అరాచకవాదుల కుట్ర విఫలమైంది  | BJP Spokesperson Sambit Patra Targets Opposition Over Jantar Mantar Protest | Sakshi
Sakshi News home page

అరాచకవాదుల కుట్ర విఫలమైంది 

Oct 11 2026 5:08 AM | Updated on Oct 11 2026 5:08 AM

BJP Spokesperson Sambit Patra Targets Opposition Over Jantar Mantar Protest

విపక్షాలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర ఆగ్రహం  

సాక్షి, న్యూఢిల్లీ: ఓట్ల చోరీ పేరుతో ఫేక్‌న్యూస్‌ వ్యాప్తి చేస్తూ జంతర్‌మంతర్‌ వద్ద అరాచకం సృష్టించి దేశాన్ని బందీ చేయాలని చూసిన విపక్షాల కుట్ర పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర పేర్కొన్నారు. దేశ రాజధాని వేదికగా మూకస్వామ్యంపై ప్రజాస్వామ్యం విజయం సాధించిందని స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. భారతదేశ విస్తీర్ణం 32,87,000 చదరపు కిలోమీటర్లు కాగా, జంతర్‌మంతర్‌ పరిధి కేవలం 4 చదరపు కిలోమీటర్లు మాత్రమేనని అన్నారు. 

ఆ కొద్ది ప్రాంతంలో గందరగోళం సృష్టించి, అదే దేశ ముఖచిత్రంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కనీస రాజ్యాంగ మర్యాదలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల చోరీపై ఎలాంటి ఆధారాలు లేకుండానే రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి వినతిపత్రం సమర్పించారని, బయటకు రాగానే తమ వాదనతో రాష్ట్రపతి ఏకీభవించారంటూ అవాస్తవాలు మాట్లాడారని తప్పుబట్టారు. రాజ్యాంగ అధినేతను రాజకీయ వివాదాల్లోకి లాగడం రాహుల్‌ గాంధీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement