ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం | Delhi Liquor Shops To Remain Shut On October 9 10 Jantar Mantar Protest | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం

Oct 8 2026 9:21 PM | Updated on Oct 8 2026 9:37 PM

Delhi Liquor Shops To Remain Shut On October 9 10 Jantar Mantar Protest

ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి(అక్టోబర్‌ 9,10 తేదీల్లో) ఢిల్లీలో మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి. సీఈసీకి వ్యతిరేకంగా నిరసనల కారణంగా శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలో బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమలు కానుంది. జంతర్‌మంతర్‌ సహా అన్ని చోట్లా నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. 10న సీజేపీ ఆందోళనకు అనుమతి లేదని ఢిల్లీ డీసీపీ సృష్టి పాండే స్పష్టం చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓట్ల చోరీ జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 10న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో 20 వేలకు పైగా పోలీసులు, పారామిలటరీ సిబ్బంది మోహరించారు.

సీఈసీకి వ్యతిరేకంగా తలపెట్టిన నిరసనలో పలు విద్యార్థి, రైతు సంఘాలతో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా పాల్గొనాలని నిర్ణయించాయి. జూలై 20న జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన సీజేపీ నిరసన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తాజా నిరసనల్లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. జూలై 20న జరిగిన ఆందోళనలో హింస చోటుచేసుకోవడం, పలువురు పోలీసులు, సీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేశ్‌కు మద్దతుగా 42 మంది మాజీ న్యాయమూర్తులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement