మెదక్ కలెక్టరేట్: ఉద్యోగులపై నిర్లక్ష్య వైఖరి తగదని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక టీఎన్జీఓ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, కరువు భత్యం, నూతన పీఆర్సీ, ఆరోగ్య కార్డుల అమలుపై ప్రభుత్వం 18 నెలలుగా తాత్సారం చేస్తుందన్నారు. ఉద్యోగుల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగుల పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. చార్మినార్ జోన్ సాధనకు త్వరలో అన్ని వర్గాల ఉద్యోగులతో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సంఘపరంగా వృత్తిపరంగా పదోన్నతులు పొందిన సభ్యులను శాలువాతో సన్మానించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మీనికి రాజ్ కుమార్ పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. అలాగే పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా కార్యదర్శిగా కాయితి సంతోష్‌ను నియమించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాండ్ల అనురాధ, జిల్లా సహా అధ్యక్షుడు ఎండీ ఇక్బాల్ పాషా, కోశాధికారి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఫజులుద్దీన్, రఘునాథరావు, లీల, సంయుక్త కార్యదర్శులు శివాజీ, కిరణ్ కుమార్, రాధ, ఆర్గనైజింగ్ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, క్రీడల కార్యదర్శి గోపాల్, కార్యవర్గ సభ్యులు మరియా, సతీష్, సలావుద్దీన్, నర్సాపూర్ యూనిట్ అధ్యక్షుడు శేషాచారి, ఏడుపాయల వనదుర్గ యూనిట్ కార్యదర్శి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు జంగం నగేష్, ఇరిగేషన్ ఫోరం కార్యదర్శి శ్రీ హర్ష, హెచ్‌డబ్ల్యూఓ ఫోరం కార్యదర్శి శేఖర్, ఏఈఓ ఫోరం కార్యదర్శి రాజశేఖర్, మెడికల్ ఫోరం కార్యదర్శి మంజుల, ఉద్యోగులు పాల్గొన్నారు.
Medak
- టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్
నర్సాపూర్ రూరల్: మండలంలోని అవంచ, రెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన పంచాయతీ శాఖ అధికారులు, సర్పంచ్‌లు పర్యటించారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ సీడీపీఏ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలన, అభివృద్ధి పనులపై అధ్యయనం చేశారు. గ్రామపంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ నిర్వహణ, తడి, పొడి చెత్త, నిధుల సమీకరణ, వాటర్ హార్వెస్టింగ్, నర్సరీలు, ఫారం ఫండ్, అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు, స్వయం సహాయక సంఘాల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, అవంచ, రెడ్డిపల్లి గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్‌లు, రాజకీయ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ సంస్కతి సాంప్రదాయాలను తెలియజేసేందుకు బతుకమ్మ ఆటాపాటలు, ఆయా రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధులత, డీఎల్‌పీఓ సాయిబాబా, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ అంజిరెడ్డి, ఏపీఎం సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్): మండల కేంద్రంలో బుధవారం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో 12మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేశారు. వీరంతా ఈ నెల 25న నిజామాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షుడు కుమార్, జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, రాజగౌడ్, శశికుమార్, కోశాధికారి రవి, మధు, ఆంజనేయులు, శ్రీను, రేణుక, లాజర్, గీత, మీనా పాల్గొన్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి కేవీకే ఆధ్వర్యం ఆరుగురు వ్యవసాయ యువ శాస్త్రవేత్తలు బుధవారం తునికిలో పర్యటించారు. కేవీకే హెడ్‌అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో 115వ ఫౌండేషన్ కోర్స్ ఫర్ అగ్రికల్చర్ సర్వీసెస్‌లో భాగంగా కొత్తగా నియామకమైన వివిధ రాష్ట్రాలకు చెందిన యువ శాస్త్రవేత్తలు వచ్చారు. ఇందులో సందీప్ (ఆంధ్రప్రదేశ్), రణబీర్ (పశ్చిమబెంగాల్), గోపాల కృష్ణ (తమిళనాడు), లావణ్య (తెలంగాణ), రవిప్రకాష్ (ఉత్తరప్రదేశ్), రుచిత(కర్ణాటక) ఉన్నారు. వీరంతా గ్రామంలో నెలరోజులపాటు పర్యటించి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సమాచారం సేకరించి రైతులతో చర్చించనున్నట్లు కేవీకే శాస్త్రవేత్త రవికుమార్ తెలిపారు. అనంతరం యువ శాస్త్రవేత్తలను గ్రామస్తులకు పరిచయం చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సౌజన్య, మాజీ సర్పంచ్ సాయిలు, మానిక్యరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వం తెలంగాణ తల్లి ముఖచిత్రం మార్చినా అధికారులు మాత్రం నేటికీ తెలంగాణ తల్లి పాత ఫొటోలనే ఉపయోగిస్తున్నారు. బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రం వద్ద తెలంగాణ తల్లి చిత్రపటం పాతదే పెట్టారు. దీంతో జాతీయ జెండా ఆవిష్కరణకు వచ్చిన నాయకులు విస్మయం వ్యక్తం చేశారు. అలాగే చిన్నశంకరంపేట ఎంపీడీఓ కార్యాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించగా.. తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం తహసీల్దార్ సమయానికి రాకపోవడంతో జాతీయ జెండాను సమయానికి ఆవిష్కరించలేదు. దాదాపు 9:15 నిముషాల వరకు వేచి చూసిన ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి వెళ్లిపోగా.. ఆ తర్వాత తహసీల్దార్ మాలతి వచ్చి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు.
Vikarabad
తాండూరు రూరల్: విశ్వకర్మల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఖాంజాపూర్ గుట్ట వద్ద విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుట్ట ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీసీ రోడ్లు, విద్యుత్ సదుపాయం, వంటగదుల ని ర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు.
నేటి నుంచి
విధుల్లోకి జీపీఓలు
అనంతగిరి: భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. క్లస్టర్ల వారీగా గ్రామ పరిపాలన అధికారుల(జీపీఓలు) కేటాయింపు ప్రక్రియను బుధవారం పారదర్శకంగా నిర్వహించనట్లు తెలిపారు. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం జీపీఓలను నియమించిందన్నారు. 139 మందికి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. గురువారం నుంచి విధుల్లో చేరాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీఆర్‌ఓ మంగీలాల్, ఏఓ ఫర్హీన్ కాతున్, తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛత కార్యక్రమాలను
విజయవంతం చేద్దాం
తాండూరు టౌన్: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ యాదగిరి తెలిపారు. మున్సిపల్ సిబ్బందితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి 20వ తేదీ వరకు పరిశుభ్రత కార్యక్రమాలు, 23, 24వ తేదీల్లో విద్యాలయాల వద్ద శుభ్రత, 25న చెరువుల వద్ద, 26న ప్రభుత్వ కార్యాలయాల వద్ద, 27న ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద, 29, 30న పార్కుల్లో శుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నీరజా బాల్‌రెడ్డి, ప్రభాకర్ గౌడ్, సోమశేఖర్, విజయాదేవి, రవి, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈ ఖాజా హుస్సేన్, ఉద్యోగులు ఉదయ్, వెంకటయ్య ఉమేష్, ప్రవీణ్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఐను కలిసిన
కాంగ్రెస్ యూత్ నాయకులు
యాలాల: ఇటీవల యాలాల ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన విఠల్‌రెడ్డిని బుధవారం కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. యూత్ విభాగం మండల అధ్యక్షుడు వీరేశం ఎస్‌ఐను సన్మానించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు యూత్ కాంగ్రెస్ తరఫున అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఖాసీం, కిషన్, కేఎన్‌ఎస్, ప్రశాంత్‌కుమార్, రమేష్, నగేష్, మహిపాల్, పాల శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు జోనల్ స్థాయి పోటీలు
కొడంగల్ రూరల్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం ఉదయం 10 గంటలకు జోనల్ స్థాయి ఎస్‌జీఎఫ్ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు జోనల్ కార్యదర్శి అజీజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, దుద్యాల్ మండలాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అండర్–14, అండర్–17 విభాగాలకు సంబంధించి క్రీడా కారుల ఎంపిక ఉంటుందని తెలిపారు.
అనంతగిరి/మోమిన్‌పేట: ట్రిపుల్ ఆర్ భూ బాధితులకు బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందరాని హామీ ఇచ్చారు. మండలంలోని టేకులపల్లి, దేవరంపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు బుధవారం నగరంలోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చడం ద్వారా తమ భూములు పోతున్నాయని, ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల ఆస్తులను కాపాడేందుకు పేద రైతుల పొట్ట కొడుతోందని ఆరోపించారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా సర్వే చేయడం ఏమిటని ప్రశ్నించారు. అభివృద్ధికి పేదల భూములే కావాలా అని నిలదీశారు. రైతులు మెచ్చేలా పరిహారం చెల్లించిన తర్వాతే భూములు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. బలవంతపు భూసేకరణ మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. గతంలో ఓఆర్‌ఆర్ విషయంలో కూడా ఇదే విధంగా సొంత ఎజెండాతో పేద రైతులను ముంచిందన్నారు. ఇప్పుడు అలైన్‌మెంట్ మార్చడం వెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్థన్‌రెడ్డి, మర్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్, భూములు కోల్పోతున్న రైతులు ఉన్నారు.
కుల్కచర్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. బుధవారం మండలంలోని అనంతసాగర్ గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన పేదలను గుర్తించి వారికి నీడ కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. లబ్ధిదారులు ఇంటి పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాంచంద్రయ్య, భరత్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మహేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, నాయకులు కుర్మయ్య, రఘు, కేశవులు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి
అనంతగిరి: మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 56 రకాల పరీక్షలు, 17 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అనంతరం వికారాబాద్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా ఆధునీకరణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, డీఎంహెచ్‌ఓ లలితాదేవి తదితరులు పాల్గొన్నారు.
ధారూరు: మండలంలోని ఎబ్బనూర్ గ్రామంలో 52 మంది ఫేక్ ఓటర్లు ఉన్నారని వచ్చిన ఫిర్యాదుపై బుధవారం డీఆర్‌ఓ మంగీలాల్ విచారణ చేపట్టారు. గ్రామ ఓటరు జాబితాలో 52 మంది పేర్లు ఉన్నా వారు స్థానికంగా లేనివారని కొంతమంది కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీఆర్‌ఓ ధారురు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. విచారణకు హాజరుకావాలని ఆ 52 మందికి సమాచారం ఇచ్చారు. మొదటి రోజు 26 మంది రావాల్సి ఉండగా 12 మాత్రమే వచ్చారు. గురువారం కూడా విచారణ చేపట్టనున్నట్లు తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు.
మహనీయుల త్యాగ ఫలితమే తెలంగాణ స్వాతంత్య్రం
వికారాబాద్: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే రాచరిక వ్యవస్థకు చరమగీతం పడిందని.. ఆ రోజును స్మరించుకోవడం ఎంతో అవసరమని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో తెలంగాణ విలీన దినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అందరికీ 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే.. తెలంగాణ మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వేచ్ఛా వాయువులు పీల్చుకుందన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలతో మన ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎందరో మహనీయులు అసువులు బాశారని అన్నారు. ఇక్కడి ప్రజల స్వాతంత్య్ర ఆకాంక్షను గుర్తించి నాటి ప్రధాని నెహ్రూ, హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేశారని గుర్తు చేశారు. ఈ రోజును మనం ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకొంటున్నామని పేర్కొన్నారు.
హామీలనీ అమలు చేస్తున్నాం
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందందని తెలిపారు. అభయ హస్తంలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పథకాలు అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఇలా రైతు సంక్షేమ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆరు గ్యారంటీలను నెరవేర్చే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహ జ్యోతి, మహిళలకు ఉచిత బస్సుప్రయాణం, సబ్సిడీ గ్యాస్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రుణమాఫీ పథకం కింద 1,00,358 మంది రైతుల రూ.849.30 కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందన్నారు. జిల్లాకు 13,640 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 11 వేల పైచిలుకు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు కూడా ఇచ్చినట్లు గుర్తు చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వటంతో పాటు పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షల వరకు పెంచి పేదలకు ఆరోగ్య భరోసా కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద 924 పాఠశాలల్లో రూ. 17.55 కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. రైతుల నుంచి ధాన్యం సేకరించడంతోపాటు క్వింటాలు సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. వెనుకబడిన కొడంగల్ అభివృద్ధికి కడా ఏర్పాటు చేసి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్‌చౌదరి, డీఆర్వో మంగీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బషీరాబాద్: మండలంలోని జీవన్గీ జెడ్పీ ఉన్నత పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కనీస సదుపాయాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 102 మంది విద్యార్థులు ఉన్నారు. భవనం శిథిలావస్థకు చేరడంతో నాలుగు గదులకు తాళం వేశారు. ఉన్న మూడు గదుల్లో 8 నుంచి 10 తరగతి వరకు.. మిగిలిన 6, 7 తరగతులను వరండాలో నిర్వహిస్తున్నారు. చిన్నపాటి వర్షం పడిన బోధనకు అంతరాయం కలుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తలుపులు, కిటికీలు, గోడలు దెబ్బతిన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటున్నారు. వంటగది పరిస్థితి కూడా దారుణంగా ఉంది. మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు నిర్వాహకులు జంకుతున్నారు.
రూ.30 లక్షలు వెనక్కు
మన ఊరు.. మనబడి పథకం కింద గత ప్రభుత్వం రూ.30లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో కొత్త తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా పనులు ప్రారంభం కాకుండానే నిధులు వెనక్కు వెళ్లాయి. చిన్నపాటి మరమ్మతులతో సరిపెట్టి విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
నిరుపయోగంగా బల్లలు
పాఠశాలల ప్రారంభ సమయంలో విద్యార్థులు కూర్చునేందుకు ప్రభుత్వం 60 డ్యూయల్ బల్లలు పంపిణీ చేసింది. ఇప్పటి వరకు వాటిని వినియోగించలేదు. దీంతో నిరుపయోగంగా మారాయి.
నిధులు మంజూరు చేయాలి
పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి. ప్రస్తుతం మూడు గదులు మాత్రమే అందుబాటులో ఉండటంతో 8 నుంచి 10వ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. 6, 7వ తరగతి విద్యార్థులకు వరండాలో బోధన చేస్తున్నారు. వర్షం పడ్డా, ఎండ ఎక్కువగా ఉన్నా ఇబ్బంది పడుతున్నాం.
– 6వ తరగతి విద్యార్థులు
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
పాఠశాలలో గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. గతంలో మన ఊరు.. మనబడి పథకం కింద నిధులు మంజూరైన పనులు జరగలేదు. ప్రస్తుతం మూడు తరగతులను వరండాలో నిర్వహిస్తున్నాం. పాఠశాలకు మంజూరైన బల్లలను వినియోగిస్తాం.
– దూస రాములు, ఎంఈఓ
శిథిలావస్థలో జీవన్గీ జెడ్పీ ఉన్నత పాఠశాల భవనం
నాలుగు గదులకు తాళం
ఉన్న మూడింటిలోనే 5 తరగతులు
పట్టించుకోని పాలకులు, అధికారులు
ఇబ్బందుల్లో విద్యార్థులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త నగరాలు, రహదారులు, మౌలిక సదుపాయాలకు రూపకల్పన జరుగుతుంది. అందులో రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) కూడా ఒకటి. ప్రభుత్వం తమ ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టింది. ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పటికీ చర్చల దశలోనే ఉన్న ఈ రోడ్డుపై కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జిల్లా ప్రజలను, రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ విడుదల చేసిన అనధికారిక అలైన్‌మెంట్(పాత)ను మార్చి, కొత్త అలైన్‌మెంట్ రూపొందిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. నిజానికి పాత అలైన్‌మెంట్ అనేది ఒక ఊహాజనితం మాత్రమే. భూసేకరణ విషయంలో రైతులను తప్పు దోవ పట్టించొద్దు’ అని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన శ్రీసాక్షిశ్రీ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను, వాటి పరిణామాలను ఆయన మాటల్లోనే...
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు మాత్రమే ఫైనల్
రావిర్యాల ఎగ్జిట్ 13 నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు అటు నుంచి ఆమనగల్లు వరకు ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశాం. తొలి విడతలో రావిర్యాల ఎగ్జిట్ నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు ఉన్న 20 కిలోమీటర్లు రోడ్డుకు 449 ఎకరాలు, రెండో విడతలో మీర్‌ఖాన్‌పేట వరకు అటు నుంచి ఆమనగల్లు వరకు 21.5 కిలోమీటర్ల రోడ్డుకు 554.35 ఎకరాలు భూమి అవసరమైంది. ఆ మేరకు మొత్తం 4,725 మంది రైతుల నుంచి 1004.22 ఎకరాలు సమీకరించాం. భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి అవార్డును పాస్ చేశాం. భూములు ఇచ్చేందుకు నిరాకరించిన కొంత మంది రైతులకు సంబంధించిన మొత్తాన్ని అథారిటీలో జమ చేశాం. ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదు. టెండర్లు కూడా ఖరారయ్యాయి.
ఓ కొలిక్కి వచ్చిన బీజాపూర్ రహదారి
బీజాపూర్ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. దీంతో ప్రభుత్వం అప్పా టు మన్నెగూడ వరకు(46.405 కిలోమీటర్లు) రోడ్డును రెండు వైపులా 60 మీటర్ల వరకు విస్తరించాలని నిర్ణయించింది. ఆ మేరకు రూ.928.41 కోట్లు ఖర్చు సహా 266.55 హెక్టార్ల భూమి అవసరం ఉన్నట్లు గుర్తించింది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అయితే రోడ్డుకు ఇరు వైపులా ఉన్న 60 నుంచి 80 ఏళ్ల వయసున్న 915 మర్రి వృక్షాలను తొలగించాల్సి రావడంపై కొంత మంది పర్యావరణ వేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పురాతన మర్రి చెట్ల ఉనికి దెబ్బతినకుండా మధ్యేమార్గంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే రెడ్ మార్క్ వేసిన 150 వృక్షాలు మినహా మిగిలిన వాటిని సర్వీసు రోడ్డుకు, ప్రధాన క్యారేజ్‌వేకు మధ్యలో ఉండేలా స్వల్ప మార్పులు చేపట్టారు. ఇప్పటికే మొయినాబాద్, చేవెళ్ల బైపాస్‌రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.
నాలుగు వేల అర్జీలు క్లియర్ చేశాం
రెవెన్యూ సదస్సుల్లో భాగంగా 21 వేలకుపైగా అర్జీలు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, బాధితులకు నోటిసులు జారీ చేశాం. క్షేత్రస్థాయి నుంచి రిపోర్టులు తెప్పించుకుని ఇప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నాం. రోజుకు సగటున 50 నుంచి 60 దరఖాస్తులను పరిష్కరిస్తున్నాం. ఇప్పటి వరకు నాలుగు వేలకుపైగా దరఖాస్తులను క్లియర్ చేశాం. ధరణి పోర్టల్‌లో దొర్లిన తప్పిదాలకు శ్రీభూభారతిశ్రీలో అవకాశం ఇవ్వడం లేదు. భూ భారతి పోర్టల్‌తో అన్ని సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది.
రైతులను తప్పుదారి పట్టించొద్దు
పాత అలైన్‌మెంట్ ఓ కన్సల్టెన్సీ
ఊహాజనితం మాత్రమే
భూ భారతితోనే భూములకు పూర్తి రక్షణ
‘సాక్షి’తో కలెక్టర్ నారాయణరెడ్డి
ఇంకా ప్రతిపాదనల దశలోనే
నగరంపై ఒత్తిడి తగ్గించేందుకు ఔటర్ మాదిరిగా మరో రింగు రోడ్డు అవసరం ఉందని ప్రజలతో పాటు ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తైతే జిల్లా రూపు రేఖలే మారబోతున్నాయి. భూముల ధరలు పెరిగి, రియల్ ఎస్టేట్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఈ రోడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇది ప్రభుత్వ ప్రతిపాదన మాత్రమే. ఎక్కడ నివాసాలు ఉన్నాయి? ఎక్కడ చెరువు ఉంది? ఎక్కడ బఫర్ జోన్ ఉంది? ఎక్కడ విల్లాలు ఉన్నాయో? స్పష్టత రాలేదు. రోడ్లు భవనాల శాఖ తుది రిపోర్టు తర్వాతే రెవెన్యూశాఖ భూసేకరణ ప్రక్రియను చేపడుతుంది. అయితే ప్రభుత్వ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంలో కొంత మంది త్యాగం చేయక తప్పదు. రైతులు అనవసరంగా ఆందోళన చెందొద్దు.
తాండూరు రూరల్: తాండూరు పట్టణం, మండలంలోని ఆయా పాఠశాలలకు 17 మంది టీచర్లను సర్దుబాటు చేసినట్లు ఎంఈఓ వెంకటయ్య తెలిపారు. అంతారంతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 మంది ఎస్జీటీలు, ముగ్గురు స్కూల్ అసిస్టెంటలను వివిధ స్కూళ్లలో సర్దుబాటు చేశామని స్పష్టంచేశారు. మైసమ్మతండా, జినుగుర్తితండా, గుండ్లమడుగుతండాలో ఒక్కో ఉపాధ్యాయుడే ఉన్నాడన్నారు. ప్రతీ పాఠశాలలోనూ విద్యార్థులకు మెగురైన బోధన, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఎంఈఓ వెంట అంతారంతండా హెచ్‌ఎం రమేశ్, సీఆర్‌పీ సుభాష్ తదితరులు ఉన్నారు.
● షోకాజ్‌తో షో చేసిన
వ్యవసాయ అధికారులు
● ‘అధిక ధరల’ వ్యవహారం
● చివరికి మునిగింది రైతులే!
బషీరాబాద్: ప్రభుత్వ నిబంధనలను లెక్కచేయకుండా, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తూ తమను మోసం చేస్తున్న వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం బషీరాబాద్ రైతు వేదిక వద్దకు చేరుకుని వ్యవసాయ శాఖ అధికారులను నిలదీశారు. ఒక్క బస్తా యూరియా కోసం రోజుల తరబడి క్యూలైన్‌లో నిలబడ్డామని, ఇదే అదనుగా దుకాణం యజమానులు ఇష్టానుసారం ఎరువుల ధరలు పెంచి విక్రయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై విచారణ చేపట్టిన అధికారులు చివరికి వ్యాపారులకే వంతపాడటంపై నిరసన తెలిపారు.
ఏం జరిగిందంటే..
బషీరాబాద్‌లోని ఓ ఫర్టిలైజర్ షాపులో యూరియా, డీఏపీ అధిక ధరలకు విక్రయిస్తున్నారని గత గురువారం పలువురు రైతులు వ్యవసాయ అధికారులకు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన మండల వ్యవసాయ అధికారి సదరు షాపు షాపు యజమానికి శనివారం షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఐదు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని రైతులు, మీడియా ముందు ఆదేశాలు జారీచేశారు. బుధవారం గడువు ముగియడంతో సదరు షాపు యజమాని వివరణ ఇచ్చుకున్నారు. యూరియా, డీఏపీ ధరలు తెలియక ఎక్కువ ధరకు విక్రయించామని, మరోసారి పొరపాటు కాకుండా చూస్తానని, బిల్లు బుక్కు కోసంఆర్డర్ ఇవ్వగా ప్రింటింగ్‌లో జాప్యం కావడంతో రశీదులు ఇవ్వలేకపోయామని దుకాణ యజమాని సంజాయిషీ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు కర్షకులు రైతు వేదికకు చేరుకుని అధికారులను నిలదీశారు. ఎక్కువ ధరలకు అమ్మినట్లు దుకాణాదారులే ఒప్పుకొన్నారని చెబుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా తాండూరు ఏడీఏ కూడా సదరు షాపు యజమానిని వెనకేసుకురావడంపై రైతులు అసహనం వ్యక్తంచేశారు. ఇదే విషయమై ఏడీఏను అడగగా తమపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని, మీడియాలో వచ్చిన కథనాలతో దుకాణ యజమానిపై చర్యలు తీసుకోలేమని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమకు అండగా నిలవాల్సిన అధికారులు, నాయకులు వ్యాపారులకే మద్దతు పలకడం ఏమిటని వాపోయారు. గట్టిగా నిలదీద్దామంటే తమకు ఎరువులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతారని, అత్యవసరమైతే ఉద్దెర(క్రెడిట్) ఇవ్వరని పలువురు తెలిపారు. మరికొందరు మాత్రం అధిక ధరల విషయమై చర్యలు తీసుకోకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
● వాల్యానాయక్‌తండాకు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాని వైనం
● ఆందోళన వ్యక్తంచేస్తున్న గిరిజనులు
దుద్యాల్: ఇందిరమ్మ మా ఊరికి ఇల్లేదమ్మా.. అంటూ మండల పరిధిలోని వాల్యానాయక్‌తండా గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దుద్యాల్ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈగ్రామానికి ఇందిరమ్మ పథకం మొదటి విడతలో ఒక్క ఇల్లు కూడా మాజూరు కాలేదు. తండాలో చాలా మంది ఆర్హులు ఉన్నా అధికారులు, పాలకులు తమపై దయ చూపలేదని వాపోతున్నారు. అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇందుకోసం పక్కాగా వివరాలు సేకరిస్తున్నామని చెప్పిన అధికారుల మాటలన్నీ అబద్ధాలేనని పేర్కొంటున్నారు. అధికారులు చేసిన సర్వేలో తమ గ్రామంలోని ఒక్కరికై నా ఇందిరమ్మల ఇంటికి అర్హత లేదా అని ప్రశ్నిస్తున్నారు. వాల్యానాయక్‌తండాలో 600 జనాభా నివసిస్తున్నారు. సుమారు 80 వరకు ఇళ్లు ఉన్నాయి. వీరిలో చాలా మంది పక్కా ఇల్లు లేవు. శిఽథిలావస్థకు చేరిన ఇళ్ల పైకప్పులపై టార్పాలిన్ కవర్లు వేసుకుని జీనవం సాగిస్తున్నారు. ఒక్కసారి తమ తండాను, నివాసాలను పరిశీలించాలని స్థానికులు హన్మిబాయి, రాములు నాయక్, శివనాయక్, రవినాయక్, గోప్యానాయక్ తదితరులు కోరారు.
న్యాయం చేయాలి
నాకు ఉండేందుకు గూడు లేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని పలుమార్లు అధికారులు, నాయకులకు విన్నవించా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాతండాకు ఇళ్లు ఇస్తారని ఆశపడ్డాం. కానీ ఒక్కరికి కూడా ఇల్లు రాకపోవడం బాధగా ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలి.
– మాణిక్యనాయక్, వాల్యానాయక్‌తండా
దోమ: సామాన్య శాస్త్రం బోధిస్తున్న రాములు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికవ్వడం హర్షణీయమని జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులు పేర్కొన్నారు. బుధవారం దోమ మండల పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో తోటి ఉపాధ్యాయులతో కలిసి ఆయన శాలువాకప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ..ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేస్తున్నారన్నారు. జిల్లా స్థాయిలో తమ పాఠశాల ఉపాధ్యాయుడికి అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.
పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతులు
బషీరాబాద్: రోడ్డు విస్తరణలో పగిలిపోయిన తాగునీటి పైప్‌లైన్‌కు పంచాయతీ సిబ్బంది బుధవారం మరమ్మతు పనులు చేపట్టారు. వారం రోజుల క్రితం రోడ్డు విస్తరణ కోసం నిర్మాణ పనులు చేపట్టడంతో పైప్‌లైన్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో తాగునీటి సరఫరాలేక ఐదు రోజులుగా ప్రజులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరమ్మతు పనులు పూర్తికావడంతో నీటిసరఫరా పునరుద్ధరించినట్లు కార్యదర్శి జయకర్ తెలిపారు.
న్యాయం చేయాలని వినతి
శంకర్‌పల్లి: వ్యవసాయం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1967లో తమకిచ్చిన నాలుగు ఎకరాల భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని మండలంలోని పొన్నగుట్టతండాకు చెందిన కిషన్, శంకర్, రాంసింగ్, ఆమ్రియాలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. 1967లో ప్రభుత్వం తమ తండ్రి వాల్యకి నాలుగు ఎకరాల భూమిని ఇచ్చింది. అప్పటి నుంచి దాన్ని ఏళ్లుగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. గత కొన్ని నెలల నుంచి మోకిల తండాకు చెందిన ఓ వ్యక్తి తమని భయభ్రాంతులకు గురి చేస్తూ, పొలం లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మంగళవారం పొలం వద్ద వారు పనులు చేస్తున్నారని సమాచారం అందింది. అక్కడికి మేము వెళ్లగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మోకిల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఇరువురు మాట్లాడుకోవాలని చెబుతున్నారే తప్పా.. కేసు నమోదు చేయడం లేదన్నారు.
దోమ: దొంగ ఎన్కేపల్లి గ్రామంలో విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను బుధవారం గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని కాళికాదేవి మాతకు యజ్ఞం నిర్వహించి వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విశ్వకర్మలు మాట్లాడుతూ..విశ్వకర్మలకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేశంచారి, నాగేంద్రచారి, కృష్ణస్వామిచారి, మనచారి, చంద్రశేఖర్‌చారి, బ్రహ్మంచారి, వీరన్నచారి, కరుణాకర్‌చారి, తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ రూరల్‌లో..
కొడంగల్ రూరల్: పట్టణంలోని మహాదేవుని ఆలయ ఆవరణలో విశ్వకర్మ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో గణపతిపూజ, శ్రీకాళికాదేవి, విశ్వకర్మ చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సంఘం సభ్యులు ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆర్ జగదీశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంతు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పరిగి: పట్టణ కేంద్రంలో విరాట్ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ వేడుకలను నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ పేర్కొన్నారు. బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఇబ్రహీంపట్నం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వాస్తవాలు–వక్రీకరణ అనే అంశంపై ఇబ్రహీంపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజులు విచ్చేసి మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాయుధ పోరాటం సాగిందన్నారు. నిజాం అరాచకాలకు ఎదిరిస్తూ సామాన్యులు సాయుధులుగా మారారన్నారు. నిజాంను గద్దెదింపడం కోసం నాయకత్వం వహించింది కమ్యూనిస్టులేనన్నారు. సాయుధ పోరులో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ స్థానమేక్కడిదన్నారు. నిర్బంధాలు, త్యాగాలు చేసింది ఎందరో చెప్పగలరా అని ప్రశ్నించారు. వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటానికి ఏమాత్రం సంబంధం లేని పార్టీలు విమోచన, విలీనం, విద్రోహం అంటూ నేడు చరిత్రను వక్రభాష్యాలు చెబుతున్నారన్నారు. బీజేపీ అనేక ఏళ్ల నుంచి తెలంగాణలో మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శంకర్, డీవైఎఫ్‌ఐ కార్యదర్శి జగన్, నాయకులు సామేలు, గణేష్, శ్రీకాంత్, వంశీ, తరంగ్, జంగయ్య, అజయ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్
దోమ: పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం మరువలేనిదని మండల విద్యాధికారి వెంకట్ అన్నారు. బుధవారం దోమ మండల పరిధిలోని ఊటుపల్లి, కొండాయపల్లి గ్రామాల్లో గ్రామానికి చెందిన పట్లోళ్ల రాజేశ్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి ఆయా పాఠశాలలకు ఎల్‌ఈడీ టీవీ, విద్యార్థులకు టై, బెల్టు, ఐడీ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ..ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నప్పటికీ దాతలు కూడా సహకరిస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరం బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కిష్టాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు లాల్యనాయక్, ప్రధానోపాధ్యాయులు పరిపూర్ణ, శివప్రసాద్, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
మండల విద్యాధికారి వెంకట్
● స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి
మూల్యం తప్పదు
● అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే
గువ్వల బాలరాజు
ఆమనగల్లు: ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని తెలిపారు. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆయన బుధవారం తొలిసారి అచ్చంపేటకు వెళ్తున్న క్రమంలో బీజేపీ ఆమనగల్లు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. అన్ని విషయాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తిలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, బీజేపీ రాష్ట్ర నాయకులు కండె హరిప్రసాద్, రాంరెడ్డి, మండల అధ్యక్షుడు కేకేశ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కర్నాటి విక్రంరెడ్డి, బీజేపీ నాయకులు దుర్గయ్య, సుండూరు శేఖర్, లక్ష్మణ్, చెన్నకేశవులు, రవిరాథోడ్ పాల్గొన్నారు.
- ఎస్‌ఐ వసంత్ జాదవ్
దోమ: విద్యార్థులు, యువత డ్రగ్స్, గంజాయితో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్‌ఐ వసంత్‌జాదవ్ తెలిపారు. బుధవారం దోమ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో షీటీం ఇంచార్జి నర్సింహులుతో కలిసి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులగురించి, డ్రగ్స్ రహిత సమా జం దిశగా ముందుకు సాగాలన్నారు. మహిళలపై ఎలాంటి దాడులు జరిగిన 100, 181 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం చేరవేయ్యాలన్నారు. మానవ అక్రమ రవాణా, మద్యపాన నిషేధాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలన్నారు. ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తత అవసరమన్నారు. సైబర్ నేరాలకు గురైన వారు 1930కి సమాచాం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో షీటీం సభ్యులు బి.సావిత్రి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Sangareddy
సంగారెడ్డి జోన్: ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేవిధంగా చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంత్రితో పాటు కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి నివాళులర్పించారు. అనంతరం మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి మాట్లాడుతూ..నేటి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం మన సొంతం కావడానికి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారన్నారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి రాష్ట్ర అభివృద్ధికి నాంది పలికిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తుందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రెట్టింపు ఉత్సాహంతో కలిసికట్టుగా శ్రమించి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
14,538 మంది లబ్ధిదారులకు ఇళ్లు
రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని వారిని గుర్తించి, వారు నిర్మించుకునేందుకు జిల్లాలో 14,538 మంది దరఖాస్తుదారులకు ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 7,429 పనులు ప్రారంభం కాగా, 239 నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.46కోట్లు లబ్ధిదారులకు చెల్లించడం జరిగిందని వివరించారు.విద్య, వైద్యానికి ప్రాధాన్యత
జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 59 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించుకుంటున్నామని, అందుకు రూ. రూ.1.80 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. రూ.186 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాల భవనాన్ని ఇటీవలే ప్రారంభించామని, రూ.273 కోట్ల నిధులతో సంగారెడ్డిలో 500 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసినట్లు మంత్రి వెల్లడించారు.
దేశాభివృద్ధిలో శిల్పుల పాత్ర కీలకం
నేటి సమాజంలో శిల్పులు, కార్మికులు, వృత్తిదారులు సాంప్రదాయ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. విశ్వకర్మ భగవాన్ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, తదితరులు పాల్గొన్నారు.
ఆహార భద్రత పథకం ద్వారా సన్నబియ్యం
ప్రజా పాలన వేడుకల్లోమంత్రి దామోదర
అమరవీరుల స్తూపం వద్ద నివాళులు
కలెక్టరేట్‌లో ఆకట్టుకున్నసాంస్కృతిక కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత పథకం ద్వారా ప్రతీనెల ఉచితంగా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 846 రేషన్ దుకాణాల ద్వారా 13, 3719 మంది సభ్యులకు 3,736 క్వింటాళ్ల బియ్యం ప్రతీనెల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా 4,10,652 తెల్ల రేషన్ కార్డులు, 26,078 అంత్యోదయ, 100 అన్నపూర్ణ కార్డులున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జోన్: నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. కలెక్టరేట్లో పీసీసీ ఎన్‌డీటీ యాక్ట్ అమలుపై బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పూర్తిగా నిషేధించిందని, అందుకు పీసీసీఎన్‌డీటీ చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు చేపట్టి వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా వైద్యాధికారి నాగనిర్మల తదితరులు పాల్గొన్నారు.
ఎకరాకు రూ.20 వేల
నష్ట పరిహారం ఇవ్వాలి
మంజీర రైతు సమాఖ్య అధ్యక్షుడు
పృథ్వీరాజ్ డిమాండ్
రాయికోడ్(అందోల్): అతివృష్టి వల్ల జిల్లాలో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మంజీర రైతు సమాఖ్య అధ్యక్షుడు పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. రాయికోడ్‌లో బుధవారం పాడైన పత్తి పంటలను సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వ రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.
పుట్టినరోజు వేడుకలు
నిర్వహించొద్దు
అభిమానులకు ఎమ్మెల్యే
గూడెం మహిపాల్‌రెడ్డి విజ్ఞప్తి
పటాన్‌చెరు: ఈ ఏడాది తన పుట్టినరోజును జరుపుకోవడంలేదని అభిమానులు, పార్టీ కార్యకర్తలెవరూ తన జన్మదిన వేడుకలు నిర్వహించవద్దని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తన పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్‌రెడ్డి మరణం తర్వాత పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోకూడదని నిర్ణయం తీసుకున్నానని, అభిమానులెవరూ తన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని బుధవారం ఓ ప్రకటనలో కోరారు. ఈనెల 19న తన పుట్టినరోజున సన్నిహితులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నట్లు ఆయన తెలిపారు.
తప్పనిసరిగా రశీదు ఇవ్వాలి
జేడీఏ శివప్రసాద్
కొండాపూర్(సంగారెడ్డి): ఎరువులు కొంటున్న రైతులకు సంబంధిత డీలర్ తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయాధికారి కొండాపూర్‌లోని పీఏసీఎస్‌తో పాటు యూరియా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎరువులను అధిక ధరలకు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు. అనంతరం బిల్ బుక్కులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అదేవిధంగా కొండాపూర్‌లో పత్తిపంటను పరిశీలించారు.
అల్గోల్‌లో ఎన్‌సీసీ శిబిరం
జహీరాబాద్ టౌన్: మండలంలోని అల్గోల్ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో తెలంగాణ 33 బెటాలియన్ ఎన్‌సీసీ క్యాడెట్ల సంయుక్త వార్షిక శిక్షణ శిబిరం బుధవారం ప్రారంభమైంది. 600 మంది క్యాడెట్లకు 10 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రమేష్ సరియాల్ మాట్లాడుతూ...క్యాడెట్లకు నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ, జాతీయ ఐక్యత స్ఫూర్తి పెంచుతామన్నారు. కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపాల్ జె.రాములు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జమీల్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి రవిపూరి సుబేదార్ మేజర్లు పాల్గొన్నారు.
పుల్‌కల్(అందోల్): భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో మంజీరా నది తీరం వెంబడి పంటలు మునిగిపోయి రైతులకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మంజీరానది పరీవాహకం సారవంతమైన నేల కావడంతో పంటలు బాగా పండుతాయని ఆశించిన రైతులను వరదలు దిక్కుతోచని స్థితిలోకి నెట్టాయి. ప్రాజెక్టుకు భారీ వరదలు రావడంతో క్రస్టుగేట్ల ద్వారా నీటిని వదలడం...ఆ నీరు మంజీరా బ్యారేజ్ గుండా దిగువకు సరాసరి పోకపోవడంతో మంజీరా నది ప్రవాహం వెంబడి నీరు నిలిచిపోయి పంటలు మునిగిపోయాయి.
ప్రతీ ఏటా ఇదే పరిస్థితి
సింగూరు ప్రాజెక్టు దిగువ నుంచి మంజీరా బ్యారేజ్ వరకు 22 కిలోమీటర్ల మంజీరా నది పరివాహకం ఇరువైపులా వరదల వల్ల పంటలు ముంపు బారిన పడుతున్నాయి. వరదలు వచ్చిన ప్రతి ఏటా పంటలు మునిగి పోవడం ఇక్కడ సాధారణమైపోయింది. పుల్‌కల్,సదాశివపేట,మునిపల్లి తదితర మండలాల పరిధిలోని మంజీరా నది పరీవాహకం రైతులకు కండగండ్లు మిగులుతున్నాయి.
ప్రభుత్వం ఆదుకోవాలి..
మంజీరా నది పరీవాహకంలో వరదల వల్ల ఏటా పంటలు మునిగిపోతున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజ్ వరకు ఉన్న భూముల్లో వరదల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి.
– కమాల్‌రెడ్డి రైతు, ముద్దాయిపేట
ఏటా మునుగుతున్న పంటలు
నష్టపోతున్న రైతులు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: చరిత్రను బీజేపీ, ఆర్‌ఎస్సెస్ వక్రీకరిస్తున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. బీజేపీ నేతలకు, ఆర్‌ఎస్సెస్‌కు సాయుధ పోరాటానికి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు? సంగారెడ్డిలో వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో రాఘవులు మాట్లాడారు. నిజాం, బీజేపీ విధానాలు ఒక్కటేనని, మతం పేరిట ప్రజలను చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నాడు బ్రిటిష్ వాళ్లకుతొత్తుగా పని చేసింది ఆర్‌ఎస్సెస్ వాళ్లేనని, సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని తేల్చి చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ విమోచనదినంగా నిర్వహించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు, రాష్ట్ర నాయకుడు మల్లిఖార్జున్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం, రాజయ్య, మాణిక్యం, సాయిలు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటానికిఆర్‌ఎస్సెస్, బీజేపీలకు సంబంధమేంటి?
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడుబీవీ రాఘవులు
నారాయణఖేడ్: నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడించారు. ఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంట్రల్ రిజర్వు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ (సీఆర్‌ఐఎఫ్) నిధులు రూ.20కోట్లతో ఎన్‌హెచ్ 161బీ అనుసంధానంతో మూడుగుంటల చౌరస్తా నుంచి వయా సంజీవన్‌రావుపేట్, కడ్పల్, సిర్గాపూర్, చాప్టా(కె) క్రాస్‌రోడ్డు వరకు రహదారి అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు చెప్పారు.
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కృషితో కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఈ నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు అనుసంధానిస్తూ నాలుగు రోడ్లను, హ్యామ్‌కింద రూ.300 కోట్లతో రహదారులకోసం ప్రతిపాదించినట్లు తెలిపారు. బోర్గి, చౌకాన్‌పల్లి, కంగ్టి, ఖేడ్, రాయిపల్లి బీటీ రెన్యూవల్‌కు కూడా ప్రతిపాదించామని వెల్లడించారు.
రూ.5కోట్లతో ఎన్‌జీ హుక్రాన రహదారి నిర్మాణం, వాసర్, కరస్‌గుత్తి ఎరక్‌పల్లికి రూ.5కోట్లు, రూప్లా తండా నుంచి లచ్చు తండాకు రూ.4.50కోట్లతో రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎస్టీ హ్యాబిటేషన్ కింద కొండానాయక్ తండా రూ.2.20కోట్లు, ఎకరన్‌పల్లి నుంచి హనుమాన్ తండాకు రూ.1.10 కోట్లు, లక్యానాయక్ తండాకు రూ.1.75కోట్లతో రహదారులను బీటీ రెన్యూవల్ చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యాదవరెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.
కంది(సంగారెడ్డి): హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) నిధులతో చెరువుల సుందరీకరణ చేపట్టనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. కంది చుట్టుపక్కల దేవుని చెరువు, కిసాన్‌సాగర్ చెరువు, పాత చెరువును టీజీఐసీసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి సందర్శించారు. చెరువుల వద్ద చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనం కోసం మెట్లతోపాటు గణేశ్ నిమజ్జనం కోసం గద్దెలు నిర్మించాలన్నారు. చెరువుల చుట్టూ నెక్లెస్ రోడ్లను నిర్మించి పచ్చదనం ఏర్పాటుచేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. భూములను ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తే పరిహారం చెల్లించి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ బాలగణేశ్ పాల్గొన్నారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
● యాత్ర దానం పేర బస్సును అద్దెకు తీసుకునేందుకు 55 సీట్లకు సంబంధించిన చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
● అనాథ చిన్నారులు, పాఠశాల విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులను ఈ ప్యాకేజీ కింద వారు కోరిన చోటుకు వెళ్లిరావచ్చు.
● దాతలు ప్రయాణికులెవరినీ సూచించని పక్షంలో ఆర్టీసీయే ఆ బాధ్యత తీసుకుంటుంది.
● ఎవరైనా దేవస్థానాలకు వెళ్లాలనే ఆలోచన ఉంటే అధికారులను సంప్రదించి యాత్ర దానం ద్వారా వెళ్లే బస్సుల్లో ఖాళీ ఉంటే వినియోగించుకోవచ్చు.
● కార్యక్రమం ద్వారా ఆర్టీసీకి ఆదాయం రావడంతోపాటు దాతలకు సామాజిక సేవ చేశామనే సంతృప్తి మిగులుతుంది.
● స్వచ్చంద సంస్థలు, దాతలు ఒకేసారి ఎక్కువమందిని ఈ సౌకర్యంతో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: ప్రతీ ఇంటికి ప్రభుత్వ సేవలు అందించడమే ప్రజా పాలన ప్రధాన లక్ష్యం అని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి చివరి వరకు ఒకే ఉత్సాహంతో విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.
మర్కూక్(గజ్వేల్): గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుందని, ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చేలా తమ వంతు కృషి చేస్తున్నారు. సేవే లక్ష్యంగా స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు. గ్రామంలోని వీధుల్లో చెత్తా చెదారం, ప్లాస్టిక్, మురుగు నీరు, ప్రజలకు రోగాలు ఏ విధంగా వస్తున్నాయని అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్యవంతమైన గ్రామాలుగా తయారు చేయాలనే లక్ష్యంతో 60 మంది విద్యార్థినులు గ్రూపులుగా విడిపోయి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని మాజీ సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లిలో హైదరాబాద్‌లోని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కళాశాల విద్యార్థినులు సుమారు 15 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మూడు రోజుల నుండి ఎర్రవల్లి గ్రామంలో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వివరిస్తున్నారు. గ్రామంలో రోడ్లపై మురుగునీరు పారుతుండటంతో దోమలు వ్యాప్తి చెంది వ్యాధులు సోకే ప్రమాదం ఉందని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. హెల్త్ క్యాంపు నిర్వహించి రక్త పరీక్ష, హిమోగ్లోబిన్, బీపీ, షుగర్ వాటికి వెంటనే మందులు ఇస్తున్నారు. గ్రామ వీధుల్లో తిరుగుతూ పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లను తొలగిస్తున్నారు. మూడు రోజులుగా గ్రామ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తున్నారని మాజీ సర్పంచ్ భాగ్య తెలిపారు.వ్యాధులపై అవగాహన
ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలి. రోగాల భారిన పడకుండా ఉండేందుకు తమ వంతు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. వారికి అవగాహన కల్పించేలా స్వయంగా తామే పరిసరాలను శుభ్రం చేశాం. ప్రత్యేకంగా డెంగీ వ్యాధిపై అవగాహన కల్పించాం. – ప్రియా, విద్యార్థిని
ప్రజలతో మమేకమై..
నేను బేగంపేట మహిళా కళాశాలలో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఎన్‌ఎస్‌ఎస్ క్యాంపులో పాల్గొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉంది. గ్రామాల్లోకి వచ్చి ప్రజలతో మమేకమై చాలా విషయాలు తెలుసుకున్నా. మునుముందు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతా. – నిక్షిత, విద్యార్థిని
వ్యాధులు సోకకుండా జాగ్ర త్తలు
గ్రామ ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాం. హెల్త్ క్యాంపు నిర్వహించి రక్త నమూనాలను సేకరించి వెంటనే మందులు పంపిణీ చేశాం. డెంగీ సోకకుండా జాగ్రత్తలు సూచించాం. ప్రజల సహకారం అభినందనీయం.
– డాక్టర్ ప్రసన్న (ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్)
ఎర్రవల్లిలో ప్లాస్టిక్‌ను సేకరిస్తున్న విద్యార్థులు
పల్లె సేవలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు
అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థినులు
మద్దూరు(హుస్నాబాద్): నిజాం రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బైరాన్‌పల్లి అమరవీరులదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా వీర బైరాన్‌పల్లి గ్రామంలోని అమవీరుల స్తూపం, బురుజు వద్ద భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజమైజన స్వాతంత్య్రం వచ్చిందన్నారు. అర్ధరాత్రి నెత్తురు పారిన నేల బైరాన్‌పల్లి అని పేర్కొన్నారు. రజాకార్ల ఆగడాలను అడ్డుకుంటూ , వారి మూకలను తరిమిగొట్టిన గొప్ప చరిత్ర ఈనేలకు ఉందన్నారు. 1948 ఆగస్టు 27న రజాకార్లు గ్రామంలోకి ప్రవేశించి కాల్చి చంపి , ఇంటింటికీ తిరిగి మారణకాండ సృష్టించి మరో జలియన్‌వాలా బాగ్‌ను సృష్టించారన్నారు. గ్రామం బయట శవాల చుట్టూ మహిళలను వివస్త్రలు చేసి బతుకమ్మ ఆటలు ఆడించిన ఘటనను గుర్తు చేసుకుంటే బాధేస్తుందన్నారు. ఈ ప్రాంతం స్ఫూర్తితో వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు, సంక్షేమం, అభివృద్ధితో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సీఎంతో మాట్లాడి బైరాన్‌పల్లి అమరవీరుల స్మారకం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటూ వారిని గౌరవించుకుంటామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
బైరాన్‌పల్లి అభివృద్ధికి కృషి: ఎంపీ చామల
మనందరం ఈరోజు స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నామంటే బైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాల వల్లేనని అని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గ్రామానికి వీర బైరాన్‌పల్లిగా పేరు మార్చుకోడానికి గెజిట్ తీసుకువస్తామని, స్తూపం, బురుజు నిర్మాణం కోసం రూ. 10లక్షల నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణని గత ప్రభుత్వం పదేళ్లలో అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, టీపీసీసీ కార్యదర్శి గిరి కొండల్‌రెడ్డి, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కమలాకర్ యాదవ్, బైరాన్‌పల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
గ్రామంలో స్మారక స్తూపం నిర్మిస్తాం
మిరుదొడ్డి(దుబ్బాక): ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీనగర్, నిమ్హాన్స్ బెంగళూరు ఆధ్వర్యంలో బుధవారం మిరుదొడ్డిలో నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే–2 నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య స్థితి, జీవన శైలి సమస్యలు, ఆరోగ్య అవగాహన స్థాయిని అంచనా వేయడం, చికిత్స అంతరాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్స్ డాక్టర్ వామన్ కులకర్ణి, డిపార్టుమెంట్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్ సాయి కృష్ణా తిక్కా, తెలంగాణ స్టేట్ కో ఆర్డినేటర్ బి.ప్రవళిక, రారష్ట్‌ర ఆరోగ్య బృందం సభ్యులు గ్రేస్, వేణు మాధురి, రంజీత్, యాదవ్, శ్రీధర్, వెంకట్రావు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా పీహెచ్‌సీ డాక్టర్ సమీనా సుల్తానా, సీహెచ్‌ఓ లింగమూర్తి సర్వేను సమీక్షించారు.
కళా ఉత్సవ్ పోటీలకు
విద్యార్థులు ఎంపిక
సిద్దిపేటరూరల్: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళా ఉత్సవ్ పోటీల్లో రాఘవాపూర్ కేజీబీవీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు కేజీబీవీ ప్రత్యేక అధికారి జె .హేమలత ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశా ఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు గ్రూప్ డ్యాన్స్ విభాగంలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. కాగా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కరీనా , రాధిక, సుహాని, లిఖితను జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జీఈసీఓ నర్మద, మండల విద్యాధికారి రాజిరెడ్డి అభినందించారు.
జానపద పోటీల్లో
రాణించిన విద్యార్థి
సిద్దిపేట ఎడ్యుకేషన్: వరంగల్‌లో జరిగిన ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) విద్యార్థి సింధు పురుషోత్తం జానపద గేయపోటీల్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. కళాశాల సాంస్కృతిక విభాగం కన్వీనర్ డాక్టర్ మట్టా సంపత్‌కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం కళాశాలలో విద్యార్థిని ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్య రెడ్డి, కృష్ణయ్య, ఉమామహేశ్వరి, వెంకటరమణ విద్యార్థిని అభినందించారు.
విద్యార్థులకు
గుణాత్మకమైన బోధన
కొండపాక(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మకమైన బోధనలు అందేలా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకుడు రమేశ్ తెలిపారు. బుధవారం మండలంలోని సిర్సనగండ్లలోని ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలోని 3,4,5 తరగతుల విద్యార్థులను సబ్జెక్టులలో పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఎం జయప్రకాశ్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జహీరాబాద్: పట్టణంలో ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్న కొండెంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రప్పిస్తున్నట్లు డీఎఫ్‌ఓ సి.శ్రీధర్‌రావు పేర్కొన్నారు. బుధవారం ‘సాక్షి’ మెయిన్‌లో ‘కొండెంగల వీరంగం’, 20 మందికి గాయాలు శీర్షికన ప్రచురితమైన కథనానికి ఫారెస్టు, మున్సిపల్, పోలీసు శాఖల అధికారులు స్పందించారు. పట్టణంలోని శాంతినగర్, బాగారెడ్డిపల్లి, హౌసింగ్‌బోర్డు, హమాలీ కాలనీల్లో కొండెంగల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు. ఆయా కాలనీల ప్రజలు వాటి నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి విన్నవించారు. గాయపడిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని ప్రజలు కోరారు. కాగా డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు, మున్సిపల్ కమిషనర్ సుభాష్‌రావుతో సంప్రదింపులు జరిపారు. కొండెంగలను పట్టుకునేందుకు నిపుణుల బృందాన్ని రప్పించేందుకు ఏర్పాట్లు చేశామని, మహబూబ్‌నగర్ నుంచి పిలిపిస్తున్నట్లు చెప్పారు. గురువారం ఉదయం పట్టుకుంటారని తెలిపారు. బాధితులకు తగిన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మరో ఇద్దరిపై దాడి ..
జహీరాబాద్ టౌన్: పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మరో ఇద్దరిపై కొండముచ్చులు దాడి చేసి బుధవారం గాయపరిచాయి. శాంతినగర్‌కు చెందిన మారుతీరావు, సిద్ధులు వీధిలో వెళ్తుంటే రెండు కొండు ముచ్చులు వారిపై ఆకస్మికంగా దాడి చేశాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. జాగో తెలంగాణ నాయకులు రాములు నేత, శివప్రసాద్, ఎండీ ఇమ్రాన్ తదితరులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా అధికారులు వచ్చి గాయపడిన వారి వివరాలు నమోదు చేసుకున్నారు. వీరికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నాం
జిల్లా ఫారెస్టు అధికారి శ్రీధర్‌రావు
‘సాక్షి’ కథనానికి స్పందన
కొమురవెల్లి(సిద్దిపేట): గంజాయి అమ్ముతున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్, పోలీసులు కలిసి అరెస్టు చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చేర్యాల సీఐ ఎల్. శ్రీను ఎస్‌ఐ రాజుతో కలిసి వివరాలు వెల్లడించారు. మండల శివారులోని దాచారం గుట్ట సమీపంలో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్, పోలీసులు కలిసి దాడి చేశారు. ఈ దాడిలో కుంభ భూమరాజును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 195 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పారిశ్రామిక వాడలో..
తూప్రాన్, మనోహరాబాద్(తూప్రాన్): పారిశ్రామిక ప్రాంతంలో బీహార్‌కు చెందిన వ్యక్తి నుంచి 1.350 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ గోపాల్ వివరాలు వెల్లడించారు. మనోహరాబాద్ మండలం పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి విక్రయాలపై నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించినట్లు తెలిపారు. తమ విచారణలో ఓ స్టోరేజీ పరిశ్రమలో బీహార్‌కు చెందిన ముఖేశ్ కుమార్ మండల్(29) ఆయా పరిశ్రమల్లో కార్మికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల యువకులకు గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ఎండు గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నర్సాపూర్ ఎకై ్సజ్ అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ బాలయ్య, హెడ్‌కానిస్టేబుల్ చంద్రయ్య, కానిస్టేబుళ్లు రాజు, నరేశ్, రవి, హరీశ్‌లు పాల్గొన్నారు.
గజ్వేల్‌రూరల్: విద్యుదాఘాతానికి గురై మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటన మండలంలోని కొడకండ్లలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మిందె గౌరయ్య–మనిలా(38) దంపతులకు కూతురు రేణ, కొడుకు విష్ణు ఉన్నారు. వీరికి ఇంటితో పాటు ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. గౌరయ్య 4 ఏళ్ల క్రితం అనారోగ్యానికి గురై మృతి చెందడంతో పిల్లల బాధ్యత మనీలాపై పడింది. దీంతో ఆమె గజ్వేల్‌లోని ఓ హోటల్‌లో కూలీ పనులు చేస్తూ పిల్లలను సాకుతుంది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం హోటల్‌లో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. నాలుగేళ్ల క్రితం తండ్రి, ఇప్పుడు తల్లి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. గ్రామస్తులు, బంధువుల సహకారంతో చందాలు వేసి బుధవారం మనీలా అంత్యక్రియలు నిర్వహించారు. ఇద్దరు పిల్లలను మానవతావాదులు, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
అనాథలుగా మారిన చిన్నారులు
కొండపాక(గజ్వేల్): సత్యసాయి సంజీవని ఆసుపత్రి.. పసి హృదయాలను పదిలం చేస్తున్న దేవాలయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కొండపాకలోని సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆస్పత్రిలో వివిధ రాష్ట్రాలకు చెందిన 196 మంది చిన్న పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులకు ఆపరేషన్లు విజయవంతమవ్వడంతో బుధవారం గిఫ్టు ఆఫ్ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ సత్యసాయి సంజీవని ఆస్పత్రి సేవలు విశ్వవ్యాప్తం అయ్యేలా ప్రతీ ఒక్కరం బాధ్యతగా కృషి చెద్దామన్నారు. జీవితం శాశ్వతం కాదని చేస్తున్న మంచి పనులు శాశ్వతంగా నిలుస్తాయన్నారు. కొండపాక శివారులో అనాథ వృద్ధాశ్రమం, అష్టాదశ శక్తి పీఠ దేవాలయం, సత్యసాయి బాలికల జూనియర్ కళాశాలతో పాటు సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆసుపత్రి వెలువడంతో ప్రపంచ దేశాల్లో ఈ గడ్డ సేవా రంగంలో గొప్పగా పేరొందుతోందని అన్నారు. అనంతరం గుండె ఆపరేషన్ చేయించుకున్న పిల్లలకు గిప్టు ప్ లైఫ్ సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి నిర్వహణ చైర్మన్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
వట్‌పల్లి(అందోల్): మతిస్థిమితం సరిగాలేని మహిళ భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసు మండలంలో చర్చనీయాంశమైంది. వివరాలు... మునిపల్లి మండలం పెద్ద చెల్మడ గ్రామానికి చెందిన అంజమ్మ (45) అందోలు మండలంలోని మాసానిపల్లి గ్రామంలో గల తమ బంధువు కుమార్ గౌడ్ ఇంట్లో ఉంచారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో ఉండటంతో 15 రోజులుగా మందులు వాడకపోవడం వల్ల మతిస్థిమితం తప్పినట్లు బంధువులు చెప్పారు. 16న రాత్రి 9 గంటల సమయంలో అంజమ్మ భవనంపైకి ఎక్కి దూకింది. గమనించిన కుమార్ గౌడ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెకు సీపీఆర్ చేసి, జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అభ్యంతరం తెలిపారు. 17న 3 గంటల సమయంలో మృతదేహాన్ని పెద్ద చెల్మడ గ్రామానికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ పాండు వెళ్లి మృతదేహాన్ని తమకు అప్పగించాలన్నారు. దీంతో మృతురాలి బంధువులు, మృతురాలి భర్త రాజయ్య పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. చివరకు నచ్చజెప్పి సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి వారికి అప్పగించారు.
మతిస్థిమితం సరిగా లేని మహిళ మృతి
ఆస్పత్రి నుంచి మృతదేహం తరలింపు
పోలీసులతో బంధువుల వాగ్వాదం
Rangareddy
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని ‘మణి’కొండ చుట్టే అనకొండలు పాగా వేశాయి. ఇవి ఒక్కొక్కటిగా ఏసీబీ వలకు చిక్కుతున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ కోసం రూ.4 లక్షలు తీసుకుంటూ నార్సింగి మున్సిపల్ కార్పొరేషన్ టీపీఓ మణిహారిక ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన మరువక ముందే మంగళవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇబ్రహీంబాగ్ ఆపరేషన్స్ ఏడీఈ అంబేడ్కర్‌ను ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. తాజాగా బుధవారం ఆయన సన్నిహితుడు, బినామీ చేవెళ్ల ఏడీఈ రాజేశ్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించగా బాత్‌రూంలో రూ.17 లక్షల నగదు సహా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈయన ఇదే డివిజన్‌లోని చిలుకూరు సెక్షన్ ఏఈగా పని చేశారు. ఇటీవలే పదోన్నతిపై చేవెళ్లకు వెళ్లడం గమనార్హం.
తప్పించినా.. తప్పుకోకుండా..
ఏడీఈ అంబేడ్కర్ 1998 ఏపీఎస్‌ఈబీ ద్వారా ఖమ్మంలో తొలి పోస్టింగ్. ఆ తర్వాత డిప్యూటేషన్‌పై జీహెచ్‌ఎంసీకి ఏఈగా వచ్చారు. ఏడీఈగా పదోన్నతి పొందిన తర్వాత డిస్కంలోకి అడుగుపెట్టారు. పటాన్‌చెరు, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో కీలక పోస్టుల్లో పనిచేశారు. ఆయన సర్వీసు అంతా ఫోకల్ పోస్టుల్లోనే కొనసాగారు. కాగా ఇబ్రహీంబాగ్, మణికొండ, గచ్చిబౌలి డివిజన్లపై గత ఏడాది డిస్కం ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ అంశాన్ని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సీరియస్‌గా తీసుకుని అప్పట్లో గచ్చిబౌలి డీఈని బదిలీ చేశారు. ఇబ్రహీంబాగ్ డీఈకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో ఏడీఈ అంబేడ్కర్‌ను సైతం మరో చోటికి బదిలీ చేశారు. అయినా కదలకుండా ప్రభుత్వంలోని పెద్దలకు భారీగా ముడుపులు ముట్టజెప్పి అదే పోస్టులో కొనసాగుతూ వచ్చారు. సాధారణంగా మూడేళ్లు ఫోకల్ పోస్టులో పని చేస్తే.. ఆ తర్వాత ఉంచరు. కానీ ఏడీఈ అంబేడ్కర్ విషయంలో నిబంధనలు అమలు కాలేదు. ప్రభుత్వంలోని పెద్దలే ఆయనకు అండగా నిలవడంతో ఉన్నతాధికారులు సైతం చేతులెత్తేశారు. ఏడీఈగా ప్రభుత్వ సంస్థ నుంచి ప్రతి నెలా రూ.లక్షల్లో వేతనాలు పొందుతూ.. తన బినామీలతో యూజీ కేబుల్ వర్క్‌లు చేయించి, పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయ న ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల నివాసాలు, ఆఫీసుల్లోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది.
17 మంది ఇంజనీర్లపై ముఖ్యమంత్రి ఆరా?
ఇబ్రహీంబాగ్ డివిజన్ చిలుకూరు సెక్షన్ ఏఈగా పని చేసి, ఇటీవలే పదోన్నతిపై చేవెళ్ల వెళ్లిన ఏడీఈ రాజేశ్.. ఇప్పటికే ఏసీబీ కేసులో అరైస్టెన అంబేడ్కర్‌కు బినామీగా వ్యవహరించినట్లు సమాచారం. ఇద్దరు కలిసే పలు కాంట్రాక్టులు చేసినట్లు తెలుస్తోంది. మారేడుపల్లిలో నివాసం ఉంటున్న చేవెళ్ల ఏడీఈ రాజేశ్ ఇంట్లో బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించగా బాత్‌రూమ్‌లో రూ.17 లక్షల నగదు సహా కీలక స్థిరాస్తి డాక్యుమెంట్లు లభించినట్లు సమాచారం. కాగా ఏసీబీ అధికారులు మాత్రం ఈ అంశాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఫోకల్ టు ఫోకల్ పోస్టులు దక్కించుకున్న 17 మంది ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏళ్లుగా శివారు ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టిన ఇంజనీర్లలో ఏడీఈ, డీఈలే కాకుండా పలువురు సీఈ, ఎస్‌ఈ స్థాయి అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీబీ సోదాలతో ఆయా అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడు? ఎక్కడ? సోదాలు చేస్తారో? అనే ఆందోళన ఆయా ఇంజనీర్లలో వ్యక్తమవుతోంది.
ఉద్యోగులకు కాసుల వర్షం
శివారు మున్సిపాలిటీలు, పోలీసుస్టేషన్లు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, విద్యుత్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసుల్లో పోస్టుల కోసం ఉద్యోగుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఐటీ అనుబంధ సంస్థలు, హైరైజ్ భవనాలు, హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఎక్కువగా ఉన్న హైటెక్‌సిటీ, మణికొండ, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, బండ్లగూడజాగీర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, రాజేంద్రనగర్, శంషాబాద్ మొయినాబాద్ సహా శివారు ప్రాంతాలు ఆయా విభాగాల ఉద్యోగులకు కాసుల వర్షం కురిపిస్తుంటాయి. వివిధ విభాగాల్లోని, వివిధ సెక్షన్లలో ఫోకల్ పోస్టింగ్‌ల కోసం భారీగా వెచ్చిస్తుంటారు. వీటిని తిరిగి సంపాదించుకునేందుకు అడ్డదారులు తొక్కుతూ ఏసీబీకి చిక్కుతున్నారు.
ఏసీబీ వలకు వరుసగా చిక్కుతున్న అవినీతి తిమింగళాలు
నార్సింగి టీపీఓ అంశాన్ని మరువక ముందే మరొకరు
ఏడీఈ అంబేడ్కర్ సన్నిహితుడు చేవెళ్ల ఏడీఈ ఇంట్లో తాజాగా సోదాలు
రూ.17 లక్షల నగదు, పలు స్థిరాస్తి పత్రాలు గుర్తించినట్లు సమాచారం
రాజేంద్రనగర్ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ కె.రవికుమార్ జూలై 24న ఓ హోటల్ యజమాని నుంచి రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకీ చిక్కారు.
మణికొండ మున్సిపల్ పరిధిలోని జలమండలి మేనేజర్ స్ఫూర్తిరెడ్డి నల్లా కనెక్షన్‌కు రూ.30 వేలు తీసుకుంటూ పట్టుబడింది. – మణికొండ మున్సిపల్ ఇంజనీరింగ్ డీఈ దివ్యజ్యోతి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు స్వయంగా ఆమె భర్త వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఉన్నతాధికారులు ఆమెను తప్పించారు. ఏసీబీ కేసు నమోదైనప్పటికీ నేటికీ అరెస్ట్ చేయలేదు.
నెక్నాంపూర్‌లోని ఓ నిర్మాణానికి నిరభ్యంతర పత్రం జారీ కోసం రూ.2.50 లక్షలు డిమాండ్ చేసిన ఇరిగేషన్ ఏఈ నిఖేష్, గండిపేట సర్వేయర్ గణేశ్ ఎన్‌ఓసీ జారీ కోసం భారీగా డబ్బులు డిమాండ్ చేసి పట్టుబడ్డారు.
ఏఈ నిఖేష్ రూ.500 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించి, కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ బన్సీలాల్, అసిస్టెంట్ ఇంజనీర్ కార్తీక్ ఏసీబీ కేసులో అరెస్ట్ అయ్యారు.
గోపన్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి విద్యుత్ మీటర్ మంజూరుకు రూ.50వేలు డిమాండ్ చేసి గచ్చిబౌలి డివిజన్ ఏడీఈ సతీశ్ ఏసీబీకి చిక్కారు. ఆయన వంద కోట్లకుపైగా ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు.
మాదాపూర్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ ఎం.సుధ జూలై 9న ఓ చిన్న కంపెనీకి జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడింది.
ఇబ్రహీంపట్నం రూరల్: స్వచ్ఛతతో పల్లెలు మెరవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా స్వచ్ఛతా హీసేవ–2025 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17– అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో నిర్వహించాలన్నారు. ఇందులో ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి అని చెప్పారు. 15 రోజుల పాటు చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయడం, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తదితర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కిట్‌లు అందజేసి సఫాయి మిత్ర సురక్షా శిబిర్ కార్యక్రమం, శ్రమదాన కార్యక్రమాలు చెత్త నుంచి కళాకృతులు తయారు చేయడం, ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు, పాఠశాలలు, గ్రామాల్లో స్వచ్ఛతా ర్యాలీలు, మహిళా సంఘాలు, విద్యార్థులతో ప్రతిజ్ఞలు చేయించాలని సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలన్నారు.
చిరు ధాన్యాలతో ఆరోగ్యం
అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ఆహార పదార్థాల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. తృణ ధాన్యాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నారు. శరీరానికి పోషకాలు పుష్కలంగా లభిస్తాయని, మాంసాహారంతో పోలిస్తే చిరు ధాన్యాల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పారు. చిరు ధాన్యాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు.
విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన కలెక్టర్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ వస్తువుకు ఒక ఆకృతిని ఇచ్చే వారే విశ్వకర్మలన్నారు. శిల్పులకు ఆదరణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాలు వారి వృత్తులకు చేయూతనిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీఆర్‌ఓ సంగీత, డీసీపీ సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి కేశురాం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉష, సీపీఓ సౌమ్య, డీఆర్‌డీఓ శ్రీలత, సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేశ్ మోహన్, అడిషనల్ డీఆర్‌డీఓ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు .
స్వచ్ఛతా హీసేవ–2025లో ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి
కలెక్టర్ నారాయణరెడ్డి
కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంత్యుత్సవాలు
తెలంగాణ ఉద్యమ చరిత్ర గొప్పది
షాద్‌నగర్‌రూరల్: ప్రపంచ ఉద్యమ చరిత్రలో తెలంగాణ ఉద్యమం గొప్పదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవానికి ప్రొఫెసర్ కోదండరాం హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ కోదండరాం
ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మొయినాబాద్ రూరల్: ఔషధ మొక్కలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. బుధవారం మండల పరిధిలోని తోల్‌కట్ట చౌరస్తాలో ఉన్న పీవీ నర్సింహారావు కేంద్రంలో స్వామి రామానంద తీర్థ వనమూలికల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఔషధ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఔషధ మొక్కలు మానవ మనుగడకు ముఖ్యమన్నారు. కాలుష్యం పెరగుతున్న తరుణంలో ఔషధ మొక్కలను పెంచి స్చవ్ఛమైన ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఆధ్వర్యంలో చేపడుతున్న మొక్కల పెంపకం ప్రతీ ఒక్కరికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీశ్, కాంగ్రెస్ చేవెళ్ల ఇన్‌చార్జి పామెన భీంభరత్, పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులు తొలిసారిగా ట్రాఫిక్ సమస్యలు, పరిష్కారాలపై కీలక సదస్సు నిర్వహించనున్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ నేతృత్వంలో ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ సమ్మిట్–2025 పేరుతో రెండు రోజుల పాటు దీనిని తలపెట్టారు. నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో గురువారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సదస్సును ప్రారంభించనున్నారు. ఇందులో వివిధ వాణిజ్య సంస్థలు, నిపుణులు, స్టార్టప్స్, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. సురక్షిత నగరాలు, స్థిరమైన రవాణా, సమగ్రమైన ప్రయాణ వ్యవస్థలు, రోడ్డు భద్రతకు సంబంధించిన డిజైన్లు, సాంకేతిక పరిజ్ఞాతం వినియోగం, భవిష్యత్తులో సవాళ్లు, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై కూలంకషంగా రెండు రోజుల పాటు చర్చించనున్నారు. సదస్సు తీర్మానాలను విధానపరమైన నిర్ణయాల కోసం ప్రభుత్వానికీ సిఫార్సు చేయాలని అధికారులు నిర్ణయించారు. రహదారి భద్రత, ఎలక్ట్రానిక్ వాహనాలు తదితర రంగాల్లో సేవలు అందిస్తున్న స్టార్టప్స్, సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఈ సమ్మిట్‌లో అవకాశం కల్పిస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు, విభాగాల మధ్య సమన్వయ లోపం, నగరవాసుల్లో అవగాహన లేమి, పాలకుల నిర్లక్ష్యాలకు ఈ సమ్మిట్ ద్వారా పరిష్కార మార్గాలు చూపాలని సెక్యూరిటీ కౌన్సిల్ భావిస్తోంది.
ఏజీవర్సిటీ: ఈ నెల 19న పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు వీసీ ఎం.జ్ఞాన ప్రకాశ్ తెలిపారు. బుధవారం పశువైద్య విశ్వవిద్యాలయంలో వీసీ భవనంలో ఆయన మాట్లాడుతూ.. స్నాతకోత్సవం 2023 నుంచి 2024 వరకు పట్టభద్రులైన మొత్తం 524 మందికి పట్టాలు ప్రదాన చేస్తామన్నారు. 25 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్ శరత్‌చంద్ర, ఫ్యాకల్టీస్ డీన్ ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.
● సాగర్ హైవే దిగ్బంధానికిరైతుల యత్నం
● మద్దతు తెలిపిన అఖిలపక్షం నాయకులు
మాడ్గుల/యాచారం: రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలని అఖిలపక్షం నాయకులు, బాధిత రైతుల ఆధ్వర్యంలో మాడ్గుల మండలం అన్నెబోయినపల్లి గేటు వద్ద బుధవారం హైవే దిగ్బంధం చేపట్టారు. తమ భూములు లాక్కోవద్దని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులు నినాదాలు చేశారు. అనంతరం సాగర్ హైవేపై బైఠాయించడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. ఆందోళనకారులను యాచారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తదితరులున్నారు.
మార్చులు ఉండొద్దు
యాచారం పోలీస్‌స్టేషన్ వద్ద జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో పేద రైతులకు అన్యాయం చేస్తూ, సీఎం రేవంత్‌రెడ్డి బంధువులకు మేలు చేసేలా చేస్తున్నారని ఆరోపించారు. సీఎం బంధువుల వ్యవసాయ భూములను కాపాడుకోవడం కోసమే తరచూ అలైన్‌మెంట్లు మార్చుతూ రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. గతంలో బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలోనే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పట్ల అలైన్‌మెంట్ తయారు చేసి, రైతుల మద్దతు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఎలాంటి మార్పులు లేకుండా రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రాంచంద్రయ్య, బీఆర్‌ఎస్ యాచారం మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు యాదయ్యగౌడ్, సత్యపాల్, జైపాల్‌రెడ్డి, లక్ష్మినరసింహ, కృష్ణారెడ్డి, తిరుమల్‌రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.
● ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ‘స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్’
● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
చేవెళ్ల: నారీ శక్తితోనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ మహిళాభివృద్ధికి కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్ ఆరోగ్య మహిళ–శక్తివంతమైన కుటుంబం (స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్) కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబానికి భరోసా ఉంటుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని.. పార్లమెంట్‌లోనూ మహిళల ప్రాతినిథ్యం ఉండాలని వారికి అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంత మహిళల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ప్రదాని జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మహిళలకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని అన్ని ఆస్పత్రుల ఆధ్వర్యంలో వైద్యసేవలను అందించారు. టీబీ రోగులకు ఆరోగ్య కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం, చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య, జిల్లా అధికారి షఫీయుద్దీన్, ఉప వైద్యాధికారి నాగేంద్రబాబు, డివిజన్ వైద్యాధికారుల బృందం, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం.. ప్రాణదానంతో సమానం
రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ మున్సిపల్, మండల అధ్యక్షుడు శ్రీకాంత్, అనంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కేజీఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో యువత పెద్ద ఎత్తున రక్త దానం చేసింది. అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి రక్తదాతలకు సర్టిపికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ వైభవ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఆంజనేయులుగౌడ్, శర్వలింగం, కృష్ణగౌడ్, మాణిక్యంరెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, రవీందర్‌రెడ్డి, అశోక్, జైశంకర్, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ, సత్యనారాయణ, రుషికేష్, శ్రీనివాస్, చంద్రశేఖర్, ధనుష్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, నాగరాజు, జైసింహ, కరుణాకర్, వెంకట్‌రెడ్డి, శివ, మధూకర్, కృష్ణారెడ్డి, రవి, కుమార్ తదితరులు ఉన్నారు.
హిమాయత్‌నగర్ కంజర్ల మాల్‌లో..
మొయినాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను బుధవారం బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ కంజర్ల మాల్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం చేతులమీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాశ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, ఓబీసీ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ వెంకటేశ్‌గౌడ్, మాజీ సర్పంచ్ రత్నం, నాయకులు వెంకటేశ్, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
దేశ ప్రతిష్టను చాటిన వ్యక్తి మోది..
మహేశ్వరం: దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటిన మహోన్నత వ్యక్తి ప్రధాని మోది అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్‌గౌడ్ అన్నారు. బుధవారం నరేంద్రమోది జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్‌భూపాల్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశ ప్రధాని పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన జన్మదినం సందర్భంగా 75 మంది యువకులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్, పార్టీ రాష్ట్ర నాయకులు పాపయ్యగౌడ్, మండల అధ్యక్షుడు యాదీశ్, నాయకులు అనంతయ్యగౌడ్, మాధవాచారి, యాదయ్య గౌడ్, వెంకటేశ్ గౌడ్, సుదర్శన్ యాదవ్, శ్రవణ్, దేశ్యానాయక్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త నగరాలు, రహదారులు, మౌలిక సదుపాయాలకు రూపకల్పన జరుగుతుంది. అందులో రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) కూడా ఒకటి. ప్రభుత్వం తమ ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టింది. ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పటికీ చర్చల దశలోనే ఉన్న ఈ రోడ్డుపై కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జిల్లా ప్రజలను, రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ విడుదల చేసిన అనధికారిక అలైన్‌మెంట్(పాత)ను మార్చి, కొత్త అలైన్‌మెంట్ రూపొందిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. నిజానికి పాత అలైన్‌మెంట్ అనేది ఒక ఊహాజనితం మాత్రమే. భూసేకరణ విషయంలో రైతులను తప్పు దోవ పట్టించొద్దు’ అని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను, వాటి పరిణామాలను ఆయన మాటల్లోనే...
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు మాత్రమే ఫైనల్
రావిర్యాల ఎగ్జిట్ 13 నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు అటు నుంచి ఆమనగల్లు వరకు ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశాం. తొలి విడతలో రావిర్యాల ఎగ్జిట్ నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు ఉన్న 20 కిలోమీటర్లు రోడ్డుకు 449 ఎకరాలు, రెండో విడతలో మీర్‌ఖాన్‌పేట వరకు అటు నుంచి ఆమనగల్లు వరకు 21.5 కిలోమీటర్ల రోడ్డుకు 554.35 ఎకరాలు భూమి అవసరమైంది. ఆ మేరకు మొత్తం 4,725 మంది రైతుల నుంచి 1004.22 ఎకరాలు సమీకరించాం. భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి అవార్డును పాస్ చేశాం. భూములు ఇచ్చేందుకు నిరాకరించిన కొంత మంది రైతులకు సంబంధించిన మొత్తాన్ని అథారిటీలో జమ చేశాం. ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదు. టెండర్లు కూడా ఖరారయ్యాయి.
ఓ కొలిక్కి వచ్చిన బీజాపూర్ రహదారి
బీజాపూర్ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. దీంతో ప్రభుత్వం అప్పా టు మన్నెగూడ వరకు(46.405 కిలోమీటర్లు) రోడ్డును రెండు వైపులా 60 మీటర్ల వరకు విస్తరించాలని నిర్ణయించింది. ఆ మేరకు రూ.928.41 కోట్లు ఖర్చు సహా 266.55 హెక్టార్ల భూమి అవసరం ఉన్నట్లు గుర్తించింది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అయితే రోడ్డుకు ఇరు వైపులా ఉన్న 60 నుంచి 80 ఏళ్ల వయసున్న 915 మర్రి వృక్షాలను తొలగించాల్సి రావడంపై కొంత మంది పర్యావరణ వేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పురాతన మర్రి చెట్ల ఉనికి దెబ్బతినకుండా మధ్యేమార్గంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే రెడ్ మార్క్ వేసిన 150 వృక్షాలు మినహా మిగిలిన వాటిని సర్వీసు రోడ్డుకు, ప్రధాన క్యారేజ్‌వేకు మధ్యలో ఉండేలా స్వల్ప మార్పులు చేపట్టారు. ఇప్పటికే మొయినాబాద్, చేవెళ్ల బైపాస్‌రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.
నాలుగు వేల అర్జీలు క్లియర్ చేశాం
రెవెన్యూ సదస్సుల్లో భాగంగా 21 వేలకుపైగా అర్జీలు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, బాధితులకు నోటిసులు జారీ చేశాం. క్షేత్రస్థాయి నుంచి రిపోర్టులు తెప్పించుకుని ఇప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నాం. రోజుకు సగటున 50 నుంచి 60 దరఖాస్తులను పరిష్కరిస్తున్నాం. ఇప్పటి వరకు నాలుగు వేలకుపైగా దరఖాస్తులను క్లియర్ చేశాం. ధరణి పోర్టల్‌లో దొర్లిన తప్పిదాలకు ‘భూభారతి’లో అవకాశం ఇవ్వడం లేదు. భూ భారతి పోర్టల్‌తో అన్ని సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది.
రైతులను తప్పుదారి పట్టించొద్దు
పాత అలైన్‌మెంట్
ఓ కన్సల్టెన్సీ ఊహాజనితమే
భూ భారతితోనే భూములకు పూర్తి రక్షణ
‘సాక్షి’తో కలెక్టర్ నారాయణరెడ్డి
ఇంకా ప్రతిపాదనల దశలోనే
నగరంపై ఒత్తిడి తగ్గించేందుకు ఔటర్ మాదిరిగా మరో రింగు రోడ్డు అవసరం ఉందని ప్రజలతో పాటు ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తైతే జిల్లా రూపు రేఖలే మారబోతున్నాయి. భూముల ధరలు పెరిగి, రియల్ ఎస్టేట్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఈ రోడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇది ప్రభుత్వ ప్రతిపాదన మాత్రమే. ఎక్కడ నివాసాలు ఉన్నాయి? ఎక్కడ చెరువు ఉంది? ఎక్కడ బఫర్ జోన్ ఉంది? ఎక్కడ విల్లాలు ఉన్నాయో? స్పష్టత రాలేదు. రోడ్లు భవనాల శాఖ తుది రిపోర్టు తర్వాతే రెవెన్యూశాఖ భూసేకరణ ప్రక్రియను చేపడుతుంది. అయితే ప్రభుత్వ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంలో కొంత మంది త్యాగం చేయక తప్పదు. రైతులు అనవసరంగా ఆందోళన చెందొద్దు.
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ పేర్కొన్నారు. బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఇబ్రహీంపట్నం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వాస్తవాలు–వక్రీకరణ అనే అంశంపై ఇబ్రహీంపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజులు విచ్చేసి మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాయుధ పోరాటం సాగిందన్నారు. నిజాం అరాచకాలకు ఎదిరిస్తూ సామాన్యులు సాయుధులుగా మారారన్నారు. నిజాంను గద్దెదింపడం కోసం నాయకత్వం వహించింది కమ్యూనిస్టులేనన్నారు. సాయుధ పోరులో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ స్థానమేక్కడిదన్నారు. నిర్బంధాలు, త్యాగాలు చేసింది ఎందరో చెప్పగలరా అని ప్రశ్నించారు. వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటానికి ఏమాత్రం సంబంధం లేని పార్టీలు విమోచన, విలీనం, విద్రోహం అంటూ నేడు చరిత్రను వక్రభాష్యాలు చెబుతున్నారన్నారు. బీజేపీ అనేక ఏళ్ల నుంచి తెలంగాణలో మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శంకర్, డీవైఎఫ్‌ఐ కార్యదర్శి జగన్, నాయకులు సామేలు, గణేష్, శ్రీకాంత్, వంశీ, తరంగ్, జంగయ్య, అజయ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్
● స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి
మూల్యం తప్పదు
● అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే
గువ్వల బాలరాజు
ఆమనగల్లు: ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని తెలిపారు. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆయన బుధవారం తొలిసారి అచ్చంపేటకు వెళ్తున్న క్రమంలో బీజేపీ ఆమనగల్లు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. అన్ని విషయాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తిలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, బీజేపీ రాష్ట్ర నాయకులు కండె హరిప్రసాద్, రాంరెడ్డి, మండల అధ్యక్షుడు కేకేశ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కర్నాటి విక్రంరెడ్డి, బీజేపీ నాయకులు దుర్గయ్య, సుండూరు శేఖర్, లక్ష్మణ్, చెన్నకేశవులు, రవిరాథోడ్ పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్: చెడు వ్యసనాలకు బానిసై..డబ్బుల కోసం ఆటోలను దొంగిలించి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం..లింగాపూర్ గ్రామానికి చెందిన కొరుపతి శ్రీరాములు అలియాస్ రాము కొంత కాలంగా దుండిగల్ పరిధిలోని చర్చి గాగిల్లాపూర్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన రాము తన జల్సాలు తీర్చుకునేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా స్టీరింగ్ లాక్ (తాళం) లేని ఆటోలను దొంగిలించేందకు ప్లాన్ వేసుకుని మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ ప్రాంతాల్లో ఆటోలను దొంగలించారు. ఇటీవల మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఆటో దొంగిలించగా పోలీసులు దర్యాప్తు చేసి దొంగతనాలకు పాల్పడుతున్న రామును అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో అతని వద్ద నుండి మూడు ఆటోలు స్వాధీనం చేసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సయ్యగౌడ్
తుర్కయంజాల్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తుర్కయంజాల్‌లో ఆ పార్టీ నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి రాక ముందు ప్రకటనలు చేసి, ఆ తరువాత చేతులు దులుపుకొంటున్నాయని ఆరోపించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 80 మంది రక్తదానం చేసినట్లు పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్, శ్రావణ్‌కుమార్‌గౌడ్ తదితరలు పాల్గొన్నారు.
Politics
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి మళ్లీ కోపమొచ్చింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో ఆయన మంత్రులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏం మంత్రులయ్యా మీరు అన్నరీతిలో చురకలంటించారాయన.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే.. మంత్రుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేస్తున్న సమయంలో.. మంత్రులు ఏం పట్టనట్లు చూస్తూ ఉండిపోయారు. అయితే ఎమ్మెల్యేల ప్రశ్నలను నమోదు చెయ్యని మంత్రులు, అధికారులపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలు మాట్లాడితే ఒక్క మంత్రి కూడా నోట్ చేసుకోరా?. గతంలో ఉన్న సంప్రదాయం ఇప్పుడెందుకు లేదు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.. జీరో అవర్ లో మాట్లాడిన ప్రశ్నలకు కనీసం సమాధానం కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇలా అసహనం.. ఆగ్రహం వ్యక్తం చేయడం కొత్తేం కాదు. గతంలో కూటమి ఎమ్మెల్యేలు తమ అనుచరుల్ని అసెంబ్లీకి తోలుకుని రావడంపై, అలాగే మంత్రులు ఆలస్యంగా రావడం.. క్వశ్చన్ అవర్‌ను సీరియస్‌గా తీసుకోకపోవడంపైనా ఆయన మందలింపు వ్యాఖ్యలు చేశారు.
సాక్షి, వైఎఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఏ ఒక్క వర్గానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. కడపలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. గ్రామ సచివాల వ్యవస్థను పూర్తిగా నిర్వీరం చేశారు. రైతు భరోస కేంద్రాల ద్వారా రైతుకు అందాల్సిన యూరియాను అందించడం లేదు. సకాలంలో యూరియా ఎరువులు అందగా రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది..
మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. గతంలో రైతులకు పెట్టుబడి సహాయం అందించేవారు. రైతులను ప్రభుత్వం ముంచుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. గ్యాంబ్లింగ్ పేకాట జూదం కూటమి నాయకులు దగ్గరుండి నడిపిస్తున్నారు అని అన్నారాయన.
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నేడు జరగనుంది. గురువారం మధ్యాహ్నా ప్రాంతంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై, కీలకాంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Hyderabad
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని ‘మణి’కొండ చుట్టే ‘అవినీతి అనకొండలు’ పాగా వేశాయి. ఇప్పటి వరకు ఎవరికీ కన్పించకుండా పుట్టలో దాగి ఉన్న ఈ అనకొండలు ఒక్కొక్కటిగా బయటికి వచ్చి ఏసీబీ వలకు చిక్కుతున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ కోసం రూ.నాలుగు లక్షలు తీసుకుంటూ వారం రోజుల క్రితం నార్సింగి మున్సిపల్ కార్పొరేషన్ టీపీఓ మణిహారిక ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అంశాన్ని ఇంకా పూర్తిగా మరిచిపోకముందే..మంగళవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇబ్రహీంబాగ్ ఆపరేషన్స్ ఏడీఈ అంబేద్కర్‌ను ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. తాజాగా బుధవారం ఆయన సన్నిహితుడిగా పేరొందిన చేవెళ్ల ఏడీఈ రాజేష్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించింది. బాత్‌రూంలో రూ.20 లక్షల నగదు సహా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
తప్పించినా..తప్పుకోకుండా...
ఏడీఈ అంబేద్కర్ 1998లో ఏపీఎస్‌ఈబీ ద్వారా ఖమ్మంలో తొలి పోస్టింగ్ సంపాదించారు. ఆ తర్వాత డిప్యూటేషన్‌పై జీహెచ్‌ఎంసీకి ఏఈగా వచ్చారు. ఏడీఈగా పదోన్నతి పొందిన తర్వాత డిస్కంలోకి అడుగుపెట్టారు. పటాన్‌చెరు, కేబీహెచ్‌పీ, గచ్చిబౌలిలో కీలక పోస్టుల్లో పని చేశారు. ఆయన సర్వీసు అంతా ఫోకల్ పోస్టుల్లోనే కొనసాగారు. అయితే ఇబ్రహీంబాగ్, మణికొండ, గచ్చిబౌలి డివిజన్లపై గత ఏడాది డిస్కం ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు అందాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహా అవినీతి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడటంతో ఈ అంశాన్ని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సీరియస్‌గా తీసుకున్నారు. అప్పట్లోనే గచ్చిబౌలి డీఈని బదిలీ చేశారు. ఇబ్రహీంబాగ్ డీఈకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో ఏడీఈ అంబేద్కర్‌ను సైతం మరో చోటికి బదిలీ చేశారు. ఆయినా..వెళ్లకుండా ప్రభుత్వంలోని పెద్దలకు భారీగా ముడుపులు ముట్టజెప్పి మళ్లీ ఆయన అదే పోస్టులో కొనసాగుతూ వచ్చారు. సాధారణంగా మూడేళ్లు ఫోకల్ పోస్టులో పని చేస్తే..ఆ తర్వాత ఆ పోస్టులో ఉంచరు. కానీ ఏడీఈ అంబేద్కర్ విషయంలో ఇవేవీ అమలు కాలేదు. ఏడీఈగా ప్రభుత్వ సంస్థ నుంచి ప్రతి నెలా రూ.లక్షల్లో వేతనాలు పొందుతూ..తన బినామీలతో యూజీ కేబుల్ వర్క్ చేయించి పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన ఇళ్లు సహా బంధువులు, సన్నిహితుల ఇళ్లు, ఆఫీసుల్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది.
చేవెళ్ల ఏడీఈ ఇంట్లోనూ సోదాలు?
ఇబ్రహీంబాగ్ డివిజన్ చిలుకూరు సెక్షన్ ఏఈగా పని చేసి, ఇటీవలే పదోన్నతిపై చేవెళ్ల వెళ్లిన ఏడీఈ రాజేష్... అంబేద్కర్‌కు సన్నిహితుడని సమాచారం. మారేడుపల్లిలో నివాసం ఉంటున్న రాజేష్ ఇంట్లో బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. బాత్‌రూమ్‌లో రూ.17 లక్షల నగదు సహా కీలక స్థిరాస్తి డాక్యుమెంట్లు లభించినట్లు తెలిసింది. అయితే ఏసీబీ అధికారులు ఈ అంశాన్ని ఇంకా ధృవీకరించలేదు.
ఏసీబీ వలకు వరుసగా చిక్కుతున్న అవినీతి తిమింగలాలు..
నార్సింగి టీపీఓ అంశాన్ని మర్చిపోక ముందే తాజాగా మరొకరు
సంచలనం సృష్టించినఏడీఈ అంబేద్కర్ ఉదంతం
చేవెళ్ల ఏడీఈ ఇంట్లోనూ తాజాగా సోదాలు?
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. బాధితులు ఊహించని, వారి ఊహకు అందని విధంగా పంజా విసురుతున్నారు. సెల్‌ఫోన్లలోని ఏపీకే ఫైల్స్ పంపి, వారి ఖాతాలకు ఖాళీ చేస్తున్న నేరాలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే బాధితుల నెట్ బ్యాంకింగ్‌ను వాడి, వారి ప్రయేయం లేకుండానే వారి పేరుతో రుణం తీసుకుని, ఖాతాలో పడిన తర్వాత, సేవింగ్స్‌తో కలిపి కాజేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఈ పంథాలో రూ.12.75 లక్షలు కోల్పోయిన సికింద్రాబాద్ వ్యక్తి ఈ నెల 2న సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. తాజాగా రూ.13 లక్షలు కోల్పోయిన మరో బాధితుడు బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన బాధితుడి (45) ఫోన్‌కు సైబర్ నేరగాళ్లు ఇటీవల ‘ఈ చలాన్ ఆర్టీఓ.ఏపీకే’ పేరుతో ఉన్న లింకు పంపారు. దీనిపై అవగాహన లేని ఆ బాధితుడు అది ఈ–చలాన్లకు సంబంధించిన యాప్ అని భావించి క్లిక్ చేశారు. ఆ వెంటనే అందులో ఉన్న ఏపీకే ఫైల్ బాధితుడి ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇలా బాధితుడి ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు ఆయనకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతా నెట్ బ్యాంకింగ్‌ను యాక్సస్ చేశారు. ‘పే యూ మనప్పుడు ఫిన్’ పేరుతో ఉన్న వారి ఖాతాను బెనిఫిషియరీ అకౌంట్‌గా యాడ్ చేసుకున్నారు. లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలు సైతం నేరగాళ్లు చూడగలగటంతో బాధితుడి నెట్ బ్యాంకింగ్ ద్వారానే రూ.12.5 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మొత్తం మంజూరై బాధితుడి ఖాతాలో పడింది. దీంతో పాటు అప్పటికే ఖాతాలో ఉన్న సేవింగ్స్ రూ.50 వేలు కలిపి మొత్తం రూ.13 లక్షలు స్వాహా చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించిన సందేశాలు వరుసపెట్టి అందుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. అతడి ఫోన్ అధ్యయనం చేసిన అధికారులు ఈ ఏపీకే ఫైల్‌తో కూడిన యాప్ గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఏపీకే ఫైల్ ద్వారా కథనడిపిన కేటుగాళ్లు
బాధితుడి ప్రమేయం లేకుండానే రుణం
మొత్తం రూ.13 లక్షలు స్వాహా చేసిన వైనం
నాంపల్లి: భారీ వర్షాల కారణంగా నాలుగు రోజుల క్రితం వరదలో కొట్టుకుపోయిన అఫ్జల్‌సాగర్ మాన్గార్ బస్తీకి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాలను బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా అఫ్జల్‌సాగర్ నాలా పరివాహక ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. నాలాలో గల్లంతైన వారిని గుర్తించేందుకు సెర్చ్ ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని హైడ్రా అధికారులను ఆదేశించారు. అలాగే హబీబ్‌నగర్ నాలా, అఫ్జల్‌సాగర్ నాలాల వెంబడి ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని సూచించారు. మురికివాడలపై ప్రత్యేక దృష్టిని సారించాలని, కూలడానికి సిద్ధంగా ఉన్న వాంబే గృహాల్లో నివసిస్తున్న నిరుపేదలకు ప్రత్యామ్నాయంగా ఆవాసం కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. మురికివాడల్లో స్వచ్ఛత కనపించడం లేదని, మురికి కూపంలా మారిన బస్తీలను కాస్త పరిశుభ్రంగా ఉంచాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పూడికతీత పనులు చేపట్టాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, దోమలు, ఈగలు విజృంభించకుండా చూడాలని, అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా సమీక్షా సమావేశంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అఫ్జల్‌సాగర్, మాన్గార్ బస్తీల భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ జ్యోతి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, జిల్లా అధ్యక్షులు లంకల దీపక్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్‌చంద్ర, డివిజన్ అధ్యక్షులు మధు, స్థానిక బీజేపీ నేతలు గోపి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాలు
అఫ్జల్‌సాగర్ నాలా బాధితులకు పరామర్శ
సాక్షి, సిటీబ్యూరో: ‘రోబోటిక్ సర్జరీలు చేశాం..టెలీ సర్జరీల గురించి విన్నాం...ఈ రెండింటిని కలపి సుదూర ప్రాంతంలో ఉన్న వ్యక్తికి ఖచ్చితత్వంతో కూడిన టెలీ రోబోటిక్ సర్జరీ చేయడం కొత్త టెక్నాలజీ’ అని ప్రీతీ కిడ్నీ ఆసుపత్రి ఎండీ చంద్రమోహన్ అన్నారు. బుధవారం ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుట్టుకతోనే కిడ్నీ సమస్య ఉన్న 16 నెలల బాలుడికి చికిత్స చేయాల్సి వచ్చిందన్నారు. అయితే గురుగ్రాంలో ఉన్న తాను కొండాపూర్ ప్రీతి ఆసుపత్రిలో ఉన్న బాలునికి టెలీ–రోబోటిక్ పద్ధతిలో సర్జరీని విజయవంతంగా పూర్తి చేశానని చంద్రమోహన్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. మరో కేసులో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ మహిళకు గర్భసంచి తొలగించిన తరువాత సమస్య రావడంతో తమను సంప్రదించారని, ఆమెకు టెలీ–రోబోటిక్ సర్జరీ విజయవంతంగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ప్రీతి ఆసుపత్రి ఈడీ డా.రూప, సీఈఓ రంగప్ప, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్: చెడు వ్యసనాలకు బానిసై..డబ్బుల కోసం ఆటోలను దొంగిలించి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం..లింగాపూర్ గ్రామానికి చెందిన కొరుపతి శ్రీరాములు అలియాస్ రాము కొంత కాలంగా దుండిగల్ పరిధిలోని చర్చి గాగిల్లాపూర్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన రాము తన జల్సాలు తీర్చుకునేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా స్టీరింగ్ లాక్ (తాళం) లేని ఆటోలను దొంగిలించేందకు ప్లాన్ వేసుకుని మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ ప్రాంతాల్లో ఆటోలను దొంగలించారు. ఇటీవల మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఆటో దొంగిలించగా పోలీసులు దర్యాప్తు చేసి దొంగతనాలకు పాల్పడుతున్న రామును అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో అతని వద్ద నుండి మూడు ఆటోలు స్వాధీనం చేసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు.
Business
బంగారం ధరలు చాన్నాళ్ల తరువాత తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు గరిష్టంగా.. రూ.550 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో.. గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. పసిడి ధరలు మాదిరిగానే.. వెండి రేటు కూడా తగ్గింది. ఇది పసిడి ప్రియులకు కొంత ఉపశమనం కలిగించింది. కాగా ఈ రోజు (సెప్టెంబర్ 18) పసిడి ధరలు ఏ నగరంలో ఎలా ఉన్నాయో ఇక్కడ వివరంగా చూసేద్దాం.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 10:23 సమయానికి నిఫ్టీ(Nifty) 78 పాయింట్లు పెరిగి 25,407కు చేరింది. సెన్సెక్స్(Sensex) 288 పాయింట్లు పుంజుకొని 82,981 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 96.98
బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 67.76 డాలర్లు
యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.07 శాతానికి చేరాయి.
గడిచిన సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.1 శాతం నష్టపోయింది.
నాస్‌డాక్ 0.33 శాతం పడిపోయింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
దేశంలో అన్ని వ్యవస్థలూ డిజిటల్ వైపు పయనిస్తున్నాయి. ఇదే ఒరవడిలో ఇప్పటికే కొత్త పాస్‌పోర్ట్‌లు వచ్చేశాయి. పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0 కింద ఈ-పాస్‌పోర్ట్‌లను జూన్ 24, 2025 నుంచి ప్రవేశపెడుతున్నారు. ఈ-పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన కొన్ని అంశాలను కింద తెలుసుకుందాం.
ఇంటిగ్రేటెడ్ చిప్
ఈ-పాస్‌పోర్ట్ ఇంటిగ్రేటెడ్ చిప్‌తో వస్తుంది. సంబంధిత వ్యక్తికి చెందిన బయోమెట్రిక్ డేటా (ఫొటోగ్రాఫ్, వేలిముద్రలు) ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. దీని వల్ల భద్రత మెరుగుపడుతుందని, అంతర్జాతీయ సరిహద్దుల్లో పాస్‌పోర్టులను నకిలీ చేయడం కష్టతరం అవుతుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఎవరు అర్హులు
కొత్త పాస్‌పోర్ట్ లేదా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ పౌరులందరూ అర్హులు. చెన్నై, హైదరాబాద్, సూరత్, జైపూర్.. వంటి ఎన్నో నగరాల్లో ఎంపిక చేయబడిన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఎస్‌కే)ల్లో ప్రాథమికంగా జారీ చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ
ఆన్‌లైన్ ద్వారా పాస్‌పోర్ట్ సేవా అధికారిక పోర్టల్ ఓపెన్ చేయాలి.
వ్యక్తిగత వివరాలతో ముందుగా రిజిస్టర్ చేసుకొని, లాగిన్ అవ్వాలి.
కొత్త ఈ-పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అపాయింట్‌మెంట్ నిమిత్తం ఆన్‌లైన్‌లోనే మీ దగ్గరల్లో ఉన్న పీఎస్‌కే లేదా పీఓఎస్‌కేని ఎంచుకోవాలి.
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.
అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకోవాలి.
తదుపరి బయోమెట్రిక్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పీఎస్‌కేను సందర్శించాలి.
ప్రయోజనాలు
ఈ-గేట్ల ద్వారా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ వేగవంతం అవుతుంది.
ట్యాంపరింగ్, ఐడెంటిఫికేషన్ థెఫ్ట్ ఉండదు. మెరుగైన భద్రతను నిర్ధారిస్తుంది.
ఎన్‌క్రిప్టెడ్ చిప్ యాక్సెస్‌తో కాంటాక్ట్ లెస్ వెరిఫికేషన్.
డూప్లికేషన్ లేదా మోసాలని తగ్గిస్తుంది.
మొదట ఫిన్లాండ్‌లో..
అవాంతరాలు లేని అంతర్జాతీయ ప్రయాణ అనుభవాన్ని అందించడానికి డిజిటల్ పాస్‌పోర్ట్‌లను ప్రారంభించిన మొదటి దేశం ఫిన్లాండ్. ఆ దేశ ప్రయాణికులు భౌతిక పాస్‌పోర్ట్‌లకు బదులుగా ఈ-పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి యూకేకి ప్రయాణించవచ్చు. ఫిన్లాండ్ మాదిరిగానే యూకే, యూఎస్, దక్షిణ కొరియా, పోలాండ్ కూడా డిజిటల్ పాస్‌పోర్ట్ ప్రాజెక్ట్‌లపై పని చేస్తున్నాయని ఒక నివేదిక తెలిపింది.
ఇదీ చదవండి: మరో నాలుగు రోజులు ఇంతే..
టీవీఎస్ తన వినియోగదారులకు కనెక్టివిటీ సర్వీసులు అందించేందుకు నాయిస్ కంపెనీతో జతకట్టినట్లు తెలిపింది. ఈ భాగస్వామ్యంతో భారతదేశపు మొట్టమొదటి ఈవీ-స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్‌ను ఐక్యూబ్ మోడల్‌లో లాంచ్ చేసినట్లు పేర్కొంది. ఈ స్మార్ట్ వాచ్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని కొన్ని అంశాలను లైవ్‌టైమ్‌లో ట్రాక్ చేయవచ్చని తెలిపింది.
బ్యాటరీ స్టేటస్, దాని రేంజ్‌ను మానిటర్ చేయవచ్చు.
టైర్ ప్రజర్ మానిటరింగ్
వాహన భద్రతా హెచ్చరికలు
రైడ్ గణాంకాలను తెలుసుకోవచ్చు.
ఈ ఫీచర్లను ప్రామాణిక కనెక్టివిటీ ఫంక్షన్లతోపాటు విలీనం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ‘కొత్త టీవీఎస్ ఐక్యూబ్‌ను స్మార్ట్ వాచ్‌తో అనుసంధానించడం ద్వారా వినియోగదారులకు సురక్షితమైన, మరింత సహజమైన ప్రయాణాలు సాగించేందుకు వీలుంటుంది’ అని టీవీఎస్ మోటార్ కంపెనీలో హెడ్ కమ్యూటర్ & ఈవీ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ కార్పొరేట్ బ్రాండ్ అండ్ మీడియా అనిరుద్ధ హల్దార్ అన్నారు.
ఇదీ చదవండి: మరో నాలుగు రోజులు ఇంతే..
భారతదేశం అంతటా ద్విచక్ర వాహన డీలర్‌షిప్‌ల్లో షోరూమ్ బుకింగ్‌లు దాదాపు స్తంభించాయి. సెప్టెంబర్ 4న సవరించిన పన్ను రేట్లను జీఎస్టీ కౌన్సిల్ అధికారికంగా ఆమోదం తెలిపినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతోంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు దేశవ్యాప్తంగా వినియోగదారులు ధరల తగ్గింపునకు వేచిచూస్తున్నారు.
ఏదేమైనా, ఈ ప్రకటన విస్తృతంగా కొనుగోలుదారులను కట్టిపడేసింది. వినియోగదారులు తాము కొనాలనుకునే ఉత్పత్తులపై త్వరలో ధరల రాయితీ ఉంటుందని నమ్మి ఇలా కొనుగోళ్లను వాయిదా వేస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ‘జీఎస్టీ రేటు తగ్గింపును ప్రధాని ప్రకటించినప్పటి నుంచి అమ్మకాలు తగ్గాయి. సెప్టెంబర్ 4న చేసిన కొత్త రేట్లను అధికారికంగా ఆమోదం తెలపడంతో వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు’ అని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) డీలర్ ఆశిష్ పాండే చెప్పారు.
‘సెప్టెంబర్ 22 కొత్త జీఎస్టీ శ్లాబులు అమలు తర్వాతే కొనుగోళ్లు తిరిగి ఊపందుకుంటాయని ఆశిస్తున్నాం. అయితే ఇది భవిష్యత్తులో సాధారణ ప్రక్రియగానే మారుతుందని, పరిమిత సమయ పథకం కాదని వినియోగదారులకు తెలుసు’ అన్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే షోరూమ్ బుకింగ్స్ దాదాపు 50% పడిపోయాయని దేశవ్యాప్తంగా డీలర్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు
డిజిటల్ మార్కెట్లలో బడా టెక్ కంపెనీలు, పోటీ సంస్థలను దెబ్బతీసే విధానాలను ఉపయోగించకుండా ముందస్తుగా నివారించేలా ప్రత్యేక విధానాన్ని (ఎక్స్–యాంటీ) రూపొందించడం తక్షణావసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను దేశీ అంకుర సంస్థల వ్యవస్థాపకులు కోరారు. డిజిటల్ పోటీపై తలపెట్టిన మార్కెట్ అధ్యయనం పారదర్శకంగా, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే విధంగా ఉండేలా చూడాలని కోరారు. ఎక్స్–యాంటీ నిబంధనలను వ్యతిరేకిస్తూ గ్లోబల్ టెక్ దిగ్గజాలు దు్రష్పచారం సాగిస్తున్నాయని వివరించారు.
పీపుల్ గ్రూప్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్, మ్యాట్రిమోనీడాట్‌కామ్ ఫౌండర్ మురుగవేల్ జానకిరామన్, ట్రూలీమ్యాడ్‌లీ సహ వ్యవస్థాపకులు స్నేహిల్ ఖనోర్, అమిత్ గుప్తా తదితరులు ఈ మేరకు నిర్మలా సీతారామన్‌కి లేఖ రాశారు. డిజిటల్ మార్కెట్లలో పోటీని అణగదొక్కేలా వ్యవహరిస్తున్న బిగ్ టెక్ సంస్థల వల్ల స్టార్ట్ వ్యవస్థ నిరంతరం సవాళ్లు ఎదుర్కొంటోందని అందులో పేర్కొన్నారు.
ఎక్స్–యాంటీ నిబంధనలను పునఃసమీక్షించడానికి ముందుగా ప్రస్తుత డిజిటల్ కాంపిటీషన్ బిల్లు ముసాయిదాను ఉపసంహరించి, మార్కెట్‌ను సవివరంగా అధ్యయనం చేయాలన్న ప్రభుత్వ యోచనను తాము స్వాగతిస్తున్నామని స్టార్టప్‌ల ఫౌండర్లు తెలిపారు. అయితే, ఇది స్వతంత్రంగా, పారదర్శకమైన విధంగా జరిగేలా చూడాలని కోరారు.
ఇదీ చదవండి: అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు
రోజువారీ జీవనంలో కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని నైతికంగా ఉపయోగించడానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలను రూపొందించడంపై కసరత్తు జరుగుతోందని వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. ఆయా కమిటీల్లో భారతీయ నిపుణులు కూడా ఉన్నారని వివరించారు.
గ్లోబల్ ప్రమాణాలు ఖరారైన తర్వాత భారత్ సహా ప్రపంచ దేశాలు వాటిని అమలు చేస్తాయని పీహెచ్‌డీసీసీఐ సదస్సులో చెప్పారు. ఇప్పటికే 39 ఉండగా, మరో 45 గ్లోబల్ ఏఐ ప్రమాణాలను రూపొందించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఏఐ టెక్నాలజీకి రెండు పార్శ్వాలు ఉన్నాయని చెప్పారు. రిటైల్, ఈ–కామర్స్ రంగాల్లో మోసాలను అరికట్టేందుకు ఇది ఉపయోగపడనుండగా, అదే సమయంలో అనైతికంగా ఉపయోగిస్తే ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలూ ఉన్నాయని నిధి చెప్పారు.
‘ప్రస్తుతం ప్రపంచంలో ఏఐ పెద్ద సవాలుగా మారింది. దీనితో ఎంతగా దుష్ప్రచారం జరుగుతోందో మనం చూస్తున్నాం. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. మోసాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు ప్రభుత్వాలు తప్పనిసరిగా చట్టాలు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. అలాగని ఏఐ వల్ల ప్రయోజనాలు లేవని చెప్పడానికి లేదు. సోషల్ మీడియా, ప్లాట్‌ఫాంలు, నవకల్పనలకు సంబంధించి ఇదొక సానుకూల, సృజనాత్మక ఆవిష్కరణ’ అని తెలిపారు.
ఇదీ చదవండి: పండుగ సీజన్‌పై ‘సోనీ’ ఆశలు..!
పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ) నుంచి యస్ బ్యాంక్‌కు చెందిన 13.18 శాతం వాటాను జపనీస్ దిగ్గజం సుమితోమొ మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్‌ఎంబీసీ) చేజిక్కింకుకుంది. దీంతో ఎస్‌ఎంబీసీ నుంచి రూ. 8,889 కోట్లు అందుకున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఫలితంగా యస్ బ్యాంక్‌లో ఎస్‌బీఐ వాటా 10.8 శాతానికి దిగివచ్చింది. ఈ డీల్‌లో భాగంగా ఇతర 7 ప్రయివేట్ బ్యాంకింగ్ సంస్థల నుంచి సైతం మరో 6.82 శాతం వాటాను ఎస్‌ఎంబీసీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా యస్ బ్యాంక్‌లో పీఈ దిగ్గజం కార్లయిల్ నుంచి మరో 4.2 శాతం వాటాను ఎస్‌ఎంబీసీ సొంతం చేసుకోనుంది. ఇందుకు షేరుకి రూ. 21.5 ధరలో(ఎస్‌బీఐ వాటా విక్రయ ధర)నే కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం(17న) తెలియజేసింది. ఇందుకు రూ. 2,800 కోట్లు వెచి్చంచనున్నట్లు వెల్లడించింది. వెరసి యస్ బ్యాంక్‌లో వాటాను జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్(ఎస్‌ఎంఎఫ్‌జీ)కు చెందిన ఎస్‌ఎంబీసీ 24.2 శాతానికి పెంచుకోనుంది. తద్వారా యస్ బ్యాంక్‌లో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. ప్రస్తుతం యస్ బ్యాంక్‌లో కార్లయిల్ గ్రూప్ 4.22 శాతం వాటా కలిగి ఉంది.
ఇదీ చదవండి: పండుగ సీజన్‌పై ‘సోనీ’ ఆశలు..!
కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ సోనీ ఇండియా ప్రస్తుత పండుగల సీజన్ పట్ల ఆశావహంగా ఉన్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో పెద్ద తెరల టీవీల ధరలు తగ్గుతాయని.. దీంతో విక్రయాలు రెండంకెల మేర వృద్ధి చెందుతాయని (గతేడాది ఇదే సీజన్‌తో పోల్చి చూస్తే) అంచనా వేస్తున్నట్టు సంస్థ ఎండీ సునీల్ నయ్యర్ ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి టీవీల అమ్మకాలు ఫ్లాట్‌గా, ఎలాంటి వృద్ధి లేకుండా ఉన్నట్టు చెప్పారు.
జీఎస్‌టీ శ్లాబుల్లో మార్పుల వల్ల వీటి ధరలు 7.5–8 శాతం మేర తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. దీంతో కొనుగోళ్ల సెంటిమెంట్ మెరుగుపడుతుందన్నారు. పెద్ద సైజు తెరల టీవీల మార్కెట్లో (ప్రీమియం మార్కెట్) సోనీ ప్రముఖ సంస్థగా ఉండడం తెలిసిందే. ఈ విభాగంలో టీవీల ధరలు మోడల్ ఆధారంగా రూ.8,000 నుంచి రూ.70,000 మధ్య తగ్గుతాయని నయ్యర్ ప్రకటించారు. ధరలు తగ్గడంతో కస్టమర్లు పెద్ద సైజు టీవీలు, మెరుగైన టెక్నాలజీ ఫీచర్లతో ఉన్న వాటికి మారతారన్న (అప్‌గ్రేడ్) ఆశాభావం వ్యక్తం చేశారు. విక్రయాలు 10–15 శాతం వరకు పెరగొచ్చన్నారు.
మాకు ప్రయోజనం..
జీఎస్‌టీలో 32 అంగుళాలకు మించిన టీవీలపై జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం గమనార్హం. కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. 55 అంగుళాలు, అంతకుమించిన సైజు టీవీల మార్కెట్లో కీలకంగా ఉన్న సోనీ ఈ రేటు తగ్గింపుతో ప్రయోజనం పొందుతుందని నయ్యర్ చెప్పారు. ‘‘55, 65, 75, 85, 98 అంగుళాల టీవీలను పెద్ద సంఖ్యలో విక్రయిస్తుంటాం. ఈ టీవీలన్నీ ప్రీమియం, పెద్ద సైజు విభాగం కిందకు వస్తాయి’’అని తెలిపారు. 55 అంగుళాల టీవీ ధర రూ.8,000 వరకు తగ్గుతుందని.. 75 అంగుళాలు అంతకుమించిన సైజు టీవీలపై రూ.19,000–51,000 వరకు, 85 అంగుళాల టీవీలపై రూ.47,000–70,000 వరకు రేట్లు తగ్గుతాయని చెప్పారు. బడ్జెట్‌లో ప్రకటించిన ఆదాయపన్ను ప్రయోజనాలతో ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుందని.. దీని ఫలితంగా కెమెరాలు, సౌండ్‌బార్లు, పార్టీ స్పీకర్లు, హెడ్‌ఫోన్లు, ప్లే స్టేషన్ ఉత్పత్తుల అమ్మకాలు సైతం పెరుగుతాయని నయ్యర్ అంచనా వేశారు. విక్రయాల్లో సగం వాటా కలిగిన చిన్న పట్టణాలు, గ్రామీణ మార్కెట్లలో సోనీ స్థానం మరింత బలపడుతుందన్నారు.
నిలిచిన కొనుగోళ్లు
ప్రభుత్వం జీఎస్‌టీపై నిర్ణయాలు ప్రకటించిన తర్వాత వినియోగదారులు టీవీల కొనుగోళ్లను నిలిపివేసినట్టు నయ్యర్ తెలిపారు. ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉన్నట్టు చెప్పారు. అందరూ సెప్టెంబర్ 22 కోసం వేచి చూస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత కొనుగోళ్లు ఒక్కసారిగా పెరుగుతాయని అంచనా వేశారు.
ఇదీ చదవండి: 5 ఏళ్లలో రూ.70 లక్షల కోట్లు
మధ్య, దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి సాధించేందుకు అత్యుత్తమ అవకాశాలున్నట్లు గ్లోబల్ రేటింగ్ సంస్థ ఎస్‌అండ్‌పీ తాజాగా అభిప్రాయపడింది. దీంతో రానున్న ఐదేళ్లలో ప్రయివేట్ రంగం నుంచి 800 బిలియన్ డాలర్ల(రూ. 70 లక్షల కోట్లు) పెట్టుబడులకు వీలున్నట్లు అంచనా వేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ప్రయివేట్ పెట్టుబడులు ఊపందుకునే చాన్స్ లేనట్లు పేర్కొంది.
ప్రయివేట్ రంగంలో భారీస్థాయి సామర్థ్య విస్తరణలో అప్రమత్తత కనిపిస్తున్నట్లు సంస్థ అధికారి గీతా చుగ్ తెలియజేశారు. కాగా.. ప్రయివేట్ రంగంలో పెట్టుబడులు కనిపిస్తున్నప్పటికీ నామినల్ జీడీపీ వృద్ధి రేటుకంటే తక్కువ స్థాయిలో నమోదవుతున్నట్లు ఎస్‌అండ్‌పీ దేశీ రేటింగ్స్ యూనిట్ క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషీ పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య విధానాలు, టారిఫ్‌లలో మార్పులు, తదితర తీవ్ర అనిశ్చితులు కార్పొరేట్ సంస్థల పెట్టుబడి నిర్ణయాలలో ఆలస్యానికి కారణమవుతున్నట్లు వివరించారు.
పలు కంపెనీలు పెట్టుబడులను సమకూర్చుకోవడంలో బ్యాంకులకు బదులుగా సొంత అంతర్గత వనరులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. బ్యాంక్ రుణాలు లేదా క్యాపిటల్ మార్కెట్ల నుంచి రుణ సమీకరణ ద్వారా కనీసస్థాయిలోనే నిధులను సమీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి పరిస్థితులు మెరుగుపడనుండటంతో బ్యాంకింగ్ వ్యవస్థలో 12–13 శాతం రుణ వృద్ధికి వీలున్నట్లు అంచనా వేశారు.
ఇదీ చదవండి: దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్ ఆఫర్?
National
న్యూఢిల్లీ: పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదరడంపై భారత్ స్పందించింది. ఆ ఇరు దేశాల ఒప్పందంలో వివరాల ప్రకారం.. ఇరు దేశాలలోని ఎవరిపైన దాడి జరిగినా.. అది ఇరు పక్షాలపైన జరిగిన దాడిగానే పరిగణిస్తారు. అప్పుడు ఆ ఇరు పక్షాలు సమానంగా ప్రత్యర్థితో పోరాడుతాయని పేర్కొన్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ ఒప్పందపు పరిణామాలను అర్థం చేసుకునేందుకు అధ్యయనం చేస్తామని వెల్లడించింది.
‘సౌదీ అరేబియా- పాకిస్తాన్ మధ్య కుదిరిన పరస్పర వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై సంతకం చేసినట్లు వచ్చిన నివేదికలను చూశాం. రెండు దేశాల మధ్య కుదిరిన దీర్ఘకాలిక ఒప్పందాన్ని అధికారికం చేసే పరిణామ ప్రక్రియ పరిశీలనలో ఉందని భారత ప్రభుత్వానికి తెలుసు. మన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఈ పరిణామం వలన వచ్చే చిక్కులపై అధ్యయనం చేస్తాం. భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు, అన్ని రంగాలలో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మీడియా ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ ప్రధాని.. రియాద్‌ను సందర్శించారు అక్కడి అల్-యమామా ప్యాలెస్‌లో సౌదీ యువరాజు షరీఫ్‌ను కలిశారు. సౌదీ అరేబియా - పాకిస్తాన్ మధ్య పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం, రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని అభివృద్ధి చేయడం, ఏదైనా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఒప్పందపు ప్రకటన వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడి.. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాక్- సౌదీల మధ్య కుదిరిన ఈ ఒప్పందం కీలకమైనదిగా భావిస్తున్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి సంచలన ఆరోపణలకు దిగారు. ఓట్ల దొంగతనం ఒక పథకం ప్రకారమే జరుగుతోందని.. ఆ దొంగలను రక్షించే ప్రయత్నంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం న్యూఢిల్లీలోని ఇందిరా భవన్ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని.. రాష్ట్రం వెలుపలి నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించినట్లు వ్యాఖ్యానించారు. సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు.
100 శాతం ఆధారాలున్నాయ్
ఓట్ల చోరీ గురించి ఈసీ నుంచి మాకు సమాచారం వస్తోంది. చాలా చోట్ల మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఉద్దేశపూర్వకంగానే లక్షల ఓట్లను తొలగించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. కర్ణాటక ఓటర్లకు లింక్ చేసిన ఫోన్ నెంబర్లన్నీ తప్పుడువే. కాంగ్రెస్‌కు బలమున్న ప్రాంతాల్లోనే ఓట్ల తొలగింపు జరిగింది. ఓట్లను తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారు. ఫేక్ లాగిన్‌తో కాంగ్రెస్ సానుభూతి ఓట్లను తొలగించారు. ఇవన్నీ ఆరోపణలు కాదు.. పక్కా ఆధారాలతో చెబుతున్నా..సీఈసీపై సంచలన ఆరోపణలు
ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవారిని కాపాడుతోంది. అధికారులకు తెలియకుండా జాబితా నుంచి ఓట్లు ఎలా పోతాయి?. కేవలం కాంగ్రెస్ ఓటర్లే టార్గెట్‌గా ఇదంతా నడుస్తోంది. కర్ణాటక సీఐడీ ఓట్ల తొలగింపు వివరాలు 18సార్లు అడిగినా ఈసీ స్పందించడం లేదు. మాకు ఓట్ల తొలగింపు ఐడీల వివరాలు, ఓటీపీలు కావాలి. వారం లోగా సీఐడీ అడిగిన వివరాలు అందించాలి.ఓట్ల దొంగలను రక్షిస్తూ..
కర్ణాటక అలంద్‌లో గోదాబాయ్ పేరుతో 18 ఓట్లు తొలగించారు . మహారాష్ట్ర రాజురా నియోజకవర్గంలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారు. కర్ణాటక, యూపీ, మహారాష్ట్ర, హర్యానాలో ఒకే రీతిలో ఓట్ల తొలగింపు జరిగింది. సెంట్రలైజ్డ్ వ్యవస్థ ద్వారా పథకం ప్రకారం రాష్ట్ర ఎన్నికల్లో ఓట్లు డిలీట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థ ఆ పని చేయడం లేదు. ఓట్ల దొంగలను సీఈసీ రక్షిస్తోంది. అందుకే ప్రతిపక్ష నేతగా నేను ప్రజల ముందు ఉంచుతున్నాఓటు చోరీ అనేది ప్రజాస్వామ్యంపై అణుబాంబ్ లాంటిది. కానీ ఇప్పుడు హైడ్రోజన్ బాంబ్ పేలబోతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవాళ్లను ఈసీ కాపాడుతోంది. ఓట్లు చోరీ చేస్తున్న వారిని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రక్షిస్తున్నారు. అన్నింటికీ మా దగ్గర ఆధారాలన్నాయ్. ఎన్నికల వ్యవస్థలో అక్రమాలను కోర్టులు పరిశీలించాలి. ఓట్ల చోరీపై న్యాయ వ్యవస్థ దృష్టి సారించాలి అని రాహుల్ గాంధీ కోరారు. ఈ క్రమంలో ఆధారాల పేరిట పలువురు ఓటర్లతో మాట్లాడించిన ఆయన, ఓట్ల అవకతవకల పేరిట జరిగిన అంశాలనూ మీడియా ముందు ప్రవేశపెట్టారు.
VIDEO | Delhi: During a press conference, Congress MP Rahul Gandhi (@RahulGandhi) shows 'evidence' of alleged vote theft in Karnataka, claiming that the theft happened specifically on the booths where Congress was winning.
He further claimed that a fake login was created in the… pic.twitter.com/k9uSw4boLG— Press Trust of India (@PTI_News) September 18, 2025
LIVE: Special press briefing by LoP Shri @RahulGandhi at Indira Bhawan | New Delhi. https://t.co/BfcSQU0LTd
— Congress (@INCIndia) September 18, 2025
చమోలి: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో పెను విపత్తు సంభవించింది. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న నందనగర్‌లో గురువారం తెల్లవారుజామున సంభవించిన క్లౌడ్ బరస్ట్ పలు ఇళ్లను ధ్వంసం చేసింది. ఐదుగురు అదృశ్యమయ్యారు. జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, నందనగర్‌లోని కుంత్రి వార్డులో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చమోలి జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
VIDEO | Chamoli, Uttarakhand: Cloudburst in Nandanagar results in massive destruction. More details are awaited.
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/LMiM4SuTPQ— Press Trust of India (@PTI_News) September 18, 2025
క్లౌడ్ బరస్త్ దరిమిలా ఆ ప్రాంతంలో భయాందోళనలు అలుముకున్నాయి. ఇళ్ల శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంఘటన జరిగిన సమయంలో ఏడుగురు ఇళ్లలో ఉండగా, వారిలో ఇద్దరిని రెస్క్యూ సిబ్బంది సజీవంగా బయటకు తీసుకువచ్చారు. గల్లంతైన మరో ఐదుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎస్‌డీఆర్ ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, వైద్య బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
చమోలి జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ బుధవారం రాత్రి చమోలి జిల్లాలోని నందనగర్ ఘాట్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ సంభవించి, భారీ నష్టం జరిగిందన్నారు. నందనగర్‌లోని కుంత్రి లంగాఫలి వార్డులో ఆరు ఇళ్ల శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇంతలో వాతావరణ శాఖ ఉత్తరాఖండ్‌లో 20 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
VIDEO | Chamoli, Uttarakhand: Cloudburst in Nandanagar results in massive destruction. More details are awaited.
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/LMiM4SuTPQ— Press Trust of India (@PTI_News) September 18, 2025
పవన్ గురించి రిపోర్టర్ ప్రశ్న.. అవినాష్ రెడ్డి సమాధానం అదుర్స్
బంగారంపై GST ప్రభావం ఎలా ఉంటుంది..
పాన్ ఇండియా షేక్..! ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్డేట్
భారత్ అంటే ఇంత భయమా..? బయటపడ్డ పాక్ డ్రామా
హైకోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా అమరావతిలో DSC వేడుకలు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి రంగం సిద్ధం
అంబేద్కర్ రాజ్యాంగం దిండు కింద పెట్టి.. లోకేష్ రాజ్యాంగం నడుపుతున్నారు
Andhra Pradesh
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రైతుల సమస్యలపై చర్చకు వైఎస్సార్‌సీపీ పట్టుబడుతోంది. రైతుల సమస్య, యూరియా అంశాలపై చర్చించాలంటూ వైఎ‍్సార్‌సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు తిరస్కరించారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.
యూరియా కొరత సమస్య తీర్చాలని, పంటకు గిట్టుబాటు ధర సమస్య పరిష్కరించాలంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులతో అధికార సభ్యులు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ ఆందోళనల నడుమ మండలిని కాసేపు చైర్మన్ వాయిదా వేశారు. అయితే.. రైతాంగం సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమని, ఆ చర్చ రేపు నిర్వహిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దీంతో.. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది రైతులకు అత్యవసరమైన చర్చ. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఈరోజు చర్చించవచ్చు కదా. రేపటిదాకా వాయిదా వేయడం ఎందుకు?. రైతాంగం తరఫున వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోంది. గత ఐదేళ్లుగా ఎప్పుడైనా రైతులు ఇలా రోడ్డెక్కి ఆందోళన చేశారా?. మా హయాంలో రైతులకు ఎలాంటి సమస్య ఎదురవ్వలేదు. యూరియా కోసం ఎన్నడూ ఆందోళనలు జరగలేదు. రైతులు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అందుకే రైతుల సమస్యలపై చర్చించాలని మేం కోరుతున్నాం. రైతాంగం తరపున చర్చించడానికి రేపటిదాకా ఎందుకు?. ఈరోజే చర్చిస్తే తప్పేముంది. ఇప్పుడే సమస్య వచ్చింది కాబట్టే చర్చించమని కోరుతున్నాం అని బొత్స డిమాండ్ చేశారు.
సాక్షి, విజయవాడ: ప్రజల ఆందోళనను, రాజకీయ పార్టీల అభ్యంతరాలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లెక్క చేయలేదు. అన్నంత పని చేసేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు టెండర్ నోటిఫికేషన్ ఇవాళ జారీ అయ్యింది.
తొలివిడత నాలుగు మెడికల్ కాలేజీలను పీపీపీ(Public-Private Partnership)లో అప్పగించేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. మెడికల్ కాలేజీలు.. 625 పథకాల సూపర్ స్పెషలిటీ ఆస్పత్రుల పీపీపీకి టెండర్ ప్రకటన ఏపీ ఎంఎస్ఐడీసీ రిలీజ్ చేసింది.
చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణ, ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, అలాగే వైద్య విద్యపై తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్‌సీపీ, ఎమ్మార్పీఎస్, ఇతర సామాజిక సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటు ప్రజలలోనూ ఈ నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంగా ఇన్నేళ్ల తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టని చంద్రబాబు.. పేదలు, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందాలనే లక్ష్యంతో తాము నిర్మించిన కాలేజీలను ప్రైవేట్ చేతుల్లో పెడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేపు తాము అధికారంలోకి వచ్చాక టెండర్లు రద్దు చేసి తీరతామని హెచ్చరించారు కూడా.
Movies
వరుస చిత్రాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నిరంతరం పని చేస్తున్నారు. హీరోగా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌తో శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా జైరామ్ చిటికెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘కాయిన్’. చంద్రహాస్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘‘కాయిన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి కొత్త టాలెంట్ రావాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్‌తో నాకు చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. చంద్రహాస్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ‘కాయిన్’ చుట్టూ ఇంత జరిగిందా? అని కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా. ట్రైలర్ వచ్చిన తరువాత చిత్రంపై మరింత అంచనాలు పెరుగుతాయని నమ్మకంగా ఉన్నాను. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ .. ‘యథార్థ సంఘటనల ఆధారంగా మా దర్శకుడు జైరామ్ ఈ ‘కాయిన్’ మూవీని తీస్తున్నారు. పాత ఐదు రూపాయల కాయిన్స్‌ని బ్యాన్ చేయడం, ఆ కాయిన్స్ మెల్ట్ చేయడం, వాటి నేపథ్యంలో క్రైమ్ అనే పాయింట్లతో అద్భుతంగా కథను రాసుకున్నారు. జైరామ్ పనితనం నాకు చాలా నచ్చింది. జైరామ్ భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్ అవుతారు. ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్‌ను లాంచ్ చేసేందుకు వచ్చిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్. నిమిషి మ్యూజిక్ డైరెక్టర్‌గా పెద్ద స్థాయికి వెళ్తారు. శ్రీకాంత్ రాజా రత్నం ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత. ఆయనకు కథపై చాలా నమ్మకం ఉంది. నేను కథ నచ్చితే ఏ జానర్ అన్నది ఆలోచించను. అన్ని రకాల చిత్రాలను చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి, నన్ను ట్రోల్ చేసే వారికి సమాధానం చెప్పేందుకు నేను ఎప్పుడూ కష్ట పడుతూనే ఉంటాను’ అని అన్నారు.
మలయాళ సీనియర్ నటి శాంతి విలియమ్స్ మోహన్‌లాల్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె తమిళ, మలయాళంలో వందకు పైగా సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో సహాయక పాత్రలు పోషించారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్‌కు తల్లిగా కూడా నటించారు. తనకు 12 ఏళ్ల వయసు ఉండగానే చిత్రపరిశ్రమలో ఆమె అడుగుపెట్టారు. ఆమె 1979లో మలయాళీ కెమెరామెన్ జె. విలియమ్స్ ను వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. తన భర్త మరణం సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండగా దానిని మోహన్‌లాల్ తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపించారు.
మలయాళ సినిమాల్లో ఒకప్పుడు సుపరిచితుడైన సినిమాటోగ్రాఫర్ జె విలియమ్స్‌ను వివాహం చేసుకున్న శాంతి, తన భర్త అనారోగ్యానికి గురైనప్పుడు కుటుంబం తీవ్ర పేదరికంలోకి నెట్టబడిందని, కానీ పరిశ్రమ నుండి ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. విలియమ్స్ 2005లో అనారోగ్యంతో మరణించారు. అయితే, ఆ సమయంలో మోహన్ లాల్‌తో జరిగిన ఒక సంఘటన గురించి శాంతి ఇలా అన్నారు, “ఒకప్పుడు నాకు తెలిసిన లాల్ నేటి సూపర్ స్టార్ కంటే చాలా భిన్నంగా ఉంటాడు. అప్పట్లో, అతనికి చిన్నపిల్లవాడి అమాయకత్వం ఉండేది. అతను మా ఇంటికి వచ్చి, మాతో ఎప్పుడూ మాట్లాడేవాడు. నవ్వుతూ అన్ని విషయాలు పంచుకునే మంచి వ్యక్తి. కానీ, అతను పాపులర్ అయిన తర్వాత అతని ప్రవర్తన మారిపోయింది. చాలా మంది ఇతరులు కూడా అదే చెప్తారు.
లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లాడు
తన ఇంట్లో ఉండే కృష్ణుడి విగ్రహాన్ని మోహన్‌లాల్ ఎలా తీసుకెళ్లాడో శాంతి ఇలా చెప్పింది. "మా ఇంట్లో పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తున్న కృష్ణుడి విగ్రహం ఉండేది. నేడు ఆ విగ్రహం మోహన్‌లాల్ ఇంట్లో ఉంది. నా భర్తకు ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాం. ఆ సమయంలో కృష్ణుడి విగ్రహాన్ని మేము సరిగ్గా నిర్వహించగలమో లేదోనని నా భర్తకు అనిపించింది. మా ఇంట్లో ఎయిర్ కండిషనర్ లేదని, పిల్లలకు ఇబ్బందిగా ఉందని మోహన్‌లాల్‌తో నా భర్త విలియమ్స్ చెప్పాడు. మా ఆర్థిక పరిస్థితిని లాల్ సద్వినియోగం చేసుకున్నాడు. లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లి, బదులుగా తన ఆఫీసు నుండి పాత ఎయిర్ కండిషనర్‌ను మాకు ఇచ్చాడు. కేవలం పదిరోజుల తర్వాత అది రిపేయర్‌కు వచ్చింది. దీంతో మేము దానిని అమ్మినప్పుడు, మాకు రెండు వేల రూపాయలు మాత్రమే వచ్చాయి. నాకు చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే.., మేము మోహన్‌లాల్ కోసం చాలా చేసినప్పటికీ, నా భర్త మరణించినప్పుడు అతను రాలేదు. నేను దాని గురించి మాట్లాడే ప్రతిసారీ, నాలో కోపం ఉప్పొంగుతుంది.ఆకలితోనే నా పిల్లలు నిద్రపోయేవారు
నాకు నలుగురు పిల్లలు ఉన్నారనే విషయం మోహన్‌లాల్‌కు తెలుసు. విలియమ్స్ మంచం పట్టిన తర్వాత, కుటుంబాన్ని పోషించడానికి నేను డబ్బింగ్, నటన అంటూ తిరగాల్సి వచ్చింది. పిల్లలకు కడుపు నిండా ఆహారం లేని రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు వారు ఆకలితోనే నిద్రపోయేవారు. ఇప్పటివరకు నేను దీని గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే, దర్శకుడు శంకర్ సార్ నా భర్త మరణించారని తెలుసుకొని రూ. 25వేలు సాయం చేశారు. ఏదైనా సాయం అవసరమైతే కాల్ చేయమని కూడా చెప్పారు. అయితే, మలయాళ పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు కూడా సాయం చేయలేదు. కానీ, తమిళ పరిశ్రమ నుంచి కొందరు చేశారు.నా మాతృభూమి కేరళ, నేను మలయాళీని. అయినప్పటికీ నన్ను నేను అలా పిలుచుకోవడానికి సిగ్గుపడుతున్నాను. మా దగ్గర డబ్బున్న సమయంలో ఎందరికో సాయం చేశాం. కానీ, నా భర్త మరణించిన సమయంలో ఎవరూ కూడా పలకరించలేదు.' అని ఆమె అన్నారు. ప్రస్తుతం శాంతి పిల్లలు పెద్దవారయ్యరు. ఉద్యోగాలు చేస్తూ జీవితంలో సెటిల్ అయ్యారు. భర్త మరణం తర్వాత తనకు చిన్న పాత్ర వచ్చినా సరే చేస్తూ పిల్లలను చదివించారని అక్కడి పరిశ్రమ గురించి తెలిసిన వారు చెప్తారు.
International
ప్రముఖ మీడియా సంస్థ ఏబీసీ తన లేట్-నైట్ టాక్ షో ‘జిమ్మీ కిమ్మెల్ లైవ్’ను నిరవధికంగా నిలిపివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్‌పై వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ (Jimmy Kimmel) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)డైరెక్టర్ కాష్ పటేల్‌లు ఈ హత్యపై దర్యాప్తులో నిర్వహించిన తీరుపై జిమ్మీ కిమ్మెల్ విమర్శలు గుప్పించారు.
కాగా జిమ్మీ లేట్ నైట్ షోను రద్దు చేయాలన్న ఏబీసీ నిర్ణయంపై అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికాకు ఇది గొప్ప వార్త అని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10న ఉటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో తుపాకీ కాల్పులకు బలయ్యాడు. అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో చార్లీ కిర్క్ మరణాన్ని అధికారికంగా ప్రకటించారు. అతనిని ఈవెన్ లెజెండరీ అంటూ ప్రశంసించారు.
కాగా సోమవారం కిమ్మెల్ తన ప్రముఖ లేట్ నైట్ షో లో మోనోలాగ్‌లో జరిగిన కాల్పుల గురించి మాట్లాడారు. చార్లీ కిర్క్‌ను హత్య చేసిన టైలర్ రాబిన్సన్ ను వలసవాదిగా చిత్రీకరించేందుకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మెగా) గ్యాంగ్ తీవ్రంగా ప్రయత్నించిందని, తద్వారా రాజకీయ లబ్ధకోసం తాపత్రయపడిందని కిమ్మెల్ ఆరోపించారు.
ట్రంప్‌కు అందుకే కోపం..
అధ్యక్షుడు ట్రంప్ తన స్నేహితుడు చార్లీని కోల్పోయినందుకు ఎలా బాధపడ్డారనేదానిపై కిమ్మెల్ వ్యంగ్యంగా మాట్లాడారు. ట్రంప్ దుఃఖించే విధానాన్ని ఎగతాళి చేస్తూ ఆయన దుఃఖంలో నాల్గవ దశలో ఉన్నారన్నారు. తన స్నేహితుని హత్యపై అతను బాధపడటం లేదని, నాలుగేళ్ల పిల్లవాడు గోల్డ్ ఫిష్ పోతే ఎలా బాధపడతాడో అలా దుఃఖించారని కిమ్మెల్ వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్ షోలో ట్రంప్.. కిర్క్ మరణంపై మాట్లాడిన క్లిప్పింగ్‌ను కిమ్మెల్ ప్లే చేశారు.ఈ షోలో ట్రంప్ వైట్ హౌస్‌లో అత్యంత ఖరీదైన బాల్‌రూమ్‌ను నిర్మించడంలోని ఉద్దేశ్యాన్ని కూడా ప్రశ్నించారు.అయితే ఇంతలో నెక్స్‌స్టార్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రెసిడెంట్ ఆండ్రూ ఆల్ఫోర్డ్ ఒక ప్రకటనలో కిమ్మెల్ వ్యాఖ్యలను కంపెనీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, కిర్క్ మరణంపై కిమ్మెల్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి తాము భావిస్తున్నామన్నామని ప్రకటించారు. కిమ్మెల్‌కు ప్రసార వేదికను అందించడం ప్రస్తుత సమయంలో ప్రజా ప్రయోజనం కోసం కాదని భావిస్తూ, జిమ్మీ షో ప్రసారం నిరవధికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించారు. కాగా జిమ్మీ కిమ్మెల్ లేట్-నైట్ షో రద్దును అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. ఇందుకు ధైర్యం చూపినందుకు ఏబీసీని అభినందించారు.
జిమ్మీ కిమ్మెల్ ఒక ప్రముఖ అమెరికన్ టెలివిజన్ హోస్ట్, హాస్యనటుడు.. ప్రొడ్యూసర్ కూడా. ఆయన "Jimmy Kimmel Live!" అనే లేట్ నైట్ టాక్ షోను 2003 నుండి ABC ఛానల్‌లో హోస్ట్ చేస్తున్నారు. రాజకీయ వ్యంగ్యం.. సెలబ్రిటీలతో చేసే చమత్కార సంభాషణలతో టీవీ రంగంలో ఎంతో ప్రసిద్ధి పొందారీయ. తాజాగా చార్లీ కిర్క్ హత్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఆపై షో నిలిచిపోవడం.. అమెరికాలో భావ స్వేచ్ఛ ప్రకటపై చర్చకు దారితీసింది. అయితే వ్యంగ్యంగా రాజకీయ విమర్శలు గుప్పించే జిమ్మి కిమ్మెల్‌తో పాటు జిమ్మీ ఫాలోన్, సెత్ మేయర్స్‌లాంటి హోస్టులనూ కూడా ట్రంప్ ఇంతకు ముందు తిట్టిపోశారు.
Telangana
సాక్షి, హైదరాబాద్: జాతీయ దర్యాప్తు సంస్థల వరుస సోదాలు, తనిఖీలతో నగరం మరొకసారి ఉలిక్కిపడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) నగరంలోని ప్రముఖ వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తోంది.
ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో గురువారం ఉదయం ఈడీ అధికారుల తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బూరుగు రమేష్‌తో పాటు ఆయన తనయుడు విక్రాంత్ ఇంట్లోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు. రెండు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు ఆల్వాల్, మారేడుపల్లిలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందాల్సి ఉంది.
Family
ఇరానీ చాయ్, కబాబ్‌లు, బిర్యానీలకు సిటీ ప్రసిద్ధి చెంది ఉండవచ్చు.. కానీ ఇప్పుడు ఖరీదైన రుచులకూ కేరాఫ్‌గా మారుతోంది. తమ దగ్గర ఉన్న విలాస విందు గురించి రెస్టారెంట్స్, తాము రుచిచేసిన కాస్ట్‌లీ ఫుడ్ గురించి నగరవాసులు సోషల్ వేదికలపై పంచుకుంటూ రిచ్ రుచుల వెల్లువకు కారణమవుతున్నారు. ఫలితంగా బంగారంతో చుట్టిన ఇడ్లీలు, రాజకుటుంబానికి సరిపోయేంత పెద్ద పళ్లెంలో విందులకు కూడా నగరం పేరొందుతోంది. అనేక మందికి ఇదో ఖరీదైన రుచికరమైన యాత్ర. ఈ వంటకాలు కేవలం భోజనం మాత్రమే కాదు, అవి జ్ఞాపకాల్లో ఒదిగిపోయే అనుభవాలు కూడా అంటున్నారు ఫుడ్ లవర్స్.
ఒకప్పుడు ఆకలి తీర్చుకోవడానికి తినడం.. ఇప్పుడు అభిరుచులు నెరవేర్చుకోవడానికి తినడం దాకా పరిణామం చెందింది. ఆకలికి హద్దు ఉంటుందేమో కానీ అభిరుచులకు ఉండదు కదా.. అలాగే ఇప్పుడు ఆహార అభిరుచులు కూడా కొత్త పుంతలు కాస్ట్‌లీ వింతలుగా మారుతున్నాయి. ఈ సోషల్ మీడియా యుగంలో తినడం మాత్రమే కాదు ఆనందించడం.. ఆ ఆనందాన్ని నలుగురితో
పంచుకోవడం కూడా అలవాటైంది.ఇన్‌స్టాలో పోస్ట్ చేయాలంటే ఇరానీ చాయ్ సరిపోదు.. ఇడ్లీ రూ.1200 ఉండాల్సిందే అనేది సిటీ సోషల్‘ఇçషు్టల’ మాట బాట. అలాంటి వారి కోసం నగరంలోని పలు రెస్టారెంట్స్, కేఫ్స్, ఐస్‌క్రీమ్ పార్లర్స్.. వైవిధ్య భరితంగా అదే సమయంలో అత్యంత విలాసవంతమైన రుచులను అందిస్తున్నాయి. అలాంటి కాస్ట్‌లీ వంటకాల్లో కొన్నింటి విశేషాలు..
బంజారాహిల్స్‌లోని లెవాంట్ రెస్టారెంట్‌లో ఉన్న మషావి ముషాకల్ ప్లేట్ ధర: రూ.3,300.. నగరంలో ఫైవ్‌స్టార్ హోటల్స్‌ను మినహాయిస్తే.. రెస్టారెంట్స్‌లోని ఖరీదైన ప్లేట్ ఇదే. దీనిలో వడ్డించే మిడిల్ ఈస్టర్న్ విందు మాంసం ప్రియులను చవులూరిస్తుంది. బాషా షీష్, అదానా కబాబ్, లాంబ్ చుకాఫ్, బాల్కా షీష్, లెవాంట్ జాయేనా.. గ్రిల్ చేసి స్టైల్‌గా వడ్డిస్తారు. ఇది రోజంతా తినాల్సిన భోజనాన్ని సులభంగా భర్తీ చేయగలదు.
ఐటీసీ కోహినూర్‌లో అందించే హైదరాబాదీ బిర్యానీ దమ్ పుఖ్త్ బేగం ధర రూ.2500. ప్రీమియం కుంకుమ పువ్వు, సువాసనగల బాస్మతి బియ్యం లేత మాంసంతో మేళవించి వండుతారు. ఈ బిర్యానీ ఒక హ్యాండిలో అందంగా కనిపిస్తుంది.
బంజారాహిల్స్ లోని కృష్ణ ఇడ్లీని 24–క్యారెట్ గోల్డ్ ఇడ్లీగా పేర్కొంటారు. ఈ ఇడ్లీ ప్లేట్ ధర: రూ.1200 ఇది దక్షిణ భారతదేశంలోని పేరొందిన అల్పాహారం.. రెండు మృదువైన ఇడ్లీలు తినదగిన బంగారు
ఆకులతో కప్పబడి, గులాబీ రేకులను చల్లి, సాంబార్ చట్నీలతో వడ్డిస్తారు. బహుశా ఇడ్లీని ఇంత అందంగా ఎప్పుడూ చూసి ఉండరు.బంజారాహిల్స్, హిమాయత్‌నగర్‌లలోని హుబెర్ – హోలీ అందించే మైటీ మిడాస్ గోల్డ్ ఐస్ క్రీం ధర: రూ.1200. ఇది కేవలం డెజర్ట్ కాదు, ట్రెజర్ అని చెప్పొచ్చు.
బెల్జియన్ చాక్లెట్, ప్రాలైన్ బాదం, మాకరూన్లు, చాక్లెట్ నిండిన బాల్స్. 24 క్యారెట్ తినదగిన బంగారు ఆకులో చుట్టబడిన చాక్లెట్ బార్‌తో తయారైంది. ఇది ఆర్డర్ ఇచ్చాక స్వీకరించడానికి గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది.
బంజారాహిల్స్‌లోని రోస్ట్ సిసిఎక్స్‌లో యానిమేటెడ్ చాక్లెట్ అందుబాటులో ఉంది. దీని ధర: రూ.1800 ప్లస్ పన్నులు అదనం. ఈ షోటాపర్ డెజర్ట్, అందమైన జంతువులు లేదా కార్టూన్ పాత్రలుగా మలిచారు. నగరంలోని అత్యంత అందమైన అత్యంత ప్రీమియం డెజర్ట్‌లలో ఒకటిగా పేరొందింది.
నగరంలోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్, ది వెస్టిన్‌లోని ప్రీగో అత్యంత ఖరీదైన బిర్యానీలను అందిస్తాయని సమాచారం. ధరలపై స్పష్టత లేనప్పటికీ అక్కడ బిర్యానీల ధర రూ.6వేల వరకూ ఉంటుందని తెలుస్తోంది
బంజారాహిల్స్‌లోని హౌస్ ఆఫ్ దోసె, నగరంలోనే అత్యంత ఖరీదైన దోసెను అందుబాటులోకి తెచి్చంది. దీని ధర సుమారు రూ.1000 పైనే ఉంది. అయితే ఇది ఆర్డర్‌పై మాత్రమే అందిస్తారు. దీని తయారీలో తినదగిన బంగారు పూత, వేయించిన జీడిపప్పు, బాదం, స్వచ్ఛమైన నెయ్యి చట్నీలు లభ్యత: కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే తయారు చేస్తారు. గింజలు నెయ్యితో వస్తుంది. ఈ బంగారు దోసె ఆహార ప్రియులకు, వారాంతాల్లో ఆకర్షణగా మారింది.
(చదవండి: ప్లాంట్స్.. దోమలకు చెక్..!)
విష జ్వరాలు, డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికెన్‌గున్యా వంటి ఎన్నో రకాల వ్యాధులు దోమ కాటుతో వస్తాయి. దోమ కాటు వేసిందా ఎంతటి వారైనా మంచాన పడాల్సిందే. మరి అలాంటి దోమల నివారణకు ఎవరో వచ్చి దోమల మందు పిచికారీ చేస్తారని ఎదురు చూడకుండా ఇంటి పెరట్లోనో, బాల్కనీల్లోనో చిన్న కుండీల్లో ఈ మొక్కలను పెంచుకుంటే దోమలు రాకుండా ఉంటాయని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అవి ఒక్క దోమల నివారణకే కాకుండా వంటింటికీ ఉపయోగపడతాయని అంటున్నారు. రసాయన లిక్విడ్లకు బదులుగా సహజ సిద్ధంగా దోమల నివారణ ఆరోగ్యం, పర్యావరణానికి మంచిదని బోటనీ ప్రొఫెసర్ దిలీప్ చెబుతున్నారు. మొక్కలు పెంచే సమయంలో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
పాత కాలంలో ఇంటి ఆవరణలో తులసి మొక్కకు పూజలు చేసేవారు. ఉదయం లేచి స్నానం చేసి, తులసి గుండం వద్ద దీపం వెలిగించేవాళ్లు. అది ఆధ్యాత్మికంగా, అందులో ఔషధ గుణాలు ఆరోగ్యపరంగానూ ఉపయోగకరంగా ఉంటాయి. ఈ మొక్కల ఆకుల వాసనతో దోమలు దూరమవుతాయట.
వంటింట్లో మనకు నిత్యం కనిపించే పుదీనా ఆకు ఘాటైన వాసనలకు దోమలు దూరమవుతాయట. పుదీనా పెంచుకుంటే ఒక వైపు దోమల నివారణ, మరో వైపు వంటకు అవసరమైన పుదీనా ఆకు సొంతంగా పెంచుకున్నట్లు అవుతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ లీవ్స్
అందుబాటులో ఉంటాయి.నిమ్మ గడ్డి వాసనకు దోమలు దూరం కావడంతో పాటు వంటల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు. సిట్రోనెల్లా గడ్డిలో సిట్రోనెల్లాల్, సిట్రోనెల్లోల్, జెరానియోల్ కలిసి ఉంటాయి. ఇది ఘాటైన వాసనలను వెదజల్లుతుంది. ఈ వాసనకు దోమలు తరలిపోతాయి.
రోజ్‌మెరీ కొమ్మలను కాల్చినా, నూనె వాడినా దోమలు దూరమవుతాయి. కుప్ప చెట్టు రసాయనాల కంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఇంట్లో లావెండర్, బంతి మొక్కలు పెంచుకుంటే వాటి పువ్వులు సువాసనలు వెదజల్లుతాయి. కలర్‌ఫుల్‌గా ఉండే పువ్వులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రిలాక్స్‌గా అనిపిస్తుంది. వీటిలో లినాలూల్, కర్పూరం సమ్మేళనాలు ఉంటాయి. వీటి సువాసన, నూనె దోమలను తరిమేస్తుంది.
(చదవండి: మాన్సున్ ఎండ్..ట్రెక్కింగ్ ట్రెండ్..! సై అంటున్న యువత..)
Narayanpet
ధన్వాడ: ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వావిద్యాలయం సమష్టిగా కార్యచరణ రూపొందిస్తున్నాయని వ్యవసాయ శాస్త్రవేత డా.జేడీ సరిత అన్నారు. ‘ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం’ కార్యక్రమంలో భాగంగా బుధవారం వ్యవసాయ శాస్త్రవేత్తల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు కంసాన్‌పల్లి, మందిపల్లి, పాతతండా గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన విత్తనం ద్వారానే అధిక దిగుబడులను సాధించడంతో పాటు పెట్టుబడి వ్యయం తగ్గించుకోవచ్చన్నారు. విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏఓ నవీన్‌కుమార్, ఏఈఓ సైమన్ తదితరులు పాల్గొన్నారు.
● పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూ సేకరణ నోటిఫికేషన్ జారీ
● రైతులకు రూ.574 కోట్ల రుణమాఫీ
● కొత్తగా 23,411 రేషన్ కార్డుల
మంజూరు
● సన్న వడ్లకు రూ.70.44 కోట్ల బోనస్ చెల్లింపు
నారాయణపేట/మక్తల్: తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 కీలకమైన రోజు అని, హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమై నేటికి 77 ఏళ్లు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి అడుపెడుతున్నందున రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లావ్యాప్తంగా బుధవారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కలెక్టరేట్‌లో, మక్తల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి తోడ్పాటు అందించి అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పిస్తున్నామన్నారు.
ప్రజాపాలనకు అంకురార్పణ
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చుతున్నామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా నారాయణపేటలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారని, ఇప్పటి వరకు వారికి రూ.15.02 లక్షల లాభం వచ్చిందన్నారు. స్వయం సహాయక బృందాలకు జిల్లాలో 4 కొత్త బస్సులు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లాలో 1.87 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోగా.. వారికి రూ. 88.14 కోట్లు ఆదా అయ్యాయని పేర్కొన్నారు. 69,808 మంది లబ్ధిదారులకు 1.84 లక్షల సిలిండర్ల మీద సబ్సిడీ ఇవ్వడంతో రూ.4.66 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.
పేదలకు సన్నబియ్యం
ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా జిల్లాలో 1,61,719 ఆహార భద్రత కార్డు లబ్ధిదారులకు 3,808 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు 23,411 మంజూరు చేయగా.. 50,938 మందిని రేషన్ కార్డులో చేర్చారన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 80,795 గృహ వినియోగదారులు లబ్ధి పొందుతున్నారని మంత్రి తెలిపారు.
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలో 19,146 మంది పేదలు చికిత్స తీసుకోగా రూ.51.89 కోట్లు చెల్లించామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.16.17 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
లక్ష ఎకరాలకు సాగునీరు
నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగు, తాగునీరు అందించేందుకు రూ.4,350 కోట్లతో చేపట్టనున్న ఎత్తిపోతల పథకం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, ఎస్పీ యోగేష్‌గౌతమ్, జిల్లా అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, ఆర్డీఓ రామచందర్‌నాయక్, మక్తల్ సీఐ రాంలాల్, తహసీల్దార్ సతీష్‌కుమార్, కమిషనర్ నర్సిములు, ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జెండాను
ఆవిష్కరిస్తున్న
మంత్రి వాకిటి శ్రీహరి,
కలెక్టర్ సిక్తాపట్నాయక్,
ఎమ్మెల్యే పర్ణికారెడ్డి
తదితరులు
జిల్లా కేంద్రంలో పోలీసుల గౌరవ వందనం
స్వీకరిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి
జిల్లాలో 65,631 మంది రైతులకు రూ.574 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా కింద 1,79,154 మంది రైతులకు రూ.260.56 కోట్లు చెల్లించామని తెలిపారు. 1,40,894 టన్నుల సన్న వడ్లు సేకరించి బోనస్ రూ.70.44 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
పాలమూరు: పేద రోగులకు సంజీవనిగా పనిచేసే ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఓపీ సేవలతోపాటు ఖరీదైన సర్జరీలను పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో ఈ సేవలను కొనసాగించడానికి యాజమాన్యాలు విముఖత చూపుతున్నాయి. దీంతో సాధారణ, మధ్య తరగతి రోగుల జేబులకు చిల్లుపడే పరిస్థితి కనిపిస్తోంది.
ఆస్పత్రుల వద్ద బ్యానర్లు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం జరిగింది. పాలమూరు పట్టణంలో చాలా ఆస్పత్రులకు రోగులు రాగా సేవలు బంద్ చేసినట్లు సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు. అన్ని ఆస్పత్రుల ముఖద్వారాల దగ్గర ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ఉన్నట్లు నోటీస్ బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేస్తున్న ఆరోగ్యశ్రీ కేసులకు సంబంధించిన నిధులు ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కో ఆస్పత్రికి రూ.కోట్లలో బకాయిలు ఉండటం వల్ల ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించడం భారంగా మారినట్లు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. చివరగా గతేడాది మార్చి నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఆస్పత్రులకు బడ్జెట్ విడుదల కావడం లేదు. దీంతో ఈ విభాగం కింద కేసులను అడ్మిట్ చేసుకోవడంతోపాటు ఓపీ సేవలు అందించడం సవాల్‌గా మారింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ పట్టణంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు అధికంగా ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేసిన సర్జరీలు, ఎస్టిమేషన్ వివరాలు
జిల్లా చేసిన బకాయిలు
సర్జరీలు (రూ.లలో..)
గద్వాల 527 1,02,78,990
మహబూబ్‌నగర్ 19,032 46,95,71,170
నాగర్‌కర్నూల్ 133 34,03,362
నారాయణపేట 275 1,02,52,882
వనపర్తి 603 1,94,18,046
సేవలు అందుబాటులో లేకపోతే పేదలకు ఆర్థిక ఇబ్బందులే..
మొదటి రోజు ఆస్పత్రులకు వచ్చి తిరిగి వెళ్లిన రోగులు?
నారాయణపేట: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచీ కార్యవర్గ పదవీకాలం ముగియడంతో బుధవారం కలెక్టర్ సిక్తాపట్నాయక్ నారాయణపేట జిల్లా సహకార అధికారి జి. శంకరాచారిని ఎన్నికల అధికారిగా నియమించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి, ఐఆర్సీఎస్ అడహక్ కమిటీతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణే ప్రధాన ఎజెండాగా ఐఆర్సీఎస్ మహాజన సమావేశాన్ని కనీసం 21 రోజుల ముందస్తు నోటీసుతో అక్టోబర్ 14, 2025 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో నిర్వహించడానికి నిర్ణయించారు. మహాజన సమావేశం 15 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నిక, ఆఫీసు బేరర్లు అయిన వారిని చైర్మన్, వైస్ చైర్మన్, ట్రెజరర్, రాష్ట్ర కార్యదర్శి, నామినీల ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తామన్నారు. ఐఆర్సీఎస్‌లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కోరారు.
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
కోస్గి రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల్లోని సభ్యులు తమ పొదుపులను పెంచుకొని ఆర్థికంగా చైతన్యవంతులుగా ఎదగాలని ఆర్‌బీఐ ఎల్‌డీఓ గోమతి, ఎల్‌డీఓ విజయ్‌కుమార్ అన్నారు. బుధవారం గుండుమాల్ మండల కేంద్రంలో మండల మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక ఆక్షరాస్యత, కేంద్ర ఫ్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్, జీవనోపాధి, సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా ఆవశ్యకత గురించి వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ శీల, ఎంపీడీఓ వేణుగోపాల్, బ్యాంకు మేనేజర్ హరినామశర్శ, సీసీ నర్సిములు తదితరులు ఉన్నారు.
బీజేపీ జిల్లా కార్యవర్గం నియామకం
నారాయణపేట రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ అన్నారు. రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన అధ్యక్షతన జిల్లా కమిటీని నియమించారు.
జిల్లా ఉపాధ్యక్షులుగా కర్ని స్వామి (మక్తల్), ఎస్.ఉమేష్ (ధన్వాడ), కెంచె శ్రీనివాసులు (కోటకొండ), కొండ్రు నర్సింహులు (కొడంగల్), మేర్వ రాజు (అమరచింత), పి.చెన్నారెడ్డి (కోయిల్‌కొండ), ప్రధాన కార్యదర్శులుగా జి.బలరాంరెడ్డి (మక్తల్), లక్ష్మిగౌడ్ (నారాయణపేట), డి.తిరుపతిరెడ్డి (మరికల్), కార్యదర్శులు సుజాత (నారాయణపేట), హన్మంతు (మక్తల్), విజయభాస్కర్‌రెడ్డి (మద్దూరు), గోపాల్రావు (దామరగిద్ద), రవీంద్ర నాయక్ (కొడంగల్), కనకరాజు (మాగనుర్), కోశాధికారిగా సిద్ధి వెంకట్రాములు (నారాయణపేట), కార్యాలయ కార్యదర్శి సాయిబన్న (భైరంకొండ), సోషల్ మీడియా ఇన్‌చార్జి రమేష్యాదవ్ (కొడంగల్), మీడియా కన్వీనర్ కిరణ్ డగే (నారాయణపేట), ఐటీ ఇన్‌చార్జి బి.అనూష (నారాయణపేట)లను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, మండల మాజీ అధ్యక్షుడు సాయిబన్న పాల్గొన్నారు.
నారాయణపేట: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు–2025 కు సంబంధించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన, చెత్తాచెదారం తొలగించడం వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. ఎంపీడబ్ల్యూ వర్కర్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 25న ఉదయం 8 గంటలకు ఏక్ దిన్ ఏ ఘంటా ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు జాతీయ స్థాయి శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 తో స్వచ్ఛభారత్ దివస్‌తో ముగుస్తుందని, ఈ సమాచారం మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్‌లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. స్వచ్ఛతహీ సేవాలో భాగంగా కలెక్టర్ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ మొగులప్ప, స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా మేనేజర్ మాలిక్ పాషా, భార్గవ్, సిబ్బంది పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్: రైతులు పండిస్తున్న పంటలకు కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా ఎమ్మెస్పీ నిర్ణయించాలని అఖిల భారత ఐక్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో ఏఐయూకేఎస్ డివిజన్ అధ్యక్షుడి సమక్షంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ రైతులు పెట్టిన పెట్టుబడిపై 50 శాతం కలిపి ధాన్యానికి ధర నిర్ణయించాలన్నారు. రైతులు పంట వేసినప్పటి నుంచి అతివృష్టి, అనావృష్టి, చీడపీడలకు, అడవి జంతువుల తాకిడి నుంచి కాపాడి తీర మార్కెట్‌కు అమ్మడానికి పోతే అడవి.. కొనడానికి పోతే కొరవి అనే పరిస్థితి నెలకొందన్నారు. పత్తి క్వింటాల్‌కు రూ.10,075 ధర నిర్ణయించి కాటన్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయలన్నారు. కార్యక్రమంలో సంఘం డివిజన్ కార్యదర్శి కొండ నర్సిములు, ఉపాధ్యక్షుడు నారాయణ, సహాయ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మక్తల్: విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతిని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని స్థానిక నల్లజానమ్మ ఆలయం నుంచి శ్రీమోనేశ్వరస్వామి ఆలయం వరకు విశ్వకర్మ పల్లకీసేవను భజనలతో ఊరేగించారు. ఆలయం వద్ద హోమం నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పాలాభిషేకం చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. చిన్నారులు చేసిన దాండియా నృత్యాలు, భజనలు పలువురిని ఆకట్టుకున్నాయి. సాయిజ్యోతి పాఠశాల తరఫున 2024– 2025 విద్యా సంవత్సరంలో ప్రతిభ చూపిన విశ్వకర్మ విద్యార్థులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పోర్ల విశ్వనాథ్, పోర్ల రాఘవేందర్, విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు రాఘవేంద్రచారీ, ప్రధాన కార్యదర్శి గట్టురవి ఆచారీ, కోశాధికారులు కడ్మూర్ రాజు, వి.రాజు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన సాయుధ రైతాంగ పోరాటాన్ని నెహ్రూ యూనియన్ సైన్యాలు, రజాకార్ పోలీసులు, దొరలు, జమీందారులు కుమ్మకై ్క అణగదొక్కారని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి బి. రాము విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ అధ్యక్షతన సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ పోరాటానికి జరిగిన విద్రోహ దినంగా అభివర్ణిస్తూ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత యూనియన్ సైన్యాలు చర్య వలన ప్రజలు విముక్తి చెందకపోగా భూస్వామ్య దోపిడీ ఆధిపత్యాలకు బానిసలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ సైన్యాలు సంస్థానాల్లోకి ప్రవేశించాక ప్రజలకు కొన్ని హక్కులు, భూ పంపకం, దోపిడీదారుల నుంచి రక్షణ లభిస్తుందని భావించినా.. అవేవి జరగ లేదని ఆరోపించారు. యూనియన్ సైన్యాలు ప్రజలపై సాగించిన హత్యాకాండ, అకృత్యాలను విమర్శిస్తూ ప్రజాసాహిత్యం వెలుగులోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బి.యాదగిరి, బి.రాము, కిరణ్, చెన్నారెడ్డి, కొండ నర్సింలు పాల్గొన్నారు.
Nagarkurnool
● దృశ్య, శ్రవణ అనుభూతితో
దీర్ఘకాల జ్ఞాపకం
● విద్యార్థుల్లో నేర్చుకోవాలనే
ఆసక్తి పెంపుదల
● పాల్గొననున్న 20 మండలాల
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు
మండల స్థాయిలో టీఎల్‌ఎం మేళాను పూర్తిచేశాం. జిల్లాస్థాయిలో నిర్వహించే టీఎల్‌ఎం మేళాకు ప్రతి మండలం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తప్పక హాజరు కావాలి. దీన్ని ద్వారా విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు పెంపొందించే అవకాశం ఉంటుంది. వినూత్న బోధనలతో విద్యార్థులను అకట్టుకోవచ్చు.
– రమేశ్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి
కందనూలు: ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న చిన్నారుల్లో అక్షర బీజాలు నాటి.. వారిని చదువులో ముందుకు నడిపించేందుకు విద్యాశాఖ వినూత్న పద్ధతులు పాటిస్తోంది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించే దిశగా ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తోంది. అందులో భాగంగా మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో టీఎల్‌ఎం (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) మేళాలు నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వినూత్న బోధనా పద్ధతులు పాటించడం.. పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించడం టీఎల్‌ఎం దోహదపడుతుంది.
1 నుంచి 5వ తరగతి వరకు..
జిల్లావ్యాప్తంగా గత నెలలో 1నుంచి 5వ తరగతి వరకు మండలస్థాయిలో టీఎల్‌ఎం మేళా నిర్వహించారు. మొత్తం 20 మండలాల్లో ఎంపికై న ఉత్తమ టీఎల్‌ఎంలను గురువారం జిల్లా కేంద్రంలోని లిటిల్ ప్లవర్ హైస్కూల్‌లో నిర్వహించే జిల్లాస్థాయి మేళాలో ప్రదర్శించనున్నారు. ఇందులో భాషా పాఠాలు, అక్షరమాల, పద బంధాలు, కథాచిత్రాలు, గణితం, సంఖ్యా మోడళ్లు, ఆకారాలు, కొలతలు, గణన పద్ధతులు, పర్యావరణం, జంతువులు, పక్షులు, రుతువులు, చారిత్రక స్మారకాలు, సంప్రదాయాలు, సైన్స్ ప్రయోగాలు తదిత ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ఉపాధ్యాయులు రూపొందించిన టీఎల్‌ఎంలలో జోడించి ప్రదర్శించనున్నారు. వీటి ద్వారా విద్యార్థులకు నేర్చుకోవాలని ఆసక్తి పెరగడంతో పాటు దృశ్య అనుభూతి కలుగుతుంది. టీఎల్‌ఎం తయారీతో ఉపాధ్యాయుల అంతర్గత ప్రతిభ కూడా బయటకు వస్తుందని విద్యాశాఖ అభిప్రాయపడుతోంది.
సులువుగా అర్థమయ్యేలా..
బోధన ప్రక్రియను సులభతరం చేసి.. విద్యార్థులకు పాఠ్యాంశాలపై ఆసక్తి పెంపొందించేందుకు ఉపయోగపడే ప్రతి వస్తువు, వనరు, పరికరం బోధన అభ్యసన సామగ్రిగా చెప్పవచ్చు. ఈ తరహా బోధనలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య జరిగే బోధన అభ్యసన ప్రక్రియ మెరుగుపడుతుంది. వీటి ద్వారా ఉపాధ్యాయుడు బోధనను అత్యంత ప్రభావవంతంగా నిర్వహించవచ్చు. విద్యార్థులు కూడా చురుగ్గా నేర్చుకుంటారు. అభ్యసన ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. ఉపాధ్యాయుల బోధన విద్యార్థులకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. విద్యార్థుల్లో ఆలోచన, విమర్శనాత్మక శక్తి పెరుగుతుంది. దృశ్య, శ్రవణ సాధనాలను టీఎల్‌ఎం బోధనలో ఉపయోగిస్తారు.
మెరుగైన ఫలితాలే లక్ష్యం..
ప్రభుత్వ పాఠశాలల్లో 90 శాతంపైగా పేద విద్యార్థులే చదువుతుంటారు. వీరి తల్లిదండ్రులకు విద్యాభ్యాసం అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో కనీస సామర్థ్యాలు పెంపొందించేందుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ విధానంలో తొలుత 45 నిమిషాల పాటు ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తాడు. ఆ తర్వాత పాఠ్యాంశానికి సంబంధించిన సామగ్రిని ప్రదర్శించి.. విద్యార్థులతో అభ్యసనం చేయిస్తారు. దీంతో విద్యార్థులు వేగవంతంగా నేర్చుకునే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు: 497
ప్రాథమికోన్నత: 124
విద్యార్థులు: 26,203
ప్రతి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు రూపొందించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను మండల స్థాయిలో ఎంఈఓ పర్యవేక్షణలో ప్రదర్శించారు. ఎన్‌సీఆర్టీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి మండల స్థాయిలోని పది ఉత్తమ టీఎల్‌ఎంలను జిల్లాస్థాయికి ఎంపిక చేశారు. వీటిలో తెలుగు, ఆంగ్లం, గణితం, పరిసరాల విజ్ఞానం అంశాల్లో రెండేసి.. అన్నింటిలో ఉత్తమంగా ఉన్న మరో రెండేసి చొప్పున ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు మండల స్థాయిలో ముగ్గురు స్థానిక విద్యా నిపుణులతో కూడిన జ్యూరీని నియమించారు. జిల్లాస్థాయిలో డీఈఓ ఆధ్వర్యంలో ఆరుగురు నిపుణుల జ్యూరీ కమిటీ అగ్రభాగాన నిలిచిన ఎనిమిది ఉత్తమ టీఎల్‌ఎంలను రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారు.
- నియంతృత్వం నుంచి
చారిత్రక ఘటనకు గుర్తుగా ప్రభుత్వ కార్యక్రమం● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదలకు ఆత్మగౌరవం
● వ్యవసాయం, విద్య,
వైద్యరంగాలపై ప్రత్యేక దృష్టి
● పెండింగ్ ప్రాజెక్టులను
పూర్తిచేసి పాలమూరును
సస్యశ్యామలం చేస్తాం
● రాష్ట్ర ప్రణాళికా సంఘం
ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్: దశాబ్ధాల తరబడి ఉద్యమాలు, పోరాటాల చరిత్ర తెలంగాణకు ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి అన్నారు. నాటి నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది.. ప్రజాస్వామ్య పాలన అవతరించిన చారిత్రక ఘటనకు గుర్తుగా నేటి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం పాలనలో ప్రజలు భూస్వాముల వద్ద బానిసలుగా బతకాల్సిన పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ సంస్థానానికి మాత్రం విముక్తి కలుగలేదన్నారు. ఆపరేషన్ కాటర్ పిల్లర్, ఆపరేషన్ పోలో పేరుతో భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై పోరాటం చేసిన ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో విలీనమైందన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని తమ ప్రభు త్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు.
కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ జెండాను
ఆవిష్కరిస్తున్న
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, చిత్రంలో కలెక్టర్
బదావత్ సంతోష్,
ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎమ్మెల్యే వంశీకృష్ణ
జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిసారించామని.. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఒకేసారి నాలుగు ప్రాజెక్టులకు రూ. 7వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 3.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 311.644 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని వివరించారు. కేఎల్‌ఐకి అనుసంధానంగా పులిజాల నుంచి చంద్రసాగర్ చెరువు వరకు 15 కి.మీ. బ్రాంచ్ కెనాల్ నిర్మాణం కోసం రూ. 107.20 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్టేజ్–1 కింద తెలకపల్లి, ఉప్పునుంతల, లింగాల, బల్మూర్, అచ్చంపేట మండలాల్లో 57,200 ఎకరాలకు నీరందించేందుకు రూ. 1,534 కోట్ల అంచనాలతో పరిపాలనా అనుమతులు పొందినట్టు వివరించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తిచేసి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. కాగా, ప్రజాపాలన వేడుకల్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజాపాలన కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాలకు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల పంపిణీ చేపట్టామన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం అందించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేద కుటుంబాల సొంతింటి కలను నెరవేరుస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మించి ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన 2.58 లక్షల దరఖాస్తులకు గాను 56వేల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించామని తెలిపారు. ఇప్పటికే 11,622 ఇళ్లను కేటాయించి.. 6,599 ఇళ్లకు మార్కింగ్ పూర్తిచేసినట్టు చెప్పారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుభరోసా, రుణమాఫీ, రైతుబీమా పథకాలతో పాటు సన్నరకం వరిధాన్యానికి బోనస్ చెల్లిస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు 14,757 మంది రైతులకు రూ. 39.51 కోట్ల బోనస్ చెల్లించామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచామన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లాలో విద్యార్థులు లేక మూతబడిన 23 పాఠశాలలను తిరిగి ప్రారంభించామని చెప్పారు. 21 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించామన్నారు. ● జిల్లాలోని 22 పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తరగతులు బోధిస్తున్నట్టు వివరించారు. విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సైతం ముఖ గుర్తింపు హాజరు వర్తింపజేశామని.. దీంతో ఉపాధ్యాయుల హాజరు శాతం, సమయపాలన మెరుగుపడిందన్నారు. సమగ్ర మహిళా ఆరోగ్య పథకం కింద మహిళలకు 8 రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 17,883 మంది మహిళలకు రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలిపారు. రహదారుల విస్తరణకు హైబ్రిడ్ ఆన్యూటీ మోడల్ కింద రూ. 166కోట్ల నిధులతో 16.60 కి.మీ. మేర పనులు మంజూరు చేశామన్నారు.
తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో రోజుకు 72,716 లీటర్ల పాలను సేకరిస్తున్నామని చెప్పారు. పాల సేకరణలో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. గోవులు, గేదెల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయిల్‌పాం తోటల సాగును ప్రోత్సహిస్తూ.. రైతుల ఆదాయం పెంచేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 200 మంది రైతులతో 753 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు నాటించామన్నారు.
నాగర్‌కర్నూల్ రూరల్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి మాట్లాడారు. భూమి, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఎర్రజెండా నీడలో సాగిందన్నారు. నిజాం నిరంకుశ పాల నకు వ్యతిరేకంగా పోరాడుతూ తెలంగాణ ప్రాంతా న్ని ఎర్రజెండా మయం చేసిన కామ్రేడ్ భీమి రెడ్డి, నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ, మల్లు స్వరా జ్యం, అరుట్ల కమలాదేవి, దొడ్డి కొమురయ్య వంటి ఎందరో నేతలు అమరులయ్యారని అన్నారు. రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని గుర్తించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.శ్రీనివాసులు, కందికొండ గీత, పొదిల రామయ్య, అశోక్, యాద య్య, వెంకటేశ్, కాశన్న, సత్యనారాయణ, రవి, మల్లికార్జున్, రాఘవేందర్, కృష్ణయ్య, వెంకటయ్య, బాలస్వామి పాల్గొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతర కృషి : ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసుశాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేందుకు పోలీసు సిబ్బంది 24 గంటలపాటు సంసిద్ధంగా ఉంటున్నట్లు తెలిపారు. సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల పరంగా ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
మహిళలు పూర్తి
ఆరోగ్యంగా ఉండాలి
నాగర్‌కర్నూల్ క్రైం: మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సురక్షితంగా ఉంటుందని.. మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఆరోగ్య సంరక్షణ కోసం ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా మార్చుకోవాలని సూచించారు. పూర్వం జొన్న, సజ్జ, రాగులు వంటి ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండే వారని గుర్తుచేశారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తారని.. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తోందన్నారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాలో నిర్వహించే వైద్యశిబిరాల్లో మహిళలకు ఈఎన్‌టీ, నేత్ర, రక్తపోటు, మధుమేహం, దంత పరీక్షలతో పాటు నోటి, రొమ్ము ఇతర క్యాన్సర్, రక్తహీనత, టెలిమానస్ సేవలు, సికిల్ సెల్ ఎనీమియా తదితర వైద్యపరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్ పాల్గొన్నారు.
నిండుకుండలా
రామన్‌పాడు జలాశయం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో బుధవారం సముద్ర మట్టానికిపైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదన్నారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873 క్యూసెక్కు లు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగించినట్లు వివరించారు.