ఢిల్లీలో నిరసనలు అప్‌డేట్స్..
ఢిల్లీకి అబిజిత్ దీప్కే
- ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరిన సీజేపీ అభిజిత్ దీప్కే
- ఢిల్లీలో మోహరించిన పోలీసులు, ప్రత్యేక బలగాలు
- ఎక్కడిక్కడే పోలీసుల తనిఖీలు
- కఠిన ఆంక్షలతో రాజధానిలో హైఅలర్ట్..
- ఉదయం 10 గంటలలోపు ఢిల్లీ చేరుకునే అవకాశం.
#WATCH | Mumbai, Maharashtra: Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke leaves for Delhi ahead of the protest today at Jantar Mantar. https://t.co/ABZcekAlCS
— ANI (@ANI) October 10, 2026
- ‘ఎమర్జెన్సీ’ విధిస్తున్నారంటూ సీజేపీ నేతల విమర్శలు
- నిరసనకు అనుమతి నిరాకరించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని సీజేపీ నేతలు విమర్శించారు.
- నిర్బంధించే అవకాశం ఉన్నప్పటికీ వెనక్కి తగ్గబోమని అభిజీత్ దీప్కే ప్రకటించారు.
- ఢిల్లీ నిరసనపై ఉత్కంఠ
- జంతర్‌మంతర్ వద్ద నిరసన నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రత కట్టుదిట్టం
#WATCH | Mumbai, Maharashtra: Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke leaves for Delhi ahead of the protest today at Jantar Mantar. https://t.co/EZVIGtq9Tx
— ANI (@ANI) October 10, 2026
దేశమంతా జంతర్‌మంతరే: సౌరవ్ దాస్
- రవాణాపై ఆంక్షలు విధించడాన్ని సీజేపీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ ప్రశ్నించారు.
- రైళ్లు, విమానాలు, బస్సులను ఎంతకాలం నిలిపివేస్తారని నిలదీశారు.
- ప్రభుత్వ చర్యలతో ఢిల్లీ మాత్రమే కాకుండా దేశమంతా నిరసన వేదికగా మారిందని వ్యాఖ్యానించారు.
- ఫోన్ నంబర్ లీక్ చేశారని ఆరోపణ
- ఢిల్లీ పోలీసులు తన ఫోన్ నంబర్‌ను బహిర్గతం చేశారని సౌరవ్ దాస్ ఆరోపించారు.
- దీంతో తనకు పెద్దఎత్తున ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు వస్తున్నాయని తెలిపారు.
#WATCH | Delhi: The RAF has been deployed at Firoz Shah Road, Mandi House, ahead of the protest today at Jantar Mantar. https://t.co/3oGqIqwIUz
— ANI (@ANI) October 10, 2026
సెంట్రల్ ఢిల్లీలో లాక్‌డౌన్..
- సీజేపీ ధర్నాకు అనుమతి ఇవ్వని ఢిల్లీ పోలీసులు
- 30000 మంది కేంద్ర బలగాలతో భారీ భద్రత ఏర్పాట్లు
- సున్నితమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీసులు
- అర్ధరాత్రి నుంచి ఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్
- ఢిల్లీ నలుమూలల భారీగా మోహరించిన పోలీసులు
- దుకాణాలు, కార్యాలయాలు మూసివేత
- 57 మెట్రో స్టేషన్లు బంద్
- శాంతియుత నిరసనలకు జంతర్ మంతర్ కాకుండా ఆందోళనకు మరోచోట అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
- హోటల్స్, పీజీ హాస్టల్స్ లో తనిఖీలు చేస్తున్న ఢిల్లీ పోలీసులు
- సెంట్రల్ ఢిల్లీలో సెక్షన్ 163 BNS యాక్ట్ అమలు
- ఢిల్లీలో ఎలాంటి నిరసనలకు ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసుల మైకులలో ప్రకటన
#WATCH | Delhi: Heavy security has been deployed, and barricades have been put up at the Jantar Mantar and Parliament Street areas ahead of the protest today. https://t.co/6yzKOiOw6b
— ANI (@ANI) October 10, 2026
ఢిల్లీలో హైఅలర్ట్..
- కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద శనివారం భారీ ధర్నాకు పిలుపు
- అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి
- ‘నీట్’పేపర్ లీక్ విషయంలో సీజేపీ ఆందోళన సందర్భంగా ఎదురైన అనుభవంతో పోలీసులు కఠిన ఆంక్షలు
- జంతర్‌మంతర్ వద్ద శనివారం ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని తేల్చిచెప్పారు.
#WATCH | Delhi: Security tightened, and barricades put up at Jantar Mantar ahead of the protest today. https://t.co/9CcWs0nzZO
— ANI (@ANI) October 10, 2026
అన్నీ బంద్..
- ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాల ఆందోళన.
- ఎస్‌ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని ప్రతిపక్షాల డిమాండ్.
- ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్.
- జంతర్‌మంతర్ వద్ద సీజేపీ, విద్యార్థి సంఘాల నిరసనకు పిలుపు.
- నిరసనకు అనుమతి నిరాకరించిన ఢిల్లీ పోలీసులు.
- ఢిల్లీలో భారీగా భద్రతా బలగాల మోహరింపు.
- నగర సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్ల వద్ద విస్తృత తనిఖీలు.
- ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేత.
- న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చే కొన్ని రైళ్ల రద్దు.
- ఢిల్లీలో విద్యా సంస్థల మూసివేత, పరీక్షలు, క్రీడా కార్యక్రమాల వాయిదా.
- హోటళ్లు, లాడ్జీల బుకింగ్‌లపై ఆంక్షలు.
- నగరంలోకి ప్రవేశించే వాహనాల తనిఖీలు ముమ్మరం.
- నిరసనకు సంబంధించిన సోషల్ మీడియా ప్రచారంపై పోలీసుల నిఘా.
- జంతర్‌మంతర్ పరిసరాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ప్రకటన.
- న్యూఢిల్లీ జిల్లాను 20 భద్రతా జోన్లుగా విభజించిన పోలీసులు.
- ఢిల్లీకి నిరసనకారులు రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ సూచన.
- ట్రాఫిక్ మళ్లింపులు, రవాణా ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం.


