ఢిల్లీలో హైటెన్షన్‌.. మధ్యాహ్నం 2 గంటలకు సీజేపీ కీలక ప్రెస్‌మీట్‌ | Chalo Jantar Mantar, Delhi CJP Protest For CEC Resignation On October 11 Live News Updates And Highlights | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో హైటెన్షన్‌.. మధ్యాహ్నం 2 గంటలకు సీజేపీ కీలక ప్రెస్‌మీట్‌

Oct 11 2026 8:11 AM | Updated on Oct 11 2026 10:51 AM

Chalo Jantar Mantar: Cjp Protest October 11 Updates

ఢిల్లీలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. నేడు కూడా నిరసనలు తెలుపుతామన్న సీజేపీ.. జ్ఞానేష్‌ రాజీనామా చేసే వరకు నిరసనలు చేస్తామంటూ తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని.. ఎన్నికల పారదర్శకత కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలంటూ సీజేపీ పిలుపునిచ్చింది.

మధ్యాహ్నం 2 గంటలకు సీజేపీ కీలక ప్రెస్‌మీట్‌

  • ఎన్నికల జాబితా అక్రమాలపై పోరాటం కొనసాగిస్తామన్న సీజేపీ
  • సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్
  • 13 కోట్ల ఓట్ల తొలగింపు, తారుమారుపై జవాబుదారీతనం నిర్థారించాలని డిమాండ్
  • దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని పార్టీ ప్రకటన
  • సీజేపీ నేతలు, పౌరుల నిర్బంధాలపై పార్టీ అభ్యంతరం
  • ఢిల్లీని కోటలా మార్చారంటూ ప్రభుత్వంపై సీజేపీ నేతల విమర్శలు
  • 15 వేల మందికి పైగా నిర్బంధానికి గురయ్యారన్న సీజేపీ ప్రతినిధులు
  • రైళ్లు, బస్సులు, విమానాల రద్దుతో నిరసనలకు ఆటంకం కలిగించారని ఆరోపణ
  • మెట్రో స్టేషన్ల మూసివేత, సిగ్నల్ జామర్ల వినియోగంపై అభ్యంతరాలు
  • ప్రతిపక్షాలు, పౌర సమాజం మధ్య ఐక్యత ఉందన్న ఎన్సీపీ నేత అనీష్ గవాండే
  • ఎన్నికల పారదర్శకత కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపు
  • నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా విస్తృత ఐక్యతతో పోరాడతామన్న ఎస్‌ఎఫ్‌ఐ
  • జంతర్ మంతర్ వద్ద నిరసనలకు ఆంక్షలు విధించడంపై విమర్శలు
  • రాజ్యాంగ హక్కులు, ఎన్నికల పారదర్శకత కోసం ఉద్యమం కొనసాగిస్తామన్న సీజేపీ

సీజేపీ నేతలు అభిజిత్‌, అశుతోష్‌ విడుదల

  • పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన సీజేపీ నేతలు అభిజిత్‌, అశుతోష్‌
  • ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాలతో సీజేపీ నేతల విడుదల
  • నిన్న ఢిల్లీ వస్తున్న సీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నేడు సుప్రీం కోర్టు ప్రత్యేక  విచారణ

  • నేడు ఢిల్లీ పోలీసుల ఆంక్షలు, కోర్టు ధిక్కార పిటిషన్లపై  సుప్రీంకోర్టు ప్రత్యేక  విచారణ
  • సీజేపీ నిరసన నేపథ్యంలో విధించిన ఆంక్షలు పరిమితంగానే ఉండాలన్న సుప్రీం ఆదేశాలు
  • పాటించకపోవడంపై ధిక్కార పిటిషన్  దాఖలు
  • జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహన ధర్మాసనం విచారణ

మ‌ళ్లీ హీటెక్కిన జంత‌ర్ మంత‌ర్ 

  • ఎస్ఐఆర్ వివాదంపై రెండో రోజుకు చేరిన సీజేపీ ఆందోళ‌న‌లు 
  • ఎస్ఐఆర్ అంశంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు సీజేపీ పిలుపు  
  • అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు.. అదుపులోకి వంద‌ల మంది సీజేపీ కార్య‌క‌ర్త‌లు,ముఖ్య నేత‌లు
  • నిన్న ఉదయం నుంచి పోలీసుల అదుపులోనే అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్
  • నేడు ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఈ ముగ్గురు నేతలు 
  • నాయకుల అరెస్టులతో నిరసనలు ఆగిపోవన్న‌ సీజేపీ మరో నేత అజింక్య షిండే 
  • నేతల గైర్హాజరీలోనూ ఆందోళనకారులు నేడు మరోసారి జంతర్ మంతర్ వైపు భారీ మార్చ్ 
  • జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వ‌ర‌కు పోరాటం ఆగ‌ద‌న్న షిండే  

ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌కు అభిజిత్‌

  • ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌కు సీజేపీ ఫౌండర్ అభిజీత్, అశుతోష్ , సౌరవ్‌
  • 9 గంటలకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్న పోలీసులు

👉చలో జంతర్‌ మంతర్‌కు నేడు మరోసారి సీజీపీ నిరసన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ అడ్వైజరీ జారీ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధానిలో జరిగిన నిరసనలను కవర్‌ చేస్తున్న జర్నలిస్టులను నిర్బంధించడంపై మీడియా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బహిరంగ క్షమాపణ చెప్పాలని సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశాయి.

👉ప్రెస్‌ గుర్తింపు కార్డులు చూపించినప్పటికీ పలువురు జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించారని, కొందరు విలేకరుల ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారని మీడియా సంఘాలు ఆరోపించాయి. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలంటూ శనివారం నిరసన తెలిపిన వందలాది మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రకటనలో పేర్కొన్నాయి.

👉పోలీసుల చర్యలను కవర్‌ చేస్తున్న జర్నలిస్టులను సైతం బస్సుల్లో ఎక్కించి ఛత్రసాల్‌ స్టేడియం, చాణక్యపురి పోలీస్‌ స్టేషన్‌ సహా పలు నిర్బంధ కేంద్రాలకు తరలించారని తెలిపాయి. నిరసనలను కవర్‌ చేస్తున్న జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మీడియా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.

ఇదీ చదవండి: అడుగడుగునా అణచివేత 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement