ఆర్థిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్లు కల్పించాలి
అన్‌రిజర్వ్‌డ్ యువత ఆందోళన
యూజీసీ సమానత్వ నిబంధనలను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ మళ్లీ జనసంద్రంగా మారింది. ఈసారి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కాకుండా.. అన్‌రిజర్వ్‌డ్(రిజర్వేషన్ వర్గాలకు చెందని) యువత కదం తొక్కారు. భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కుల ప్రాతిపదికన అమలవుతున్న రిజర్వేషన్లు, యూనివర్సిటీ నిధుల సంఘం(యూజీసీ) తీసుకొచ్చిన సమానత్వ నిబంధనలను వ్యతిరేకిస్తూ వేలాది మంది ఆందోళనకు దిగారు. రిజర్వేషన్ల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ‘రిజర్వేషన్ సంస్కరణల ఆందోళన్’పేరిట పెద్ద సంఖ్యలో నిరసనకారులు శుక్రవారం జంతర్‌మంతర్‌కు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్‌ఏఎఫ్) జవాన్లు భారీగా మోహరించారు. పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. యూజీసీ నిబంధనలకు, ప్రస్తుతం ఉన్న కుల ఆధారిత రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా తాము శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తున్నామని నిరసనకారులు స్పష్టంచేశారు. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) అభ్యర్థి హర్‡్ష దూబే నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమంలో రాజస్తాన్‌కు చెందిన జనరల్ సేన, చాణక్య సేనలతో పాటు కర్ణి సేన కూడా పాల్గొన్నాయి. ఇన్‌ఫ్లుయెన్సర్ అజిత్ భారతి కూడా హాజరయ్యారు.
ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
నిరసనకారులు జంతర్‌మంతర్ వద్ద హనుమాన్ చాలీసా పఠించారు. ‘సియావర్ రామచంద్ర కీ జై’అని నినాదాలు చేశారు. కొంతమంది నిరసనకారులు ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని వ్యతిరేకించారు. దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాలను ఎవరూ దురి్వనియోగం చేయకూడదని చెప్పారు. అటువంటి దురి్వనియోగాన్ని నివారించడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. కులం ఆధారంగా కాకుండా పౌరుల ఆర్థిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిజంగా అవసరమైన వారికే రిజర్వేషన్ ప్రయోజనాలు దక్కేలా సంస్కరణలు తీసుకురావాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తేలి్చచెప్పారు. ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో సాగిన కుల ఆధారిత రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ఇప్పుడు వీధుల్లోకి వచ్చింది.


