలు చెప్పాలిఅవినీతికి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతీకధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు అంటున్నారుఆయన్ని మరో శాఖకు మార్చాలని అనుకుంటున్నారుఆయన శాఖ మార్చడం కూడా ఆమోద యోగ్యం కాదుఎంత బెదిరించినా.. జంతర్ మంతర్నుంచి విద్యార్థులు కదలరుయువతకు అభిజిత్ దీప్కే ధన్యవాదాలు టైఫాయిడ్‌తో బాధపడుతున్ను కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేచికిత్స తీసుకుంటున్న సీజేపీ చీఫ్శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న యువతకు ధన్యవాదాలుఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తే కేంద్రం తప్పకుండా దిగి వస్తుందిధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి తప్పకుండా రాజీనామా చేస్తారుపోరాటం ఇలాగే కొనసాగించాలని సూచనకోలుకోగానే తాను చేరతానని వ్యాఖ్యమోహన్ భగవత్ పరోక్ష వ్యాఖ్యలుఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలునేటి యువత దారితప్పిన వారు కాదని, వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న భగవత్యువతకు ఆదేశాలు ఇవ్వడం కాకుండా.. వారితో చర్చలు జరపాలని సూచనకొత్త తరం ఎక్కువగా ప్రశ్నలు అడుగుతోందని, వారికి సరైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని వ్యాఖ్యయువతకు మార్గనిర్దేశం చేయాలే తప్ప.. వారి అభిప్రాయాలను అణచివేయకూడదన్న ఆరెస్సెస్ చీఫ్“ఆదేశాలు కాదు.. చర్చలు, నియంతృత్వం కాదు.. ఏకాభిప్రాయం” అనే సందేశం ఇచ్చిన మోహన్ భగవత్యువత విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే సంభాషణ(మాటలు, చర్చల) ద్వారానే సాధ్యమని ఆసక్తికర వ్యాఖ్యరాజీనామా లేకుండానే దీక్ష విరమణ.. వాంగ్‌చుక్ వివరణధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ మినహా మిగతా వాటికి అంగీకరించిన సోనమ్ వాంగ్చుక్కేంద్ర మంత్రుల సమక్షంలో మొన్న దీక్ష విరమణప్రధాన డిమాండ్ నెరవేరక ముందే దీక్ష విరమించడంపై విమర్శలునిన్న రాత్రి వీడియోలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన వాంగ్చుక్కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ.. 26 రోజుల నిరాహార దీక్షను విరమించినట్లు సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు.రాజీనామా తనకు ప్రధాన అంశం కాదని.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు కాకుండా చూడటమే తన ప్రాధాన్యత అని చెప్పారు.ఢిల్లీలోని ‘సీజేపీ’ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో జరిగిన ‘సంసద్ చలో’ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవని కేంద్రం రాతపూర్వక హామీ ఇచ్చిందని వెల్లడించారు.పరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లపై పార్లమెంట్లో చర్చిస్తామని.. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని తాను చర్చల్లో ప్రస్తావించానని.. కానీ కేంద్రం మరింత సమయం కోరిందని వాంగ్‌చుక్ తెలిపారు.ప్రధాన్ రాజీనామా చివరికి జరిగే అవకాశం ఉందని తాను భావిస్తున్నానని.. అందుకే దానిపై పట్టుబట్టలేదని చెప్పారు."నా లక్ష్యం విద్యార్థులు నష్టపోకూడదనేది. వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు కాకుండా చూడటమే అత్యంత ముఖ్యమైన విషయం" అని స్పష్టం చేశారు.దీక్ష విరమణపై వచ్చిన ‘డీల్ కుదిరింది’ అనే ఆరోపణలను వాంగ్‌చుక్ ఖండించారు."డీల్ చేసుకోవాలనుకుంటే 26 రోజులు ఆకలితో ఉండాల్సిన అవసరం ఏముంది? ఏసీ గదిలో కూర్చునే ఒప్పందం చేసుకునేవాడిని" అని వ్యాఖ్యానించారు.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆస్పత్రికి వచ్చి హామీలు ఇచ్చారని.. అయితే రాతపూర్వక హామీ వచ్చే వరకు దీక్ష విరమించలేదని తెలిపారు.తనతో పాటు పోరాడిన విద్యార్థులు, ఎంపీలు, లద్దాఖ్ ప్రతినిధులు దీక్ష ముగింపు సమయంలో తన వద్ద లేకపోవడం బాధ కలిగించిందని వాంగ్‌చుక్ అన్నారు. AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026సమగ్ర కథనం కోసం👉 ఎలాంటి డీల్ లేదు: ఐసీయూ నుంచి వాంగ్‌చుక్ చర్చల వేళ సీజేపీ కీలక వ్యాఖ్యలుకేంద్ర ప్రభుత్వంతో మూడో విడత చర్చలకు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక ప్రకటన.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పష్టత లేకుండా చర్చలు కొనసాగించడంలో అర్థం లేదని స్పష్టీకరణ.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పనిసరి డిమాండ్ (నాన్-నెగోషియబుల్) అంటూ సీజీపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా వ్యాఖ్య ప్రభుత్వం రాజీనామాకు అంగీకరించకపోతే.. తదుపరి చర్చలకు వెళ్లడంలో ప్రయోజనం లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు.కేంద్రం, సీజీపీ ప్రతినిధుల మధ్య మూడో విడత సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని సీజీపీ డిమాండ్ చేస్తోంది.సమగ్ర కథనం కోసం👉 కేంద్రానికి సీజేపీ సంచలన షరతువాంగ్చుక్ వైరల్ వీడియోపై సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వివరణసోనమ్ వాంగ్చుక్ను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో రికార్డైన దృశ్యాలు బయటకు వైరల్‌గా మారిన వీడియో‘‘నేను వెళ్తున్నా.. నన్ను అరెస్ట్ చేయండి’’ అని పోలీసులకు సవాల్ విసిరిన వాంగ్చుక్వైరల్ వీడియోపై స్పందించిన సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి జూలై 21న ఆస్పత్రిలోని నో-వీడియోగ్రఫీ జోన్లో రికార్డు చేసినట్లు వెల్లడించింది.వాంగ్‌చుక్ అనుచరులు ఈ వీడియోను చిత్రీకరించారని స్పష్టీకరణరికార్డు చేసిన వెంటనే కాకుండా శుక్రవారం విడుదల చేశారని స్పష్టం చేసింది.ఆస్పత్రి నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరించారంటూ వివరణ ఇచ్చిన సర్దర్జంగ్ ఆస్పత్రికేంద్రం–సీజేపీ చర్చలు 3.0.. కీలక పరిణామాలుకేంద్రం, సీజేపీ మధ్య మూడో విడత చర్చలు నేడు జరగనున్నాయి.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పైనే ప్రధానంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.శుక్రవారం జరిగిన దాదాపు రెండు గంటల చర్చల్లో ఎలాంటి తుది నిర్ణయం రాలేదు.సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లలో రెండింటికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం.శాంతియుత నిరసనకారులపై కేసులు ఎత్తివేయడం, మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అంశాలపై సానుకూలత వ్యక్తం చేసింది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాత్రం కేంద్రం మరింత సమయం కోరింది.ఇవాళ మధ్యాహ్నం 3గం.లకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల భేటీ జరగనుందినీట్ నిరసనలు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలుపేపర్ లీక్ నేరాలకు కఠిన శిక్షలు విధించే ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.పేపర్ లీక్ మాఫియాకు కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష ప్రతిపాదించారు.నేర తీవ్రత ఆధారంగా శిక్షను 10 ఏళ్ల వరకు పెంచే అవకాశం కల్పించారు.వ్యవస్థీకృత పేపర్ లీక్ రాకెట్లకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు చేర్చారు.పేపర్ లీక్ కేసుల దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించారు.కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ చేపట్టనున్నారు.ఈ బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.మంత్రి రాజీనామాపై ఉత్కంఠ..విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాన్ని ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి.రాజీనామా చేయడం బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని కేంద్ర వర్గాల వాదన.ఎన్టీఏ సంస్కరణలు, పరీక్షల వ్యవస్థలో మార్పులే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం చెబుతోంది.సీజేపీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేస్తోంది.సీజేపీ హెచ్చరికలు..రాజీనామాపై స్పష్టమైన నిర్ణయం రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.ప్రభుత్వం స్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అశుతోష్ రాంకా తెలిపారు.కేంద్రం వైఖరిలో మార్పు లేకుంటే కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు.డిమాండ్లపై అశుతోష్ రాంకా కీలక వ్యాఖ్యలునిన్న జరిగిన సమావేశంలో పరిహారం, చట్టపరమైన కేసులకు సంబంధించిన అంశాలపై సానుకూల స్పందన వచ్చిందన్న రాంగాఈ అంశాలపై ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ అంగీకారం లభించిందని, ఈరోజు లిఖితపూర్వక ఒప్పందం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాలేదన్నారు.మీడియా కథనాల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని సమాచారం వస్తోందని, అదే జరిగితే సమావేశాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని రాంకా అన్నారు.ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్‌ను పట్టించుకోకుండా రాజీనామాకు నిరాకరిస్తే, తదుపరి వ్యూహాన్ని ప్రకటిస్తామని తెలిపారు.ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే సీజేపీ కూడా మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని అశుతోష్ రాంకా కోరారు.VIDEO | Delhi Jantar Mantar Protest: CJP spokesperson Ashutosh Ranka, says, "In yesterday's meeting, we received a positive response regarding compensation and legal cases. We got an in-principle agreement, and we hope to receive the written agreement today as well. However,… pic.twitter.com/BFvGHOZWBm— Press Trust of India (@PTI_News) July 25, 2026సమగ్ర కథనం కోసం👉: నీట్ టైం బాంబ్.. ఎప్పుడైనా పేలొచ్చుజంతర్ మంతర్ వద్ద భద్రత కట్టుదిట్టం..సీజేపీ ఆందోళన నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద కట్టుదిట్టమైన భద్రతఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలను పెంచారు.నిరసనలకు ప్రధాన వేదిక అయిన జంతర్ మంతర్ ప్రాంతం చుట్టూ అదనపు బారికేడ్ల ఏర్పాటు.బారికేడ్లను భారీ స్థాయి గొలుసులతో ఒకదానికొకటి అనుసంధానించారు.బారికేడ్లు కదలకుండా ఉండేందుకు వాటిని వెల్డింగ్ చేసి మరింత బలోపేతం.పెద్ద సంఖ్యలో ప్రజలు చేరే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు.జంతర్ మంతర్ పరిసరాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు.శాంతియుతంగా ఆందోళన కొనసాగించేలా పోలీసులు చర్యలు చేపట్టారుPolice Fortifies Jantar Mantar,A six-layer barricade setup is now in place on the road near Jantar Mantar and Jai Singh Marg. An attempt is being made to restrict the protesters to the area. The barricades have been anchored to the ground using iron rods and welding pic.twitter.com/NmwjZOfNPN— Amit Bhardwaj (@AmmyBhardwaj) July 24, 2026ఇంటర్నెట్ నిలిపివేత..సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సర్వీస్ నిలిపివేతపని చేయని మొబైల్ డేటా సర్వీసెస్బుకింగ్ కానీ క్యాబ్ సర్వీసులు, పని చేయని యూపీఐ పేమెంట్స్ యాప్సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు#WATCH | Security intensified around Jantar Mantar as Delhi Police set up additional barricades that have been interlinked with heavy duty chains and reinforced through welding. pic.twitter.com/I9tNCvGp6X— ANI (@ANI) July 25, 2026 మెట్రో మూసివేత..సీజేపీ నిరసనల నేపథ్యంలో మళ్ళీ మెట్రో స్టేషన్లు మూసివేత18 మెట్రో స్టేషన్లు క్లోజ్ లోక్ కల్యాణ్ మార్గ్రాజీవ్ చౌక్పటేల్ చౌక్రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్బారఖంబా రోడ్సుప్రీం కోర్ట్సేవా తీర్థ్జనపథ్మండి హౌస్సెంట్రల్ సెక్రటేరియట్ఐటీఓఢిల్లీ గేట్ఇంద్రప్రస్థఖాన్ మార్కెట్జోర్ బాగ్శివాజీ స్టేడియంఝండేవాలాన్న్యూ ఢిల్లీకేంద్రం, సీజేపీ చర్చల్లో ప్రతిష్టంభన..రాజీనామా చేయాల్సిందేనన్న కాక్రోచ్ జనతా పార్టీ24 గంటల్లో చెబుతామన్న మంత్రులు, నేడు మళ్లీ చర్చలు47 మంది ఎన్టీఏ సిబ్బందికి ఉద్వాసనధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరంటున్న ప్రభుత్వ వర్గాలుకేంద్ర ప్రభుత్వం, సీజేపీ చర్చలు శుక్రవారం అసంపూర్తిగా ముగిశాయి.ఏమీ తేల్చకుండా శనివారానికి ఉత్కంఠను మిగిల్చాయి.విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే ప్రధానంగా చర్చ నడిచింది.మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ పట్టుబట్టగా.. ప్రభుత్వం 24 గంటల సమయం కోరింది.శనివారం మధ్యాహ్నం ఏ విషయం చెబుతానంటూ వాయిదా వేసింది. -
జోమాటో నుండి అంత ఫుడ్ ఏవరు పంపారంటే? CJP కి అంతమంది సపోర్ట్ ఎందుకు ?
-
లోపల చర్చలు.. బయట లారీ ఛార్జ్.. మోడీ వీడియో వెనుక బీజేపీ వ్యూహం అదే
-
దద్దరిల్లిన జంతర్ మంతర్.. బొద్దింకల దెబ్బ.. ఢిల్లీ అబ్బ
-
పెల్లెట్ గన్లు గురిపెట్టారు
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద ఈ నెల 20వ తేదీన శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా పెల్లెట్ గన్స్‌తో కాల్పులు జరిపారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పెల్లెట్స్ ఉపయోగించారనడానికి ఈ విద్యార్థే నిదర్శనమంటూ సాహిల్ అనే యువకుడిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. విద్యార్థులపై కాల్పులు జరిపి, లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని పునరుద్ఘాటించారు. సాహిల్ త్రివర్ణ పతాకం చేతబూని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు అతడిపై పెల్లెట్ గన్‌తో దాడి జరిగిందని, తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. సాహిల్ కన్ను దెబ్బతి న్నదని, ఆ కంటితో అతనికి ఏమీ కనిపించడం లేదని తెలిపారు. సాహిల్ శరీరానికి తగి లిన గాయాలను సైతం రాహుల్ మీడియాకు చూపించారు. వేలాది మంది యువతకు ఇదే పరిస్థితి ఎదురైందని, వారిపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపి, లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించారు. నిరసనకారులు చేసిన నేరం ఏమిటని తీవ్రంగా ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక ‘క్రిమినల్ ఎడ్యుకేషన్ మినిస్టర్’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భారత విద్యా వ్యవస్థ పతనానికి ప్రతీకగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. -
నిరసనకారులపై ఏఐ నజర్!
న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకు రావాలని, పేపర్ లీకేజీలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద యువత, విద్యార్థు లు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అయితే, ఉద్యమకా రులపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. జంతర్‌మంతర్ వద్ద నిరసనకు సంబంధించిన వీడియోలను చాలామంది ‘ఎక్స్’లో పోస్టు చేస్తున్నారు. నిరసన కారులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనేది కచ్చితంగా గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ముఖ గుర్తింపు(ఫేసియల్ రికగ్నిషన్) వ్యవస్థలను ఉపయోగిస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ‘ఎక్స్’లో పోస్టుచేసిన వీడియో క్లిప్‌లలో 360 డిగ్రీల కెమెరాలతో కూడిన లైవ్ సీసీటీవీ నిఘా వాహనం ద్వారా తీసిన దృశ్యాలు కనిపిస్తు న్నాయి. వాహనం లోపల ఉన్న స్క్రీన్ మీద కొందరు నిరసనకారుల పేర్లు, ఫొటోలు, ఇతర వివరాలు కూడా దర్శనమి స్తున్నాయి. ఆ వీడియో ల్లో ఎక్కడా ఆధార్ కార్డు వివరాల ప్రస్తావన లేదు. అయితే, వ్యక్తుల ముఖాలను స్కాన్ చేసిన తర్వాత వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఇచ్చే వ్యవస్థను పోలీసులు ఉపయో గిస్తున్నట్లు నిరసనకారులు అనుమానిస్తున్నారు. ఇది ఆధార్‌తో లేదా మరేదైనా ప్రభుత్వ డేటా బేస్‌తో అనుసంధానమై ఉండొచ్చని అంటున్నా రు. పోలీసులు ఆధార్ డేటాను ఉపయోగిస్తున్నట్లు అధికారిక ధ్రువీకరణ లేదు. తమ సాంకేతిక వ్యవస్థను ఆధార్ డేటాబేస్‌తో అనుసంధానించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పడం లేదు. జంతర్‌మంతర్ వద్ద నిరసన ప్రదేశానికి సమీపంలో ఢిల్లీ పోలీసులు రెండు నిఘా వాహనాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి మొబైల్ పర్యవేక్షణ యూనిట్‌గా పనిచేస్తూ, ఆ ప్రాంతం చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరాల నుండి ప్రత్యక్ష ప్రసారాలను స్వీకరిస్తుంది. రెండో వాహనం కృత్రిమ మేధను ఉపయోగించి ఆ వీడియో ఫీడ్లను విశ్లేషించి, కెమెరాలో బంధించిన ముఖాలను పోలీసుల డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న చిత్రాలతో పోల్చి చూస్తుంది. నిరసనకారులను ప్రత్యక్షంగా గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ వ్యాన్లను మోహరించారని, వారు అక్కడికక్కడే బయో మెట్రిక్ వివరాలను సేకరించి, వ్యక్తిగత డేటాను వెలికితీస్తున్నారని కాక్రోచ్ జనతా పార్టీ వెల్లడించింది. అయితే, తమ ఉద్దేశశం నిరసనకారులందరినీ గుర్తించడం కాదని పోలీసు అధికారులు చెబుతున్నారు. జన సమూహంలో నేర చరిత్ర ఉన్నవారు ఎవరైనా కనిపిస్తే పోలీసులను అప్రమత్తం చేయడమే దీని లక్ష్యమని పేర్కొంటున్నారు. ‘‘నేరగాళ్ల ఫొటోలతో కూడిన ఒక పెద్ద డేటాబేస్ మా దగ్గర ఉంది. అందువల్ల జంతర్‌మంతర్ ప్రాంతంలోని వివిధ సీసీటీవీ కెమెరాల నుంచి మాకు అందిన ఫుటేజ్ ఆధారంగా ముఖ గుర్తింపు చేస్తాం. తద్వారా అక్కడ నేరగాళ్లు ఉంటే అదుపులోకి తీసుకోవడం సాధ్యమవుతుంది’’ అని పోలీసులు స్పష్టంచేశారు. -
నిరసనలపై విచారణ 27న రెండు పిల్స్‌పై విచారిస్తాం
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై పోలీసుల దాష్టీకంపై ఈ నెల 27న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది. ఈ అంశంపై దాఖలైన రెండు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేస్తామని ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ యాదవ్ జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ తెలిపింది. ‘‘విద్యార్థులపై పోలీసులు అతిగా బలం ఉపయోగించారు’’అని, ఇది రోజూ జరుగుతున్నందున అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ప్రస్తావించగా సీజేఐ స్పందించారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ నెలరోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూలై 20వ తేదీన నిర్వహించిన ‘ఛలో సంసద్’ర్యాలీలో పోలీసులు విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా పోలీసుల చర్యను గర్హిస్తూ జూలై 22న ఢిల్లీ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయ. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు కేంద్రం, ఢిల్లీ పోలీసుల స్పందనను కోరింది. పోలీసుల చర్యకు సంబంధించిన అన్ని రికార్డులను, సీసీటీవీ ఫుటేజ్‌లను భద్రపరచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. మీడియాది అతి నిర్లక్ష్యం: సీజేఐ ఛలో సంసద్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ అంశంపై సత్వర విచారణను తాను నిరాకరించినట్లు వచ్చిన వార్తలను సీజేఐ సూర్యకాంత్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఆ అంశంపై ఎలాంటి రిట్ పిటిషన్ దాఖలు కాలేదని, ఒక రిప్రెజెంటేషన్ మాత్రమే అందిందని ఆయన శుక్రవారం వ్యాఖ్యానించారు. తమ కేసులను అత్యవసరంగా లిస్ట్ చేయాలని న్యాయవాదులు కోరుతున్న సమయంలో సీజేఐ మాట్లాడుతూ ‘‘రెండు రోజులుగా పిటిషన్ ఫైల్ అయినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. మీడియా అన్ని రకాల బాధ్యతల నుంచి తప్పించుకని చీఫ్ జస్టిస్ ఆ పిటిషన్‌ను లిస్ట్ చేసేందుకు నిరాకరించారని తప్పుడు రిపోరి్టంగ్ చేస్తోంది’’అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆ రోజు ఉదయం పదిగంటల వరకూ ఒక్క కాగితమూ దాఖలు కాలేదు. ఒక రిప్రజెంటేషన్ మాత్రమే.. మిశ్రానో ఇంకెవరో పంపారు. దాన్ని రిట్ పిటిషన్‌గా ఎలా పరిగణిస్తా’’అని ప్రశ్నించారు. బుధవారం ఒక న్యాయవాది విద్యార్థులపై లాఠీఛార్జ్ విషయమై అత్యవసర విచారణ జరపాలని సీజేఐని కోరుతూ.. ‘‘పోలీసుల అకృత్యాలపై నా దగ్గర వీడియోలున్నాయి.... కేసు రేపు (గురువారం) లిస్ట్ చేయగలిగితే... విద్యార్థులు ఉన్నారు’’అని విన్నవించారు. అయితే సీజేఐ ఈ విజ్ఞప్తిని తిరస్కరించడంతోపాటు కేసులు ప్రస్తావించే సమయంలో వీడియోలు చూడలేమని స్పష్టం చేశారు. విద్యార్థులను బాగా కొట్టారని న్యాయవాది తెలపగా.. ‘‘మా సమయం వృథా చేయవద్దు. మేము వీడియోలు చూడదలచుకోలేదు’’అని ఘాటుగా సమాధానమిచ్చారు. -
వ్యాన్ ముందు ఎందుకు నిలబడ్డానంటే..! వైరల్ వీడియోపై RHIYA AHIR EMOTIONAL
-
అర్థరాత్రి 11:55 గంటలకు.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన మోదీ!
-
మీకేంత ధైర్యం.. ఢిల్లీ యూనివర్సిటీకి రాహుల్ వార్నింగ్
-
అర్థరాత్రి ఎలా ఉంది ? రాత్రి 12 గంటలకు.. జంతర్ మంతర్ వద్ద యువతులు
-
CJP అభిజిత్ ప్రశ్నలకు కంగుతిన్న పోలీస్..
-
ఓవైపు చర్చలు.. మరోవైపు పార్లమెంట్ స్ట్రీట్‌లో హైటెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పార్లమెంట్ స్ట్రీట్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా.. తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదని శుక్రవారం సీజేపీ చెబుతోంది. నిరసనకారులపై కేసులు తప్పవని, జాతీయ భద్రతా చట్టం (NSA) ప్రయోగిస్తామని, పాస్‌పోర్టులు సీజ్ చేస్తామని.. అఖరికి అరెస్టులు చేస్తామని హెచ్చరికలు వచ్చినప్పటికీ.. ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. విద్యా వ్యవస్థలో మార్పులు, తమపై జరిగిన పోలీసుల చర్యలపై బాధ్యులపై చర్యలు, ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో కేంద్రంతో సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది.కేంద్రం ప్రయత్నాలుమరోవైపు ఆందోళనను ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సీజేపీ ప్రతినిధులతో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో రెండో దఫా చర్చలు జరుగుతున్నాయి. సీజేపీ తరఫున ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు భేటీ అయ్యారు. ఎలాగైనా ఆందోళనలు విరమింపజేయాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం తమ ప్రధాన డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయాన్ని ప్రతినిధులు చర్చలకు వెళ్లే ముందు మీడియాకు స్పష్టం చేశారు. ‘‘మా డిమాండ్లకు కట్టుబడి ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. మాపై లాఠీ చార్జి చేసింది పోలీసులు కాదు.. ఆ ముసుగులో ఉన్న గూండాలు. వాళ్లకు శిక్ష పడాల్సిందే. అవసరమైతే ఈ విషయంలో కోర్టుకు వెళ్తాం. మా డిమాండ్లు నెరవేరే దాకా పోరాటం ఆపం’’ అని ఆ ఇద్దరు ప్రకటించారు. దీంతో చర్చలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది.పార్లమెంట్ వైపు వెళ్లేందుకు యత్నం.. పోలీసుల అప్రమత్తంఇదిలా ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నాం జంతర్ మంతర్ నుంచి కొందరు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్ స్ట్రీట్ ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని పోలీసులు ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.కేబినెట్ భేటీఅటు చర్చలు.. ఇటు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరుగుతోంది. పేపర్ లీకుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పిన ప్రధాని మోదీ.. అందుకు అవసరమైన చర్యలకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పాటు కఠిన శిక్షలతో చట్టం అమలయ్యేలా సంస్కరణల రూపకల్పన దిశగా ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం దీనిపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వాంగ్‌చుక్ దీక్ష విరమించినా.. పోరాటం కొనసాగింపుప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ నేతలు తెలిపారు. వ్యక్తుల దీక్షతో సంబంధం లేకుండా.. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ముందుగా ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్సీజేపీ తమ ప్రధాన ఎజెండాను స్పష్టం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. నీట్ సహా పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వివాదాలు, విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. మంత్రి రాజీనామా తర్వాతే విద్యా సంస్కరణలు, ఆందోళనకారులపై లాఠీచార్జి చేసిన అధికారులపై చర్యలు వంటి అంశాలపై చర్చిస్తామని సీజేపీ పేర్కొంది.ఒకవైపు ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తుండగా.. మరోవైపు సీజేపీ మాత్రం తమ డిమాండ్ల సాధన వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. దీంతో పార్లమెంట్ స్ట్రీట్‌లో కొనసాగుతున్న ఈ నిరసన దేశవ్యాప్తంగా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రం–సీజేపీ మధ్య జరగనున్న చర్చల ఫలితంపైనే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉన్నాయి. -
ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే మోదీ పెట్టుకున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా యువత అద్భుత పోరాటం జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే ప్రధాని మోదీ పెట్టుకున్నారు. యువత.. మోదీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. రాజ్యామా ఉలిక్కిపడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో యువత కదం తొక్కుతున్నారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీలకు అతీతంగా యువత పోరాడుతున్నారు. మీడియా రాకున్నా యువత ఒంటరిగా ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసింది. యువతపై జరుగుతున్న దాడులు దారుణం. ఢిల్లీలో జరిగిన ఘటనలు అమానుషం.. పిల్లలపై పోలీసులు దాడులు చేశారు. విద్యార్థులు న్యాయం అడిగితే పోలీసులు దౌర్జన్యానికి దిగారు. యువకులను దారుణంగా కొట్టారు. యువత జవాబుదారీతనం కోరుతున్నారు. ఉద్యమ పార్టీగా మాకు ప్రజా ఉద్యమాల పట్ల గౌరవం ఉంది.ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే మోదీ పెట్టుకున్నారు. ప్రధాని మోదీ కొరివితో తల గోక్కుంటున్నారు. విద్యార్థులు మంత్రి పదవి అడగలేదు. న్యాయం చేయాలని మాత్రమే కోరుతున్నారు. ఢిల్లీలో ఇటీవల ఘటనలు చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఈ జనరేషన్ చావుకు భయపడే రకం కాదు. యువతకు పొట్టు పొట్టు ఆకలి ఉంది.. మోదీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. రాజ్యామా ఉలిక్కిపడు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలి.. వచ్చాయా?. ఈ జనరేషన్ ఐటీ, ఈడీ సోదాలకు భయపడే వారు కాదు. మేకిన్ ఇండియా అడిగితే లీకిన్ ఇండియా ఇచ్చారు. నేను మోదీని ప్రశ్నిస్తే ఇక్కడున్న కేడీకి ఎందుకంత భయం?. పేపర్ లీక్‌కు, నాకు సంబంధం ఉందని రేవంత్ అంటున్నాడు. మోదీని ఎదిరించే దమ్ము రేవంత్‌కు లేదు. పాత కేసులు చూపించి జైల్లో పెడతారని రేవంత్‌కు భయం ఉంది. ఢిల్లీలో గల్లా పట్టి అడిగే దమ్ము మాకుంది ’ అని వ్యాఖ్యలు చేశారు. -
నీట్ లీక్‌పై ‘సుప్రీం’ సీరియస్.. కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణలో వరుస లోపాలను ఇకపై కొనసాగించలేమని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి సమగ్ర నివేదికలు కోరింది.నీట్ పేపర్ లీక్ కేసును శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం.. ఈ అంశాన్ని అత్యంత దగ్గరగా పర్యవేక్షిస్తామని తెలిపింది. పరీక్షల వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకొచ్చి, వాటిని సంస్థాగతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో నీట్‌ను నిర్వహించే ఎన్టీఏకు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.సంస్కరణలపై అఫిడవిట్లు దాఖలు చేయాలినీట్ పేపర్ లీక్ తర్వాత పరీక్షల నిర్వహణలో తీసుకున్న చర్యలు, భవిష్యత్ సంస్కరణల పురోగతిపై కేంద్రం, ఎన్టీఏ వివరణాత్మక అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ముఖ్యంగా పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానానికి మార్చే అవకాశాలు, డేటా భద్రత వంటి అంశాలపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని ధర్మాసనం కోరింది. “కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు మారితే డేటాను ఎలా రక్షిస్తారు?” అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.‘ఇక ఇలా కొనసాగనివ్వం’నీట్ వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “వరుస తప్పిదాలను ఇక కొనసాగించలేం. ఈ అంశాన్ని చాలా దగ్గరగా పర్యవేక్షిస్తాం” అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. విద్యార్థుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సమగ్ర ప్రణాళికను కోర్టు ముందు ఉంచేందుకు మరింత సమయం కావాలని కోరారు.ఇటు హైకోర్టులోనూ.. మరోవైపు నీట్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత అంశం కూడా కోర్టు ముందుకు వచ్చింది. ఇంటర్నెట్ నిలిపివేతను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. నిరసనల సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధమేనా? అనే అంశంపై కోర్టు పరిశీలించనుంది.ఆందోళనలు.. రాజకీయ వేడినీట్ పేపర్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో ఉద్రిక్తత చోటుచేసుకోవడం, పోలీసులు బలప్రయోగం చేశారన్న ఆరోపణలు వివాదానికి దారితీశాయి. ఇప్పటికే నీట్ లీక్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో పలువురిని అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో.. నీట్ పరీక్షల భవిష్యత్ విధానం, భద్రతా ప్రమాణాలు, సంస్కరణలపై కేంద్రం తీసుకునే చర్యలపై ఆసక్తి నెలకొంది. -
ఈరోజు రాత్రి మేమంతా అరెస్ట్.. సీజేపీ దీప్కే సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాత్రికి సీజేపీ టీమ్ మొత్తాన్ని అరెస్ట్ చేయవచ్చు అని చెప్పుకొచ్చారు. తాము అరెస్ట్ అయినా ఉద్యమం శాంతియుతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దీంతో, ఈరోజు ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన అభిజీత్ దీప్కే...‘ఈ రాత్రికి సీజేపీ టీమ్ మొత్తాన్ని అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేసి మరో తప్పు చేయవద్దని ప్రభుత్వానికి చెబుతున్నా. అరెస్ట్‌తో ఆందోళన మరింత ఉధృతం అవుతుంది. మేము అరెస్ట్ అయినా ఉద్యమం శాంతియుతంగా సాగాలి. అలాగే, సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల నిరాహార దీక్షను విరమించడం శుభపరిణామం. ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఆరోగ్యం పట్ల మాకు ఆందోళన ఉండేది. 26 రోజులకు పైగా ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఈ దేశానికి ఎంతో విలువైనది” అని వ్యాఖ్యలు చేశారు.VIDEO | Delhi: “According to new input, CJP team members may be arrested tonight”, says CJP Founder Abhijeet Dipke, urging protesters to continue movement across nation even after arrest.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/6AW7aACtxQ— Press Trust of India (@PTI_News) July 24, 2026అయితే, తమ ఉద్యమం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ ధర్నా కొనసాగుతుందని ప్రకటించారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మాకు మరే పరిష్కారం ఆమోదయోగ్యం కాదు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, పరీక్షా వ్యవస్థలో జవాబుదారీతనం వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది’ అని దీప్కే తేల్చి చెప్పారు.కేంద్ర మంత్రులతో జరగనున్న సమావేశంపై స్పందిస్తూ... చర్చలు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా తటస్థ వేదికలోనే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ ప్రధాన డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ వివాదం, పోటీ పరీక్షల్లో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.#WATCH | Delhi: Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "Our dharna at Jantar Mantar will continue until Dharmendra Pradhan resigns. We are very relieved that Sonam Wangchuk has broken his hunger strike as it had been more than 26 days. His life is… pic.twitter.com/SSyJANfcXA— ANI (@ANI) July 24, 2026మరోవైపు.. సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని, అది నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జేపీ నడ్డా గారితో సమావేశం ఉంది. ఈ సమావేశానికి జితేంద్ర సింగ్ గారు కూడా హాజరయ్యే అవకాశం ఉందని మాకు సమాచారం. చర్చల్లో ఏం జరిగిందో మీడియాకు వెల్లడిస్తాం” అని తెలిపారు.సోనమ్ గారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో దీక్ష విరమించాలని మేము నిరంతరం కోరుతున్నాం. మా రెండు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇచ్చింది. శాంతియుత నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, అలాగే బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది’ అని చెప్పుకొచ్చారు. అయితే, ఈ హామీలతో పోరాటం ముగిసినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోపై కూడా ఆయన స్పందించారు. ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి పెరిగిందని వ్యాఖ్యానించారు. ‘మొదటిసారి ప్రధానమంత్రి అర్ధరాత్రి 12 గంటలకు సెల్ఫీ వీడియో విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని ద్వారా పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. యువత భవిష్యత్తుపై ప్రభుత్వం నిజంగా సీరియస్‌గా ఉంటే, అత్యంత కఠినమైన చర్యగా ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలి’ అని రంకా అన్నారు. -
కేంద్రంతో చర్చలకు సీజేపీ గ్రీన్‌సిగ్నల్.. వేదిక ఫిక్స్
ఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమం కీలక మలుపు తిరిగింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని ఇప్పటికే ప్రకటించిన సీజేపీ నాయకత్వం, తటస్థ వేదికలోనే సమావేశం నిర్వహించాలని చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించినట్లు పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఇరు పక్షాల మధ్య చర్చలు జరగనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా గురువారం అర్ధరాత్రి సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రేపు చర్చలకు పిలుపు వచ్చింది. తటస్థ వేదికలో సమావేశం నిర్వహించాలని మేము కోరాం. ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది. చర్చలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాను వేదికగా ఎంపిక చేశారు’ అని తెలిపారు. ఈ చర్చలు సానుకూలంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.#WATCH | Delhi: Saurav Das, Chief Spokesperson, Cockroach Janta Party, says, "... Tomorrow, a discussion has been called for, we are very happy that the government has agreed to our request that it be at a neutral venue. The Constitution Club of India has been chosen..." (23.07) pic.twitter.com/MoK1DgdgJ5— ANI (@ANI) July 24, 2026కాగా, నిరసనల వేళ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చర్చల కోసం పలుమార్లు ఆహ్వానం పంపినప్పటికీ, కేంద్ర మంత్రుల నివాసాల్లో సమావేశాలకు తాము హాజరుకాబోమని సీజేపీ స్పష్టం చేసింది. జంతర్ మంతర్‌లోనే లేదా అందరికీ ఆమోదయోగ్యమైన తటస్థ వేదికలోనే చర్చలు జరగాలని పట్టుబట్టింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం తటస్థ వేదిక ప్రతిపాదనను అంగీకరించినట్లు తెలుస్తోంది.దేశవ్యాప్తంగా జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు, యువతలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో పారదర్శకత వంటి అంశాలపై ఈ ఉద్యమం ప్రారంభమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, బాధ్యులపై కఠిన చర్యలు, బాధిత కుటుంబాలకు న్యాయం వంటి డిమాండ్లతో సీజేపీ ఉద్యమం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ప్రధానమంత్రి మోదీ పరీక్షా పేపర్ లీకుల కేసులపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ, అది తమ ప్రధాన డిమాండ్లకు పూర్తి పరిష్కారం కాదని సీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జరగనున్న శుక్రవారం చర్చలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ సమావేశంలో ప్రభుత్వం ఉద్యమకారుల డిమాండ్లపై ఎలాంటి హామీలు ఇస్తుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
జంతర్ మంతర్ లో మీమ్స్.. రీల్స్
-
మోదీ వీడియో.. వాంగ్‌చుక్ దీక్ష విరమణపై సీజేపీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నీట్ నిరసనల్లో భాగంగా చేపట్టిన తన దీక్షను విరమించారు. గురువారం రాత్రి మేదాంత ఆస్పత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు ఆయనకు స్వయంగా నీళ్లు తాగించారు. ఆ సమయంలో వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉన్నారు. అయితే.. వాంగ్‌చుక్ దీక్ష ముగింపుపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పందించింది. వాంగ్‌చుక్ దీక్ష విరమించడంతో తాము కాస్త ఉపశమనం పొందామని, ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు సీజేపీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వాంగ్‌చుక్ దీక్ష విరమణతో ఆందోళనలు ఆగిపోతాయా? అనే అనుమానాలకు అభిజిత్ పుల్‌స్టాప్ పెట్టారు. అసాధారణ ధైర్యం.. గొప్ప త్యాగం“26 రోజుల పాటు అసాధారణ ధైర్యంతో, త్యాగంతో పోరాడిన సోనమ్ సర్‌కు ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి దేశం మొత్తం ఆలోచించేలా చేశారు. ఈ దేశానికి మీ జీవితం ఎంతో విలువైనది” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. అయితే వాంగ్‌చుక్ దీక్ష విరమించినప్పటికీ తమ ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది. We are relieved and grateful that Sonam sir has ended his hunger strike after 26 days.Thank you, sir, for your extraordinary courage and sacrifice. By putting your own life on the line, you awakened the conscience of an entire nation. Your life is far too precious to this…— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కేంద్రం తీసుకునే కఠిన చర్య. అది నెరవేరే దాకా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన శాంతియుత నిరసనలు కొనసాగుతాయి అని స్పష్టం చేశారాయన. వీ సపోర్ట్ వాంగ్‌చుక్ అనే డీపీని అభిజిత్ ఇంకా ఎక్స్ కొనసాగిస్తుండడం గమనార్హం.కేంద్రం ఇచ్చిన హామీలేంటి?వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం తాను దీక్ష విరమించినట్లు సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు. దేశంలో హింస చోటుచేసుకునే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని షరతులతో దీక్షను ముగించినట్లు వెల్లడించారు. తాను అంగీకరించిన షరతులను త్వరలోనే వీడియో ద్వారా వివరిస్తానని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి హింసకు తావివ్వొద్దని కోరారు.కాగా, జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయబోమని కేంద్రం హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.జూన్ 28 నుంచి నిరాహార దీక్షపరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకు ముందే జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతుగా నిలిచారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు ఆయనను జంతర్ మంతర్ నుంచి తరలించి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు అనుమతితో మెదాంత ఆస్పత్రికి మార్చారు. 26 రోజుల దీక్షలో ఆయన సుమారు 11 కిలోల బరువు కోల్పోయినట్లు సమాచారం.పేపర్ లీకులపై కేంద్రం కీలక చర్యలుపరీక్ష పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసుల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు.. ఢిల్లీ పరిధిలో రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లో స్పెష్టల్ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్ను నియమించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారించనుంది. ఇటు విద్యాశాఖలో ఉన్నతాధికారుల మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని బదిలీ చేసి ఆయన స్థానంలో నరేశ్ గంగ్వార్‌ను నియమించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా టీ.కే. అనిల్‌కుమార్‌ను నియమించింది.మోదీ వీడియో మెసేజ్.. రాహుల్ కౌంటర్ప్రధాని మోదీ తొలిసారిగా వీడియో సందేశం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నీట్ పేపర్ లీక్ అతిపెద్ద సమస్య.. పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పేపర్ లీకులపై కఠిన చర్యలు ఉంటాయని.. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని.. పలువురు అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారాయన. విద్యా సంస్కరణలు తీసుకొస్తామని కూడా చెప్పారు. అంతేకాదు ఇవాళ్టి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయని ఓ వీడియో సందేశంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెడతామని ప్రకటించారు. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026అలాగే సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణపైనా మోదీ స్పందించారు. వైద్యుల సలహా మేరకు వాంగ్‌చుక్ తన దినచర్యను కొనసాగించాలని.. త్వరగా కోలుకొని మునుపటి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు.అయితే.. మోదీ ట్వీట్‌పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మంత్రితో రాజీనామా చేయించకుండా.. విద్యార్థుల్ని అవమానించొద్దు అని రీట్వీట్ చేశారు. దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి.. ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని, విద్యార్థులు కోరుకునేది ఇదేనని అన్నారాయన. అలాగే లీకులకు పాల్పడిన వాళ్లపై తక్షణమే, కఠిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన వాళ్లపైనా చర్యలకు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. Mr. Modi, our students are demanding Dharmendra Pradhan’s resignation.Don’t insult their intelligence with this pathetic midnight video. 1. Sack Pradhan.2. Punish those who beat students.3. Apologise https://t.co/7SLB6pQqZx— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2026మాకు రాజీనామానే కావాలిఇటు మోదీ వీడియో సందేశంపై సీజేపీ స్పందించింది. కేంద్రం తీసుకున్న చర్యలు సరిపోవని.. మంత్రి రాజీనామా చేయాల్సిందేనని అంటోంది. జంతర్ మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. “ఒక్క మంత్రి పదవి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే గొప్పది కాదు. విద్యార్థుల న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని సీజేపీ తెలిపింది. మరోవైపు సీజేపీతో ఏ టైంలోనైనా.. ఎక్కడైనా చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం.. రాజీనామా డిమాండ్ విషయంలో మాత్రం తలొగ్గే తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాలు ఇస్తోంది. ఇవాళ మధ్యాహ్నాం సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. -
ప్లకార్డ్‌లో పంచ్‌లైన్... నిరసనలో రీల్ వైబ్
లాఠీలతో కొడితే థ్యాంక్యూలు చెప్తున్నారు. చెదరగొట్టడానికి వాటర్ కానన్ వాడితే రెయిన్ డాన్స్ చేస్తున్నారు. వాళ్ల పాటే నినాదం. వాళ్ల వ్యంగ్యమే ప్రశ్న. సెల్‌ఫోన్ పట్టుకున్న సైన్యంలా ఉంటున్నారు. జెన్ జి నిరసనకు ఫార్మాట్ మారింది. సీరియస్ ఇష్యూ + సినిమా పంచ్ + సోషల్ మీడియా... అదే ‘జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్’.ఢిల్లీ జంతర్ మంతర్‌లో ‘నీట్’ ప్రశ్నాపత్రానికి సంబంధించి తాజా నిరసనలో టియర్ గ్యాస్ గుప్పుమంది. అది చూసిన ఒక కుర్రాడు వెంటనే ప్లకార్డ్ మీద ఇలా రాశాడు. ‘గురూ... నేను యమునకు ఆ వైపున ఉంటా. ఇంతకన్నా కంపు రోజూ తెలుసు. ఇదసలు లెక్కే కాదు’....అక్కడే ఉన్న మరో కుర్రాడు ఇంకో ప్లకార్డ్ పట్టుకున్నాడు. దాని మీద గాంధీగారి బొమ్మ ఉంది. కింద కామెంట్– ‘ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే సీజన్1 హీరోని రంగంలో దించాల్సి వచ్చింది’... అంటే అహింసామార్గ ప్రదాతనే రంగంలోకి దించాల్సి వచ్చిందని అర్థం.మరో ప్లకార్డ్ ఒకమ్మాయి పట్టుకుంది. దాని మీద కామెంట్– ‘నాకు ఎవరూ ఫండింగ్ చేయలేదు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని ఉచితానికే అసహ్యించుకుంటున్నా’...తమ నిరసనకు స్పందించని పెద్దలకు చురక వేస్తూ మరో పోస్టర్. దానిపై మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్‌లోని సర్క్యూట్ పాత్ర. కింద కామెంట్– ఓయ్ సర్క్యూట్. రాంగ్ పర్సన్‌ని ఎత్తుకొచ్చావ్ స్వామీ.మామూలుగా నిరసనల్లో లాఠీచార్జీ జరిగితే పారిపోతారు. కాని నిరసనకు దిగిన జెన్ జి తరం వెనక్కి తగ్గలేదు. వాటర్ కానన్ కొట్టినా బదులుగా ‘రెయిన్ డాన్స్’ చేశారు. ‘Fitness plan: Running from police’ అని బోర్డు పట్టుకున్నారు.జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్ఒకప్పుడు నిరసన అంటే నల్ల జెండాలు, గొంతు చించుకునే నినాదాలు. కానీ 2026లో జెన్ జి ఆ డెఫినిషన్ను చెరిపేసింది. వాళ్లకు ఆగ్రహం ఉంది. కానీ ఆ ఆగ్రహాన్ని మీమ్‌గా, రీల్‌గా, పాటగా మారుస్తున్నారు. పేపర్ లీక్, నిరుద్యోగం, అవినీతి– సీరియస్ ఇష్యూలే. కానీ చెప్పే తీరు మాత్రం క్రియేటివ్. ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, జైపూర్ కావచ్చు... జెన్ జికి కోపం వస్తే స్టయిల్ ఇదే. స్పందించని వ్యవస్థను ఎద్దేవా చేస్తూ ‘నా ఎక్స్ (బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్) కూడా నన్ను ఇంతగా బాధించ లేదు’ అని ప్లకార్డు పట్టుకొని నిలబడుతున్నారు. ఇలా డిజిటల్ కల్చర్‌ను, మీమ్స్ భాషను నిరసనకు వాడుకోవడాన్నే ‘జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్’ అంటున్నారు. బాలీవుడ్ పాటలు పాడటం, సంగీత కచ్చేరీలు, ప్రబోధ గీతాల ఆలాపన.. అన్నీ అలౌడ్.గెట్ రెడీ విత్ మీ (G-RWM)జెన్ జి యువతీ యువకులు ఒక దగ్గరకు కూడటానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఢిల్లీ ‘చలో సంసద్’ నిరసన కోసం ప్రిపరేషన్ అంతా సోషల్ మీడియా రీల్స్ నుంచే ప్లాన్ అయింది. ‘గెట్ రెడీ విత్ మీ’ అంటూ రీల్స్ చేస్తూ యువతను సమీకరించారు. టియర్ గ్యాస్‌ను తట్టుకోవడానికి స్విమ్మింగ్ గాగుల్స్, ఢిల్లీ ఉక్కపోతను తట్టుకోవడానికి మినీ యూఎస్బీ ఫ్యాన్లు, విసనకర్రలు దగ్గర పెట్టుకుని బయలుదేరి వచ్చారు. ఎయిర్‌పోర్టుల నుంచి, రైలు కంపార్ట్మెంట్లలో నుంచి స్టోరీలు పెడుతూ ఏదో మ్యూజిక్ కాన్సెర్ట్‌కు వెళ్తున్నంత ఊపుతో దేశ రాజధానికి తరలివచ్చారు. ‘మా గుండెల్లో ఇంక్విలాబ్.. మా చేతుల్లో ఇన్ స్టాగ్రామ్!’ అనే వన్–లైనర్ ఈ తరం నిరసన తత్వం. ధర్మాగ్రహం కలిగి, శాంతియుతంగా మార్పు తేవాలని ప్రయత్నిస్తున్న ఈ తరాన్ని, వ్యంగ్యమనే బాణాలతో ప్రత్యర్థి మనసు మార్చాలని చూస్తున్న ఈ భావితరం స్వరాన్ని ‘నో’ అని నొక్కేస్తే రేపు వాళ్లు మాట్లాడటమే మానేస్తారు. ‘మేమున్నాం’ అని భుజం తడితే ఈ దేశానికి క్రియేటివ్, కరేజియస్ లీడర్స్ దొరుకుతారు. పంచ్‌లైన్ తో మొదలైన ఈ నిరసన రేపు పాలసీతో అంతం కావాలి. అప్పుడే ఈ ‘సెల్‌ఫోన్ సైన్యం’ నిజమైన దేశభక్తి సైన్యంగా మారుతుంది. వారి దారి వినూత్నంఢిల్లీలో పోలీసుల లాఠీచార్జి జరిగి, సాయంత్రం వాళ్లు డ్యూటీ దిగుతుంటే లాఠీ దెబ్బలు తిన్న యువతీ యువకులంతా ‘థ్యాంక్యూ సర్... చాలా బాగా డ్యూటీ చేశారు’ అని రోడ్డు పొడుగునా నిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇలా చేయడం తిట్టడం కంటే చాలా ఎక్కువ. ‘ఇంటికెళ్లి గర్వంగా ముఖం చూపించండి’ అని కూడా అన్నారు. తమను కొట్టిన వారికే మంచి నీళ్లు అందించడం, గులాబీపూలు ఇవ్వడం జెన్ జి ప్రొటెస్ట్ స్టయిల్. పోలీసులు కొడుతుంటే జాతీయ జెండాను చుట్టుకుని నిలబడటం, సారే జహాసే అచ్ఛా పాడటం.... జనగణమన ఆలపించడం.... కచ్చితంగా గాంధీ మార్గం.– కె -
నేటి యువత చూపుతున్న నైతిక శక్తి
ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరుగుతున్న విద్యార్థుల నిరసన... శాంతియుతంగా వ్యవస్థలను ప్రశ్నించే ధైర్యం ఉన్న వారే ఒక దేశపు ప్రజాస్వామ్య గాథను రాస్తారనే చిరస్థాయి సూత్రాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. బ్రిటిష్ పాలనలో జరిగిన స్వదేశీ ఉద్యమం నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు; స్వాతంత్య్రం తరువాత గుజరాత్‌లోని నవనిర్మాణ ఉద్యమం నుంచి 1970ల జేపీ (జయప్రకాశ్ నారాయణ్) జేపీ ఉద్యమం వరకు... వ్యవస్థ న్యాయమార్గం నుంచి తప్పిపోతోందని భావించిన ప్రతిసారీ విద్యార్థులు సవాలు విసిరారు. వారి పాత్ర తరగతి గదులకే పరిమితం కాలేదు. జంతర్ మంతర్ నిరసన ఆ సంప్రదాయానికి కొనసాగింపు మాత్రమే.సత్యాగ్రహ శక్తిసామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన అనేక వీడియోల్లో, పోలీసులు బలప్రయోగం చేసినప్పటికీ విద్యార్థులు హింసతో ప్రతిస్పందించకుండా నిలిచిన దృశ్యాలు కనిపిస్తాయి. తమపై ఏమి జరిగినా శాంతియుతంగానే ఉంటామని కొందరు పోలీసుల ఎదుట నిలబడి చెప్పారు. వారు తెలుసుకుని చేసినా, తెలియక చేసినా అది మహాత్మా గాంధీ ‘సత్యాగ్రహం’గా అభివర్ణించిన సత్యశక్తినే ప్రతిబింబించింది. ‘మానవాళి చేతిలో ఉన్న అత్యంత శక్తిమంతమైన ఆయుధం అహింస’ అని గాంధీజీ అన్నారు. ఆయన దృష్టిలో సత్యాగ్రహి లక్ష్యం ప్రత్యర్థిని ఓడించడం కాదు, సమాజ అంతరాత్మను మేల్కొల్పడం. జంతర్ మంతర్ నిరసన ద్వారా విద్యార్థులు సరిగ్గా ఇదే చేశారు. విద్య అంటే అసలు ఏమిటన్న మరింత లోతైన ప్రశ్నను కూడా ఈ నిరసన లేవనెత్తుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావప్రకటన స్వేచ్ఛతో పాటు శాంతియుతంగా సమావేశ మయ్యే హక్కును హామీ ఇస్తోంది. ఎందుకంటే భయపడకుండా అధికారాన్ని ప్రశ్నించగల విజ్ఞానవంతులైన పౌరులపైనే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి. అందువల్ల భిన్నాభిప్రాయం ప్రజాస్వామ్యానికి మినహాయింపు కాదు; దాని ప్రాథమిక అవసరాల్లో అది ఒకటి. ఏ రాజకీయ సిద్ధాంతం అధికారంలో ఉన్నా, ప్రజా శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వ బాధ్యతే కావచ్చు. కానీ అదే సమయంలో శాంతియుత నిరసనను దేశానికే ముప్పుగా పరిగణించకుండా చూడటం కూడా ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వ బాధ్యత అనేది గుర్తెరగాలి.ధర్మబద్ధమైన కార్యాచరణ‘ప్రభుత్వాలు తాత్కాలికమైనవి; ప్రజాస్వామ్య సంస్థలు శాశ్వ తమైనవి’ అని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని దేశాన్ని విమర్శించినట్టుగా భావించడం... భారత స్వాతంత్య్ర ఉద్యమం నెలకొల్పాలనుకున్న రాజ్యాంగ సంస్కృతినే బలహీన పరుస్తుంది. ఇది ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న ‘సనాతన ధర్మం’ వైపునకు తీసుకువెళుతుంది. ప్రస్తుత రాజకీయ చర్చల్లో సనాతన ధర్మాన్ని కేవలం మతపరమైనదిగా చిత్రీకరిస్తున్నారు. కానీ భారతీయ శాస్త్రీయ తాత్విక సంప్రదాయంలో దానికి ఎంతో విస్తృతమైన అర్థం ఉంది. ‘ధర్మం’ అంటే సమాజాన్ని నిలబెట్టేది– న్యాయం, సత్యం, కరుణ, కర్తవ్యం, నైతిక క్రమం. అది కేవలం ఆచారాలు, కర్మకాండలు కాదు; నైతిక ప్రవర్తన.ధర్మం లేని అధికారానికి చెల్లుబాటు ఉంటుందా అనే ప్రశ్న మహాభారతంలో చాలాసార్లు కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు అధికారంపై మమకారంతో అన్యాయాన్ని చూడలేకపోయాడు. దుర్యోధనుడి దురాశ ఒక రాజ్యాన్నే నాశనం చేసింది. భీష్ముడు జ్ఞానవంతుడూ, నిష్కళంకుడూ అయినప్పటికీ, చక్రవర్తి పట్ల తన విధేయత కారణంగా అధర్మాన్ని ఎదిరించలేక విషాదపాత్రగా మిగిలాడు. న్యాయాన్ని వదిలిపెట్టిన పాలకులు చివరకు తమను తామే నాశనం చేసుకుంటారని విదురుడు పదేపదే హెచ్చరిస్తాడు. అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన ఉపదేశం అధికారాన్ని సమర్థించడం కాదు; ధర్మ బద్ధమైన కార్యాచరణకు మద్దతు ఇవ్వడం. ఈ సందేశం శాశ్వత మైనది. ధర్మం రాజకీయ అధికారానికి మించినది. పాలకుల చెల్లు బాటు నైతిక పాలన పట్ల వారి నిబద్ధతపైనే ఆధారపడి ఉంటుంది.ఈ అవగాహన భారత రాజ్యాంగంతో కూడా సారూప్యత కలిగి ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, న్యాయం వంటి విలువలు భారతీయ నాగరికతపై పాశ్చాత్య ప్రపంచం రుద్దినవి కావు. ఉప నిషత్తుల నుంచి బుద్ధుడి వరకు, అశోకుని నుంచి బసవన్న వరకు, కబీర్ నుంచి అంబేడ్కర్ వరకు... భారతీయ తాత్విక సంప్రదా యాల్లో ఇవి లోతుగా ప్రతిధ్వనిస్తాయి. భారత రాజ్యాంగ నైతికత, భారత నాగరికత నైతిక సంప్రదాయం పరస్పర విరోధాలు కావు; అత్యుత్తమ రూపంలో అవి ఒకదానిని మరొకటి బలోపేతం చేస్తాయి.పూర్తికాని స్వాతంత్య్ర పోరాటంభారతదేశం 1947లో రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించింది. అయితే ఆ స్వేచ్ఛకు నైతిక పునాదులను కాపాడుకునే పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులు ప్రజాస్వామ్యం ఎన్నికల ద్వారా మాత్రమే నిలవదనీ, ప్రజా అంతరాత్మ ద్వారానూ నిలుస్తుందనీ గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సమాధానం కేవలం అధికార కేంద్రాల్లో దొరకదు. స్వతంత్ర ఆలోచనను పెంపొందించే తరగతి గదుల్లో, జవాబుదారీతనాన్ని ఆహ్వానించే సంస్థల్లో, భయానికి సత్యాన్ని బలివ్వని పౌరుల్లో అది కనిపిస్తుంది. అధికా రాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు; గణతంత్రంపై విశ్వాసాన్ని వ్యక్తపరిచే చర్య అని జంతర్ మంతర్‌లో యువత గుర్తుచేస్తోంది. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు నిరసన స్వరం కాదు, పౌరుల మౌనం!డా‘‘ రఘు చలిగంటివ్యాసకర్త ఫ్రౌన్హోఫర్ హెచ్‌హెచ్‌ఐ (జర్మనీ)సీనియర్ పరిశోధకుడు, ‘తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ’ వ్యవస్థాపకుడు -
కాక్రోచ్ ఆందోళన .. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ: సీజేపీ నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఉన్నత విద్యాశాఖ నూతన కార్యదర్శిగా నరేశ్ పాల్ గంగ్వార్ని నియమించింది. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.ప్రస్తుత కార్యదర్శి వినిత్ జోషిని పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసింది.అదే విధంగా ప్రధాని ఆదేశాలతో నీట్ లీకేజ్‌పై ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ పరిధిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సేవలు జరగనున్నాయి. స్పెషల్ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్ని నియమించింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను విచారణ చేపట్టడం కొరకే స్పెషల్ కోర్టున ఏర్పాటు చేసినట్లు తెలిపింది. -
రుద్రమదేవిలా హైదరాబాద్ నుంచి జంతర్ మంతర్‌కు అమ్మాయి
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. చాలా మంది యువతులు ఒంటరిగానే జంతర్ మంతర్‌కు వస్తున్నారు. ఓ అమ్మాయి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒంటరిగా వెళ్లి వీడియో తీసి పోస్ట్ చేసింది. ‘‘అందరికీ హాయ్. నేను ఇప్పుడు నిరసనలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్తున్నాను. నేను ఏం చేస్తున్నానో కూడా నాకు పూర్తిగా తెలియడం లేదు. ఇది ఎలా చేస్తానో కూడా తెలియదు. నేను ఎక్కడికి వెళ్తున్నానో మా తల్లిదండ్రులకు చెప్పలేదు. బయటకు వెళ్తున్నానని మాత్రమే చెప్పాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తున్నాను. నేను ఒంటరిగానే వెళ్తుండటంతో చాలా భయంగా ఉంది. ఢిల్లీలో నాకు ఎవరూ తెలియరు. అయినా సరే... ఎలాగోలా ధైర్యం చేసి బయల్దేరాను. నాకు తెలుసు...’’ అని ఆమె వ్యాఖ్యానించింది.Many girls are coming solo to Jantar Mantar.She is from Hyderabad.@Cockroachisback pic.twitter.com/MvK7CWd4XE— 🪳Against Corruption (@akashuchani08) July 22, 2026ఒకరు ఎక్స్‌లో ఇదే వీడియోను పోస్ట్ చేస్తూ... ‘‘ఈమె హైదరాబాద్‌కు చెందిన యువతి. ఈమె పేరు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన దిశ. దిశ ఢిల్లీ చేరుకుంది. విమానాశ్రయం నుంచి ర్యాపిడో బైక్‌లో నేరుగా నిరసన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ విద్యార్థులతో కలిసి నిరసనలో పాల్గొంటోంది.తాను క్షేమంగా ఉన్నానని, ఎలాంటి ఇబ్బంది లేదని దిశ తెలిపింది. ఢిల్లీ చేరిన వెంటనే తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది. ముందుగానే చెప్పి ఉంటే తల్లిదండ్రులు ఒప్పుకునే వారు కాదనే ఉద్దేశంతో ముందస్తుగా చెప్పలేదని తెలిపింది. అయితే తనకు నమ్మకమైన ఓ స్నేహితుడికి ప్రతి విషయం చెబుతూ, ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చింది. దారిలో కలిసిన మంచి మనసున్న వారు ఆమెకు నీరు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు. దిశ రుద్రమదేవి, సమ్మక్క–సారలమ్మ, చాకలి ఐలమ్మ నేలపై పుట్టిన యువతి. తెలంగాణ మహిళలు ఒకప్పుడు తుపాకీ చేతబట్టి రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. అలాంటి ధైర్యసాహసాల సంప్రదాయం నుంచి వచ్చిన వారే వారు. దిశపై ఎంతో గర్వంగా ఉంది. మనందరి గొంతును ఆమె బలంగా వినిపిస్తుందనే నమ్మకం ఉంది. ముందుకు సాగు దిశ. ఇంక్విలాబ్ జిందాబాద్’’ అని అందులో పేర్కొన్నారు.దేశ వ్యాప్తంగా ఆందోళనలునీట్ యూజీ పరీక్షలో అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో జూలై 24న దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. ప్రశ్నపత్రం లీక్ అంశంపై ప్రభుత్వం పలుమార్లు హామీ ఇచ్చినా, చర్చలకు ఆహ్వానించినా సీజేపీ తన ఆందోళన కొనసాగిస్తోంది.దేశవ్యాప్తంగా పోలీసుల దౌర్జన్యానికి గురైన బాధితులకు సంఘీభావంగా ఈ నిరసన చేపడుతున్నామని సీజేపీ తెలిపింది. అనుమతులు, ఇతర ఏర్పాట్ల విషయంలో విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు కలిసి పనిచేయాలని సూచించింది. "సమావేశాల ముందు విద్యార్థుల డిమాండ్లను గట్టిగా చదవాలి. పోలీసుల దౌర్జన్యానికి గురైన వారికి సంఘీభావం ప్రకటించాలి. ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతా కీ జై" అని ప్రకటనలో పేర్కొంది. "జై హింద్, భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్" వంటి సానుకూల నినాదాలే ఇవ్వాలని, జరిగిన ప్రతిదాన్ని రికార్డు చేయాలని ఆందోళనకారులకు సూచించింది.ఏ పరిస్థితి ఎదురైనా శాంతియుతంగా, అహింసా మార్గంలోనే నిరసన కొనసాగించాలని సీజేపీ తెలిపింది. అనుమతి ఇచ్చిన ప్రాంతంలోనే ఉండాలని, అనుమతి పొందిన మార్గాల్లోనే వెళ్లాలని, రెచ్చగొట్టే, పరువునష్టం కలిగించే, మత విద్వేషం రెచ్చగొట్టే లేదా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. Found her name. She is Disha from Hyderabad. She reached Delhi. From the airport took a rapido and directly and reached the protest site. She is there with the protesting students.She says she is safe and absolutely fine. The moment she landed in Delhi, she called her… pic.twitter.com/R4FHNa8311— Revathi (@revathitweets) July 23, 2026 -
భారత్‌లో అంత బాగా నిరసనలు.. మనమేమో చేతగానోళ్లలా..
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనను గమనిస్తున్న పాకిస్థానీయుల్లో ఆసక్తితో పాటు అసూయ కనిపిస్తున్నాయి. "పాకిస్థాన్‌లో ఇలా నిరసనలు ఎందుకు జరగవు?" అని వాళ్లకు వాళ్లే ప్రశ్నించుకుంటున్నారు.నీట్ ప్రశ్నపత్రం లీకులపై జరుగుతున్న నిరసనలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. యువత ముందుండి నడిపిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఈ ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. సరిహద్దు అవతల పాకిస్థానీయులు ఆశ్చర్యంతో వీటిని గమనిస్తున్నారు. పాటలు, నినాదాలు, ఉద్యమ లక్ష్యం అన్నింటినీ విశ్లేషిస్తున్నారు.క్రికెట్ కోసమైతే వస్తారు.. పాకిస్థాన్ యువత ఎందుకు వీధుల్లోకి రావడం లేదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు ఆ దేశీయులు. ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్ వద్ద లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు చూసే జనం.. అక్కడ ఇతర కారణాలపై (సమస్యలపై) మాత్రం ఎందుకు గుమిగూడడం లేదని ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి సమాధానం ఏంటంటే "పాకిస్థాన్‌లో అసలు ప్రజాస్వామ్యమే లేదు" అని కంటెంట్ క్రియేటర్ మహ్మద్ వలీద్ చెప్పిన మాటతో చాలామంది ఏకీభవిస్తున్నారు.‘‘డాన్’’ పత్రిక మాజీ సంపాదకుడు సిరిల్ అల్మీడా జంతర్ మంతర్ నిరసనలను "రావల్పిండీకి హెచ్చరిక"గా అభివర్ణించారు. రావల్పిండి నగరంలోనే పాకిస్థాన్ సైన్య ప్రధాన కార్యాలయం ఉంది. తమ దేశంలో ఇలాంటి విప్లవం రావడం లేదని నిరాశ చెందుతున్నారు.పోలీసుల దౌర్జన్యానికి వస్తే రెండు దేశాల్లోనూ పరిస్థితి ఒకేలా ఉంటుందని అంటున్నారు. వలీద్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియోలో భారత యువత నుంచి పాకిస్థాన్ యువత నేర్చుకోవాల్సిన విషయాలను వివరించారు. నిరసన చేయాలంటే పెద్ద స్థాయిలో చేయాలని ఆయన అన్నారు. "పాకిస్థానీయులు తమ సంకల్పాన్ని ఎప్పుడూ చూపలేరు. 'నాకు ఏమాత్రం పట్టదు' అనే ధోరణితో ఉంటారు. డిగ్రీ తీసుకుని దేశం వదిలి వెళ్లడంపైనే మాట్లాడుతుంటారు. ఇది ఓడిపోయిన వారి ప్రవర్తన" అని చెప్పారు.బంగ్లా, భారత్‌లోనే నిరసనలు మరో పాకిస్థాన్ కంటెంట్ సృష్టికర్త నోమీ సయ్యద్ మాట్లాడుతూ.. "ఈ ఉపఖండంలో బంగ్లాదేశీయులు మార్పు తీసుకురాగలుగుతున్నారు. భారతీయులు నిరసన చేయగలుగుతున్నారు. పాకిస్థాన్‌లో మాత్రం అలాంటి వారు లేరు. మా దేశంలో ఇలాంటి విప్లవం ఎప్పుడూ రాదు" అని ఆయన అన్నారు.మరో ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్ మహ్వాష్ అజాజ్ మాట్లాడుతూ.. భారత్‌లోని నిరసనలకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని చెప్పారు. "వందే మాతరం పాడుతూ దేశ అభివృద్ధి కోసం నిరసన చేస్తారు. కానీ, పాకిస్థానీయులను మాత్రం ఇక్కడ వేర్పాటువాదులుగా ముద్ర వేస్తారు" అని అన్నారు.అయితే అందరూ ఇదే అభిప్రాయంతో లేరు. మానవ హక్కుల పాత్రికేయురాలు అలిఫియా సోహైల్ మాట్లాడుతూ.. "పాకిస్థాన్ నిరసనల గురించి మీరు మాట్లాడే తీరు, భారత మీడియా భారత్‌లోని నిరసనల గురించి మాట్లాడే తీరులానే ఉంది" అని అన్నారు."భారత కంటెంట్ సృష్టికర్తలు, ఇన్ఫ్లూయెన్సర్లు తమ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంటున్నారు. ఇక్కడ మాత్రం అణచివేతకు పాల్పడేవారి గొంతుకగా మారేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. వెన్నెముక లేని వర్గం" అని అబ్దుల్లా అనే ఎక్స్ యూజర్ పేర్కొన్నారు. -
మోదీ ట్వీట్‌కు రాహుల్, సీజేపీ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ సహా పోటీ పరీక్షల పేపర్ లీకుల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసింది కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించాయి.ప్రధాని మోదీ స్పందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పేపర్ లీకులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఎవరినీ వదిలిపెట్టం’’ అని ప్రధాని స్పష్టం చేశారు.రాహుల్ గాంధీ ఘాటు స్పందనప్రధాని ట్వీట్‌పై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’’ అంటూ విమర్శించారు. పేపర్ లీకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన రాహుల్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.మంత్రి రాజీనామా చేయాల్సిందే:సీజేపీమరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్న సీజేపీ కూడా ప్రధాని మోదీ ట్వీట్‌పై స్పందించింది. పేపర్ లీకుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. అలాగే విద్యార్థులపై దాడులు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఉద్ఘాటించింది. అప్పటిదాకా తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేసింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేపీ కోరింది. -
బీజేపీపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉత్కంఠగా మారాయి. గత రాత్రి జరిగిన ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే స్పందిస్తూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ నిరసనలను ఉద్దేశపూర్వకంగా హింసాత్మకంగా మార్చేందుకు బీజేపీకి చెందిన వ్యక్తులు చొరబడ్డారని ఆయన ఆరోపించారు.తాజాగా అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడుతూ.. ‘కొందరు బయటి వ్యక్తులు మా నిరసనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి చెందిన వ్యక్తులు మా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వారి వల్లే హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సీజేపీకి చెడ్డపేరు తీసుకురావడమే వారి లక్ష్యం. కొందరు సివిల్ డ్రెస్సుల్లో వచ్చి విద్యార్థులపై దాడులు చేస్తున్నారు. జంతర్ మంతర్ ఎప్పుడూ ప్రజాస్వామ్య నిరసనలకు అందుబాటులో ఉండే ప్రదేశమే’ అని వ్యాఖ్యానించారు.#WATCH | Delhi: Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "I have already spoken about the lathi charge. It was very brutal, and we will take the police officers who carried it out to court, and today is the 34th day of our protest. Sonam Sir's hunger… pic.twitter.com/LuZgdavsIr— ANI (@ANI) July 23, 2026అలాగే, నిరసనల సందర్భంగా పోలీసులు చేపట్టిన లాఠీచార్జ్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లాఠీచార్జ్ అత్యంత దారుణంగా జరిగింది. ఈ చర్యకు బాధ్యులైన పోలీసు అధికారులపై కోర్టును ఆశ్రయిస్తాం. మా ఉద్యమానికి ఇవాళ 34వ రోజు. మా డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు.లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ కొనసాగిస్తున్న నిరాహార దీక్షపై కూడా దీప్కే స్పందించారు. ‘వాంగ్‌చుక్ సర్ నిరాహార దీక్షకు ఇవాళ 26వ రోజు. ఆయన ఆరోగ్యం మాకు ఆందోళన కలిగిస్తోంది. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లకూడదని భావిస్తున్నాం. అందుకే దీక్ష విరమించాలని కోరుతున్నాం. అయినప్పటికీ మా డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం మాత్రం కొనసాగుతుంది’ అని తెలిపారు.Jantar Mantar: men in civvies walking the street with sticks. Students ask who they are. No answer. Riot police standing nearby.Police? Another agency? Someone private? That’s not a detail you shrug off. This needs a real investigation, not silence. pic.twitter.com/GX8vEnehdt— Dilip Ray 🇮🇳 (@dilipray) July 21, 2026 Sarthak Goswami covering a protest near New Delhi Railway Station. Video shows Delhi Police pushing and handling him in the crowd — arm yanked, phones out, total chaos. pic.twitter.com/Bw3feKQwij— Dilip Ray 🇮🇳 (@dilipray) July 22, 2026 -
గాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సీజేపీ. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు నిరసనలు ఇతర రాష్ట్రాలకు విస్తరించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజా పరిణామాలు ఇవే..Live Updates08: 14 PMగాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శనఇండి కూటమి ఎంపీల కొవ్వొత్తుల ప్రదర్శనగాంధీ స్మృతి కేంద్రం వద్ద నివాళులర్పిస్తున్న ఇండి కూటమి నేతలుమొదట ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని భావించిన నేతలుప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ స్మృతి కేంద్రానికి వచ్చిన నేతలునీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఇండికూటమి నేతల నివాళి 07: 30 PMవిద్యార్థులకు అండగా ప్రతిపక్ష ఎంపీలంతా రోడ్డెక్కాలని భావించాం: రాహుల్ఇండియాగేట్కు వెళ్దామంటే అనుమతి ఇవ్వలేదువిద్యార్థులంతా రోడ్డుపై ఉన్నారురాజ్ఘాట్కు వెళ్దామని అనుకుంటున్నాంమా బస్సును పోలీసులు అడ్డుకున్నారుబస్సును వదిలి డ్రైవర్ వెళ్లిపోయాడు07:18 PMఢిల్లీలో ఇండి కూటమి నేతల ర్యాలీరాజ్ఘాట్కు ర్యాలీగా వెళ్తున్న రాహుల్, ఇండి కూటమి నేతలురాజ్ఘాట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్న ఇండి కూటమి నేతలువిద్యార్థులు ఒంటరి వారు కాదు.. బాసటగా నిలుస్తాం: రాహుల్07:08 PMఢిల్లీలో ఇండి కూటమి నేతల నిరసనలురాహుల్ నివాసంలో ముగిసిన ఇండి కూటమి ఎంపీల భేటీరాజ్ ఘాట్ బయల్దేరిన రాహుల్, ఇండి కూటమి నేతలువిద్యార్థులకు అండగా ఉంటాం: రాహుల్06:13 PMరాహుల్ గాంధీ నివాసంలో విపక్షాల కీలక భేటీవిద్యార్థుల ఆందోళనలు, తాజా పరిణామాలపై చర్చసమావేశం అనంతరం రాజ్‌ఘాట్‌కు వెళ్లే యోచనరాహుల్ గాంధీ ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు04:50PMరేపు దేశవ్యాప్త ఆందోళనలకు సీజేపీ పిలుపుశాంతియుతంగా నిరసనలు చేపట్టాలన్న సీజేపీ 03:21 PMనీట్ పేపర్ లీక్ కేసుపై కేంద్రం కీలక నిర్ణయంనాలుగు రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుబాంబే హైకోర్టులోని రెండు బెంచ్‌ల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులుపేపర్ లీక్ చట్టం కింద ప్రతిరోజూ విచారణ03:13 PMసీజేపీని మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రంఅన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమన్న కేంద్రం..జంతర్మంతర్లోనే చర్చలు జరగాలని పట్టుబడుతున్న సీజేపీ02:03 PM | కేంద్రం సంచలన నిర్ణయంఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం అమలునిరసనకారుల్ని మూడు నెలల బంధించే అధికారంసీజేపీ నిరసనల నేపథ్యంలో పోలీస్ కమిషనర్‌కు విశేష అధికారాలిచ్చిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధుసీజేపీ ఆందోళనలతో ఢిల్లీ పోలీసులకు అదనపు అధికారాలునేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిర్బంధించే అవకాశంగెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోం శాఖ1:58 PM | నిరసనకారుల్ని బెదిరించిన పోలీస్‌పై చర్యలుముంబైలో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసు డ్రైవర్ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు.‘‘డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’’ అంటూ విద్యార్థులను బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్.వీడియోపై స్పందించిన ముంబై పోలీస్ శాఖ.. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.నిరసనకారులపై తప్పుడు కేసులు పెట్టడం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.01:18 PM | సీజేపీకి అనూహ్యంగా పెరుగుతున్న మద్దతుజంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలుఅంతకంతకు పెరుగుతున్న మద్దతు కమల్ హాసన్, నసీరుద్దీన్ షా లాంటి దిగ్గజ నటుల మద్దతుమొదటి విద్యార్థి మరణం దగ్గరే ప్రభుత్వం స్పందించి ఉండాల్సిందేన్న కమల్బాలీవుడ్ మద్దతు ప్రకటించకపోవడం సిగ్గుచేటన్న షాఆందోళనలకు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్న బాలీవుడ్ తారలుఇటు సౌత్‌లోనూ పలువురి సపోర్ట్12:21 PM | మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు దృష్టిసీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో మూసివేసిన మెట్రో స్టేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది.సెంట్రల్ ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లు మూసివేయడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు.సుప్రీంకోర్టు సమీప మెట్రో స్టేషన్ మూసివేత వల్ల కేసులకు హాజరయ్యే వారికి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.ఎంట్రీ పాస్‌లు ఉన్న న్యాయవాదులు, రిజిస్ట్రీ సిబ్బందిని భద్రతా తనిఖీల తర్వాత అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే మధ్యాహ్నం తర్వాత తాను జోక్యం చేసుకుంటానని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.ఇప్పటికే మెట్రో అధికారులతో మాట్లాడాలని సుప్రీంకోర్టు పరిపాలన విభాగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు. 11:33 AM | ముంబైలో పోలీస్ వాహనం నుంచి నిరసనకారుల పరార్చెంబూర్లో జరిగిన CJP నిరసనల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.అదుపులోకి తీసుకున్న విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వ్యాన్ తలుపును ఓ వ్యక్తి తెరిచినట్లు వైరల్ వీడియోలో కనిపించింది.దీంతో పలువురు విద్యార్థులు వాహనం నుంచి బయటకు వచ్చి పరారైనట్లు సమాచారం.నిషేధాజ్ఞలు ఉల్లంఘించి నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు.దాదాపు 700–800 మంది ఆందోళనలో పాల్గొన్నట్లు వెల్లడించారు.సుమారు 200 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.11:31 AM | రాళ్ల దాడిలో ఢిల్లీ ఏసీపీకి గాయాలుజంతర్ మంతర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రాళ్ల దాడిలో ఢిల్లీ పోలీస్ ఏసీపీ వివేక్ భగత్ గాయపడ్డారు.తలకు గాయం కావడంతో పాటు చేతులు, కాళ్లు, భుజంపై గాయాలైనట్లు ఆర్ఎంఎల్ ఆస్పత్రి అధికారులు తెలిపారు.చెవి నుంచి రక్తస్రావం, వాంతులు వంటి లక్షణాలతో ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.11:14 AM | ప్రధాని మోదీ ట్వీట్‌పై CJP చీఫ్ సెటైర్పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మరోసారి డిమాండ్ చేశారు.ప్రధాని ట్వీట్లోని “యువత భవిష్యత్తు, సంక్షేమమే ముఖ్యం” అన్న వ్యాఖ్యలపై సెటైరికల్‌గా పోస్టు చేశారు.‘‘Hi, my name is Nothing’’ అంటూ గ్రాఫిక్‌ను షేర్ చేశారు. https://t.co/mo44rK6tNc pic.twitter.com/kEeHWUMouF— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026 11:08 AM | బిహార్ అసెంబ్లీలో నీట్ నిరసనల సెగవిద్యార్థులపై లాఠీచార్జ్ అంశం బిహార్ అసెంబ్లీని కుదిపేసింది.విపక్ష ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.విద్యార్థులపై పోలీసుల చర్యను ప్రశ్నించారు.మరోవైపు తమ వాహనంపై దాడి చేసిన వారిని అధికార కూటమి ఎమ్మెల్యేలు ‘గూండాలు’గా అభివర్ణించారు.అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతపార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు యువత ప్రయత్నంఅడ్డుకున్న పోలీసులు.. భారీగా మోహరింపుయువతను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటుఇవాళ పార్లమెంట్ సమావేశాలు నాలుగో రోజు భేటీఉభయ సభల్లోనూ విపక్షాల నిరసనలతో కొనసాగుతున్న వాయిదాల పర్వంశాంతియుతంగానే నిరసనలు కొనసాగుతాయన్న సీజేపీచలో సంసద్ మళ్లీ ఉండబోదన్న సీజేపీజంతర్ మంతర్ వద్దే దీక్ష చేస్తున్న మద్దతుదారులునిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని సీజేపీ ఆరోపణఅప్రమత్తంగా ఉండాలని వలంటీర్లకు ప్రతినిధుల పిలుపు11:04 AM | అభిజిత్ దీప్కేకు అస్వస్థతCJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు అస్వస్థతనిరసనలకు దూరంగా ఇవాళ రెస్ట్ తీసుకోనున్న దీప్కే గత కొన్ని రోజులుగా జ్వరం, తీవ్ర ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు సీజేపీ వెల్లడి.నొప్పి నివారణ మందులతో ఇప్పటివరకు కొనసాగానని.. విశ్రాంతి కోసం కొంత సమయం పాటు నిరసన స్థలం నుంచి దూరంగా ఉంటాడని వెల్లడితిరిగి సాయంత్రానికి తిరిగి జంతర్ మంతర్‌కు వచ్చే చాన్స్.10:50 AM | పోలీసుల చర్యలపై ప్రియాంక గాంధీ ప్రశ్నలునిరసనకారులపై లాఠీఛార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిజంగా శ్రద్ధ చూపిస్తే ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకున్నారని నిలదీశారు.విద్యార్థులతో నేరుగా చర్చలు జరిపి వారి సమస్యలు వినాలని కేంద్రాన్ని కోరారు.10:46 AM | ‘విద్యార్థుల మాట వినండి’నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో విద్యార్థులు వ్యవస్థపై నమ్మకం కోల్పోయారని ప్రియాంక గాంధీ అన్నారు.సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వినాలని సూచించారు.10:43 AM | జంతర్ మంతర్‌కు అలఖ్ పాండేఫిజిక్స్ వాలా సీఈవో అలఖ్ పాండే జంతర్ మంతర్ వద్ద CJP నిరసనల్లో పాల్గొన్నారు.ఆందోళనకారులను ‘పాక్ ఫండెడ్’, ‘చైనా మద్దతుదారులు’గా చిత్రీకరించడాన్ని తప్పుబట్టారు.పోలీసుల చర్యల్లో గాయపడిన విద్యార్థుల అంశాన్ని ప్రస్తావించారు.10:34 AM | చండీగఢ్‌కు విస్తరించిన నిరసనలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో చండీగఢ్‌లోనూ నిరసనలు జరిగాయని CJP తెలిపింది.దేశవ్యాప్తంగా ఆందోళనలు విస్తరిస్తున్నాయని పేర్కొంది.10:31 AM | చర్చలు ఉంటాయా? ఉండవా?!మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తున్న విపక్షాలు, నిరసనకారులురాజీనామా తర్వాతే పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరగాలంటున్న ప్రతిపక్షాలుఅప్పటిదాకా సమావేశాలను ముందుకు వెళ్లనివ్వబోమని స్పష్టీకరణఇటు.. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలుమంత్రి రాజీనామా చేస్తేనే ఆందోళనలు విరమిస్తామని స్పష్టీకరణఇదివరకే మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులురాజీనామా సహా మూడు డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తిడిమాండ్లపై ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయని కేంద్రంచర్చలు ఉంటాయంటూనే.. ముందుకు అడుగు వేయని వైనంచర్చలకు కేంద్రమే దిగి రావాలని.. తాము వెళ్లబోమని సీజేపీ కుండబద్ధలులీక్కు కారకులైన వాళ్లను వదలమని.. కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటనమంత్రి రాజీనామాపై మాత్రం మౌనం!ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ముడిపడి ఉన్న నీట్ నిరసనల వ్యవహారంకేంద్రం నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠచర్చలు ఉంటాయా? ఉండవా? అనే సందిగ్ధం10:00 AM | నిరసనల్లోకి చొరబడ్డ అసాంఘిక శక్తులు!కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ఆరోపణలు సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. నిరసనల్లోకి కొందరు అసాంఘిక శక్తులు చొరబడ్డారని తెలిపారు. వారిని నియంత్రించేందుకు వాలంటీర్ల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. రాత్రి సమయంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని, టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు.09:49 AM | ‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’పేపర్ లీక్‌లపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. యువత భవిష్యత్తుకు అత్యధిక నష్టం చేసింది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు.09:49 AM | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: CJP పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై స్పందించిన CJP.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది.09:42 AM | పోలీస్‌పై దాడి వీడియో వైరల్జూలై 20న జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో కొందరు ఆందోళనకారులు ఢిల్లీ పోలీస్ సిబ్బందిని వెంబడించి దాడి చేసినట్లు కనిపిస్తోంది.09:28 AM | ముంబైలోనూ CJP నిరసనలు.. 1,500 మందికి పైగా పాల్గొనడంNEET పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ముంబై శివాజీ పార్క్‌లో భారీ నిరసన చేపట్టారు. ఇందులో నటులు, కమెడియన్లు కూడా పాల్గొన్నారు.09:17 AM | NEET పేపర్ లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు: ప్రధాని మోదీ ప్రకటనపరీక్షల పేపర్ లీక్‌లకు పాల్పడిన వారిపై వేగంగా చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.09:05 AM | ముంబైలో నిరసనలు.. 200 మంది అదుపులోకిఅనుమతి లేకుండా నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు. శివాజీ పార్క్‌లో జరిగిన ఆందోళనలో సుమారు 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.08:59 AM | నిరసనల్లో గాయపడిన పోలీస్ అధికారి ఫొటో వైరల్CJP ఆందోళనల్లో ఇన్స్పెక్టర్ నందకిశోర్‌పై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఫొటో బయటకు వచ్చింది.08:21 AM | కేంద్రంపై ఆప్ నేత అతిషి విమర్శలుఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేతపై ఆప్ నేత అతిషి స్పందించారు. సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, కానీ విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు.08:21 AM | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగుతుంది: CJP చీఫ్CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాలని కోరారు.08:21 AM | గాయపడిన పోలీసులను పరామర్శించిన సీనియర్ అధికారిఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ కమిషనర్ దేవేశ్ చంద్ర శ్రీవాస్తవ ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన పోలీసులను పరామర్శించారు.07:55 AM | పోలీస్ అధికారి చర్యలపై CJP స్పందననిరసనకారిణిని కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ADCPను విధుల నుంచి తప్పించడంపై CJP స్పందించింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.🔴 08:21 AM | ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు మూసివేతCJP నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాలతో ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను మూసివేశారు. రాజీవ్ చౌక్, మండీ హౌస్, ఐటీవో వంటి కీలక స్టేషన్ల వద్ద రాకపోకలను నిలిపివేశారు. జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మోహరించాయి.🔴 08:13 AM | మంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం: CJPకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. నిరసన 34వ రోజుకు చేరిందని, సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష 26వ రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.🔴 07:55 AM | పోలీస్ అధికారిపై చర్యలకు CJP డిమాండ్జంతర్ మంతర్ వద్ద మహిళా నిరసనకారిపై పోలీస్ అధికారి చేయి చేసుకున్న వీడియో వైరల్ కావడంతో.. సదరు అధికారిని సస్పెండ్ చేసి, విచారణ జరపాలని CJP డిమాండ్ చేసింది.🔴 07:24 AM | భద్రత కట్టుదిట్టం.. మెట్రో సేవలపై ప్రభావంకేంద్ర ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు.🔴 07:13 AM | ఇంటర్నెట్ నిలిపివేతపై కాంగ్రెస్ ఆరోపణలుజంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. యువత నిరసన గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.🔴 05:01 AM | ముంబైలో 13 ఎఫ్ఐఆర్లు నమోదుCJPకి మద్దతుగా జరిగిన అనుమతి లేని నిరసనలపై ముంబై పోలీసులు చర్యలు చేపట్టారు. గత ఐదు రోజుల్లో 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి.. దాదాపు 400 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.🔴 03:46 AM | నాగ్‌పూర్‌లో నిరసనకారుల తరలింపునాగ్పూర్లోని సంవిధాన్ స్క్వేర్ వద్ద కొనసాగిన నిరసనను పోలీసులు రాత్రివేళ తొలగించారు. గడువు ముగిసినా ఆందోళన కొనసాగించడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్య సమయంలో కొందరు యువకులు జాతీయ గీతం ఆలపించారు.🔴 02:44 AM | మరో పోలీస్ చర్యపై CJP ఆరోపణలుజంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని CJP ఆరోపించింది. మరోసారి పోలీస్ చర్యకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? అంటూ ప్రశ్నించింది.🔴 02:04 AM | షరతులతో దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్చుక్నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని ప్రభుత్వం హామీ ఇస్తే దీక్ష విరమించేందుకు సిద్ధమని సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు. విద్యార్థులు కూడా తాత్కాలికంగా ఆందోళన విరమించి చర్చలకు రావాలని కోరారు.🔴 01:45 AM | నిరసనలో నేరస్తుడి హల్చల్!జూలై 20న జంతర్ మంతర్ నిరసనలో చరిత్ర కలిగిన నేర చరిత్ర కలిగిన హాజీ అఫ్జల్ కనిపించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.🔴 01:18 AM | బ్యారికేడ్లు దాటేందుకు మళ్లీ ప్రయత్నంజంతర్ మంతర్ వద్ద కొందరు నిరసనకారులు బ్యారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గతంలో రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే.🔴 11:16 PM | దేశవ్యాప్తంగా నిరసనలపై కేంద్రం సమీక్షCJP ఆందోళనలు పలు రాష్ట్రాలకు విస్తరించడంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. మహారాష్ట్రలో అత్యధికంగా నిరసనలు నమోదయ్యాయని, ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ, అసోం, హర్యానాల్లోనూ ఆందోళనలు జరిగాయని అధికారులు తెలిపారు.🔴 10:30 PM | ఢిల్లీలో రాళ్ల దాడి ఘటనకనాట్ ప్లేస్ సమీపంలోని టాల్‌స్టాయ్ మార్గ్ వద్ద పోలీసులు, RAF సిబ్బందిపై కొందరు రాళ్లు, బాటిళ్లు విసిరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ గాయపడినట్లు వెల్లడించారు. -
సీజేపీ నిరసనకు స్పాన్సర్ ఎవరు?.. అసలు కథ ఇదే
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. జంతర్‌మంతర్ వద్ద మరో ఆసక్తికర అంశం చర్చకు దారితీస్తోంది. నిరసనకారుల వెనుక ఎవరున్నారు?. అసలు వాళ్లకు మద్దతుగా వస్తున్న ఆహారం, నీరు, ఇతర సహాయ సామగ్రి ఎవరు పంపిస్తున్నారు? నిజంగానే ఆ ఆర్డర్లు ముంబై, హైదరాబాద్‌లాంటి నగరాల నుంచి ఆర్డర్ చేస్తున్నవేనా?.. ఇలాంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.సీజేపీ ఆందోళనలు దేశానికి ప్రమాదకరమని.. ఈ ఉద్యమంలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడుతున్నాయంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. విదేశీ నిధులు, ముఖ్యంగా పాక్ నుంచి ఫండింగ్ వస్తోందన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా కొనసాగుతోంది. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు అధికారిక ఆధారాలు బయటకు రాలేదు. అదే సమయంలో నిరసన ప్రాంగణంలో కనిపిస్తున్న పరిణామాలు మాత్రం మరో కథ చెబుతున్నాయి.జంతర్‌మంతర్‌కు వరుసగా.. నిరసన ప్రాంతంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఫుడ్ డెలివరీలు వస్తూనే ఉన్నాయి. దాల్ చావల్, రాజ్మా చావల్, టీ, శాండ్విచ్లు, బర్గర్లు, తాగునీటి బాటిళ్లు పెద్ద సంఖ్యలో చేరుతున్నాయి. కొందరు డెలివరీ రైడర్లు వరుసగా రావడం అక్కడ కనిపిస్తోంది. అయితే ఈ ఆహారాన్ని ఎవరు పంపిస్తున్నారో తమకు తెలియదని వాలంటీర్లు చెబుతున్నారు. ఆర్డర్ వచ్చిన ప్రాంతం మాత్రమే తెలుస్తుందని.. పంపించిన వ్యక్తుల వివరాలు తమకు తెలియవని అంటున్నారు.దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సహాయం?నిరసనకారుల ప్రకారం.. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, నాగ్‌పూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాల నుంచి కూడా ఫుడ్ ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ముంబై వంటి నగరాల నుంచి కూడా సహాయం అందుతోందని వారు చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు నేరుగా ఉద్యమంలో పాల్గొనలేకపోయినా.. తమ మద్దతును ఆహారం, నీరు వంటి రూపాల్లో తెలియజేస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో తాము మద్దతుగా ఆర్డర్లు పెడుతున్నామంటూ కొందరు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. జూలై 20 తర్వాతే పెరిగిన మద్దతుజూలై 20న చలో సంసద్‌కు సీజేపీ ప్రయత్నించింది. అయితే ఘర్షణల నేపథ్యం, అలాగే నిరసనకారులకు గాయాలు అయిన నేపథ్యంలో.. శాంతియుతంగా జంతర్ మంతర్ వద్దే ఆ మరుసటి రోజు నుంచి ఆందోళన కొనసాగిస్తోంది. ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని అంటోంది. అయితే లాఠీ చార్జి పరిణామాల తర్వాత నిరసనకు ప్రజల నుంచి మద్దతు పెరిగిందని అక్కడి వారు చెబుతున్నారు. అంతకుముందు వరకు పరిమితంగా ఉన్న సహాయం.. ఆ తర్వాత భారీగా పెరిగిందని వాలంటీర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆహార కొరత లేదని, రోజంతా పలు పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయని వారు తెలిపారు. మిగిలిపోయిన ఆహారాన్ని ఇతరులకు కూడా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఒకానొక దశలో.. ఫుడ్ ఆర్డర్లు భారీగా చేరడంతో ఇక భోజనాలు పంపొద్దంటూ CJP తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేసింది.ఫండింగ్పై రాజకీయ ఆరోపణలు.. సోషల్ మీడియాలో చర్చఅయితే ఉద్యమానికి వస్తున్న మద్దతుపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. నిరసనల వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందన్న అంశంపై అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కొన్ని వర్గాలు నిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని ఆరోపిస్తుండగా.. మరికొందరు మాత్రం విద్యార్థుల సమస్యపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారని వాదిస్తున్నారు.సోషల్ మీడియాలోనూ ఇదే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫుడ్ సపోర్ట్‌ను ప్రజల స్వచ్ఛంద మద్దతుగా చూస్తుంటే.. మరికొందరు ఉద్యమానికి నిధుల మూలాలపై స్పష్టత అవసరమని ప్రశ్నిస్తున్నారు.పేర్లు తెలియని దాతలు.. కనిపిస్తున్న మద్దతుప్రస్తుతం జంతర్‌మంతర్ వద్ద కనిపిస్తున్న దృశ్యం ఏమిటంటే.. పేర్లు వెల్లడించని వ్యక్తుల నుంచి ఆహారం, నీరు వంటి సహాయం నిరసనకారులకు చేరుతోంది. అయితే ఈ సహాయం వెనుక ఎవరు ఉన్నారు? ఇది కేవలం వ్యక్తిగత మద్దతేనా? లేదంటే మరేదైనా వ్యవస్థీకృత సహకారం ఉందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆరోపణలు ఒకవైపు.. ఆధారాలతో నిరూపితమైన వాస్తవాలు మరోవైపు. సీజేపీ నిరసనల చుట్టూ పెరుగుతున్న రాజకీయ చర్చల మధ్య.. జంతర్‌మంతర్ ఫుడ్ ప్యాకెట్ల కథ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. -
చర్చలకు సిద్ధం: సీజేపీ
న్యూఢిల్లీ: నెల రోజులుగా ఉద్యమబాటలో పయనిస్తున్న తాము ఇకపై చర్చల బాటలో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గురువారం ప్రకటించింది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు సత్వరం చరమగీతం పాడాలంటూ ఉద్యమపంథాలో వెళ్తున్న తాము ప్రస్తుతం ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ‘‘చర్చలకు మోదీ సర్కార్ సుముఖంగా ఉందని బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమాచారమిచ్చారు. ఆయన అధికార నివాసంలో చర్చలకు రావాలని ఆహా్వనంపలికారు. అయితే అధికారిక నివాసాల్లో చర్చలకు మేం సిద్ధంగా లేము. జంతర్‌మంతర్‌లో ప్రజాకోర్టు ఇప్పటికే కొలువుతీరి ఉంది. ప్రజలు వచ్చినట్లు మంత్రులూ ఇక్కడికొచ్చి చర్చిస్తే బాగుంటుంది. ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది’’అని దాస్ చెప్పారు. ‘‘మనందరం విద్యావంతులమే. జంతర్ మంతర్‌లో భద్రత పరంగా ఏమైనా సమస్యలు తలెత్తవచ్చు అని ప్రభుత్వం భావిస్తే దీక్షాస్థలికి బదులుగా మరేదైనా తటస్థ వేదికపై చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. చర్చలకు మేం రెడీ అని ఎప్పుడో చెప్పాం. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనడం ఉత్తమమైన ప్రక్రియ. అయితే అర్థరహిత చర్చలకు మా ఉద్యమంలో చోటేలేదు. నిరసనకారుల డిమాండ్ల సాధనకు కృషిజరిగేలా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకురావాలి. మా డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏ మేరకు సంసిద్ధంగా ఉందనేదే ఇక్కడ అసలు విషయం. ఎందుకంటే కాలం చాలా విలువైంది. ఇంకా వేలాది మంది జంతర్మంతర్లోనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. రెండ్రోజుల క్రితంనాటి పోలీసుల లాఠీచార్జ్, ఉద్యమకారుల ప్రతిఘటన ఉదంతంలో విద్యార్థులపై పోలీసులు ఎలాంటి కేసులు మోపకూడదు. ఉద్యమం ఉధృతమవుతోంది. ఢిల్లీ నుంచి ఉద్యమం గోవా, ముంబై, జైపూర్‌లకు పాకింది. ఇది సహజంగానే జాతీయస్థాయి ఉద్యమంగా రూపాంతరం చెందింది’’అని దాస్ వ్యాఖ్యానించారు. -
కాక్రోచ్ పార్టీకి మద్దతుగా ప్రకాష్ రాజ్
-
నిరసనకారులకు ఆహార మద్దతు..!
-
LIVE: రణరంగంగా ఢిల్లీ..! హై అలర్ట్
-
చర్చల్లో ట్విస్ట్! కేంద్రానికి CJP కొత్త కండిషన్
న్యూఢిల్లీ: నీట్ ఆందోళనల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమేనని చెబుతూనే.. కాక్రోచ్ జనతా పార్టీ కొత్త కండిషన్ పెట్టింది. తాము వాళ్ల దగ్గరకు వెళ్లబోమని.. చర్చలకు ప్రభుత్వమే ముందుకు రావాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా జంతర్ మంతర్‌కు వచ్చి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.“ప్రభుత్వం చర్చలు జరపాలనుకుంటే మా వద్దకే రావాలి. మా షరతులకు అంగీకరించాలి” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని, అహంకారాన్ని పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని CJP తేల్చిచెప్పింది. తమ ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపింది.జంతర్ మంతర్‌లోనే, లేకుంటే..సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా మాట్లాడుతూ.. చర్చలు జరపాలంటే తటస్థ ప్రదేశంలో లేదా జంతర్ మంతర్‌లోనే నిర్వహించాలని అన్నారు. తమ డిమాండ్ల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో జరిగిన చర్చలపై కూడా సీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ప్రతినిధులను నడ్డా నివాసంలో గంటల తరబడి కూర్చోబెట్టి సమయం వృథా చేశారని అభిజీత్ దీప్కే ఆరోపించారు.చర్చలకు సిద్ధమన్న కేంద్రంమరోవైపు, నిరసనకారులు చర్చలకు వస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. అయితే చర్చల విషయంలో బాధ్యతను ప్రభుత్వం నిరసనకారులపైనే ఉంచినట్లు తెలుస్తోంది.జూలై 20న CJP చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పోలీసులు బలప్రయోగం చేశారని CJP ఆరోపించగా.. నిబంధనలు ఉల్లంఘించడంతోనే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ సమయంలోనే జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు.. మూడు డిమాండ్లతో వినతి పత్రం సమర్పించారు. వాటిని పరిశీలించి నిర్ణయం తెలియజేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో సీజేపీ–కేంద్ర ప్రభుత్వం మధ్య రెండో దఫా చర్చల అంశం కీలకంగా మారింది. ఎవరు ముందడుగు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. -
ఢిల్లీలో హై అలర్ట్.. మెట్రో స్టేషన్లు మూసివేత
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. భద్రతా కారణాలతో ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రకటించింది.ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా కారణాల దృష్ట్యా కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. జన్‌పథ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లను క్లోజ్ చేశారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లే ముందు మెట్రో సేవలకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులు సూచించారు. భద్రతా పరిస్థితుల ఆధారంగా స్టేషన్ల పునఃప్రారంభంపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లలో ఇంటర్చేంజ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని DMRC వెల్లడించింది. Delhi Metro stations -Lok Kalyan Marg, Rajiv Chowk, Patel Chowk, Ramakrishna Ashram Marg, Barakhambha Road, Supreme Court, Seva Teerth, Janpath, Mandi House, Central Secretariat, ITO, Delhi Gate, Indraprastha, Khan Market, Jor Bagh and Shivaji Stadium are closed till further… pic.twitter.com/PXLPuJTP2r— ANI (@ANI) July 22, 2026 -
ఢిల్లీలోనే కాదు.. ఇక్కడ కూడా జంతర్ మంతర్
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)నిరసనల కారణంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ పేరు మారుమోగిపోతోంది. ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశంలోని మరో ఐదు ప్రదేశాల్లో జంతర్ మంతర్లు ఉన్నాయి. 18వ శతాబ్దంలో జైపూర్ మహారాజా సవాయి జై సింగ్ II దేశంలోని వివిధ ప్రాంతాలలో ఐదు ఖగోళ పరిశోధనశాలలను (జంతర్ మంతర్) నిర్మించారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ 1720లలో (1721-1724 మధ్య) నిర్మించిన ఈ తొలి జంతర్ మంతర్‌లో ఖగోళ వస్తువుల గమనాన్ని అధ్యయనం చేసేవారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ సమీపంలో ఉన్న ఈ చారిత్రాత్మక వేదిక నేడు శాంతియుత నిరసనలకు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.జైపూర్‌లో..ఈ ఐదు జంతర్ మంతర్లలో ఇది అత్యంత విశిష్టమైనది. దీని పరిమాణం, అద్భుతమైన పరిరక్షణను గుర్తించి 2010లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఇందులో ప్రపంచంలోని అతిపెద్ద రాతి సూర్య గడియారాలలో ఒకటైన ప్రసిద్ధ ‘సమ్రాట్ యంత్రం’ సహా సుమారు 20 పెద్ద ఖగోళ పరికరాలు ఉన్నాయి.ఉజ్జయినిలో.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రాచీన కాలం నుంచే ఖగోళ, గణిత శాస్త్రాలకు బలమైన సంబంధం ఉంది. జైపూర్ జంతర్ మంతర్ కంటే పరిమాణంలో చిన్నదైనప్పటికీ, ఖగోళ వస్తువుల స్థానాలు, చలనాలను లెక్కించడానికి దీనిని నిర్మించారు.వారణాసిలో..గంగా నది ఒడ్డున ఉన్న మాన్ మహల్ సముదాయానికి అనుసంధానమై ఉన్న ఈ బనారస్ జంతర్ మంతర్ నాటి విద్యా, విజ్ఞాన కేంద్రాల ప్రాధాన్యతను చాటుతుంది. ఇక్కడి పరికరాలు కాలక్రమేణా దెబ్బతిన్నప్పటికీ, 18వ శతాబ్దపు శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి.మధురలో..ఈ జాబితాలోని ఐదో జంతర్ మంతర్ విషాదకర ముగింపును చవిచూసింది. 1857 విప్లవానికి ముందే మధురలోని జంతర్ మంతర్ కోటను కూల్చివేయడంతో నేడు అక్కడ ఎలాంటి అవశేషాలు కనిపించవు. -
జంతర్‌మంతర్ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సోమవారం పార్లమెంట్ ముట్టడి సమయంలో, అలాగే మంగళవారం చోటుచేసుకున్న ఘర్షణల అనంతరం పోలీసులు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు, వేదికను తొలగించారు. అయితే బుధవారం ఉదయం నుంచి నిరసనకారులు మళ్లీ అక్కడకు చేరుకుని ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు.లేటెస్ట్ అప్డేట్స్:ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులుపోలీసులపై అల్లరిమూకల దాడిదాడిలో పలువురు పోలీసులకు గాయాలుజంతర్మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్పై నిషేదంగాయపడిన పలువురు పోలీసులుజంతర్మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణంపోలీసులపైకి రాళ్లు విసిరిన ఆందోళనకారులుపోలీసులు, RAF సిబ్బందిపైకి రాళ్లు, బాటిళ్లు విసిరిన ప్రొటెస్టర్లుగాయపడిన పలువురు పోలీసులు ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర హైటెన్షన్భారీగా తరలివస్తున్న యువతపార్లమెంట్ వైపు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలుప్రభుత్వం చర్చలకు రావాలంటే తమ వద్దకే రావాలని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధమేనని, కానీ తమ షరతులను అంగీకరించాలని తెలిపారు.ప్రభుత్వ అహంకారం తగ్గాలని డిమాండ్ చేశారు.NEET పేపర్ లీక్ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.చర్చలు తటస్థ ప్రదేశంలో లేదంటే జంతర్ మంతర్‌లో జరగొచ్చని CJP ప్రతినిధి ఆశుతోష్ రంకా తెలిపారు.ప్రభుత్వం తమతో చర్చలు జరుపుతూనే మరోవైపు విద్యార్థులపై పోలీసు చర్యలకు దిగిందని CJP ఆరోపించింది.తమ ప్రతినిధులను జేపీ నడ్డా నివాసంలో గంటల తరబడి కూర్చోబెట్టి సమయం వృథా చేశారని అభిజీత్ దీప్కే ఆరోపించారు.చర్చలకు పిలిచి మరోవైపు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారని విమర్శించారు.జూలై 20 పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు బలప్రయోగం చేశారని CJP ఆరోపించింది.మరోవైపు, నిరసనకారులు చట్టాన్ని ఉల్లంఘించడంతోనే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.NEET అంశంపై CJP–ప్రభుత్వం మధ్య రెండో విడత చర్చలు కొనసాగుతున్నాయి.నాలుగు నినాదాలే చేద్దాం: సీజేపీ జంతర్ మంతర్‌లో CJP ప్రతినిధి ఆశుతోష్ రంకా కీలక వ్యాఖ్యలు.ఆందోళనల్లో నాలుగు నినాదాలకే పరిమితం కావాలని పిలుపు.‘‘భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’’ అంటూ నినాదాలు చేయాలని సూచన.ప్రతికూల నినాదాలతో ఉద్యమంపై తప్పుడు కథనం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ.ఎలాంటి నెగెటివ్ స్లోగన్స్‌ను సహించబోమని స్పష్టం చేశారు.స్పీకర్‌ను కలిసిన ధర్మేంద్ర ప్రధాన్NEET అంశంపై పార్లమెంట్లో చర్చకు ప్రతిపక్షాల ఒత్తిడిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉభయ సభల్లో డిమాండ్రాజీనామాకు పట్టుబడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. విపక్షాలుఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామంలోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠCJP నిరసనలు.. తాజా పరిణామాలువిద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని DMK ఎంపీ తిరుచ్చి శివ ఆరోపించారు.NEET వ్యతిరేక నిరసనల్లో విద్యార్థులపై బలప్రయోగం జరిగిందని విమర్శించారు.సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను 20 రోజులకు పైగా కొనసాగించేందుకు అనుమతించారని గుర్తుచేశారు.ప్రభుత్వానికి మానవతా దృక్పథం లేదని DMK ఎంపీ ఆరోపించారు.విద్యార్థుల పోరాటం ఆగదని, వారు తమ డిమాండ్ల కోసం కొనసాగుతారని వ్యాఖ్యానించారు.ఢిల్లీలో భద్రతా కారణాలతో మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.రాజీవ్ చౌక్, ఐటీవో, మండీ హౌస్ సహా 16 మెట్రో స్టేషన్లు తదుపరి ఆదేశాల వరకు మూసివేశారు.జంతర్ మంతర్ పోలీస్ యాక్షన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు👉 ‘సమయం వృథా చేయొద్దు’జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాడి ఆరోపణలపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. “మా సమయం, మీ సమయం వృథా చేయొద్దు” అని న్యాయవాదికి సూచించింది. 👉 వీడియోలు చూడబోమన్న సీజేఐపోలీసుల చర్యకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోరగా.. “మేము ఎలాంటి వీడియోలు చూడాలనుకోవడం లేదు” అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.👉 పార్లమెంట్ మార్చ్ సమయంలో ఉద్రిక్తతనీట్ పేపర్ లీక్‌పై CJP చేపట్టిన నిరసనల్లో భాగంగా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.👉 లాఠీఛార్జ్ చేశారంటూ ఆరోపణలువిద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారని CJP ఆరోపించింది. పలువురు గాయపడ్డారని తెలిపింది.👉 ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్పోలీసుల చర్యపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.👉 ‘కోర్టును ఇందులోకి లాగొద్దు’పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సూచన చేసింది. కేసును బుధవారం విచారణకు లిస్ట్ చేసింది. విచారణ జరగాల్సి ఉంది.👉 నిరసనలు కొనసాగుతున్నాయిజంతర్ మంతర్ వద్ద CJP ఆందోళనలు కొనసాగుతుండగా.. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.CJP హెచ్చరిక.. ఢిల్లీకి లక్షల మంది వస్తారుNEET పేపర్ లీక్ ఆరోపణలపై ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని CJP హెచ్చరిక.జూలై 20న జరిగిన నిరసన కేవలం ‘‘ట్రైలర్ మాత్రమే’’ అని CJP జాతీయ అధికార ప్రతినిధి ఆశుతోష్ రంకా వ్యాఖ్య.ప్రభుత్వం డిమాండ్లు అంగీకరించకపోతే లక్షలాది మంది ఢిల్లీకి తరలివస్తారని హెచ్చరిక.స్వాతంత్ర్యం తర్వాత దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉద్యమమని రంకా పేర్కొన్నారు.ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, లేదంటే భారీ స్థాయిలో నిరసనలు తప్పవని వ్యాఖ్య.జూలై 20 మార్చ్ పోలీసుల జోక్యం వరకు శాంతియుతంగానే సాగిందని ఆరోపణ.ఆందోళనకారులను హింసాత్మకులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని విమర్శ.పోలీసులు విద్యార్థులపై బలప్రయోగం చేయడంతోనే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.31 రోజులుగా శాంతియుతంగా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు.మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాల ఆధారంగా ఉద్యమం సాగుతోందని చెప్పారు.CJP–ప్రభుత్వం రెండో దఫా చర్చలు నేడుNEET-UG 2026 పేపర్ లీక్ వివాదంపై కొనసాగుతున్న CJP ఆందోళనలు.నేడు మధ్యాహ్నం 12 గంటలకు CJP–కేంద్ర ప్రభుత్వం మధ్య రెండో విడత చర్చలు.జూలై 20న తొలిసారి CJP ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ.ప్రభుత్వానికి మూడు ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం సమర్పించిన CJP.కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ఎలాంటి ఆంక్షలు లేకుండా విడుదల చేయాలని డిమాండ్.విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేదా తొలగింపు కోరిన CJP.NEET పేపర్ లీక్‌తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్.తొలి చర్చల్లో డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం.CJP ఆందోళనకు TMC మద్దతుCJP చేపట్టిన నిరసనలకు మద్దతు ప్రకటించిన TMC ఎంపీ కల్యాణ్ బెనర్జీ.విద్యార్థుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వ స్పందన దురదృష్టకరమని వ్యాఖ్య.‘‘విద్యార్థుల మాట వినకపోతే ఇంకెవరి మాట వింటారు?’’ అని ప్రశ్న.ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై విమర్శలు చేసిన బెనర్జీ.పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించారు.నిరసనల్లో భద్రతా సిబ్బంది, జర్నలిస్టులపై దాడుల ఆరోపణలపై ప్రశ్నించగా అసహనం వ్యక్తం చేశారు.జంతర్ మంతర్ పోలీస్ చర్యలపై ఢిల్లీ హైకోర్టులో విచారణజంతర్ మంతర్‌లో విద్యార్థులు, ఆందోళనకారులపై పోలీసుల చర్యను సవాల్ చేస్తూ పిటిషన్.ఈ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.జూలై 18న సోనమ్ వాంగ్చుక్ను నిరసన స్థలం నుంచి తరలించిన ఘటనపై అభ్యంతరం.పోలీస్ ఆపరేషన్‌పై స్వతంత్ర దర్యాప్తు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి.ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, బాడీ కెమెరా రికార్డులు భద్రపరచాలని కోరారు.శాంతియుత నిరసన హక్కును కాపాడేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి.భవిష్యత్‌లో నిరసనకారులపై విచక్షణారహిత పోలీస్ చర్యలను అడ్డుకోవాలని కోర్టును కోరారు.CJP నిరసనలు.. 10 ఎఫ్ఐఆర్లు నమోదుఢిల్లీలో CJP నిరసనలకు సంబంధించి మొత్తం 10 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.న్యూఢిల్లీ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్‌లో 4, కన్నాట్ ప్లేస్‌లో 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.మండీర్ మార్గ్, బరాఖంబా రోడ్, కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదు చేశారు.నిరసనల సమయంలో హింస, రాళ్ల దాడి, విధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం వంటి అంశాలపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.హింస ముందస్తు ప్రణాళికలో భాగమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.ఘటనలకు సంబంధించిన 250కిపైగా వీడియోలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.👉 పార్లమెంట్లో చర్చకు సిద్ధం: కేంద్రంనీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో విస్తృత చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి.👉 ‘ఘోర పాపం’ అన్న ప్రధాని మోదీనీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. యువత భవిష్యత్‌తో ఆడుకోవడం ‘ఘోర పాపం’ అని వ్యాఖ్యానించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.👉ఆయన రాజీనామా చేయాల్సిందే!నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్లు పట్టుబడుతున్నాయి. ఆ తర్వాతే ఆందోళనలను విరమిస్తామని సీజేపీ ప్రతినిధులు తేల్చి చెబుతున్నారు. అయితే.. ఈ విషయంలో కేంద్రం నుంచి సానుకూల సంకేతాలేవీ కనిపించడం లేదు. తొలిరోజు నిరసనల సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసిన నిరసనకారుల ప్రతినిధులు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించినప్పటికీ.. ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా తప్పు చేసినవాళ్లను జైల్లో పెట్టామని ప్రధాని మోదీ అంటుండగా.. చర్చలకు ప్రభుత్వం సిద్ధమంటూ ధర్మేంద్ర ప్రదాన్ విపక్షాలకు స్పష్టం చేశారు. #WATCH | Delhi | Cockroach Janta Party (CJP) National Spokesperson Ashutosh Ranka says, "This is the biggest movement in India's post-independence history...We have said this very clearly, what happened on 20th was a trailer. If the Govt doesn't agree, millions more will come to… pic.twitter.com/YwBpgeGkXc— ANI (@ANI) July 22, 2026👉జంతర్ మంతర్‌లో మళ్లీ భారీగా చేరిన నిరసనకారులువర్షం కురుస్తున్నప్పటికీ CJP కార్యకర్తలు జంతర్ మంతర్‌లో నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం ఉదయం ఆందోళనకారుల సంఖ్య పెరిగినట్లు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను కొనసాగిస్తున్నారు.👉 CJP నేత వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అంటూ ఆరోపణCJP ప్రతినిధి సౌరవ్ దాస్ తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని ఆరోపించారు. తమ నిరసనల నేపథ్యంలోనే డిజిటల్ ఆంక్షలు విధిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికే తమ సంస్థకు చెందిన పలు సోషల్ మీడియా ఖాతాలు, వ్యవస్థాపకుడికి సంబంధించిన ఖాతాలు బ్లాక్ లేదా సస్పెండ్ అయ్యాయని CJP ఆరోపిస్తోంది.👉 పోలీసులపై రాళ్ల దాడి.. కేసు నమోదుమంగళవారం రాత్రి ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడి జరిగిన ఘటనపై కేసు నమోదైంది. గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.👉 RAF వాహనంపై దాడికన్నాట్ ప్లేస్‌లో గుంపును చెదరగొట్టే క్రమంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్లు పోలీసులు తెలిపారు. RAFకు చెందిన వజ్ర వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు సంయమనం పాటించారని అధికారులు తెలిపారు.👉 రాహుల్ గాంధీ నిరసన.. ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్తతజంతర్ మంతర్ ఆందోళనకు దూరంగా ఉన్నారంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వైపు నిరసనకు వెళ్లారు. పోలీసులు అడ్డుకుని రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వారిని విడుదల చేశారు.👉భద్రత కట్టుదిట్టంజంతర్ మంతర్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను మరింత పెంచారు. -
నీట్ మంటలు.. కేంద్రానికి రాహుల్ గాంధీ ఐదు డిమాండ్ల అస్త్రం
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, విద్యార్థులపై పోలీసుల చర్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఢిల్లీలో భారీ నిరసన చేపట్టింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించారు. అనంతరం మంగళవారం రాత్రి వారిని విడుదల చేశారు.రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియానికి తరలించగా, ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రియాంకను పరామర్శించేందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రాహుల్, ప్రియాంకతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్బంగా నిర్బంధంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ వీడియో సందేశం విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందు ఐదు కీలక డిమాండ్లు ఉంచారు.కీలక డిమాండ్లు..👉కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, 👉విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 👉విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 👉అలాగే విద్యార్థులపై జరిగిన చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని, 👉నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో తక్షణమే చర్చ నిర్వహించాలని, 👉దేశ విద్యా వ్యవస్థతో పాటు పోటీ పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని కోరారు.దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ..‘భారత్‌లో విద్యా వ్యవస్థ ఎందుకు కుప్పకూలుతోంది? ప్రశ్నపత్రాలు ఎందుకు వరుసగా లీకవుతున్నాయి? విద్య ఎందుకు అంత ఖరీదుగా మారింది? పిల్లలను చదివించడానికి కుటుంబాలు ఎందుకు అప్పుల పాలవుతున్నాయి? ఇవి లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అడుగుతున్న సహజమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు అడగడంలో ఎలాంటి తప్పు లేదు’ అని వ్యాఖ్యానించారు. బుధవారం లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలన్నీ కోరుతున్నాయని తెలిపారు. విద్యార్థుల కోసం పోరాడుతున్న ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.भारत के छात्रों और प्रधानमंत्री को मेरा सीधा संदेश... pic.twitter.com/pgZZHLLz8h— Rahul Gandhi (@RahulGandhi) July 21, 2026మరోవైపు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టంగా తెలిపినా, కాంగ్రెస్ విద్యార్థుల సమస్యలకు పరిష్కారం వెతకడం కంటే రాజకీయ ప్రదర్శనకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయ లబ్ధే రాహుల్ గాంధీ లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన 'ఎక్స్'లో పేర్కొన్నారు. -
అదే వేదిక.. అదే పోరు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో తమ డిమాండ్ల సాధనకు బయల్దేరిన వేలాది మంది కాక్రోచ్ జనతాపార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజిక, విద్యావేత్తలను లాఠీచార్జ్, బాష్పవాయుగోళాల ప్రయోగంతో చెదరగొట్టి, జంతర్‌మంతర్ వద్ద దీక్షాస్థలిని తొలగించినా ఉద్యమకారులు మళ్లీ మొదటి నుంచి తమ ఉద్యమాన్ని ఆరంభించారు. సోమవారం సాయంత్రం కార్యకర్తలందరినీ దీక్షాస్థలి నుంచి తరిమికొట్టినా మంగళవారం మధ్యాహ్నంకల్లా అందరూ మళ్లీ అదే దీక్షాస్థలికి వచ్చి నిరసనను మొదలెట్టారు. ‘‘పోలీసుల దాష్టికం చూశాక ఉద్యమం మరింత ఉధృతమైంది. సోమవారం కంటే ఎక్కువ మంది ఈరోజు దీక్షాస్థలికి చేరుకున్నారు. డజన్ల మంది విద్యార్థుల ఆత్మహత్యల బలిదానాలతో ఈ ఉద్యమం మొదలైంది. దీనిని వృథాగా పోనివ్వం.మా డిమాండ్లు నెరవేరేదాకా పోరాడతాం’’ అని ఉద్యమకారులు పునరుద్ఘాటించారు. నిరసన కార్యక్రమం మంగళవారం 32వ రోజుకు చేరిన సందర్భంగా జంతర్‌మంతర్‌లో సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ప్రసంగించారు. ‘‘సోమవారం చర్చల పేరిట మోదీ సర్కార్ మా సమయాన్ని వృథాచేసింది. కుట్రప్రకారం మా ప్రతినిధులు అశుతోష్, సౌరవ్ దాస్‌లను ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా నివాసానికి పిలిపించి అక్కడ వారిని నిలువరించారు. వాళ్ల మొబైల్స్ లాక్కున్నారు. ఓవైపు చర్చలంటూనే మరోవైపు వీధుల్లో విద్యార్థులను తలలు పగలగొట్టారు’’అని దీప్కే ఆగ్రహం వ్యక్తంచేశారు.లాఠీచార్జ్, అణచివేతతో తమ ఐక్యతను పోలీసులు చెదరగొట్టలేరని దీప్కే అన్నారు. ఆస్పత్రిలో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తుండటంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని దీప్కే ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో సీజేపీ కార్యకర్తలు దీక్షాస్థలికి చేరుకున్నారు. వాంగ్‌చుక్ దీక్షకు గుర్తుగా జంతర్‌మంతర్ వద్ద ఆయన చిత్రపటాన్ని, రాజ్యాంగ ప్రతి, చర్కాను పెట్టారు. సీజేపీ నుంచి విజేత దహియా బయటకు.. సోమవారం పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న వేళ ప్రతిఘటించాల్సిందిపోయి జంతర్‌మంతర్ వద్ద తాపీగా బర్గర్ తింటూ కన్పించిన పార్టీ అధికార ప్రతినిధి విజేత దహియాను సీజేపీ బయటకు పంపేసింది. ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు సీజేపీ మంగళవారం ప్రకటించింది. దహియా సోమవారం బర్గర్ తింటున్న వీడియో బయటకు రావడంతో పలువురు నిరసనకారులు ఆయన నిబద్ధతను ప్రశ్నించారు. దీనిపై దహియా స్పందించారు. ‘‘రెండ్రోజులుగా అందరిలా రోడ్లపై నిద్రలేని రాత్రులు గడిపా. ఆకలేసి బర్గర్ తినడం కూడా తప్పేనా?’’అని ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. గాయాలతో వెంటిలేటర్‌పై విద్యార్థినిన్యూఢిల్లీ: చలో సంసద్ సందర్భంగా సోమ వారం పోలీసుల లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగంలో గాయపడిన 23 ఏళ్ల విద్యార్థిని సాక్షి ప్రస్తుతం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. బాష్పవాయువు ప్రయోగం తర్వాత నిరసనకారులు పరుగులు తీయడంతో ఏర్పడిన తొక్కిసలాట వంటి పరిస్థితుల్లో ఆ యువతి ఊపిరి ఆడక ఇబ్బంది పడినట్లు భావిస్తున్నారు.ఆమె ముఖం, ఛాతీ, మెడ భాగాల్లో గాయాలైనట్లు సాక్షి కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటిలేటర్‌పై ఉన్నప్పటికీ చికిత్సకు స్పందిస్తోందని తెలిపారు. నిరసన జరిగిన సమయంలో ఆ యువతి తన బంధువుతో కలిసి అక్కడే ఉంది. ఆమె బంధువు కాలికి కూడా గాయాలయ్యాయి. దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్పూర్ ఎక్స్టెన్షన్ ప్రాంతానికి చెందిన బాధిత యువతి సాక్షి అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు అభ్యసిస్తోంది. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. -
రాజీనామా చేసేంత వరకు నిరసన కొనసాగుతుంది..!
-
ఆస్పత్రిలో వాంగ్ చుక్.. బయట సీజేపీ నిరసన.. టెన్షన్ టెన్షన్
-
జంతర్ మంతర్ లాఠీచార్జ్.. రాజ్యసభలో రాజకీయ మంటలు
న్యూఢిల్లీ: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీస్ చర్య అంశం పార్లమెంట్లో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని ప్రస్తావించడంతో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.రాజ్యసభ తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే ఖర్గే మాట్లాడుతూ.. జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న వేలాది మంది విద్యార్థులపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగిందని ఆరోపించారు. విద్యార్థుల గొంతును అణిచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. వేలాది మంది విద్యార్థులను మౌనం చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జంతర్ మంతర్ వద్ద వారిపై లాఠీచార్జ్ చేశారు అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై బలప్రయోగం చేయడం సరికాదని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఖర్గే అధికార పక్షంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. చందా చోరీకి మద్దతుదారులు ట్రెజరీ బెంచ్‌లలో కూర్చున్నారు(అయోధ్య రామ మందిర విరాళాల వివాదాన్ని ఉద్దేశించి) అంటూ చేసిన వ్యాఖ్యలు సభలో మరింత ఉద్రిక్తతకు కారణమయ్యాయి. అధికారపక్ష సభ్యులు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఖర్గే ప్రసంగం కొనసాగుతున్న సమయంలో ప్రతిపక్ష ఎంపీలు లేచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇరువైపుల సభ్యుల నిరసనల మధ్య సభా కార్యక్రమాలు కొనసాగించడం కష్టంగా మారడంతో రాజ్యసభను కొద్దిసేపటికే వాయిదా వేశారు.#WATCH | Delhi: Rajya Sabha adjourned to meet again at 12 Noon today.Leader of the Opposition in Rajya Sabha Mallikarjun Kharge says, "You have allowed me to present my views regarding this paper leak and the NEET examination scandal. This is a matter concerning students; I am… pic.twitter.com/2bRWp771zI— ANI (@ANI) July 20, 2026ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యా సంస్కరణలు, నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు మద్దతుగా పలువురు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు కూడా స్పందించారు. నిరసనల సమయంలో పోలీసులు చేపట్టిన చర్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే శాంతిభద్రతల పరిరక్షణ కోసమే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. జంతర్ మంతర్ ఘటన ఇప్పుడు పార్లమెంట్లో ప్రధాన రాజకీయ అంశంగా మారింది. విద్యార్థుల నిరసనలు, పోలీస్ చర్య, ప్రభుత్వ వైఖరిపై చర్చలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. -
కాక్రోచ్ Vs పోలీస్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ కట్..
-
నేడు చలో సంసద్ ర్యాలీ
న్యూఢిల్లీ: ‘చలో సంసద్’ ర్యాలీని విజయవంతం చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పట్టుదలతో ఉంది. ఆ పార్టీకి మద్దతుగా ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కు భారీగా జనం తరలివచ్చారు. ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఆదివారం రాత్రంతా నిరసన కొనసాగించాలని, సోమవారం పార్లమెంట్ వరకు ర్యాలీ చేపట్టాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. నిర్ణిత సమయానికి ప్రజలను సమీకరించకముందే దాదాపు 20 వేల మంది జంతర్‌మంతర్, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నారని సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రధాన్ రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. రాజకీయ నాయకులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వాంగ్చుక్ను కలిసి, విద్యా రంగంలో జవాబుదారీతనం పెంచే అంశాన్ని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని ఖచ్చితమైన హామీ ఇస్తేనే సోనమ్ సోమవారం దీక్ష విరమిస్తారని ఆయన భార్య గీతాంజలి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.


