జంతర్ మంతర్‌లోకి సీజేపీ నేతలు.. ఢిల్లీలో హైటెన్షన్‌! | Police detain CJP's Saurav Das, Ashutosh Ranka and Ajinkya Shinde as they attempt to breach Jantar Mantar | Sakshi
Sakshi News home page

జంతర్ మంతర్‌లోకి సీజేపీ నేతలు.. ఢిల్లీలో హైటెన్షన్‌!

Oct 13 2026 10:18 AM | Updated on Oct 13 2026 11:05 AM

Police detain CJP's Saurav Das, Ashutosh Ranka and Ajinkya Shinde as they attempt to breach Jantar Mantar

సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అనుమతులు లేకపోయినా.. నిషేధిత ప్రాంతంగా ఉన్న జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు కాక్రోచ్‌ జనతా పార్టీ నేతలు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు సీజేపీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. 

మంగళవారం ఉదయం సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, అజింక్య షిండేతో పాటు పలువురు కార్యకర్తలు, వాలంటీర్లు హఠాత్తుగా జంతర్ మంతర్ నిరసన స్థలంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. 

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అనుమతులు లేవనే కారణంతో నిరసనకు యత్నించిన అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌తోపాటు ఇతర సీజేపీ ప్రతినిధులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే జంతర్ మంతర్‌ను నిరసన స్థలాల జాబితా నుంచి ఢిల్లీ పోలీసులు పూర్తిగా తొలగించిన విషయం తెలిసిందే.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement