ఢిల్లీ: ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ఆందోళనల రద్దును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా డీనోటిఫై చేస్తూ ఢిల్లీ పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. అక్టోబర్ 11న ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ జారీ చేసిన స్టాండింగ్ ఆర్డర్‌పై అభ్యంతరం వ్యక్తమవుతోంది. జంతర్ మంతర్ స్థానంలో మూడు కొత్త నిరసన వేదికలను ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
రాంలీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌ను నిరసన స్థలాలుగా గుర్తించారు. ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞాన్‌శ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో నిరసనలపై పోలీసుల అణచివేత చర్యల మధ్య కొత్త నిరసన వేదికలపై వివాదం నెలకొంది. గతంలో జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా సుప్రీంకోర్టు గుర్తించిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు.
నిరసనలకు అనువైన స్థలం కాదంటూ గతంలో రాంలీలా మైదాన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కొత్తగా గుర్తించిన నిరసన స్థలాలు ఢిల్లీ చెత్త డంపింగ్ యార్డులకు సమీపంలో ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో నిరసనలపై దాఖలైన పెండింగ్ పిటిషన్‌లో భాగంగా సుప్రీంకోర్టును పిటిషనర్ ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముక్తా గుప్తా వాదనలు వినిపించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: రఫేల్ డీల్‌పై వ్యాఖ్యల కేసు.. రాహుల్‌కు సుప్రీంలో ఊరట


